తెలుగు మురళి · Brahma Kumaris

తెలుగు మురళి · 26 అక్టోబర్, 2024

ఓం శాంతి · BapDada ·

ఈరోజు మురళి — today’s murli in Telugu, BK Telugu murli.

18
మురళి26 అక్టోబర్, 2024 · తెలుగు
0:00--:--

పాఠ్యాన్ని ఎంచుకోండి → హైలైట్ / బాక్స్ / అండర్‌లైన్

26-10-2024
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
మధువనం

‘‘మధురమైన పిల్లలూ - సర్వశక్తివంతుడైన తండ్రి మీకు శక్తిని ఇచ్చేందుకు వచ్చారు, ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా శక్తి లభిస్తూ ఉంటుంది’’
ప్రశ్న:- ఈ డ్రామాలో అందరికన్నా మంచి పాత్ర పిల్లలైన మీదే, అది ఎలా?
జవాబు:- పిల్లలైన మీరే అనంతమైన తండ్రికి చెందినవారిగా అవుతారు. భగవంతుడు టీచరుగా అయి మిమ్మల్నే చదివిస్తారు కావున మీరు భాగ్యశాలి అయినట్లు కదా. విశ్వాధిపతి మీకు అతిథిగా అయి వచ్చారు, వారు మీ సహయోగముతో విశ్వ కళ్యాణాన్ని చేస్తారు. పిల్లలైన మీరు పిలిచారు మరియు తండ్రి వచ్చారు, ఇదే రెండు చేతుల చప్పట్లు. ఇప్పుడు తండ్రి నుండి పిల్లలైన మీకు మొత్తం విశ్వమంతటిపైనా రాజ్యం చేసే శక్తి లభిస్తుంది.

ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రి ఎదురుగా కూర్చున్నారు, శిక్షకుని ఎదురుగా కూడా కూర్చున్నారు మరియు ఈ బాబా పిల్లలైన మనల్ని తీసుకువెళ్ళేందుకు గురువు రూపములో వచ్చారు అన్నది కూడా మీకు తెలుసు. తండ్రి కూడా అంటారు - ఓ ఆత్మిక పిల్లలూ, నేను మిమ్మల్ని ఇక్కడి నుండి తీసుకువెళ్ళేందుకు వచ్చాను. ఈ ప్రపంచము పాతదిగా అయిపోయింది మరియు ఈ ప్రపంచము అశుద్ధమైనది అని కూడా మీకు తెలుసు. పిల్లలైన మీరు కూడా అశుద్ధముగా అయిపోయారు. మీ గురించి మీరే ఇలా అంటారు - పతిత పావన బాబా, మీరు వచ్చి పతితులైన మమ్మల్ని ఈ దుఃఖధామము నుండి శాంతిధామములోకి తీసుకువెళ్ళండి అని. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుని ఉంటారు కావున మీ హృదయములోకి ఇది రావాలి. తండ్రి కూడా అంటారు, నేను మీరు పిలిచినందుకు, మీ ఆహ్వానముపై ఇక్కడకు వచ్చాను. మీరు రండి అని మీరు తప్పకుండా నన్ను పిలిచేవారు కదా అని తండ్రి గుర్తు చేయిస్తారు. మేము పిలిచాము అని ఇప్పుడు మీకు గుర్తుకువచ్చింది. డ్రామానుసారంగా కల్పపూర్వము వలె ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారు. వాళ్ళు ప్లాన్లు తయారుచేస్తారు కదా. ఇది కూడా శివబాబా ప్లాన్. ఈ సమయములో అందరికీ తమ-తమ ప్లాన్లు ఉన్నాయి కదా. పంచ వర్ష ప్రణాళికలను తయారుచేస్తారు, అందులో ఇది, ఇది చేస్తాము అని అంటారు. ఈ విషయాలు ఎలా కలుస్తున్నాయో చూడండి. ఇంతకుముందు ఈ ప్లాన్లు మొదలైనవి తయారుచేసేవారు కాదు, ఇప్పుడు ప్లాన్లు తయారుచేస్తూ ఉంటారు. మన బాబా ప్లాన్ ఇది అని పిల్లలైన మీకు తెలుసు. డ్రామా ప్లాన్ అనుసారంగా 5000 సంవత్సరాల క్రితం నేను ఈ ప్లాన్ ను తయారుచేసాను. మధురాతి మధురమైన పిల్లలైన మీరు ఎవరైతే ఇక్కడ చాలా దుఃఖితులుగా అయిపోయారో, వేశ్యాలయములో పడిపోయారో, మిమ్మల్ని శివాలయములోకి తీసుకువెళ్ళేందుకు ఇప్పుడు నేను వచ్చాను. ఆ శాంతిధామము నిరాకారీ శివాలయము మరియు సుఖధామము సాకారీ శివాలయము. ఈ సమయములో పిల్లలైన మిమ్మల్ని తండ్రి రిఫ్రెష్ చేస్తున్నారు. మీరు తండ్రి సమ్ముఖములో కూర్చున్నారు కదా. బాబా వచ్చి ఉన్నారు అని బుద్ధిలో నిశ్చయం అయితే ఉంది. ‘బాబా’ అన్న పదము చాలా మధురమైనది. ఇది కూడా మీకు తెలుసు - ఆత్మలమైన మనము ఆ తండ్రి పిల్లలము, మళ్ళీ పాత్రను అభినయించేందుకు ఈ తండ్రికి చెందినవారిగా అవుతాము. ఎంత సమయం మీకు లౌకిక తండ్రులు లభించారు? సత్యయుగము నుండి మొదలుకుని సుఖ, దుఃఖాల పాత్రలను అభినయించారు. మన దుఃఖపు పాత్ర ఇక పూర్తవుతుందని, సుఖపు పాత్రను కూడా పూర్తి 21 జన్మలు అభినయించాము అని ఇప్పుడు మీకు తెలుసు. మళ్ళీ అర్ధకల్పము దుఃఖపు పాత్రను అభినయించారు. బాబా మీకు స్మృతిని కలిగించారు. నిజంగా అలాగే ఉండేది కదా అని బాబా అడుగుతున్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు అర్ధకల్పం సుఖపు పాత్రను అభినయించాలి. ఈ జ్ఞానముతో మీ ఆత్మ నిండుగా ఉంటుంది, ఆ తర్వాత ఖాళీ అయిపోతుంది. మళ్ళీ తండ్రి నిండుగా చేస్తారు. మీ కంఠములో విజయమాల ఉంది, కంఠములో జ్ఞాన మాల ఉంది. తప్పకుండా మనం చక్రములో తిరుగుతూ ఉంటాము. సత్యయుగము, త్రేతా, ద్వాపరము, కలియుగము, ఆ తర్వాత మళ్ళీ ఈ మధురమైన సంగమములోకి వస్తాము. దీనిని మధురమైనది అని అంటారు. శాంతిధామము మధురమైనదేమీ కాదు. అన్నింటికన్నా మధురమైనది పురుషోత్తమ కళ్యాణకారీ సంగమయుగము. డ్రామాలో మీది కూడా అందరికన్నా మంచి పాత్ర. మీరు ఎంత అదృష్టవంతులు. అనంతమైన తండ్రికి చెందినవారిగా మీరు అవుతారు. వారు వచ్చి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తారు. ఇది ఎంత ఉన్నతమైన, ఎంత సహజమైన చదువు. మీరు ఎంత ధనవంతులుగా అవుతారు. ఇందులో ఏ విధంగానూ కష్టపడవలసిన అవసరం ఉండదు. డాక్టర్లు, ఇంజనీర్లు మొదలైనవారు ఎంతగా కష్టపడుతూ ఉంటారు, మీకైతే వారసత్వము లభిస్తుంది, తండ్రి సంపాదనపై పిల్లలకు హక్కు ఉంటుంది కదా. మీరు ఇది చదువుకుని 21 జన్మల సత్యమైన సంపాదనను చేసుకుంటారు. అక్కడ మీకు తండ్రిని స్మృతి చేయవలసి వచ్చేందుకు అసలు ఎటువంటి నష్టమూ వాటిల్లదు. ఇక్కడ దీనిని నిరంతర జపము అని అంటారు.

బాబా వచ్చి ఉన్నారని మీకు తెలుసు. నేను వచ్చాను అని తండ్రి కూడా అంటారు. రెండు చేతులతోనే చప్పట్లు మ్రోగుతాయి కదా. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే జన్మ-జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి. పంచ వికారాల రూపీ రావణుడు మిమ్మల్ని పాపాత్ములుగా తయారుచేశాడు, మళ్ళీ పుణ్యాత్ములుగా కూడా అవ్వాలి, ఇది బుద్ధిలోకి రావాలి. మనం తండ్రి స్మృతితో పవిత్రముగా అయి తండ్రితోపాటు ఇంటికి వెళ్తాము. ఈ చదువుతో మనకు శక్తి లభిస్తుంది. దేవీ-దేవతా ధర్మము విషయములో రిలీజియన్ ఈజ్ మైట్ (ధర్మమే శక్తి) అని అనడం జరుగుతుంది. తండ్రి అయితే సర్వశక్తివంతుడు, కావున బాబా నుండి మనకు విశ్వములో శాంతిని స్థాపించే శక్తి లభిస్తుంది. ఆ రాజ్యాధికారాన్ని మన నుండి ఎవ్వరూ దోచుకోలేరు. అంతటి శక్తి లభిస్తుంది. రాజుల చేతిలోకి ఎంతటి శక్తి వస్తుందో చూడండి. వారికి ఎంతగా భయపడతారు. ఒక్క రాజుకు ఎంతమంది ప్రజలు, సైన్యం మొదలైనవారు ఉంటారు, కానీ అది అల్పకాలికమైన శక్తి. ఇది 21 జన్మల శక్తి. మనకు సర్వశక్తివంతుడైన తండ్రి నుండి విశ్వముపై రాజ్యం చేయడానికి శక్తి లభిస్తుందని ఇప్పుడు మీకు తెలుసు. ప్రేమ అయితే ఉంటుంది కదా. దేవతలు ప్రాక్టికల్ గా ఇక్కడ లేకపోయినా సరే, వారిపై ఎంతటి ప్రేమ ఉంటుంది. వారు సమ్ముఖంగా ఉన్నప్పుడు ప్రజలకు వారిపై ఎంత ప్రేమ ఉంటుంది. స్మృతియాత్రతో ఈ మొత్తం శక్తినంతటినీ మీరు తీసుకుంటున్నారు. ఈ విషయాలను మర్చిపోకండి. స్మృతి చేస్తూ, చేస్తూ మీరు చాలా శక్తివంతులుగా అయిపోతారు. సర్వశక్తివంతుడు అని ఇంకెవ్వరినీ అనడం జరుగదు. అందరికీ శక్తి లభిస్తుంది. ఈ సమయములో ఎవ్వరిలోనూ శక్తి లేదు, అందరూ తమోప్రధానముగా ఉన్నారు. మళ్ళీ ఆత్మలందరికీ ఒక్కరి నుండే శక్తి లభిస్తుంది, మళ్ళీ తమ రాజధానిలోకి వచ్చి తమ-తమ పాత్రను అభినయిస్తారు. తమ లెక్కాచారాలను తీర్చుకుని మళ్ళీ అదే విధంగా నంబరువారుగా శక్తివంతులుగా అవుతారు. ఈ దేవతల్లో నంబరు వన్ శక్తి ఉంటుంది. ఈ లక్ష్మీ-నారాయణులు తప్పకుండా మొత్తం విశ్వానికి యజమానులుగా ఉండేవారు కదా. మీ బుద్ధిలో మొత్తం సృష్టి చక్రమంతా ఉంది. ఏ విధంగా మీ ఆత్మలో ఈ జ్ఞానము ఉందో, అలాగే బాబా ఆత్మలో కూడా మొత్తం జ్ఞానమంతా ఉంది. ఇప్పుడు మీకు వారు జ్ఞానాన్ని ఇస్తున్నారు. డ్రామాలో పాత్ర నిండి ఉంది, అది రిపీట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఆ పాత్ర 5000 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు. మీరు సత్యయుగములో రాజ్యం చేసేటప్పుడు తండ్రి రిటైర్ లైఫ్ లో ఉంటారు, మళ్ళీ స్టేజి మీదకు ఎప్పుడు వస్తారు? ఎప్పుడైతే మీరు దుఃఖితులుగా అవుతారో అప్పుడు. వారిలో మొత్తం రికార్డ్ అంతా నిండి ఉందని మీకు తెలుసు. ఆత్మ ఎంత చిన్ననిది, అందులో ఎంతటి వివేకం ఉంటుంది. తండ్రి వచ్చి ఎంతటి వివేకాన్ని ఇస్తారు. మళ్ళీ అక్కడ సత్యయుగములో ఈ విషయాలన్నింటినీ మర్చిపోతారు. సత్యయుగములో మీకు ఈ జ్ఞానము ఉండదు. అక్కడ మీరు సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇది కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, సత్యయుగములో మనమే దేవతలుగా అయి సుఖాన్ని అనుభవిస్తాము. ఇప్పుడు మనమే బ్రాహ్మణులుగా ఉన్నాము, మళ్ళీ మనమే దేవతలుగా అవుతున్నాము. ఈ జ్ఞానాన్ని బుద్ధిలో బాగా ధారణ చేయాలి. ఎవరికైనా అర్థం చేయించడములో సంతోషం కలుగుతుంది కదా. మీరు ప్రాణదానాన్ని ఇస్తారు. కాలుడు వచ్చి అందరినీ తీసుకువెళ్ళిపోతాడు అని అంటారు కదా. వాస్తవానికి కాలుడు అంటూ ఎవరూ లేరు. ఇదంతా తయారై-తయారుచేయబడిన డ్రామా. ఆత్మ అంటుంది - నేను ఒక శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాను, మళ్ళీ ఇంకొకటి తీసుకుంటాను. నన్ను మృత్యువు కబళించదు. ఆత్మకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. ఆత్మ గర్భములో ఉన్నప్పుడు సాక్షాత్కారాలు కలిగి దుఃఖాన్ని అనుభవిస్తుంది, లోలోపల శిక్షలు అనుభవిస్తుంది, అందుకే దానిని గర్భ జైలు అని అంటారు. ఈ డ్రామా ఎంత అద్భుతముగా తయారుచేయబడి ఉంది. గర్భ జైలులో శిక్షలు పొందుతూ తమ సాక్షాత్కారాన్ని పొందుతూ ఉంటారు. శిక్షలు ఎందుకు లభించాయి? ఈ, ఈ తప్పుడు పనులు చేసారని, వీరికి దుఃఖాన్ని ఇచ్చారు అని సాక్షాత్కారాలైతే చేయిస్తారు కదా. అక్కడ అన్ని సాక్షాత్కారాలు అవుతాయి, అయినా కానీ బయటకు వచ్చి పాపాత్ములుగా అయిపోతారు. అన్ని పాపాలు ఎలా భస్మమవుతాయి? ఈ స్మృతియాత్ర ద్వారా మరియు స్వదర్శన చక్రాన్ని తిప్పడం ద్వారా మీ పాపాలు భస్మమవుతాయని పిల్లలకు అర్థం చేయించారు. తండ్రి అంటారు కూడా - మధురాతి మధురమైన స్వదర్శన చక్రధారీ పిల్లలూ, మీరు 84 జన్మల ఈ స్వదర్శన చక్రాన్ని తిప్పినట్లయితే మీ జన్మజన్మాంతరాల పాపాలు అంతమైపోతాయి. చక్రాన్ని కూడా స్మృతి చేయాలి, అలాగే ఈ జ్ఞానాన్ని ఎవరు ఇచ్చారో వారిని కూడా స్మృతి చేయాలి. తండ్రి మనల్ని స్వదర్శన చక్రధారులుగా తయారుచేస్తున్నారు. అలా తయారుచేస్తారు కానీ ప్రతి రోజూ కొత్త-కొత్తవారు వస్తారు కావున వారందరినీ కూడా రిఫ్రెష్ చేయవలసి ఉంటుంది. మీకు మొత్తం జ్ఞానమంతా లభించింది, మనం ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చామని ఇప్పుడు మీకు తెలుసు. 84 జన్మల చక్రములో తిరిగారు, మళ్ళీ తిరిగి వెళ్ళాలి. ఇలా చక్రాన్ని తిప్పుతూ ఉంటారా? పిల్లలు చాలా మర్చిపోతూ ఉంటారని తండ్రికి తెలుసు. చక్రాన్ని తిప్పడంలో ఎటువంటి కష్టమూ లేదు, తీరిక అయితే ఎంతో ఉంటుంది. చివరి సమయములో మీకు ఈ స్వదర్శన చక్రధారీ అవస్థ ఉంటుంది. మీరు ఈ విధంగా తయారవ్వాలి. సన్యాసులైతే ఈ శిక్షణను ఇవ్వలేరు. స్వదర్శన చక్రము గురించి స్వయం ఆ గురువులకు కూడా తెలియదు. వారు కేవలం గంగా నది వద్దకు వెళ్ళండి అని అంటారు. ఎంతమంది స్నానాలు చేస్తారు! ఎక్కువ స్నానాలు చేయడం ద్వారా ఆ గురువులకు ఆదాయం లభిస్తుంది. ఘడియ-ఘడియ యాత్రలకు వెళ్తారు. ఇప్పుడు ఆ యాత్రలకు మరియు ఈ యాత్రకు ఎంత తేడా ఉందో చూడండి. ఈ యాత్ర ఆ యాత్రలన్నింటి నుండి విముక్తులుగా చేస్తుంది. ఈ యాత్ర ఎంత సహజమైనది. చక్రాన్ని కూడా తిప్పండి. నలువైపులా తిరిగి వచ్చాము, అయినా కానీ ఎంతో దూరంగానే ఉన్నాము అన్న పాట కూడా ఉంది కదా. అనంతమైన తండ్రి నుండి దూరంగా ఉన్నారు. ఇది మీకు అనుభవమవుతుంది. వారికైతే దీని అర్థము తెలియదు. ఎంతగానో తిరుగుతూ వచ్చామని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడిక ఈ తిరగడం నుండి మీరు విముక్తులైపోయారు. అలా తిరగడం వల్ల మీరేమీ దగ్గరగా రాలేదు, ఇంకా దూరమవుతూ వచ్చారు.

ఇప్పుడు డ్రామా ప్లాన్ అనుసారంగా అందరినీ తమతోపాటు తీసుకువెళ్ళేందుకు తండ్రికే రావలసి ఉంటుంది. తండ్రి అంటారు, నా మతముపై మీరు నడవవలసిందే, పవిత్రముగా అవ్వాలి. ఈ ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకూడదు. ఎప్పటివరకైతే కొత్త ఇల్లు తయారవ్వదో అప్పటివరకూ పాత ఇంట్లో ఉండవలసి ఉంటుంది. తండ్రి వారసత్వాన్ని ఇవ్వడానికి సంగమములోనే వస్తారు. అనంతమైన తండ్రిది అనంతమైన వారసత్వము. తండ్రి వారసత్వము మాదేనని లౌకికములో పిల్లలకు తెలుసు, ఆ సంతోషములో ఉంటారు. ఆ పిల్లలు తమ సంపాదనను కూడా చేసుకుంటారు మరియు వారికి తండ్రి వారసత్వము కూడా లభిస్తుంది. మీకైతే వారసత్వమే లభిస్తుంది. స్వర్గ వారసత్వము మీకు ఎలా లభించింది అనేది అక్కడ మీకు తెలియదు. అక్కడ మీ జీవితము చాలా సుఖమయంగా ఉంటుంది ఎందుకంటే మీరు తండ్రిని స్మృతి చేసి శక్తిని తీసుకుంటారు. పాపాలను అంతం చేసేవారు పతిత-పావనుడైన తండ్రి ఒక్కరే. తండ్రిని స్మృతి చేయడం ద్వారా మరియు స్వదర్శన చక్రాన్ని తిప్పడం ద్వారానే మీ పాపాలు అంతమవుతాయి. దీనిని బాగా నోట్ చేసుకోండి. ఇది అర్థం చేయించినా చాలు. ఇక మున్ముందు మీరు ఎక్కువగా చెప్పవలసిన అవసరం ఉండదు. ఒక్క సూచన ఇస్తే చాలు, సరిపోతుంది. అనంతమైన తండ్రిని స్మృతి చేస్తే మీ పాపాలు అంతమైపోతాయి. మీరు నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అవ్వడానికి వస్తారు. ఇదైతే గుర్తుంది కదా. ఇంకెవరి బుద్ధిలోకీ ఈ విషయం రాదు. మీరు ఇక్కడకు వస్తారు, మేము బాప్ దాదా వద్దకు కొత్త ప్రపంచమైన స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు వెళ్తాము అని బుద్ధిలో ఉంది.

తండ్రి అంటారు, స్వదర్శన చక్రధారులుగా అవ్వడం ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి. ఇప్పుడు ఎవరైతే మీ జీవితాన్ని వజ్రతుల్యముగా తయారుచేస్తారో వారినే చూడండి. ఇది కూడా మీరు అర్థం చేసుకుంటారు - ఇందులో చూసే విషయమంటూ ఏదీ లేదు, దీనిని మీరు దివ్యదృష్టి ద్వారా తెలుసుకుంటారు. ఆత్మయే ఈ శరీరము ద్వారా చదువుతుంది - ఈ జ్ఞానము ఇప్పుడు లభించింది. మనం ఏ కర్మలనైతే చేస్తామో, వాటిని ఆత్మయే శరీరాన్ని తీసుకుని చేస్తుంది. తండ్రి కూడా చదివించవలసి ఉంటుంది, వారి పేరైతే సదా శివ అనే ఉంటుంది. శారీరక పేర్లు మారుతాయి. ఈ శరీరమైతే నాది కాదు. ఇది ఇతని ఆస్తి. శరీరము ఆత్మకు ఆస్తి, దాని ద్వారా పాత్రను అభినయిస్తుంది. ఇది చాలా సహజముగా అర్థం చేసుకోవలసిన విషయము. ఆత్మ అయితే అందరిలోనూ ఉంది, అందరికీ శారీరక పేర్లు వేర్వేరుగా ఉంటాయి. వీరు పరమ ఆత్మ, సుప్రీమ్ ఆత్మ, వీరు ఉన్నతోన్నతమైనవారు. భగవంతుడు ఒక్కరే, వారే రచయిత అని, మిగిలినవారంతా పాత్రను అభినయించే రచన అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మలు ఏ విధంగా వస్తాయి అనేది కూడా మీరు తెలుసుకున్నారు. మొట్టమొదట ఆది సనాతన దేవీ-దేవతా ధర్మపు ఆత్మలు కొద్దిమందే ఉంటారు. మళ్ళీ చివరిలో మొదట వచ్చేందుకు అర్హులుగా అవుతారు. ఈ సృష్టి చక్రము ఒక మాల వంటిది, ఇది తిరుగుతూ ఉంటుంది. మీరు మాలను తిప్పుతూ ఉన్నట్లయితే పూసలన్నీ ఒకదాని తర్వాత ఒకటి తిరుగుతూ ఉంటాయి కదా. సత్యయుగములో భక్తి కొద్దిగా కూడా ఉండదు. తండ్రి అర్థం చేయించారు - ఓ ఆత్మల్లారా, నన్నొక్కరినే స్మృతి చేయండి. మీరు తప్పకుండా ఇంటికి తిరిగి వెళ్ళాలి, వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. స్మృతి ద్వారానే పాపాలు అంతమవుతాయి, అప్పుడిక శిక్షలు అనుభవించడం నుండి కూడా విముక్తులైపోతారు. పదవి కూడా మంచిది పొందుతారు. లేకపోతే శిక్షలను ఎంతగానో అనుభవించవలసి వస్తుంది. నేను పిల్లలైన మీ వద్దకు వచ్చిన ఎంత మంచి అతిథిని. నేను మొత్తం విశ్వమంతటినీ పరివర్తన చేస్తాను, పాత విశ్వాన్ని కొత్తగా చేస్తాను. మీకు కూడా తెలుసు, బాబా కల్ప-కల్పమూ వచ్చి విశ్వాన్ని పరివర్తన చేసి పాత విశ్వాన్ని కొత్తగా చేస్తారు. ఈ విశ్వము కొత్తది నుండి పాతదిగా, పాతది నుండి కొత్తదిగా అవుతుంది కదా. మీరు ఈ సమయములో చక్రాన్ని తిప్పుతూ ఉంటారు. తండ్రి బుద్ధిలో జ్ఞానము ఉంది, వారు వర్ణన చేస్తూ ఉంటారు. మీ బుద్ధిలో కూడా చక్రం ఎలా తిరుగుతుంది అన్నది ఉంది. బాబా వచ్చి ఉన్నారని, వారి శ్రీమతముపై మనం పావనంగా అవుతామని మీకు తెలుసు. స్మృతి ద్వారానే పావనంగా అవుతూ ఉంటారు, మళ్ళీ ఉన్నత పదవిని కూడా పొందుతారు. పురుషార్థం చేయించడం కూడా తప్పనిసరి. పురుషార్థం చేయించేందుకు ఎన్ని చిత్రాలు మొదలైనవి తయారుచేస్తారు. ఎవరైతే వస్తారో వారికి మీరు 84 జన్మల చక్రము గురించి అర్థం చేయిస్తారు. తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీరు పతితుల నుండి పావనులుగా అయిపోతారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. జ్ఞానాన్ని బుద్ధిలో బాగా ధారణ చేసి అనేక ఆత్మలకు ప్రాణదానాన్ని ఇవ్వాలి, స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి.

2. ఈ మధురమైన సంగమములో మీ సంపాదనతోపాటుగా తండ్రి శ్రీమతముపై నడుస్తూ పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. తమ జీవితాన్ని సదా సుఖమయంగా తయారుచేసుకోవాలి.

వరదానము:- సర్వ వరదానాలను అవసరమైన సమయములో కార్యములో వినియోగించి వాటిని ఫలీభూతము చేసే ఫల స్వరూప భవ
బాప్ దాదా ద్వారా ఎప్పటికప్పుడు ఏయే వరదానాలైతే లభించాయో, వాటిని అవసరమైన సమయములో కార్యములో వినియోగించండి. ఈ రోజు చాలా మంచి వరదానము లభించింది అని కేవలం వరదానాన్ని విని సంతోషపడకండి. వరదానాలను కార్యములో వినియోగించడం ద్వారా వరదానాలు నిలిచి ఉంటాయి. వరదానాలైతే అవినాశీ తండ్రివి, కానీ వాటిని ఫలీభూతము చెయ్యాలి. దీని కొరకు వరదానాలకు పదే-పదే స్మృతి అనే నీటిని ఇవ్వండి, వరదానము యొక్క స్వరూపములో స్థితులవ్వటము అనే ఎండను ఇవ్వండి, అప్పుడు వరదానాల ఫల స్వరూపులుగా అవుతారు.
స్లోగన్:- విశేషతలు ప్రభు ప్రసాదము, వాటిని సేవలో ఉపయోగించండి, పంచండి, తద్వారా పెంచుకోండి.

 

మురళి అంటే ఏమిటి?

మురళి బ్రహ్మకుమారీల దైనిక ఆధ్యాత్మిక బోధన, ఇది ప్రతి ఉదయం మధుబన్ నుండి ప్రచురించబడుతుంది. ఇక్కడ మీరు ఈరోజు మురళిని తెలుగులో చదవవచ్చు, ఆడియో వినవచ్చు మరియు PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధ్యయనానికి సహాయంగా పాఠ్యాన్ని హైలైట్ చేయవచ్చు — మీ గుర్తులు ఈ బ్రౌజర్‌లోనే సురక్షితంగా ఉంటాయి.

28 భాషల్లో మురళి

Daily Murli · Madhuban మూలం: మధుబన్ మురళి విభాగం ఇది స్వతంత్ర రీడర్ యాప్, అధికారిక వెబ్‌సైట్ కాదు.