తెలుగు మురళి · Brahma Kumaris

తెలుగు మురళి · 25 అక్టోబర్, 2024

ఓం శాంతి · BapDada ·

ఈరోజు మురళి — today’s murli in Telugu, BK Telugu murli.

18
మురళి25 అక్టోబర్, 2024 · తెలుగు
0:00--:--

పాఠ్యాన్ని ఎంచుకోండి → హైలైట్ / బాక్స్ / అండర్‌లైన్

25-10-2024
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
మధువనం

‘‘మధురమైన పిల్లలూ - తండ్రి నుండి ఒక్క దృష్టి లభించడంతో మొత్తం విశ్వములోని మనుష్యమాత్రులందరూ తృప్తి చెందుతారు, అందుకే దృష్టితో తృప్తి చెందుతారు... అని అనడం జరుగుతుంది’’
ప్రశ్న:- పిల్లలైన మీ హృదయములో సంతోషపు భజంత్రీలు మ్రోగాలి - ఎందుకు?
జవాబు:- ఎందుకంటే మీకు తెలుసు - బాబా అందరినీ తమతోపాటు తీసుకువెళ్ళేందుకు వచ్చారు. ఇప్పుడు మనం మన తండ్రితోపాటు ఇంటికి వెళ్తాము. హాహాకారాల తర్వాత జయజయకారాలు మ్రోగనున్నాయి. తండ్రి ఇచ్చే ఒక్క దృష్టితో మొత్తం విశ్వమంతటికీ ముక్తి-జీవన్ముక్తుల వారసత్వము లభించనున్నది. మొత్తం విశ్వమంతా తృప్తి చెందుతుంది.

ఓం శాంతి. ఆత్మిక శివబాబా కూర్చుని తమ ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. మూడవ నేత్రము కూడా ఉంటుంది అనైతే మీకు తెలుసు. తండ్రికి తెలుసు - మొత్తం ప్రపంచములోని ఆత్మలంతా ఎవరైతే ఉన్నారో, వారందరికీ వారసత్వాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను. తండ్రి హృదయములోనైతే వారసత్వమే గుర్తుంటుంది. లౌకిక తండ్రి హృదయములో కూడా వారసత్వమే గుర్తుంటుంది. కొడుకులకు వారసత్వాన్ని ఇస్తారు. కొడుకు లేకపోతే ఎవరికి ఇవ్వాలి అని తికమకపడుతూ ఉంటారు, అప్పుడిక దత్తత తీసుకుంటారు. ఇక్కడైతే తండ్రి కూర్చున్నారు, వీరికైతే మొత్తం ప్రపంచమంతటిలో ఏ ఆత్మలైతే ఉన్నారో, వారందరి వైపుకు దృష్టి వెళ్తుంది. అందరికీ నేను వారసత్వాన్ని ఇవ్వాలి అని నాకు తెలుసు. ఇక్కడ కూర్చుని ఉన్నా కానీ దృష్టి అయితే మొత్తం విశ్వమంతటిపైనా మరియు మొత్తం విశ్వమంతటిలోని మనుష్యమాత్రులపై ఉంది, ఎందుకంటే మొత్తం విశ్వమంతటినీ తృప్తిపరచవలసి ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తారు, ఇది పురుషోత్తమ సంగమయుగము. బాబా అందరినీ శాంతిధామానికి, సుఖధామానికి తీసుకువెళ్ళడానికి వచ్చారని మీకు తెలుసు. అందరూ తృప్తి చెందనున్నారు. డ్రామా ప్లాన్ అనుసారంగా కల్ప-కల్పము తృప్తి చెందుతారు. తండ్రి పిల్లలందరినీ గుర్తు చేస్తారు. దృష్టి అయితే వెళ్తుంది కదా. అందరూ చదువుకోరు. డ్రామా ప్లాన్ అనుసారంగా అందరూ తిరిగి వెళ్ళాలి ఎందుకంటే నాటకం పూర్తవుతుంది. ఇంకాస్త ముందుకు వెళ్తే ఇప్పుడిక వినాశనం జరుగుతుంది అని స్వయమూ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు కొత్త ప్రపంచ స్థాపన జరుగనున్నది, ఎందుకంటే ఆత్మ ఎంతైనా చైతన్యమైనది కదా కావున బుద్ధిలోకి వస్తుంది - ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు, స్వర్గ స్థాపన జరుగుతుంది మరియు మేము శాంతిధామములోకి వెళ్ళిపోతాము అని. అందరికీ గతి లభిస్తుంది కదా. ఇకపోతే మీకు మాత్రం సద్గతి లభిస్తుంది. ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారు. మనం స్వర్గములోకి వెళ్తాము. జయజయకారాలు మ్రోగుతాయి. ఇప్పుడైతే ఎన్నో హాహాకారాలు ఉన్నాయి. కొన్ని చోట్ల కరువులు వస్తున్నాయి, మరి కొన్ని చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి, కొన్ని చోట్ల భూకంపాలు వస్తూ ఉంటాయి. వేలాదిమంది మరణిస్తూ ఉంటారు. మృత్యువైతే జరుగవలసిందే. సత్యయుగములో ఈ విషయాలు ఉండవు. తండ్రికి తెలుసు - ఇప్పుడు నేను వస్తాను, ఇక మొత్తము విశ్వమంతటిలో జయజయకారాలు మోగుతాయి. నేను భారత్ లోకే వస్తాను. మొత్తం విశ్వములో భారత్ ఒక ఊరులాంటిది. బాబాకైతే అది ఊరులాంటిదే కదా. అందులో చాలా కొద్దిమంది మనుష్యులే ఉంటారు. సత్యయుగములో మొత్తం విశ్వమంతా ఒక చిన్న ఊరులాంటిదే. ఇప్పుడు ఎంతగా వృద్ధి జరిగింది. తండ్రి బుద్ధిలో అయితే అంతా ఉంది కదా. ఇప్పుడు ఈ శరీరము ద్వారా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మీది కల్ప-కల్పమూ ఏ పురుషార్థమైతే జరుగుతుందో, అదే పురుషార్థము ఇప్పుడు కూడా జరుగుతుంది. తండ్రి కూడా కల్పవృక్షానికి బీజరూపుడు. ఇది సాకార వృక్షము. పైన నిరాకార వృక్షము ఉంది. ఇది ఎలా తయారుచేయబడి ఉందో మీకు తెలుసు. ఈ వివేకము ఇంకే మనుష్యుల్లోనూ లేదు. వివేకహీనులకు మరియు వివేకవంతులకు మధ్యన తేడాను చూడండి. వివేకవంతులు స్వర్గములో రాజ్యము చేసేవారు, దానిని సత్యఖండము, స్వర్గము అని అంటారు.

ఇప్పుడు పిల్లలైన మీకు లోలోపల చాలా సంతోషము ఉండాలి. బాబా వచ్చి ఉన్నారు, ఈ పాత ప్రపంచమైతే తప్పకుండా మారుతుంది. ఎంతెంతగా ఎవరెవరు పురుషార్థము చేస్తారో, అంతటి పదవిని పొందుతారు. తండ్రి అయితే చదివిస్తున్నారు. మీ ఈ స్కూలు అయితే చాలా వృద్ధి చెందుతూ ఉంటుంది, ఎంతోమంది తయారవుతారు. అందరికీ ఒకటే స్కూలు ఉండదు కదా. అలా అయితే ఇంతమంది ఎక్కడ ఉంటారు. ఇప్పుడు మనం సుఖధామములోకి వెళ్తామని పిల్లలైన మీకు గుర్తుంది. ఎవరైనా విదేశాలకు వెళ్ళినప్పుడు 8-10 సంవత్సరాలు అక్కడకు వెళ్ళి ఉంటారు కదా, తర్వాత మళ్ళీ భారత్ లోకి వస్తారు. భారత్ అయితే పేద దేశము. విదేశాలలో ఉండేవారికి ఇక్కడ సుఖము అనుభవమవ్వదు. అలాగే పిల్లలైన మీకు కూడా ఇక్కడ సుఖము లేదు. మీకు తెలుసు, మేము చాలా ఉన్నతమైన చదువును చదువుతున్నాము, దీని ద్వారా మేము స్వర్గాధిపతులైన దేవతలుగా అవుతాము. అక్కడ ఎంతటి సుఖము ఉంటుంది. ఆ సుఖాన్ని అందరూ తలచుకుంటారు. ఈ ఊరు (కలియుగము) అయితే గుర్తు కూడా రాదు, ఇందులోనైతే అపారమైన దుఃఖము ఉంది. ఈ రావణ రాజ్యము, పతిత ప్రపంచములో ఈనాడు అపారమైన దుఃఖము ఉంది, రేపు మళ్ళీ అపారమైన సుఖము ఉంటుంది. మనం యోగబలముతో అపారమైన సుఖము గల ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నాము. ఇది రాజయోగము కదా. నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారుచేస్తాను అని తండ్రి స్వయంగా చెప్తున్నారు కావున ఈ విధంగా తయారుచేసే టీచరును స్మృతి చేయాలి కదా. టీచరు లేకుండా బ్యారిస్టర్, ఇంజనీర్ మొదలైనవారిగా అవ్వలేరు. ఇక్కడ ఇది కొత్త విషయము. ఆత్మలు పరమాత్మ అయిన తండ్రితో యోగాన్ని జోడించాలి, వారి నుండే ఎంతోకాలం దూరంగా ఉన్నారు. ఎంతోకాలము అంటే ఎంత కాలము, అది కూడా తండ్రి స్వయంగా అర్థం చేయిస్తూ ఉంటారు. మనుష్యులైతే లక్షల సంవత్సరాల ఆయువు అని అంటారు. తండ్రి అంటారు, అలా కాదు, ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మొట్టమొదట మీరెవరైతే విడిపోయారో, మీరే వచ్చి తండ్రిని కలుసుకుంటారు. మీరే పురుషార్థము చేయాలి. మధురాతి మధురమైన పిల్లలకు ఎటువంటి కష్టమూ ఇవ్వరు, కేవలం స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్తారు. జీవ ఆత్మ కదా. ఆత్మ అవినాశీ, జీవము వినాశీ. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది, ఆత్మ ఎప్పుడూ పాతబడదు. ఇది అద్భుతము కదా. చదివించేవారూ అద్భుతమైనవారే, చదువు కూడా అద్భుతమైనదే. ఎవరికీ గుర్తు లేదు, మర్చిపోతారు. గత జన్మలో ఏమి చదివేవారు అన్నది ఎవరికైనా గుర్తుందా? ఈ జన్మలో మీరు చదువుతారు, దీని రిజల్టు కొత్త ప్రపంచములో లభిస్తుంది. ఇది కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమయుగమని, మనము కొత్త ప్రపంచములోకి వెళ్ళనున్నామని గుర్తుండాలి. ఇది గుర్తున్నా కూడా మీకు తండ్రి స్మృతి ఉంటుంది. స్మృతి కొరకు తండ్రి అనేక ఉపాయాలను తెలియజేస్తారు. వీరు తండ్రి కూడా, టీచరు కూడా మరియు సద్గురువు కూడా. మూడు రూపాలలోనూ స్మృతి చేయండి. స్మృతి చేయడానికి ఎన్ని యుక్తులను ఇస్తున్నారు. కానీ మాయ మరపింపజేస్తుంది. ఏ తండ్రి అయితే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారో, ఆ తండ్రే చెప్తున్నారు - ఇది పురుషోత్తమ సంగమయుగము, ఇది గుర్తు చేసుకోండి అని, అయినా ఎందుకు గుర్తు చేయలేకపోతారు! స్మృతి కోసం యుక్తులను తెలియజేస్తారు. అలాగే మాయ చాలా శక్తివంతమైనది అని కూడా చెప్తారు. అది మిమ్మల్ని ఘడియ, ఘడియ మరపింపజేస్తుంది మరియు దేహాభిమానులుగా చేసేస్తుంది. అందుకే ఎంత వీలైతే అంత స్మృతి చేస్తూ ఉండండి. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ దేహానికి బదులుగా స్వయాన్ని దేహీగా భావించండి. ఇదే మీరు చేయవలసిన శ్రమ. జ్ఞానమైతే చాలా సహజము. స్మృతి నిలవడం లేదు అని పిల్లలందరూ అంటారు. మీరు తండ్రిని స్మృతి చేస్తారు, మాయ మళ్ళీ తనవైపుకు లాక్కుంటుంది. దీనిపైనే ఈ ఆట తయారయ్యింది. మా బుద్ధియోగము ఏదైతే తండ్రితో మరియు చదువుకునే సబ్జెక్టులతో జోడించబడి ఉండాలో, అది అలా లేదు, మర్చిపోతున్నాము అని మీరు కూడా భావిస్తారు. కానీ మీరు అలా మర్చిపోకూడదు. వాస్తవానికి ఈ చిత్రాల అవసరం కూడా లేదు, కానీ చదివించే సమయములో ఏదో ఒకటి ఎదురుగా ఉండాలి కదా. ఎన్ని చిత్రాలు తయారవుతూ ఉంటాయి. పాండవ గవర్నమెంట్ ప్లాన్ ఎలా ఉందో చూడండి. ఆ గవర్నమెంట్ కు కూడా ప్లాన్ ఉంది. కొత్త ప్రపంచములో కేవలం భారత్ మాత్రమే ఉండేదని, అది చాలా చిన్నగా ఉండేదని మీరు భావిస్తారు. మొత్తం భారత్ విశ్వానికి అధిపతిగా ఉండేది. ప్రతీదీ కొత్తగా ఉంటుంది. ప్రపంచమైతే ఒక్కటే, పాత్రధారులు కూడా వారే, చక్రము తిరుగుతూ ఉంటుంది. ఇన్ని క్షణాలు, ఇన్ని గంటలు, ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు పూర్తయ్యాయి అని మీరు లెక్కపెడతారు, మళ్ళీ చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఇవాళ, రేపు అంటూ 5000 సంవత్సరాలు పూర్తయిపోయాయి. అన్ని దృశ్యాలు ఆట, పాటల్లా గతించిపోతూ ఉంటాయి. ఇది ఎంత పెద్ద అనంతమైన వృక్షము. వృక్షములోని ఆకులనైతే లెక్కపెట్టలేరు. ఇది వృక్షము. దీనికి పునాది దేవీ-దేవతా ధర్మము. దాని నుండి మూడు శాఖలు (ధర్మాలు) ముఖ్యముగా వెలువడ్డాయి. ఇకపోతే వృక్షములోని ఆకులైతే ఎన్ని ఉన్నాయి. వాటిని లెక్కపెట్టగలిగేంత శక్తి ఎవరికీ లేదు. ఈ సమయములో అన్ని ధర్మాల వృక్షాలు వృద్ధి చెందాయి. ఇది అనంతమైన పెద్ద వృక్షము. ఈ ధర్మాలన్నీ మళ్ళీ ఉండవు. ఇప్పుడు మొత్తం వృక్షమంతా నిలబడి ఉంది, ఇకపోతే దాని కాండము లేదు. మర్రి వృక్షము యొక్క ఉదాహరణ చాలా ఏక్యురేట్ గా ఉంది. ఈ ఒక్కటీ అద్భుతమైన వృక్షము. తండ్రి డ్రామాలో ఈ ఉదాహరణను అర్థం చేయించేందుకనే ఉంచారు. దీని కాండము లేదు. ఇది అర్థం చేసుకోవలసిన విషయము. తండ్రి మిమ్మల్ని ఎంత తెలివైనవారిగా తయారుచేసారు. ఇప్పుడు దేవతా ధర్మము యొక్క పునాది లేదు. పిండిలో ఉప్పంత ఏవో కొన్ని గుర్తులు మాత్రమే ఉన్నాయి. చివరిలో ఈ గుర్తులు కొన్ని మిగిలి ఉన్నాయి. కావున పిల్లల బుద్ధిలోకి ఈ జ్ఞానమంతా రావాలి. తండ్రి బుద్ధిలో కూడా జ్ఞానము ఉంది కదా. మీకు కూడా మొత్తం జ్ఞానమంతటినీ ఇచ్చి తమ సమానంగా తయారుచేస్తున్నారు. తండ్రి బీజరూపుడు మరియు ఇది తలకిందుల వృక్షము. ఇది పెద్ద అనంతమైన డ్రామా. ఇప్పుడు మీ బుద్ధి పైకి వెళ్ళిపోయింది. మీరు తండ్రిని మరియు రచనను తెలుసుకున్నారు. శాస్త్రాలలో ఉన్నా ఋషులు, మునులు ఎలా తెలుసుకోగలరు? ఒక్కరు తెలుసుకున్నా అది పరంపరగా నడవాలి కదా. కానీ అది అవసరమే లేదు. సద్గతి జరిగిన తర్వాత, ఇక మధ్యలో ఎవరూ తిరిగి వెళ్ళలేరు. నాటకం పూర్తయ్యేలోపు పాత్రధారులందరూ ఇక్కడకు చేరుకోవాలి, అప్పటివరకు తండ్రి ఇక్కడ ఉంటారు. ఎప్పుడైతే అక్కడ పూర్తిగా ఖాళీ అయిపోతుందో, అప్పుడిక శివబాబా ఊరేగింపు వెళ్తుంది. ముందునుండే వెళ్ళి అక్కడ కూర్చోరు. కావున తండ్రి కూర్చుని మొత్తం జ్ఞానమంతటినీ ఇస్తారు. ఈ ప్రపంచపు చక్రము ఎలా రిపీట్ అవుతుంది. సత్యయుగము, త్రేతా, ద్వాపర, కలియుగాలు... ఆ తర్వాత సంగమము ఉంటుంది. గాయనము ఉంది కానీ సంగమయుగమనేది ఎప్పుడు ఉంటుంది అన్నది ఎవరికీ తెలియదు.

నాలుగు యుగాలు ఉన్నాయి అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇది లీప్ యుగము, దీనిని చిన్న యుగము అని కూడా అంటారు. శ్రీకృష్ణుడిని కూడా చిన్నగానే చూపిస్తారు. ఇది జ్ఞానము. జ్ఞానాన్ని అటు-ఇటు మార్చి భక్తిలో ఎలా తయారుచేశారు. జ్ఞానము యొక్క దారమంతా చిక్కుబడిపోయింది. దానిని అర్థం చేయించేవారు అయితే ఒక్క తండ్రే. ప్రాచీన రాజయోగాన్ని నేర్పించేందుకు విదేశాలకు వెళ్తారు. అది ఇదే కదా. ప్రాచీనము అనగా మొట్టమొదటిది. సహజ రాజయోగాన్ని నేర్పించేందుకు తండ్రి వచ్చారు. ఎంతటి అటెన్షన్ ఉంటుంది. స్వర్గ స్థాపన జరగాలి అని మీరు కూడా అటెన్షన్ పెడతారు. ఆత్మకు స్మృతి అయితే వస్తుంది కదా. తండ్రి అంటారు, ఈ జ్ఞానమునేదైతే నేను ఇప్పుడు మీకు ఇస్తున్నానో దీనిని మళ్ళీ నేనే వచ్చి ఇస్తాను. ఇది కొత్త ప్రపంచము కొరకు కొత్త జ్ఞానము. ఈ జ్ఞానము బుద్ధిలో ఉన్నట్లయితే సంతోషం ఎంతో ఉంటుంది. ఇంకా కొద్ది సమయమే ఉంది. ఇప్పుడిక వెళ్ళాలి. ఒకవైపు సంతోషం కలుగుతుంది, మళ్ళీ ఇంకొకవైపు - అరే, ఇటువంటి మధురమైన తండ్రిని మనం మళ్ళీ కల్పం తర్వాతే చూస్తాము అని ఫీలింగ్ కూడా కలుగుతుంది. తండ్రే పిల్లలకు ఇంతటి సుఖాన్ని ఇస్తారు కదా. తండ్రి శాంతిధామానికి, సుఖధామానికి తీసుకువెళ్ళేందుకే వస్తారు. మీరు శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేసినట్లయితే తండ్రి కూడా గుర్తుకువస్తారు. ఈ దుఃఖధామాన్ని మర్చిపోండి. అనంతమైన తండ్రి అనంతమైన విషయాన్ని వినిపిస్తారు. పాత ప్రపంచము నుండి మీ మమకారం తొలగిపోతూ ఉన్నట్లయితే సంతోషము కూడా కలుగుతుంది. ఫలితంగా మీరు సుఖధామానికి వెళ్తారు. సతోప్రధానులుగా అవుతూ ఉంటారు. కల్ప-కల్పమూ ఎవరైతే అయ్యారో వారే అవుతారు మరియు వారికే సంతోషము కలుగుతుంది. ఇక ఈ పాత శరీరాన్ని వదిలేస్తారు. మళ్ళీ కొత్త శరీరాన్ని తీసుకుని సతోప్రధాన ప్రపంచములోకి వస్తారు. ఈ జ్ఞానము అంతమైపోతుంది. విషయాలైతే చాలా సహజమైనవి. రాత్రివేళ పడుకునే సమయములో ఇలా-ఇలా స్మరిస్తూ ఉన్నా సరే - మేము ఇలా తయారవుతున్నాము అన్న సంతోషము కలుగుతుంది. రోజంతటిలో నేను ఎటువంటి ఆసురీ పనిని చేయలేదు కదా? పంచ వికారాలలో ఏ వికారమూ నన్ను విసిగించలేదు కదా? లోభమైతే రాలేదు కదా? తమను తాము చెక్ చేసుకోవాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. యోగబలముతో అపారమైన సుఖాల ప్రపంచాన్ని స్థాపన చేయాలి. ఈ దుఃఖమయమైన పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. మనము సత్యఖండానికి యజమానులుగా అవుతున్నాము అన్న సంతోషము ఉండాలి.

2. రోజూ స్వయాన్ని చెక్ చేసుకోవాలి - మొత్తం రోజంతటిలో ఏ వికారమూ విసిగించలేదు కదా? ఎటువంటి ఆసురీ పనిని చేయలేదు కదా? లోభానికి వశమైతే అవ్వలేదు కదా?

వరదానము:- వరదాత ద్వారా సర్వ శ్రేష్ఠ సంపద యొక్క వరదానాన్ని ప్రాప్తి చేసుకునే సంపత్తివాన్ భవ
ఎవరి వద్దనైనా ఒకవేళ స్థూల సంపద మాత్రమే ఉన్నా సరే సదా సంతుష్టంగా ఉండలేరు. స్థూల సంపదతోపాటుగా ఒకవేళ సర్వ గుణాల సంపద, సర్వ శక్తుల సంపద మరియు జ్ఞానము అనే శ్రేష్ఠ సంపద లేనట్లయితే సంతుష్టత సదా ఉండదు. మీ అందరివద్దనైతే ఈ శ్రేష్ఠ సంపదలన్నీ ఉన్నాయి. ప్రపంచములోనివారు కేవలం స్థూల సంపద కలవారినే సంపన్నులుగా భావిస్తారు కానీ వరదాత అయిన తండ్రి ద్వారా పిల్లలైన మీకు సర్వ శ్రేష్ఠ సంపత్తివాన్ భవ అన్న వరదానము లభించి ఉంది.
స్లోగన్:- సత్యమైన సాధన ద్వారా అయ్యో, అయ్యో అన్నదానిని వాహ్, వాహ్ లోకి పరివర్తన చెయ్యండి.

 

మురళి అంటే ఏమిటి?

మురళి బ్రహ్మకుమారీల దైనిక ఆధ్యాత్మిక బోధన, ఇది ప్రతి ఉదయం మధుబన్ నుండి ప్రచురించబడుతుంది. ఇక్కడ మీరు ఈరోజు మురళిని తెలుగులో చదవవచ్చు, ఆడియో వినవచ్చు మరియు PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధ్యయనానికి సహాయంగా పాఠ్యాన్ని హైలైట్ చేయవచ్చు — మీ గుర్తులు ఈ బ్రౌజర్‌లోనే సురక్షితంగా ఉంటాయి.

28 భాషల్లో మురళి

Daily Murli · Madhuban మూలం: మధుబన్ మురళి విభాగం ఇది స్వతంత్ర రీడర్ యాప్, అధికారిక వెబ్‌సైట్ కాదు.