తెలుగు మురళి · Brahma Kumaris

ఈరోజు మురళి · 15 అక్టోబర్, 2025

ఓం శాంతి · BapDada · 15 అక్టోబర్, 2025

ఈరోజు మురళి — today murli telugu, every morning.

18
మురళి15 అక్టోబర్, 2025 · తెలుగు
0:00--:--

పాఠ్యాన్ని ఎంచుకోండి → హైలైట్ / బాక్స్ / అండర్‌లైన్

15-10-2025
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
మధువనం

‘‘మధురమైన పిల్లలూ - ఆత్మా రూపీ బ్యాటరీ 84 కార్లలోకి వెళ్ళిన కారణంగా డల్ అయిపోయింది, ఇప్పుడు దానిని స్మృతియాత్ర ద్వారా నింపుకోండి’’
ప్రశ్న:- బాబా ఏ పిల్లలను చాలా-చాలా భాగ్యశాలురుగా భావిస్తారు?
జవాబు:- ఎవరికైతే ఏ జంజాటాలు లేవో, ఎవరైతే నిర్బంధనులుగా ఉన్నారో, అటువంటి పిల్లలతో బాబా అంటారు - మీరు చాలా-చాలా భాగ్యశాలురు, మీరు స్మృతిలో ఉంటూ మీ బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేసుకోవచ్చు అని. ఒకవేళ యోగము లేకుండా కేవలం జ్ఞానము వినిపించినట్లయితే బాణము తగలదు. ఎవరు ఎంత గొప్పగా తమ అనుభవాన్ని వినిపించినా కానీ స్వయంలో ధారణ లేకపోతే మనసు తింటూ ఉంటుంది.

ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థము చేయిస్తారు. ఆత్మిక తండ్రి పేరు ఏమిటి? శివబాబా. వారు భగవంతుడు, అనంతమైన తండ్రి. మనుష్యులను ఎప్పుడూ అనంతమైన తండ్రి అని లేక ఈశ్వరుడు అని లేక భగవంతుడు అని అనలేరు. శివ అనే పేరు చాలామందికి ఉండవచ్చు కానీ వారంతా దేహధారులు కావున వారిని భగవంతుడని అనలేరు. తండ్రి కూర్చొని పిల్లలకు ఈ విషయాలు అర్థము చేయిస్తున్నారు. నేను ఎవరిలోకైతే ప్రవేశించానో, ఇది వారి అనేక జన్మల అంతిమ జన్మ. పిల్లలైన మిమ్మల్ని చాలామంది అడుగుతారు - మీరు వీరిని భగవంతుడు అని ఎందుకు అంటారు? తండ్రి ముందు నుండే అర్థం చేయించారు - ఏ స్థూల లేక సూక్ష్మ దేహధారులనూ భగవంతుడు అని అనలేరు. సూక్ష్మ దేహధారులు సూక్ష్మవతనవాసులు. వారిని దేవతలు అని అంటారు. ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు, పరమపిత. వారి పేరు ఉన్నతోన్నతమైనది, వారి స్థానము ఉన్నతోన్నతమైన పరంధామము. తండ్రి ఆత్మలందరితో పాటు అక్కడ నివసిస్తారు. వారి ఆసనము కూడా ఉన్నతమైనది. వాస్తవానికి అది కూర్చునే స్థానమేమీ కాదు. నక్షత్రాలు ఎక్కడైనా కూర్చుని ఉన్నాయా? అవి నిలబడి ఉన్నాయి కదా. ఆత్మలైన మీరు కూడా మీ శక్తి ద్వారా అక్కడ నిలబడి ఉన్నారు. శక్తి ఎంతగా లభిస్తుందంటే అక్కడకు వెళ్ళి నిలబడతారు. తండ్రి పేరే సర్వశక్తివంతుడు, వారి ద్వారా శక్తి లభిస్తుంది. ఆత్మ వారిని స్మృతి చేస్తుంది, బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఉదాహరణకు కారులో బ్యాటరీ ఉంటుంది, దాని శక్తి వలనే కారు నడుస్తుంది. బ్యాటరీలో కరెంటు నింపబడి ఉంటుంది, తర్వాత నడుస్తూ-నడుస్తూ అది ఖాళీ అయిపోతుంది, మళ్ళీ బ్యాటరీని మెయిన్ పవర్ తో ఛార్జి చేసి కారులో పెడతారు. అవి హద్దులోని విషయాలు. ఇది అనంతమైన విషయము. మీ బ్యాటరీ అయితే 5 వేల సంవత్సరాలు నడుస్తుంది. నడుస్తూ-నడుస్తూ తర్వాత ఢీలా అయిపోతుంది. శక్తి పూర్తిగా సమాప్తమవ్వదు, ఎంతోకొంత మిగిలి ఉంటుందని తెలుస్తుంది. ఎలాగైతే టార్చి లైట్ డిమ్ అవుతుంది కదా. ఆత్మ ఈ శరీరము యొక్క బ్యాటరీ. ఇది కూడా డల్ అయిపోతుంది. బ్యాటరీ ఈ శరీరము నుండి బయటకు కూడా వస్తుంది, తర్వాత రెండవ, మూడవ మోటరులోకి (కారులోకి) వెళ్తుంది. దానిని 84 కార్లలో పెట్టడము జరుగుతుంది. ఇప్పుడు తండ్రి అంటారు - మీరు ఎంత మందబుద్ధిగా, రాతిబుద్ధిగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ మీ బ్యాటరీని నింపుకోండి. తండ్రి స్మృతి ద్వారా తప్ప ఆత్మ ఎప్పుడూ పవిత్రంగా అవ్వలేదు. సర్వశక్తివంతుడైన తండ్రి ఒక్కరే, వారితో యోగము జోడించాలి. నేను ఎవరిని, ఎలా ఉంటాను అని తండ్రే స్వయంగా వారి పరిచయాన్ని ఇస్తారు. మీ ఆత్మ యొక్క బ్యాటరీ ఎలా డల్ అవుతుంది అనేది చెప్తారు. ఇప్పుడు మీకు సలహా ఇస్తాను - నన్ను స్మృతి చేసినట్లయితే బ్యాటరీ సతోప్రధానంగా, ఫస్ట్ క్లాస్ గా అవుతుంది. పవిత్రంగా అయినట్లయితే ఆత్మ 24 క్యారెట్ల కలదిగా తయారవుతుంది. ఇప్పుడు మీరు అపవిత్రంగా అయిపోయారు. శక్తి పూర్తిగా సమాప్తమైపోయింది. ఆ శోభయే లేదు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు - పిల్లలూ, ముఖ్యమైన విషయము, యోగములో ఉండడము, పవిత్రంగా అవ్వడము. లేకపోతే బ్యాటరీ నిండదు. యోగము కుదరదు. ఇతరులకు జ్ఞానము చెప్పి, స్వయము నిదురించేవారు చాలామంది ఉన్నారు. జ్ఞానాన్ని ఇస్తారు కానీ ఆ అవస్థ ఉండదు. ఇక్కడ చాలా గొప్పగా తమ అనుభవాన్ని వినిపిస్తారు. నేను ఏదైతే వర్ణన చేస్తున్నానో, అటువంటి అవస్థ నాకు లేదని లోలోపల తింటూ ఉంటుంది. యోగీ ఆత్మలైన పిల్లలు కూడా కొందరు ఉన్నారు. తండ్రి అయితే పిల్లల మహిమను ఎంతగానో చేస్తారు. తండ్రి అంటారు - పిల్లలూ, మీరు చాలా-చాలా భాగ్యశాలురు. మీకు ఇన్ని జంజాటాలు లేవు. ఎవరికైతే ఎక్కువమంది పిల్లలుంటారో, వారికి బంధనము కూడా ఉంటుంది. బాబాకు ఎంతమంది పిల్లలున్నారు. అందరినీ సంభాళిస్తూ, పాలన చేయవలసి ఉంటుంది. బాబాను కూడా స్మృతి చేయాలి. ప్రియుని స్మృతి అయితే చాలా పక్కాగా ఉండాలి. భక్తి మార్గములో, ఓ భగవంతుడా అని అంటూ మీరు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తూ వచ్చారు, మొట్టమొదటి పూజ కూడా వారికే చేస్తారు. మొదట నిరాకార భగవంతుడినే పూజిస్తారు. ఆ సమయంలో మీరు ఆత్మాభిమానులుగా ఉంటారని కాదు. ఆత్మాభిమానులుగా ఉండేవారు పూజలు చేయరు.

తండ్రి అర్థం చేయిస్తారు - మొట్టమొదట భక్తి ప్రారంభమైనప్పుడు, మొదట ఒక్క తండ్రిని మాత్రమే పూజిస్తారు. ఒక్క శివుడిని మాత్రమే పూజిస్తారు. యథా రాజా-రాణి తథా ప్రజా. ఉన్నతోన్నతమైనవారు భగవంతుడే, వారినే స్మృతి చేయాలి. క్రింద ఉన్నవారిని - బ్రహ్మా-విష్ణు-శంకరులను కూడా స్మృతి చేయాల్సిన అవసరము లేదు. ఉన్నతోన్నతమైన తండ్రినే స్మృతి చేయాలి. కానీ డ్రామాలో పాత్ర ఎలా ఉందంటే, మీరు క్రిందకు దిగేందుకు బంధించబడి ఉన్నారు. మీరు ఎలా క్రిందకు దిగుతారో తండ్రి అర్థం చేయిస్తారు. ప్రతి విషయము ఆది నుండి అంతిమము వరకు, పై నుండి క్రింది వరకు తండ్రి అర్థం చేయిస్తారు. భక్తి కూడా మొదట సతోప్రధానముగా ఉంటుంది, తర్వాత సతో-రజో-తమోగా అవుతుంది. మీరిప్పుడు మళ్ళీ సతోప్రధానంగా అవుతున్నారు, ఇందులోనే శ్రమ ఉంది. పవిత్రముగా అవ్వాలి. స్వయాన్ని చెక్ చేసుకోవాలి - మాయ ఎక్కడా మోసము చెయ్యడం లేదు కదా? నాకు వికారీ దృష్టి లేదు కదా? పాపపు ఆలోచనలేవీ రావటం లేదు కదా? ప్రజాపిత బ్రహ్మా అని గాయనముంది, మరి వారి సంతానమైన బ్రాహ్మణ-బ్రాహ్మణీలు సోదరీ-సోదరులవుతారు కదా. ఇక్కడి బ్రాహ్మణులు కూడా స్వయాన్ని బ్రహ్మా సంతానముగా చెప్పుకుంటారు. మీరు కూడా బ్రాహ్మణులు, సోదరీ-సోదరులు అయినట్లు కదా. మరి వికారీ దృష్టి ఎందుకు ఉంచుకుంటున్నారు. మీరు బ్రాహ్మణులకు చాలా బాగా దృష్టిని ఇవ్వవచ్చు. బ్రహ్మా సంతానము, బ్రాహ్మణ-బ్రాహ్మణీలుగా అయిన తర్వాత దేవతలుగా అవుతారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. తండ్రి వచ్చి బ్రాహ్మణ దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారని కూడా అంటారు. ఇది అర్థము చేసుకునే విషయము కదా. మనము బ్రహ్మా సంతానము సోదర-సోదరీలము అయ్యాము కావున చెడు దృష్టి ఎప్పుడూ ఉండకూడదు. దానిని ఆపాలి. వీరు కూడా నా మధురమైన సోదరి అని ఆ ప్రేమ ఉండాలి. రక్త సంబంధంలో ఏ విధంగా ప్రేమ ఉంటుందో, అది మారి ఆత్మికముగా అవ్వాలి. ఇందులో చాలా-చాలా శ్రమ ఉంది. ఇది సహజ స్మృతి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. వికారీ దృష్టి ఉండకూడదు. బాబా అర్థం చేయించారు - ఈ కళ్ళు చాలా మోసము చేస్తాయి, వాటిని పరివర్తన చేసుకోవాలి. మనము ఆత్మలము. ఇప్పుడు మనము శివబాబా పిల్లలము. దత్తత తీసుకోబడిన సోదరీ-సోదరులము. మనం స్వయాన్ని బి.కె.లుగా చెప్పుకుంటాము. నడవడికలో తేడా ఉంటుంది కదా. మనకు సోదర-సోదరీలము అన్న దృష్టి ఉందని మీరు అనుకుంటున్నారా లేక ఏదైనా చంచలత్వము ఉందా అని క్లాసులో అందరినీ ప్రశ్నించడము టీచరు పని. సత్యమైన తండ్రి ఎదురుగా సత్యము చెప్పకుండా, అసత్యం చెప్తే చాలా శిక్ష పడుతుంది. సత్యమైన తండ్రి అయిన ఈశ్వరుని ఎదురుగా సత్యము చెప్తాము అని కోర్టులో ప్రమాణము చేస్తారు కదా. సత్యమైన తండ్రి యొక్క పిల్లలు కూడా సత్యముగానే ఉంటారు. బాబా సత్యము కదా. వారు సత్యమే చెప్తారు. మిగిలినవన్నీ సత్యము కాదు. శ్రీ శ్రీ 108 అని స్వయాన్ని పిలిపించుకుంటారు, వాస్తవానికి ఇది మాల కదా, దీనిని స్మరణ చేస్తారు. మనం ఎందుకు స్మరణ చేస్తామో కూడా తెలియదు. బౌద్ధుల మాల, క్రిస్టియన్ల మాల కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ-తమ పద్ధతిలో మాలను తిప్పుతారు. పిల్లలైన మీకిప్పుడు జ్ఞానము లభించింది. ఈ విధంగా చెప్పండి, 108 మాలలో పైన ఉన్న పుష్పము నిరాకారుడు, వారినే అందరూ స్మృతి చేస్తారు. వారి స్మృతి ద్వారానే మనము స్వర్గము యొక్క పట్టపు రాణులుగా అనగా మహారాణులుగా అవుతాము. నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అవ్వడము - ఇది సూర్య వంశీ మఖ్ మల్ పట్టపు రాణులుగా అయ్యి తర్వాత ఖాదీ వారిగా అయిపోతారు. కావున ఇటువంటి పాయింట్లు బుద్ధిలో ఉంచుకొని తర్వాత అర్థము చేయించాలి. అప్పుడు మీ పేరు చాలా ప్రసిద్ధి అవుతుంది. మాట్లాడడములో సింహము వలె అవ్వండి. మీరు శివశక్తి సైన్యము కదా. అనేక రకాల సైన్యాలున్నాయి కదా. అక్కడికి కూడా మీరు వెళ్ళి ఏం నేర్పిస్తున్నారో చూడండి. లక్షల మంది మనుష్యులు వెళ్తారు. వికారీ దృష్టి చాలా మోసము చేస్తుందని బాబా అర్థం చేయించారు. మీ అవస్థను వర్ణన చేయాలి. మేము ఇంట్లో ఎలా ఉంటున్నాము, స్థితిపై ఎలాంటి ప్రభావము పడుతుంది అని అనుభవాన్ని వినిపించాలి. ఎంత సమయము ఈ అవస్థలో ఉంటున్నాను అని డైరీ పెట్టండి. శక్తివంతమైనవారితో మాయ కూడా శక్తిశాలిగా అయ్యి యుద్ధము చేస్తుందని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇది యుద్ధ మైదానము కదా. మాయ చాలా శక్తివంతమైనది. మాయ అనగా 5 వికారాలు. ధనాన్ని సంపద అని అంటారు, ఎవరి వద్దనైతే ఎక్కువ సంపద ఉంటుందో, వారే ఎక్కువ అజామిళునిగా అవుతారు.

తండ్రి అంటారు - మొట్టమొదట మీరు వేశ్యలను రక్షించండి. అప్పుడు వారు మళ్ళీ వారి అసోసియేషన్ ను తయారుచేస్తారు. మేమైతే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. నేను మిమ్మల్ని శివాలయానికి యజమానులుగా చేసేందుకు వచ్చానని తండ్రి అంటారు. ఇది అంతిమ జన్మ. వేశ్యలకు అర్థము చేయించాలి - మీ పేరు కారణంగా భారత్ పరువు ఇంతగా పోయింది. ఇప్పుడు శివాలయంలోకి తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చారు. మేము శ్రీమతము ఆధారంగా మీ వద్దకు వచ్చాము. ఇప్పుడు మీరు విశ్వానికి యజమానులుగా అవ్వండి. మా వలె భారత్ పేరును ప్రసిద్ధము చేయండి. మేము కూడా తండ్రిని స్మృతి చేయడము ద్వారా పవిత్రంగా అవుతున్నాము. మీరు కూడా ఈ ఒక్క జన్మ ఛీ-ఛీ పనులు చేయడము వదిలేయండి. వారిపై దయ చూపించాలి కదా. అప్పుడు మీ పేరు చాలా ప్రసిద్ధమవుతుంది. వీరిలో ఎంతటి శక్తి ఉందంటే, ఇటువంటి అశుద్ధమైన వ్యాపారము నుండి వారిని విడిపించారు అని అంటారు. అందరికీ అసోసియేషన్ లు ఉన్నాయి. మీరు మీ అసోసియేషన్ తయారుచేసుకుని గవర్నమెంట్ నుండి ఏ సహాయం కావాలనుకుంటే అది తీసుకోవచ్చు. కావున ఇప్పుడు భారత్ పేరును అప్రతిష్టపాలు చేసిన అటువంటి ఛీ-ఛీ గా ఉన్నవారి సేవను చేయండి. 10-12 మంది కలిసి వెళ్ళి అర్థము చేయించే విధంగా మీ యూనియన్ కూడా చాలా పక్కాగా ఉండాలి. మాతలు కూడా బాగుండాలి. ఎవరైనా కొత్త యుగల్ వస్తే వారికి చెప్పండి - మేము పవిత్రంగా ఉంటాము. పవిత్రముగా ఉండటం ద్వారానే విశ్వానికి యజమానులుగా అవుతారు. మరి ఎందుకు పవిత్రంగా అవ్వకూడదు. మొత్తం గుంపు అంతా వెళ్ళాలి. మేము మీకు పరమపిత పరమాత్ముని సందేశాన్ని ఇచ్చేందుకు వచ్చాము అని చాలా నమ్రతతో వెళ్ళి చెప్పాలి. ఇప్పుడు వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. తండ్రి అంటారు - నేను అందరినీ ఉద్ధరించడానికి వచ్చాను. మీరు కూడా ఈ ఒక్క జన్మ వికారాలలోకి వెళ్ళకండి. వారికి అర్థం చేయించవచ్చు - బ్రహ్మాకుమారీ-బ్రహ్మాకుమారులైన మేము మా తనువు-మనసు-ధనముతోనే సేవ చేస్తున్నాము, మేము భిక్ష అడగము, మేము ఈశ్వరుని సంతానము. ఇటువంటి ప్లాన్లు తయారుచేయండి. మీరు సహాయము చెయ్యలేరని కాదు. వాహ్-వాహ్ అనేటటువంటి పనులు చేయండి. మీకు సహాయము చేయడానికి వేలాది మంది వస్తారు. మీ సంగఠనను తయారుచేసుకోండి. అత్యంత ముఖ్యమైనవారిని ఎన్నుకొని సెమినార్ చేయండి. పిల్లలను సంభాళించేవారు చాలామంది వస్తారు. మీరు ఈశ్వరీయ సేవలో నిమగ్నమవ్వండి. ఎంతటి విశాల హృదయం కలవారిగా ఉండాలంటే, వెంటనే సేవ కోసం వెళ్ళగలగాలి. ఒకవైపు ఈ సేవ మరియు రెండవ విషయము గీతకు సంబంధించినది, ఈ విషయాలను కలిపి చెప్పండి. ఈ విధంగా లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకే మీరు చదువుతున్నారు కావున ఇక్కడ పిల్లలైన మీకు పరస్పరము అభిప్రాయ భేదాలు ఉండకూడదు. ఒకవేళ తండ్రి నుండి ఏదైనా విషయాన్ని దాచిపెడితే, సత్యము చెప్పకపోతే, అప్పుడు కూడా స్వయాన్నే నష్టపరచుకుంటారు, ఇంకా వంద రెట్ల పాపము పెరుగుతుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మనము మధురమైన తండ్రి యొక్క పిల్లలము, పరస్పరము మధురమైన సోదరీ-సోదరులుగా ఉండాలి. ఎప్పుడూ కూడా వికారీ దృష్టి ఉండకూడదు. దృష్టిలో ఎలాంటి చంచలత్వము ఉన్నా ఆత్మిక సర్జన్ కు సత్యాన్ని వినిపించాలి.

2. ఎప్పుడూ కూడా పరస్పరం అభిప్రాయ భేదాలలోకి రాకూడదు. విశాలహృదయము కలవారిగా అయి సేవ చేయాలి. తమ తనువు-మనసు-ధనముతో, చాలా-చాలా నమ్రతతో సేవ చేసి అందరికీ తండ్రి పరిచయాన్ని (సందేశాన్ని) ఇవ్వాలి.

వరదానము:- ప్రతి కర్మను చరిత్ర రూపములో మహిమా యోగ్యముగా చేసే మహాన్ ఆత్మ భవ
ఎవరి ప్రతి సంకల్పము, ప్రతి కర్మ మహాన్ గా ఉంటుందో, వారే మహాన్ ఆత్మ. ఒక్క సంకల్పము కూడా సాధారణంగా లేక వ్యర్థముగా ఉండకూడదు. ఏ కర్మ కూడా సాధారణంగా లేక అర్థము లేకుండా ఉండకూడదు. కర్మేంద్రియాల ద్వారా ఏ కర్మ జరిగినా అది అర్థ సహితముగా ఉండాలి, సమయము కూడా మహాన్ కార్యాలలో సఫలము అవుతూ ఉండాలి, అప్పుడు ప్రతి చరిత్ర మహిమా యోగ్యముగా ఉంటుంది. మహాన్ ఆత్మల స్మృతిచిహ్నమే హర్షిత మూర్తులు, ఆకర్షణా మూర్తులు మరియు అవ్యక్త మూర్తుల రూపములో ఉంది.
స్లోగన్:- గౌరవము కావాలనే కోరికను వదిలి స్వమానములో స్థితులైనట్లయితే గౌరవము నీడ వలె వెనువెనుక వస్తుంది.

 

అవ్యక్త సూచనలు - స్వయము కొరకు మరియు సర్వుల కొరకు మనసు ద్వారా యోగ శక్తులను ప్రయోగము చెయ్యండి

ఏవైనా స్థూల కార్యాలు చేస్తున్నప్పుడు మనసు ద్వారా వైబ్రేషన్లను వ్యాపింపజేసే సేవ చెయ్యండి. ఏ విధంగా బిజినెస్చేసేవారు స్వప్నములో కూడా వారి బిజినెస్నే చూస్తూ ఉంటారో, అదే విధంగా మీ పని - విశ్వ కళ్యాణము చెయ్యటము. ఇదే మీ ఆక్యుపేషన్ (కర్తవ్యము), ఈ ఆక్యుపేషన్ ను స్మృతిలో ఉంచుకుని సేవలో సదా బిజీగా ఉండండి. సేవా ఫలము లభించినట్లయితే సహజంగానే మాయాజీతులుగా అయిపోతారు, అందుకే బుద్ధికి తీరిక లభించినప్పుడల్లా సేవలో నిమగ్నమవ్వండి.

మురళి అంటే ఏమిటి?

మురళి బ్రహ్మకుమారీల దైనిక ఆధ్యాత్మిక బోధన, ఇది ప్రతి ఉదయం మధుబన్ నుండి ప్రచురించబడుతుంది. ఇక్కడ మీరు ఈరోజు మురళిని తెలుగులో చదవవచ్చు, ఆడియో వినవచ్చు మరియు PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధ్యయనానికి సహాయంగా పాఠ్యాన్ని హైలైట్ చేయవచ్చు — మీ గుర్తులు ఈ బ్రౌజర్‌లోనే సురక్షితంగా ఉంటాయి.

28 భాషల్లో మురళి

Daily Murli · Madhuban మూలం: మధుబన్ మురళి విభాగం ఇది స్వతంత్ర రీడర్ యాప్, అధికారిక వెబ్‌సైట్ కాదు.