| 31-12-2024 |
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
|
మధువనం |
| ‘‘మధురమైన పిల్లలూ - తండ్రి ఏదైతే ప్రతిరోజూ చదివిస్తారో, ఆ చదువును ఎప్పుడూ మిస్ అవ్వకూడదు, ఈ చదువు ద్వారానే లోపలి సంశయము దూరమవుతుంది’’ | |
| ప్రశ్న:- | తండ్రి హృదయాన్ని గెలుచుకునేందుకు యుక్తి ఏమిటి? |
| జవాబు:- | తండ్రి హృదయాన్ని గెలుచుకోవాలంటే - ఎప్పటివరకైతే సంగమయుగము ఉంటుందో అప్పటివరకూ తండ్రి నుండి ఏమీ దాచిపెట్టకండి. తమ క్యారెక్టర్ల పట్ల పూర్తి శ్రద్ధ వహించండి. ఒకవేళ ఏదైనా పాపకర్మ జరిగితే అవినాశీ సర్జన్ కు వినిపించండి, అప్పుడు తేలికవుతారు. తండ్రి ఏదైతే శిక్షణను ఇస్తున్నారో, ఇదే వారు చూపించే దయ, కృప లేక ఆశీర్వాదము. కావున తండ్రి నుండి దయ లేక కృపను యాచించేందుకు బదులుగా మీపై మీరు కృప చూపించుకోండి. ఇటువంటి పురుషార్థము చేసి తండ్రి హృదయాన్ని గెలుచుకోండి. |
ఓం శాంతి. కొత్త ప్రపంచములో సుఖము ఉంటుందని, పాత ప్రపంచములో దుఃఖము ఉంటుందని ఇప్పుడు ఆత్మిక పిల్లలకు ఇదైతే తెలుసు. దుఃఖములో అందరూ దుఃఖములోకి వచ్చేస్తారు మరియు సుఖములో అందరూ సుఖములోకి వచ్చేస్తారు. సుఖ ప్రపంచములో దుఃఖము యొక్క నామ-రూపాలు ఉండవు, అలాగే ఎక్కడైతే దుఃఖము ఉంటుందో అక్కడ సుఖము యొక్క నామ-రూపాలు ఉండవు. ఎక్కడైతే పాపముంటుందో, అక్కడ పుణ్యము యొక్క నామ-రూపాలు ఉండవు, ఎక్కడైతే పుణ్యము ఉంటుందో, అక్కడ పాపము యొక్క నామ-రూపాలు ఉండవు. అవి ఏ ప్రదేశాలు? ఒకటేమో సత్యయుగము, రెండవది కలియుగము. ఇదైతే పిల్లల బుద్ధిలో తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు దుఃఖపు సమయము పూర్తి అవుతుంది మరియు సత్యయుగము కొరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనం ఇప్పుడు ఈ పతిత ఛీ-ఛీ ప్రపంచము నుండి అటువైపు సత్యయుగములోకి అనగా రామ రాజ్యములోకి వెళ్తున్నాము. కొత్త ప్రపంచములో సుఖము ఉంది, పాత ప్రపంచములో దుఃఖము ఉంది. ఎవరైతే సుఖమిస్తారో వారే దుఃఖము కూడా ఇస్తారని కాదు. సుఖము తండ్రి ఇస్తారు, దుఃఖము మాయా రావణుడు ఇస్తాడు. ఆ శత్రువు దిష్టిబొమ్మను ప్రతి సంవత్సరమూ కాలుస్తారు. దుఃఖాన్ని ఇచ్చేవారిని ఎల్లప్పుడూ కలుస్తూ ఉంటారు. ఎప్పుడైతే అతని రాజ్యము పూర్తి అవుతుందో అప్పుడిక శాశ్వతముగా అంతమైపోతాడు అని పిల్లలకు తెలుసు. పంచ వికారాలే అందరికీ ఆదిమధ్యాంతాలు దుఃఖాన్ని ఇస్తూ వచ్చాయి. మీరు ఇక్కడ కూర్చున్నా కూడా మీ బుద్ధిలో ఇదే ఉండాలి - మేము బాబా వద్దకు వెళ్ళాలి. రావణుడిని అయితే మీరు తండ్రి అని అనరు. రావణుడిని ఎవరైనా పరమపిత పరమాత్మ అని అనడం మీరు విన్నారా? ఎప్పుడూ వినలేదు. కొందరు లంకలో రావణుడు ఉండేవాడని భావిస్తారు. తండ్రి అంటారు, ఈ ప్రపంచమంతా లంకే. వాస్కోడిగామా (ఒక ప్రముఖ నావికుడు) స్టీమర్ పైన లేక నౌక పైన అంతా తిరిగి వచ్చారని చెప్తారు. ఏ సమయములోనైతే అతను అంతటా తిరిగారో, ఆ సమయములో ఏరోప్లేన్లు మొదలైనవి లేవు. రైళ్ళు కూడా స్టీమ్ పై నడిచేవి. విద్యుత్తు వేరే విషయము. ఇప్పుడు తండ్రి అంటారు, ప్రపంచము ఒక్కటే, ఇదే కొత్తది నుండి పాతదిగా, పాతది నుండి కొత్తదిగా అవుతుంది. స్థాపన, పాలన, వినాశనము అని అనకూడదు, అలా కాదు. ముందు స్థాపన, ఆ తర్వాత వినాశనము, ఆ తర్వాత పాలన అని అనాలి, ఇది సరైన వరుస. ఆ తర్వాత రావణుని పాలన మొదలవుతుంది. అది అసత్యమైన వికారీ పతితులుగా తయారయ్యే పాలన, దాని వలన అందరూ దుఃఖితులవుతారు. తండ్రి అయితే ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖాన్నివ్వరు. ఇక్కడైతే తమోప్రధానముగా అయిన కారణముగా తండ్రినే సర్వవ్యాపి అనేస్తారు. ఎలా తయారయ్యారో చూడండి! ఇది పిల్లలైన మీకు నడుస్తూ, తిరుగుతూ బుద్ధిలో ఉండాలి. వాస్తవానికి ఇది చాలా సహజము. కేవలం అల్ఫ్ (భగవంతుని) విషయము. ముసల్మానులు కూడా, లేచి అల్లాను స్మృతి చేయండి అని చెప్తారు. వారు స్వయం కూడా ఉదయాన్నే లేస్తారు. అల్లాను లేక ఖుదాను స్మృతి చేయండి అని వారు అంటారు, తండ్రిని స్మృతి చెయ్యండి అని మీరు అంటారు. బాబా అన్న పదము చాలా మధురమైనది. అల్లా అని అనడంతో వారసత్వము గుర్తుకురాదు. బాబా అని అనడంతో వారసత్వము గుర్తుకొస్తుంది. ముసల్మానులు బాబా అని అనరు. వారు అల్లామియా అని అంటారు (అరబిక్ భాషలో భగవంతుడిని పిలిచే పేరు). మియా-బీబీ (భార్యా-భర్తలు) అని అంటారు. ఈ పదాలన్నీ భారత్ లో ఉన్నాయి. పరమపిత పరమాత్మ అని అనగానే శివలింగం గుర్తుకువస్తుంది. యూరోప్ వాసులు గాడ్ ఫాదర్ అని అంటారు. భారత్ లోనైతే రాయి-రప్పలను కూడా భగవంతునిగా భావిస్తారు. శివలింగము కూడా రాతితో తయారవుతుంది. ఆ రాయిలో భగవంతుడు కూర్చున్నారని భావిస్తారు. భగవంతుడిని తలచుకున్నప్పుడు, రాతి విగ్రహమే వారి ఎదురుగా వస్తుంది. రాయినే భగవంతునిగా భావించి పూజిస్తారు. రాయి ఎక్కడ నుండి వస్తుంది? పర్వతాల నుండి ప్రవహించే సెలయేరుల నుండి రాళ్ళు దొర్లుతూ, దొర్లుతూ గుండ్రముగా మృదువుగా తయారవుతాయి. అప్పుడు సహజసిద్ధముగా ఆ రూపము కూడా తయారవుతుంది. దేవీ-దేవతల మూర్తులు ఇలా ఉండవు. శిలను చెక్కుతూ, చెక్కుతూ, చెవులు, నోరు, ముక్కు, కళ్ళు, మొదలైనవి ఎంత సుందరముగా తయారుచేస్తారు. చాలా ఖర్చుపెడతారు. శివబాబా మూర్తికైతే ఖర్చు మొదలైన విషయాలేవీ లేవు. మనమే దేవీ-దేవతలుగా చైతన్యములో స్వయం తయారవుతున్నాము అని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. చైతన్యములో ఉన్నప్పుడు పూజ మొదలైనవేవీ ఉండవు. ఎప్పుడైతే రాతిబుద్ధి కలవారిగా అవుతారో, అప్పుడు రాయికి పూజ చేస్తారు. చైతన్యముగా ఉన్నప్పుడు పూజ్యులుగా ఉంటారు, ఆ తర్వాత పూజారులుగా అవుతారు. అక్కడ పూజారులూ ఎవరూ ఉండరు, అలాగే రాతిమూర్తులూ ఉండవు. అవసరమే లేదు. ఎవరైతే ఒకప్పుడు చైతన్యములో ఉండేవారో, వారి స్మృతిచిహ్న గుర్తులుగా రాతిశిల్పాలను పెడతారు. ఈ దేవతల జీవితచరిత్ర ఏమిటి అంటూ ఇప్పుడు ఈ దేవతల కథ గురించి మీకు తెలిసింది. మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఇంతకుముందు ఈ జ్ఞాన చక్షువు ఉండేది కాదు, అప్పుడు రాతిబుద్ధి వలె ఉండేవారు. ఇప్పుడు తండ్రి ద్వారా ఏ జ్ఞానమైతే లభించిందో, ఆ జ్ఞానము ఒక్కటే, కానీ దాన్ని తీసుకునేవారు నంబరువారుగా ఉన్నారు.
మీ రుద్రమాల కూడా ఈ ధారణ అనుసారముగానే తయారవుతుంది. ఒకటి రుద్రమాల, రెండవది రుండమాల. ఒకటి సోదరులది, రెండవది సోదరీ-సోదరులది. ఆత్మలమైన మేము చాలా చిన్న-చిన్న బిందువులవంటి వారము అని అయితే బుద్ధిలోకి వస్తుంది. భృకుటి మధ్యలో అద్భుతమైన సితార మెరుస్తుంది అని గాయనం కూడా ఉంది. ఆత్మ అయిన మనము చైతన్యము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఒక చిన్న సితార వలె ఉన్నాము. మళ్ళీ ఎప్పుడైతే గర్భములోకి వస్తారో అప్పుడు ముందు ఎంత చిన్న పిండముంటుంది, ఆ తర్వాత ఎంత పెద్దదవుతుంది. అదే ఆత్మ తన శరీరము ద్వారా అవినాశీ పాత్రను అభినయిస్తూ ఉంటుంది. ఇక ఆ శరీరమునే అందరూ తలచుకోవడం మొదలుపెడతారు. ఈ శరీరమే మంచిగా, చెడుగా ఉన్న కారణముగా అందరినీ ఆకర్షిస్తుంది. సత్యయుగములో - ఆత్మాభిమానులుగా అవ్వండి, స్వయాన్ని ఆత్మగా భావించండి అని అనరు. ఈ జ్ఞానము మీకు ఇప్పుడే లభిస్తుంది ఎందుకంటే మీకు తెలుసు, ఇప్పుడు ఆత్మ పతితమైపోయింది. పతితముగా అయిన కారణముగా ఏ పని చేసినా అంతా తప్పు అయిపోతుంది. తండ్రి సరైన పనులు చేయిస్తారు, మాయ తప్పుడు పనులు చేయిస్తుంది. అన్నింటికంటే తప్పుడు పని తండ్రిని సర్వవ్యాపి అని అనడము. ఆత్మ ఏదైతే పాత్రను అభినయిస్తుందో అది అవినాశీ. దానిని కాల్చడం జరగదు, ఆత్మకు పూజ జరుగుతుంది, శరీరాన్ని కాల్చడం జరుగుతుంది. ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని వదులుతుందో, అప్పుడు శరీరాన్ని కాలుస్తారు. ఆత్మ వెళ్ళి వేరే శరీరములోకి ప్రవేశిస్తుంది. ఆత్మ లేకపోతే శరీరాన్ని రెండు, నాలుగు రోజులు కూడా ఉంచలేరు. కొందరైతే శరీరానికి ఔషధాలు మొదలైనవి రాసి ఉంచుతారు కూడా. కానీ లాభమేముంది? క్రిస్టియన్లలో సెయింట్ జేవియర్ అని ఒకరు ఉన్నారు, అతని శరీరము ఇప్పటికీ ఇంకా ఉంచబడిందని అంటారు. అతనిది కూడా మందిరములా తయారుచేయబడి ఉంది, ఎవ్వరికీ చూపించరు, కేవలం వారి పాదాలు మాత్రమే చూపిస్తారు. ఎవరైనా ఆ పాదాలు స్పర్శిస్తే అనారోగ్యంపాలు అవ్వరు అని అంటారు. పాదాలు స్పర్శించి అనారోగ్యము నుండి కోలుకుంటే అతని కృపగా భావిస్తారు. తండ్రి అంటారు, వారి భావనకు ఫలము లభిస్తుంది. నిశ్చయబుద్ధి కలవారిగా ఉన్నందుకు కొంత లాభం ఉంటుంది. కానీ అందరికీ అలాగే జరిగితే ఇక అనేకానేకమంది అక్కడకు వెళ్ళిపోతారు, పెద్ద మేళా ఏర్పడుతుంది. మరి తండ్రి కూడా ఇక్కడకు వచ్చారు, అయినా కానీ అంతమంది ఉండరు. అంతమంది ఉండేందుకు స్థలము కూడా లేదు. ఎప్పుడైతే లెక్కలేనంతమంది వచ్చే సమయము వస్తుందో, అప్పుడు వినాశనమైపోతుంది. ఇది కూడా డ్రామాగా తయారై ఉంది. దీనికి ఆది మరియు అంతిమము లేదు. అయితే, వృక్షము శిథిలావస్థకు చేరుకుంటుంది అనగా తమోప్రధానమవుతుంది, అప్పుడు ఈ వృక్షము మారుతుంది. ఇది ఎంతటి అనంతమైన వృక్షము. ఎవరైతే ముందుగా వెళ్ళేది ఉందో, వారు ముందుగా వస్తారు. నంబరువారుగా వస్తారు కదా? సూర్యవంశీయులందరూ కలిసైతే రారు. చంద్రవంశీయులు కూడా అందరూ ఒకేసారి కలిసి రారు. నంబరువారుగా మాల అనుసారముగానే వస్తారు. పాత్రధారులందరూ కలిసి ఒకేసారి ఎలా వస్తారు. అలా జరిగితే ఆట పాడైపోతుంది. ఈ ఆట చాలా ఏక్యురేట్ గా తయారై ఉంది, ఇందులో ఎటువంటి మార్పు జరగదు.
మధురాతి మధురమైన పిల్లలు ఇక్కడ కూర్చున్నప్పుడు బుద్ధిలో ఇదే గుర్తుండాలి. ఇతర సత్సంగాలలోనైతే వేరే-వేరే విషయాలు బుద్ధిలోకి వస్తాయి. మీ సంపాదన జరిగేది ఈ ఒక్క చదువు ద్వారానే. ఆ శాస్త్రాలు మొదలైనవి చదవడం ద్వారా సంపాదన జరగదు. అయితే, దాని వలన కొన్ని-కొన్ని గుణాలు మంచివి ఉంటాయి. గ్రంథ్ ను చదవడానికి కూర్చున్నప్పుడు అందరూ నిర్వికారులుగా ఉంటారని ఏమీ కాదు. తండ్రి అంటారు, ఈ ప్రపంచములో అందరూ భ్రష్టాచారము ద్వారా జన్మ తీసుకుంటారు. అక్కడ జన్మ ఎలా జరుగుతుంది అని పిల్లలైన మిమ్మల్ని ఎవరైనా అడిగితే, వారికి ఇలా చెప్పండి - అక్కడ పంచ వికారాలే ఉండవు, యోగబలముతో పిల్లలు జన్మ తీసుకుంటారు. బిడ్డ జన్మించక ముందే బిడ్డ జన్మించబోతున్నాడని సాక్షాత్కారమవుతుంది. అక్కడ వికారాల మాటే ఉండదు. ఇక్కడైతే పిల్లలను కూడా మాయ పడేస్తుంది. కొందరు తండ్రికి వచ్చి వినిపిస్తారు కూడా, ఒకవేళ వినిపించకపోతే 100 రెట్లు శిక్ష పడుతుంది. తండ్రి అయితే పిల్లలందరికీ చెప్తున్నారు - ఏదైనా పాపకర్మ జరిగితే తండ్రికి వెంటనే తెలియజేయాలి. తండ్రి అవినాశీ వైద్యుడు. సర్జన్ కు వినిపించడం ద్వారా మీరు తేలికైపోతారు. ఎప్పటివరకైతే సంగమయుగము ఉందో అప్పటివరకూ తండ్రి నుండి ఏదీ దాచిపెట్టకూడదు. ఎవరైనా దాచిపెడితే తండ్రి హృదయాన్ని గెలుచుకోలేరు. మొత్తం ఆధారమంతా పురుషార్థముపై ఉంది. స్కూల్ కే రాకపోతే ఇక నడవడిక ఎలా బాగుపడుతుంది? ఈ సమయములో అందరి క్యారెక్టర్లు చెడ్డగా ఉన్నాయి. వికారాలే మొదటి నంబరు చెడు క్యారెక్టర్లు, అందుకే తండ్రి అంటారు - పిల్లలూ, కామ వికారము నీకు మహాశత్రువు. ఇంతకుముందు కూడా ఆ గీతా జ్ఞానాన్ని విన్నారు, కానీ ఈ విషయాలన్నీ అర్థమయ్యేవి కావు. ఇప్పుడు తండ్రి డైరెక్టుగా గీతను వినిపిస్తున్నారు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి దివ్యబుద్ధిని ఇచ్చారు, కావున భక్తి అన్న మాట వినగానే, ఏమేమి చేసేవారము అని నవ్వు వస్తుంది! ఇప్పుడైతే తండ్రి శిక్షణను ఇస్తున్నారు, ఇందులో దయ, కృప లేక ఆశీర్వాదాల మాటే ఉండదు. మీపై మీరే దయ, కృప లేక ఆశీర్వాదము చూపించుకోవాలి. తండ్రి అయితే పిల్లలు ప్రతి ఒక్కరి చేత పురుషార్థము చేయిస్తారు. కొందరైతే పురుషార్థము చేసి తండ్రి హృదయాన్ని గెలుచుకుంటారు, కొందరైతే పురుషార్థము చేస్తూ-చేస్తూ చనిపోతారు కూడా. తండ్రి అయితే పిల్లలందరినీ ఒకేలా చదివిస్తారు, అయితే కొన్ని సమయాలలో ఎటువంటి గుహ్యమైన విషయాలు వెలువడుతాయంటే ఇక వాటి వలన పాత సంశయము దూరమైపోతుంది, మళ్ళీ లేచి నిలబడతారు, అందుకే తండ్రి చదివించే చదువును ఎప్పుడూ మిస్ చేయకూడదు. ముఖ్యమైనది తండ్రి స్మృతి. దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి. ఎవరైనా ఛీ-ఛీ విషయాలేవైనా మాట్లాడితే వినీ-విననట్లు వదిలేయాలి. చెడు వినకండి... ఉన్నత పదవిని పొందాలంటే, మానావమానాలు, సుఖ-దుఃఖాలు, గెలుపు-ఓటములు, అన్నింటినీ తప్పకుండా సహనం చేయాలి. తండ్రి ఎన్ని యుక్తులను తెలియజేస్తున్నారు. అయినప్పటికీ పిల్లలు తండ్రి చెప్పినదానిని వినీ-విననట్లుగా వదిలేస్తే ఇక వారు ఏం పదవిని పొందుతారు. తండ్రి అంటారు, ఎప్పటివరకైతే అశరీరిగా అవ్వరో, అప్పటివరకూ మాయ వల్ల ఏదో ఒక దెబ్బ తగులుతూనే ఉంటుంది. తండ్రి మాటను వినకపోతే తండ్రిని అగౌరవపరచినట్లు అవుతుంది. అయినా తండ్రి అంటారు, పిల్లలూ, సదా జీవిస్తూ మేలుకొని ఉండండి మరియు తండ్రిని స్మృతి చేసి ఉన్నత పదవిని పొందండి. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఎవరైనా తప్పుడు మాటలు మాట్లాడితే, వాటిని వినీ-విననట్లుగా వదిలేయండి. చెడు వినకండి... సుఖ-దుఃఖాలు, మానావమానాలు, అన్నింటినీ సహనం చేయాలి.
2. తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిని ఎప్పడూ వినీ-విననట్లుగా వదిలేసి, తండ్రిని అగౌరవపరచకూడదు. మాయ దెబ్బ నుండి రక్షించుకునేందుకు అశరీరిగా ఉండే అభ్యాసాన్ని తప్పకుండా చెయ్యాలి.
| వరదానము:- |
తండ్రి సమానముగా దయార్ద్ర హృదయులుగా అయి అందరినీ క్షమించి స్నేహాన్ని ఇచ్చే మాస్టర్ దాతా భవ ఏ విధంగా తండ్రిని దయార్ద్ర హృదయుడు అని అంటారో, అలాగే పిల్లలైన మీరు కూడా మాస్టర్ దయార్ద్ర హృదయులు. ఎవరైతే దయార్ద్ర హృదయులుగా ఉంటారో వారే కళ్యాణము చేయగలరు, అకళ్యాణము చేసేవారిని కూడా వారు క్షమించగలరు. వారు మాస్టర్ స్నేహసాగరులుగా ఉంటారు, వారి వద్ద స్నేహము తప్ప ఇంకేమీ లేనే లేదు. వర్తమాన సమయములో సంపదకన్నా ఎక్కువగా స్నేహము యొక్క అవసరము ఉంది. అందుకే మాస్టర్ దాతలుగా అయి అందరికీ స్నేహాన్ని ఇస్తూ ముందుకు వెళ్ళండి. ఎవ్వరూ ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. |
| స్లోగన్:- | తీవ్ర పురుషార్థిగా అవ్వాలనే కోరిక ఉన్నట్లయితే, కోరిక ఉన్న చోట మార్గము తప్పకుండా లభిస్తుంది. |