| 31-10-2024 |
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
|
మధువనం |
| ‘‘మధురమైన పిల్లలూ - ఆర్డర్ చేయండి, హే భూతాలూ, మీరు మా వద్దకు రాలేరు అని, మీరు వాటిని భయపెట్టినట్లయితే అవి పారిపోతాయి’’ | |
| ప్రశ్న:- | ఈశ్వరీయ నషాలో ఉండే పిల్లల జీవితం యొక్క శోభ ఏమిటి? |
| జవాబు:- | సేవయే వారి జీవితం యొక్క శోభ. మాకు ఈశ్వరీయ లాటరీ లభించింది అన్న నషా ఉన్నప్పుడు మరి సేవ పట్ల అభిరుచి ఉండాలి. కానీ ఎప్పుడైతే లోపల ఎటువంటి భూతాలూ ఉండవో, అప్పుడే బాణం తగులుతుంది. |
| ప్రశ్న:- | శివబాబా పిల్లలుగా పిలవబడేందుకు హక్కుదారులు ఎవరు? |
| జవాబు:- | ఎవరికైతే భగవంతుడు మా తండ్రి, మేము ఇటువంటి ఉన్నతోన్నతుడైన తండ్రికి పిల్లలము అన్న నిశ్చయము ఉంటుందో, అటువంటి నషాలో ఉండే యోగ్యులైన పిల్లలే శివబాబా పిల్లలుగా పిలవబడేందుకు హక్కుదారులు. ఒకవేళ క్యారెక్టర్ సరిగ్గా లేకపోతే, నడవడిక రాయల్టీతో ఉండకపోతే, వారు శివబాబా పిల్లలుగా పిలవబడలేరు. |
ఓం శాంతి. శివబాబా గుర్తున్నారా? స్వర్గ రాజ్యాధికారము గుర్తుందా? ఇక్కడ కూర్చున్నప్పుడు బుద్ధిలోకి రావాలి - మేము అనంతమైన తండ్రికి పిల్లలము మరియు నిత్యమూ ఆ తండ్రిని స్మృతి చేస్తాము అని. స్మృతి చేయకుండా మనం వారసత్వాన్ని తీసుకోలేము. ఏ వారసత్వాన్ని? పవిత్రతా వారసత్వాన్ని. కావున దాని కోసం ఇటువంటి పురుషార్థాన్ని చేయాలి. ఎప్పుడూ ఎటువంటి వికారాల విషయమూ మా ముందుకు రాలేదు, కేవలం వికారాల విషయమే కాదు అనగా ఒక్క భూతమే కాదు, ఏ భూతమూ మా ముందుకు రాలేదు అని ఇటువంటి శుద్ధ అహంకారము ఉండాలి. చాలా ఉన్నతోన్నతుడైన భగవంతుని పిల్లలైన మనము కూడా ఉన్నతోన్నతమైనవారము కదా. మాట, నడవడిక ఎంత రాయల్ గా ఉండాలి. వీరైతే పూర్తిగా పైసకు కొరగానివారు, నా పిల్లలుగా పిలవబడేందుకు కూడా యోగ్యులు కారు అని నడవడిక ద్వారా తండ్రి అర్థం చేసుకోగలరు. లౌకిక తండ్రికి కూడా అనర్హులైన పిల్లలను చూసి లోలోపల ఇలా అనిపిస్తుంది. వీరు కూడా తండ్రే. తండ్రి మనకు శిక్షణను ఇస్తున్నారని పిల్లలకు తెలుసు కానీ కొందరు ఎలా ఉన్నారంటే, వారు ఏమాత్రమూ అర్థం చేసుకోరు. అనంతమైన తండ్రి మనకు అర్థం చేయిస్తున్నారు అన్న నిశ్చయమూ లేదు, నషా కూడా లేదు. పిల్లలైన మీ బుద్ధి ఎంత ఉన్నతముగా ఉండాలి. మనము ఎంత ఉన్నతోన్నతుడైన తండ్రి పిల్లలము. తండ్రి ఎంతగా అర్థం చేయిస్తారు. లోలోపల ఆలోచించండి - మేము ఎంత ఉన్నతోన్నతుడైన తండ్రి పిల్లలము, మా క్యారెక్టర్ ఎంత ఉన్నతముగా ఉండాలి. ఈ దేవీ-దేవతల మహిమ ఏదైతే ఉందో, అది మన మహిమగా ఉండాలి. ప్రజలకు మహిమ అయితే లేదు కదా. ఒక్క లక్ష్మీ-నారాయణులనే చూపించారు. కావున పిల్లలు ఎంతటి మంచి సేవ చేయాలి. ఈ లక్ష్మీ-నారాయణులు ఇరువురూ ఈ సేవ చేసారు కదా. బుద్ధి ఎంత ఉన్నతముగా ఉండాలి. కొందరు పిల్లల్లోనైతే ఎటువంటి మార్పు లేదు. మాయతో ఓడిపోతే ఇంకా ఎక్కువ పాడైపోతారు, లేదంటే లోలోపల ఎంతటి నషా ఉండాలి. మనం అనంతమైన తండ్రి పిల్లలము. తండ్రి అంటారు, అందరికీ నా పరిచయాన్ని ఇస్తూ ఉండండి. సేవ ద్వారానే శోభను పొందుతారు, అప్పుడే తండ్రి హృదయముపైకి ఎక్కుతారు. ఎవరైతే తండ్రి హృదయాన్ని అధిరోహించి ఉంటారో వారే పిల్లలు. తండ్రికి పిల్లలపై ఎంతటి ప్రేమ ఉంటుంది. పిల్లలను తలపైకి ఎక్కించుకుంటారు. అంతటి మోహము ఉంటుంది. కానీ అది హద్దులోని మాయావీ మోహము, ఇది అనంతమైనది. పిల్లలను చూసి సంతోషించని తండ్రి అంటూ ఎవరైనా ఉంటారా. తల్లిదండ్రులకైతే అపారమైన సంతోషము కలుగుతుంది. ఇక్కడ కూర్చున్నప్పుడు బాబా మమ్మల్ని చదివిస్తున్నారు అని భావించాలి. బాబా మన ఒబీడియంట్ (విధేయుడైన) టీచర్ కూడా. అనంతమైన తండ్రి తప్పకుండా ఏదో సేవ చేసి ఉంటారు, కావుననే వారికి గాయనం ఉంది కదా. ఇది ఎంత అద్భుతమైన విషయము. ఎంతగా వారి మహిమ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూర్చున్నప్పుడు బుద్ధిలో ఆ నషా ఉండాలి. సన్యాసులు అయితే నివృత్తి మార్గానికి చెందినవారు. అసలు వారి ధర్మమే వేరు. ఇది కూడా ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. సన్యాస మార్గము గురించి మీకు తెలియదు కదా. మీరు గృహస్థ ఆశ్రమములో ఉంటూ భక్తి మొదలైనవి చేసేవారు, మీకు తర్వాత జ్ఞానము లభిస్తుంది, వారికైతే జ్ఞానము లభించేదే లేదు. మీరు ఎంత ఉన్నతముగా చదువుతారు కానీ ఎంత సాధారణముగా కింద కూర్చుని ఉన్నారు. దిల్వాడా మందిరములో కూడా మీరు కింద తపస్యలో కూర్చున్నారు, పైన వైకుంఠము ఉంది. పైన వైకుంఠము ఉండడాన్ని చూసి మనుష్యులు స్వర్గము పైనే ఉంటుంది అని భావిస్తారు.
పిల్లలైన మీకు లోపల - ఇది స్కూల్ అని, మనం చదువుతున్నామని ఈ విషయాలన్నీ రావాలి. ఎక్కడికైనా తిరగడానికి వెళ్ళినప్పుడు కూడా బుద్ధిలో ఈ విషయాలు నడుస్తూ ఉన్నట్లయితే ఎంతో ఆనందం కలుగుతుంది. అనంతమైన తండ్రి గురించి అయితే ప్రపంచములో ఎవరికీ తెలియదు. తండ్రికి కొడుకుగా అయి ఆ తండ్రి చరిత్ర గురించి తెలియని మూర్ఖులను ఎప్పుడైనా చూసారా. తెలియని కారణముగానే వారిని సర్వవ్యాపి అని అనేస్తారు. భగవంతుడినే - నీవే పూజ్యుడవు, నీవే పూజారివి అని అంటారు. మేము ఎంత ఉన్నతమైన పూజ్యులుగా ఉండేవారము, మళ్ళీ మేమే పూజారులుగా అయ్యాము అని పిల్లలైన మీకు లోలోపల ఎంత సంతోషము ఉండాలి. ఏ శివబాబా అయితే మిమ్మల్ని ఇంత ఉన్నతముగా తయారుచేస్తారో, మళ్ళీ డ్రామానుసారంగా వారినే మీరు పూజించడం ప్రారంభిస్తారు. భక్తి ఎప్పుడు ప్రారంభమవుతుంది అని ఈ విషయాలను గురించి ప్రపంచానికి తెలియదు. తండ్రి పిల్లలైన మీకు ప్రతి రోజూ అర్థం చేయిస్తూ ఉంటారు. ఇక్కడ కూర్చున్నప్పుడు - మమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు అని లోలోపల ఎంత సంతోషము ఉండాలి. భగవంతుడు వచ్చి చదివిస్తారు - ఇది ఎప్పుడూ వినను కూడా వినియుండరు. వారు గీతా భగవంతుడు శ్రీకృష్ణుడు అని భావిస్తారు కావున శ్రీకృష్ణుడే చదివిస్తారేమోనని భావిస్తారు. అచ్ఛా, శ్రీకృష్ణుడే అని భావించినా కానీ ఎంతటి ఉన్నతమైన అవస్థ ఉండాలి. మనుష్య మతము మరియు ఈశ్వరీయ మతము అనే పుస్తకం కూడా ఒకటి ఉంది. దేవతలకైతే ఇలా మతమును తీసుకునే అవసరమే ఉండదు. ఈశ్వరీయ మతాన్ని మనుష్యులే కోరుకుంటారు. దేవతలకైతే ముందు జన్మలో మతము లభించింది, దాని ద్వారా ఉన్నతమైన పదవిని పొందారు. ఇప్పుడు పిల్లలైన మీకు శ్రేష్ఠముగా అయ్యేందుకు శ్రీమతము లభిస్తుంది. ఈశ్వరీయ మతముకు మరియు మనుష్య మతముకు ఎంతటి తేడా ఉంది. మనుష్య మతము ఏమి చెప్తుంది, ఈశ్వరీయ మతము ఏమి చెప్తుంది. మరి తప్పకుండా ఈశ్వరీయ మతముపై నడవవలసి ఉంటుంది. కొంతమంది ఎవరినైనా కలుసుకునేందుకు వెళ్ళినప్పుడు ఏమీ తీసుకువెళ్ళరు, ఎవరికి ఏ కానుకను ఇవ్వాలి అన్నది గుర్తుండదు. ఈ మనుష్య మతము మరియు ఈశ్వరీయ మతము యొక్క వ్యత్యాసము చాలా అవసరము. మీరు మనుష్యులుగా ఉన్నప్పుడు ఆసురీ మతము ఉండేది మరియు ఇప్పుడు ఈశ్వరీయ మతము లభిస్తుంది. వీటి మధ్యన ఎంత తేడా ఉంది. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ మనుష్యుల ద్వారా తయారుచేయబడ్డవే. తండ్రి ఏమైనా శాస్త్రాలను చదివి వస్తారా? తండ్రి అంటారు, నేను ఏ తండ్రికైనా కొడుకునా? నేను నేర్చుకునేందుకు ఏ గురువుకైనా శిష్యుడినా? కావున ఈ విషయాలన్నింటినీ కూడా అర్థం చేయించాలి. కోతిబుద్ధి కలవారు అని తెలిసినా కానీ మందిరయోగ్యులుగా అయ్యేవారిగా కూడా ఉన్నారు కదా. ఇలా ఎంతోమంది మనుష్య మతముపై నడుస్తారు, మళ్ళీ మీరు - మేము ఈశ్వరీయ మతము ద్వారా ఎలా తయారవుతాము అన్నది వినిపిస్తారు. వారు మనల్ని చదివిస్తారు. భగవానువాచ. మనము వారి నుండి చదువుకునేందుకు వెళ్తాము. మనము రోజూ ఒక గంట, ముప్పావుగంట వెళ్తాము. క్లాస్ కు ఎక్కువ సమయం కూడా తీసుకోకూడదు. స్మృతియాత్ర అయితే నడుస్తూ, తిరుగుతూ కూడా జరగగలదు. జ్ఞానము మరియు యోగము, రెండూ చాలా సహజమైనవి. అల్ఫ్ (భగవంతుడు) అన్న పదము ఒక్కటే. భక్తి మార్గములో అయితే ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి, వాటన్నింటినీ పోగు చేస్తే మొత్తం ఇల్లు అంతా శాస్త్రాలతో నిండిపోతుంది. వీటిపై ఎంత ఖర్చు అయి ఉంటుంది. ఇప్పుడు తండ్రి అయితే చాలా సహజముగా తెలియజేస్తారు - కేవలం తండ్రిని స్మృతి చేయండి. తండ్రి ఇచ్చే వారసత్వము స్వర్గ రాజ్యాధికారము. మీరు విశ్వాధిపతులుగా ఉండేవారు కదా. భారత్ స్వర్గముగా ఉండేది కదా. మీరు మర్చిపోయారా? దీనిని కూడా డ్రామా రాత అనే అంటారు. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు. వారు ప్రతి 5000 సంవత్సరాల తర్వాత చదివించేందుకు వస్తారు. అనంతమైన తండ్రి వారసత్వముగా తప్పకుండా కొత్త ప్రపంచమైన స్వర్గమే ఉంటుంది కదా. ఇది చాలా సహజమైన విషయము. లక్షల సంవత్సరాలు అని అనేటప్పటికి బుద్ధికి తాళం పడినట్లుగా అయిపోయింది. అసలు ఆ తాళం తెరుచుకోనే తెరుచుకోదు. తాళం ఎలా పడిపోయిందంటే ఇంతటి సహజమైన విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు. ఒకే విషయం చాలు అని తండ్రి అర్థం చేయిస్తారు. ఎక్కువగా ఏమీ చదివించకూడదు. ఇక్కడ మీరు ఒక్క క్షణములో ఎవరినైనా స్వర్గవాసులుగా చేయగలరు. కానీ ఇది స్కూలు, అందుకే మీ చదువు కొనసాగుతూ ఉంటుంది. జ్ఞాన సాగరుడైన తండ్రి మీకు జ్ఞానాన్ని ఎంతగా ఇస్తారంటే సాగరాన్ని సిరాగా చేసి మొత్తం అడవినంతటినీ కలముగా చేసినా అది అంతమవ్వదు. జ్ఞానాన్ని ధారణ చేస్తూ ఎంత సమయమయ్యింది. భక్తి ప్రారంభమై అర్ధకల్పమయ్యింది. జ్ఞానమైతే మీకు ఒకే జన్మలో లభిస్తుంది. తండ్రి మిమ్మల్ని కొత్త ప్రపంచము కోసం చదివిస్తున్నారు. ఆ దైహికమైన స్కూళ్ళలోనైతే మీరు ఎంత సమయం చదువుతారు. 5 సంవత్సరాల వయసు నుండి 20-22 సంవత్సరాల వయసు వరకు చదువుతూ ఉంటారు. సంపాదన తక్కువ మరియు ఖర్చు ఎక్కువ చేస్తే నష్టం కలుగుతుంది కదా.
తండ్రి ఎంత సంపన్నులుగా చేస్తారు, మళ్ళీ దివాలాకోరుగా అయిపోతారు. ఇప్పుడు భారత్ పరిస్థితి ఎలా ఉందో చూడండి. నషాతో అర్థం చేయించాలి. మాతలు లేచి నిలబడాలి. వందేమాతరం అని మీకే గాయనం ఉంది. భూమిని వందేమాతరం అనరు. వందేమాతరం అని మనుష్యులకే నమస్కరించడం జరుగుతుంది. ఏ పిల్లలైతే బంధనముక్తులుగా ఉన్నారో, వారే ఈ సేవ చేస్తారు. అది కూడా కల్పపూర్వము ఏ విధంగా బంధనముక్తులుగా అయ్యారో అలా అవుతూ ఉంటారు. అబలలపై ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి. మాకు తండ్రి లభించారు అని తెలుసు కావున ఇప్పుడిక ఆ తండ్రి సేవనే చేయాలి, అదే చాలు అని భావిస్తారు. బంధనము ఉంది అని అనేవారు గొర్రెలవంటివారు. మీరు ఈశ్వరీయ సేవ చేయకండి అని ప్రభుత్వం ఎప్పుడూ అనలేదు. మాట్లాడే ధైర్యము ఉండాలి కదా. ఎవరిలోనైతే జ్ఞానం ఉంటుందో, వారు చాలా సహజముగా బంధనముక్తులుగా అవ్వగలరు. జడ్జికి కూడా అర్థం చేయించవచ్చు - మేము ఆత్మిక సేవ చేయాలనుకుంటున్నాము, ఆత్మిక తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు అని. క్రిస్టియన్లు - విముక్తులుగా చేయండి, గైడ్ గా అవ్వండి అని అంటారు. ఎంతైనా భారతవాసుల కన్నా వారి బుద్ధి బాగుంది. పిల్లలైన మీలో మంచి వివేకవంతులు ఎవరైతే ఉన్నారో, వారికి సేవ పట్ల అభిరుచి ఎంతగానో ఉంటుంది. ఈశ్వరీయ సేవతో ఎంతో లాటరీ లభించనున్నది అని భావిస్తారు. కొందరైతే లాటరీ మొదలైనవాటిని అర్థమే చేసుకోరు. వారు అక్కడకు వెళ్ళి కూడా దాస-దాసీలుగానే అవుతారు. పోనీలే, దాసీగా అయినా పర్వాలేదు, చండాలునిగా అయినా పర్వాలేదు, స్వర్గములో అయితే ఉంటాము కదా అని వారు భావిస్తారు! వారి నడవడిక కూడా అలాగే కనిపిస్తుంది. అనంతమైన తండ్రి మనకు అర్థం చేయిస్తున్నారని మీరు భావిస్తారు. ఈ దాదా కూడా అర్థం చేయిస్తారు. తండ్రి వీరి ద్వారా పిల్లలను చదివిస్తున్నారు. కొందరైతే ఈ మాత్రము కూడా అర్థం చేసుకోరు. ఇక్కడి నుండి బయటకు వెళ్ళగానే సమాప్తము. ఇక్కడ కూర్చున్నా కూడా ఏమీ అర్థం చేసుకోనట్లే ఉంటారు. బుద్ధి బయట భ్రమిస్తూ ఎదురుదెబ్బలు తింటూ ఉంటుంది. ఒక్క భూతము కూడా తొలగదు. చదివించేవారు ఎవరు కానీ తయారవుతుంది ఎలా! షావుకారులకు కూడా దాస-దాసీలు తయారవుతారు కదా. ఇప్పుడు కూడా షావుకారుల వద్ద ఎంతమంది నౌకర్లు ఉంటారు. సేవ కోసమైతే పూర్తిగా ఎగురుతూ ఉండాలి. పిల్లలైన మీరు శాంతి స్థాపనార్థము నిమిత్తము అయ్యారు, విశ్వములో సుఖ-శాంతులను స్థాపన చేస్తున్నారు. మనము శ్రీమతముపై స్థాపన చేస్తున్నామని, ఇందులో ఏ విధమైన అశాంతీ ఉండకూడదని మీకు ప్రాక్టికల్ గా తెలుసు. తండ్రి ఇక్కడ కూడా మంచి-మంది కుటుంబాలను చాలా చూసారు, ఒకే ఇంట్లో 6-7గురు కోడళ్ళు కలిసి-మెలిసి ఎంతో ప్రేమగా ఉంటారు, ఎంతో శాంతి ఉంటుంది. మా ఇంట్లో అయితే స్వర్గము ఉంది, ఎటువంటి గొడవల విషయమూ లేదు, అందరూ ఆజ్ఞాకారులుగా ఉన్నారు అని వాళ్ళు అనేవారు. ఆ సమయములో బాబాకు కూడా సన్యాసపు ఆలోచనలు ఉండేవి. ప్రపంచముపై వైరాగ్యము ఉండేది. ఇప్పుడు ఇది అనంతమైన వైరాగ్యము. ఏమీ గుర్తుండకూడదు. బాబా అయితే పేర్లు మొదలైనవాటన్నింటినీ మర్చిపోతారు. పిల్లలు అంటారు - బాబా, మీరు మమ్మల్ని తలచుకుంటారా? బాబా అంటారు, నేనైతే అందరినీ మర్చిపోవాలి. మర్చిపోను, అలాగని గుర్తుంచుకోను. అనంతమైన వైరాగ్యము కదా. అందరినీ మర్చిపోవాలి. మనము ఇక్కడి నివాసులము కాము. తమ స్వర్గ వారసత్వాన్ని ఇవ్వడానికి తండ్రి వచ్చి ఉన్నారు. అనంతమైన తండ్రి అంటారు - నన్ను స్మృతి చేసినట్లయితే మీరు విశ్వాధిపతులుగా అయిపోతారు. అర్థం చేయించేందుకు ఈ బ్యాడ్జి ఎంతో బాగుంది. ఎవరైనా ఇది కావాలని అడిగితే ఇలా చెప్పండి - మీరు అర్థం చేసుకుని తీసుకోండి, ఈ బ్యాడ్జిని అర్థం చేసుకోవడం ద్వారా మీకు విశ్వ రాజ్యాధికారము లభించగలదు అని. శివబాబా ఈ బ్రహ్మా ద్వారా డైరెక్షన్ ఇస్తున్నారు - నన్ను స్మృతి చేసినట్లయితే మీరు ఈ విధంగా అవుతారు. దేవతా ధర్మానికి చెందినవారిలో గీతను చదివేవారు ఎవరైతే ఉంటారో వారు బాగా అర్థం చేసుకుంటారు. కొందరు - దేవతలు ఎందుకు దిగజారుతారు అని ప్రశ్న అడుగుతారు. అరే, ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. పునర్జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ కిందకైతే దిగుతారు కదా! చక్రమైతే తిరిగేదే ఉంది. ప్రతి ఒక్కరి హృదయములోకి ఇది తప్పకుండా వస్తుంది - నేను సేవను ఎందుకు చేయలేకపోతాను? తప్పకుండా నాలో ఏదో లోపము ఉంది. మాయ భూతాలు ముక్కు పట్టుకుని ఉన్నాయి.
ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు - మనము ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ కొత్త ప్రపంచములోకి వచ్చి రాజ్యం చేస్తాము. మీరు యాత్రికులు కదా. దూరదేశము నుండి ఇక్కడకు వచ్చి పాత్రను అభినయిస్తారు. మనము అమరలోకములోకి వెళ్ళాలి అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఈ మృత్యులోకము అంతమైపోనున్నది. తండ్రి అయితే ఎంతో అర్థం చేయిస్తారు. చాలా బాగా ధారణ చేయాలి. దీనిని మళ్ళీ నెమరువేస్తూ ఉండాలి. కర్మభోగము యొక్క రోగము తిరగబడుతుంది అని కూడా తండ్రి అర్థం చేయించారు. మాయ విసిగిస్తుంది కానీ తికమకపడకూడదు. ఏదైనా కొంచెం జరిగితే హైరానా పడిపోతారు. రోగగ్రస్థులై ఉన్నప్పుడు మనుష్యులు భగవంతుడిని ఇంకా ఎక్కువగా తలచుకుంటారు. బెంగాల్ లో ఎవరైనా చాలా రోగగ్రస్థులుగా అయితే, వారికి రాముడిని స్మరించండి, రాముడిని స్మరించండి... అని చెప్తారు. ఇక వారు చనిపోయే స్థితిలో ఉన్నారని అనిపిస్తే గంగ వద్దకు తీసుకువెళ్ళి, హరి అని జపించండి, హరి అని జపించండి అని చెప్తారు. మరి మళ్ళీ వారిని తీసుకువచ్చి కాల్చవలసిన అవసరమేముంది. గంగలోనే వేసేయండి కదా. మొసళ్ళు, చేపలకు ఆహారమవుతారు, శరీరము ఆ రకంగా పనికొస్తుంది. పార్శీయులు శవాన్ని అలా పెట్టేస్తారు, వారి ఎముకలు కూడా పనికొస్తాయి. తండ్రి అంటారు, మీరు ఇతర విషయాలన్నింటినీ మరచి నన్నొక్కరినే స్మృతి చేయండి. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. బంధనముక్తులుగా అయి భారత్ యొక్క సత్యమైన సేవను చేయాలి. మమ్మల్ని ఆత్మిక తండ్రి చదివిస్తున్నారు, మేము ఆత్మిక సేవలో ఉన్నాము అని నషాతో అర్థం చేయించాలి. ఈశ్వరీయ సేవ చేసే ఉత్సాహము కలుగుతూ ఉండాలి.
2. కర్మభోగపు రోగాలలో లేక మాయ తుఫానులలో తికమకపడకూడదు లేక హైరానా పడకూడదు. తండ్రి ఏ జ్ఞానాన్ని అయితే ఇచ్చారో, దానిని నెమరువేస్తూ తండ్రి స్మృతిలో హర్షితముగా ఉండాలి.
| వరదానము:- |
నిరాకారీ మరియు సాకారీ, రెండు రూపాల స్మృతిచిహ్నాన్ని విధి పూర్వకముగా జరుపుకునే శ్రేష్ఠ ఆత్మా భవ దీపావళి అనేది అవినాశీగా వెలుగుతున్న అనేక దీపాలకు స్మృతిచిహ్నము. మెరుస్తున్న ఆత్మలైన మీరు ప్రమిదలోని దీపపు వెలుగులా కనిపిస్తారు, అందుకే మెరుస్తున్న ఆత్మల దివ్య జ్యోతి యొక్క స్మృతిచిహ్నాన్ని స్థూల దీపములోని జ్యోతిగా చూపించారు, కావున ఒకవైపు నిరాకారీ ఆత్మ రూపములో స్మృతిచిహ్నము ఉంది, మరొకవైపు మీ భవిష్య సాకార దివ్య స్వరూపమైన లక్ష్మి రూపములో స్మృతిచిహ్నము ఉంది. ఈ దీపావళియే దేవ పదవిని ప్రాప్తింపజేస్తుంది. కావున శ్రేష్ఠ ఆత్మలైన మీరు మీ స్మృతిచిహ్నాన్ని స్వయమే జరుపుకుంటున్నారు. |
| స్లోగన్:- | నెగెటివ్ ను పాజిటివ్ లోకి పరివర్తన చేసేందుకు మీ భావనలను శుభమైనవిగా మరియు అనంతమైనవిగా చేసుకోండి. |