తెలుగు మురళి · Brahma Kumaris

తెలుగు మురళి · 28 ఫిబ్రవరి, 2025

ఓం శాంతి · BapDada ·

ఈరోజు మురళి — today’s murli in Telugu, BK Telugu murli.

18
మురళి28 ఫిబ్రవరి, 2025 · తెలుగు
0:00--:--

పాఠ్యాన్ని ఎంచుకోండి → హైలైట్ / బాక్స్ / అండర్‌లైన్

28-02-2025
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
మధువనం

‘‘మధురమైన పిల్లలూ - శాంతి కావాలంటే అశరీరిగా అవ్వండి, ఈ దేహ-భానములోకి రావడము వలనే అశాంతి కలుగుతుంది, అందుకే మీ స్వధర్మములో స్థితులవ్వండి’’
ప్రశ్న:- యథార్థ స్మృతి అంటే ఏమిటి? స్మృతి చేసే సమయములో విశేషముగా ఏ విషయము పట్ల శ్రద్ధ ఉండాలి?
జవాబు:- స్వయాన్ని ఈ దేహము నుండి అతీతమైన ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడము - ఇదే యథార్థమైన స్మృతి. ఏ దేహమూ గుర్తుకు రాకూడదు, ఈ విషయములో శ్రద్ధ వహించడం తప్పనిసరి. స్మృతిలో ఉండేందుకు జ్ఞానము యొక్క నషా ఎక్కి ఉండాలి. బాబా మనల్ని మొత్తము విశ్వానికి యజమానులుగా తయారుచేస్తున్నారు, మనము మొత్తం సముద్రానికి, మొత్తం ధరణికి యజమానులుగా అవుతాము.
పాట:- మిమ్మల్ని పొంది మేము...

ఓంశాంతి. ఓం అనగా అర్థము నేను, ఆత్మనైన నేను. మనుష్యులు ఓం అనగా భగవంతుడని భావిస్తారు, కానీ అలా కాదు. ఓం అనగా నేను ఆత్మను, ఇది నా శరీరము. ఓం శాంతి అని అంటారు కదా. ఆత్మనైన నా స్వధర్మము శాంతి. ఆత్మ తన పరిచయాన్ని ఇస్తుంది. మనుష్యులు ఓం శాంతి అని అంటారు కానీ ఓం యొక్క అర్థాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఓం శాంతి అన్న పదము బాగుంది. నేను ఆత్మను, నా స్వధర్మము శాంతి. ఆత్మనైన నేను శాంతిధామ నివాసిని. అర్థము ఎంత సహజముగా ఉంది. దీనికి చాలా విస్తారమైన అర్థమేమీ లేదు. ఈ సమయములోని మనుష్యమాత్రులకైతే, ఇప్పుడు ఇది కొత్త ప్రపంచమా లేక పాత ప్రపంచమా అన్నది కూడా తెలియదు. కొత్త ప్రపంచము మళ్ళీ పాతదిగా ఎప్పుడు అవుతుంది, పాతది నుండి మళ్ళీ కొత్త ప్రపంచముగా ఎప్పుడు అవుతుంది - ఇది ఎవ్వరికీ తెలియదు. ప్రపంచము కొత్తదిగా ఎప్పుడు అవుతుంది, మళ్ళీ పాతదిగా ఎప్పుడు అవుతుంది అని ఎవరినైనా అడిగినట్లయితే ఎవ్వరూ చెప్పలేకపోతారు. ఇప్పుడు ఇది కలియుగీ పాత ప్రపంచము. కొత ప్రపంచము అని సత్యయుగాన్ని అంటారు. అచ్ఛా, కొత్తదానికి మళ్ళీ పాతగా అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. మనుష్యులై ఉండి కూడా ఇది తెలియదు, అందుకే వారిని జంతువులకంటే హీనము అని అంటారు. జంతువులైతే వాటినవి ఏమీ అనుకోవు, మనుష్యులైతే మేము పతితముగా ఉన్నాము, ఓ పతిత-పావన రండి అని అంటారు. కానీ వారి గురించి ఏ మాత్రమూ తెలియదు. పావనము అన్న పదము ఎంత బాగుంది. పావన ప్రపంచమైన స్వర్గము కొత్త ప్రపంచముగానే ఉంటుంది. చిత్రాలు కూడా దేవతలవి ఉన్నాయి కానీ ఈ లక్ష్మీ-నారాయణులు కొత్త పావన ప్రపంచానికి యజమానులని ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఈ విషయాలన్నింటినీ అనంతమైన తండ్రియే కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. కొత్త ప్రపంచము అని స్వర్గాన్ని అంటారు. దేవతలను స్వర్గవాసులు అని అంటారు. ఇప్పుడు ఇది పాత ప్రపంచము, నరకము. ఇక్కడి మనుష్యులు నరకవాసులు. ఎవరైనా మరణించినా స్వర్గస్థులయ్యారు అని అంటారు అనగా ఇక్కడ నరకవాసులుగా ఉన్నట్లు కదా. వారూ తమ లెక్కలో - తప్పకుండా ఇది నరకమేనని అంటారు, కానీ ఒకవేళ మీరు నరకవాసులు అని అంటే డిస్టర్బ్ అవుతారు. తండ్రి అర్థం చేయిస్తారు, చూడటానికైతే మనుష్యుల వలె ఉన్నారు. ముఖము మనిషి వలె ఉంది కానీ బుద్ధి కోతి వలె ఉంది. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. స్వయం కూడా మందిరాలలోకి వెళ్ళి దేవతల ఎదురుగా - మీరు సర్వగుణ సంపన్నులు... అని పాడుతారు, మరి స్వయం కోసం ఏమనుకుంటారు? మేము పాపులము, నీచులము అని. కానీ మీరు వికారులు అని డైరెక్టుగా అంటే డిస్టర్బ్ అవుతారు. అందుకే తండ్రి కేవలం పిల్లలతోనే మాట్లాడుతారు, అర్థం చేయిస్తారు. బయటివారితో మాట్లాడరు ఎందుకంటే కలియుగీ మనుష్యులు నరకవాసులు. ఇప్పుడు మీరు సంగమయుగవాసులు. మీరు పవిత్రముగా అవుతూ ఉన్నారు. బ్రాహ్మణులైన మనల్ని శివబాబా చదివిస్తున్నారని మీకు తెలుసు. వారు పతిత-పావనుడు. ఆత్మలైన మనందరినీ తీసుకువెళ్ళేందుకే తండ్రి వచ్చారు. ఇవి ఎంతటి సింపుల్ విషయాలు. తండ్రి అంటారు - పిల్లలూ, ఆత్మలైన మీరు పాత్రను అభినయించడానికి శాంతిధామము నుండి వస్తారు. ఈ దుఃఖధామములో అందరూ దుఃఖితులుగా ఉన్నారు, అందుకే మసస్సుకు శాంతి ఎలా కలుగుతుంది అని అడుగుతారే కానీ ఆత్మకు శాంతి ఎలా కలుగుతుంది అని అనరు. అరే, మీరు - ఓం శాంతి, నా స్వధర్మమే శాంతి అని అంటారు కదా, మరి శాంతిని ఎందుకు అడుగుతారు? స్వయాన్ని ఆత్మ అని మర్చిపోయి దేహాభిమానములోకి వచ్చేస్తారు. ఆత్మలైతే శాంతిధామ నివాసులు. ఇక్కడ మరి శాంతి ఎక్కడి నుండి లభిస్తుంది? అశరీరిగా అయినట్లయితేనే శాంతి లభిస్తుంది. శరీరముతో పాటు ఆత్మ ఉంది, కావున వారికి తప్పకుండా మాట్లాడవలసి, నడవవలసి వస్తుంది. ఆత్మలమైన మనము శాంతిధామము నుండి ఇక్కడికి పాత్రను అభినయించడానికి వచ్చాము. రావణుడే మన శత్రువు అని కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఈ రావణుడు ఎప్పటినుండి శత్రువుగా అయ్యాడు? ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. మనము దిష్టిబొమ్మ తయారుచేసి కాలుస్తున్నా సరే ఆ రావణుడు ఎవరు అన్నది గొప్ప-గొప్ప విద్వాంసులు, పండితులు మొదలైనవారిలో ఒక్కరికి కూడా తెలియదు. జన్మజన్మాంతరాలుగా కాలుస్తూ వచ్చారు, ఏమీ తెలియదు. రావణుడు ఎవరు అని ఎవరినైనా అడగండి. ఇదంతా ఊహ అని అంటారు. వారికి తెలియనే తెలియకపోతే, ఇక ఏమని జవాబిస్తారు. ఓ రామా, అసలు ఈ ప్రపంచము తయారవ్వనే లేదు, ఇదంతా ఒక ఊహ అని శాస్త్రాలలో కూడా ఉంది కదా. చాలామంది ఇలా అంటూ ఉంటారు. ఇప్పుడు ఊహ యొక్క అర్థమేమిటి? ఇది సంకల్పాల ప్రపంచమని, ఎవరు ఎటువంటి సంకల్పము చేస్తే అది జరిగిపోతుందని అంటూ ఉంటారు కానీ దాని అర్థము అర్థం చేసుకోరు. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. కొందరు బాగా అర్థం చేసుకుంటారు, కొందరు అర్థమే చేసుకోరు. ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వారిని సొంత పిల్లలు అని అంటారు మరియు ఎవరైతే అర్థం చేసుకోరో వారు సవతి పిల్లలు. ఇప్పుడు సవతి పిల్లలు వారసులుగా అవ్వరు కదా. బాబా వద్ద సొంత పిల్లలు కూడా ఉన్నారు, సవతి పిల్లలు కూడా ఉన్నారు. సొంత పిల్లలైతే తండ్రి శ్రీమతముపై పూర్తిగా నడుస్తారు. సవతి పిల్లలు నడవరు. వీరు నా మతముపై నడవరు, రావణుడి మతముపై నడుస్తారు అని తండ్రి అంటారు. రాముడు మరియు రావణుడు అనే రెండు పదాలు ఉన్నాయి. రామ రాజ్యము మరియు రావణ రాజ్యము. ఇప్పుడు ఉన్నది సంగమము. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఈ బ్రహ్మాకుమార, కుమారీలందరూ శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు, మరి మీరు కూడా తీసుకుంటారా, శ్రీమతముపై నడుస్తారా అని అడిగితే - ఆ మతము ఏమిటి అని అంటారు. తండ్రి పవిత్రముగా అవ్వండి అని శ్రీమతాన్ని ఇస్తారు. దానికి ఏమంటారంటే - నేను పవిత్రముగా ఉంటే, దానికి పతి అంగీకరించకపోతే, మరి నేను ఎవరి మాట వినాలి? అతను నాకు పతి పరమేశ్వరుడు ఎందుకంటే భారత్ లో పతియే నీకు గురువు, ఈశ్వరుడు, సర్వస్వము అని నేర్పించబడుతుంది. కానీ ఎవ్వరూ అలా భావించరు. ఆ సమయానికి అవును అని అంటారు కానీ వాస్తవానికి అలా భావించరు. మళ్ళీ గురువుల వద్దకు మందిరాలకు వెళ్తూ ఉంటారు. నీవు బయటకు వెళ్ళొద్దు, నేను నీకు రాముడి విగ్రహాన్ని ఇంట్లో పెడతాను, నువ్వు అయోధ్య మొదలైన చోట్లకు ఎందుకు తిరుగుతావు? అని పతి అంటే, పత్ని ఒప్పుకోదు. ఇవి భక్తి మార్గపు ఎదురుదెబ్బలు. వారు తప్పకుండా ఆ ఎదురుదెబ్బలే తింటారు, ఎప్పటికీ అంగీకరించరు. అది రాముని మందిరము అని భావిస్తారు. అరే, నువ్వు రాముడిని స్మృతి చేసేది ఉందా లేక ఆ మందిరాన్నా అని పతి అంటారు. కానీ ఆమె అర్థం చేసుకోరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఓ భగవంతుడా, వచ్చి మాకు సద్గతిని ఇవ్వండి అని భక్తి మార్గములో అంటారు కూడా ఎందుకంటే వారొక్కరే సర్వుల సద్గతిదాత. అచ్ఛా, వారు ఎప్పుడు వస్తారు - ఇది కూడా ఎవ్వరికీ తెలియదు.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - రావణుడే మీ శత్రువు. రావణుడి విషయము విచిత్రముగా ఉంటుంది, అతడిని కాలుస్తూనే ఉంటారు కానీ అతను చనిపోనే చనిపోడు. రావణుడు ఎవరు అనేది ఎవ్వరికీ తెలియదు. మనకు అనంతమైన తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు కానీ శివుని గురించి ఎవ్వరికీ తెలియదు. ప్రభుత్వానికి కూడా మీరు అర్థం చేయిస్తారు. శివుడైతే భగవంతుడు, వారే కల్ప కల్పమూ వచ్చి భారత్ ను నరకవాసి నుండి స్వర్గవాసిగా, బికారి నుండి రాకుమారునిగా, పతితము నుండి పావనముగా చేస్తారు. వారే సర్వుల సద్గతిదాత. ఈ సమయములో మనుష్యమాత్రులందరూ ఇక్కడ ఉన్నారు. క్రైస్టు ఆత్మ కూడా ఏదో ఒక జన్మ తీసుకుని ఇక్కడే ఉంది. తిరిగి వెనుకకు ఎవ్వరూ వెళ్ళలేరు. వీరందరి సద్గతిని చేసేవారు ఉన్నతమైన ఆ తండ్రి ఒక్కరే. వారు రావడం కూడా భారత్ లోనే వస్తారు. వాస్తవానికి భక్తి కూడా ఎవరైతే సద్గతిని ఇస్తారో వారికే చేయాలి. ఆ నిరాకార తండ్రి ఇక్కడ లేరు. వారిని ఎప్పుడూ పైన ఉన్నట్లుగా భావిస్తూ స్మృతి చేస్తారు. కృష్ణుడిని పైన ఉన్నట్లుగా భావించరు. మిగిలినవారందరినీ ఇక్కడే కింద స్మృతి చేస్తారు. కృష్ణుడిని కూడా ఇక్కడే స్మృతి చేస్తారు. పిల్లలైన మీది యథార్థ స్మృతి. మీరు స్వయాన్ని ఈ దేహము నుండి అతీతముగా, ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తారు. తండ్రి అంటారు, మీకు ఏ దేహమూ గుర్తురాకూడదు. ఈ అటెన్షన్ తప్పకుండా ఉంచాలి. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. బాబా మనల్ని మొత్తము విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు. మొత్తము సముద్రానికి, మొత్తము భూమికి, మొత్తము ఆకాశానికి యజమానులుగా తయారుచేస్తారు. ఇప్పుడైతే ఎంత ముక్కలు-ముక్కలుగా విభజించబడి ఉన్నాయి. ఒకరి హద్దులోకి ఇంకొకరిని రానివ్వరు. అక్కడ ఈ విషయాలేవీ ఉండవు. భగవంతుడు ఒక్క తండ్రే. అలాగని అందరూ తండ్రులేనని కాదు. హిందువులు-చైనీయులు భాయి-భాయి అని, హిందువులు-ముస్లిములు భాయి-భాయి అని అంటారు కానీ దాని అర్థాన్ని అర్థం చేసుకోరు. హిందువులు-ముస్లిములు సోదరీ-సోదరులు అని ఎప్పుడూ అనరు. అలా అనరు. ఆత్మలందరూ పరస్పరము సోదరులు. కానీ ఈ విషయము గురించి వారికి తెలియనే తెలియదు. శాస్త్రాలూ మొదలైనవి వింటూ ఇది సత్యము, ఇది సత్యము అని అంటూ ఉంటారు, అర్థమేమీ తెలియదు. వాస్తవానికి అది అసత్యము, అబద్దము. సత్యఖండములో అంతా సత్యమే మాట్లాడుతారు. ఇక్కడ అంతా అసత్యమే అసత్యము. ఎవరినైనా, మీరు అబద్దము చెప్పారు అని అంటే డిస్టర్బ్ అవుతారు. మీరు సత్యము చెప్పినా సరే కొంతమంది నిందించడం మొదలుపెడతారు. ఇప్పుడు తండ్రి గురించైతే బ్రాహ్మణులైన మీకే తెలుసు. పిల్లలైన మీరు ఇప్పుడు దైవీ గుణాలను ధారణ చేస్తారు. ఇప్పుడు పంచ తత్వాలు కూడా తమోప్రధానముగా ఉన్నాయని మీకు తెలుసు. ఈ రోజుల్లో మనుష్యులు భూతాల పూజను కూడా చేస్తూ ఉంటారు. భూతాల స్మృతే ఉంటూ ఉంటుంది. తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కరినే స్మృతి చేయండి. భూతాలను స్మృతి చేయకండి. గృహస్థ వ్యవహారములో ఉంటూ బుద్ధియోగాన్ని తండ్రితో జోడించండి. ఇప్పుడు దేహీ-అభిమానిగా అవ్వాలి. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా వికర్మలు వినాశనమవుతాయి. జ్ఞానము యొక్క మూడవ నేత్రము మీకు లభిస్తుంది.

ఇప్పుడు మీరు వికర్మాజీతులుగా అవ్వాలి. అది వికర్మాజీతుల కాలము. ఇది వికర్మలు చేసేవారి కాలము. మీరు యోగబలముతో వికర్మలపై విజయము పొందుతారు. భారత్ యొక్క యోగమైతే ప్రసిద్ధమైనది. కానీ మనుష్యులకు తెలియదు. సన్యాసులు విదేశాలకు వెళ్ళి - మేము భారత్ యొక్క యోగాన్ని నేర్పించడానికి వచ్చాము అని అంటారు. కానీ వీరు హఠయోగులు అన్నది వారికి తెలియదు. వారు రాజయోగాన్ని నేర్పించలేరు. మీరు రాజఋషులు. వారు హద్దు సన్యాసులు, మీరు అనంతమైన సన్యాసులు. రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. బ్రాహ్మణులైన మీరు తప్ప ఇంకెవ్వరూ రాజయోగాన్ని నేర్పించలేరు. ఇవి కొత్త విషయాలు. వీటిని కొత్తవారెవరూ అర్థం చేసుకోలేరు, అందుకే కొత్తవారిని ఎప్పుడూ అనుమతించడం జరగదు. ఇది ఇంద్రసభ కదా. ఈ సమయములో అందరూ రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు. సత్యయుగములో మీరు పారసబుద్ధి కలవారిగా అవుతారు. ఇప్పుడు ఉన్నది సంగమము. రాయి నుండి పారసముగా తండ్రి తప్ప ఇంకెవ్వరూ తయారుచేయలేరు. మీరు ఇక్కడకు పారసబుద్ధి కలవారిగా అవ్వడానికి వచ్చారు. తప్పకుండా భారత్ బంగారు పిచ్చుకలా ఉండేది. ఈ లక్ష్మీ-నారాయణులు విశ్వానికి యజమానులుగా ఉండేవారు కదా. వీరు ఒకప్పుడు రాజ్యము చేసేవారు అన్నది కూడా ఎవ్వరికీ తెలియదు. నేటికి 5000 సంవత్సరాల క్రితము వీరి రాజ్యము ఉండేది. మరి తర్వాత వారు ఎక్కడికి వెళ్ళారు. మీరు ఇలా చెప్పవచ్చు - వారు 84 జన్మలు అనుభవించారు, ఇప్పుడు తమోప్రధానముగా ఉన్నారు, మళ్ళీ తండ్రి ద్వారా సతోప్రధానముగా అవుతున్నారు, తతత్వం (ఇది మీకు కూడా వర్తిస్తుంది). ఈ జ్ఞానాన్ని తండ్రి తప్ప సాధు-సన్యాసులు మొదలైనవారెవ్వరూ ఇవ్వలేరు. అది భక్తి మార్గము, ఇది జ్ఞాన మార్గము. పిల్లలైన మీ వద్ద మంచి-మంచి పాటలేవైతే ఉన్నాయో, వాటిని విన్నట్లయితే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సంతోషము యొక్క పాదరసము పూర్తిగా పైకి ఎక్కుతుంది. మళ్ళీ ఆ నషా స్థిరముగా కూడా ఉండాలి. ఇది జ్ఞాన అమృతము. వారు మద్యము తాగితే నషా ఎక్కుతుంది. ఇక్కడ ఇది జ్ఞాన అమృతము. మీ నషా దిగకూడదు, సదా పైకి ఎక్కి ఉండాలి. మీరు ఈ లక్ష్మీ-నారాయణులను చూసి ఎంత సంతోషపడతారు. మనము శ్రీమతము ద్వారా మళ్ళీ శ్రేష్ఠాచారులుగా అవుతున్నాము అని మీకు తెలుసు. ఇక్కడ చూస్తూ కూడా బుద్ధియోగము తండ్రి మరియు వారసత్వముతో జోడించబడి ఉండాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. వికర్మాజీతులుగా అయ్యేందుకు యోగబలముతో వికర్మలపై విజయము పొందాలి. ఇక్కడ చూస్తూ కూడా బుద్ధియోగము తండ్రి మరియు వారసత్వముతో జోడించబడి ఉండాలి.

2. తండ్రి యొక్క వారసత్వానికి పూర్తి అధికారాన్ని ప్రాప్తి చేసుకునేందుకు సొంత పిల్లలుగా అవ్వాలి. ఒక్క తండ్రి శ్రీమతముపైనే నడవాలి. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో, దానిని అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయించాలి.

వరదానము:- దివ్య బుద్ధి అనే లిఫ్ట్ ద్వారా మూడు లోకాల షికారు చేసే సహజయోగీ భవ
సంగమయుగములో పిల్లలందరికీ దివ్య బుద్ధి అనే లిఫ్ట్ లభిస్తుంది. ఈ అద్భుతమైన లిఫ్ట్ ద్వారా మూడు లోకాలలో ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి చేరుకోగలరు. కేవలం స్మృతి అనే స్విచ్ ను ఆన్ చేసినట్లయితే క్షణములో చేరుకుంటారు మరియు ఎంత సమయము, ఏ లోకాన్ని అనుభవం చేయాలనుకుంటే అంత సమయము అక్కడ స్థితులై ఉండవచ్చు. ఈ లిఫ్ట్ ను ఉపయోగించుకునేందుకు అమృతవేళ జాగ్రత్తగా స్మృతి అనే స్విచ్ ను యథార్థ రీతిలో సెట్ చేయండి. అథారిటీగా అయి ఈ లిఫ్ట్ ను కార్యములో ఉపయోగించినట్లయితే సహజయోగిగా అవుతారు. శ్రమ సమాప్తమైపోతుంది.
స్లోగన్:- మనస్సును సదా ఆనందములో ఉంచడము - ఇదే జీవితము జీవించే కళ.

 

అవ్యక్త సూచనలు:- ఏకాంతప్రియులుగా అవ్వండి, ఏకతను మరియు ఏకాగ్రతను అలవరచుకోండి

ఏకాంతవాసికి రెండు అర్థాలు ఉన్నాయి. కేవలం బాహ్య ఏకాంతమే కాదు, కానీ ఒక్కరి అంతములో మైమరచిపోవటము, ఏకాంతము. లేదంటే కేవలం బాహ్య ఏకాంతమే ఉన్నట్లయితే బోర్అయిపోతారు, అప్పుడు - రోజు ఎలా గడుస్తుందో ఏమిటో తెలియదు అని అంటారు! అందుకే ఒక్క తండ్రి యొక్క అంతములో మైమరచిపోండి. ఏ విధంగా సాగరము లోతుల్లోకి వెళ్తే ఎంత ఖజానా లభిస్తుంది, అలా ఒక్కరి అంతములోకి వెళ్ళిపోండి అనగా తండ్రి ద్వారా ఏ ప్రాప్తులైతే లభించాయో, వాటిలో మైమరచిపోండి.

మురళి అంటే ఏమిటి?

మురళి బ్రహ్మకుమారీల దైనిక ఆధ్యాత్మిక బోధన, ఇది ప్రతి ఉదయం మధుబన్ నుండి ప్రచురించబడుతుంది. ఇక్కడ మీరు ఈరోజు మురళిని తెలుగులో చదవవచ్చు, ఆడియో వినవచ్చు మరియు PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధ్యయనానికి సహాయంగా పాఠ్యాన్ని హైలైట్ చేయవచ్చు — మీ గుర్తులు ఈ బ్రౌజర్‌లోనే సురక్షితంగా ఉంటాయి.

28 భాషల్లో మురళి

Daily Murli · Madhuban మూలం: మధుబన్ మురళి విభాగం ఇది స్వతంత్ర రీడర్ యాప్, అధికారిక వెబ్‌సైట్ కాదు.