| 29-04-2025 |
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
|
మధువనం |
| ‘‘మధురమైన పిల్లలూ - ఇది మీ అత్యంత అమూల్యమైన జన్మ, ఈ జన్మలోనే మీరు మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు పావనముగా అయ్యే పురుషార్థము చేయాలి’’ | |
| ప్రశ్న:- | ఈశ్వరీయ సంతానముగా పిలవబడే పిల్లల యొక్క ముఖ్యమైన ధారణ ఏమిటి? |
| జవాబు:- | వారు పరస్పరములో చాలా-చాలా క్షీరఖండము (పాలు-చక్కెర) వలె ఉంటారు. ఎప్పుడూ ఉప్పునీరులా అవ్వరు. దేహాభిమానులైన మనుష్యులు ఎవరైతే ఉంటారో వారు తప్పుడు మాటలు మాట్లాడుతారు, కొట్లాడుతూ-గొడవపడుతూ ఉంటారు. పిల్లలైన మీలో ఆ అలవాటు ఉండకూడదు. ఇక్కడ మీరు దైవీ గుణాలను ధారణ చేయాలి, కర్మాతీత అవస్థను పొందాలి. |
ఓం శాంతి. మొట్టమొదట తండ్రి పిల్లలకు చెప్తున్నారు - దేహీ-అభిమానీ భవ. స్వయాన్ని ఆత్మగా భావించండి. గీత మొదలైనవాటిలో ఏమున్నా, అవన్నీ భక్తి మార్గపు శాస్త్రాలు. తండ్రి అంటారు - నేను జ్ఞానసాగరుడిని. పిల్లలైన మీకు జ్ఞానాన్ని వినిపిస్తాను. ఏ జ్ఞానాన్ని వినిపిస్తారు? సృష్టి అనగా డ్రామా యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు. ఇది చదువు. చరిత్ర మరియు భౌగోళాలు ఉన్నాయి కదా. భక్తి మార్గములో ఎవరూ చరిత్ర-భౌగోళాలను చదవరు. వాటి పేరును కూడా తీసుకోరు. సాధు-సన్యాసులు మొదలైనవారు కూర్చొని శాస్త్రాలను చదువుతారు. ఈ తండ్రి అయితే శాస్త్రాలేమీ చదివి వినిపించరు. మిమ్మల్ని ఈ చదువు ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తారు. మీరు వచ్చిందే మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు. వారు కూడా మనుష్యులే, వీరు కూడా మనుష్యులే. కానీ వీరు - ఓ పతిత-పావనా రండి అని తండ్రిని పిలుస్తారు. దేవతలు పావనమైనవారు అనైతే తెలుసు. మిగిలినవారందరూ అపవిత్రమైన మనుష్యులు, వారు దేవతలకు నమస్కరిస్తారు. వారిని పావనులుగా, స్వయాన్ని పతితులుగా భావిస్తారు. కానీ దేవతలు పావనముగా ఎలా అయ్యారు, ఎవరు తయారుచేసారు - ఇది మనుష్యమాత్రులెవ్వరికీ తెలియదు. కావున తండ్రి అర్థం చేయిస్తారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడములోనే శ్రమ ఉంది. దేహాభిమానము ఉండకూడదు. ఆత్మ అవినాశీ, సంస్కారాలు కూడా ఆత్మలోనే ఉంటాయి. ఆత్మయే మంచి లేక చెడు సంస్కారాలను తీసుకువెళ్తుంది అందుకే ఇప్పుడు తండ్రి అంటారు - దేహీ-అభిమానులుగా అవ్వండి. తమ ఆత్మ గురించి కూడా ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే రావణ రాజ్యము ప్రారంభమవుతుందో, అప్పుడు అంధకార మార్గము ప్రారంభమవుతుంది. దేహాభిమానులుగా అవుతారు.
తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు - పిల్లలైన మీరు ఇక్కడికి ఎవరి వద్దకు వచ్చారు? వీరి వద్దకు రాలేదు. నేను వీరిలోకి ప్రవేశించాను. ఇది వీరి అనేక జన్మల అంతిమ పతిత జన్మ. అనేక జన్మలు ఏమిటి? అర్ధకల్పము పవిత్ర జన్మలు, అర్ధకల్పము పతిత జన్మలు అని కూడా తెలియజేసారు. కావున వీరు కూడా పతితమైపోయారు. బ్రహ్మా స్వయాన్ని దేవతగా లేక ఈశ్వరునిగా పిలుచుకోరు. మనుష్యులు ప్రజాపిత బ్రహ్మాను దేవతగా భావిస్తారు, అందుకే బ్రహ్మా దేవతాయ నమః అని అంటారు. తండ్రి అర్థం చేయిస్తారు - బ్రహ్మా పతితముగా ఉండేవారు, వారు అనేక జన్మల అంతిమములో మళ్ళీ పావనముగా అయి దేవతగా అవుతారు. మీరు బి.కె.లు. మీరు కూడా బ్రాహ్మణులు, ఈ బ్రహ్మా కూడా బ్రాహ్మణుడే. వీరిని దేవత అని ఎవరంటారు? బ్రహ్మాను బ్రాహ్మణుడు అని అంటారు, దేవత అని అనరు. బ్రహ్మా పవిత్రముగా అయినా వారిని దేవత అని అనరు. ఎప్పటివరకైతే విష్ణువుగా (లక్ష్మీ-నారాయణులుగా) అవ్వరో, అప్పటివరకు దేవత అని అనరు. మీరు బ్రాహ్మణ-బ్రాహ్మణీలు. మిమ్మల్ని మొట్టమొదట శూద్రుల నుండి బ్రాహ్మణులుగా, బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారుచేస్తాను. ఇది మీ అమూల్యమైన, వజ్ర సమానమైన జన్మ అని అంటారు. కర్మభోగమైతే అనుభవించవలసి ఉంటుంది. కావున ఇప్పుడు తండ్రి అంటారు - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేస్తూ ఉండండి. ఈ అభ్యాసము ఉంటేనే వికర్మలు వినాశనమవుతాయి. దేహధారులుగా భావించినట్లయితే వికర్మలు వినాశనమవ్వవు. ఆత్మ బ్రాహ్మణ్ కాదు, శరీరముతోపాటు ఉన్నప్పుడు బ్రాహ్మణునిగా ఆ తర్వాత దేవతగా... శూద్రునిగా మొదలైనవారిగా అవుతుంది. కావున ఇప్పుడు తండ్రిని స్మృతి చేయడంలో శ్రమ ఉంది. ఇది సహజ యోగము కూడా. తండ్రి అంటారు - ఇది అతి సహజమైనది కూడా. కొందరికి ఇది చాలా కష్టముగా కూడా అనిపిస్తుంది. ఘడియ-ఘడియ దేహాభిమానములోకి వచ్చి తండ్రిని మర్చిపోతారు. దేహీ-అభిమానులుగా అవ్వడానికి సమయమైతే పడుతుంది కదా. ఇప్పుడు మీరు ఏకరసంగా అవుతారు, తండ్రి స్మృతి స్థిరముగా నిలిచిపోతుంది అనైతే కాదు. అలా కాదు. కర్మాతీత అవస్థను పొందినట్లయితే ఇక శరీరము కూడా ఉండదు. పవిత్ర ఆత్మ తేలికగా అయి ఒక్కసారిగా శరీరాన్ని వదిలేస్తుంది. పవిత్ర ఆత్మతోపాటు అపవిత్ర శరీరము ఉండదు. అలాగని ఈ దాదా తీరానికి చేరుకున్నారు అని కాదు. వీరు కూడా అంటారు - స్మృతి చాలా శ్రమతో కూడుకున్నది. దేహాభిమానములోకి రావడం వలన తప్పుడు మాటలు మాట్లాడడము, కొట్లాడుకోవడము-గొడవపడడము మొదలైనవి జరుగుతాయి. ఆత్మలమైన మనందరమూ పరస్పరం సోదరులము, అలా అనుకుంటే ఆత్మకు ఏమీ అవ్వదు. దేహాభిమానము కారణంగానే గందరగోళము జరిగింది. ఇప్పుడు పిల్లలైన మీరు దేహీ-అభిమానులుగా అవ్వాలి. ఏ విధంగా దేవతలు క్షీరఖండము (పాలు, పంచదార) వలె ఉన్నారో, అలాగే మీరు కూడా పరస్పరంలో క్షీరఖండము వలె ఉండాలి. మీరెప్పుడూ ఉప్పునీరులా అవ్వకూడదు. దేహాభిమానులైన మనుష్యులు ఎవరైతే ఉన్నారో, వారు తప్పుడు మాటలు మాట్లాడుతూ, కొట్లాడుతూ-గొడవపడుతూ ఉంటారు. పిల్లలైన మీలో ఆ అలవాటు ఉండకూడదు. ఇక్కడైతే మీరు దేవతలుగా అయ్యేందుకు దైవీ గుణాలను ధారణ చేయాలి. కర్మాతీత అవస్థను పొందాలి. మీకు తెలుసు, ఈ శరీరము, ఈ ప్రపంచము పాతది, తమోప్రధానమైనది. పాత వస్తువులపై, పాత సంబంధాలపై అయిష్టము కలిగి ఉండాలి. దేహాభిమానపు విషయాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే పాపాలు వినాశనమవుతాయి. చాలా మంది పిల్లలు స్మృతిలో ఫెయిల్ అవుతారు. జ్ఞానాన్ని అర్థం చేయించడములో చాలా చురుకుగా ముందుకు వెళ్తారు, కానీ స్మృతి యొక్క శ్రమ చాలా కష్టతరమైనది. ఇది పెద్ద పరీక్ష. అర్ధకల్పపు పాత భక్తులే దీనిని అర్థం చేసుకోగలరు. భక్తిలో ఎవరైతే చివర్లో వచ్చారో వారు అంతగా అర్థం చేసుకోలేరు.
తండ్రి ఈ శరీరములోకి వచ్చి చెప్తారు - నేను ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వస్తాను. నాకు డ్రామాలో పాత్ర ఉంది మరియు నేను ఒక్కసారి మాత్రమే వస్తాను. ఇది ఆ సంగమయుగమే. యుద్ధము కూడా ఎదురుగా నిలబడి ఉంది. ఇది 5 వేల సంవత్సరాల డ్రామా. కలియుగము యొక్క ఆయుష్షు ఇప్పుడింకా 40 వేల సంవత్సరాలు ఉంటే, ఏమి జరుగుతుందో తెలియదు. వారు అంటారు - భగవంతుడే వచ్చినా కానీ మేము శాస్త్రాల మార్గాన్ని విడిచిపెట్టము అని. 40 వేల సంవత్సరాల తర్వాత ఏ భగవంతుడు వస్తారు అనేది కూడా వారికి తెలియదు. కొందరు కృష్ణ భగవానుడు వస్తారని భావిస్తారు. ఇంకాస్త ముందుకు వెళ్ళే కొద్దీ మీ పేరు ప్రసిద్ధి అవుతుంది. కానీ ఆ అవస్థకు చేరుకోవాలి. పరస్పరంలో చాలా ప్రేమ కలిగి ఉండాలి. మీరు ఈశ్వరీయ సంతానము కదా. మీరు ఈశ్వరీయ సేవాధారులుగా గాయనము చేయబడ్డారు. మీరు అంటారు - పతిత భారత్ ను పావనముగా తయారుచేయడములో మేము బాబాకు సహాయకులము. బాబా, కల్పకల్పము మేము ఆత్మాభిమానులుగా అయి మీ శ్రీమతముపై యోగబలము ద్వారా మా వికర్మలను వినాశనము చేసుకుంటాము. యోగబలము అనగా సైలెన్స్ బలము. సైలెన్స్ బలానికి మరియు సైన్స్ బలానికి రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. మున్ముందు మీకు ఎన్నో సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. ప్రారంభములో ఎంతమంది పిల్లలు సాక్షాత్కారాలను పొందారు, ఆ పాత్రను అభినయించారు. ఈ రోజు వారు లేనే లేరు. మాయ తినేసింది. యోగములో లేకపోతే మాయ తినేస్తుంది. భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు అని పిల్లలకు తెలిసినప్పుడు నియమానుసారంగా చదువుకోవాలి. లేకపోతే చాలా-చాలా తక్కువ పదవిని పొందుతారు. శిక్షలను కూడా ఎన్నో అనుభవిస్తారు. జన్మ-జన్మాంతరాల పాపులము అని కూడా అంటూ ఉంటారు కదా. అక్కడైతే (సత్యయుగములో) రావణ రాజ్యమే లేనప్పుడు వికారాల పేరు ఎలా ఉండగలదు. అది ఉన్నదే సంపూర్ణ నిర్వికారీ రాజ్యము. అది రామ రాజ్యము, ఇది రావణ రాజ్యము. ఈ సమయములో అందరూ తమోప్రధానముగా ఉన్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ తమ స్థితిని చెక్ చేసుకోవాలి - నేను తండ్రి స్మృతిలో ఎంత సమయము ఉండగలుగుతున్నాను? దైవీ గుణాలను ఎంతవరకు ధారణ చేసాను? ముఖ్యమైన విషయము, స్వయములో చూసుకోవాలి - నాలో ఏ అవగుణమైతే లేదు కదా? నా ఆహార-పానీయాలు ఎలా ఉన్నాయి? రోజంతటిలో ఎటువంటి వ్యర్థమైన విషయాలను మాట్లాడడము లేదా అబద్ధాలు చెప్పడం లాంటివి చేయడం లేదు కదా? శరీర నిర్వహణార్థము కూడా అబద్ధాలు మొదలైనవి చెప్పవలసి వస్తుంది కదా. మనుష్యులు ధర్మము చేయడం కొరకు ఆదాయము నుండి తీసినట్లయితే పాపాలు తేలికవుతాయి. మంచి కర్మలు చేసినట్లయితే దానికి కూడా ప్రతిఫలము లభిస్తుంది. ఎవరైనా హాస్పిటల్ ను నిర్మించినట్లయితే మరుసటి జన్మలో మంచి ఆరోగ్యము లభిస్తుంది. కాలేజీ నిర్మించినట్లయితే బాగా చదువుకుంటారు. కానీ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తము ఏమిటి? దాని కొరకు మళ్ళీ గంగా స్నానాలు చేయడానికి వెళ్తారు. ఇకపోతే ధనము ఏదైతే దానము చేస్తారో, అది మరుసటి జన్మలో లభిస్తుంది. అందులో పాపాలు కట్ అయ్యే విషయమేమీ లేదు. అది ధనము ఇచ్చి-పుచ్చుకోవడము వంటిది, ఈశ్వరార్థము ఇచ్చారు, ఈశ్వరుడు అల్పకాలికంగా తిరిగి ఇస్తారు. ఇక్కడైతే మీరు పావనముగా అవ్వాలి, తండ్రి స్మృతి తప్ప వేరే ఏ ఉపాయమూ లేదు. పావనులు పతిత ప్రపంచములో ఉండరు. వారు ఈశ్వరార్థము ఇన్ డైరెక్ట్ గా ఇస్తారు. ఇప్పుడు ఈశ్వరుడు అంటారు - నేను పావనముగా చేయడానికి సమ్ముఖములోకి వచ్చాను. నేను దాతను, నాకు మీరు ఇచ్చినట్లయితే నేను రిటర్న్ లో ఇస్తాను. నేనేమైనా నా వద్ద ఉంచుకుంటానా. పిల్లలైన మీ కొరకే ఇళ్ళు మొదలైనవి నిర్మించబడ్డాయి. సన్యాసులైతే తమ కొరకు పెద్ద-పెద్ద మహళ్ళు మొదలైనవి నిర్మిస్తారు. ఇక్కడ శివబాబా తమ కొరకు ఏమీ తయారుచేసుకోరు. వారంటారు - దీనికి రిటర్న్ మీకు 21 జన్మల కొరకు కొత్త ప్రపంచములో లభిస్తుంది ఎందుకంటే మీరు సమ్ముఖముగా ఇచ్చి-పుచ్చుకోవడాలు చేస్తారు. మీరు ధనము ఏదైతే ఇస్తారో, అది మీకే ఉపయోగపడుతుంది. నేను భక్తి మార్గములో కూడా దాతను, ఇప్పుడు కూడా దాతనే. అది ఇన్ డైరెక్ట్, ఇది డైరెక్ట్. బాబా అంటారు - మీ వద్ద ఉన్నదానితో వెళ్ళి సెంటరును తెరవండి. ఇతరుల కళ్యాణము చేయండి. నేను కూడా సెంటరు తెరుస్తాను కదా. ఇది పిల్లలు ఇచ్చినది, మళ్ళీ పిల్లలకే నేను సహాయం చేస్తాను. నేను నాతోపాటు ధనాన్ని ఏమైనా తీసుకొస్తానా. నేను వచ్చి వీరిలోకి ప్రవేశిస్తాను, వీరి ద్వారా కర్తవ్యాన్ని చేయిస్తాను. నేనైతే స్వర్గములోకి రాను. ఇవన్నీ మీ కొరకే ఉన్నాయి, నేనైతే అభోక్తను. నేనేమీ తీసుకోను. నా పాదాలకు నమస్కరించండి అని కూడా చెప్పను. నేనైతే పిల్లలైన మీ యొక్క అతి విధేయుడైన సేవకుడిని. ఇది కూడా మీకు తెలుసు - వారే తల్లి-తండ్రి, బంధువు-సఖుడు... సర్వస్వము. వారు నిరాకారుడు. మీరు ఏ గురువునూ - నీవే తల్లివి-తండ్రివి అని అనరు. గురువును గురువు అని, టీచరును టీచర్ అని అంటారు. వీరిని తల్లి-తండ్రి అని అంటారు. తండ్రి అంటారు - నేను కల్ప-కల్పము ఒక్కసారి మాత్రమే వస్తాను. మీరే 12 నెలలు తర్వాత నా జయంతిని జరుపుతారు. కానీ శివబాబా ఎప్పుడు వచ్చారు, ఏమి చేసారు అనేది ఎవరికీ కూడా తెలియదు. బ్రహ్మా-విష్ణు-శంకరుల కర్తవ్యము గురించి కూడా తెలియదు ఎందుకంటే పైన ఉన్న శివుని చిత్రాన్ని మాయం చేసేసారు. లేదంటే శివబాబా కరన్-కరావన్ హార్ (చేసేవారు-చేయించేవారు). బ్రహ్మా ద్వారా చేయిస్తారు. వారు వచ్చి ఏ విధంగా ప్రవేశిస్తారు మరియు ఏ విధంగా చేసి చూపిస్తారు అనేది కూడా పిల్లలైన మీకు తెలుసు. మీరు కూడా ఈ విధంగా చేయండి అని వారు అంటారు. ఒకటేమో మంచి రీతిలో చదువుకోండి, తండ్రిని స్మృతి చేయండి, దైవీ గుణాలను ధారణ చేయండి అని వీరి ఆత్మ చెప్తుంది. ఈ విషయము కూడా చెప్తున్నారు - నేను బాబాను స్మృతి చేస్తాను, బాబా కూడా తోడుగా ఉన్నట్లు అనిపిస్తుంది. మేము కొత్త ప్రపంచానికి యజమానులుగా అవ్వనున్నామని మీ బుద్ధిలో ఉంది. కావున నడవడిక, ఆహార-పానీయాలు మొదలైనవన్నీ మార్చుకోవాలి. వికారాలను విడిచిపెట్టాలి. పరివర్తన అయితే అవ్వాలి. ఎంతెంతగా పరివర్తన అవుతారో, శరీరాన్ని వదిలిన తర్వాత అంతటి ఉన్నతమైన కులములో జన్మ తీసుకుంటారు. కులాలు నంబరువారుగా ఉంటాయి. ఇక్కడ కూడా మంచి-మంచి కులాలు ఉంటాయి. 4-5 మంది సోదరులందరూ పరస్పరము కలిసి ఉంటారు, గొడవలు మొదలైవేవీ జరగవు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు - మనము అమరలోకములోకి వెళ్తాము, అక్కడ మృత్యువు కబళించదు. భయపడవలసిన విషయమేమీ లేదు. ఇక్కడైతే రోజురోజుకూ భయం పెరుగుతూ ఉంటుంది. బయటికి వెళ్ళలేకపోతారు. ఇది కూడా తెలుసు - ఈ చదువును కోట్లల్లో ఏ ఒక్కరో చదువుకుంటారు. కొందరైతే మంచి రీతిలో అర్థం చేసుకుంటారు, చాలా బాగుంది అని వ్రాస్తారు కూడా. ఇటువంటి పిల్లలు కూడా తప్పకుండా వస్తారు. రాజధాని అయితే స్థాపన అవ్వనున్నది కదా. ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది.
స్మృతి యాత్రలో ఎవరైతే చురుకుగా పరుగులు తీస్తారో, తండ్రి ఆ పురుషార్థీ పిల్లలకు చాలా-చాలా మహిమ చేస్తారు. ముఖ్యమైనది స్మృతికి సంబంధించిన విషయము. దీనితో పాత లెక్కాచారాలన్నీ సమాప్తమవుతాయి. కొందరు పిల్లలు - బాబా, నేను రోజూ ఇన్ని గంటలు స్మృతి చేస్తాను అని బాబాకు వ్రాస్తారు, అప్పుడు బాబా కూడా - వీరు చాలా మంచి పురుషార్థులు అని భావిస్తారు. పురుషార్థమైతే చేయాలి కదా, అందుకే తండ్రి అంటారు - పరస్పరంలో ఎప్పుడూ కూడా కొట్లాడుకోవడము-గొడవపడడము చేయకూడదు. ఇది జంతువుల పని. కొట్లాడుకోవడము-గొడవపడడము అనేది దేహాభిమానము. తండ్రి పేరు అప్రతిష్టపాలు చేస్తారు. సద్గురువుకు నింద తీసుకొచ్చేవారు ఉన్నత పదవిని పొందలేరు అని తండ్రి కోసమే అంటారు. కానీ సాధువులు ఈ మాటను తమ కొరకు చెప్పుకున్నారు. కావున, వారు ఎక్కడ శపిస్తారో అని మాతలు భయపడుతూ ఉంటారు. ఇప్పుడు మీకు తెలుసు - మనము మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నాము. సత్యాతి-సత్యమైన అమరకథను వింటున్నాము. మేము ఈ పాఠశాలకు శ్రీ లక్ష్మీ-నారాయణుల పదవిని పొందేందుకు వస్తాము అని మీరు అంటారు, ఇంకెక్కడా ఈ విధంగా అనరు. ఇప్పుడు మనము మన ఇంటికి వెళ్తాము. ఇందులో స్మృతి యొక్క పురుషార్థమే ముఖ్యమైనది. అర్ధకల్పము స్మృతి చేయలేదు. ఇప్పుడు ఒక్క జన్మలోనే స్మృతి చేయాలి. ఇది శ్రమతో కూడుకున్నది. స్మృతి చేయాలి, దైవీ గుణాలను ధారణ చేయాలి, ఏవైనా పాప కర్మలు చేసినట్లయితే 100 రెట్ల శిక్ష పడుతుంది. పురుషార్థము చేయాలి, తమ ఉన్నతిని చేసుకోవాలి. ఆత్మయే శరీరము ద్వారా చదువుకుని బ్యారిస్టరుగా లేక సర్జన్ మొదలైనవారిగా అవుతుంది కదా. ఈ లక్ష్మీ-నారాయణుల పదవి చాలా ఉన్నతమైనది కదా. మున్ముందు మీకు ఎన్నో సాక్షాత్కారాలు జరుగుతాయి. మీరు సర్వోత్తమమైన బ్రాహ్మణ కులభూషణులు, స్వదర్శన చక్రధారులు. కల్పపూర్వము కూడా ఈ జ్ఞానాన్ని మీకు వినిపించాను. మళ్ళీ మీకు వినిపిస్తాను. మీరు విని పదవిని పొందుతారు. తర్వాత ఈ జ్ఞానము కనుమరుగైపోతుంది. ఇకపోతే ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. లోపల స్వయాన్ని చెక్ చేసుకోవాలి - నేను తండ్రి స్మృతిలో ఎంత సమయం ఉంటున్నాను? దైవీ గుణాలను ఎంతవరకు ధారణ చేసాను? నాలో ఏ అవగుణమూ లేదు కదా? నా ఆహార-పానీయాలు, నడత-నడవడిక రాయల్ గా ఉన్నాయా? వ్యర్థ విషయాలైతే మాట్లాడటము లేదు కదా? అబద్ధాలు అయితే చెప్పడము లేదు కదా?
2. స్మృతి చార్టును పెంచుకునేందుకు అభ్యాసము చేయాలి - ఆత్మలమైన మనందరమూ పరస్పరం సోదరులము. దేహాభిమానము నుండి దూరంగా ఉండాలి. తమ ఏకరస స్థితిని తయారుచేసుకోవాలి, దీని కొరకు సమయాన్ని కేటాయించాలి.
| వరదానము:- |
పంచ తత్వాలను మరియు పంచ వికారాలను తమ సేవాధారులుగా చేసుకునే మాయాజీత్ స్వరాజ్యాధికారీ భవ ఏ విధంగా సత్యయుగములో విశ్వ మహారాజులు మరియు విశ్వ మహారాణుల యొక్క రాజ్యరికపు డ్రెస్ ను వెనుక నుండి దాస-దాసీలు పట్టుకుంటారో, అదే విధంగా సంగమయుగములో పిల్లలైన మీరు మాయాజీతులుగా, స్వరాజ్యాధికారులుగా అయి టైటిల్స్ రూపీ డ్రెస్ తో అలంకరించబడి ఉన్నట్లయితే ఈ 5 తత్వాలు మరియు 5 వికారాలు తమ డ్రెస్ ను వెనుక నుండి పట్టుకుంటాయి అనగా ఆధీనంగా అయి నడుస్తాయి. దీని కొరకు దృఢ సంకల్పమనే బెల్టుతో టైటిల్స్ యొక్క డ్రెస్ ను టైట్ చేసుకోండి, రకరకాల డ్రెస్లు మరియు అలంకరణ సెట్లతో అలంకరించుకుని తండ్రితో పాటుగా ఉన్నట్లయితే ఈ వికారాలు మరియు తత్వాలు పరివర్తన చెంది సహయోగులుగా, సేవాధారులుగా అవుతాయి. |
| స్లోగన్:- | ఏ గుణాలను మరియు శక్తులను వర్ణన చేస్తారో, వాటి యొక్క అనుభవాలలో నిమగ్నమైపోండి. అనుభవమే అన్నింటికన్నా పెద్ద అథారిటీ. |
అవ్యక్త సూచనలు - ‘‘కంబైండ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి’’
స్వయాన్ని తండ్రితోపాటుగా కంబైండ్గా ఉన్నట్లు భావించినట్లయితే వినాశీ సహచరుడు కావాలి అన్న సంకల్పము సమాప్తమైపోతుంది ఎందుకంటే సర్వశక్తివంతుడు సహచరునిగా ఉన్నారు. ఏ విధంగానైతే సూర్యుని ఎదురుగా అంధకారము నిలవలేదో, అలాగే సర్వశక్తివంతుని ఎదురుగా మాయ యొక్క ఎటువంటి వ్యర్థ సంకల్పము కూడా నిలవలేదు. ఏ శత్రువైనా దాడి చేసే కంటే ముందు ఒంటరిగా చేస్తాడు, అందుకే ఎప్పుడూ ఒంటరిగా అవ్వకండి.