| 25-02-2025 |
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
|
మధువనం |
| ‘‘మధురమైన పిల్లలూ - అందరికీ ఈ శుభవార్తను వినిపించండి - భారత్ ఇప్పుడు మళ్ళీ స్వర్గముగా తయారవుతుంది, హెవెన్లీ గాడ్ ఫాదర్ వచ్చి ఉన్నారు’’ | |
| ప్రశ్న:- | ఏ పిల్లలకైతే స్వర్గానికి యజమానులుగా తయారవుతున్నాము అన్న సంతోషము ఉంటుందో, వారి గుర్తులు ఏమిటి? |
| జవాబు:- | వారికి లోపల ఏ రకమైన దుఃఖమూ కలగదు. వారికి నషా ఉంటుంది - మేము చాలా ఉన్నతమైన వ్యక్తులము, మమ్మల్ని అనంతమైన తండ్రి ఈ విధంగా (లక్ష్మీ-నారాయణుల వలె) తయారుచేస్తున్నారు. వారి నడవడిక చాలా రాయల్ గా ఉంటుంది. వారు ఇతరులకు శుభవార్తను వినిపించకుండా ఉండలేరు. |
ఓంశాంతి. తండ్రి అర్థం చేయిస్తున్నారు మరియు పిల్లలకు తెలుసు - విశేషముగా భారత్ కు మరియు మిగిలిన ప్రపంచమంతటికీ ఈ సందేశాన్ని అందించాలి అని. మీరందరూ సందేశకులు. భారత్ ఇప్పుడు మళ్ళీ స్వర్గముగా తయారవుతోంది అనగా స్వర్గ స్థాపన జరుగుతోంది అన్న ఈ చాలా సంతోషకరమైన సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. ఏ తండ్రినైతే హెవెన్లీ గాడ్ ఫాదర్ అని పిలుస్తారో, వారే స్థాపన చేయడానికి భారత్ లోకి వచ్చారు. ఈ శుభవార్తను అందరికీ బాగా వినిపించండి అని పిల్లలైన మీకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికీ తమ-తమ ధర్మము యొక్క చింత ఉంటుంది. మీకు కూడా చింత ఉంది. మీరు ఈ శుభవార్తను వినిపిస్తారు - భారత్ యొక్క సూర్యవంశీ దేవీ-దేవతా ధర్మము స్థాపన అవుతోంది అనగా భారత్ మళ్ళీ స్వర్గముగా తయారవుతోంది. మేము ఇప్పుడు స్వర్గానికి యజమానులుగా అవుతున్నాము అన్న ఈ సంతోషము లోలోపల ఉండాలి. ఎవరికైతే లోలోపల ఈ సంతోషము ఉంటుందో, వారికి ఏ విధమైన దుఃఖము కలగదు. కొత్త ప్రపంచము స్థాపన అవ్వడములో ఇబ్బంది కూడా కలుగుతుంది అనైతే పిల్లలకు తెలుసు. అబలలపై ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి. మేము భారత్ కు అనంతమైన శుభవార్తను వినిపిస్తున్నాము అని పిల్లలకు సదా స్మృతి ఉండాలి. ఏ విధంగా బాబా - సోదరీ-సోదరులారా, వచ్చి ఈ శుభవార్తను వినండి అని కరపత్రాలను ముద్రింపజేసారు. అందరికీ ఈ సందేశాన్ని ఎలా వినిపించాలి అని రోజంతా ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఈ లక్ష్మీ-నారాయణుల చిత్రాన్ని చూస్తూ రోజంతా హర్షితముగా ఉండాలి. మీరైతే చాలా ఉన్నతమైన వ్యక్తులు, అందుకే మీ నడవడిక ఏదీ కూడా అనాగరిక నడవడికలా ఉండకూడదు. మేము ఒకప్పుడు కోతికంటే కూడా హీనముగా ఉండేవారము, ఇప్పుడు బాబా మమ్మల్ని ఈ విధంగా (దేవీ-దేవతల వలె) తయారుచేస్తున్నారు అని మీకు తెలుసు. కావున ఎంత సంతోషము ఉండాలి. కానీ ఆశ్చర్యము ఏమిటంటే పిల్లల్లో ఆ సంతోషము కూడా ఉండదు, అలాగే అంతటి ఉల్లాసముతో అందరికీ శుభవార్తను కూడా తెలియజేయరు. తండ్రి మిమ్మల్ని సందేశకులుగా తయారుచేసారు. అందరి చెవులలో ఈ సందేశాన్ని వినిపిస్తూ ఉండండి. తమ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ఎప్పుడు రచింపబడింది, ఆ తర్వాత ఏమైంది అనేది భారతవాసులకు తెలియనే తెలియదు. ఇప్పుడైతే కేవలం వాటి చిత్రాలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన అన్ని ధర్మాలు ఉన్నాయి కానీ కేవలం ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము మాత్రమే లేదు. భారత్ లోనే చిత్రాలు ఉన్నాయి. బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తారు. కావున మీరు అందరికీ ఈ శుభవార్తను వినిపించినట్లయితే మీకు కూడా లోలోపల సంతోషము కలుగుతుంది. మీరు వచ్చి అనంతమైన తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకోండి అని ప్రదర్శినీలో మీరు ఈ శుభవార్తను వినిపిస్తారు కదా. ఈ లక్ష్మీ-నారాయణులు స్వర్గానికి యజమానులు కదా. మరి తర్వాత వారు ఏమయ్యారు? ఇది ఎవరికీ అర్థం కాదు. అందుకే - ముఖము మనిషి వలె, బుద్ధి కోతి వలె ఉంది అని అనడం జరుగుతుంది. ఇప్పుడు మీ ముఖము మనిషి వలె ఉంది, బుద్ధి దేవతల వలె తయారవుతుంది. మేము మళ్ళీ సర్వ గుణ సంపన్నులుగా తయారవుతున్నాము అని మీకు తెలుసు. మళ్ళీ ఇతరుల చేత కూడా ఈ పురుషార్థము చేయించాలి. ప్రదర్శనీ సేవ అయితే చాలా మంచిది. ఎవరికైతే గృహస్థ వ్యవహారము యొక్క బంధనము లేదో, ఎవరైతే వానప్రస్థులో లేక విధవలో, కుమారీలో వారికైతే సేవ చేయడానికి చాలా అవకాశము ఉంది. సేవలో నిమగ్నమైపోవాలి. ఈ సమయములో వివాహము చేసుకోవటమంటే నాశనము చేసుకోవడము వంటిది, వివాహము చేసుకోకుండా ఉండడమనేది సమృద్ధిగా ఉండటము వంటిది. తండ్రి అంటారు, ఈ మృత్యులోకము, పతిత ప్రపంచము వినాశనము అవుతోంది. మీరు పావన ప్రపంచములోకి వెళ్ళాలంటే ఈ సేవలో నిమగ్నమైపోవాలి. ఒక ప్రదర్శనీ తర్వాత ఇంకొక ప్రదర్శనీ చేస్తూ వెళ్ళాలి. సేవాధారీ పిల్లలెవరైతే ఉన్నారో, వారికి సేవా అభిరుచి బాగుంది. బాబాను కొంతమంది అడుగుతుంటారు - మమ్మల్ని ఉద్యోగము వదిలేయమంటారా? బాబా చూస్తారు, వారు యోగ్యులైతే వారికి - సరే, ఈ సేవ చేయండి అని అనుమతి ఇస్తారు. ఇటువంటి శుభవార్తను అందరికీ వినిపించాలి. తండ్రి అంటారు, మీరు మీ రాజ్యభాగ్యాన్ని వచ్చి తీసుకోండి. మీరు 5 వేల సంవత్సరాల క్రితం రాజ్యభాగ్యాన్ని తీసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ తీసుకోండి. కేవలం నా డైరెక్షన్లపై నడవండి.
నాలో ఏమేమి అవగుణాలు ఉన్నాయి అనేది చూసుకోవాలి. మీరు ఈ బ్యాడ్జీల ద్వారానైతే ఎంతో సేవ చేయవచ్చు. ఇది ఫస్ట్ క్లాస్ సాధనము. దీని ధర ఎక్కువగా లేకపోయినా దీని ద్వారా ఎంత ఉన్నత పదవిని పొందవచ్చు. మనుష్యులు చదువుకునేందుకు పుస్తకాలు మొదలైనవాటిపై ఎంత ఖర్చు పెడతారు. ఇక్కడ పుస్తకాలు మొదలైనవాటి విషయమే లేదు. కేవలం అందరి చెవులలో సందేశము ఇవ్వాలి, ఇదే తండ్రి యొక్క సత్యమైన మంత్రము. మిగిలినవారందరూ అసత్యమైన మంత్రాలను ఇస్తూ ఉంటారు. నకిలీ వస్తువులకు విలువ ఏమీ ఉండదు కదా. విలువ వజ్రాలకే ఉంటుంది, అంతేకానీ రాళ్ళకు కాదు. ఒక్కొక్క వాక్యము లక్షల విలువ చేస్తుంది అనే గాయనమేదైతే ఉందో, అది ఈ జ్ఞానము విషయములోనే అంటారు. తండ్రి అంటారు, శాస్త్రాలు కూడా అనేకానేకమున్నాయి. మీరు అర్ధకల్పము చదువుతూ వచ్చారు, వాటి ద్వారా ఏమీ లభించలేదు. ఇప్పుడు మీకు జ్ఞాన రత్నాలను ఇస్తున్నారు. వారు శాస్త్రాల అథారిటీ. తండ్రి అయితే జ్ఞానసాగరుడు. వీరి ఒక్కొక్క వాక్యము లక్షల, కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. మీరు వెళ్ళి పదమపతులుగా అవుతారు. ఈ జ్ఞానానికే మహిమ ఉంది. ఆ శాస్త్రాలు మొదలైనవి చదువుతూ నిరుపేదలుగా అయిపోయారు. కావున ఇప్పుడు ఈ జ్ఞాన రత్నాల దానము కూడా చేయాలి. తండ్రి చాలా సహజమైన యుక్తులను అర్థం చేయిస్తారు. మీరు మీ ధర్మాన్ని మర్చిపోయి బయట భ్రమిస్తున్నారు అని వారికి చెప్పండి. భారతవాసులైన మీది ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము, ఆ ధర్మము ఏమయ్యింది? 84 లక్షల యోనులు అని అనడం వలన ఏ విషయమూ బుద్ధిలో కూర్చోదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు ఒకప్పుడు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారు, మళ్ళీ 84 జన్మలు తీసుకున్నారు. ఈ లక్ష్మీ-నారాయణులు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమువారు కదా. ఇప్పుడు ధర్మభ్రష్టులుగా, కర్మభ్రష్టులుగా అయిపోయారు. ఇతర ధర్మాలన్నీ ఉన్నాయి, ఈ ఆది సనాతన ధర్మమే లేదు. ఈ ధర్మము ఉన్నప్పుడు ఇతర ధర్మాలేవీ లేవు. ఇది ఎంత సహజము. వీరు తండ్రి, వీరు దాదా. ప్రజాపిత బ్రహ్మా ఉన్నట్లయితే తప్పకుండా బి.కె.లు అనేకానేకమంది ఉంటారు కదా. తండ్రి వచ్చి రావణుని జైలు నుండి, శోక వాటిక నుండి విడిపిస్తారు. శోక వాటిక యొక్క అర్థము కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు. తండ్రి అంటారు, ఇది శోకము మరియు దుఃఖము యొక్క ప్రపంచము. అది సుఖమయ ప్రపంచము. మీరు మీ శాంతి ప్రపంచాన్ని మరియు సుఖ ప్రపంచాన్ని స్మృతి చేస్తూ ఉండండి. ఇన్ కార్పోరియల్ వరల్డ్ (నిరాకారీ ప్రపంచము) అని అంటారు కదా. ఇంగ్లీష్ పదాలు చాలా బాగున్నాయి. ఇంగ్లీష్ అయితే నడుస్తూనే వస్తుంది. ఇప్పుడైతే అనేక భాషలు తయారయ్యాయి. మనుష్యులు ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు నిర్గుణ బాలల సంస్థ అని అంటారు. నిర్గుణులు అనగా ఏ గుణాలు లేవు అని అర్థము. ఊరికే అలా సంస్థను తయారుచేసేసారు. నిర్గుణ అన్న పదము యొక్క అర్థము కూడా వారికి అర్థం కాదు. అర్థం తెలియకుండా పేరు పెట్టేస్తారు. అనేక సంస్థలు ఉన్నాయి. భారత్ లో ఒకే ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము యొక్క సంస్థ ఉండేది, అప్పుడు వేరే ఏ ధర్మాలు లేవు. కానీ మనుష్యులు 5 వేల సంవత్సరాలకు బదులుగా కల్పము ఆయువును లక్షల సంవత్సరాలుగా వ్రాసేసారు. కనుక మీరు అందరినీ ఈ అజ్ఞాన అంధకారము నుండి బయటకు తీయాలి. సేవ చేయాలి. ఈ డ్రామా అయితే తయారై, తయారుచేయబడినది కానీ శివబాబా యజ్ఞము నుండి తింటూ, తాగుతూ సేవ ఏమీ చేయకపోతే రైట్ హ్యాండ్ గా ఉన్న ధర్మరాజు తప్పకుండా శిక్షిస్తారు, అందుకే అప్రమత్తం చేయడం జరుగుతుంది. సేవ చేయడమైతే చాలా సహజము. ప్రేమతో ఎవరికైనా అర్థం చేయిస్తూ ఉండండి. మేము మందిరాలకు వెళ్ళాము, గంగా నది తీరానికి వెళ్ళాము అని తండ్రి వద్దకు కొందరి సమాచారము వస్తూ ఉంటుంది. ఉదయమే లేచి మందిరాలకు వెళ్తారు, ధార్మిక మనస్కులకు అర్థం చేయించడం సహజమవుతుంది. అన్నంటికంటే మంచిది లక్ష్మీ-నారాయణుల మందిరములో సేవ చేయడము. అచ్ఛా, మరి వీరిని ఈ విధంగా తయారుచేసేవారు శివబాబా, అక్కడికి వెళ్ళి అర్థం చేయించండి. ఈ అడవికి నిప్పు అంటుకుంటుంది, ఇదంతా అంతమైపోతుంది, అప్పుడు మీ పాత్ర కూడా పూర్తవుతుంది. మీరు వెళ్ళి రాజ్య కులములో జన్మ తీసుకుంటారు. రాజ్యము ఎలా లభించనున్నది అనేది మున్ముందు తెలుస్తుంది. డ్రామాలో ముందు నుండే చెప్పరు కదా. మేము ఏ పదవిని పొందబోతున్నాము అనేది మీకు తెలిసిపోతుంది. ఎక్కువగా దాన-పుణ్యాలు చేసేవారు రాజరికములోకి వస్తారు కదా. రాజుల వద్ద ధనము చాలా ఉంటుంది. ఇప్పుడు మీరు అవినాశీ జ్ఞాన రత్నాలను దానము చేస్తారు.
భారతవాసుల కొరకే ఈ జ్ఞానము ఉంది. మీరు ఇలా చెప్పండి - ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము యొక్క స్థాపన జరుగుతోంది, పతితము నుండి పావనముగా తయారుచేసే తండ్రి వచ్చి ఉన్నారు. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి. ఇది ఎంత సహజము. కానీ బుద్ధి ఎంత తమోప్రధానముగా ఉందంటే అసలేమీ ధారణయే అవ్వదు. వికారాలు ప్రవేశించి ఉన్నాయి. జంతువులు కూడా రకరకాలుగా ఉంటాయి, కొన్నింటిలో క్రోధము చాలా ఉంటుంది, ప్రతి జంతువు యొక్క స్వభావము వేరువేరుగా ఉంటుంది. దుఃఖము ఇచ్చే రకరకాల స్వభావాలు ఉంటాయి. అన్నింటికంటే మొదట దుఃఖాన్ని ఇచ్చే వికారము కామ ఖడ్గాన్ని ఉపయోగించడము. రావణ రాజ్యములో ఉన్నదే ఈ వికారాల రాజ్యము. రోజూ అర్థం చేయిస్తూ ఉంటారు. ఎంత మంచి-మంచి కుమార్తెలు ఉన్నారు, పాపం వారు బంధనములో ఉన్నారు, వారిని బాంధేలీ (బంధనములో ఉన్నవారు) అని అంటారు. వాస్తవానికి వారు ఒకవేళ జ్ఞాన పరాకాష్ఠకు చేరుకున్నట్లయితే ఇక ఎవ్వరూ వారిని బంధించలేరు. కానీ మోహ బంధము చాలా ఉంది. సన్యాసులకు కూడా ఇళ్ళు-వాకిళ్ళు గుర్తుకొస్తూ ఉంటాయి, చాలా కష్టము మీద ఆ మోహము తొలగుతుంది. ఇప్పుడు మీరైతే మిత్ర-సంబంధీకులు మొదలైనవారందరినీ మర్చిపోవాల్సిందే ఎందుకంటే ఈ పాత ప్రపంచమే అంతమవ్వనున్నది. ఈ శరీరాన్ని కూడా మర్చిపోవాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేయాలి. పవిత్రముగా అవ్వాలి. 84 జన్మల పాత్రనైతే అభినయించవలసిందే. మధ్యలోనైతే ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. ఇప్పుడు నాటకము పూర్తవుతుంది. పిల్లలైన మీకు ఎంతో సంతోషము ఉండాలి. ఇప్పుడు మనము మన ఇంటికి వెళ్ళాలి. పాత్ర పూర్తయ్యింది. తండ్రిని ఎంతో స్మృతి చేయాలి అన్న ఉత్సుకత ఉండాలి. స్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. ఇంటికి వెళ్ళి మళ్ళీ సుఖధామానికి వస్తారు. ఈ ప్రపంచము నుండి త్వరగా విముక్తులవ్వాలి అని చాలామంది భావిస్తారు. కానీ ఎక్కడికి వెళ్తారు. మొదటైతే ఉన్నత పదవిని పొందేందుకు కృషి చేయాలి కదా. మొదట - మేము ఎంతవరకు యోగ్యులుగా అయ్యాము? అని తమ నాడిని తాము చూసుకోవాలి. స్వర్గములోకి వెళ్ళి ఏం చేస్తారు? మొదటైతే యోగ్యులుగా అవ్వాలి కదా. తండ్రికి సుపుత్రులుగా అవ్వాలి. ఈ లక్ష్మీ-నారాయణులు సుపుత్రులు, యోగ్యులు కదా. వీరు చాలా బాగున్నారు, సేవకు యోగ్యులు అని పిల్లలను చూసి భగవంతుడు కూడా అంటారు. కొందరి విషయములోనైతే, వీరు యోగ్యులు కారు అని అంటారు. అనవసరముగా తమ పదవినే భ్రష్టము చేసుకుంటారు. తండ్రి అయితే సత్యము చెప్తారు కదా. పతిత-పావనా రండి, వచ్చి సుఖధామానికి యజమానులుగా చేయండి అని పిలుస్తారు కూడా. అపారమైన సుఖాన్ని కోరుకుంటారు కదా. కావున తండ్రి అంటారు, ఎంతోకొంత సేవ చేయడానికి యోగ్యులుగా అవ్వండి. నా భక్తులెవరైతే ఉన్నారో, వారికి ఈ శుభవార్తను వినిపించండి - ఇప్పుడు శివబాబా వారసత్వాన్ని ఇస్తున్నారు. వారు చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి మరియు పవిత్రముగా అవ్వండి, అప్పుడు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అయిపోతారు. ఈ పాత ప్రపంచానికి నిప్పు అంటుకుంటుంది. ఎదురుగా లక్ష్యాన్ని చూసినట్లయితే - మేము ఈ విధంగా తయారవ్వాలి అని చాలా సంతోషము కలుగుతుంది. రోజంతా బుద్ధిలో ఇదే గుర్తు ఉన్నట్లయితే ఏ విధమైన ఆసురీ కర్మలు జరగవు. నేను ఈ విధంగా తయారవుతున్నాను కదా, మరి ఇటువంటి తప్పుడు కర్మలు ఎలా చేయగలను? కానీ ఎవరి భాగ్యములోనైనా లేకపోతే ఇటువంటి యుక్తులను కూడా రచించరు, తమ సంపాదనను కూడా చేసుకోరు. సంపాదన ఎంత బాగుంది. ఇంట్లో కూర్చుని అందరూ తమ సంపాదనను చేసుకోవాలి మరియు ఇతరుల చేత కూడా చేయించాలి. ఇంట్లో కూర్చుని ఈ స్వదర్శన చక్రాన్ని తిప్పండి, ఇతరులను కూడా స్వదర్శన చక్రధారులుగా తయారుచేయాలి. ఎంతగా అనేకులను తయారుచేస్తారో అంతగా మీ పదవి ఉన్నతముగా ఉంటుంది. ఈ లక్ష్మీ-నారాయణుల వలె తయారవ్వగలరు. లక్ష్యము-ఉద్దేశ్యమే ఇది. చేతులు కూడా అందరూ సూర్యవంశీయులుగా అయ్యే విషయములోనే ఎత్తుతారు. ఈ చిత్రాలు కూడా ప్రదర్శనీలో ఎంతో ఉపయోగపడగలవు. వాటిపై అర్థం చేయించాలి. మనకు ఉన్నతోన్నతమైన తండ్రి ఏదైతే వినిపిస్తారో, అదే మనము వింటాము. భక్తి మార్గపు విషయాలను వినడం మనము ఇష్టపడము. ఈ చిత్రాలైతే చాలా మంచి సాధనాలు. వీటి ద్వారా మీరు ఎంతో సేవ చేయగలరు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తమ నాడిని తాము చూసుకోవాలి - మేము ఎంతవరకు యోగ్యులుగా అయ్యాము? యోగ్యులుగా అయి సేవా ఋజువును ఇవ్వాలి. జ్ఞాన పరాకాష్ఠ ద్వారా బంధనముక్తులుగా అవ్వాలి.
2. ఒక్క తండ్రి డైరెక్షన్లపై నడుస్తూ అవగుణాలను లోపల నుండి తొలగించుకోవాలి. దుఃఖాన్ని ఇచ్చే స్వభావాన్ని వదిలి సుఖాన్ని ఇచ్చేవారిగా అవ్వాలి. జ్ఞాన రత్నాలను దానము చేయాలి.
| వరదానము:- |
పరీక్షలు మరియు సమస్యలలో వాడిపోయేందుకు బదులుగా వాటిని మనోరంజనముగా అనుభవం చేసే సదా విజయీ భవ ఈ పురుషార్థీ జీవితములో డ్రామా అనుసారముగా సమస్యలు లేక పరిస్థితులు అయితే రావలసిందే. జన్మ తీసుకోవడముతోనే ముందుకు వెళ్ళాలి అన్న లక్ష్యము పెట్టుకోవడము అనగా పరీక్షలను మరియు సమస్యలను ఆహ్వానించడము. మార్గాన్ని నిర్ణయించుకోవాలి అన్నప్పుడు మరి ఆ మార్గమధ్యములో దృశ్యాలు ఉండకూడదు అంటే అది ఎలా అవుతుంది. కానీ ఆ దృశ్యాలను దాటేందుకు బదులుగా ఒకవేళ వాటిని కరెక్షన్ చేయడం మొదలుపెడితే తండ్రి స్మృతి యొక్క కనెక్షన్ లూజ్ అయిపోతుంది మరియు మనోరంజనానికి బదులుగా మనసును వాడిపోయేలా చేసుకుంటారు, అందుకే వాహ్ దృశ్యము, వాహ్ అన్న పాటను పాడుతూ ముందుకు వెళ్ళండి అనగా సదా విజయీ భవ అన్న వరదానులుగా అవ్వండి. |
| స్లోగన్:- | మర్యాదల లోపల నడవడము అనగా మర్యాదా పురుషోత్తములుగా అవ్వడము. |
అవ్యక్త సూచనలు - ఏకాంతప్రియులుగా అవ్వండి, ఏకత మరియు ఏకాగ్రతను అలవరచుకోండి
ఏకాంతవాసి అనగా అనుభవీమూర్తులు. వర్తమాన సమయమనుసారంగా ఇప్పుడు వానప్రస్థ అవస్థకు సమీపముగా ఉన్నారు. వానప్రస్థులు బొమ్మలాటను ఆడరు. వానప్రస్థులు ఏకాంతములో మరియు స్మరణలో ఉంటారు. కనుక అనంతమైన వానప్రస్థులైన మీరందరూ సదా ఒక్కరి అంతములో అనగా నిరంతర ఏకాంతములో సదా స్మృతి స్వరూపులుగా ఉండండి. ఇది అనంతమైన వానప్రస్థీ స్థితి.