తెలుగు మురళి · Brahma Kumaris

ఈరోజు మురళి · 31 మార్చి, 2025

ఓం శాంతి · BapDada · 31 మార్చి, 2025

ఈరోజు మురళి — today’s murli in Telugu, BK Telugu murli.

18
మురళి31 మార్చి, 2025 · తెలుగు
0:00--:--

పాఠ్యాన్ని ఎంచుకోండి → హైలైట్ / బాక్స్ / అండర్‌లైన్

31-03-2025
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
మధువనం

‘‘మధురమైన పిల్లలూ - మీరు ఇప్పుడు పాత ప్రపంచము యొక్క గేట్ నుండి బయటకు వచ్చి శాంతిధామము మరియు సుఖధామములోకి వెళ్తున్నారు, తండ్రియే ముక్తి-జీవన్ముక్తుల మార్గాన్ని తెలియజేస్తారు’’
ప్రశ్న:- వర్తమాన సమయములో అన్నింటికన్నా మంచి కర్మ ఏమిటి?
జవాబు:- అన్నింటికన్నా మంచి కర్మ ఏమిటంటే - మనసా, వాచ, కర్మణా అంధులకు చేతికర్రగా అవ్వడము. పిల్లలైన మీరు విచార సాగర మంథనము చేయాలి - ఎలాంటి పదాలను వ్రాసినట్లయితే మనుష్యులకు ఇంటికి (ముక్తికి) మరియు జీవన్ముక్తికి మార్గము లభిస్తుంది. ఇక్కడ శాంతి, సుఖము యొక్క ప్రపంచములోకి వెళ్ళే మార్గము తెలియజేయడం జరుగుతుంది అని మనుష్యులకు సహజముగా అర్థమవ్వాలి.

ఓం శాంతి. ఇంద్రజాలికుడి దీపము గురించి విన్నారా? అల్లావుద్దీన్ దీపము అని కూడా అంటూ ఉంటారు. అల్లావుద్దీన్ దీపము లేక ఇంద్రజాలికుడి దీపము ఏమేమి చూపిస్తుంది! వైకుంఠాన్ని, స్వర్గాన్ని, సుఖధామాన్ని చూపిస్తుంది. దీపాన్ని ప్రకాశము అని అంటారు. ఇప్పుడైతే అంధకారము ఉంది కదా. ఇప్పుడు ఈ ప్రకాశాన్ని చూపించడానికే పిల్లలు ప్రదర్శనీలు, మేళాలు చేస్తారు, ఎంతో ఖర్చు చేస్తారు, కష్టపడతారు. బాబా, దీనికి ఏ పేరు పెట్టాలి అని అడుగుతారు. ఇక్కడ బొంబాయిని గేట్ వే ఆఫ్ ఇండియా అని అంటారు. స్టీమర్లు ముందు బొంబాయికే వస్తాయి. ఢిల్లీలో కూడా ఇండియా గేట్ ఉంది. ఇప్పుడు మనదేమో - గేట్ ఆఫ్ ముక్తి-జీవన్ముక్తి. రెండు గేట్లు ఉన్నాయి కదా. ఎప్పుడూ గేట్లు అనేవి రెండు ఉంటాయి - ఇన్ మరియు అవుట్. ఒకదాని నుండి ప్రవేశిస్తారు, రెండవదాని నుండి బయటకు వెళ్తారు. ఇక్కడ కూడా అలాగే - మనము కొత్త ప్రపంచములోకి వస్తాము, మళ్ళీ పాత ప్రపంచము నుండి బయటకు వెళ్ళి మన ఇంటికి వెళ్ళిపోతాము. కానీ మనంతట మనమే తిరిగి వెళ్ళలేము ఎందుకంటే ఇంటిని మర్చిపోయాము, కావున ఒక గైడ్ (మార్గదర్శకుడు) కావాలి. వారు కూడా మనకు లభించారు, వారు మార్గాన్ని తెలియజేస్తారు. బాబా మనకు ముక్తి-జీవన్ముక్తి, శాంతి మరియు సుఖము యొక్క మార్గాన్ని తెలియజేస్తారని పిల్లలకు తెలుసు. కావున గేట్ ఆఫ్ శాంతిధామ్, సుఖధామ్ అని వ్రాయాలి. విచార సాగర మంథనము చేయవలసి ఉంటుంది కదా. ముక్తి-జీవన్ముక్తి అని దేనిని అంటారు అనేదానిపై ఎన్నో ఆలోచనలు నడుస్తాయి, ఇది కూడా ఎవరికీ తెలియదు. శాంతిని మరియు సుఖాన్ని అయితే అందరూ కోరుకుంటారు. శాంతి కూడా ఉండాలి మరియు ధన-సంపదలు కూడా ఉండాలి. అవి సత్యయుగములోనే ఉంటాయి. కావున గేట్ ఆఫ్ శాంతిధామ్, సుఖధామ్ అని వ్రాయండి లేక గేట్ ఆఫ్ ప్యూరిటీ, పీస్ అండ్ ప్రాస్పరిటీ (పవిత్రత, శాంతి, సంపదల గేట్) అని వ్రాయండి. ఇవి మంచి పదాలు. ఆ మూడూ ఇక్కడ లేవు. కావున వాటి గురించి మళ్ళీ అర్థము చేయించవలసి ఉంటుంది. కొత్త ప్రపంచములో ఇవన్నీ ఉండేవి. కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేవారు పతిత-పావనుడు, గాడ్ ఫాదర్. తప్పకుండా మనము ఈ పాత ప్రపంచము నుండి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళాలి. కావున ఇది - ప్యూరిటీ, పీస్ అండ్ ప్రాస్పరిటీ (పవిత్రత, శాంతి, సంపదల) గేట్ కదా. బాబాకు ఈ పేరు బాగా అనిపిస్తుంది. ఇప్పుడు వాస్తవానికి దాని ప్రారంభోత్సవాన్ని అయితే శివబాబా చేస్తారు. కానీ బ్రాహ్మణులైన మన ద్వారా చేయిస్తారు. ప్రపంచములో ప్రారంభోత్సవ వేడుకలైతే ఎన్నో జరుగుతూ ఉంటాయి కదా. కొందరు హాస్పిటల్ కు ప్రారంభోత్సవము చేస్తారు, కొందరు యూనివర్శిటీకి చేస్తారు. ఈ ప్రారంభోత్సవమైతే ఒక్కసారి మాత్రమే జరుగుతుంది మరియు ఈ సమయములోనే జరుగుతుంది, అందుకే దీని గురించి ఆలోచించడము జరుగుతుంది. బ్రహ్మాబాబా వచ్చి ప్రారంభోత్సవము చేయాలి అని పిల్లలు వ్రాశారు. బాప్ దాదా ఇరువురినీ పిలిచారు. బాబా అంటారు - నీవు బయటకు ఎక్కడికీ వెళ్ళకూడదు, ప్రారంభోత్సవానికి వెళ్ళమని వివేకము చెప్పదు, నియమము లేదు. దానిని ఎవరైనా ప్రారంభోత్సవము చేయవచ్చు. ప్రజాపిత బ్రహ్మాకుమార-కుమారీలు అని వార్తాపత్రికలలో కూడా వస్తుంది. ఈ పేరు కూడా చాలా బాగుంది కదా. ప్రజాపిత అయితే అందరికీ తండ్రి. వారేమైనా తక్కువా! ఇక్కడ తండ్రి స్వయంగా ప్రారంభోత్సవము చేయిస్తారు. వారు కరన్ కరావన్ వార్ (చేసేవారు, చేయించేవారు) కదా. మేము స్వర్గ స్థాపనను చేస్తున్నాము అని బుద్ధిలో ఉండాలి కదా. మరి ఎంతగా పురుషార్థము చేసి శ్రీమతముపై నడవాలి. వర్తమాన సమయములో మనసా-వాచ-కర్మణా, అన్నింటికన్నా మంచి కర్మ ఒక్కటే - అంధులకు చేతికర్రగా అవ్వడము. ఓ ప్రభూ, నీవు అంధులకు చేతికర్ర వంటి వాడివి అని గానము కూడా చేస్తారు. అందరూ అంధులుగానే ఉన్నారు. కావున తండ్రి వచ్చి చేతికర్రగా అవుతారు. జ్ఞానము యొక్క మూడవ నేత్రాన్ని ఇస్తారు, తద్వారా మీరు స్వర్గములోకి నంబరువారు పురుషార్థానుసారముగా వెళ్తారు. నంబరువారుగానే ఉన్నారు. ఇది చాలా పెద్ద అనంతమైన హాస్పిటల్ మరియు యూనివర్శిటీ. ఆత్మలకు తండ్రి అయిన పరమపిత పరమాత్మ పతిత-పావనుడు, మీరు ఆ తండ్రిని స్మృతి చేసినట్లయితే సుఖధామములోకి వెళ్ళిపోతారు అని అర్థం చేయించడం జరుగుతుంది. ఇది నరకము, దీనిని స్వర్గము అని అనరు. స్వర్గములో ఉన్నది ఒకే ధర్మము. భారత్ స్వర్గముగా ఉండేది, అప్పుడు ఇతర ధర్మాలేవీ లేవు. కేవలం ఇది గుర్తు చేసుకున్నా, అదీ మన్మనాభవయే. మనము స్వర్గములో ఉన్నప్పుడు మొత్తము విశ్వానికి యజమానులుగా ఉండేవారము - ఈ మాత్రము కూడా గుర్తుకురాదా! మనకు తండ్రి లభించారు అన్నది బుద్ధిలో ఉంది కావున ఆ సంతోషము ఉండాలి. కానీ మాయ కూడా తక్కువైనదేమీ కాదు. అటువంటి తండ్రికి చెందినవారిగా అయిన తర్వాత కూడా అంతటి సంతోషములో ఉండరు. గుటకలు మింగుతూ ఉంటారు. మాయ ఘడియ-ఘడియ ఎన్నో గుటకలు మింగిస్తుంది. శివబాబా స్మృతిని మరపింపజేస్తుంది. స్మృతి నిలవడము లేదని స్వయం కూడా ఉంటారు. తండ్రి జ్ఞానసాగరములో మునిగేలా చేస్తారు, మాయ మళ్ళీ విషయసాగరములో మునిగేలా చేస్తుంది. ఎంతో సంతోషముగా మునుగుతూ ఉంటారు. శివబాబాను స్మృతి చేయండి అని తండ్రి అంటారు, కానీ మాయ మరపింపజేస్తుంది. తండ్రిని అసలు స్మృతియే చేయరు. తండ్రి గురించి తెలియనే తెలియదు. దుఃఖహర్త, సుఖకర్త అయితే పరమపిత పరమాత్మ కదా. వారు దుఃఖాన్ని హరించేవారు. వాళ్ళు వెళ్ళి గంగలో మునకలు వేస్తారు. గంగను పతిత-పావనిగా భావిస్తారు. సత్యయుగములో గంగను దుఃఖహరిణి, పాపనాశినీ అని అనరు. సాధు-సన్యాసులు మొదలైనవారందరూ వెళ్ళి నదీ తీరాలలో కూర్చుంటారు. సాగర తీరములో ఎందుకు కూర్చోరు? ఇప్పుడు పిల్లలైన మీరు సాగర తీరములో కూర్చున్నారు. లెక్కలేనంతమంది పిల్లలు సాగరుని వద్దకు వస్తారు. ఆ సాగరుని నుండి ఈ చిన్న-పెద్ద నదులు వెలువడ్డాయి అని అర్థం చేసుకుంటారు. వాటికి బ్రహ్మపుత్ర, సింధ్, సరస్వతి ఈ పేర్లు కూడా పెట్టడము జరిగింది.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, మీరు మనసా-వాచా-కర్మణా చాలా-చాలా అటెన్షన్ ఉంచాలి, ఎప్పుడూ కూడా మీకు క్రోధము రాకూడదు. క్రోధము ముందుగా మనసులో వస్తుంది, ఆ తర్వాత వాచాలోకి మరియు కర్మలలోకి కూడా వచ్చేస్తుంది. ఇవి మూడు కిటికీలు. అందుకే తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురమైన పిల్లలూ, వాచను అధికముగా ఉపయోగించకండి, శాంతిగా ఉండండి, వాచాలోకి వచ్చినట్లయితే కర్మలలోకి కూడా వచ్చేస్తుంది. కోపము ముందు మనసులో వస్తుంది, ఆ తర్వాత వాచాలోకి, కర్మలలోకి వస్తుంది. ఈ మూడు కిటికీల నుండి బయటకు వస్తుంది. మొదట మనసులో వస్తుంది. ప్రపంచములోని వారైతే ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూ ఉంటారు, గొడవపడుతూ-కొట్లాడుకుంటూ ఉంటారు. మీరైతే ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. ఆ ఆలోచన కూడా రాకూడదు. సైలెన్స్ లో ఉండటము చాలా మంచిది. తండ్రి వచ్చి స్వర్గము మరియు సుఖ-శాంతుల గేట్ గురించి తెలియజేస్తారు. పిల్లలకే తెలియజేస్తారు. మీరు కూడా ఇతరులకు తెలియజేయండి అని పిల్లలతో అంటారు. పవిత్రత, శాంతి, సంపద స్వర్గములో ఉంటాయి. అక్కడికి ఎలా వెళ్తారు, ఇది అర్థం చేసుకోవాలి. ఈ మహాభారత యుద్ధము కూడా గేట్ తెరుస్తుంది. ఏమి పేరు పెట్టాలి అని బాబాకు విచార సాగర మంథనమైతే నడుస్తుంది కదా. ఉదయమే లేచి విచార సాగర మంథనము చేయడముతో వెన్న వస్తుంది. మంచి ఐడియాలు వస్తాయి. అందుకే బాబా అంటారు, ఉదయమే లేచి తండ్రిని స్మృతి చేయండి మరియు ఏ పేరు పెట్టాలి అనేదానిపై విచార సాగర మంథనము చేయండి. ఆలోచిస్తూ ఉండాలి, కొందరికి మంచి ఆలోచనలు కూడా వస్తాయి. పతితులను పావనముగా తయారుచేయడము అంటే నరకవాసుల నుండి స్వర్గవాసులుగా తయారుచేయడము అని ఇప్పుడు మీరు అర్థము చేసుకున్నారు. దేవతలు పావనమైనవారు, అందుకే వారి ఎదురుగా వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు. మీరు ఇప్పుడు ఎవరికీ తల వంచి నమస్కరించడానికి వీల్లేదు, అటువంటి నియమము లేదు కానీ యుక్తిగా నడుచుకోవలసి ఉంటుంది. సాధువులు తమను తాము ఉన్నతమైనవారిగా, పవిత్రమైనవారిగా భావిస్తారు, ఇతరులను అపవిత్రులుగా, నీచులుగా భావిస్తారు. మనము అందరికన్నా ఉన్నతమైనవారము అని మీకు తెలుసు కానీ ఎవరైనా చేతులు జోడిస్తే రెస్పాన్స్ ఇవ్వాలి. హరి ఓం తత్సత్ అని అంటే, మీరు కూడా అనవలసి ఉంటుంది. యుక్తిగా నడుచుకోకపోతే వారు చేతికి రారు. చాలా యుక్తులు కావాలి. ఎప్పుడైతే మృత్యువు తల మీదకు వస్తుందో, అప్పుడు అందరూ భగవంతుని పేరు తలచుకుంటారు. ఈ రోజుల్లో దుర్ఘటనలైతే ఎన్నో జరుగుతూ ఉంటాయి. మెల్లమెల్లగా మంటలు వ్యాపిస్తాయి. విదేశాల నుండి మంటలు అంటుకోవడం మొదలవుతుంది, ఇక మెల్లమెల్లగా మొత్తము ప్రపంచమంతా తగలబడిపోతుంది. అంతిమములో పిల్లలైన మీరు మాత్రమే మిగులుతారు. మీ ఆత్మ పవిత్రముగా అవుతుంది కావున మీకు మళ్ళీ అక్కడ కొత్త ప్రపంచము లభిస్తుంది. సత్యయుగము ప్రారంభమైనప్పుడు ఆ ప్రపంచము యొక్క కొత్త నోటు (కరెన్సీ) పిల్లలైన మీకు లభిస్తుంది. మీరు రాజ్యము చేస్తారు. అల్లావుద్దీన్ దీపము కూడా ప్రసిద్ధమైనది కదా! దానిని అలా రుద్దడముతో అపారమైన ఖజానా లభిస్తుంది. అది వాస్తవమే. ఎందుకంటే ఇక్కడ అల్లా-అవల్దీన్ కేవలము ఒక సైగతో వెంటనే సాక్షాత్కారము చేయిస్తారని మీకు తెలుసు. కేవలము మీరు శివబాబాను స్మృతి చేసినట్లయితే అన్ని సాక్షాత్కారాలు కలుగుతాయి. నవ విధ భక్తి ద్వారా కూడా సాక్షాత్కారాలు కలుగుతాయి కదా. ఇక్కడ మీకు లక్ష్యము-ఉద్దేశ్యము యొక్క సాక్షాత్కారమైతే కలుగుతుంది, అప్పుడు మీరు బాబాను మరియు స్వర్గాన్ని ఎంతగానో స్మృతి చేస్తారు. ఘడియ-ఘడియ చూస్తూ ఉంటారు. ఎవరైతే బాబా స్మృతిలో మరియు జ్ఞానములో ఆనందముగా నిమగ్నమై ఉంటారో, వారే అంతిమములోని అన్ని దృశ్యాలను చూడగలుగుతారు. ఇది చాలా ఉన్నతమైన గమ్యము. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడము అంత సులభము కాదు. చాలా శ్రమ ఉంది. స్మృతియే ముఖ్యమైనది. ఏ విధంగా బాబా దివ్యదృష్టి దాతనో, అలా స్వయం కూడా స్వయం కొరకు దివ్యదృష్టి దాతలుగా అవుతారు. ఏ విధంగా భక్తి మార్గములో తీవ్ర వేగముతో స్మృతి చేస్తే సాక్షాత్కారాలు కలుగుతాయి, వారు స్వయము యొక్క కృషితో దివ్యదృష్టి దాతలుగా అయినట్లు. మీరు కూడా స్మృతి చేసే శ్రమ చేసినట్లయితే చాలా సంతోషముగా ఉంటారు మరియు సాక్షాత్కారాలు కలుగుతూ ఉంటాయి, ఈ ప్రపంచమంతటినీ మర్చిపోతారు, మన్మనాభవగా అయిపోతారు, ఇంకేమి కావాలి! ఇక యోగబలముతో మీరు మీ శరీరాన్ని వదిలేస్తారు. భక్తిలో కూడా శ్రమ ఉంటుంది, ఇందులో కూడా శ్రమించాలి. శ్రమ చేసేందుకు బాబా చాలా ఫస్ట్ క్లాస్ మార్గాన్ని తెలియజేస్తూ ఉంటారు. స్వయాన్ని ఆత్మగా భావించడము వలన ఇక దేహము యొక్క భానమే ఉండదు. తండ్రి సమానముగా అయిపోతారు. సాక్షాత్కారాలు పొందుతూ ఉంటారు. సంతోషము కూడా ఎంతగానో ఉంటుంది. రిజల్టు అంతా అంతిమములోనిదే గాయనము చేయబడింది. స్వయము యొక్క నామ-రూపాల నుండి కూడా అతీతముగా అవ్వాలి అన్నప్పుడు మరి ఇతరుల నామ-రూపాలను తలచుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది! జ్ఞానమైతే చాలా సహజమైనది. ప్రాచీన భారత్ యొక్క యోగము ఏదైతే ఉందో, అందులో ఇంద్రజాలము ఉంది. బ్రహ్మజ్ఞానులు కూడా అలాగే శరీరాన్ని వదిలేస్తారు అని బాబా అర్థం చేయించారు. నేను ఆత్మ, పరమాత్మలో లీనమవ్వాలి అని అంటారు. అలా ఎవరూ లీనమవ్వరు. వారు బ్రహ్మజ్ఞానులు. బాబా చూసారు, వారు కూర్చుని, కూర్చుని ఉండగానే శరీరాలు వదిలేస్తారు. వాయుమండలము చాలా శాంతిగా ఉంటుంది, నిశ్శబ్దత ఏర్పడుతుంది. నిశ్శబ్దత కూడా ఎవరైతే జ్ఞాన మార్గములో ఉంటారో, శాంతిలో ఉంటారో, వారికే అనుభవమవుతుంది. కానీ కొంతమంది పిల్లలైతే ఇప్పుడు ఇంకా బేబీల వలె (పసి పిల్లల వలె) ఉన్నారు. ఘడియ-ఘడియ కింద పడిపోతారు, ఇందులో చాలా-చాలా గుప్తమైన శ్రమ ఉంది. భక్తి మార్గములో చేసే శ్రమ కనిపిస్తుంది. మాలను తిప్పుతారు, ఒక గదిలో కూర్చుని భక్తి చేస్తారు. ఇక్కడైతే నడుస్తూ-తిరుగుతూ మీరు స్మృతిలో ఉంటారు. వీరు రాజ్యాన్ని తీసుకుంటున్నారు అన్నది ఎవరికీ తెలియదు. యోగముతోనే లెక్కాచారాలన్నింటినీ సమాప్తము చేసుకోవాలి. జ్ఞానముతో అవి సమాప్తము కావు. లెక్కాచారాలు స్మృతి ద్వారానే సమాప్తమవుతాయి. కర్మభోగము స్మృతితోనే సమాప్తమవుతుంది. ఇది గుప్తము. బాబా అన్నీ గుప్తముగా నేర్పిస్తారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మనసా, వాచా, కర్మణా ఎప్పుడూ క్రోధము చేయకూడదు. ఈ మూడు కిటికీల పట్ల చాలా అటెన్షన్ పెట్టాలి. ఎక్కువగా మాట్లాడకూడదు. ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకోకూడదు.

2. జ్ఞానము మరియు యోగములో ఆనందముగా నిమగ్నమై ఉంటూ అంతిమములోని దృశ్యాలను చూడాలి. తమ మరియు ఇతరుల నామ-రూపాలను మరచి, నేను ఆత్మను అనే స్మృతితో దేహ భానాన్ని సమాప్తము చేయాలి.

వరదానము:- స్నేహ బాణాల ద్వారా స్నేహముతో మైమరపింపజేసే స్నేహము మరియు ప్రాప్తి సంపన్నమైన లవలీన ఆత్మా భవ
ఏ విధంగా లౌకిక రీతిలో ఎవరైనా ఎవరి స్నేహములోనైనా లవలీనమైనట్లయితే వారి ముఖము ద్వారా, నయనాల ద్వారా, వాణి ద్వారా - వీరు లవలీనమై ఉన్నారు, ప్రేయసిగా ఉన్నారు అని అనుభవమవుతుంది. అదే విధంగా ఎప్పుడైతే స్టేజ్ పైకి వెళ్తారో అప్పుడు ఎంతగా మీ లోపల తండ్రి స్నేహము ఇమర్జ్ అయి ఉంటుందో అంతగానే స్నేహ బాణాలు ఇతరులను కూడా స్నేహములో మైమరపింపజేస్తాయి. భాషణలో తర్వాత పాయింటు యొక్క లింకు గురించి ఆలోచించడము, పాయింట్లను రిపీట్ చేయడము - ఈ స్వరూపము ఉండకూడదు. స్నేహము మరియు ప్రాప్తి యొక్క సంపన్న స్వరూపము, లవలీన స్వరూపము ఉండాలి. అథారిటీగా అయి మాట్లాడటము ద్వారా దాని ప్రభావము పడుతుంది.
స్లోగన్:- సంపూర్ణత ద్వారా సమాప్తి సమయాన్ని సమీపముగా తీసుకురండి.

 

అవ్యక్త ప్రేరణలు - సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ ను (సంస్కృతిని) అలవరచుకోండి

‘వీరు కూడా ఉన్నారు’ అనైతే అందరూ అర్థము చేసుకోవడం మొదలుపెట్టారు, కానీ ‘అది వీరే మరియు వీరు ఒక్కరే’. ఈ అలజడిని ఇప్పుడు నాగలితో దున్నండి. ఇప్పుడు ఇతరులు కూడా ఉన్నారు, వీరు కూడా ఉన్నారు అన్నంతవరకు చేరుకున్నారు, కానీ ‘వీరు ఒక్కరే’ అన్న ఈ బాణాన్ని ఇప్పుడు వేయండి. ధరణి అయితే తయారైంది మరియు తయారవుతూ ఉంటుంది. కానీ పునాది, నవీనత, బీజము అనేది కొత్త జ్ఞానము. నిస్వార్థ ప్రేమ ఉంది, ఆత్మిక ప్రేమ ఉంది అన్నదానినైతే అనుభవము చేస్తారు, కానీ ఇప్పుడు ప్రేమతోపాటుగా మీరు జ్ఞానము యొక్క అథారిటీ కల ఆత్మలు. సత్య జ్ఞానము యొక్క అథారిటీ ఉంది అన్నదానిని ప్రత్యక్షము చెయ్యండి, అప్పుడు ప్రత్యక్షత అవుతుంది.

మురళి అంటే ఏమిటి?

మురళి బ్రహ్మకుమారీల దైనిక ఆధ్యాత్మిక బోధన, ఇది ప్రతి ఉదయం మధుబన్ నుండి ప్రచురించబడుతుంది. ఇక్కడ మీరు ఈరోజు మురళిని తెలుగులో చదవవచ్చు, ఆడియో వినవచ్చు మరియు PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధ్యయనానికి సహాయంగా పాఠ్యాన్ని హైలైట్ చేయవచ్చు — మీ గుర్తులు ఈ బ్రౌజర్‌లోనే సురక్షితంగా ఉంటాయి.

Also searched astodays murli in telugu · today murli in telugu · today murli telugu · bk telugu murli · telugu pdf murli · daily murli telugu · telugu murli today · telugu murli · today's telugu murali · brahma kumaris daily murli in telugu · brahma kumaris telugu murli today · baba murli telugu today · om shanti telugu murli today · bk murli today telugu · ఈరోజు తెలుగు మురళి · murali in telugu

28 భాషల్లో మురళి

Daily Murli · Madhuban మూలం: మధుబన్ మురళి విభాగం ఇది స్వతంత్ర రీడర్ యాప్, అధికారిక వెబ్‌సైట్ కాదు.