| 28-12-2024 |
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
|
మధువనం |
| ‘‘మధురమైన పిల్లలూ - మిమ్మల్ని సర్వ ఖజానాలతో సుసంపన్నులుగా చేసేందుకు తండ్రి వచ్చారు, మీరు కేవలం ఈశ్వరీయ మతముపై నడవండి, మంచి రీతిలో పురుషార్థము చేసి వారసత్వాన్ని తీసుకోండి, మాయతో ఓడిపోకండి’’ | |
| ప్రశ్న:- | ఈశ్వరీయ మతము, దైవీ మతము మరియు మనుష్య మతము మధ్యన ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటి? |
| జవాబు:- | ఈశ్వరీయ మతము ద్వారా పిల్లలైన మీరు తిరిగి మీ ఇంటికి వెళ్తారు, ఆ తర్వాత కొత్త ప్రపంచములో ఉన్నత పదవిని పొందుతారు. దైవీ మతము ద్వారా మీరు సదా సుఖమయముగా ఉంటారు ఎందుకంటే అది కూడా తండ్రి ద్వారా ఈ సమయములో లభించిన మతము, కానీ ఎంతైనా కిందకే దిగుతారు. మనుష్య మతము దుఃఖితులుగా చేస్తుంది. ఈశ్వరీయ మతముపై నడిచేందుకు మొట్టమొదట చదివించే తండ్రిపై పూర్తి నిశ్చయము ఉండాలి. |
ఓం శాంతి. తండ్రి దీని అర్థాన్ని అయితే అర్థం చేయించారు, ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్ని. ఓంశాంతి అని అన్నప్పుడు ఆత్మకు తన ఇల్లు గుర్తుకు వస్తుంది. ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్ని. తర్వాత ఎప్పుడైతే ఇంద్రియాలు లభిస్తాయో, అప్పుడు ఆత్మ టాకీగా అవుతుంది (మాటలలోకి వస్తుంది). మొదట ఇంద్రియాలు చిన్నగా ఉంటాయి, ఆ తర్వాత పెద్దవి అవుతాయి. ఇప్పుడు పరమపిత పరమాత్మ అయితే నిరాకారుడు. టాకీగా అయ్యేందుకు వారికి కూడా రథము కావాలి. ఏ విధముగా ఆత్మలైన మీరు పరంధామ నివాసులో, మళ్ళీ ఇక్కడకు వచ్చి టాకీగా అవుతారో, అలాగే తండ్రి కూడా అంటారు, నేను మీకు జ్ఞానాన్ని ఇచ్చేందుకు టాకీగా అయ్యాను. తండ్రి తమ మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాల పరిచయాన్ని ఇస్తారు. ఇది ఆత్మిక చదువు, అది దైహికమైన చదువు. వారు స్వయాన్ని శరీరముగా భావిస్తారు. ఆత్మయైన మేము ఈ చెవుల ద్వారా వింటున్నాము అని ఎవరూ అనరు. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు - తండ్రి పతిత-పావనుడు, వారే వచ్చి - నేను ఎలా వస్తాను అన్నది అర్థం చేయిస్తారు. మీలా నేను గర్భములోకి రాను. నేను వీరిలోకి ప్రవేశిస్తాను. ఇక ఇందులో ప్రశ్న ఏమీ ఉత్పన్నమవ్వదు. ఇది రథము, వీరిని మాత అని కూడా అంటారు. అన్నింటికన్నా పెద్ద నది బ్రహ్మపుత్ర. కావున వీరు అందరికన్నా పెద్ద నది. ఇది స్థూలమైన నీటి విషయము కాదు. ఇతను మహానది అనగా అందరికన్నా పెద్ద జ్ఞాన నది. నేను మీ తండ్రిని అని తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఏ విధంగా మీరు మాట్లాడుతారో అలాగే నేను కూడా మాట్లాడుతాను. నా పాత్ర అందరికన్నా చివరిలో ఉంది. ఎప్పుడైతే మీరు పూర్తిగా పతితముగా అయిపోతారో, అప్పుడు మిమ్మల్ని పావనముగా తయారుచేయడానికి రావలసి ఉంటుంది. ఈ లక్ష్మీ-నారాయణులను ఇలా తయారుచేసేవారు ఎవరు? ఈశ్వరుడు తప్ప ఇంకెవరి గురించి అలా అనలేరు. అనంతమైన తండ్రియే స్వర్గాధిపతిగా తయారుచేస్తారు కదా. తండ్రియే జ్ఞానసాగరుడు. వారే అంటారు - నేను ఈ మనుష్య సృష్టికి చైతన్య బీజరూపుడను. నాకు ఆదిమధ్యాంతాల గురించి తెలుసు. నేను సత్యమును, చైతన్య బీజరూపుడను, ఈ సృష్టి రూపీ వృక్షము యొక్క జ్ఞానము నాలో ఉంది. దీనిని సృష్టిచక్రము లేక డ్రామా అని అంటారు. ఇది తిరుగుతూనే ఉంటుంది. ఆ హద్దులోని డ్రామా రెండు గంటలు నడుస్తుంది. దీని రీలు 5000 సంవత్సరాలు ఉంటుంది. ఎంతెంత సమయమైతే గతిస్తూ ఉంటుందో, అది 5000 సంవత్సరాల నుండి తక్కువవుతూ ఉంటుంది. మొదట మనం దేవీ-దేవతలుగా ఉండేవారమని, తర్వాత మెల్లమెల్లగా మనం క్షత్రియ కులములోకి వచ్చామని మీకు తెలుసు. ఈ రహస్యమంతా బుద్ధిలో ఉంది కదా. కావున దీనిని స్మరిస్తూ ఉండాలి. మనం ప్రారంభములో పాత్రను అభినయించడానికి వచ్చినప్పుడు మనమే దేవీ-దేవతలుగా ఉండేవారము. 1250 సంవత్సరాలు రాజ్యము చేసాము. సమయమైతే గతిస్తూ ఉంటుంది కదా. లక్షల సంవత్సరాల విషయమైతే కాదు. లక్షల సంవత్సరాల విషయాన్ని అయితే ఎవరూ చింతన చేయలేరు కూడా.
మనం ఈ దేవీ-దేవతలుగా ఉండేవారమని, తర్వాత పాత్రను అభినయిస్తూ సంవత్సరం తర్వాత సంవత్సరం గడుస్తూ, గడుస్తూ ఇప్పటికి ఎన్ని సంవత్సరాలను దాటామనేది పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. మెల్లమెల్లగా సుఖము తగ్గిపోతూ ఉంటుంది. ప్రతి వస్తువూ సతోప్రధానముగా, సతో, రజో, తమోగా అవుతుంది. పాతగా తప్పకుండా అవుతుంది. ఇక్కడ ఇది అనంతమైన విషయము. ఈ విషయాలన్నింటినీ బుద్ధిలో బాగా ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించాలి. అందరూ ఒకేలా ఉండరు. తప్పకుండా వివిధ రీతుల్లో అర్థం చేయిస్తూ ఉండవచ్చు. చక్రాన్ని అర్థం చేయించడం అన్నింటికన్నా సహజము. డ్రామా మరియు వృక్షము, రెండూ ముఖ్యమైన చిత్రాలు. కల్పవృక్షము అన్న పేరు ఉంది కదా. కల్పము ఆయువు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది. ఇది ఎవరికీ తెలియదు. మనుష్యులవి అనేక అభిప్రాయాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారు. ఇప్పుడు మీరు అనేక మనుష్య మతాలను కూడా అర్థం చేసుకున్నారు మరియు ఒక్క ఈశ్వరీయ మతాన్ని కూడా అర్థం చేసుకున్నారు. ఎంత తేడా ఉంది. ఈశ్వరీయ మతము ద్వారా మీరు మళ్ళీ కొత్త ప్రపంచములోకి వెళ్ళవలసి ఉంటుంది, ఇంకెవరి మతము ద్వారా, దైవీ మతము ద్వారానైనా లేక మనుష్య మతము ద్వారానైనా తిరిగి వెళ్ళలేరు. దైవీ మతము ద్వారా మీరు కిందకు దిగుతారు ఎందుకంటే కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఆసురీ మతము ద్వారా కూడా కిందకు దిగుతారు కానీ దైవీ మతములో సుఖము ఉంది, ఆసురీ మతములో దుఃఖము ఉంది. దైవీ మతము కూడా ఈ సమయములో తండ్రి ఇచ్చినదే, అందుకే మీరు సుఖవంతులుగా ఉంటారు. అనంతమైన తండ్రి ఎంత దూరం నుండి వస్తారు. మనుష్యులు సంపాదించేందుకు విదేశాలకు వెళ్తారు. చాలా ధనం పోగైనప్పుడు తిరిగి వస్తారు. తండ్రి కూడా అంటారు, నేను పిల్లలైన మీ కొరకు ఎంతో ఖజానాను తీసుకువస్తాను ఎందుకంటే మీకు ఎంతో సంపదను ఇచ్చానని నాకు తెలుసు. దానినంతటినీ మీరు పోగొట్టుకున్నారు. ఎవరైతే ప్రాక్టికల్ గా పోగొట్టుకున్నారో, వారితోనే నేను మాట్లాడుతాను. 5000 సంవత్సరాల విషయము మీకు గుర్తుంది కదా. అవును బాబా, 5000 సంవత్సరాల క్రితం మిమ్మల్ని కలిసాము, మీరు వారసత్వాన్ని ఇచ్చారు అని అంటారు. తప్పకుండా అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకున్నాము అని ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. బాబా, మీ నుండి కొత్త ప్రపంచపు రాజ్య వారసత్వాన్ని తీసుకున్నాము. అచ్ఛా, మరి ఇక పురుషార్థము చేయండి. అంతేకానీ - బాబా, మాయ భూతం మమ్మల్ని ఓడించేసింది అని అనకండి. దేహాభిమానము వచ్చిన తర్వాతనే మీరు మాయతో ఓడిపోతారు. లోభానికి వశమయ్యారు, లంచం తీసుకున్నారు. తప్పనిసరి పరిస్థితి వేరు. లోభము లేకుండా పొట్ట పూజ జరగదు అని బాబాకు తెలుసు, పర్వాలేదు. తింటే తినండి కానీ ఎక్కడా చిక్కుకుని మరణించకండి, అప్పుడు మీకే దుఃఖము కలుగుతుంది. ధనము దొరికితే సంతోషపడతారు, ఎక్కడైనా పోలీసులు పట్టుకుంటే జైలుకు వెళ్ళవలసి వస్తుంది. అటువంటి పనులు చేయకండి, దానికి నేను బాధ్యుడను కాను. పాపాలు చేస్తే జైలులోకి వెళ్తారు. అక్కడైతే జైళ్ళు మొదలైనవి ఉండవు. కావున డ్రామా ప్లాన్ అనుసారముగా కల్పపూర్వము మీకు ఏ వారసత్వమైతే 21 జన్మల కొరకు లభించిందో, అలాగే మళ్ళీ తీసుకుంటారు. మొత్తం రాజధాని అంతా తయారవుతుంది. పేద ప్రజలు, షావుకారు ప్రజలు అందరూ తయారవుతారు. కానీ అక్కడ దుఃఖము ఉండదు. దీనికి బాబా గ్యారంటీ ఇస్తున్నారు. అందరూ ఒకేలా అయితే అవ్వలేరు. సూర్యవంశీ, చంద్రవంశీ రాజ్యములో అందరూ కావాలి కదా. తండ్రి ఏ విధముగా మనకు విశ్వ రాజ్యాధికారాన్ని ఇస్తారు అనేది పిల్లలకు తెలుసు. మళ్ళీ మనం కిందకు దిగుతాము. ఇది స్మృతి కలిగింది కదా. స్కూల్లో చదువు స్మృతిలో ఉంటుంది కదా. ఇక్కడ కూడా తండ్రి స్మృతి కలిగిస్తారు. ఈ ఆత్మిక చదువును ప్రపంచము మొత్తంలో ఇంకెవరూ చదివించలేరు. గీతలో కూడా మన్మనాభవ అని వ్రాయబడి ఉంది. దీనిని మహామంత్రము, వశీకరణ మంత్రము అని అంటారు అనగా ఇది మాయపై విజయాన్ని పొందే మంత్రము. మాయను జయించినవారు జగత్తును జయిస్తారు. మాయ అని పంచ వికారాలను అంటారు. రావణుని చిత్రము చాలా స్పష్టముగా ఉంది - పంచ వికారాలు స్త్రీలో, పంచ వికారాలు పురుషునిలో. వీటితో గాడిదలా అయిపోతారు, అందుకే పైన గాడిద తలను చూపిస్తారు. జ్ఞానము లేనప్పుడు మనం కూడా అలాగే ఉండేవారమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. బాబా కూర్చుని ఎంత రమణీకమైన రీతిలో అర్థం చేయిస్తారు. వారు సుప్రీమ్ టీచర్. వారి ద్వారా మనమేదైతే చదువుకుంటామో, దానిని మళ్ళీ ఇతరులకు వినిపిస్తాము. మొదట అయితే చదివించేవారిపై నిశ్చయము ఏర్పరచాలి. బాబా మాకు ఇది అర్థం చేయించారు, ఇక అంగీకరించండి, అంగీకరించకపోండి... అని చెప్పండి. వీరు అనంతమైన తండ్రియే కదా. శ్రీమతమే శ్రేష్ఠముగా తయారుచేస్తుంది. కావున శ్రేష్ఠమైన కొత్త ప్రపంచము కూడా తప్పకుండా కావాలి కదా.
మనం చెత్తతో కూడిన ప్రపంచములో కూర్చున్నామని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. దీనిని ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. అక్కడ మనం స్వర్గములో సదా సుఖవంతులుగా ఉంటాము. ఇక్కడ నరకములో ఎంత దుఃఖితులుగా ఉన్నాము. దీనిని నరకము అని అనండి, విషయ వైతరణి నది అని అనండి... ఇది పాత ప్రపంచము, ఛీ-ఛీ అయినది. సత్యయుగమైన స్వర్గము ఎక్కడ, కలియుగమైన నరకము ఎక్కడ అని ఇప్పుడు మీకు అనిపిస్తుంది. స్వర్గాన్ని వండర్ ఆఫ్ ది వరల్డ్ (ప్రపంచ అద్భుతము) అని అంటారు. త్రేతాను కూడా అలా అనరు. ఇక్కడ ఈ అశుద్ధమైన ప్రపంచములో ఉండడంలో మనుష్యులకు ఎంత సంతోషము కలుగుతుంది. పేడ పురుగులను భ్రమరము భూ-భూ చేసి తన సమానముగా తయారుచేస్తుంది. మీరు కూడా చెత్తలో పడి ఉండేవారు. నేను వచ్చి భూ-భూ చేసి మిమ్మల్ని పురుగుల నుండి అనగా శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారుచేసాను. ఇప్పుడు మీరు ద్వికిరీటధారులుగా అవుతారు కావున ఎంతటి సంతోషము ఉండాలి. పురుషార్థము కూడా పూర్తిగా చేయాలి. అనంతమైన తండ్రి వివరణ అయితే ఎంతో సహజముగా ఇస్తారు. బాబా నిజంగా సత్యమే చెప్తున్నారు అని హృదయానికి హత్తుకుంటుంది కూడా. ఈ సమయములో అందరూ మాయ ఊబిలో చిక్కుకుని ఉన్నారు. బయటి ఆర్భాటము ఎంతగా ఉంది. బాబా అర్థం చేయిస్తారు, నేను వచ్చి మిమ్మల్ని ఆ ఊబి నుండి రక్షిస్తాను, స్వర్గములోకి తీసుకువెళ్తాను. స్వర్గము అన్న పేరును విని ఉన్నారు. ఇప్పుడు స్వర్గమైతే లేదు. కేవలం ఈ చిత్రాలు ఉన్నాయి. ఈ స్వర్గాధిపతులు ఎంత ధనవంతులుగా ఉండేవారు. భక్తి మార్గములో రోజూ మందిరాలలోకి వెళ్ళేవారు, కానీ ఈ జ్ఞానము ఏమీ ఉండేది కాదు. భారత్ లో ఈ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ఉండేదని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వీరి రాజ్యము ఎప్పుడు ఉండేది, ఇది ఎవరికీ తెలియదు. దేవీ-దేవతా ధర్మానికి బదులుగా ఇప్పుడు మళ్ళీ హిందూ-హిందూ అని అంటూ ఉంటారు. ప్రారంభములో హిందూ మహాసభ ప్రెసిడెంట్ వచ్చారు, అతను అన్నారు - మేము వికారీ అసురులుగా ఉన్నాము, స్వయాన్ని దేవతలుగా ఎలా పిలుచుకోగలము? మేము అన్నాము - అచ్ఛా, మరి నీవు వచ్చినట్లయితే ఈ దేవీ-దేవతా ధర్మ స్థాపన మళ్ళీ జరుగుతుంది అన్నది అర్థం చేయిస్తాను, నేను నిన్ను స్వర్గాధిపతిగా తయారుచేస్తాను, నీవు కూర్చుని నేర్చుకో. ఇలా అంటే - దాదాజీ, తీరిక ఎక్కడ ఉంది అని అన్నారు. తీరిక లేకపోతే దేవతగా ఎలా అవుతారు! ఇది చదువు కదా. పాపం అతని భాగ్యములో లేదు. చనిపోయారు. అలాగని అతను ప్రజల్లోకి వస్తారని కూడా అనము. అలా కాదు. అతను అలా వచ్చి వెళ్ళిపోయారు, ఇక్కడ పవిత్రత గురించిన జ్ఞానము లభిస్తుంది అని విన్నారు కానీ సత్యయుగములోకి అయితే రాలేరు, మళ్ళీ హిందూ ధర్మములోకే వస్తారు.
మాయ చాలా ప్రబలమైనదని, అది ఏదో ఒక పొరపాటును చేయిస్తూనే ఉంటుందని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఎప్పుడైనా ఏదైనా పాపం జరిగితే తండ్రికి సత్యమైన హృదయముతో వినిపించాలి. రావణుడి ప్రపంచములో పాపాలైతే జరుగుతూనే ఉంటాయి. మేము జన్మ-జన్మాంతరాల పాపులము అని అంటారు. ఇలా ఎవరు అన్నారు? ఆత్మయే తండ్రి ముందు లేక దేవతల ముందు ఇలా అంటుంది. తప్పకుండా మేము జన్మ-జన్మాంతరాల పాపులుగా ఉండేవారము అని ఇప్పుడు మీరు ఫీల్ అవుతున్నారు. రావణ రాజ్యములో పాపాలు తప్పకుండా చేసారు. అనేక జన్మల పాపాలనైతే వర్ణన చేయలేరు. ఈ జన్మలోని పాపాలను వర్ణన చేయగలరు. వాటిని వినిపించడం ద్వారా కూడా తేలికగా అయిపోతారు. ఫలానాను కొట్టాను, దొంగతనం చేసాను... అంటూ సర్జన్ ముందు రోగము వినిపించాలి. ఇవి వినిపించడానికి సిగ్గు అనిపించదు, కానీ వికారాల విషయాన్ని వినిపించడానికి సిగ్గు అనిపిస్తుంది. సర్జన్ దగ్గర సిగ్గుపడితే రోగము ఎలా దూరమవుతుంది? అది ఇక లోలోపల తింటూ ఉంటుంది, తండ్రిని స్మృతి చేయలేరు. సత్యము వినిపించినట్లయితే స్మృతి చేయగలుగుతారు. తండ్రి అంటారు, సర్జన్ నైన నేను మీకు ఎంతగా వైద్యము చేస్తాను. మీ శరీరము సదా కాంచనముగా ఉంటుంది. సర్జన్ కు తెలియజేయడం వలన తేలిక అవుతుంది. బాబా, మేము జన్మ-జన్మాంతరాలూ పాపాలు చేసాము అని కొందరు తమంతట తామే వ్రాస్తారు. పాపాత్ముల ప్రపంచములో పాపాత్ములుగానే అయ్యారు. ఇప్పుడు తండ్రి అంటారు, పిల్లలూ, మీరు పాపాత్ములతో ఇచ్చి-పుచ్చుకోవడాలు చేయకూడదు. సత్యమైన సద్గురువు, అకాలమూర్తి తండ్రియే, వారెప్పుడూ పునర్జన్మలలోకి రారు. వారు అకాల సింహాసనము అన్న పేరును పెట్టారు కానీ దాని అర్థాన్ని అర్థం చేసుకోరు. ఆత్మకు ఇది సింహాసనము అని తండ్రి అర్థం చేయించారు. అది ఇక్కడే శోభిస్తుంది కూడా, తిలకము కూడా ఇక్కడే (భృకుటి మధ్యలోనే) దిద్దుతారు కదా. నిజానికి తిలకాన్ని బిందువు వలె దిద్దేవారు. ఇప్పుడు మీరు మీకు మీరుగానే తిలకాన్ని దిద్దుకోవాలి. తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఎవరైతే బాగా సేవ చేస్తారో, వారు గొప్ప మహారాజులుగా అవుతారు. కొత్త ప్రపంచములో పాత ప్రపంచపు చదువును చదివేది లేదు. కావున ఇంతటి ఉన్నతమైన చదువు పట్ల అటెన్షన్ పెట్టాలి. ఇక్కడ కూర్చున్నా కూడా కొందరి బుద్ధియోగము బాగుంటుంది, కొందరిది ఎటెటో వెళ్ళిపోతుంది. కొందరు 10 నిమిషాలు అని వ్రాస్తారు, కొందరు 15 నిమిషాలు అని వ్రాస్తారు. ఎవరి చార్టు అయితే బాగుంటుందో వారికి - బాబా, మేము ఇంత సమయము మీ స్మృతిలో ఉన్నాము అని నషా ఎక్కుతుంది. 15 నిమిషాలకన్నా ఎక్కువ సమయాన్ని అయితే ఎవరూ వ్రాయలేరు. బుద్ధి ఇటూ-అటూ పరిగెడుతూ ఉంటుంది. ఒకవేళ అందరూ ఏకరసము అయిపోయినట్లయితే ఇక కర్మాతీత అవస్థ వచ్చేస్తుంది. తండ్రి ఎంత మధురాతి మధురమైన ప్రియమైన విషయాలను వినిపిస్తారు. ఈ విధంగా గురువులు ఎవ్వరూ నేర్పించలేదు. గురువు నుండి కేవలం ఒక్కరు మాత్రమే నేర్చుకోరు కదా. గురువు నుండైతే వేలాదిమంది నేర్చుకుంటారు కదా. సద్గురువు నుండి మీరు ఎంతమంది నేర్చుకుంటారు. ఇది మాయను వశం చేసుకునే మంత్రము. మాయ అని పంచ వికారాలను అంటారు. ధనాన్ని సంపద అని అంటారు. లక్ష్మీ-నారాయణుల వద్ద ఎంతో సంపద ఉండేది అని వారి గురించి చెప్తారు. లక్ష్మీ-నారాయణులను ఎప్పుడూ మాత-పిత అని అనరు. ఆదిదేవ్, ఆదిదేవిని జగత్పిత, జగదాంబ అని అంటారు, అంతేకానీ లక్ష్మీ-నారాయణులను కాదు. వారు స్వర్గాధిపతులు. అవినాశీ జ్ఞాన ధనాన్ని తీసుకుని మనం ఇంత ధనవంతులుగా అయ్యాము. అంబ వద్దకు అనేక ఆశలతో వెళ్తారు. లక్ష్మి వద్దకు కేవలం ధనం కోసమే వెళ్తారు, ఇంకేమీ అడగరు. మరి వీరిరువురిలో పెద్ద ఎవరు? అంబ నుండి ఏమి లభిస్తుంది మరియు లక్ష్మి నుండి ఏమి లభిస్తుంది అన్నది ఎవరికీ తెలియదు. లక్ష్మిని కేవలం ధనం అడుగుతారు. అంబ నుండి మీకు అన్నీ లభిస్తాయి. అంబ మహిమ ఎక్కువ ఉంది ఎందుకంటే మాతలు దుఃఖాన్ని కూడా ఎంతో సహించవలసి వచ్చింది. కావున మాతల మహిమ ఎక్కువగా ఉంటుంది. అచ్ఛా, అయినా తండ్రి అంటారు, తండ్రిని స్మృతి చేసినట్లయితే పావనముగా అయిపోతారు. చక్రాన్ని స్మృతి చేయండి, దైవీ గుణాలను ధారణ చేయండి. అనేకులను మీ సమానముగా తయారుచేయండి. గాడ్ ఫాదర్ కు మీరు విద్యార్థులు. కల్పపూర్వము కూడా మీరు ఇలా అయ్యారు, మళ్ళీ ఇప్పుడు కూడా అదే లక్ష్యము-ఉద్దేశ్యము ఉంది. ఇది నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు సత్యమైన కథ. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మీ రోగాన్ని సర్జన్ నుండి ఎప్పుడూ దాచి పెట్టకూడదు. మాయా భూతాల నుండి స్వయాన్ని రక్షించుకోవాలి. స్వయానికి రాజ్య తిలకాన్ని దిద్దుకునేందుకు సేవ తప్పకుండా చేయాలి.
2. స్వయాన్ని అవినాశీ జ్ఞాన ధనముతో ధనవంతులుగా తయారుచేసుకోవాలి. ఇప్పుడు పాపాత్ములతో ఇచ్చి-పుచ్చుకోవడాలు చేయకూడదు. చదువు పట్ల పూర్తి అటెన్షన్ పెట్టాలి.
| వరదానము:- |
ఈ కళ్యాణకారీ యుగములో సర్వుల కళ్యాణాన్ని చేసే ప్రకృతిజీత్ మాయాజీత్ భవ సంగమయుగాన్ని కళ్యాణకారీ యుగము అని అంటారు, ఈ యుగములో సదా ఈ స్వమానము గుర్తుండాలి - నేను కళ్యాణకారీ ఆత్మను, నా కర్తవ్యము - మొదట స్వ కళ్యాణము చేసుకోవడము, ఆ తర్వాత సర్వుల కళ్యాణము చేయడము. మనుష్య ఆత్మలకే కాదు, మనం ప్రకృతికి కూడా కళ్యాణము చేసేవారము, అందుకే ప్రకృతీజీతులు, మాయాజీతులు అని పిలవబడతాము. ఎప్పుడైతే ఆత్మ రూపీ పురుష్ ప్రకృతీజీత్ గా అవుతుందో, అప్పుడు ప్రకృతి కూడా సుఖమిచ్చేదిగా అవుతుంది. అటువంటివారు ప్రకృతి లేక మాయ అలజడిలోకి రాలేరు. వారిపై అకళ్యాణ వాయుమండలము యొక్క ప్రభావము పడలేదు. |
| స్లోగన్:- | ఒకరి ఆలోచనలకు ఒకరు గౌరవాన్ని ఇచ్చుకోండి, అప్పుడు గౌరవనీయ ఆత్మలుగా అవుతారు. |