| 22-10-2025 |
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
|
మధువనం |
| ‘‘మధురమైన పిల్లలూ - మీరు ఎవరికైనా అర్థం చేయించినప్పుడు లేక భాషణ చేసినప్పుడు బాబా-బాబా అని అంటూ అర్థము చేయించండి, తండ్రి మహిమను చేయండి, అప్పుడు బాణము తగులుతుంది’’ | |
| ప్రశ్న:- | బాబా భారతవాసులైన పిల్లలను విశేషంగా ఏ ప్రశ్నలు అడుగుతారు? |
| జవాబు:- | భారతవాసీ పిల్లలైన మీరు ఎంత షావుకారులుగా ఉండేవారు, సర్వగుణ సంపన్నులుగా, 16 కళల సంపూర్ణులుగా, దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారు, మీరు పవిత్రంగా ఉండేవారు, కామ ఖడ్గాన్ని నడిపించేవారు కాదు, చాలా ధనవంతులుగా ఉండేవారు. మరి మీరు ఇంతగా ఎలా దివాలా తీశారు - కారణమేమిటో తెలుసా? పిల్లలూ, మీరు బానిసలుగా ఎలా అయ్యారు? ఇంతటి ధన-సంపదలను ఎక్కడ పోగొట్టుకున్నారు? మీరు పావనుల నుండి పతితులుగా ఎలా అయ్యారు అనేది ఆలోచించండి. పిల్లలైన మీరు కూడా ఇటువంటి విషయాలను బాబా-బాబా అని అంటూ ఇతరులకు కూడా అర్థం చేయించండి - అప్పుడు వారు సహజముగా అర్థము చేసుకుంటారు. |
ఓంశాంతి. ఓం శాంతి అని అన్నప్పుడు కూడా తండ్రి తప్పకుండా గుర్తు రావాలి. తండ్రి మొట్టమొదట చెప్పేది ఏమిటంటే - మన్మనాభవ. వారు తప్పకుండా ఇంతకుముందు కూడా చెప్పారు, అందుకే ఇప్పుడు కూడా చెప్తున్నారు కదా. పిల్లలైన మీకు తండ్రి గురించి తెలుసు, ఎక్కడైనా సభలో భాషణ చేయడానికి వెళ్ళినప్పుడు, వారికి తండ్రి గురించి తెలియదు. కావున వారికి కూడా - శివబాబాయే పతితపావనుడని శివబాబా చెప్తున్నారు అని చెప్పాలి. తప్పకుండా పావనంగా తయారుచేసేందుకు వారు ఇక్కడకు వచ్చి అర్థము చేయిస్తారు. ఏ విధంగా బాబా - ఓ పిల్లలూ, మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేశాను, ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందిన మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు అని ఇక్కడ మీకు చెప్తారో, అదే విధంగా మీరు కూడా - బాబా ఇలా చెప్తున్నారు అని చెప్పాలి. ఈ విధంగా భాషణలో చెప్పినట్లు ఎవరి నుండి సమాచారము రాలేదు. శివబాబా అంటారు - నన్ను ఉన్నతోన్నతమైనవారిగా భావిస్తారు, పతితపావనుడిగా కూడా భావిస్తారు, నేను రావడము కూడా భారత్ లోనే వస్తాను మరియు రాజయోగాన్ని నేర్పించేందుకు వస్తాను, నన్నొక్కరినే స్మృతి చేయండి, ఉన్నతమైన తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని చెప్తాను ఎందుకంటే ఈ తండ్రి ఇచ్చేటువంటి దాత. తప్పకుండా భారత్ లో మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు కదా. అప్పుడు ఇతర ధర్మాలేవీ లేవు. తండ్రి పిల్లలైన మాకు అర్థము చేయిస్తారు, మేము మళ్ళీ మీకు అర్థము చేయిస్తాము. బాబా అంటారు - భారతవాసులైన మీరు ఎంత షావుకార్లుగా ఉండేవారు. సర్వగుణ సంపన్నులుగా, 16 కళల సంపూర్ణులుగా ఉండేవారు, దేవతా ధర్మము ఉండేది, మీరు పవిత్రముగా ఉండేవారు, కామ ఖడ్గాన్ని నడిపించేవారు కాదు. చాలా ధనవంతులుగా ఉండేవారు. తండ్రి అంటారు - మీరు ఇంతగా ఎలా దివాలా తీశారు, కారణమేమిటో తెలుసా? మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు మీరు విశ్వానికి బానిసలుగా ఎందుకు అయ్యారు? అందరి నుండి అప్పులు తీసుకుంటూ ఉన్నారు. ఇంత ధనమంతా ఏమైపోయింది? ఏ విధంగా బాబా భాషణ చేస్తున్నారో, అదే విధంగా మీరు కూడా భాషణ చేయండి, అప్పుడు చాలామంది ఆకర్షితులవుతారు. మీరు తండ్రిని స్మృతి చేయరు కావున ఎవరికీ బాణము తగలదు. ఆ శక్తి లభించదు. లేకపోతే ఇటువంటి భాషణ మీది ఒక్కటి విన్నా అద్భుతము జరుగుతుంది. శివబాబా అర్థము చేయిస్తున్నారు - భగవంతుడు ఒక్కరే. వారు దుఃఖహర్త సుఖకర్త, కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేవారు. ఈ భారత్ లోనే స్వర్గముండేది. వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఉండేవి, ఒకే రాజ్యముండేది. అందరూ క్షీరఖండము వలె ఉండేవారు. ఏ విధంగా తండ్రి మహిమ అపారమైనదో, అదే విధంగా భారత్ యొక్క మహిమ కూడా అపారమైనది. భారత్ మహిమను విని సంతోషిస్తారు. తండ్రి పిల్లలను అడుగుతున్నారు - ఇంతటి ధన-సంపదలను ఎక్కడ పోగొట్టుకున్నారు? భక్తి మార్గములో మీరు ఎంత ఖర్చు చేస్తూ వచ్చారు. ఎన్ని మందిరాలను నిర్మిస్తారు. బాబా అంటారు - మీరు పావనుల నుండి పతితులుగా ఎలా అయ్యారో ఆలోచించండి. మీరంటారు కదా - బాబా, దుఃఖములో మిమ్మల్ని స్మరిస్తాము, సుఖములో స్మరించము అని. మరి మిమ్మల్ని దుఃఖితులుగా చేసేది ఎవరు? పదే-పదే బాబా పేరును తీసుకుంటూ ఉండండి. మీరు బాబా సందేశాన్ని ఇస్తారు. బాబా అంటారు - నేను స్వర్గాన్ని, శివాలయాన్ని స్థాపన చేసాను, స్వర్గములో ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది కదా. మీరు ఇది కూడా మర్చిపోయారు. రాధా-కృష్ణులే స్వయంవరము తర్వాత లక్ష్మీ-నారాయణులుగా అవుతారని కూడా మీకు తెలియదు. శ్రీకృష్ణుడు విశ్వానికి యజమానిగా ఉండేవారు, వారిపై కళంకాలు మోపుతారు, నాపై కూడా కళంకాలు మోపుతారు. నేను మీకు సద్గతిదాతను, మీరు నన్ను పిల్లిలో, కుక్కలో, కణ-కణములో ఉన్నానని అనేస్తారు. బాబా అంటారు, మీరు ఎంత పతితులుగా అయిపోయారు. తండ్రి అంటారు - సర్వుల సద్గతిదాతను, పతితపావనుడను నేను. మీరు మళ్ళీ పతితపావని అని గంగను అంటారు. నాతో యోగము జోడించని కారణంగా మీరు ఇంకా పతితులుగా అయిపోతారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. పదే-పదే బాబా పేరును తీసుకుని అర్థము చేయించినట్లయితే శివబాబా గుర్తుంటారు. మేము తండ్రి మహిమను చేస్తాము అని చెప్పండి. తండ్రి స్వయంగా చెప్తున్నారు - నేను ఈ సాధారణ పతిత తనువులోకి అనేక జన్మల అంతిమంలో ఎలా వస్తాను, ఇక్కడ అనేక జన్మలు అంటే వీరివే, ఇప్పుడు వీరు నా వారిగా అయ్యారు కావున ఈ రథము ద్వారా మీకు అర్థము చేయిస్తాను. వీరికి వీరి జన్మల గురించి తెలియదు. వీరు భగీరథుడు, వీరి యొక్క వానప్రస్థావస్థలో నేను వస్తాను. శివబాబా ఈ విధంగా అర్థం చేయిస్తారు. ఈ విధమైన భాషణ ఎవరిదీ వినలేదు. బాబా పేరే తీసుకోరు. రోజంతా బాబాను ఏ మాత్రము స్మృతి చేయరు. పరచింతనలో నిమగ్నమై ఉంటారు, మళ్ళీ - మేము ఈ విధంగా భాషణ చేసాము, మేము ఇది అర్థం చేయించాము అని వ్రాస్తారు. ఇప్పుడింకా మీరు చీమల వలె ఉన్నారు, పురుగులలా కూడా అవ్వలేదు, అయినా ఎంత అహంకారము ఉంది అని బాబా అనుకుంటారు. శివబాబా, బ్రహ్మా ద్వారా చెప్తున్నారని అర్థము చేసుకోరు. శివబాబాను మీరు మర్చిపోతారు. కొందరు బ్రహ్మా విషయములో డిస్టర్బ్ అవుతారు. తండ్రి అంటారు - మీరు నన్ను మాత్రమే స్మృతి చేయండి, మీకు నాతో పని ఉంది. నన్ను స్మృతి చేస్తారు కదా. కానీ తండ్రి ఎవరు, ఎప్పుడు వస్తారని కూడా మీకు తెలియదు. కల్పము లక్షల సంవత్సరాలు అని గురువులు మీకు చెప్తారు కానీ కల్పము 5 వేల సంవత్సరాలది అని తండ్రి అంటారు. పాత ప్రపంచము మళ్ళీ కొత్తదిగా అవుతుంది. కొత్తది మళ్ళీ పాతదిగా అవుతుంది. ఇప్పుడు కొత్త ఢిల్లీ ఎక్కడుంది? ఢిల్లీ పరిస్తాన్ గా ఉన్నప్పుడు దానిని కొత్త ఢిల్లీ అని అంటారు. కొత్త ప్రపంచములో కొత్త ఢిల్లీ యమునా నదీ తీరములో ఉండేది. అక్కడ లక్ష్మీ-నారాయణుల మహళ్ళు ఉండేవి. పరిస్తాన్ గా ఉండేది. ఇప్పుడైతే శ్మశానవాటికగా అవ్వనున్నది, అందరూ పూడ్చబడతారు, అందుకే తండ్రి అంటారు - ఉన్నతోన్నతమైన తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు. ఎల్లప్పుడూ ఈ విధంగా బాబా-బాబా అని అంటూ అర్థము చేయించండి. బాబా పేరును తీసుకోరు, అందుకే మీరు చెప్పేది ఎవరూ వినరు. బాబా స్మృతి లేకపోతే మీలో ఆ పదును నిండదు. మీరు దేహాభిమానములోకి వచ్చేస్తారు. బంధనములో ఉన్నవారు ఎవరైతే దెబ్బలు తింటారో, వారు మీ కన్నా ఎక్కువగా స్మృతిలో ఉంటారు, ఎంతగా పిలుస్తారు. తండ్రి అంటారు - మీరంతా ద్రౌపదులు కదా. ఇప్పుడు మిమ్మల్ని వివస్త్రగా అవ్వడము నుండి రక్షిస్తాను. మాతలలో కూడా ఇటువంటివారు కొందరుంటారు, వారికి కల్పక్రితము కూడా పూతన మొదలైన పేర్లను పెట్టారు. మీరు మర్చిపోయారు.
తండ్రి అంటారు - భారత్ శివాలయంగా ఉన్నప్పుడు దానిని స్వర్గమని అనేవారు. ఇక్కడ ఎవరి వద్దనైతే ఇళ్ళు, విమానాలు మొదలైనవి ఉన్నాయో, మేము స్వర్గములో ఉన్నామని వారు భావిస్తారు. ఎంత మందబుద్ధి కలవారిగా ఉన్నారు. ప్రతి విషయములో బాబా చెప్తున్నారు అని చెప్పండి. ఈ హఠయోగులు మీకేమైనా ముక్తిని ఇవ్వగలరా. సర్వుల సద్గతిదాత ఒక్కరే అయినప్పుడు మళ్ళీ గురువులను ఎందుకు ఆశ్రయిస్తున్నారు? మీరు సన్యాసులుగా అవ్వాలనుకుంటున్నారా లేక హఠయోగము నేర్చుకొని బ్రహ్మములో లీనమవ్వాలనుకుంటున్నారా? ఈ విధంగా ఎవరూ లీనమవ్వలేరు. అందరూ పాత్రను అభినయించాల్సిందే. పాత్రధారులు అందరూ అవినాశీ. ఇది అనాది అవినాశీ డ్రామా, మోక్షము ఎవరికీ లభించదు. తండ్రి అంటారు - నేను ఈ సాధువులను కూడా ఉద్ధరించేందుకు వస్తాను. మరి గంగ పతితపావని ఎలా అవుతుంది. పతితపావనా అని మీరు నన్ను అంటారు కదా. మీకు నాతో యోగము తెగిపోయిన కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ నాతో యోగము జోడించినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ముక్తిధామములో పవిత్ర ఆత్మలు ఉంటారు. ఇప్పుడైతే మొత్తం ప్రపంచమంతా పతితముగా ఉంది. పావన ప్రపంచము గురించి మీకు తెలియనే తెలియదు. మీరందరూ పూజారులు, పూజ్యులు ఒక్కరు కూడా లేరు. మీరు బాబా పేరు తీసుకుని అందరినీ మేల్కొలపవచ్చు. విశ్వానికి యజమానిగా తయారుచేసే తండ్రిని మీరు కూర్చుని నిందిస్తున్నారు. శ్రీకృష్ణుడు చిన్న బాలుడు, సర్వగుణ సంపన్నుడు, వారు కూర్చొని ఇటువంటి పని ఎలా చేయగలరు. అలాగే శ్రీకృష్ణుడు అందరికీ తండ్రి ఎలా అవ్వగలరు. భగవంతుడు ఒక్కరే ఉంటారు కదా. ఎప్పటివరకైతే నా శ్రీమతముపై నడవరో, మరి తుప్పు ఎలా తొలగుతుంది. మీరు అందరినీ పూజిస్తూ ఉండడం వలన మీ పరిస్థితి ఎలా అయిపోయింది, అందుకే నేను మళ్ళీ రావలసి వస్తుంది. మీరు ఎంతగా ధర్మభ్రష్టులుగా, కర్మభ్రష్టులుగా అయిపోయారు. హిందూ ధర్మాన్ని ఎవరు, ఎప్పుడు స్థాపించారో చెప్పండి? ఈ విధంగా సవాలు చేస్తూ భాషణ చేయండి. మీకు ఘడియ-ఘడియ తండ్రి స్మృతి కలగడమే లేదు. మాలోకి బాబా వచ్చి భాషణ చేసినట్లుగా అనిపించిందని అప్పుడప్పుడు కొందరు వ్రాస్తారు. బాబా చాలా సహాయము చేస్తూ ఉంటారు. మీరు స్మృతి యాత్రలో ఉండరు అందుకే చీమ మార్గపు సేవ చేస్తున్నారు (నెమ్మదిగా సేవ చేస్తున్నారు). బాబా పేరు తీసుకున్నప్పుడే ఎవరికైనా బాణము తగులుతుంది. బాబా అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, మీరే ఆల్ రౌండ్ 84 జన్మల చక్రాన్ని తిరిగారు కావున మీకే వచ్చి అర్థం చేయించాల్సి ఉంటుంది. నేను భారత్ లోనే వస్తాను. ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో, వారే పూజారులుగా అవుతారు. నేను పూజ్యునిగా, పూజారిగా అవ్వను.
‘‘బాబా చెప్తున్నారు, బాబా చెప్తున్నారు’’ అని పదే-పదే అంటూ ఉండాలి. మీరు ఈ విధంగా భాషణ చేసారని నేను విన్నప్పుడు, మీరు చీమల నుండి పురుగులుగా అయ్యారని భావిస్తాను. తండ్రి అంటారు - నేను మిమ్మల్ని చదివిస్తున్నాను, మీరు కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి. నన్ను స్మృతి చేయండి అని మాత్రమే ఈ రథము ద్వారా నేను మీకు చెప్తాను. రథాన్ని స్మృతి చేయకూడదు. బాబా ఇలా చెప్తారు, బాబా ఇది అర్థము చేయిస్తారు, అని ఈ విధంగా మీరు చెప్పండి, అప్పుడు మీ ప్రభావము ఎంతగా వెలువడుతుందో చూడండి. తండ్రి అంటారు, దేహ సహితంగా అన్ని సంబంధాల నుండి బుద్ధియోగాన్ని తెంచండి. మీ దేహాన్ని కూడా వదిలితే ఇక మిగిలేది ఆత్మ. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. చాలా మంది - ‘‘అహమ్ బ్రహ్మస్మి’’, మాయకు మేము యజమానులము అని అంటారు. తండ్రి అంటారు, మాయ అని దేనిని అంటారు మరియు సంపద అని దేనిని అంటారో కూడా మీకు తెలియదు. మీరు ధనాన్ని మాయ అని అంటారు. ఈ విధంగా మీరు అర్థం చేయించవచ్చు. చాలా మంచి-మంచి పిల్లలు కూడా మురళిని చదవరు. తండ్రిని స్మృతి చేయకపోతే బాణము తగలదు ఎందుకంటే స్మృతిబలము లభించదు. స్మృతి ద్వారా బలము లభిస్తుంది. ఈ యోగబలము ద్వారా మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. పిల్లలూ, ప్రతి విషయములో బాబా పేరును తీసుకుంటూ ఉండండి, అప్పుడు ఎవరూ ఏమీ అనలేరు. సర్వులకు భగవంతుడు తండ్రి ఒక్కరేనా లేక అందరూ భగవంతులేనా? మేము ఫలానా సన్యాసి యొక్క అనుచరులము అని అంటారు. ఇప్పుడు, వారు సన్యాసులు మరియు మీరు గృహస్థులు, మరి మీరు అనుచరులు ఎలా అవుతారు? అసత్యపు మాయ, అసత్యపు శరీరము, ప్రపంచమంతా అసత్యము అని కూడా అంటూ ఉంటారు. సత్యమైనవారు ఒక్క తండ్రి మాత్రమే. వారు రానంత వరకు మనము సత్యమైనవారిగా అవ్వలేము. ముక్తి-జీవన్ముక్తిదాత ఒక్కరే. వారికి చెందినవారిగా అవ్వడానికి మిగిలినవారు ఎవరూ ముక్తిని ఇవ్వలేరు. బాబా అంటారు, ఇది కూడా డ్రామాలో ఉంది. ఇప్పుడు అప్రమత్తమై కళ్ళు తెరవండి. బాబా ఇలా చెప్తున్నారు, అని చెప్పడము వలన మీరు విముక్తులవుతారు. మీ గురించి ఎవరూ తప్పుగా మాట్లాడరు. త్రిమూర్తి శివబాబా అని అనాలి, కేవలం శివ అని అనకూడదు. త్రిమూర్తులను ఎవరు రచించారు? బ్రహ్మా ద్వారా స్థాపన ఎవరు చేయిస్తారు? బ్రహ్మా సృష్టికర్తనా? ఈ విధంగా నషాతో మాట్లాడండి, అప్పుడు ఏదైనా చేయగలరు. లేదంటే దేహాభిమానములో ఉంటూ భాషణ చేసినట్లు అవుతుంది.
తండ్రి అర్థం చేయిస్తారు, ఇది అనేక ధర్మాల కల్పవృక్షము. మొట్టమొదటిది దేవీ-దేవతా ధర్మము. ఇప్పుడు ఆ దేవతా ధర్మము ఎక్కడుంది? లక్షల సంవత్సరాలని అంటారు, ఇది 5 వేల సంవత్సరాల విషయము. మీరు వారి మందిరాలను కూడా తయారుచేస్తూ ఉంటారు. పాండవులకు మరియు కౌరవులకు యుద్ధము జరిగింది, పాండవులు పర్వతాలపై కరిగిపోయి మరణించారు అని చూపిస్తారు, ఆ తర్వాత ఏమి జరిగింది? నేను ఎలా హింస చేస్తాను. నేను మిమ్మల్ని అహింసక వైష్ణవులుగా తయారుచేస్తాను. కామ ఖడ్గాన్ని నడిపించకూడదు, అటువంటివారినే వైష్ణవులు అని అంటారు. వారు విష్ణు వంశావళికి చెందినవారు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు అహంకారాన్ని వదిలి ప్రతి విషయంలో బాబా పేరును తీసుకోవాలి. స్మృతిలో ఉంటూ సేవ చేయాలి. పరచింతనలో మీ సమయాన్ని వృధా చేసుకోకూడదు.
2. సత్యాతి-సత్యమైన వైష్ణవులుగా అవ్వాలి. ఎటువంటి హింస చేయకూడదు. దేహ సహితంగా అన్ని సంబంధాల నుండి బుద్ధియోగాన్ని తొలగించాలి.
| వరదానము:- |
‘హాజీ’ పాఠము ద్వారా సేవలలో మహాన్ గా అయ్యే సర్వుల ఆశీర్వాదాలకు పాత్రులుగా కండి ఏ సేవనైనా సంతోషముతో మరియు ఉల్లాసముతో చేస్తున్నప్పుడు సదా ఏ అటెన్షన్ ఉండాలంటే - ఏ సేవ అయినా అందులో సర్వుల ఆశీర్వాదాలు ప్రాప్తించాలి ఎందుకంటే ఎక్కడైతే ఆశీర్వాదాలు ఉంటాయో అక్కడ శ్రమ ఉండదు. ఎవరి సంపర్కములోకి వచ్చినా, వారి ఆశీర్వాదాలను తీసుకుంటూ ఉండాలి అన్న లక్ష్యమే ఇప్పుడు ఉండాలి. ‘హాజీ’ అన్న పాఠమే ఆశీర్వాదాలను తీసుకునేందుకు సాధనము. ఎవరైనా రాంగ్ అయినా కానీ వారిని రాంగ్ అంటూ పడేసేందుకు బదులుగా సహయోగాన్ని అందించి వారిని నిలబెట్టండి. సహయోగులుగా అవ్వండి. అప్పుడు దాని ద్వారా కూడా సంతుష్టత అనే ఆశీర్వాదాలు లభిస్తాయి. ఎవరైతే ఆశీర్వాదాలను తీసుకోవడములో మహాన్ గా అవుతారో వారు స్వతహాగానే మహాన్ గా అవుతారు. |
| స్లోగన్:- | హార్డ్ వర్కర్ గా (కష్టపడేవారిగా) అవ్వడముతో పాటు మీ స్థితిని కూడా హార్డ్ గా (శక్తిశాలిగా) తయారుచేసుకునే లక్ష్యాన్ని పెట్టుకోండి. |
అవ్యక్త సూచనలు - స్వయము కొరకు మరియు సర్వుల కొరకు మనసు ద్వారా యోగ శక్తులను ప్రయోగము చెయ్యండి
యోగ ప్రయోగము అనగా మీ శుద్ధ సంకల్పాల ప్రయోగాన్ని తనువుపై, మనసుపై, సంస్కారాలపై అనుభవము చేస్తూ ముందుకు వెళ్తూ ఉండండి, ఈ విషయములో ఇతరులను చూడకండి. వీరేమి చేస్తున్నారు, వారు చెయ్యటము లేదు, పాతవారు చేస్తున్నారా లేదా అని చూడకండి. ముందుగా నేను ఈ అనుభవములో ముందుకు రావాలి ఎందుకంటే ఇది స్వయము యొక్క ఆంతరిక పురుషార్థానికి సంబంధించిన విషయము. ఎప్పుడైతే ఈ విధంగా వ్యక్తిగత రూపములో ఈ ప్రయోగములో నిమగ్నమవుతారో, వృద్ధిని పొందుతూ ఉంటారో, అప్పుడు ఒక్కొక్కరి శాంతి యొక్క శక్తి సంగఠిత రూపములో విశ్వముపై ప్రభావము చూపిస్తుంది.