| 24-02-2025 |
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
|
మధువనం |
| ‘‘మధురమైన పిల్లలూ - ఈ ఆత్మిక హాస్పిటల్ మిమ్మల్ని అర్ధకల్పము కొరకు సదా ఆరోగ్యవంతులుగా తయారుచేస్తుంది, ఇక్కడ మీరు దేహీ-అభిమానులై కూర్చోండి’’ | |
| ప్రశ్న:- | వ్యాపారము మొదలైనవి చేస్తూ కూడా ఏ డైరెక్షన్ బుద్ధిలో గుర్తుండాలి? |
| జవాబు:- | తండ్రి డైరెక్షన్ ఏమిటంటే - మీరు ఏ సాకారుడిని లేక ఆకారుడిని స్మృతి చెయ్యకండి, ఒక్క తండ్రి స్మృతి ఉన్నట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ఈ విషయములో ఎవ్వరూ కూడా మాకు తీరిక లేదు అని అనలేరు. అన్నీ చేస్తూ కూడా స్మృతిలో ఉండవచ్చు. |
ఓం శాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి యొక్క గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పిన తర్వాత పిల్లలకు తండ్రిని స్మృతి చెయ్యండి అని చెప్పడం జరుగుతుంది. ఓ పతిత-పావనా, మీరు వచ్చి పావనముగా తయారుచెయ్యండి అని పిలుస్తారు కూడా. తండ్రి మొట్టమొదటే చెప్తారు - ఆత్మిక తండ్రిని స్మృతి చెయ్యండి. ఆత్మిక తండ్రి అయితే అందరికీ ఒక్కరే. తండ్రిని ఎప్పుడూ సర్వవ్యాపిగా భావించరు. కనుక పిల్లలూ, ఎంత వీలైతే అంత మొట్టమొదటగా తండ్రిని స్మృతి చెయ్యండి, ఒక్క తండ్రిని తప్ప మరే ఇతర సాకారుడిని లేక ఆకారుడిని స్మృతి చెయ్యకండి. ఇదైతే పూర్తిగా సహజము కదా. మనుష్యులు - మేము బిజీగా ఉంటాము, తీరిక ఉండదు అని అంటారు. కానీ ఇందులో అయితే తీరిక సదా ఉంటుంది. తండ్రి యుక్తిని తెలియజేస్తున్నారు - తండ్రిని స్మృతి చెయ్యటము ద్వారానే మన పాపాలు భస్మమైపోతాయి, ఇది కూడా మీకు తెలుసు. ముఖ్యమైన విషయము ఇదే. వ్యాపారాలు మొదలైనవి చెయ్యవద్దని అనరు. వాటన్నింటినీ చేస్తూ కేవలము తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. మేము పతితులము అన్నదైతే అర్థం చేసుకుంటారు. సాధువు-సన్యాసులు, ఋషులు, మునులు మొదలైనవారందరూ సాధన చేస్తారు. సాధన అనేది భగవంతుడిని కలుసుకునేందుకు చెయ్యటం జరుగుతుంది. ఎప్పటివరకైతే వారి పరిచయము ఉండదో అప్పటివరకు వారిని కలుసుకోలేరు. తండ్రి పరిచయము ప్రపంచములో ఎవ్వరికీ లేదు అన్నది మీకు తెలుసు. దేహ పరిచయమైతే అందరికీ ఉంది. పెద్ద వస్తువు యొక్క పరిచయము వెంటనే జరుగుతుంది. ఆత్మ పరిచయాన్ని అయితే ఎప్పుడైతే తండ్రి వస్తారో, అప్పుడు అర్థం చేయిస్తారు. ఆత్మ మరియు శరీరము అనేవి రెండు వస్తువులు. ఆత్మ ఒక నక్షత్రము వంటిది మరియు అది చాలా సూక్ష్మమైనది. దానిని ఎవ్వరూ చూడలేరు. ఎప్పుడైతే ఇక్కడకు వచ్చి కూర్చుంటారో అప్పుడు దేహీ-అభిమానులై కూర్చోవాలి. ఇది కూడా అర్ధకల్పము కొరకు సదా ఆరోగ్యవంతులుగా అయ్యేందుకు ఒక హాస్పిటల్ కదా. ఆత్మ ఉన్నదే అవినాశీగా, ఎప్పుడూ వినాశనమవ్వదు. మొత్తము పాత్ర అంతా ఆత్మదే. నేను ఎప్పుడూ వినాశనాన్ని పొందను అని ఆత్మ అంటుంది. ఇన్ని ఆత్మలన్నీ అవినాశీ. శరీరము వినాశీ. ఇప్పుడు మీ బుద్ధిలో ఏం కూర్చుని ఉందంటే - ఆత్మ అయిన మనము అవినాశీ, మనము 84 జన్మలు తీసుకుంటాము, ఇది డ్రామా. ఇందులో ధర్మ స్థాపకులు ఎవరెవరు ఎప్పుడెప్పుడు వస్తారు, ఎన్ని జన్మలు తీసుకుంటూ ఉండవచ్చు అన్నదైతే తెలుసు. 84 జన్మలు అన్న గాయనము ఏదైతే ఉందో అది తప్పకుండా ఏదో ఒక ధర్మానికి చెందినదే అయి ఉంటుంది. అందరికీ అయితే అన్ని జన్మలు ఉండవు. అన్ని ధర్మాలు కలిసి ఒకేసారైతే రావు. మనము కూర్చుని ఇతరుల లెక్కను ఎందుకు తీయాలి? ఫలానా-ఫలానా సమయములో ధర్మ స్థాపన చేయడానికి వస్తారు అన్నదైతే తెలుసు. తర్వాత దాని వృద్ధి జరుగుతుంది. అందరూ సతోప్రధానము నుండి తమోప్రధానముగా అయితే అయ్యేదే ఉంది. ప్రపంచము తమోప్రధానముగా అయినప్పుడు ఇక తండ్రి వచ్చి సతోప్రధానమైన సత్యయుగాన్ని తయారుచేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు - భారతవాసులమైన మేమే మళ్ళీ కొత్త ప్రపంచములోకి వచ్చి రాజ్యము చేస్తాము, అప్పుడు మరే ఇతర ధర్మమూ ఉండదు. పిల్లలైన మీలో కూడా ఎవరైతే ఉన్నత పదవిని తీసుకునేది ఉందో వారు ఎక్కువ స్మృతిలో ఉండే పురుషార్థము చేస్తారు మరియు బాబా, నేను ఇంత సమయము స్మృతిలో ఉంటున్నాను అని సమాచారాన్ని వ్రాస్తారు కూడా. కొందరైతే సిగ్గు కారణముగా పూర్తి సమాచారాన్ని ఇవ్వరు. బాబా ఏమంటారో అని అనుకుంటారు. కానీ తెలియటమైతే తెలుస్తుంది కదా. స్కూల్లో టీచర్ స్టూడెండ్స్ తో అంటారు కదా - నువ్వు ఒకవేళ చదవకపోతే ఫెయిల్ అయిపోతావు అని. లౌకిక తల్లిదండ్రులు కూడా పిల్లల చదువు ద్వారా - ఇదైతే చాలా పెద్ద స్కూల్ అని అర్థం చేసుకుంటారు. ఇక్కడైతే నంబరువారుగా కూర్చోబెట్టడం జరగదు. బుద్ధి ద్వారా అర్థం చేసుకోవడం జరుగుతుంది, నంబరువారుగా అయితే ఉండనే ఉంటారు కదా. ఇప్పుడు బాబా మంచి-మంచి పిల్లలను ఎక్కడికైనా పంపిస్తారు, వారు అలా వెళ్తుంటే - మాకు మహారథి కావాలి అని ఇతరులు వ్రాస్తారు. దీని బట్టి వారు మాకంటే తెలివైనవారు, ప్రసిద్ధమైనవారు అని తప్పకుండా అర్థం చేసుకుంటారు. నంబరువారుగా అయితే ఉంటారు కదా. ప్రదర్శనీలో కూడా అనేక రకాలవారు వస్తారు, కనుక గమనించేందుకు గైడ్స్ కూడా నిలబడి ఉండాలి. వీరు ఎటువంటి వ్యక్తి అన్నది రిసీవ్ చేసుకునేవారికైతే తెలుస్తుంది, కనుక - వీరికి నువ్వు అర్థం చేయించు అని వారికి సూచన ఇవ్వాలి. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, అందరూ ఉన్నారు అన్నది మీరు కూడా అర్థం చేసుకోగలరు. ఇక్కడైతే అందరి సేవ చెయ్యాల్సిందే. ఎవరైనా పెద్ద వ్యక్తి ఉన్నట్లయితే తప్పకుండా ఆ పెద్ద వ్యక్తికైతే అందరూ మర్యాద చేస్తారు. ఇది నియమము. తండ్రి లేక టీచర్ క్లాసులో పిల్లల మహిమను చేస్తారు, ఇది కూడా చాలా గొప్ప పాలన. పేరును ప్రసిద్ధము చేసే పిల్లలకు మహిమ చెయ్యటం మరియు మర్యాద చెయ్యటం జరుగుతుంది. వీరు ఫలానా ధనవంతులు, ధార్మిక మనస్కులు అని ఇలా అనటము కూడా మర్యాద చెయ్యటమే కదా. ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు అని ఇప్పుడు మీకు తెలుసు. తప్పకుండా వారు ఉన్నతోన్నతమైనవారు అని అంటారు కూడా, కానీ వారి జీవిత చరిత్రను చెప్పండి అని అడిగితే వారు సర్వవ్యాపి అని అనేస్తారు. ఇక అంతే, ఒక్కసారిగా కిందకు తోసేస్తారు. అందరికంటే ఉన్నతోన్నతమైనవారు భగవంతుడని, వారే మూలవతనవాసి అని ఇప్పుడు మీరు అర్థం చేయించగలరు. సూక్ష్మవతనములో దేవతలు ఉంటారు. ఇక్కడ ఉండేదీ మనుష్యులు. కనుక ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు, ఆ నిరాకారుడు.
వజ్రము వలె ఉన్న మనము మళ్ళీ గవ్వ సమానముగా అయ్యామని ఇప్పుడు మీకు తెలుసు, కనుక భగవంతుడిని తమకంటే కూడా ఎక్కువ కిందకు తీసుకువెళ్ళిపోయారు. వారిని గుర్తించనే గుర్తించరు. భారతవాసులైన మీకే వారి పరిచయము లభిస్తుంది, తర్వాత మళ్ళీ ఆ పరిచయము తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు తండ్రి పరిచయాన్ని అందరికీ ఇస్తూ వెళ్తారు. చాలా ఎక్కువమందికి తండ్రి పరిచయము లభిస్తుంది. ఈ త్రిమూర్తి, సృష్టిచక్రము, కల్పవృక్షము మీ ముఖ్య చిత్రాలు. వీటిలో ఎంత ప్రకాశము ఉంది. ఈ లక్ష్మీ-నారాయణులు సత్యయుగ యజమానులుగా ఉండేవారు అనైతే ఎవరైనా చెప్తారు. అచ్ఛా, సత్యయుగానికి ముందు ఏముండేది? ఇది కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు ఉన్నది కలియుగ అంతిమము మరియు ఉన్నది కూడా ప్రజలపై ప్రజల రాజ్యము. ఇప్పుడు రాజరికాలైతే లేవు, ఎంత తేడా ఉంది. సత్యయుగ ఆదిలో రాజులు ఉండేవారు మరియు ఇప్పుడు కలియుగములో కూడా రాజులు ఉన్నారు. వారు ఎవ్వరూ పావనముగా లేకపోయినా కూడా డబ్బులు ఇచ్చి అయినా సరే టైటిల్ తీసుకుంటారు. మహారాజులు అయితే ఎవ్వరూ లేరు, టైటిల్ ను కొనుక్కుంటారు. ఉదాహరణకు పటియాలా మహారాజు, జోధ్ పూర్ మహారాజు, బికనేర్ మహారాజు... ఇలా పేరైతే తీసుకుంటారు కదా. ఈ పేరు అవినాశీగా నడుస్తూ వస్తుంది. మొదట పవిత్ర మహారాజులు ఉండేవారు, ఇప్పుడు అపవిత్ర మహారాజులు ఉన్నారు. ఈ పదాలు కొనసాగుతూ ఉంటాయి. ఈ లక్ష్మీ-నారాయణుల గురించి - వీరు సత్యయుగ యజమానులుగా ఉండేవారు అని అంటారు. రాజ్యాన్ని ఎవరు తీసుకున్నారు? రాజ్య స్థాపన ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి అంటారు, నేను ఇప్పుడు మిమ్మల్ని 21 జన్మల కొరకు చదివిస్తాను. వారైతే చదువుకుని ఈ జన్మలోనే బ్యారిస్టర్ మొదలైనవారిగా అవుతారు. మీరు ఇప్పుడు చదువుకుని భవిష్య మహారాజు-మహారాణిగా అవుతారు. డ్రామా ప్లాన్ అనుసారముగా కొత్త ప్రపంచ స్థాపన జరుగుతూ ఉంది. ఇప్పుడు ఉన్నది పాత ప్రపంచము. ఇక్కడ ఎంత మంచి-మంచి పెద్ద మహళ్ళు ఉన్నా కానీ వజ్ర-వైఢూర్యాలతో పొదగబడిన మహళ్ళను తయారుచేసేందుకైతే ఎవ్వరిలోనూ శక్తి లేదు. సత్యయుగములో అన్నీ వజ్రాల-వైఢూర్యాలతో పొదగబడిన మహళ్ళు తయారుచేస్తారు కదా. వాటిని తయారుచేయడానికి సమయమేమీ పట్టదు. ఇక్కడ కూడా భూకంపాలు మొదలైనవి వచ్చినప్పుడు చాలామంది పనివారిని పెట్టి, ఒకటి, రెండు సంవత్సరాలలోనే మొత్తము పట్టణాన్నంతా నిర్మించేస్తారు. కొత్త ఢిల్లీని తయారుచేయడానికి మహా అయితే 8-10 సంవత్సరాలు పట్టింది కానీ ఇక్కడి లేబర్ కు మరియు అక్కడి లేబర్ కు తేడా అయితే ఉంటుంది కదా. ఈ రోజుల్లోనైతే కొత్త-కొత్త ఇన్వెన్షన్లను కూడా కనుక్కుంటూ ఉంటారు. ఇంటిని తయారుచేసే సైన్స్ యొక్క వేగము కూడా ఉంది, అన్నీ రెడీగా లభిస్తాయి, వెంటనే ఫ్లాట్ తయారైపోతుంది. చాలా త్వరత్వరగా తయారవుతాయి. కనుక ఇవన్నీ అక్కడ పనికొస్తాయి కదా. ఇవన్నీ తోడుగా వచ్చేది ఉంది. సంస్కారమైతే ఉంటుంది కదా. ఈ సైన్స్ సంస్కారము కూడా తోడుగా వస్తుంది. ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు - పావనముగా అవ్వాలంటే తండ్రిని స్మృతి చెయ్యండి. తండ్రి కూడా గుడ్ మార్నింగ్ చెప్పి శిక్షణను ఇస్తారు. పిల్లలూ, తండ్రి స్మృతిలో కూర్చున్నారా? నడుస్తూ-తిరుగుతూ తండ్రిని స్మృతి చెయ్యండి ఎందుకంటే తలపై జన్మ-జన్మాంతరాల భారము ఉంది. మెట్లు దిగుతూ-దిగుతూ 84 జన్మలు తీసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ ఒక్క జన్మలో ఎక్కే కళ ఉంటుంది. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారో అంతగా సంతోషము కూడా ఉంటుంది, శక్తి లభిస్తుంది. చాలామంది పిల్లలను ముందు నంబరులో ఉంచడం జరుగుతుంది కానీ స్మృతిలో అస్సలు ఉండరు. జ్ఞానములో తీక్షణముగా ఉన్నా కానీ స్మృతియాత్ర లేదు. తండ్రి అయితే పిల్లల మహిమను చేస్తారు. వీరు కూడా నంబర్ వన్ లో ఉన్నారు అంటే తప్పకుండా శ్రమ కూడా చేస్తూ ఉంటారు కదా. శివబాబా అర్థం చేయిస్తారు అని మీరు ఎల్లప్పుడూ భావించినట్లయితే బుద్ధియోగము అక్కడ జోడించబడి ఉంటుంది. వీరు కూడా నేర్చుకుంటూ ఉండవచ్చు కదా. అయినా కానీ బాబాను స్మృతి చెయ్యండి అని చెప్తారు. ఎవరికైనా అర్థం చేయించేందుకు చిత్రాలు ఉన్నాయి. భగవంతుడు అని నిరాకారుడినే అనటం జరుగుతుంది. వారు వచ్చి శరీరాన్ని ధారణ చేస్తారు. ఒక్క భగవంతుని పిల్లలైన అత్మలందరూ పరస్పరం సోదరులు. ఇప్పుడు ఈ శరీరములో విరాజమానులై ఉన్నారు. అందరూ అకాలమూర్తులు. ఇది అకాలమూర్తి (ఆత్మ) యొక్క సింహాసనము. అకాల సింహాసనము అనేది వేరే ఏదో ప్రత్యేకమైన వస్తువు కాదు. ఇది అకాలమూర్తి యొక్క సింహాసనము. భృకుటి మధ్యలో ఆత్మ విరాజమానమై ఉంటుంది, దీనినే అకాల సింహాసనము అని అంటారు. అకాలమూర్తి యొక్క అకాల సింహాసనము. ఆత్మలందరూ అకాలమూర్తులు, ఎంతటి అతి సూక్ష్మమైనవారు. తండ్రి అయితే నిరాకారుడు. వారు తమదంటూ సింహాసనాన్ని ఎక్కడి నుండి తీసుకువస్తారు. తండ్రి అంటారు, నాది కూడా ఈ సింహాసనమే. నేను వచ్చి ఈ సింహాసనాన్ని లోన్ గా తీసుకుంటాను. బ్రహ్మా యొక్క సాధారణ వృద్ధ తనువులో అకాల సింహాసనముపై వచ్చి కూర్చుంటాను. అందరి ఆత్మలకు ఇది సింహాసనము అని ఇప్పుడు మీకు తెలిసిపోయింది. మనుష్యుల విషయమే మాట్లాడటం జరుగుతుంది, జంతువుల విషయము కాదు. మొదట మనుష్యులెవరైతే జంతువుల కంటే కూడా అధ్వానముగా అయిపోయారో వారైతే బాగుపడాలి. ఎవరైనా జంతువుల గురించి అడిగినట్లయితే వారికి - ముందు మిమ్మల్ని మీరు బాగు చేసుకోండి అని చెప్పండి. సత్యయుగములోనైతే జంతువులు కూడా చాలా మంచిగా, ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి. చెత్త మొదలైనవేవీ ఉండవు. రాజుల మహళ్ళలో పావురాళ్ళు మొదలైనవాటి చెత్త ఉన్నట్లయితే దండన విధిస్తారు. కొంచెము కూడా చెత్త ఉండదు. అక్కడ చాలా జాగ్రత్త ఉంటుంది. ఎప్పుడూ ఏ జంతువు మొదలైనవి లోపలకు జొరబడకుండా కాపలా కాస్తుంటారు. చాలా శుభ్రత ఉంటుంది. లక్ష్మీ-నారాయణుల మందిరములో కూడా ఎంత శుభ్రత ఉంటుంది. శంకరుడు-పార్వతుల మందిరములో పావురాన్ని కూడా చూపిస్తారు. కావున తప్పకుండా మందిరాన్ని కూడా పాడు చేస్తూ ఉండవచ్చు. శాస్త్రాలలోనైతే చాలా దంతకథలను వ్రాసారు.
ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, వారిలో కూడా ధారణ చెయ్యగలిగినవారు కొద్దిమందే ఉన్నారు. మిగిలినవారు ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి పిల్లలకు ఎంత ప్రేమగా అర్థం చేయిస్తారు - పిల్లలూ, చాలా-చాలా మధురముగా అవ్వండి. నోటి నుండి ఎల్లప్పుడూ రత్నాలు వెలువడుతూ ఉండాలి. మీరు రూప్ (యోగీ), బసంత్ (జ్ఞానీ). మీ నోటి నుండి రాళ్ళు వెలువడకూడదు. ఆత్మకే మహిమ ఉంటుంది. నేను ప్రెసిడెంటును, ఫలానాను... నా శరీరము పేరు ఇది అని ఆత్మయే అంటుంది. అచ్ఛా, మరి ఆత్మలు ఎవరి పిల్లలు? ఒక్క పరమాత్ముని పిల్లలు. కనుక తప్పకుండా వారి నుండి వారసత్వము లభిస్తూ ఉండవచ్చు. వారు మరి సర్వవ్యాపి ఎలా కాగలరు! మీకు కూడా ఇంతకుముందు ఏమీ తెలియదు అని మీకు తెలుసు. ఇప్పుడు బుద్ధి ఎంతగా తెరుచుకుంది. మీరు ఏ మందిరములోకి వెళ్ళినా కానీ, ఇవన్నీ అసత్యమైన చిత్రాలు అని భావిస్తారు. 10 భుజాలు కలిగినవారు, ఏనుగు తొండము కలవారు, ఇటువంటి చిత్రము కలవారు ఎవరైనా ఉంటారా! ఇదంతా భక్తి మార్గపు సామగ్రి. వాస్తవానికి భక్తి అనేది ఒక్క శివబాబాకే జరగాలి, వారు సర్వుల సద్గతిదాత. ఈ లక్ష్మీ-నారాయణులు కూడా 84 జన్మలు తీసుకుంటారు అన్నది మీ బుద్ధిలో ఉంది. మళ్ళీ ఉన్నతోన్నతుడైన తండ్రియే వచ్చి అందరికీ సద్గతిని ఇస్తారు. వారికంటే పెద్దవారు మరెవ్వరూ లేరు. ఈ జ్ఞాన విషయాలను మీలో కూడా నంబరువారుగా ధారణ చేయగలరు. ధారణ చేయలేకపోతే ఇక దేనికి పనికొస్తారు. చాలామంది అయితే అంధులకు చేతికర్రగా అయ్యేందుకు బదులుగా స్వయమే అంధులుగా అయిపోతారు. పాలు ఇవ్వని ఆవులను బందెలి దొడ్డిలో అనగా పాలు ఇవ్వని ఆవులను ఉంచే స్థలములో ఉంచుతారు. వీరు కూడా జ్ఞానమనే పాలు ఇవ్వలేరు. అస్సలు ఏమీ పురుషార్థము చెయ్యనివారు చాలామంది ఉన్నారు. మనము ఏదో కాస్త ఎవరి కళ్యాణమైనా చెయ్యాలి అని భావించరు. వారి భాగ్యము గురించిన ఆలోచన కూడా ఉండదు. ఏది లభిస్తే అది చాలు అని అనుకుంటారు. అప్పుడు తండ్రి అంటారు, వీరి అదృష్టములో లేదు. తమ సద్గతిని చేసుకునే పురుషార్థమైతే చెయ్యాలి. దేహీ-అభిమానులుగా అవ్వాలి. తండ్రి ఎంత ఉన్నతోన్నతమైనవారు, కానీ వచ్చేది చూడండి ఎటువంటి పతిత ప్రపంచములో, పతిత శరీరములో వస్తారు. వారిని పిలవడము కూడా పతిత ప్రపంచములోనే పిలుస్తారు. రావణుడు దుఃఖాన్ని ఇచ్చినప్పుడు పూర్తిగా భ్రష్టముగా చేసేస్తాడు, అప్పుడు తండ్రి వచ్చి శ్రేష్ఠముగా తయారుచేస్తారు. ఎవరైతే మంచి పురుషార్థము చేస్తారో వారు రాజు-రాణిగా అవుతారు, ఎవరైతే పురుషార్థము చెయ్యరో వారు పేదవారిగా అవుతారు. అదృష్టములో లేకపోతే పురుషార్థము చెయ్యలేరు. కొందరైతే చాలా మంచి భాగ్యాన్ని తయారుచేసుకుంటారు. మేము ఏ సేవ చేస్తున్నాము అని ప్రతి ఒక్కరూ తమను తాము చూసుకోగలరు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. రూప్ (యోగీ), బసంత్ (జ్ఞాని) గా అయ్యి నోటి నుండి సదా రత్నాలనే వెలికితీయాలి, చాలా-చాలా మధురముగా అవ్వాలి. ఎప్పుడూ కూడా రాళ్ళు (కఠినమైన మాటలు) రానివ్వకూడదు.
2. జ్ఞానము మరియు యోగములో చురుకుగా అయ్యి స్వయం మరియు ఇతరుల కళ్యాణము చేయాలి. తమ ఉన్నతమైన అదృష్టాన్ని తయారుచేసుకునే పురుషార్థము చేయాలి. అంధులకు చేతికర్రగా అవ్వాలి.
| వరదానము:- |
సంతుష్టత ద్వారా సర్వుల నుండి ప్రశంసను ప్రాప్తి చేసుకునే సదా ప్రసన్నచిత్త భవ సంతుష్టతకు గుర్తుగా ప్రత్యక్ష రూపములో ప్రసన్నత కనిపిస్తుంది మరియు ఎవరైతే సదా సంతుష్టముగా లేక ప్రసన్నముగా ఉంటారో వారిని ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్రశంసిస్తారు. కావున ప్రశంసను ప్రసన్నత ద్వారానే ప్రాప్తి చేసుకోగలుగుతారు, అందుకే సదా సంతుష్టముగా మరియు ప్రసన్నముగా ఉండే విశేష వరదానాన్ని స్వయము కూడా తీసుకోండి మరియు ఇతరులకు కూడా ఇవ్వండి ఎందుకంటే ఈ యజ్ఞములో అంతిమ ఆహుతి - సర్వ బ్రాహ్మణుల యొక్క సదాకాలిక ప్రసన్నత. ఎప్పుడైతే అందరూ సదా ప్రసన్నముగా ఉంటారో అప్పుడే ప్రత్యక్షత యొక్క శబ్దము మారుమ్రోగుతుంది మరియు విజయ జెండా ఎగురుతుంది. |
| స్లోగన్:- | డైమండ్ గా అయ్యి డైమండ్ గా అయ్యే సందేశాన్ని ఇవ్వటమే డైమండ్ జూబ్లీ జరుపుకోవటము. |
అవ్యక్త సూచనలు: ఏకాంతప్రియులుగా అవ్వండి, ఏకతను మరియు ఏకాగ్రతను అలవరచుకోండి
ఏకాంతవాసులుగా అవ్వటము అనగా నలువైపులా ఉన్న వైబ్రేషన్ల నుండి అతీతముగా వెళ్ళిపోవటము. కొందరు ఎలా ఉంటారంటే వారికి ఏకాంతము ఇష్టమనిపించదు, సంగఠనలో ఉండటము, నవ్వటము, మాట్లాడటము ఎక్కువ ఇష్టమనిపిస్తుంది, కానీ ఇది బాహ్యముఖతలోకి రావటము. ఇప్పుడు స్వయాన్ని ఏకాంతవాసిగా చేసుకోండి అనగా సర్వ ఆకర్షణల వైబ్రేషన్ల నుండి అంతర్ముఖులుగా అవ్వండి. ఇప్పుడు సమయము ఎటువంటిది వస్తుందంటే, ఈ అభ్యాసమే ఉపయోగపడుతుంది. ఒకవేళ బయటి ఆకర్షణలకు వశీభూతమయ్యే అభ్యాసము ఉన్నట్లయితే సమయానికి అది మోసము చేస్తుంది.