తెలుగు మురళి · Brahma Kumaris

తెలుగు మురళి · 24 డిసెంబర్, 2024

ఓం శాంతి · BapDada ·

ఈరోజు మురళి — today’s murli in Telugu, BK Telugu murli.

18
మురళి24 డిసెంబర్, 2024 · తెలుగు
0:00--:--

పాఠ్యాన్ని ఎంచుకోండి → హైలైట్ / బాక్స్ / అండర్‌లైన్

24-12-2024
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
మధువనం

‘‘మధురమైన పిల్లలూ - అపారమైన సంతోషములో మరియు నషాలో ఉండేందుకు దేహాభిమానమనే వ్యాధిని వదిలి ప్రీతిబుద్ధి కలవారిగా అవ్వండి, మీ నడవడికను తీర్చిదిద్దుకోండి’’
ప్రశ్న:- ఏ పిల్లలకు జ్ఞానము యొక్క తప్పుడు నషా ఎక్కదు?
జవాబు:- ఎవరైతే తండ్రిని యథార్థరీతిగా తెలుసుకుని స్మృతి చేస్తారో, హృదయపూర్వకముగా తండ్రిని మహిమ చేస్తారో, ఎవరికైతే చదువుపై పూర్తి శ్రద్ధ ఉంటుందో, వారికి జ్ఞానము యొక్క తప్పుడు నషా ఎక్కదు. ఎవరైతే తండ్రిని సాధారణమైనవారిగా భావిస్తారో వారు తండ్రిని స్మృతి చేయలేరు. స్మృతి చేసినట్లయితే తమ సమాచారాన్ని కూడా తండ్రికి తప్పకుండా ఇస్తారు. పిల్లలు తమ సమాచారాన్ని ఇవ్వడం లేదంటే, ఈ పిల్లలు మూర్ఛితులవ్వలేదు కదా అని తండ్రికి ఆలోచన నడుస్తుంది.

ఓం శాంతి. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు - పిల్లలూ, ఎప్పుడైనా ఎవరైనా కొత్తవారు వస్తే వారికి మొదట హద్దులోని తండ్రి మరియు అనంతమైన తండ్రి, ఇరువురు తండ్రుల పరిచయాన్ని ఇవ్వండి. అనంతమైన తండ్రి అనగా అనంతమైన ఆత్మల తండ్రి. ఆ హద్దులోని తండ్రి ప్రతి జీవాత్మకూ వేర్వేరు ఉంటారు. ఈ జ్ఞానాన్ని కూడా అందరూ ఒకేలా ధారణ చేయలేరు. కొందరు ఒక శాతం, కొందరు 95 శాతం ధారణ చేస్తారు. ఇది అర్థం చేసుకోవలసిన విషయము. సూర్యవంశీ, చంద్రవంశీ రాజ్యకుటుంబాలు ఉంటాయి కదా. రాజు, రాణి మరియు ప్రజలు ఉంటారు. ప్రజలలో అన్ని రకాల మనుష్యులూ ఉంటారు. ప్రజలు అంటే ప్రజలే. తండ్రి అర్థం చేయిస్తారు - ఇది చదువు, ప్రతి ఒక్కరూ తమ బుద్ధి అనుసారముగానే చదువుకుంటారు. ప్రతి ఒక్కరికీ తమ తమ పాత్ర లభించి ఉంది. కల్పపూర్వము ఎవరు ఎంతగా ఈ చదువును ధారణ చేశారో, అంతగానే ఇప్పుడు కూడా చేస్తారు. చదువు ఎప్పుడూ దాగి ఉండలేదు. చదువు అనుసారముగానే పదవి కూడా లభిస్తుంది. తండ్రి అర్థం చేయించారు, మున్ముందు పరీక్ష ఉంటుంది. పరీక్ష లేకుండా ట్రాన్స్ఫర్ అవ్వలేరు. కావున చివరిలో అంతా తెలుస్తుంది కానీ - మేము ఏ పదవికి యోగ్యులుగా ఉన్నాము అన్నది ఇప్పుడు కూడా అర్థం చేసుకోగలరు. సిగ్గు కారణముగా అందరూ చేతులు ఎత్తుతారు కానీ - అలా మేము అవ్వలేము కదా అన్నది అర్థం చేసుకోగలరు. అయినా చేతులెత్తుతారు. దీనిని కూడా అజ్ఞానమునే అంటారు. వీరికన్నా లౌకిక విద్యార్థులలో ఎక్కువ తెలివి ఉంటుంది అని తండ్రి వెంటనే అర్థం చేసుకుంటారు. మేము స్కాలర్షిప్ తీసుకునేందుకు యోగ్యులుగా లేము, మేము పాస్ అవ్వము అని ఆ లౌకిక విద్యార్థులలో అర్థం చేసుకుంటారు. టీచర్ ఏదైతే చదివిస్తున్నారో అందులో మేము ఎన్ని మార్కులను తీసుకుంటాము అన్నది వారు అర్థం చేసుకుంటారు. అంతేకానీ మేము పాస్ విత్ ఆనర్లుగా అవుతాము అని అయితే అనరు కదా. ఇక్కడైతే చాలామంది పిల్లలలో ఇంతటి తెలివి కూడా లేదు, దేహాభిమానము ఎంతగానో ఉంది. వీరిలా (దేవతలుగా) అయ్యేందుకు వచ్చారు కానీ అటువంటి నడవడిక కూడా కావాలి కదా. తండ్రి అంటారు, వినాశకాలే విపరీతబుద్ధి, ఎందుకంటే నియమానుసారముగా తండ్రిపై ప్రీతి లేదు.

వినాశకాలే విపరీత బుద్ధి అన్నదానికి యథార్థమైన అర్థమేమిటో తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. పిల్లలే పూర్తిగా అర్థం చేసుకోలేకపోతే ఇక వారేమి అర్థం చేసుకుంటారు? తండ్రిని స్మృతి చేయడము అనేది గుప్తమైన విషయము. చదువు అయితే గుప్తమైనది కాదు కదా. చదువులో నంబరువారుగా ఉంటారు. అందరూ ఒకేలా చదువుకోరు. ఇప్పుడు ఇంకా బేబీలా ఉన్నారు అని బాబా భావిస్తారు. ఇటువంటి అనంతమైన తండ్రిని మూడేసి, నాలుగేసి నెలలు స్మృతి కూడా చేయరు. స్మృతి చేస్తున్నారు అన్నది ఎలా తెలుస్తుంది? బాబా, నేను ఎలా, ఎలా నడుచుకుంటున్నాను, ఏమేమి సేవలు చేస్తున్నాను అని తండ్రికి ఉత్తరము కూడా వ్రాయరు. పిల్లలు ఎక్కడా మూర్ఛితులవ్వలేదు కదా, పిల్లలు మరణించలేదు కదా అని తండ్రికి పిల్లల యొక్క చింత ఎంతగా ఉంటుంది. కొందరైతే బాబాకు ఎంత మంచి-మంచి సేవా సమాచారాలు వ్రాస్తూ ఉంటారు. బిడ్డ జీవించి ఉన్నాడు అని తండ్రి కూడా అర్థం చేసుకుంటారు. సేవ చేసే పిల్లలు ఎప్పుడూ దాగి ఉండలేరు. ఏ ఏ పిల్లలు ఎలా ఉన్నారు అని తండ్రి అయితే పిల్లలందరి హృదయాలను పరిశీలిస్తూ ఉంటారు. దేహాభిమానపు వ్యాధి చాలా కఠినమైనది. బాబా మురళిలో అర్థం చేయిస్తారు, కొందరికైతే జ్ఞానము యొక్క తప్పుడు నషా ఎక్కుతుంది, అహంకారము వచ్చేస్తుంది, ఇక స్మృతి కూడా చేయరు, ఉత్తరాలు కూడా వ్రాయరు, మరి తండ్రి కూడా ఎలా స్మృతి చేస్తారు? స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రిని యథార్థముగా తెలుసుకుని స్మృతి చేస్తారు, హృదయపూర్వకముగా మహిమ చేస్తారు. కొంతమంది పిల్లలు తండ్రిని సాధారణమైనవారిగా భావిస్తారు, అందుకే స్మృతి చేయరు. బాబా ఏమీ ఆర్భాటము మొదలైనవి చూపించరు. భగవానువాచ, నేను మీకు విశ్వ రాజ్యాధికారాన్ని ఇవ్వడానికి రాజయోగాన్ని నేర్పిస్తాను. మేము విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకునేందుకు అనంతమైన తండ్రి నుండి చదువుకుంటున్నాము అని మీరు భావించడం లేదు. ఈ నషా ఉన్నట్లయితే అపారమైన సంతోషపు పాదరసము సదా పైకి ఎక్కి ఉంటుంది. గీతను చదివేవారు - శ్రీకృష్ణ భగవానువాచ, నేను రాజయోగాన్ని నేర్పిస్తాను అని అంటారు కానీ వారికి రాజ్యాన్ని పొందే సంతోషము ఉంటుందా. గీతను చదివి పూర్తి చేస్తారు, మళ్ళీ తమ-తమ వ్యాపార వ్యవహారాలలోకి వెళ్ళిపోతారు. మమ్మల్ని అనంతమైన తండ్రి చదివిస్తున్నారు అని మీకైతే ఇప్పుడు బుద్ధిలో ఉంది. వారి బుద్ధిలోకి ఇలా రాదు. కావున మొట్టమొదట ఎవరు వచ్చినా వారికి ఇద్దరు తండ్రుల పరిచయాన్ని ఇవ్వాలి. ఇలా చెప్పండి - భారత్ స్వర్గముగా ఉండేది, ఇప్పుడు నరకముగా ఉంది. ఇది కలియుగము, దీనిని స్వర్గము అని అనరు. సత్యయుగములోనూ ఉన్నారు, కలియుగములోనూ ఉన్నారు అని అయితే అనరు కదా. ఎవరికైనా దుఃఖము కలిగితే నరకములో ఉన్నారు అని అంటారు, ఎవరికైనా సుఖము ఉంటే వారు స్వర్గములో ఉన్నారు అని అంటారు. దుఃఖితులైన మనుష్యులు నరకములో ఉన్నారు, మేమైతే చాలా సుఖములో కూర్చున్నాము, మహళ్ళు, మోటార్లు మొదలైనవన్నీ ఉన్నాయి అని ఎంతోమంది అంటారు, మేమైతే స్వర్గములో ఉన్నాము అని భావిస్తారు, స్వర్ణయుగము, ఇనుపయుగము రెండూ ఒకటే అని అనుకుంటారు.

మొట్టమొదట ఇద్దరు తండ్రులు అన్న విషయాన్ని బుద్ధిలో కూర్చోబెట్టాలి. తండ్రే స్వయంగా తమ పరిచయాన్ని ఇస్తారు. వారు సర్వవ్యాపి ఎలా అవ్వగలరు? లౌకిక తండ్రిని సర్వవ్యాపి అని అంటారా? ఆత్మ మరియు పరమాత్మల రూపమైతే ఒక్కటేనని మీరు చిత్రములో చూపిస్తారు, అందులో తేడా లేదు. ఆత్మ మరియు పరమాత్మ చిన్నగా లేక పెద్దగా ఉండరు. అందరూ ఆత్మలే, వారూ కూడా ఆత్మయే. వారు సదా పరంధామములో ఉంటారు, అందుకే వారిని పరమ ఆత్మ అని అంటారు. కేవలం ఆత్మలైన మీరు ఏ విధంగా వస్తారో నేను అలా రాను. నేను అంతిమములో వచ్చి ఈ తనువులోకి ప్రవేశిస్తాను. ఈ విషయాన్ని బయటివారు ఎవరూ అర్థం చేసుకోలేరు. వాస్తవానికి ఈ విషయము చాలా సహజమైనది. కేవలం తేడా ఏమిటంటే తండ్రికి బదులుగా వైకుంఠవాసి అయిన శ్రీకృష్ణుని పేరును వేసేశారు. శ్రీకృష్ణుడు వైకుంఠము నుండి నరకములోకి వచ్చి రాజయోగాన్ని నేర్పించారా? దేహ సహితముగా అన్నింటినీ మరిచి... నన్నొక్కరినే స్మృతి చేయండి అని శ్రీకృష్ణుడు ఎలా అనగలరు? దేహధారి స్మృతితో పాపాలు ఎలా అంతమవుతాయి? శ్రీకృష్ణుడైతే ఒక చిన్న పిల్లవాడు, కానీ నేను వచ్చేది ఒక సాధారణ వృద్ధ మానవ తనువులో, ఎంత తేడా ఉంది. ఈ ఏకైక పొరపాటు కారణముగా మనుష్యులందరూ పతితులుగా, నిరుపేదలుగా అయిపోయారు. నేనూ సర్వవ్యాపిని కాను, శ్రీకృష్ణుడూ సర్వవ్యాపి కారు. ప్రతి శరీరములోనూ ఆత్మ సర్వవ్యాపి. నాకైతే నా శరీరము కూడా లేదు. ప్రతి ఆత్మకూ తన-తన శరీరము ఉంది. పేరు ప్రతి శరీరానికి వేర్వేరుగా ఉంటుంది. నాకు శరీరము లేదు, అలాగే నాకు శారీరకమైన పేరు కూడా ఏమీ లేదు. నేనైతే వృద్ధ మానవ శరీరాన్ని తీసుకుంటాను కావున ఇతనికి పేరు మార్చి బ్రహ్మా అన్న పేరును పెడతాను. బ్రహ్మా అన్న పేరు నాది కాదు. నన్ను సదా శివ అనే అంటారు. నేనే సర్వుల సద్గతిదాతను. ఆత్మను సర్వుల సద్గతిదాత అని అనరు. పరమాత్మకు ఎప్పుడైనా దుర్గతి కలుగుతుందా? ఆత్మకే దుర్గతి మరియు ఆత్మకే సద్గతి లభిస్తుంది. ఈ విషయాలన్నీ విచార సాగర మంథనము చేయవలసినవి. లేకపోతే ఇతరులకు ఎలా అర్థం చేయిస్తారు. కానీ మాయ ఎంత శక్తివంతమైనదంటే, అది పిల్లల బుద్ధిని ముందుకు వెళ్ళనివ్వదు. రోజంతా పరచింతనలోనే సమయాన్ని వృధా చేస్తారు. తండ్రి నుండి దూరం చేయడానికి మాయ ఎంత ఫోర్స్ చేస్తూ ఉంటుంది. ఇకదానితో చాలామంది పిల్లలు దూరమైపోతారు. తండ్రిని స్మృతి చేయకపోతే అవస్థ అచలముగా, స్థిరముగా తయారవ్వదు. తండ్రి ఘడియ-ఘడియ నిల్చోబెడతారు, మాయ పడేస్తూ ఉంటుంది. తండ్రి అంటారు, ఎప్పుడూ ఓడిపోకూడదు. కల్ప-కల్పము ఇలా జరుగుతుంది, ఇది కొత్త విషయమేమీ కాదు. మాయాజీతులుగా అంతిమములో అయిపోతారు. రావణ రాజ్యము అంతమైపోయేదే ఉంది. మళ్ళీ మనము కొత్త ప్రపంచములో రాజ్యము చేస్తాము. కల్ప-కల్పము మాయాజీతులుగా అయ్యాము. లెక్కలేనన్ని సార్లు కొత్త ప్రపంచములో రాజ్యం చేసాము. తండ్రి అంటారు, బుద్ధిని సదా బిజీగా ఉంచుకున్నట్లయితే సదా సురక్షితముగా ఉంటారు. దీనినే స్వదర్శన చక్రధారిగా అవ్వటము అని అంటారు. అంతేకానీ ఇందులో హింస మొదలైనవాటి విషయమేమీ లేదు. బ్రాహ్మణులే స్వదర్శన చక్రధారులుగా ఉంటారు. దేవతలను స్వదర్శన చక్రధారులు అని అనరు. పతిత ప్రపంచపు ఆచార వ్యవహారాలకు మరియు దేవీ-దేవతల ఆచార వ్యవహారాలకు ఎంతో తేడా ఉంటుంది. మృత్యులోకము వారే పతిత-పావనుడైన తండ్రిని పిలుస్తారు - పతితులైన మమ్మల్ని మీరు వచ్చి పావనముగా తయారుచేయండి, పావన ప్రపంచములోకి తీసుకువెళ్ళండి అని. నేటికి 5000 సంవత్సరాల క్రితం కొత్త పావన ప్రపంచము ఉండేదని, దానిని సత్యయుగము అని అంటారని మీ బుద్ధిలో ఉంది. త్రేతాను కొత్త ప్రపంచము అని అనరు. తండ్రి అర్థం చేయించారు - అది ఫస్ట్ క్లాస్, ఇంకొకటి సెకండ్ క్లాస్. ఒక్కొక్క విషయాన్ని బాగా ధారణ చేయాలి, వాటిని ఎవరైనా వచ్చి వింటే ఆశ్చర్యపోవాలి. కొందరు ఆశ్చర్యపోతారు కూడా, కానీ పురుషార్థము చేయడానికి తీరిక లేదు. మళ్ళీ పవిత్రముగా తప్పకుండా అవ్వాలి అన్నది వింటారు. ఈ కామ వికారమే మనుష్యులను పతితులుగా చేస్తుంది, దానిని జయించడం ద్వారా మీరు జగత్ జీతులుగా అవుతారు. కానీ కామవికారము వారికి ఒక ఆస్తి వంటిది, అందుకే ఆ పదాన్ని వాడరు. కేవలం మనస్సును వశం చేసుకోండి అని అంటారు. కానీ ఎప్పుడైతే శరీరములో ఉండరో అప్పుడే మనస్సు నిస్సంకల్పంగా అవుతుంది. అంతేకానీ మనస్సు ఆలోచించకుండా ఉండడమనేది ఎప్పుడూ జరగనే జరగదు. దేహము అనేది కర్మ చేయడానికే లభిస్తుంది, మరి కర్మాతీత అవస్థలో ఎలా ఉండగలరు? శవానిది కర్మాతీత అవస్థ అని అంటారు. జీవిస్తూనే మరణించడము అనగా శరీరము నుండి అతీతముగా అవ్వడము. తండ్రి మీకు శరీరము నుండి అతీతముగా అయ్యే చదువును చదివిస్తారు. ఆత్మ శరీరము నుండి వేరుగా ఉంటుంది. ఆత్మ పరంధామ నివాసి. ఆత్మ శరీరములోకి వస్తే వారిని మనిషి అని అంటారు. కర్మలు చేయడానికే శరీరము లభిస్తుంది. కర్మలు చేయడానికి ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకోవాలి. ఎప్పుడైతే శరీరములో ఉండరో అప్పుడే శాంతి ఉంటుంది. మూలవతనములో కర్మ ఉండదు. సూక్ష్మవతనపు విషయమే లేదు. సృష్టి చక్రము ఇక్కడే తిరుగుతుంది. తండ్రిని మరియు సృష్టి చక్రాన్ని తెలుసుకోవడమునే జ్ఞానము అని అంటారు. సూక్ష్మవతనములో శ్వేత వస్త్రధారులూ ఉండరు, అలంకరించబడినవారూ ఉండరు, అలాగే సర్పాలను ధరించిన శంకరుడు మొదలైనవారు కూడా ఉండరు. బ్రహ్మా మరియు విష్ణువు యొక్క రహస్యాన్ని తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. బ్రహ్మా ఇక్కడ ఉన్నారు, విష్ణువు యొక్క రెండు రూపాలు కూడా ఇక్కడే ఉన్నారు. అది కేవలం సాక్షాత్కారము యొక్క పాత్రగా డ్రామాలో ఉంది, ఇకపోతే దానిని దివ్యదృష్టి ద్వారా చూడడం జరుగుతుంది. అశుద్ధమైన నేత్రాలకు పవిత్రమైన వస్తువులు కనిపించవు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మిమ్మల్ని మీరు సదా సురక్షితముగా ఉంచుకునేందుకు బుద్ధిని విచార సాగర మంథనములో బిజీగా ఉంచుకోవాలి. స్వదర్శన చక్రధారులుగా ఉండాలి. పరచింతన విషయాలు మాట్లాడటములో మీ సమయాన్ని వృధా చేసుకోకూడదు.

2. శరీరము నుండి అతీతముగా ఉండే చదువును ఏదైతే తండ్రి చదివిస్తారో దానిని చదువుకోవాలి. మాయ ఫోర్సు నుండి రక్షించుకునేందుకు మీ అవస్థను అచలముగా, స్థిరముగా తయారుచేసుకోవాలి.

వరదానము:- బ్రహ్మాబాబా సమానముగా లక్ష్యమును లక్షణములోకి తీసుకువచ్చే ప్రత్యక్ష శ్యాంపుల్ గా అయ్యి సర్వుల సహయోగీ భవ
ఏ విధంగా బ్రహ్మాబాబా స్వయాన్ని నిమిత్త ఉదాహరణగా చేసుకున్నారు, సదా ఈ లక్ష్యమును లక్షణములోకి తీసుకువచ్చారు - ఎవరైతే తమకు తాముగా ముందుకు వచ్చి సేవా బాధ్యతను తీసుకుంటారో వారే అర్జునులు అని, దీని ద్వారానే నంబర్ వన్ గా అయ్యారు. అలా ఫాలో ఫాదర్ చెయ్యండి. కర్మ ద్వారా సదా స్వయం జీవితములో గుణమూర్తులుగా అయ్యి, ప్రత్యక్ష ఉదాహరణగా అయ్యి, ఇతరులకు సహజముగా గుణాలను ధారణ చేయడానికి సహయోగాన్ని ఇవ్వండి - దీనినే గుణదానము అని అంటారు. దానము యొక్క అర్థమే సహయోగాన్ని ఇవ్వటము. ఏ ఆత్మ అయినా ఇప్పుడు వినడానికి బదులుగా ప్రత్యక్ష ప్రమాణాన్ని చూడాలని కోరుకుంటుంది. కావున మొదట స్వయాన్ని గుణమూర్తులుగా తయారుచేసుకోండి.
స్లోగన్:- సర్వుల నిరాశల అంధకారాన్ని దూరము చేసేవారే జ్ఞాన దీపాలు.

 

మురళి అంటే ఏమిటి?

మురళి బ్రహ్మకుమారీల దైనిక ఆధ్యాత్మిక బోధన, ఇది ప్రతి ఉదయం మధుబన్ నుండి ప్రచురించబడుతుంది. ఇక్కడ మీరు ఈరోజు మురళిని తెలుగులో చదవవచ్చు, ఆడియో వినవచ్చు మరియు PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధ్యయనానికి సహాయంగా పాఠ్యాన్ని హైలైట్ చేయవచ్చు — మీ గుర్తులు ఈ బ్రౌజర్‌లోనే సురక్షితంగా ఉంటాయి.

28 భాషల్లో మురళి

Daily Murli · Madhuban మూలం: మధుబన్ మురళి విభాగం ఇది స్వతంత్ర రీడర్ యాప్, అధికారిక వెబ్‌సైట్ కాదు.