తెలుగు మురళి · Brahma Kumaris

ఈరోజు మురళి

ఓం శాంతి · BapDada · 22 నవంబర్, 2026

ఈరోజు మురళి — ప్రతి ఉదయం కొత్తది.

18
డౌన్‌లోడ్ PDF
0:00--:--

పాఠ్యాన్ని ఎంచుకోండి → హైలైట్ / బాక్స్ / అండర్‌లైన్

22-11-2026
ప్రాత:మురళి
ఓంశాంతి
‘‘అవ్యక్త బాప్ దాదా’’
రివైజ్ 03-04-2012 మధువనం

‘‘నాది అన్న దానిని నీది లోకి పరివర్తన చేసి నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి, బాబా ప్రేమలో మరియు సేవలో మనసును ఎంతగా బిజీగా పెట్టుకోండంటే వ్యర్థము రావడానికి అవకాశము ఉండకూడదు’’

ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న తమ నిశ్చింత చక్రవర్తులను చూస్తున్నారు. ప్రతి బిడ్డ ఉదయము నుండే మేలుకుని నిశ్చింత స్థితిలో స్థితులై ప్రతి కర్మను చేస్తారు. ఈ నిశ్చింత చక్రవర్తి జీవితములో చక్రవర్తిత్వము కూడా ఉంది మరియు నిశ్చింతత కూడా ఉంది అని ప్రతి బిడ్డకు అనుభవముంది, ఇది ఎంత ప్రియముగా అనిపిస్తుంది ఎందుకంటే మీరందరూ బాబాకు చింతను ఇచ్చి నషాను తీసుకున్నారు. నషా కూడా అవినాశీ నషాను తీసుకున్నారు. ఈ నిశ్చింత జీవితము ఎంత ప్రియమైనది అనేది ప్రతి ఒక్కరూ అనుభవం చేస్తారు. రాత్రింబవళ్ళు ఏ విషయములోనూ చింత లేదు, నషా ఉంది. ఇలా నిశ్చింతగా ఉండే జీవితాన్ని బాబా ఈ ఒక్క జన్మ కోసమే కాదు, కానీ అనేక జన్మల కోసం నిశ్చింత చక్రవర్తులుగా చేసారని మీకు తెలుసు. ఇప్పుడు ఇలా అనుభవం చేస్తున్నారు - నిశ్చింత జీవితము ఒకవేళ ఉన్నట్లయితే సదా మస్తకములో దివ్య జ్యోతి మెరుస్తూ ఉంటుంది మరియు ఒకవేళ చింత ఉన్నట్లయితే తలపై అనేక రకాల దుఃఖపు తట్టలు నిండి ఉంటాయి. ఈ నిశ్చింత జీవితము యొక్క విధి చాలా సహజమైనది - హద్దు యొక్క ‘నాది-నాది’ అన్నది ఏదైతే ఉందో, దానిని ‘నీది’ లోకి పరివర్తన చేసారు. నాది మరియు నీదిలో కేవలం ఒక్క అక్షరమే తేడా ఉంది. ‘నా’ మరియు ‘నీ’. కానీ నాదిని నీదిలోకి పరివర్తన చేసినట్లయితే జీవితము ఎంత సంతోషముగా అయిపోతుంది. అయిపోయింది కదా! తల ఊపండి, అయిపోయిందా! నిశ్చింత జీవితము అయిపోయిందా! ఎందుకంటే చింతల జీవితానికి ఆధారము వ్యర్థ సంకల్పాలు. మరి ఇప్పుడు బాప్ దాదా ప్రతి బిడ్డ నుండి ఇదే కోరుకుంటున్నారు - ప్రతి బిడ్డ లోపల వ్యర్థ సంకల్పాల అంశము కూడా మిగలకూడదు అని. ఎందుకంటే ఎప్పుడైతే నాదిని నీదిలోకి పరివర్తన చేస్తారో, అప్పుడు మీరు ఏమైనట్లు? మీరు నిశ్చింత చక్రవర్తులుగా అయినట్లు. ఈ నిశ్చింత చక్రవర్తి యొక్క జీవితము ఎంత ప్రియమైనది. ప్రతి కర్మను చేస్తూ నిశ్చింత చక్రవర్తి. ఏ చింత లేదు - ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పటివరకు... ఇదంతా సమాప్తమైపోయింది. బాప్ దాదా ఈ రోజు ఈ సీజన్ యొక్క చివరి రోజున ఇదే కోరుకుంటున్నారు - ప్రతి బిడ్డ వ్యర్థాన్ని నాదిని నీదిలోకి పరివర్తన చేయాలి, అప్పుడు బాబా స్వయమే దానిని భస్మము చేసేస్తారు. మీరు కేవలం ఈ చిన్న పరివర్తనను చేసి చూడండి, సమ్మతమేనా! వీలవుతుందా? ఒకవేళ వీలవుతుంది అంటే చేతులెత్తండి. చాలా మంచిది, ఎందుకంటే ఈ 5-6 నెలలు మీరందరూ విశ్వములోని దుఃఖిత ఆత్మలకు శక్తిశాలి వృత్తి ద్వారా సుఖ-శాంతుల కిరణాలను ఇవ్వాలి. ఇందులోనే మీ మనసును బిజీగా పెట్టుకోవాలి. వ్యర్థ సంకల్పాలు కూడా ఎందులో వస్తాయి? మనసులో వస్తాయి కదా! కావున బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు, ప్రతి ఒక్క నిశ్చింత చక్రవర్తి బిడ్డ తమ మనసును అనగా వృత్తిని ఎంత బిజీగా పెట్టుకోండంటే ఇక వ్యర్థము వచ్చేందుకు అవకాశమే ఉండకూడదు. శ్రమించవలసిన అవసరము ఉండకూడదు. బాబా ప్రేమలో ఎంత బిజీగా ఉండండి అంటే, వృత్తితో చేసే సేవలో ఎంతగా మనసును బిజీగా పెట్టండంటే ఇక యుద్ధము కూడా చేయాల్సిన అవసరము ఉండకూడదు. కొంతమంది పిల్లలు ఏమంటారంటే - మేము కోరుకోవడము లేదు కానీ వచ్చేస్తున్నాయి. దీనిని ఏమంటారు? మనసును బాబా ప్రేమలో మరియు సేవలో బిజీగా పెట్టలేదు. మీ ప్రేమ బాబాపై ఎంత ఉంది అని అందరినీ అడుగుతున్నాము. ఇలా అడిగితే ఏమని చెప్తారు? అనంతము అని అంటారు. మరి ఎవరి పైనైతే ప్రేమ ఉంటుందో, వారు చెప్పిన మాటను వినడము కష్టమనిపించదు. మరి మీ అందరికీ బాబాపై ఎడతెగని ప్రేమ ఉంది కదా! లేక అప్పుడప్పుడూ ఉందా? సదా ఉందా లేక అప్పుడప్పుడూ ఉందా? ఎవరైతే సదా ప్రేమ ఉంది అని అంటారో, వారు చేతులెత్తండి. సదా ప్రేమ ఉందా, చూడండి, ఆలోచించండి, సదా ప్రేమ ఉన్నట్లయితే బాబా చెప్పడము మరియు పిల్లలు చెయ్యడము ఉండాలి. ఇదైతే తెలుసు కదా!

ఇప్పుడు ఈ సీజన్ లో బాప్ దాదా పిల్లల చేత ఇదే దృఢ సంకల్పాన్ని చేయించాలనుకుంటున్నారు, సిద్ధముగా ఉన్నారు కదా! తల ఊపండి. దృఢ సంకల్పము చెయ్యడానికి సిద్ధముగా ఉన్నారా? వెనుక ఉన్నవారు సిద్ధముగా ఉన్నారా? మాతలు కూడా సిద్ధముగా ఉన్నారా? పాండవులు కూడా సిద్ధముగా ఉన్నారా? అచ్ఛా, చేతులు ఎత్తండి. ఇందులో రెండేసి చేతులు ఎత్తండి. చేతులు ఎత్తినప్పుడు బాప్ దాదాను సంతోషపెడతారు. ఇప్పుడు ఎలా అయితే ఈ చేతులను ఎత్తారో, అలా మనసు యొక్క చేతిని ఎత్తండి. ఎప్పుడూ కూడా వ్యర్థ సంకల్పాలను రానివ్వము. వాటి పని రావడము, మీ పని ఏమిటి? సమాప్తము చేసేయ్యడము. ఈ సీజన్ లో బాప్ దాదా ఇంతకుముందు కూడా చెప్పారు, రెండు విషయాల పట్ల అటెన్షన్ పెట్టాలి, ఒకటి సంకల్పాలు, రెండు సమయము. ఈ సంగమ సమయములోని ఒక్కొక్క నిమిషము యొక్క కనెక్షన్ 21 జన్మలతో ఉంది అని మీకు తెలుసు. ఈ సమయములో బాప్ దాదాకు పిల్లలపై, పిల్లలకు బాబాపై ప్రేమ ఉంది. ఈ సంగమ సమయములోని ఒక్క సెకండు, సెకండు కాదు ఎందుకంటే దానికి 21 జన్మలతో కనెక్షన్ ఉంది. ఒకవేళ ఇప్పుడు సమయాన్ని కాపాడుకోకపోతే 21 జన్మలు పోగొట్టుకున్నట్లే. బాబాపై ప్రేమ ఉంది మరియు ప్రతి ఒక్కరూ, ‘బాబాతో ఇప్పుడు కూడా ఉండాలి, తర్వాత కూడా కలిసి వెళ్ళాలి’ అని కోరుకుంటారు. మన ఇంటికి తిరిగి వెళ్ళాలి కదా ఇప్పుడు. మరి ఇంటికి కూడా కలిసి వెళ్ళాలి మరియు తర్వాత రాజ్యములోకి కూడా బాప్ దాదాతో పాటు, విశేషముగా బ్రహ్మాబాబాతో పాటు రాజధానిలో సమీపముగా రావాలి. మరి బ్రహ్మాబాబా అయితే ఫరిశ్తా రూపములో ఉన్నారు మరియు మీరు వారితోపాటు వెళ్ళాలి అంటే ఏమి చెయ్యవలసి ఉంటుంది? ఫరిశ్తాగా అవ్వవలసి ఉంటుంది కదా! ఫరిశ్తాగా అవుతారా! అవ్వవలసిందే కదా!

బ్రహ్మాబాబా చేతిలో చేయి వేసి కలిసి వెళ్ళాలి, మరి చేయి ఏమిటి? ఫరిశ్తాకు స్థూలమైన చేతులైతే ఉండవు. బ్రహ్మాబాబా చేయి ఏమిటి? శ్రీమతము. మరి బాప్ దాదా శ్రీమతము ఇదే - ఇప్పుడు నిశ్చింత చక్రవర్తులుగా అయ్యి సదా ఎలా అయితే మీ జగదాంబ పురుషార్థము చేసారో, బాబా చెప్పడము మరియు జగదాంబ చెయ్యడము, ఇలా జగదాంబను ఫాలో చేయండి. సమయాన్ని మరియు సంకల్పాలను సఫలం చేసుకోవలసిందే. అవి వ్యర్థముగా పోకూడదు. వినిపించాము కదా, ఒక్కొక్క సంకల్పము యొక్క కనెక్షన్ 21 జన్మలతో ఉంది. కావున బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు, సదా మనసును బిజీగా పెట్టుకోండి. మురళి మననములో కావచ్చు, సేవలో కావచ్చు, ప్రతి సమయము బిజీగా ఉండండి. మీ చార్టును తయారుచేసుకోండి, ప్రతి సమయము మధ్యమధ్యలో బాప్ దాదా ఏవైతే భిన్న-భిన్న డ్రిల్స్ ను వినిపించారో, వాటిని అభ్యాసము చేయండి. డ్రిల్స్ తెలుసు కదా - అశరీరిగా అయ్యే డ్రిల్, మీ మూడు స్వరూపాల స్మృతి డ్రిల్, తెలుసు కదా! ఎలా అయితే బాబాకు మూడు రూపాలు ఉన్నాయో, అలాగే మీకు కూడా మూడు రూపాలు ఉన్నాయి. బ్రాహ్మణ, ఫరిశ్తా మరియు దేవత. ఈ మూడు రూపాలలో డ్రిల్ చెయ్యడము ద్వారా మీ మనసును బిజీగా పెట్టుకోండి, అందుకే మహామంత్రము ఏమిటి? మన్మనాభవ.

ఇకపోతే, బాప్ దాదాకు ప్రతి బిడ్డ పట్ల చాలా-చాలా ప్రేమ ఉంది, అందుకే బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు, ప్రతి బిడ్డ ‘విజయీ భవ’ యొక్క వరదానిగా అవ్వాలి. వినిపించాము కదా, కొంతమంది పిల్లలు ఏమనుకుంటారంటే, మేము విజయులుగా అయితే అవుతాము కానీ మాల అయితే 108 మందిది మాత్రమే కదా, అటువంటప్పుడు విజయులుగా అయ్యి మాలలోకైతే రాలేము కదా. కానీ బాప్ దాదాకు ఎంత ప్రేమ ఉందంటే మీరు విజయులుగా అయితే బాప్ దాదా మాలలో కూడా వరుసలు జోడిస్తారు. మీరు కేవలం విజయులుగా అవ్వండి. మరి ఏమి సంకల్పముంది? విజయులుగా అవ్వవలసిందే కదా! లేక కేవలం 108 మంది మాత్రమే విజయులుగా అవుతారా? లేదు. బాబా యొక్క ప్రతి బిడ్డ విజయీనే. బాప్ దాదా ప్రతి బిడ్డ మస్తకముపై ఏం చూస్తున్నారు? విజయ తిలకము, ఎందుకంటే సాధారణ రూపములో ఉన్న బాబాను గుర్తించారు కదా! చివరి బిడ్డ అయినా, పురుషార్థములో ఢీలాగా ఉన్నా, వారిలో ఈ విశేషత ఉంది, అదేమిటంటే, సాధారణ రూపములో వచ్చిన తండ్రిని గుర్తించి ‘నా బాబా’ అనైతే అంటారు కదా, అందుకే ప్రతి బిడ్డ ధైర్యాన్ని ఉంచి విజయాన్ని ప్రాప్తి చేసుకోవాల్సిందే. కేవలం ఏం చేయాలి? శ్రమించే విషయమేమీ లేదు, అది ప్రేమ యొక్క విషయము. బాప్ దాదాపై ప్రేమ ఉంది, పరివారముపై ప్రేమ ఉంది, మరి ప్రేమ ఉన్నవారి నుండి దూరంగా ఉండలేరు. మరి బ్రహ్మాబాబాపై ఎంత ప్రేమ ఉంది? ఎవరైతే, బ్రహ్మాబాబాపై, శివబాబాపై మాకు ఎడతెగని ప్రేమ ఉంది అని భావిస్తున్నారో వారు చేతులెత్తండి. ఎడతెగని ప్రేమనా, ఎడతెగని ప్రేమనా? చాలా మంచిది. మరి వచ్చే సీజన్ లో బాప్ దాదా ఏమి చూడాలని కోరుకుంటున్నారు? తెలుసు కదా. మీకు వ్యర్థము నుండి సమర్థ సంకల్పాలు చెయ్యడానికి 5-6 నెలలు లభించనున్నాయి.

మరి చెప్పండి, మధుబన్ వారు లేవండి, కిందివారైనా, పైనవారైనా, చాలామంది ఉన్నారు. మధుబన్ వారు బాప్ దాదాకు ప్రియమైనవారు. అంటే మిగతావారు ప్రియమైనవారు కాదని కాదు. వారు కూడా ప్రియమైనవారే కానీ మధుబన్ వారిపై ఒక విషయములో విశేషమైన ప్రేమ ఉంది, అది ఏమిటి? మనసులో స్మృతి అయితే అందరూ చేస్తారు. అందరూ యోగీ ఆత్మలే. అందరూ జ్ఞాని ఆత్మలు కూడా, కానీ మధుబన్ వారికి తమ భవిష్యత్తును సహజముగా తయారుచేసుకునేందుకు ఒక లిఫ్టు లభించింది. ఆ లిఫ్టు ఏమిటి? ఎవరు మధుబన్ కు వచ్చినా, వారి సేవకు నిమిత్తమవుతారు. భోజనము తయారుచేసేవారు కావచ్చు, ఏ డ్యూటీ చేసేవారైనా కావచ్చు, బాప్ దాదా అంటారు, ఊడ్చే సేవలో ఉన్నవారైనా, వారు కూడా భాగ్యశాలురే. ఎందుకని? ఎవరు వచ్చినా కానీ వారు ఈ వాయుమండలాన్ని చూసి, మీ మనసులోని ప్రేమ యొక్క శక్తిని చూసి సంతోషిస్తారు. భోజనము తయారుచేసేవారు కావచ్చు, మరింకేదైనా డ్యూటీవారు కావచ్చు, కానీ మధుబన్ వారికి ఛాన్స్ ఉంది. మధుబన్ యొక్క ప్రేమ మరియు శక్తిశాలి వాయుమండలాన్ని తయారుచేసే అవకాశము ఉంది. అందుకే బాప్ దాదా మధుబన్ వారికి చాలా-చాలా అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ సీజన్ సమాప్తికి మరియు రాబోయే సమయములో కూడా మీ మనసులో ఆత్మలను సంతుష్టపరచడానికి మరియు శక్తిశాలిగా అనుభవము చేయించడానికి నిమిత్తముగా అవుతూ ఉంటారు. అందుకే అందరూ మధుబన్ వారి కోసం చప్పట్లు కొట్టండి. అచ్ఛా.

ఈ రోజు అమృతవేళలో బాప్ దాదాకు మధుబన్ సేవాధారులు ఎదురుగా వచ్చారు. ప్రతి ఒక్కరితో బాప్ దాదా వతనములో కూడా కలిశారు మరియు ప్రత్యేకముగా, మీకు ముందు చెప్పినట్లుగా, నాలుగు గంటల సమయములో అడ్వాన్స్ గా వెళ్ళిన మీ విశేషమైన దాదీలు తప్పకుండా వస్తారు. అలాగే ఈ రోజు కూడా విశేషమైన దాదీలు మరియు విశేషమైన సోదరులు చేరుకున్నారు. వారు విశేషముగా మధుబన్ వారిని ఇమర్జ్ చేయమని చెప్పారు. విశేషముగా దీదీ మరియు దాదీ, ఇరువురూ, మరియు విశేషమైన సోదరులు కూడా మధుబన్ వారిని గుర్తు చేసుకున్నారు. దాదీ విశేషముగా ప్రియస్మృతులను అందించారు. అంతే కాకుండా వతనము యొక్క మామిడిపండు, వతనము యొక్క పండ్లు ఎంత బాగుంటాయో మీకు తెలుసు కదా, ఫలాల కోసం కర్రను ఉపయోగించనవసరం లేదు. ఏ ఫలం కావాలనుకుంటే ఆ ఫలాన్ని మీరు చేతితోనే తీసుకోవచ్చు. దాదీ ఏమన్నారంటే, ఈ రోజు మధుబన్ వారితో మామిడి పళ్ళ పిక్నిక్ చేసుకుందాము. ఇతర దాదీలు కూడా వారితో పాటు ఉన్నారు మరియు విశేషమైన సోదరులు కూడా ఉన్నారు. బాప్ దాదా ఏమన్నారంటే, మధుబన్ గురించి దాదీ మనసులో ఏముందో అడగండి. అప్పుడు దాదీ ఏమి చెప్పారు? తెలుసు కదా, దాదీ అయితే మీకు తెలుసు కదా! దాదీ ఏమనేవారంటే, ఇప్పటికీ కూడా నా మనసులో ఇంకా ఉన్న సంకల్పము ఏమిటంటే, మధుబన్ వారు ప్రతి ఒక్కరూ, పురుషార్థములో లోటు ప్రస్తుతము ఇంకా ఉన్నా కానీ, దానికి పురుషార్థమైతే చేయాలి, కానీ నేను మధుబన్ వారి నుండి ఒకటి కోరుకుంటున్నాను. అది ఏమి కోరుకుంటున్నారు? ఒక్కొక్క మధుబన్ నివాసి బాబా సమానముగా అవ్వాలి. అసలైతే అందరూ అవ్వవలసిందే కానీ మధుబన్ విశేషమైనది. మధుబన్ వారికి దాదీపై ప్రేమ ఉంది, ఇది దాదీకి తెలుసు అంటున్నారు. మరి ప్రేమకు రిటర్న్ లో నేను ఇదే కోరుకుంటున్నాను - ఎలా అయితే మమ్మా లక్ష్యము పెట్టుకున్నారో, బాబా చెప్పడము మమ్మా చెయ్యడము. ఇదైతే మధుబన్ వారికి తెలుసు. అలాగే అమృతవేళ నుండి రాత్రి వరకు మధుబన్ వారు ప్రతి ఒక్కరూ, ఒకవేళ బాబాపైనే కాక నాపై కూడా ప్రేమ ఉన్నట్లయితే, దాదీలపై కూడా ప్రేమ ఉన్నట్లయితే, మరి ఎలా అయితే మమ్మా బాబా చెప్పిన ప్రతి సలహాను జీవితములో ఆచరించారో, అలా నేను కూడా చేసాను, మరి ఒకవేళ దాదీలపై ప్రేమ ఉన్నట్లయితే, ఇదే చేసి చూపించండి. ఉదయము నుండి రాత్రి వరకు దాదీలకు లేక బాబాకు లేక ఎవ్వరికీ నచ్చని సంకల్పాలు, మాటలు, కర్మలు చెయ్యవద్దు.

టీచర్లను చూసి బాప్ దాదా సంతోషిస్తారు ఎందుకంటే బాబా సమానమైన సీట్ యొక్క భాగ్యము లభించింది. బాబా మురళిని వినిపించే సీట్ లభించింది. బాబా సదా టీచర్లను సహచరులు అని అంటారు. ఇప్పుడు టీచర్ల నుండి బాప్ దాదా ఒక విషయాన్ని కోరుకుంటున్నారు, అదేమిటో వినిపించమంటారా? బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారంటే, ప్రతి టీచర్ తమ ముఖము ద్వారా బ్రహ్మాబాబా సమానముగా సంతోషముగా కనిపించాలి. పురుషార్థము లోపల జరుగుతున్నప్పటికీ బయటకు మీ ముఖము ద్వారా కనిపించాలి, బాబా ప్రత్యక్షమవ్వాలి. ఎవరిని చూసినా కానీ మీలో బాబా యొక్క మెరుపు కనిపించాలి. ఇలా ముఖముతో సేవ చేసేవారు బాబాను తప్పకుండా ప్రత్యక్షము చేస్తారు. బాబాను మీ ముఖము ద్వారా ప్రత్యక్షము చేసే సమయము ఇప్పుడు వచ్చేసింది. టీచర్లకు సదా ‘నా బాబా’ అన్నదైతే స్వతహాగానే గుర్తుంటుంది. ఇప్పుడు బాబాను ముఖముతో ప్రత్యక్షము చేయాలి. చెయ్యగలరు కదా! చెయ్యగలిగితే మరి చేయండి. చూడండి, ఇప్పటివరకు ఉన్న రిజల్టు గురించి అందరూ ఏమంటారు! బ్రహ్మాకుమారీలు చాలా మంచి పని చేస్తున్నారు అని అంటున్నారు, కానీ బాబా ప్రత్యక్షమవ్వలేదు. వారు ఇప్పటికీ గుప్తముగానే ఉన్నారు. మరి ఇప్పుడు సమయము సమీపముగా వస్తున్నందుకు మీ ద్వారా, అది నిమిత్త టీచర్లు అయినా, ఇతర పిల్లలైనా కానీ, ఇప్పుడు బాబాను ప్రత్యక్షము చేయండి. బ్రహ్మాకుమారీలు మంచి పని చేస్తున్నారు, ఇదైతే జరిగిపోయింది, ఇక్కడివరకు చేరుకున్నారు. కానీ ఇప్పుడు - స్వయం పరమాత్మ బ్రహ్మా తనువులో ప్రత్యక్షమై బ్రహ్మాకుమారీలను ఇంతటి యోగ్యులుగా చేస్తున్నారు అన్నది ప్రత్యక్షమవ్వాలి. ఇప్పుడు ఈ పాయింట్ ఇంకా మిగిలి ఉంది. ‘నా బాబా వచ్చేసారు’ అన్న పాటనైతే పాడుతూ ఉంటారు, కానీ ఇప్పుడు ఇతర ఆత్మల లోపల ఇది ప్రత్యక్షమవ్వాలి - భగవంతుడు స్వయంగా ప్రత్యక్షమై ఈ కార్యాన్ని సోదరీల ద్వారా లేక సోదరుల ద్వారా చేయిస్తున్నారు. ఈ ప్రత్యక్షతను చేయాలి కదా! ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు. ఏమంటారు? ఇప్పుడే కదా! (ఇప్పుడు ప్రారంభిస్తాము, వచ్చే సీజన్ కల్లా అయిపోతుంది) మీరందరూ కూడా ఇందులో ఉన్నారు, వచ్చే సీజన్ లోపల అయిపోతుందా? అలా అనుకునేవారు చేతులెత్తండి. చేతులు కొంతమంది ఎత్తుతున్నారు. చేతులు ఎత్తనివారు చూస్తారు మరియు మీరు చేస్తారు. టీచర్లు అయితే సంకల్పము చేసారు కదా! ఎందుకంటే చూస్తూనే ఉన్నారు, అన్నీ అకస్మాత్తుగా జరగనున్నాయి అని బాప్ దాదా అయితే చెప్తూనే ఉన్నారు. అకస్మాత్తుగా, అకస్మాత్తుగా అంటూ కూడా చాలా సమయమే అయిపోయింది అని కొంతమంది పిల్లలు భావిస్తారు. ఇప్పుడిక జరగాలి. కానీ అకస్మాత్తుగా కూడా ఎప్పుడు జరుగుతుందంటే పిల్లలు కూడా బాబా సమానముగా అయినప్పుడు. మీ ముఖము, మూర్తి, ఒక్కొక్క మాట బాబాను ప్రత్యక్షము చేయాలి. జరిగిపోవలసిందే. జరగాల్సిందే, ఇప్పుడు కేవలం నిమిత్తముగా అవ్వాలి. ఇప్పుడు వచ్చే సీజన్ లో ఏమి చేస్తారు? ఒకటి, స్వయాన్ని బాబా సమానముగా చేసుకోవాలి. ఏ లోపము ఉండిపోయినా కానీ దానిని పూర్తి చేయాలి. బాప్ దాదాకు ఏ విషయములో సంతోషముగా ఉంది? పిల్లలు, చిన్న-పెద్ద సెంటర్లు వాణి ద్వారా తాము ఏమి కార్యము చేస్తున్నారో ప్రసిద్ధి చేసారు. వాయుమండలాన్ని మార్చారు. అందుకు బాప్ దాదా అభినందనలు తెలియజేస్తున్నారు. ఎవరు ఎక్కడ ప్రోగ్రాములు చేసినా బాగా చేసారు, అంతేకాక అందరికీ కూడా అటెన్షన్ కలిగింది, బ్రహ్మాకుమారీలు నిజంగా గుప్త రూపములో తమ కార్యాలు చేస్తూ 75 సంవత్సరాల పూర్తి చేసుకున్నారు. ఇప్పుడిక, బ్రహ్మాకుమారీల భగవంతుడైన బాబా వచ్చేసారు అని అందరూ అనాలి. లక్ష్యము ఉంది కదా! మరి వచ్చే సీజన్ లోపు ఈ కార్యము ప్రారంభమైపోవాలి. దీని కోసం ప్రత్యక్ష ప్రోగ్రామును తయారుచేయండి. ప్రోగ్రామ్ ను తయారుచేస్తారు కదా, మీటింగ్ చేస్తారు కదా! ఇప్పుడు పిల్లలందరికీ వారసత్వాన్ని ఇచ్చే బాబా వచ్చేసారు అన్న విషయము తెలియాలి కదా, కావున మీటింగ్ లో ఈ ప్రోగ్రామును తయారుచేయండి. ఎవ్వరూ వంచితులుగా మిగిలిపోకూడదు. బాబాకైతే పిల్లల దుఃఖము చూసి చాలా దయ కలుగుతుంది. దుఃఖములో మొర పెట్టుకున్నప్పుడు, బాబాకు దయ కలుగుతుంది. దేవీ-దేవతలైన మిమ్మల్ని కూడా ఎంతగానో పిలుస్తూ ఉంటారు. మరి వచ్చే సీజన్ లో, ఒకటి, వ్యర్థము యొక్క నామ-రూపాలు ఉండకూడదు, సమ్మతమేనా? సమ్మతమేనా! మనసు యొక్క చేతిని ఎత్తండి. వ్యర్థము అంటే ఏమిటి, ఈ జ్ఞానమే మాయమైపోవాలి. ఎలా అయితే స్వర్గపు రాకుమార్తెలు వస్తారు కదా, వారికి దుఃఖము మరియు అశాంతి గురించి తెలియనే తెలియదు, వారు, అదేమిటి అని అడుగుతారు, అలాగే బ్రాహ్మణ పరివారములో వ్యర్థము అంటే ఏమిటో తెలియనే తెలియకూడదు. స్వ చింతన, స్వ చింతకులు. అచ్ఛా.

నలువైపులా ఉన్న పిల్లలందరికీ బాప్ దాదా యొక్క హృదయపూర్వక ప్రియస్మృతులు మరియు దానితోపాటు బాబా ప్రతి బిడ్డను తమ స్వమాన నషాలో స్థితులై ఉండటాన్ని చూసి హర్షిస్తారు. ఎప్పుడూ కూడా స్వమానాన్ని వదిలి పెట్టకండి. స్వమానధారి అంటే సదా సర్వ ప్రాప్తివంతులు. స్వమానాల లిస్టు చాలా పెద్దది. రోజూ ఒక్కొక్క స్వమానాన్ని స్మృతిలో పెట్టుకుని స్వరూపములోకి తీసుకువస్తూ తీవ్ర పురుషార్థులుగా అయ్యి ముందుకు వెళ్తూ ఉండండి. బాప్ దాదాను హృదయములో కూర్చోబెట్టుకుని, స్వయాన్ని బాప్ దాదా హృదయములో కూర్చోబెట్టుకుని, నిర్భయులుగా అయ్యి మాస్టర్ సర్వశక్తివంతులుగా అయి వెళ్తూ ఉండండి. ఎగురుతూ ఉండండి మరియు ఎగిరిస్తూ ఉండండి. ఓం శాంతి.

వరదానము:- సేవా స్టేజి పై ఇముడ్చుకునే శక్తి ద్వారా సఫలతా మూర్తులుగా అయ్యే మాస్టర్ సాగర్ భవ
ఎప్పుడైతే సేవా స్టేజి పైకి వస్తారో, అప్పుడు అనేక రకాల విషయాలు ఎదురుగా వస్తాయి, ఆ విషయాలను స్వయములో ఇముడ్చుకున్నట్లయితే సఫలతామూర్తులుగా అయిపోతారు. ఇముడ్చుకోవడము అనగా సంకల్పము రూపములో కూడా ఎవరి వ్యక్త విషయాలు లేక భావాలు అంశమాత్రము కూడా ఇమిడి ఉండకూడదు. అకళ్యాణకారీ మాటలను కళ్యాణ భావనలోకి ఎలా పరివర్తన చేయండంటే, అసలు అకళ్యాణకారి మాటలు లేనే లేవు అన్నట్లుగా ఉండాలి. అవగుణాన్ని గుణములోకి, నిందను స్తుతిలోకి పరివర్తన చేయండి, అప్పుడు మాస్టర్ సాగరులని అంటారు.
స్లోగన్:- విస్తారాన్ని చూడకుండా సారాన్ని చూసే మరియు దానిని స్వయములో ఇముడ్చుకునేవారే తీవ్ర పురుషార్థులు.

 

అవ్యక్త ప్రేరణలు - బ్రహ్మాబాబా సమానముగా సంపన్న మరియు సంపూర్ణ స్థితిని అనుభవము చేయండి

మీ రచన అయిన తాబేలు సెకండులో అన్ని అంగాలను లోపలకు ఇముడ్చేసుకుంటుంది. ఇముడ్చుకునే శక్తి రచనలో కూడా ఉంది. మాస్టర్ రచయితలైన మీరు ఇముడ్చుకునే శక్తి ఆధారముతో సెకండులో సర్వ సంకల్పాలను ఇముడ్చుకుని ఒక్క సంకల్పములో సెకండులో స్థితులైపోండి. ఎప్పుడైతే సర్వ కర్మేంద్రియాలతో చేసే కర్మల స్మృతి నుండి అతీతమై ఒకటే ఆత్మిక స్వరూపములో స్థితులవుతారో, అప్పుడు కర్మాతీత స్థితి అనగా సంపన్న స్థితి అనుభవమవుతుంది.

మురళి అంటే ఏమిటి?

మురళి బ్రహ్మకుమారీల దైనిక ఆధ్యాత్మిక బోధన, ఇది ప్రతి ఉదయం మధుబన్ నుండి ప్రచురించబడుతుంది. ఇక్కడ మీరు ఈరోజు మురళిని తెలుగులో చదవవచ్చు, ఆడియో వినవచ్చు మరియు PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధ్యయనానికి సహాయంగా పాఠ్యాన్ని హైలైట్ చేయవచ్చు — మీ గుర్తులు ఈ బ్రౌజర్‌లోనే సురక్షితంగా ఉంటాయి.

28 భాషల్లో మురళి

Daily Murli · Madhuban మూలం: మధుబన్ మురళి విభాగం ఇది స్వతంత్ర రీడర్ యాప్, అధికారిక వెబ్‌సైట్ కాదు.