తెలుగు మురళి · Brahma Kumaris

తెలుగు మురళి · 30 డిసెంబర్, 2024

ఓం శాంతి · BapDada ·

ఈరోజు మురళి — today’s murli in Telugu, BK Telugu murli.

18
మురళి30 డిసెంబర్, 2024 · తెలుగు
0:00--:--

పాఠ్యాన్ని ఎంచుకోండి → హైలైట్ / బాక్స్ / అండర్‌లైన్

30-12-2024
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
మధువనం

‘‘మధురమైన పిల్లలూ - ఆత్మ రూపీ బ్యాటరీని జ్ఞానము మరియు యోగముతో నిండుగా చేసుకుని సతోప్రధానముగా తయారుచేసుకోవాలి, అంతేకానీ నీటి స్నానాలతో కాదు’’
ప్రశ్న:- ఈ సమయములో మనుష్యాత్మలందరినీ భ్రమింపజేసేది ఎవరు? అతను ఎందుకు భ్రమింపజేస్తాడు?
జవాబు:- అందరినీ భ్రమింపజేసేది రావణుడు ఎందుకంటే తాను స్వయమూ భ్రమిస్తూ ఉంటాడు. అతడికి తన ఇల్లు అంటూ ఏదీ లేదు. రావణుడిని ఎవరూ తండ్రి అని అనరు. తండ్రి అయితే పరంధామమైన ఇంటి నుండి వస్తారు, తన పిల్లలకు ఆధారాన్ని ఇవ్వడానికి వస్తారు. ఇప్పుడు మీకు ఇంటి గురించి తెలిసింది, అందుకే మీరు ఇక భ్రమించరు. మీరు అంటారు, మేము తండ్రి నుండి మొట్టమొదట వేరైపోయాము, మళ్ళీ ఇప్పుడు మేమే మొట్టమొదట ఇంటికి వెళ్తాము.

ఓం శాంతి. వీరిలోకి వచ్చిన శివబాబా ఎలాగైనా సరే మమ్మల్ని తమతోపాటు తప్పకుండా ఇంటికి తీసుకువెళ్తారు అని మధురాతి మధురమైన పిల్లలు ఇక్కడ కూర్చుని భావిస్తారు. అది ఆత్మల ఇల్లు కదా. అనంతమైన తండ్రి వచ్చి మమ్మల్ని సుందరముగా తయారుచేస్తున్నారు అని పిల్లలకు తప్పకుండా సంతోషము కలుగుతూ ఉండవచ్చు. దాని కోసమని వస్త్రాలు మొదలైనవి ధరింపజేయడమనేది ఏమీ చేయరు. దీనిని యోగబలము, స్మృతి బలము అని అంటారు. టీచరు ఎంత పదవి కలవారై ఉంటే, అంతే పదవిని ఇతర పిల్లలకు కూడా ఇప్పిస్తారు. చదువు ద్వారా మేము ఈ విధంగా అవుతాము అని విద్యార్థులకు తెలుసు. మన బాబా టీచర్ కూడా మరియు సద్గురువు కూడా అని మీరు కూడా అర్థం చేసుకుంటారు. ఇది కొత్త విషయము. మన బాబా టీచర్, వారిని మనం స్మృతి చేస్తాము. వారు మనకు శిక్షణను ఇచ్చి ఈ విధంగా తయారుచేస్తున్నారు. మనల్ని తిరిగి ఇంటికి తీసుకువెళ్ళేందుకు మన అనంతమైన బాబా వచ్చి ఉన్నారు. రావణునికి ఇల్లు ఏదీ ఉండదు, ఇల్లు రామునికే ఉంటుంది. శివబాబా ఎక్కడ ఉంటారు? పరంధామములో ఉంటారు అని మీరు వెంటనే చెప్తారు. రావణుడిని అయితే తండ్రి అని అనరు. రావణుడు ఎక్కడ ఉంటాడు? తెలియదు. రావణుడు పరంధామములో ఉంటాడు అని అనరు. అలా అనరు. అతనికి అసలు ఒక నివాస స్థానమంటూ లేదు. భ్రమిస్తూనే ఉంటాడు, మిమ్మల్ని కూడా భ్రమింపజేస్తాడు. మీరేమైనా రావణుడిని తలచుకుంటారా? లేదు. శాస్త్రాలను చదవండి, భక్తి చేయండి, ఇది చేయండి, అది చేయండి అని అంటూ అతడు ఎంతగా మిమ్మల్ని భ్రమింపజేస్తాడు. తండ్రి అంటారు, దీనిని భక్తి మార్గము, రావణ రాజ్యము అని అంటారు. రామ రాజ్యము కావాలి అని గాంధీ కూడా అనేవారు. ఈ రథములోకి మన శివబాబా వచ్చి ఉన్నారు. వీరు పెద్ద తండ్రి కదా. వారు ఆత్మలతో పిల్లలూ, పిల్లలూ అని అంటూ మాట్లాడుతారు. ఇప్పుడు మీ బుద్ధిలో ఆత్మిక తండ్రి ఉన్నారు మరియు ఆత్మిక తండ్రి బుద్ధిలో ఆత్మిక పిల్లలైన మీరు ఉన్నారు, ఎందుకంటే మన సంబంధము మూలవతనము నుండే ఉంది. ఆత్మలు, పరమాత్మ బహుకాలం దూరముగా ఉన్నారు... అని అంటారు. అక్కడైతే ఆత్మలు తండ్రితో పాటు కలిసి ఉంటారు. ఆ తర్వాత తమ-తమ పాత్రలను అభినయించేందుకు వేరవుతారు. బహుకాలపు లెక్క కావాలి కదా. దానిని తండ్రి కూర్చుని తెలియజేస్తారు. మీరు ఇప్పుడు చదువును చదువుకుంటున్నారు. బాగా చదువుకునేవారు మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. వారే మొట్టమొదట నా నుండి వేరయ్యారు, వారే మళ్ళీ నన్ను ఎంతగానో తలచుకుంటారు, తద్వారా వారే మళ్ళీ మొట్టమొదట వచ్చేస్తారు.

తండ్రి కూర్చుని పిల్లలకు మొత్తం సృష్టిచక్రపు గుహ్య రహస్యాన్ని అర్థం చేయిస్తారు, దాని గురించి ఇంకెవరికీ తెలియదు. దీనిని గూఢమైనది అని కూడా అంటారు, అలాగే గుహ్యాతి గుహ్యమైనది అని కూడా అంటారు. తండ్రి ఏమీ పైన కూర్చుని అర్థం చేయించరని మీకు తెలుసు. నేను ఈ కల్పవృక్షానికి బీజరూపుడను అని వారు ఇక్కడకు వచ్చి అర్థం చేయిస్తారు. ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షాన్ని కల్పవృక్షము అని అంటారు. ప్రపంచములోని మనుష్యులకైతే అసలేమీ తెలియదు. కుంభకర్ణుని నిద్రలో నిదురిస్తున్నారు, తండ్రి వచ్చి మేలుకొలుపుతారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని మేలుకొలిపారు, మిగిలినవారంతా నిదురిస్తున్నారు. మీరు కూడా కుంభకర్ణుని ఆసురీ నిద్రలో నిదురిస్తూ ఉండేవారు. తండ్రి వచ్చి - పిల్లలూ, మేలుకోండి అని మేలుకొలిపారు. మీరు నిర్లక్ష్యులుగా నిదురిస్తూ ఉండేవారు, దీనిని అజ్ఞాన నిద్ర అని అంటారు. ఆ నిద్రనైతే అందరూ నిదురిస్తారు. సత్యయుగములో కూడా నిదురిస్తారు. ఇప్పుడు అందరూ అజ్ఞాన నిద్రలో ఉన్నారు. తండ్రి వచ్చి జ్ఞానాన్ని ఇచ్చి అందరినీ మేలుకొలుపుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు మేలుకున్నారు. బాబా వచ్చి ఉన్నారని, వారు మనల్ని తీసుకువెళ్తారని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు ఇక ఈ శరీరమూ పనికివచ్చేదిగా లేదు, అలాగే ఆత్మా కూడా పనికివచ్చేదిగా లేదు, రెండూ పతితముగా అయిపోయాయి, పూర్తిగా మాలిన్యము కలిసిపోయింది. 9 క్యారట్లు అంటే చాలా తక్కువ బంగారము ఉన్నట్టు, స్వచ్ఛమైన బంగారము 24 క్యారట్లతో ఉంటుంది. ఇప్పుడు తండ్రి పిల్లలైన మిమ్మల్ని 24 క్యారట్లలోకి తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నారు. మీ ఆత్మను సత్యాతి, సత్యమైన స్వర్ణయుగ ఆత్మగా తయారుచేస్తారు. భారత్ ను బంగారు పిచ్చుక అని అనేవారు. ఇప్పుడైతే లోహపు, రాయి-రప్పల పిచ్చుక అని అంటారు. వాస్తవానికి ఇది చైతన్యముగా ఉంది కదా. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. ఏ విధముగా ఆత్మను అర్థం చేసుకుంటారో, అలాగే తండ్రిని కూడా అర్థం చేసుకోవచ్చు. మెరుస్తున్న సితార అని కూడా అంటారు. అది చాలా చిన్న సితార. డాక్టర్లు మొదలైనవారు చూసేందుకు ఎంతో ప్రయత్నించారు కానీ దివ్యదృష్టి లేకుండా చూడలేరు. అది చాలా సూక్ష్మమైనది. ఆత్మ కళ్ళ నుండి బయటకు వెళ్ళింది అని కొందరు అంటారు, నోటి నుండి వెళ్ళింది అని కొందరు అంటారు. ఆత్మ బయటకు వచ్చి ఎక్కడికి వెళ్తుంది? మరొక తనువులోకి వెళ్ళి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ ఆత్మ పైకి శాంతిధామానికి వెళ్ళిపోతుంది. తండ్రి వచ్చి మనల్ని ఇంటికి తీసుకువెళ్తారని మీకు పక్కాగా తెలుసు. ఒకవైపు కలియుగము, ఇంకొకవైపు సత్యయుగము. ఇప్పుడు మనం సంగమములో నిలబడి ఉన్నాము. ఆశ్చర్యమేమిటంటే ఇక్కడ కోట్లాదిమంది మనుష్యులు ఉన్నారు కానీ సత్యయుగములో కేవలం 9 లక్షలమందే ఉంటారు! మిగిలినవారంతా ఏమయ్యారు? వినాశనము జరుగుతుంది. కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేందుకే తండ్రి వస్తారు. బ్రహ్మా ద్వారా స్థాపన జరుగుతుంది. ఆ తర్వాత పాలన కూడా రెండు రూపాల ద్వారా జరుగుతుంది. అంతేకానీ 4 భుజాలు కల మనుష్యులు ఎవరో ఉంటారని కాదు. అలా ఉంటే అసలు శోభే ఉండదు. శ్రీ లక్ష్మీ, శ్రీ నారాయణుల కంబైన్డ్ రూపమే చతుర్భుజ రూపము అని పిల్లలకు కూడా అర్థం చేయిస్తారు. శ్రీ అనగా శ్రేష్ఠము. త్రేతాలో రెండు కళలు తగ్గిపోతాయి. పిల్లలకు ఇప్పుడు ఈ జ్ఞానమేదైతే లభిస్తుందో, దాని స్మృతిలో ఉండాలి. ముఖ్యమైనవి రెండే మాటలు - తండ్రిని స్మృతి చేయండి. ఇది ఇంకెవరికీ అర్థం కాదు. తండ్రియే పతిత-పావనుడు, సర్వశక్తివంతుడు. బాబా, మీరు మాకు మొత్తం ఆకాశము, భూమి సర్వస్వమునూ ఇచ్చేసారు, మీరు మాకు ఇవ్వని వస్తువంటూ ఏదీ లేదు, మొత్తం విశ్వ రాజ్యాన్నే ఇచ్చేసారు అని గానం చేస్తారు కూడా.

ఈ లక్ష్మీ-నారాయణులు విశ్వాధిపతులుగా ఉండేవారని మీకు తెలుసు. డ్రామా చక్రము మళ్ళీ తిరుగుతుంది. సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి, నంబరువారు పురుషార్థానుసారముగా. వికారుల నుండి నిర్వికారులు, నిర్వికారుల నుండి వికారులు, ఈ 84 జన్మల పాత్రను లెక్కలేనన్ని సార్లు అభినయించారు. దీనిని లెక్కపెట్టలేరు. జనాభా లెక్కనైతే లెక్కపెడతారు కానీ మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా, సతోప్రధానము నుండి తమోప్రధానముగా అవుతారు కదా, ఇలా ఎన్ని సార్లు అయ్యారు అన్న లెక్కను ఎవ్వరూ తీయలేరు. ఇది 5000 సంవత్సరాల చక్రము అని బాబా అంటారు. అది నిజమే. లక్షల సంవత్సరాల విషయమైతే గుర్తు కూడా ఉండదు. ఇప్పుడు మీలో గుణాల ధారణ జరుగుతుంది. జ్ఞానమనే మూడవ నేత్రము లభిస్తుంది. ఈ నేత్రాల ద్వారా మీరు పాత ప్రపంచాన్ని చూస్తారు. మూడవ నేత్రము ఏదైతే లభిస్తుందో, దానితో కొత్త ప్రపంచాన్ని చూడాలి. ఈ ప్రపంచమైతే ఎందుకూ పనికివచ్చేదిగా లేదు. ఇది పాత ప్రపంచము. కొత్త ప్రపంచానికి మరియు పాత ప్రపంచానికి ఎంత తేడా ఉందో చూడండి. మనమే కొత్త ప్రపంచానికి అధిపతులుగా ఉండేవారమని, ఆ తర్వాత 84 జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ ఇలా అయిపోయామని మీకు తెలుసు. ఇది బాగా గుర్తుంచుకోవాలి మరియు మనం ఏ విధముగా ఇలా అవుతాము అన్నది ఇతరులకు కూడా అర్థం చేయించాలి. బ్రహ్మా నుండి విష్ణువుగా, మళ్ళీ విష్ణువు నుండి బ్రహ్మాగా అవుతారు. బ్రహ్మాకు మరియు విష్ణువుకు మధ్యన వ్యత్యాసాన్ని చూస్తారు కదా. విష్ణువు ఏ విధముగా అలంకరింపబడి కూర్చుని ఉన్నారు మరియు ఈ బ్రహ్మా ఏ విధముగా సాధారణముగా కూర్చుని ఉన్నారు. ఈ బ్రహ్మాయే ఆ విష్ణువుగా అవ్వనున్నారని మీకు తెలుసు. ఇది ఎవరికైనా అర్థం చేయించడం కూడా చాలా సహజము. బ్రహ్మా, విష్ణు, శంకరులకు పరస్పరం ఏమి సంబంధం ఉంది? ఈ విష్ణువు యొక్క రెండు రూపాలు లక్ష్మీ-నారాయణులని మీకు తెలుసు. ఈ విష్ణు దేవతయే మళ్ళీ ఈ మానవుడైన బ్రహ్మాగా అవుతారు. ఆ విష్ణువు సత్యయుగానికి చెందినవారు, బ్రహ్మా ఇక్కడివారు. బ్రహ్మా నుండి విష్ణువుగా క్షణములో అవుతారు, మళ్ళీ విష్ణువు నుండి బ్రహ్మాగా అవ్వడానికి 5000 సంవత్సరాలు పడుతుంది అని తండ్రి అర్థం చేయించారు. తతత్వం (ఇది మీకు కూడా వర్తిస్తుంది). కేవలం బ్రహ్మా ఒక్కరే అలా అవ్వరు కదా! ఈ విషయాలను ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. ఇక్కడ మానవ గురువుల యొక్క విషయమేదీ లేదు. ఇతనికి కూడా గురువు శివబాబాయే, అలాగే బ్రాహ్మణులైన మీకు కూడా గురువు శివబాబాయే. వారిని సద్గురువు అని అంటారు. కావున పిల్లలు శివబాబానే స్మృతి చేయాలి. శివబాబాను స్మృతి చేయండి అని ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజము. శివబాబా స్వర్గమైన కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. ఉన్నతోన్నతుడైన భగవంతుడు శివుడు. వారు ఆత్మలైన మనకు తండ్రి. కావున భగవంతుడు పిల్లలకు చెప్తున్నారు - తండ్రినైన నన్ను స్మృతి చేయండి. స్మృతి చేయడం ఎంత సహజము. కొడుకు పుట్టగానే వెంటనే అమ్మా, అమ్మా అంటూ తన నోటి నుండి దానంతటదే వెలువడుతుంది. తల్లిదండ్రుల వద్దకు తప్ప ఇంకెవ్వరి వద్దకూ వెళ్ళడు. తల్లి చనిపోతే అది వేరే విషయము. మొదట తల్లి, ఆ తర్వాత తండ్రి, ఆ తర్వాత మిత్ర-సంబంధీకులు మొదలైనవారు ఉంటారు. అందులో కూడా యుగళులు ఉంటారు. పినతండ్రి, పిన్ని యుగళులు కదా. మొదట కుమారిగా ఉంటారు, తర్వాత పెద్దవ్వగానే ఆమెను కొందరు పిన్ని అని అంటారు, మరికొందరు అత్త అని అంటారు.

మీరందరూ పరస్పరం సోదరులేనని ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయిస్తారు, అంతే. ఇక మిగిలిన సంబంధాలన్నింటినీ క్యాన్సల్ చేస్తారు. పరస్పరం సోదరులుగా భావించినట్లయితే ఒక్క తండ్రినే స్మృతి చేస్తారు. తండ్రి కూడా అంటారు - పిల్లలూ, తండ్రినైన నన్నొక్కరినే స్మృతి చేయండి. వీరు ఎంత పెద్ద అనంతమైన తండ్రి. ఆ పెద్ద బాబా మీకు అనంతమైన వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఘడియ-ఘడియ మన్మనాభవ అని అంటారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి, ఈ విషయాన్ని మర్చిపోకండి. దేహాభిమానములోకి రావడం వల్లనే మర్చిపోతారు. మొట్టమొదట అయితే స్వయాన్ని ఆత్మగా భావించాలి - ఆత్మలమైన మనం సాలిగ్రామాలము మరియు మనం ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. తండ్రి అర్థం చేయించారు, నేను పతిత-పావనుడిని, నన్ను స్మృతి చేయడం ద్వారా మీ బ్యాటరీ ఏదైతే ఖాళీ అయిపోయిందో అది నిండుతుంది, మీరు సతోప్రధానముగా అవుతారు. నీటిగంగలో అయితే జన్మ-జన్మాంతరాలూ మునుగుతూ వచ్చారు కానీ పావనముగా అవ్వలేకపోయారు. నీరు పతిత-పావని ఎలా అవ్వగలదు? జ్ఞానముతోనే సద్గతి జరుగుతుంది. ఈ సమయములో ఇది పాపాత్ముల అసత్య ప్రపంచము. ఇచ్చి-పుచ్చుకోవడాలు కూడా పాపాత్ములతోనే జరుగుతుంది. మనసా, వాచా, కర్మణా పాపాత్ములుగానే అవుతారు. ఇప్పుడు పిల్లలైన మీకు వివేకము లభించింది. మేము ఈ లక్ష్మీ-నారాయణులుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నాము అని మీరు అంటారు. ఇప్పుడు ఇక మీరు భక్తి చేయడం ఆగిపోయింది. జ్ఞానముతో సద్గతి జరుగుతుంది. ఈ దేవతలు సద్గతిలో ఉన్నారు కదా. వీరు అనేక జన్మల అంతిమములో ఉన్నారు అని తండ్రి అర్థం చేయించారు. తండ్రి ఎంత సహజముగా అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరు ఎంత కష్టపడతారు. మీరు కల్ప-కల్పమూ కష్టపడతారు. పాత ప్రపంచాన్ని మార్చి కొత్త ప్రపంచముగా తయారుచేయాలి. భగవంతుడు ఇంద్రజాలికుడు, రత్నాకరుడు, వ్యాపారి అని అంటారు కదా. వారు ఇంద్రజాలికుడే కదా. పాత ప్రపంచాన్ని నరకము నుండి మార్చి స్వర్గముగా తయారుచేస్తారు. ఇందులో ఎంతటి ఇంద్రజాలము ఉంది. ఇప్పుడు మీరు స్వర్గవాసులుగా అవుతున్నారు. ఇప్పుడు మనం నరకవాసులుగా ఉన్నామని మీకు తెలుసు. నరకము మరియు స్వర్గము వేర్వేరు. ఇది 5000 సంవత్సరాల చక్రము. ఇందులో లక్షల సంవత్సరాల విషయమే లేదు. ఈ విషయాలను మర్చిపోకూడదు. భగవానువాచ అని ఉంది కదా - పునర్జన్మ రహితునిగా ఉన్నవారు తప్పకుండా ఎవరో ఉన్నారు. శ్రీకృష్ణునికైతే శరీరము ఉంది, శివునికి లేదు. వారికి నోరు అయితే తప్పకుండా కావాలి. మీకు వినిపించేందుకు వారు వచ్చి చదివిస్తారు కదా. డ్రామానుసారముగా మొత్తం జ్ఞానమంతా వారి వద్ద ఉంది. వారు మొత్తం కల్పములో ఒకేసారి వస్తారు, దుఃఖధామాన్ని సుఖధామముగా తయారుచేయడానికి వస్తారు. సుఖ-శాంతుల వారసత్వము తప్పకుండా తండ్రి నుండి లభించింది కదా, అందుకే మనుష్యులు దానిని కోరుకుంటారు, దాని కొరకు తండ్రిని స్మృతి చేస్తారు.

తండ్రి జ్ఞానాన్ని ఎంత సహజరీతిలో ఇస్తారో చూడండి. ఇక్కడ కూర్చుని కూడా తండ్రిని స్మృతి చేయండి, చక్రాన్ని స్మృతి చేయండి, అది కూడా మన్మనాభవయే. తండ్రియే ఈ జ్ఞానమంతటినీ ఇచ్చేవారు. మేము అనంతమైన తండ్రి వద్దకు వెళ్తాము అని మీరు అంటారు. తండ్రి మనకు శాంతిధామానికి, సుఖధామానికి తీసుకువెళ్ళే దారిని తెలియజేస్తారు. ఇక్కడ కూర్చుని ఇంటిని స్మృతి చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి, ఇంటిని స్మృతి చేయాలి మరియు కొత్త ప్రపంచాన్ని స్మృతి చేయాలి. ఈ పాత ప్రపంచమైతే అంతమైపోనున్నది. మున్ముందు మీరు వైకుంఠాన్ని కూడా ఎంతో స్మృతి చేస్తారు. ఘడియ-ఘడియ వైకుంఠములోకి వెళ్తూ ఉంటారు. ప్రారంభములో కుమార్తెలు ఘడియ-ఘడియ పరస్పరం కూర్చుని వైకుంఠములోకి వెళ్ళిపోయేవారు. ఇది చూసి పెద్ద-పెద్ద ఇళ్ళవారు తమ పిల్లలను పంపించేవారు. దానికి ఓం నివాస్ అన్న పేరు పెట్టారు. ఎంతమంది పిల్లలు వచ్చారు, ఆ తర్వాత గొడవ జరిగింది. పిల్లలను చదివించేవారు. వారు తమంతట తామే ధ్యానములోకి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఈ ధ్యానము, సాక్షాత్కారాల పాత్రను ఆపివేశారు. ఇక్కడ కూడా స్మశాన వాతావరణాన్ని తయారుచేసేవారు. అందరినీ కింద పడుకోబెట్టేవారు, ఇప్పుడు శివబాబాను స్మృతి చేయండి అని చెప్పేవారు, అప్పుడు వారు ధ్యానములోకి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు పిల్లలైన మీరు కూడా ఇంద్రజాలికులే. ఎవరిని చూసినా వారు వెంటనే ధ్యానములోకి వెళ్ళిపోతారు. ఈ ఇంద్రజాలము ఎంత మంచిది. నవవిధ భక్తిలో ఎప్పుడైతే ఇక పూర్తిగా ప్రాణము వదిలేయడానికి సిద్ధమైపోతారో, అప్పుడు వారికి సాక్షాత్కారము కలుగుతుంది. ఇక్కడైతే స్వయంగా తండ్రియే వచ్చారు, వారు పిల్లలైన మిమ్మల్ని చదివించి ఉన్నత పదవిని ప్రాప్తి చేయిస్తారు. మున్ముందు పిల్లలైన మీరు ఎన్నో సాక్షాత్కారాలను పొందుతూ ఉంటారు. ఒకవేళ తండ్రిని ఇప్పుడు ఎవరైనా అడిగినా, ఎవరు గులాబీ పుష్పాలుగా ఉన్నారు, ఎవరు సంపెంగి పుష్పాలుగా ఉన్నారు, ఎవరు టాంగర్ (సువాసనలేని విష పుష్పాలు)లా ఉన్నారు అనేది చెప్పగలరు. టూహ్ (సువాసనలేని పుష్పాలు) కూడా ఉంటాయి కదా. (టాంగర్, టూహ్, ఇవన్నీ వెరైటీ పుష్పాల పేర్లు). అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. దేహపు సర్వ సంబంధాలను క్యాన్సల్ చేసి ఆత్మలమైన మనం పరస్పరం సోదరులము అన్న నిశ్చయము ఏర్పరచుకోవాలి మరియు తండ్రిని స్మృతి చేసి పూర్తి వారసత్వానికి అధికారులుగా అవ్వాలి.

2.ఇప్పుడిక పాపాత్ములతో ఇచ్చి-పుచ్చుకోవడాలు చేయకూడదు. అజ్ఞాన నిద్ర నుండి అందరినీ మేలుకొలపాలి, శాంతిధామానికి, సుఖధామానికి వెళ్ళే దారిని తెలియజేయాలి.

వరదానము:- మనస్సు-బుద్ధి యొక్క ఏకాగ్రత ద్వారా సర్వ సిద్ధులను ప్రాప్తి చేసుకునే సదా సమర్థ ఆత్మా భవ
సర్వ సిద్ధులను ప్రాప్తి చేసుకునేందుకు ఏకాగ్రతా శక్తిని పెంచుకోండి. ఈ ఏకాగ్రతా శక్తి సహజముగా నిర్విఘ్నులుగా చేస్తుంది, కష్టపడవలసిన అవసరం ఉండదు. ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు అన్నది సహజముగా అనుభవమవుతుంది, సహజముగా ఏకరస స్థితి తయారవుతుంది. సర్వుల పట్ల కళ్యాణ వృత్తి, సోదర దృష్టి ఉంటుంది. కానీ ఏకాగ్రులుగా అయ్యేందుకు ఎంత సమర్థులుగా అవ్వండి అంటే ఇక మనస్సు-బుద్ధి సదా మీ ఆజ్ఞానుసారముగా నడుచుకోవాలి. స్వప్నములో కూడా, క్షణకాలికముగా కూడా అలజడి ఉండకూడదు.
స్లోగన్:- కమలపుష్ప సమానముగా అతీతముగా ఉన్నట్లయితే ప్రభు ప్రేమకు పాత్రులుగా అవుతారు.

 

మురళి అంటే ఏమిటి?

మురళి బ్రహ్మకుమారీల దైనిక ఆధ్యాత్మిక బోధన, ఇది ప్రతి ఉదయం మధుబన్ నుండి ప్రచురించబడుతుంది. ఇక్కడ మీరు ఈరోజు మురళిని తెలుగులో చదవవచ్చు, ఆడియో వినవచ్చు మరియు PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధ్యయనానికి సహాయంగా పాఠ్యాన్ని హైలైట్ చేయవచ్చు — మీ గుర్తులు ఈ బ్రౌజర్‌లోనే సురక్షితంగా ఉంటాయి.

28 భాషల్లో మురళి

Daily Murli · Madhuban మూలం: మధుబన్ మురళి విభాగం ఇది స్వతంత్ర రీడర్ యాప్, అధికారిక వెబ్‌సైట్ కాదు.