తెలుగు మురళి · Brahma Kumaris

ఈరోజు మురళి · 23 డిసెంబర్, 2025

ఓం శాంతి · BapDada · 23 డిసెంబర్, 2025

ఈరోజు మురళి — today murli telugu, every morning.

18
మురళి23 డిసెంబర్, 2025 · తెలుగు
0:00--:--

పాఠ్యాన్ని ఎంచుకోండి → హైలైట్ / బాక్స్ / అండర్‌లైన్

23-12-2025
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
మధువనం

‘‘మధురమైన పిల్లలూ - ఏ సంకల్పాలైతే ఈశ్వరీయ సేవార్థము నడుస్తాయో, వాటిని శుద్ధ సంకల్పాలు లేక నిస్సంకల్పాలనే అంటారు, అవి వ్యర్థమైనవి కావు’’
ప్రశ్న:- వికర్మల నుండి రక్షింపబడేందుకు ఏ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ కూడా అనాసక్తులుగా ఉండాలి?
జవాబు:- మిత్ర-సంబంధీకుల సేవ చేయండి, కానీ అలౌకిక ఈశ్వరీయ దృష్టితో చేయండి, వారి పట్ల మోహపు బంధము ఉండకూడదు. ఒకవేళ ఏదైనా వికారీ సంబంధముతో సంకల్పము కలిగినా కూడా అది వికర్మగా అయిపోతుంది, అందుకే అనాసక్తులుగా అయి కర్తవ్యాన్ని నిర్వర్తించండి. ఎంత వీలైతే అంత దేహీ-అభిమానులుగా ఉండే పురుషార్థము చేయండి.

ఓంశాంతి. ఈ రోజు పిల్లలైన మీకు సంకల్పాలు, వికల్పాలు, నిస్సంకల్పాలు మరియు కర్మ, అకర్మ, వికర్మలను గురించి అర్థం చేయించడము జరుగుతుంది. ఎప్పటివరకైతే మీరు ఇక్కడ ఉంటారో, అప్పటివరకు మీకు సంకల్పాలు తప్పకుండా నడుస్తూనే ఉంటాయి. సంకల్పాలను ధారణ చేయకుండా ఏ మనిషీ ఒక్క క్షణము కూడా ఉండలేరు. ఇప్పుడు ఈ సంకల్పాలు అనేవి ఇక్కడ కూడా నడుస్తాయి, సత్యయుగములో కూడా నడుస్తాయి మరియు అజ్ఞాన కాలములో కూడా నడుస్తాయి, కానీ జ్ఞానములోకి వచ్చిన తర్వాత సంకల్పాలు, సంకల్పాలు కావు, ఎందుకంటే మీరు ఈశ్వరీయ సేవార్థము నిమిత్తముగా అయ్యారు, కావున యజ్ఞము కోసం ఏ సంకల్పాలైతే నడుస్తాయో, ఆ సంకల్పాలు, సంకల్పాలు కావు, అవి నిస్సంకల్పాలే అవుతాయి. ఇకపోతే అనవసరమైన సంకల్పాలు ఏవైతే నడుస్తాయో అనగా కలియుగీ ప్రపంచము గురించి, కలియుగీ మిత్ర-సంబంధీకుల గురించి ఏవైతే సంకల్పాలు నడుస్తాయో, వాటిని వికల్పాలు అని అంటారు, వాటి వల్లనే వికర్మలు జరుగుతాయి మరియు వికర్మల ద్వారా దుఃఖము ప్రాప్తిస్తుంది. ఇకపోతే యజ్ఞము గురించి గాని లేక ఈశ్వరీయ సేవ గురించి గాని ఏవైతే సంకల్పాలు నడుస్తాయో, అవి నిస్సంకల్పాలుగా అవుతాయి. సేవ కోసం శుద్ధ సంకల్పాలు నడవచ్చు. చూడండి, పిల్లలైన మిమ్మల్ని సంభాళించేందుకని బాబా ఇక్కడ కూర్చున్నారు. పిల్లల సేవ చేయడము కోసమని మాతా-పితల సంకల్పాలు తప్పకుండా నడుస్తాయి. కానీ ఆ సంకల్పాలు, సంకల్పాలు కావు, వాటి ద్వారా వికర్మలు తయారవ్వవు, కానీ ఒకవేళ ఏదైనా వికారీ సంబంధముతో సంకల్పము నడుస్తే ఆ సంకల్పాలకు వికర్మ తప్పకుండా తయారవుతుంది.

బాబా పిల్లలైన మీకు చెప్తున్నారు - మీరు మిత్ర-సంబంధీకుల సేవ చేయండి కానీ అలౌకిక ఈశ్వరీయ దృష్టితో చేయండి. మోహపు బంధము ఉండకూడదు. అనాసక్తులుగా అయి మీ కర్తవ్యాన్ని పాలన చేయండి. కానీ ఎవరైనా ఇక్కడ ఉంటూ, కర్మ సంబంధములో ఉంటూ, వాటిని తెంచుకోలేకపోతే, అయినా సరే వారు పరమాత్మను విడిచిపెట్టకూడదు. వారి చేతిని పట్టుకుని ఉన్నట్లయితే ఏదో ఒక పదవిని ప్రాప్తి చేసుకుంటారు. నాలో ఏ వికారము ఉంది అన్నదైతే ప్రతి ఒక్కరికీ స్వయము గురించి తెలుసు. ఒకవేళ ఎవరిలోనైనా ఒక్క వికారము ఉన్నా కానీ వారు తప్పకుండా దేహాభిమానులే, ఎవరిలోనైతే వికారాలు లేవో వారు దేహీ-అభిమానులు. ఎవరిలో ఏ వికారము ఉన్నా సరే, వారు శిక్షలు తప్పకుండా అనుభవిస్తారు మరియు ఎవరిలోనైతే వికారాలు లేవో వారు శిక్షల నుండి విముక్తులైపోతారు. ఉదాహరణకు కొంతమంది పిల్లలు ఉన్నారు, వారిలో కామము లేదు, క్రోధము లేదు, లోభము లేదు, మోహము లేదు... వారు సేవను చాలా బాగా చేయగలరు. ప్రస్తుతము వారి అవస్థ చాలా జ్ఞాన-విజ్ఞానమయముగా ఉంది. వారికి మీరందరూ కూడా ఓటు వేస్తారు. ఇప్పుడు ఈ విషయము గురించి ఏ విధముగా నాకు తెలుసో, అలాగే పిల్లలైన మీకు కూడా తెలుసు. మంచివారిని అందరూ మంచివారు అనే అంటారు, ఎవరిలోనైనా ఏదైనా లోపముంటే అందరూ వారికి ఆ ఓటే వేస్తారు. ఎవరిలోనైనా ఏవైనా వికారాలు ఉంటే వారు సేవ చేయలేరు అన్నది ఇప్పుడు నిశ్చయము చేసుకోండి. ఎవరైతే వికారాల ప్రూఫ్ గా (వికారాలు లేనివారిగా) ఉంటారో, వారు సేవ చేసి ఇతరులను తమ సమానముగా తయారుచేయగలుగుతారు, అందుకే వికారాలపై పూర్తి విజయము పొందాలి, వికల్పాలపై పూర్తి విజయము పొందాలి. ఈశ్వరార్థము చేసిన సంకల్పాలను నిస్సంకల్పాలని అనవచ్చు. వాస్తవానికి నిస్సంకల్పత అని దేనిని అంటారంటే, సంకల్పాలు నడవనే నడవకూడదు, సుఖ-దుఃఖాల నుండి అతీతముగా అవ్వాలి. అది అంతిమములో ఎప్పుడైతే మీరు లెక్కాచారాలను తీర్చుకుని వెళ్తారో అప్పుడు, అక్కడ సుఖ-దుఃఖాలకు అతీతమైన ఆ అవస్థలో మీకు ఎటువంటి సంకల్పాలు నడవవు. ఆ సమయములో కర్మ-అకర్మ, ఈ రెండింటికీ అతీతమైన అకర్మీ అవస్థలో ఉంటారు.

ఇక్కడ మీకు సంకల్పాలు తప్పకుండా నడుస్తాయి ఎందుకంటే మీరు ఈ మొత్తము ప్రపంచమంతటినీ శుద్ధముగా చేయడానికి నిమిత్తముగా అయ్యారు, దాని కోసం మీకు శుద్ధ సంకల్పాలు తప్పకుండా నడుస్తాయి. సత్యయుగములో శుద్ధ సంకల్పాలు నడుస్తాయి కావున ఆ సంకల్పాలు, సంకల్పాలు కావు, కర్మలు చేస్తున్నా కూడా కర్మ బంధనాలు ఏర్పడవు. అర్థమయ్యిందా? ఇప్పుడు కర్మ, అకర్మ, వికర్మల గతి గురించైతే తండ్రియే అర్థం చేయించగలరు. వారే వికర్మల నుండి విడిపించేవారు, వారు ఈ సంగమములో మిమ్మల్ని చదివిస్తున్నారు, అందుకే పిల్లలూ, మీపై మీరు చాలా అటెన్షన్ ఉంచండి. మీ లెక్కాచారాలను కూడా చూసుకుంటూ ఉండండి. మీరు లెక్కాచారాలను సమాప్తము చేసుకునేందుకని ఇక్కడకు వచ్చారు. ఇక్కడకు వచ్చి కూడా లెక్కాచారాలను తయారుచేసుకుంటూ ఉంటే ఇక శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. గర్భజైలులోని శిక్షలు తక్కువైనవేమీ కాదు. అందుకే ఎంతో పురుషార్థము చేయాలి. ఈ గమ్యము చాలా గొప్పది, అందుకే జాగ్రత్తగా నడుచుకోవాలి. వికల్పాలపై తప్పకుండా విజయము పొందాలి. ప్రస్తుతము మీరు ఎంతవరకు వికల్పాలపై విజయము పొందారు, ఎంతవరకు ఈ నిస్సంకల్ప అవస్థలో అనగా సుఖ-దుఃఖాల నుండి అతీతమైన అవస్థలో ఉంటారు - ఇది మీకు మీరే తెలుసుకుంటూ ఉండండి. ఎవరైతే స్వయాన్ని అర్థం చేసుకోలేరో వారు మమ్మా-బాబాను అడుగవచ్చు ఎందుకంటే మీరు వారికి వారసులు కనుక వారు మీకు తెలియజేయగలరు.

నిస్సంకల్ప అవస్థలో ఉండటముతో మీరు మీ వికర్మలనే కాదు, ఎటువంటి వికారీ వ్యక్తుల యొక్క వికర్మలనైనా కూడా అణిచివేయగలరు. కామముతో ఉన్న పురుషుడు ఎవరైనా మీ ముందుకు వచ్చినా కానీ అతనికి వికారీ సంకల్పాలు నడవవు. ఎలాగైతే ఎవరైనా దేవతల వద్దకు వెళ్ళినప్పుడు వారి ఎదురుగా వాళ్ళు శాంతిగా అయిపోతారో, అదే విధముగా మీరు కూడా గుప్త రూపములో ఉన్న దేవతలు. మీ ఎదురుగా కూడా ఎవ్వరి వికారీ సంకల్పాలు నడవవు. కానీ కామానికి వశమైన పురుషులు ఎంతోమంది ఉన్నారు, వారికి ఒకవేళ అటువంటి సంకల్పాలు కలిగినా కానీ మీరు ఒకవేళ యోగయుక్తముగా నిలబడినట్లయితే, వారు మీపై దాడి చేయలేరు.

చూడండి పిల్లలూ, మీరు పరమాత్మకు వికారాల ఆహుతిని ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చారు, కానీ కొందరు ప్రస్తుతము ఇంకా నియమానుసారముగా ఆహుతిని ఇవ్వలేదు. వారి యోగము పరమపితతో జోడించబడి లేదు. రోజంతా బుద్ధియోగము భ్రమిస్తూ ఉంటుంది అనగా వారు దేహీ-అభిమానులుగా అవ్వలేదు. దేహాభిమానులుగా ఉండటము వలన ఎవరో ఒకరి స్వభావము యొక్క ప్రభావములోకి వచ్చేస్తారు, దాని వలన పరమాత్మునితో ప్రీతిని నిర్వర్తించలేరు, అనగా పరమాత్ముని కోసం సేవ చేయడానికి అధికారులుగా అవ్వలేరు. కావున ఎవరైతే పరమాత్మ నుండి సేవ తీసుకుని మళ్ళీ సేవ చేస్తున్నారో అనగా పతితులను పావనముగా తయారుచేస్తున్నారో, వారే నా సత్యమైన పక్కా పిల్లలు. వారికి చాలా గొప్ప పదవి లభిస్తుంది.

ఇప్పుడు పరమాత్మ స్వయముగా వచ్చి మీకు తండ్రిగా అయ్యారు. సాధారణ రూపములో వచ్చిన ఆ తండ్రిని తెలుసుకోకుండా, వేరే ఏ రకమైన సంకల్పాలనైనా ఉత్పన్నము చేయడమంటే అది వినాశనము పొందడమే. ఇప్పుడు ఎటువంటి సమయము వస్తుందంటే, 108 జ్ఞాన గంగలు పూర్ణ అవస్థను ప్రాప్తి చేసుకుంటారు. ఇకపోతే ఎవరైతే చదవకుండా ఉంటారో వారు తమను తామే నాశనము చేసుకుంటారు.

ఈ ఈశ్వరీయ యజ్ఞములో ఎవరైతే దాక్కుని పనులు చేస్తారో, వారిని జానీ జానన్ హార్ బాబా (అన్నీ తెలిసిన బాబా) చూసేస్తారు అన్నది ఖచ్చితముగా తెలుసుకోండి. అటువంటివారిని సావధానపరిచేందుకని, ఆ బాబా సాకార స్వరూపములో ఉన్న మన బాబాను టచ్ చేస్తారు. కావున ఏ విషయాన్నీ దాచి పెట్టకూడదు. పొరపాట్లు జరుగుతాయి కానీ వారికి తెలియజేస్తేనే భవిష్యత్తు కోసం రక్షింపబడతారు, అందుకే పిల్లలూ, జాగ్రత్తగా ఉండండి.

పిల్లలు మొట్టమొదట - నేను ఎవరిని, వాట్ ఏమ్ ఐ (నేను ఏమిటి) అని స్వయాన్ని అర్థం చేసుకోవాలి. ‘‘నేను’’ అని శరీరాన్ని అనరు, ‘‘నేను’’ అని ఆత్మను అంటారు. ఆత్మనైన నేను ఎక్కడ నుండి వచ్చాను? నేను ఎవరి సంతానాన్ని? ఆత్మనైన నేను పరమపిత పరమాత్ముని సంతానాన్ని అని ఆత్మకు ఎప్పుడైతే తెలుస్తుందో, అప్పుడు తన తండ్రిని స్మృతి చేయడముతో సంతోషము కలుగుతుంది. బిడ్డ తన తండ్రి కర్తవ్యాన్ని తెలుసుకున్నప్పుడు అతడికి సంతోషము కలుగుతుంది. ఎప్పటివరకైతే చిన్నవారిగా ఉంటారో, అప్పటివరకు తండ్రి కర్తవ్యము గురించి తెలియదు, అప్పటివరకు అంత సంతోషము ఉండదు. పెద్దవాడిగా అయ్యే కొద్దీ తండ్రి కర్తవ్యము గురించి తెలుస్తూ ఉంటుంది, అప్పుడు ఆ నషా, ఆ సంతోషము పెరుగుతూ ఉంటుంది. కావున మొదటగా - మా బాబా ఎవరు, వారు ఎక్కడ ఉంటారు అని వారి కర్తవ్యము గురించి తెలుసుకోవాలి. ఒకవేళ ఆత్మ వారిలో లీనమైపోతుంది అని అంటే ఇక ఆత్మ వినాశీ అయినట్లు, కావున ఎవరికి సంతోషము కలుగుతుంది.

మీ వద్దకు కొత్తగా ఎవరైనా జిజ్ఞాసువులు వస్తే, వారిని - ఇక్కడ మీరు ఏం చదువుకుంటారు, దీని వలన ఏ హోదా లభిస్తుంది అని అడగాలి. ఆ కాలేజీలలో చదువుకునేవారు - మేము డాక్టర్లుగా అవుతున్నాము, ఇంజనీర్లుగా అవుతున్నాము... అని చెప్తారు, అప్పుడు వారు తప్పకుండా చదువుకుంటున్నారని నమ్మకము కలుగుతుంది కదా. ఇక్కడ కూడా విద్యార్థులు ఏమని చెప్తారంటే - ఇది దుఃఖపు ప్రపంచము, దీనిని నరకము, హెల్ లేక ఆసురీ ప్రపంచము అని అంటారు. దీనికి భిన్నముగా హెవెన్ లేక దైవీ ప్రపంచము ఉంటుంది, దానిని స్వర్గమని అంటారు. ఇది ఆ స్వర్గము కాదు, ఇది నరకము మరియు దుఃఖపు ప్రపంచము, పాపాత్ముల ప్రపంచము అని అందరికీ తెలుసు, అందరూ అర్థం కూడా చేసుకోగలరు. అందుకే వారిని పిలుస్తూ ఉంటారు - మమ్మల్ని పుణ్య ప్రపంచములోకి తీసుకువెళ్ళండి అని. కావున పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో, వారికి తెలుసు - బాబా మమ్మల్ని ఆ పుణ్య ప్రపంచములోకి తీసుకువెళ్తున్నారు అని. కొత్త విద్యార్థులు ఎవరైతే వస్తారో, వారు ఇక్కడ ఉన్న పిల్లలను అడగాలి, పిల్లల నుండి చదువుకోవాలి. అప్పుడు పిల్లలు తమ టీచర్ లేక తండ్రి యొక్క కర్తవ్యాన్ని గురించి తెలియజేయగలరు. తండ్రి కూర్చుని స్వయముగా వారి మహిమను వారే చేసుకోరు, టీచర్ తన గొప్పతనాన్ని తానే వినిపించుకుంటారా ఏమిటి! ఈ టీచర్ ఇటువంటివారు అని విద్యార్థులు వినిపిస్తారు, అప్పుడు విద్యార్థులు మాస్టరుగారిని ప్రత్యక్షము చేస్తారని అంటారు. పిల్లలైన మీరు ఇంత కోర్స్ చదువుకుని వచ్చారు, మీ పని కొత్తవారికి కూర్చుని అర్థం చేయించడము. అంతేకానీ బి.ఎ, ఎమ్.ఎ. చదువును చదివించే టీచర్లు కూర్చుని కొత్త విద్యార్థులకు ఎ, బి, సి... లు నేర్పిస్తారా ఏమిటి! కొందరు విద్యార్థులు మంచి తెలివైనవారిగా ఉంటారు, వారు ఇతరులను కూడా చదివిస్తారు. అందులో మాతా గురువైతే ప్రసిద్ధమైనవారు. వీరు దైవీ ధర్మానికి చెందిన మొదటి మాత, వీరిని జగదంబ అని అంటారు. మాతకు చాలా మహిమ ఉంది. బెంగాల్ లో కాళీ, దుర్గ, సరస్వతి మరియు లక్ష్మీ - ఈ నలుగురు దేవీలకు చాలా పూజలు చేస్తారు. ఇప్పుడు ఆ నలుగురి కర్తవ్యాలేమిటో తెలియాలి. ఉదాహరణకు లక్ష్మి గాడెస్ ఆఫ్ వెల్త్ (ధన దేవి). ఆమె ఇక్కడే రాజ్యము చేసి వెళ్ళారు. ఇకపోతే కాళీ, దుర్గ మొదలైన పేర్లన్నీ వీరికి చెందినవే. ఒకవేళ నలుగురు మాతలు ఉంటే వారికి నలుగురు పతులు కూడా ఉండాలి కదా. ఇప్పుడు లక్ష్మికి పతి నారాయణుడు అన్నది అందరికీ తెలిసిన విషయమే. కాళీకి పతి ఎవరు? (శంకరుడు) కానీ శంకరుడిని పార్వతికి పతి అని అంటారు. పార్వతి ఏమీ కాళీ కాదు. కాళీని పూజించేవారు చాలామంది ఉన్నారు, కాళీ మాత అని మాతను తలచుకుంటారు కానీ పిత గురించి తెలియదు. కాళీకి పతి అన్నా ఉండాలి లేక పిత అన్నా ఉండాలి, కానీ అది ఎవ్వరికీ తెలియదు.

మీరు అందరికీ అర్థం చేయించాలి - ప్రపంచము ఇదొక్కటే, ఇదే ఒకసారి దుఃఖపు ప్రపంచముగా, నరకముగా అవుతుంది, ఇదే మళ్ళీ సత్యయుగములో స్వర్గముగా అవుతుంది. లక్ష్మీ-నారాయణులు కూడా ఇదే సృష్టిపై సత్యయుగము ఉన్నప్పుడు రాజ్యము చేసేవారు. అంతేకానీ సూక్ష్మ రూపములోని లక్ష్మీ-నారాయణులు ఉన్నటువంటి సూక్ష్మ వైకుంఠమేమీ లేదు. వారి చిత్రాలు ఇక్కడే ఉన్నాయి కావున వారు తప్పకుండా ఇక్కడే రాజ్యము చేసి వెళ్ళారు. ఆట అంతా ఈ స్థూల ప్రపంచములోనే నడుస్తుంది. చరిత్ర-భౌగోళికాలు ఈ స్థూల ప్రపంచానికి చెందినవే. సూక్ష్మవతనానికి చరిత్ర-భౌగోళికాలేవీ ఉండవు. కానీ ఈ విషయాలన్నింటినీ వదిలి మీరు కొత్తగా వచ్చిన జిజ్ఞాసువులకు మొదట భగవంతుని గురించి నేర్పించాలి, ఆ తర్వాత రాజ్యాధికార వారసత్వము గురించి అర్థం చేయించాలి. భగవంతుడు అనగా గాడ్, వారు సుప్రీమ్ సోల్ (పరమాత్మ). ఎంతవరకైతే ఇది పూర్తిగా అర్థం చేసుకోరో అంతవరకు పరమపిత పట్ల ఆ ప్రేమ జాగృతమవ్వదు, ఆ సంతోషము కలగదు ఎందుకంటే మొదట ఎప్పుడైతే తండ్రిని తెలుసుకుంటారో, అప్పుడు వారి కర్తవ్యము గురించి కూడా తెలుసుకుని సంతోషములోకి వస్తారు. కావున ఈ మొదటి విషయాన్ని అర్థం చేసుకోవడములోనే సంతోషము ఉంది. భగవంతుడు అయితే సదా సంతోషముగా ఉంటారు, వారు ఆనంద స్వరూపుడు. మనము వారి పిల్లలము కావున మనకెందుకు ఆ సంతోషముండకూడదు! ఆ ఆనందముతో కూడిన పులకరింపు ఎందుకు కలగదు! ఐ ఆమ్ సన్ ఆఫ్ గాడ్ (నేను భగవంతుని కుమారుడిని), ఐ ఆమ్ ఎవర్ హ్యాపీ మాస్టర్ గాడ్ (నేను సదా సంతోషముగా ఉండే మాస్టర్ భగవంతుడిని). ఆ సంతోషము కలగపోతే స్వయాన్ని భగవంతుని కుమారునిగా భావించడము లేదు అన్నది ఋజువు అవుతుంది. గాడ్ ఈజ్ ఎవర్ హ్యాపీ బట్ ఐ ఆమ్ నాట్ హ్యాపీ (భగవంతుడు సదా సంతోషముగా ఉంటారు కానీ నేను సంతోషముగా లేను), ఎందుకంటే తండ్రి గురించి తెలియదు. విషయమైతే సహజమైనదే.

కొందరికి ఈ జ్ఞానము వినడము కంటే శాంతి మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే జ్ఞానాన్ని తీసుకోనే తీసుకోలేనివారు చాలామంది ఉన్నారు. అంత సమయము ఎక్కడ ఉంది. కేవలం భగవంతుడిని తెలుసుకుని సైలెన్స్ లో ఉన్నా అది కూడా మంచిదే. ఏ విధముగా సన్యాసులు కూడా కొండలలోని గుహలలోకి వెళ్ళి పరమాత్ముని స్మృతిలో కూర్చుంటారో, అలా పరమపిత పరమాత్ముని స్మృతిలో, ఆ సుప్రీమ్ లైట్ స్మృతిలో ఉన్నా మంచిదే. వారి స్మృతితో సన్యాసులు కూడా నిర్వికారులుగా అవ్వగలరు. కానీ ఇంటిలో కూర్చుని ఉంటే స్మృతి చేయలేకపోతారు. అక్కడైతే పిల్లల పట్ల మోహము వెళ్తూ ఉంటుంది, అందుకే కదా వారు సన్యసిస్తారు. పవిత్రముగా అయితే అందులో సుఖము ఉంటుంది కదా. సన్యాసులు అందరికంటే మంచివారు. ఆదిదేవ్ కూడా సన్యాసిగా అయ్యారు కదా. ఎదురుగా వారి (ఆదిదేవ్) మందిరము ఉంది, అక్కడ తపస్య చేస్తున్నారు. గీతలో కూడా - దేహ ధర్మాలన్నింటినీ సన్యసించండి అని అంటారు. వారు సన్యసించి వెళ్ళి మహాత్ములుగా అవుతారు. గృహస్థులను మహాత్ములు అని అనడము నియమవిరుద్ధము. మీ చేత అయితే పరమాత్మయే వచ్చి సన్యాసము చేయించారు. సన్యాసము చేసేది సుఖము కోసమే. మహాత్ములు ఎప్పుడూ దుఃఖితులుగా అవ్వరు. రాజులు కూడా సన్యసించినప్పుడు తమ కిరీటము మొదలైనవి విసిరేస్తారు. ఉదాహరణకు గోపిచంద్ రాజు సన్యసించారు కదా, కనుక తప్పకుండా అందులో సుఖముంది. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. దాక్కుని ఎటువంటి తప్పుడు కర్మలను చేయకూడదు. బాప్ దాదా నుండి ఏ విషయాన్ని దాచి పెట్టకూడదు. చాలా-చాలా జాగ్రత్తగా ఉండాలి.

2. స్టూడెంట్ షోస్ మాస్టర్ (విద్యార్థి టీచర్ ను ప్రత్యక్షము చేస్తారు). మీరు చదివినదానిని ఇతరులకు చదివించాలి. ఎవర్ హ్యాపీ గాడ్ కు పిల్లలము (సదా సంతోషముగా ఉండే భగవంతునికి పిల్లలము) అనే స్మృతితో అపారమైన సంతోషములో ఉండాలి.

వరదానము:- వికారాల రూపీ సర్పాలను కూడా పానుపుగా చేసుకునే విష్ణు సమాన సదా విజయీ, నిశ్చింత భవ
విష్ణువు యొక్క శేషశయ్యనేదైతే చూపిస్తారో, అది విజయీ పిల్లలైన మీ యొక్క సహజయోగీ జీవితానికి స్మృతిచిహ్నము. సహజయోగము ద్వారా వికారాల రూపీ సర్పాలు కూడా ఆధీనమైపోతాయి. ఏ పిల్లలైతే వికారాల రూపీ సర్పాలపై విజయాన్ని పొంది వాటిని విశ్రాంతి తీసుకునే పానుపుగా చేసుకుంటారో, వారు సదా విష్ణు సమానముగా హర్షితముగా మరియు నిశ్చింతగా ఉంటారు. కావున సదా ఈ చిత్రాన్ని మీ ఎదురుగా చూడండి - నేను వికారాలను ఆధీనము చేసుకున్న అధికారిని, ఆత్మ సదా విశ్రాంతి స్థితిలో నిశ్చింతగా ఉంది.
స్లోగన్:- బాలక మరియు యజమానత్వపు స్థితి యొక్క బ్యాలెన్స్ ద్వారా ప్లాన్ ను ప్రాక్టికల్ లోకి తీసుకురండి.

 

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు సంపన్నముగా మరియు కర్మాతీతముగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి

మీ ప్రతి కర్మేంద్రియము యొక్క శక్తికి సూచనను ఇవ్వండి, అప్పుడు సూచన ద్వారానే ఎలా కావాలంటే అలా నడిపించగలగాలి. ఇటువంటి కర్మేంద్రియజీతులుగా అవ్వండి, అప్పుడే ప్రకృతిజీతులుగా అయ్యి కర్మాతీత స్థితి యొక్క ఆసనధారుల నుండి విశ్వ రాజ్యాధికారులుగా అవుతారు. ప్రతి కర్మేంద్రియము ‘‘జీ హజూర్’’, ‘‘జీ హాజిర్’’ అంటూ నడుచుకోవాలి. రాజ్యాధికారులైన మిమ్మల్ని సదా స్వాగతించాలి అనగా సలామ్ చేస్తూ ఉండాలి, అప్పుడే కర్మాతీతులుగా అవ్వగలరు.

మురళి అంటే ఏమిటి?

మురళి బ్రహ్మకుమారీల దైనిక ఆధ్యాత్మిక బోధన, ఇది ప్రతి ఉదయం మధుబన్ నుండి ప్రచురించబడుతుంది. ఇక్కడ మీరు ఈరోజు మురళిని తెలుగులో చదవవచ్చు, ఆడియో వినవచ్చు మరియు PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధ్యయనానికి సహాయంగా పాఠ్యాన్ని హైలైట్ చేయవచ్చు — మీ గుర్తులు ఈ బ్రౌజర్‌లోనే సురక్షితంగా ఉంటాయి.

28 భాషల్లో మురళి

Daily Murli · Madhuban మూలం: మధుబన్ మురళి విభాగం ఇది స్వతంత్ర రీడర్ యాప్, అధికారిక వెబ్‌సైట్ కాదు.