| 30-12-2025 |
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
|
మధువనం |
| ‘‘మధురమైన పిల్లలూ - పాపాల నుండి తేలికగా అయ్యేందుకు విశ్వాసపాత్రులుగా, నిజాయితీపరులుగా అయి మీ కర్మల కథను తండ్రికి రాసి ఇచ్చినట్లయితే క్షమించబడతారు’’ | |
| ప్రశ్న:- | సంగమయుగములో పిల్లలైన మీరు ఏ బీజాన్ని నాటకూడదు? |
| జవాబు:- | దేహాభిమానమనే బీజము. ఈ బీజము ద్వారా అన్ని వికారాల వృక్షాలు వెలువడుతాయి. ఈ సమయంలో మొత్తం ప్రపంచంలో 5 వికారాల వృక్షాలు వెలువడ్డాయి. అందరూ కామ-క్రోధాల బీజాలను నాటుతూ ఉంటారు. మీకు తండ్రి యొక్క డైరెక్షన్ ఏమిటంటే - పిల్లలూ, యోగబలముతో పావనంగా అవ్వండి. ఈ బీజాలు నాటడము ఆపు చేయండి. |
| పాట:- | మిమ్మల్ని పొంది మేము విశ్వాన్ని పొందాము... |
ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు! ఇప్పుడైతే కొంతమంది ఉన్నారు, తర్వాత అనేకానేక మంది పిల్లలు తయారవుతారు. ఈ సమయంలో కొద్దిమంది అయిన మీరు ప్రాక్టికల్ గా తయారయ్యారు, అయినా ఈ ప్రజాపిత బ్రహ్మా గురించి అయితే అందరికీ తెలుసు కదా. వీరి పేరే ప్రజాపిత బ్రహ్మా. ఎంత మంది ప్రజలున్నారు. అన్ని ధర్మాలవారు వీరిని తప్పకుండా అంగీకరిస్తారు. వీరి ద్వారానే మనుష్యమాత్రుల రచన జరిగింది కదా. బాబా అర్థం చేయించారు, లౌకిక తండ్రి కూడా హద్దు బ్రహ్మా ఎందుకంటే వారి వంశము కూడా తయారవుతుంది కదా. ఇంటి పేరుతో వంశము కొనసాగుతుంది. వారు హద్దుకు చెందినవారు, వీరు అనంతమైన తండ్రి. వీరి పేరే ప్రజాపిత. ఆ లౌకిక తండ్రి అయితే పరిమిత ప్రజలను రచిస్తారు. కొంతమంది రచించరు కూడా. వీరైతే తప్పకుండా రచిస్తారు. ప్రజాపిత బ్రహ్మాకు సంతానము లేరా అని ఈ విధంగా ఎవరైనా అంటారా. మొత్తం ప్రపంచమంతా వీరి సంతానమే. మొట్టమొదటివారు ప్రజాపిత బ్రహ్మా. ముసల్మానులు కూడా ఆదమ్ బీబీ అని ఎవరినైతే అంటారో, అలా తప్పకుండా ఎవరో ఒకరి గురించైతే అంటూ ఉండవచ్చు కదా. ఏడమ్ ఈవ్, ఆది దేవ్, ఆది దేవి అని ఈ విధంగా ప్రజాపిత బ్రహ్మా కోసమే అంటారు. అన్ని ధర్మాలవారు ఎవరైతే ఉన్నారో, అందరూ వీరిని అంగీకరిస్తారు. తప్పకుండా ఒకరు హద్దు తండ్రి, ఇంకొకరు అనంతమైన తండ్రి. ఈ అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్ని ఇచ్చేవారు. మీరు పురుషార్థము కూడా అనంతమైన స్వర్గ సుఖాల కోసము చేస్తారు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖ వారసత్వాన్ని పొందేందుకు ఇక్కడకు వచ్చారు. స్వర్గంలో అనంతమైన సుఖము అని, నరకంలో అనంతమైన దుఃఖము అని కూడా అనవచ్చు. దుఃఖాలు కూడా ఎన్నో రానున్నాయి. అయ్యో-అయ్యో అని అంటూ ఉంటారు. తండ్రి మీకు మొత్తం విశ్వం యొక్క ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయించారు. పిల్లలైన మీరు ఎదురుగా కూర్చున్నారు మరియు పురుషార్థము కూడా చేస్తారు. వీరైతే తల్లి-తండ్రి, ఇరువురూ అయినట్లు కదా. ఎంత మంది పిల్లలు ఉన్నారు. అనంతమైన తల్లిదండ్రుల పట్ల ఎప్పుడూ ఎవ్వరూ శతృత్వాన్ని పెట్టుకోరు. తల్లిదండ్రుల నుండి ఎంత సుఖము లభిస్తుంది. నీవే తల్లివి, తండ్రివి... అని అంటూ ఉంటారు కూడా. ఇది పిల్లలు మాత్రమే అర్థం చేసుకుంటారు. ఇతర ధర్మాల వారందరూ ఫాదర్ ను మాత్రమే పిలుస్తారు. తల్లి-తండ్రి అని అనరు. కేవలం ఇక్కడ మాత్రమే నీవే తల్లివి, తండ్రివి, మేము మీ పిల్లలము... అని పాడుతారు. పిల్లలైన మీకు తెలుసు, మేము చదువుకుని మనుష్యుల నుండి దేవతలుగా, ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నాము అని. తండ్రి నావికుడు కూడా, తోట యజమాని కూడా. ఇకపోతే బ్రాహ్మణులైన మీరంతా అనేక రకాల తోటమాలులు. ముఘల్ గార్డెన్ కు కూడా తోటమాలి ఉంటారు కదా. వారి జీతము కూడా ఎంత బాగుంటుంది. మాలులు కూడా నంబరువారుగా ఉన్నారు కదా. కొంతమంది తోటమాలులు ఎంత మంచి-మంచి పుష్పాలను తయారుచేస్తారు. పుష్పాలలో ఒకటి, కింగ్ ఆఫ్ ఫ్లవర్ (రాజా పుష్పము) కూడా ఉంటుంది. సత్యయుగంలో రాజు-రాణి పుష్పాలు కూడా ఉన్నాయి కదా. ఇక్కడ మహారాజులు-మహారాణులు ఉన్నారు కానీ పుష్పాల వలె లేరు. పతితులుగా అవ్వడంతో ముళ్ళగా అయిపోతారు. మార్గంలో నడుస్తూ-నడుస్తూ ముళ్ళు గుచ్చుకుని పారిపోతారు. అజామిళ్ అని కూడా వారిని అంటారు. అందరికన్నా ఎక్కువ భక్తి మీరు చేస్తారు. వామ మార్గములో పడిపోయినవారి చిత్రాలను చూడండి, ఎంత అశుద్ధంగా తయారుచేయబడి ఉన్నాయి. దేవతల చిత్రాలనే అలా చూపించారు. ఇప్పుడు అవి వామ మార్గం యొక్క చిత్రాలు. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ విషయాలను అర్థం చేసుకున్నారు. మీరిప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు. మనము వికారాల నుండి చాలా దూరంగా వెళ్ళిపోతాము. బ్రాహ్మణులలో సోదరుడు-సోదరితో వికారాలలోకి వెళ్ళడము - ఇది చాలా పెద్ద అశుద్ధ కర్మ అవుతుంది. పేరు పాడైపోతుంది, అందుకే బాల్యము నుండే ఏవైనా తప్పుడు పనులు చేసి ఉంటే, వాటిని కూడా బాబాకు వినిపించినట్లయితే సగము క్షమించబడతాయి. అవి గుర్తుంటాయి కదా. ఫలానా సమయంలో నేను ఈ అశుద్ధమైన పని చేశాను అని. బాబాకు రాసి ఇస్తారు. ఎవరైతే చాలా విశ్వాసపాత్రులుగా, నిజాయితీపరులుగా ఉంటారో, వారు బాబాకు ఏమని రాస్తారంటే - బాబా, మేము ఈ-ఈ తప్పుడు పనులు చేశాము. క్షమించండి. తండ్రి అంటారు - క్షమాపణ అయితే ఉండదు, ఇకపోతే సత్యము చెప్పినట్లయితే అది తేలికైపోతుంది. అంతేకానీ మర్చిపోతారని కాదు. మర్చిపోలేరు. మున్ముందు మళ్ళీ అటువంటి పనులేవీ జరగకుండా, దాని గురించి అప్రమత్తం చేస్తాను. ఇకపోతే, మనస్సు తప్పకుండా తింటుంది. బాబా, మేమైతే అజామిళ్ వలె ఉండేవారము అని అంటారు. అది ఈ జన్మకు సంబంధించిన విషయమే. ఇది కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఎప్పటి నుండి వామ మార్గములోకి వచ్చి పాపాత్ములుగా అయ్యారు? ఇప్పుడు తండ్రి మళ్ళీ మనల్ని పుణ్యాత్ములుగా తయారుచేస్తారు. పుణ్యాత్ముల ప్రపంచమే వేరు. ప్రపంచము ఒక్కటే కావచ్చు కానీ రెండు భాగాలుగా ఉంటుందని అర్థం చేసుకున్నారు. ఒకటేమో పుణ్యాత్ముల ప్రపంచము, దానిని స్వర్గమని అంటారు. రెండవది పాపాత్ముల ప్రపంచము, దానిని నరకము, దుఃఖధామమని అంటారు. సుఖపు ప్రపంచము మరియు దుఃఖపు ప్రపంచము. దుఃఖపు ప్రపంచములో - మాకు ముక్తిని ఇవ్వండి, మా ఇంటికి తీసుకువెళ్ళండి అని అందరూ మొర పెట్టుకుంటూ ఉంటారు. ఇంటికి వెళ్ళి కూర్చుండిపోవడము కాదు అని కూడా పిల్లలకు అర్థం చేసుకుంటారు, మళ్ళీ పాత్రను అభినయించేందుకు రావాల్సి ఉంటుంది. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా పతితంగా ఉంది. ఇప్పుడు తండ్రి ద్వారా మీరు పావనంగా అవుతున్నారు. లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా నిలబడి ఉంది. మేము ఈ విధంగా తయారవుతున్నాము అన్న లక్ష్యము-ఉద్దేశ్యాన్ని ఇంకెవ్వరూ చూపించరు. తండ్రి అంటారు, పిల్లలూ, మీరు ఈ విధంగా ఉండేవారు, ఇప్పుడు అలా లేరు. పూజ్యులుగా ఉండేవారు, ఇప్పుడు పూజారులుగా అయిపోయారు, మళ్ళీ పూజ్యులుగా అయ్యేందుకు పురుషార్థము కావాలి. తండ్రి ఎంత మంచి పురుషార్థము చేయిస్తారు. నేను రాకుమారునిగా అవుతాను అని ఈ బాబా అనుకుంటారు కదా. వీరు నంబరువన్ లో ఉన్నారు, అయినా ప్రతి క్షణము స్మృతి నిలిచి ఉండదు. మర్చిపోతారు. ఎవరు ఎంత శ్రమ చేసినా కానీ ఇప్పుడు ఆ అవస్థ ఏర్పడదు. ఎప్పుడైతే యుద్ధము యొక్క సమయము వస్తుందో అప్పుడు కర్మాతీత అవస్థ ఏర్పడుతుంది. పురుషార్థమైతే అందరూ చేయాలి కదా. వీరు కూడా చేయాలి. మీరు అర్థం చేయిస్తారు కూడా - చిత్రంలో చూడండి, బాబా చిత్రము ఎక్కడుంది? పూర్తిగా వృక్షం చివర్లో పతిత ప్రపంచంలో నిలబడి ఉన్నారు మరియు కింద తపస్య చేస్తున్నారు. ఎంత సహజంగా అర్థం చేయించడము జరుగుతుంది. ఈ విషయాలన్నీ తండ్రియే అర్థం చేయించారు. ఇంతకుముందు వీరికి కూడా తెలియదు. తండ్రియే నాలెడ్జ్ ఫుల్, వారినే అందరూ - ఓ పరమపిత పరమాత్మా, మీరు వచ్చి మా దుఃఖాన్ని హరించండి అని స్మృతి చేస్తారు. బ్రహ్మా-విష్ణు-శంకరులు దేవతలు. మూలవతనంలో ఉండే ఆత్మలను దేవతలు అని ఏమైనా అంటారా. బ్రహ్మా-విష్ణు-శంకరుల రహస్యాన్ని కూడా తండ్రి అర్థం చేయించారు. బ్రహ్మా, లక్ష్మీ-నారాయణులు, వీరందరూ ఇక్కడే ఉన్నారు కదా. కేవలం పిల్లలైన మీకే ఇప్పుడు సూక్ష్మవతనము యొక్క సాక్షాత్కారమవుతుంది. ఈ బాబా కూడా ఫరిశ్తాగా అయిపోతారు. మెట్ల చిత్రములో ఎవరైతే పైన నిలబడి ఉన్నారో, వారే మళ్ళీ కింద తపస్య చేస్తున్నారని పిల్లలకు తెలుసు. చిత్రములో చాలా స్పష్టంగా చూపించారు. వారు తమను తాము భగవంతుడు అని ఎక్కడ చెప్పుకుంటున్నారు. వారంటారు, నేను పైసాకు కూడా కొరగానివారిగా ఉండేవాడిని, తతత్వమ్. ఇప్పుడు ఎంత విలువైనవారిగా అవుతున్నాను, తతత్వమ్. ఇవి ఎంత సహజంగా అర్థం చేసుకునే విషయాలు. ఎవరైనా ఎప్పుడైనా అడిగితే చెప్పండి - చూడండి, వీరైతే కలియుగాంతములో నిలబడి ఉన్నారు కదా. తండ్రి అంటారు, ఎప్పుడైతే శిథిలావస్థ, వానప్రస్థావస్థ ఏర్పడుతుందో, అప్పుడు నేను వీరిలోకి ప్రవేశిస్తాను. ఇప్పుడు రాజయోగ తపస్య చేస్తున్నారు. తపస్య చేసేవారిని దేవతలని ఎలా అంటారు? రాజయోగము నేర్చుకొని ఈ విధంగా తయారవుతారు. పిల్లలైన మిమ్మల్ని కూడా ఈ విధంగా కిరీటధారులుగా తయారుచేస్తారు కదా. వీరే మళ్ళీ దేవతగా అవుతారు. ఈ విధముగా 10 - 20 మంది పిల్లల చిత్రాలను కూడా పెట్టవచ్చు. వీరు ఇలా తయారవుతారని చూపించేందుకు పెట్టవచ్చు. ఇంతకుముందు అందరివీ ఇటువంటి ఫొటోలు తయారుచేయబడి ఉండేవి. ఇది అర్థం చేయించే విషయము కదా. ఒకవైపు సాధారణమైనవారు, ఇంకొకవైపు డబల్ కిరీటధారులు. మేము ఈ విధంగా తయారవుతున్నామని మీరు అర్థం చేసుకుంటారు. ఎవరి లైన్ క్లియర్ గా ఉంటుందో, వారే అలా తయారవుతారు మరియు చాలా మధురంగా కూడా తయారవ్వాలి. ఈ సమయంలో మనుష్యులలో కామము-క్రోధము మొదలైన బీజాలు ఎంత ఎక్కువ అయిపోయాయి. అందరిలోనూ 5 వికారాల రూపీ బీజాల యొక్క వృక్షాలు వెలువడ్డాయి. ఇప్పుడు తండ్రి అంటారు - ఇటువంటి బీజాలను నాటకండి. సంగమయుగములో మీరు దేహాభిమానమనే బీజాన్ని నాటకూడదు. కామము యొక్క బీజాన్ని నాటకూడదు. అర్ధకల్పము కొరకు ఇక రావణుడే ఉండడు. ప్రతి ఒక్క విషయాన్ని తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. ముఖ్యమైన విషయము ఒకటే - మన్మనాభవ. నన్ను స్మృతి చేయండి అని తండ్రి అంటారు. అందరికన్నా చివరిలో వీరు ఉన్నారు, మళ్ళీ అందరికన్నా ముందు కూడా వీరే ఉన్నారు. యోగబలముతో ఎంత పావనంగా అవుతారు. ప్రారంభంలోనైతే పిల్లలకు చాలా సాక్షాత్కారాలు జరిగేవి. భక్తి మార్గములో నవవిధ భక్తి చేసినప్పుడు సాక్షాత్కారాలు జరుగుతాయి. ఇక్కడైతే వీరు కూర్చుని-కూర్చుని ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు, దీనిని ఇంద్రజాలమని భావించేవారు. ఇది ఫస్ట్ క్లాస్ ఇంద్రజాలము. మీరా చాలా తపస్య చేసారు, సాధు-సన్యాసులు మొదలైనవారి సాంగత్యం చేసారు. ఇక్కడ సాధువులు మొదలైనవారు ఎక్కడున్నారు. వీరు తండ్రి కదా. అందరి తండ్రి శివబాబా. గురువుగారిని కలవాలి అని అంటారు. ఇక్కడైతే గురువు లేరు. శివబాబా అయితే నిరాకారుడు, మరి ఎవరిని కలవాలని అనుకుంటున్నారు? ఆ గురువుల వద్దకైతే వెళ్ళి కానుకలు సమర్పిస్తారు. ఈ తండ్రి అయితే అనంతమైన యజమాని. ఇక్కడ కానుకలు మొదలైనవి సమర్పించే విషయము లేదు. ఈ ధనాన్ని ఏమి చేసుకుంటారు? నేను విశ్వానికి యజమానిగా అవుతానని ఈ బ్రహ్మా కూడా భావిస్తారు. పిల్లలు ధనము మొదలైనవి ఏవైతే ఇస్తారో, వారి కోసమే భవనాలు మొదలైనవి నిర్మిస్తారు. ధనము శివబాబాకూ ఉపయోగపడదు, బ్రహ్మాబాబాకు కూడా ఉపయోగపడదు. ఈ భవనాలు మొదలైనవి పిల్లల కోసమే తయారుచేసారు, పిల్లలే వచ్చి ఉంటారు. కొంతమంది పేదవారు ఉన్నారు, కొంతమంది షావుకారులు ఉన్నారు, కొంతమందైతే - బాబా, మా ఒక్క ఇటుకను పెట్టండి అని రెండు రూపాయలు కూడా పంపిస్తారు. కొంతమంది వెయ్యి రూపాయలు పంపిస్తారు. ఇద్దరి భావన ఒకటే కదా. కావున ఇరువురిదీ సమానమైపోతుంది. అప్పుడు పిల్లలు వస్తే ఎక్కడ కావాలంటే అక్కడ ఉండవచ్చు. ఎవరైతే భవనం కట్టించారో, వారు ఒకవేళ వస్తే, వారిని తప్పకుండా సుఖంగా ఉంచుతారు. బాబా వద్ద కూడా మర్యాదలు జరుగుతాయని కొందరు అంటారు. అరే, అదైతే తప్పకుండా చేయవలసి ఉంటుంది కదా. కొంతమంది ఒకలా ఉంటారు, కొంతమందైతే ఎక్కడైనా కూర్చుండిపోతారు. కొంతమంది చాలా సున్నితంగా ఉంటారు, విదేశాలలో ఉండేవారు ఉంటారు, పెద్ద-పెద్ద మహళ్ళలో ఉండేవారు ఉంటారు, ప్రతి ఒక్క దేశంలో పెద్ద-పెద్ద షావుకార్లు వెలువడుతారు, అప్పుడు భవనాలు మొదలైనవి అటువంటివి తయారుచేస్తారు. ఇక్కడైతే చూడండి, ఎంత మంది పిల్లలు వస్తారు. ఇంకే తండ్రికైనా ఇటువంటి ఆలోచనలు ఉంటాయా. ఎక్కువలో ఎక్కువ 10-12-20 మంది మనవలు-మనవరాళ్ళు ఉంటారు. అచ్ఛా, కొందరికి 200-500 మంది కూడా ఉండవచ్చు, అంతకన్నా ఎక్కువ అయితే ఉండరు. ఈ బాబా యొక్క పరివారము ఎంత పెద్దది, ఇంకా వృద్ధి చెందనున్నది. ఇక్కడ రాజధాని స్థాపనవుతుంది. తండ్రి యొక్క పరివారము ఎంత వృద్ధి చెందుతుంది. ప్రజాపిత బ్రహ్మా యొక్క పరివారము ఎంతగా వృద్ధి చెందింది. కల్ప-కల్పము ఎప్పుడైతే వస్తారో, అప్పుడే ఈ అద్భుతమైన విషయాలు మీ చెవిలో పడతాయి. ఓ ప్రభూ, మీ గతి-మతి అన్నింటికన్నా అతీతంగా ఉంటుంది అని తండ్రి గురించే అంటారు కదా. భక్తి మరియు జ్ఞానంలో తేడా చూడండి ఎంతగా ఉంది.
తండ్రి మీకు అర్థం చేయిస్తారు, స్వర్గములోకి వెళ్ళాలంటే దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. ఇప్పుడైతే ముళ్ళ వలె ఉన్నారు కదా. నిర్గుణుడినైన నాలో ఏ గుణాలు లేవు అని పాడుతూ ఉంటారు. ఇకపోతే, 5 వికారాల అవగుణాలున్నాయి, ఇది రావణ రాజ్యము. ఇప్పుడు మీకెంత మంచి జ్ఞానము లభిస్తుంది. ఈ జ్ఞానము ఎంతటి సంతోషాన్ని అయితే ఇస్తుందో, ఆ జ్ఞానము అంతగా ఇవ్వదు. మీకు తెలుసు, ఆత్మలమైన మనము పైన మూలవతనములో ఉండేవారము. సూక్ష్మవతనములో బ్రహ్మా-విష్ణు-శంకరులు ఉంటారు, అది కూడా కేవలం సాక్షాత్కారము జరుగుతుంది. బ్రహ్మా కూడా ఇక్కడివారే, లక్ష్మీ-నారాయణులు కూడా ఇక్కడి వారే. కేవలం వారి సాక్షాత్కారం జరుగుతుంది. వ్యక్త బ్రహ్మా, సూక్ష్మ వతనవాసి ఫరిశ్తా బ్రహ్మాగా ఎలా అవుతారు అన్న గుర్తులున్నాయి. అంతే, ఇంకేమీ లేదు. ఇప్పుడు పిల్లలైన మీరు అన్ని విషయాలను అర్థం చేసుకుంటూ ఉంటారు, ధారణ చేస్తూ ఉంటారు. ఇది కొత్త విషయమేమీ కాదు. మీరు అనేక సార్లు దేవతలుగా అయ్యారు, దైవీ రాజ్యముండేది కదా. ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. అది వినాశీ డ్రామా, ఇది అనాది, అవినాశీ డ్రామా. ఇది మీకు తప్ప ఇంకెవరి బుద్ధిలోనూ లేదు. ఈ విషయాలన్నీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. అంతేకానీ ఇది పరంపరగా కొనసాగుతూ వచ్చిందని కాదు. తండ్రి అంటారు - ఈ జ్ఞానాన్ని మీకిప్పుడు వినిపిస్తాను. తర్వాత ఇది కనుమరుగైపోతుంది. మీరు రాజ్య పదవిని ప్రాప్తి చేసుకుంటారు, తర్వాత సత్యయుగంలో ఈ జ్ఞానము ఉండదు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఇప్పుడు మేము బ్రాహ్మణులము కావున వికారాలకు చాలా-చాలా దూరంగా ఉండాలి అన్న స్మృతి సదా ఉండాలి. ఎప్పుడూ అశుద్ధ కర్మలు జరగకూడదు. తండ్రితో చాలా-చాలా నిజాయితీగా, విశ్వాసపాత్రులుగా ఉండాలి.
2. డబల్ కిరీటధారులైన దేవతలుగా అయ్యేందుకు చాలా మధురంగా అవ్వాలి, లైన్ క్లియర్ గా ఉంచుకోవాలి. రాజయోగ తపస్య చేయాలి.
| వరదానము:- |
సదా అనంతమైన స్థితిలో స్థితులై ఉండే బంధనముక్త, జీవన్ముక్త భవ దేహాభిమానము హద్దు స్థితి మరియు దేహీ-అభిమానులుగా అవ్వడము - ఇది అనంతమైన స్థితి. దేహంలోకి రావడముతో అనేక కర్మ బంధనాలలోకి, హద్దులలోకి రావలసి వస్తుంది, కానీ ఎప్పుడైతే దేహీగా అవుతారో అప్పుడు ఈ బంధనాలన్నీ సమాప్తమైపోతాయి. బంధనముక్తులే జీవన్ముక్తులు అని అంటారు కదా, అదే విధంగా ఎవరైతే అనంతమైన స్థితిలో స్థితులై ఉంటారో వారు ప్రాపంచిక వాయుమండలము, వైబ్రేషన్లు, తమోగుణీ వృత్తులు, మాయ యొక్క దాడి - వీటన్నింటి నుండి ముక్తులైపోతారు, దీనినే జీవన్ముక్త స్థితి అని అంటారు, దీనిని సంగమయుగంలోనే అనుభవం చేసుకోవాలి. |
| స్లోగన్:- | నిశ్చయబుద్ధి కలవారి గుర్తు - నిశ్చిత విజయము మరియు నిశ్చింత స్థితి, వారి వద్దకు వ్యర్థము రాలేదు. |
అవ్యక్త ప్రేరణలు-ఇప్పుడు సంపన్నముగా మరియు కర్మాతీతముగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి
కర్మల గుహ్య గతిని తెలుసుకుని అనగా త్రికాలదర్శులుగా అయ్యి ప్రతి కర్మను చెయ్యండి, అప్పుడే కర్మాతీతులుగా అవ్వగలరు. ఒకవేళ చిన్న-చిన్న పొరపాట్లు సంకల్ప రూపములోనైనా జరిగితే దాని లెక్కాచారము కూడా చాలా కఠినంగా తయారవుతుంది, అందుకే చిన్న పొరపాటును కూడా పెద్దదిగా భావించాలి ఎందుకంటే ఇప్పుడు సంపూర్ణ స్థితికి సమీపంగా వస్తున్నారు.