తెలుగు మురళి · Brahma Kumaris

తెలుగు మురళి · 27 ఫిబ్రవరి, 2025

ఓం శాంతి · BapDada ·

ఈరోజు మురళి — today’s murli in Telugu, BK Telugu murli.

18
మురళి27 ఫిబ్రవరి, 2025 · తెలుగు
0:00--:--

పాఠ్యాన్ని ఎంచుకోండి → హైలైట్ / బాక్స్ / అండర్‌లైన్

27-02-2025
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
మధువనం

‘‘మధురమైన పిల్లలూ - సత్యము యొక్క సాంగత్యము జ్ఞాన మార్గములోనే ఉంటుంది, ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి యొక్క సాంగత్యములో కూర్చున్నారు, తండ్రి స్మృతిలో ఉండటము అనగా సత్సంగము చేయటము’’
ప్రశ్న:- సత్సంగము యొక్క అవసరము పిల్లలైన మీకు ఇప్పుడే ఉంది - ఎందుకు?
జవాబు:- ఎందుకంటే తమోప్రధానమైన ఆత్మ ఒక్క సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు మరియు సద్గురువు యొక్క సాంగత్యముతోనే సతోప్రధానముగా అనగా నలుపు నుండి తెలుపుగా అవ్వగలదు. సత్సంగము లేకుండా నిర్బల ఆత్మ శక్తిశాలిగా అవ్వలేదు. తండ్రి సాంగత్యముతో ఆత్మలో పవిత్రతా బలము వస్తుంది, 21 జన్మల కొరకు వారి నావ తీరం చేరుకుంటుంది.

ఓంశాంతి. పిల్లలైన మీరు సత్సంగములో కూర్చున్నారు, ఈ సత్యము యొక్క సాంగత్యములో కల్ప-కల్పము సంగమములోనే పిల్లలు కూర్చుంటారు. సత్య సాంగత్యము అని దేనిని అంటారో ప్రపంచములోని వారికెవ్వరికీ తెలియదు. సత్సంగము అనే పేరు అవినాశీగా నడుస్తూ వచ్చింది. మేము ఫలానా సత్సంగానికి వెళ్తున్నాము అని భక్తి మార్గములో కూడా అంటారు. ఇప్పుడు వాస్తవానికి భక్తి మార్గములో ఎవ్వరూ సత్సంగానికి వెళ్ళరు. సత్సంగము ఉండేదే జ్ఞాన మార్గములో. ఇప్పుడు మీరు సత్యము యొక్క సాంగత్యములో కూర్చున్నారు. ఆత్మలు సత్యమైన తండ్రి సాంగత్యములో కూర్చున్నారు. వేరే ఏ స్థానములోనూ ఆత్మలు పరమపిత పరమాత్ముని సాంగత్యములో కూర్చోరు. తండ్రి గురించి తెలియదు. మేము సత్సంగానికి వెళ్తున్నాము అని అంటారు కానీ వారు దేహాభిమానములోకి వచ్చేస్తారు. మీరు దేహాభిమానములోకి రారు. మేము ఆత్మలము, సత్యమైన బాబా సాంగత్యములో కూర్చున్నాము అని మీరు భావిస్తారు. ఇతర మనుష్యులెవ్వరూ సత్యము యొక్క సాంగత్యములో కూర్చోలేరు. సత్యము యొక్క సాంగత్యము - ఈ పేరు కూడా ఇప్పుడే ఉంది. సత్యము యొక్క సాంగత్యము - దీని అర్థాన్ని యథార్థ రీతిలో తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఆత్మలైన మీరు ఇప్పుడు సత్యము అయిన పరమాత్మ తండ్రితో పాటు కూర్చున్నారు. వారు సత్యమైన తండ్రి, సత్యమైన టీచరు, సత్యమైన గురువు. కావున మీరు సత్సంగములో కూర్చున్నారు. ఇక ఇక్కడ కూర్చున్నా లేక ఇంట్లో కూర్చున్నా, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తారు. ఆత్మలమైన మనము ఇప్పుడు సత్యమైన తండ్రిని స్మృతి చేస్తున్నాము అనగా సత్యము యొక్క సాంగత్యములో ఉన్నాము. తండ్రి మధుబన్ లో కూర్చున్నారు. తండ్రిని స్మృతి చేసే యుక్తులు కూడా అనేక రకాలవి లభిస్తాయి. స్మృతితోనే వికర్మలు వినాశనమవుతాయి. మనము 16 కళల సంపూర్ణులుగా అవుతామని, ఆ తర్వాత దిగుతూ, దిగుతూ కళలు తగ్గుతూ ఉంటాయని ఇది కూడా పిల్లలకు తెలుసు. భక్తి కూడా మొదట అవ్యభిచారిగా ఉంటుంది, ఆ తర్వాత పడిపోతూ, పడిపోతూ వ్యభిచారి భక్తిగా అయ్యేటప్పటికి తమోప్రధానముగా అయిపోతారు, అప్పుడిక వారికి సత్యము యొక్క సాంగత్యము తప్పకుండా కావాలి. లేదంటే పవిత్రముగా ఎలా అవుతారు? కావున ఇప్పుడు ఆత్మలైన మీకు సత్యమైన తండ్రి సాంగత్యము లభించింది. నేను బాబాను స్మృతి చేయాలి, వారి సాంగత్యములోనే ఉండాలి అని ఆత్మకు తెలుసు. స్మృతిని కూడా సాంగత్యము అని అంటారు. ఇక్కడ ఉన్నది సత్యము యొక్క సాంగత్యము. ఈ దేహము ఉంటున్నప్పటికి ఆత్మ అయిన మీరు నన్ను స్మృతి చేయండి, ఇదే సత్యము యొక్క సాంగత్యము. ఉదాహరణకు - ఇతనికి ఒక పెద్ద వ్యక్తి సాంగత్యము లభించింది, అందుకే దేహాభిమానిగా అయిపోయాడు అని అంటుంటారు కదా. ఇప్పుడు మీకు సత్యమైన తండ్రితో సాంగత్యము జోడించబడింది, దీని ద్వారా మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయిపోతారు. తండ్రి అంటారు, నేను ఒకేసారి వస్తాను. ఇప్పుడు ఆత్మకు పరమాత్మతో సాంగత్యము జోడించబడిన కారణముగా మీరు 21 జన్మల కొరకు దాటేస్తారు. ఆ తర్వాత మళ్ళీ మీకు దేహ సాంగత్యము అంటుకుంటుంది. ఇది కూడా డ్రామాగా తయారై ఉంది. తండ్రి అంటారు, పిల్లలైన మీ సాంగత్యము నాతో ఉన్నట్లయితే మీరు సతోప్రధానముగా అవుతారు, అప్పుడు బంగారుయుగమువారు అని అంటారు.

సాధు-సన్యాసులు మొదలైనవారు ఆత్మ నిర్లేపి అని, అందరూ పరమాత్మే పరమాత్మ అని భావిస్తారు. మరి దీని అర్థము పరమాత్మలో మాలిన్యము చేరింది అని. పరమాత్మలోనైతే మాలిన్యము చేరదు. తండ్రి అంటారు, పరమాత్మనైన నాలో మాలిన్యము చేరుతుందా? లేదు. నేనైతే సదా పరంధామములో ఉంటాను ఎందుకంటే నేను జనన-మరణాలలోకి రాను. మీలో కూడా కొందరి సాంగత్యము ఎక్కువగా, కొందరి సాంగత్యము తక్కువగా ఉందని పిల్లలైన మీకు తెలుసు. కొందరైతే బాగా పురుషార్థము చేసి యోగములో ఉంటారు, ఎంత సమయమైతే ఆత్మ తండ్రి సాంగత్యములో ఉంటుందో అంత లాభము ఉంటుంది. వికర్మలు వినాశనమవుతాయి. తండ్రి అంటారు - ఓ ఆత్మలారా, తండ్రినైన నన్ను స్మృతి చేయండి, నాతో సాంగత్యము చేయండి. నేను ఈ శరీరము యొక్క ఆధారమైతే తీసుకోవలసి ఉంటుంది. లేకపోతే పరమాత్మ ఎలా మాట్లాడగలరు? ఆత్మ ఎలా వినగలదు? ఇప్పుడు పిల్లలైన మీ సాంగత్యము సత్యముతో ఉంది. సత్యమైన తండ్రిని నిరంతరం స్మృతి చేయాలి. ఆత్మ సత్యము యొక్క సాంగత్యము చేయాలి. ఆత్మ కూడా అద్భుతమైనది, పరమాత్మ కూడా అద్భుతమైనవారు, ప్రపంచము కూడా అద్భుతమైనది. ఈ ప్రపంచ చక్రము ఎలా తిరుగుతుంది, ఇది అద్భుతము. మీరు డ్రామా అంతటిలో ఆల్ రౌండ్ పాత్రను అభినయిస్తారు. మీ ఆత్మలో 84 జన్మల పాత్ర నిశ్చితమై ఉంది - ఇది అద్భుతము. సత్యయుగ ఆత్మలు మరియు ఈ రోజుల్లోని ఆత్మలు ఉన్నారు. అందులోనూ మీ ఆత్మ అందరికంటే ఎక్కువ ఆల్ రౌండర్. నాటకములో కొందరి పాత్ర ప్రారంభము నుండి ఉంటుంది, కొందరిది మధ్యలో నుండి, కొందరిది అంతిమములో పాత్ర ఉంటుంది. అవన్నీ హద్దులోని డ్రామాలు, అవి కూడా ఇప్పుడే తయారయ్యాయి. ఇప్పుడు సైన్స్ యొక్క తీవ్రత ఎంతో ఉంది. సత్యయుగములో సైన్స్ బలము ఎంత ఉంటుంది. కొత్త ప్రపంచము ఎంత త్వరగా తయారవుతూ ఉండవచ్చు. అక్కడ పవిత్రతా బలము ముఖ్యమైనది. ఇప్పుడు నిర్బలులుగా ఉన్నారు. అక్కడ ఉన్నది శక్తివంతులు. ఈ లక్ష్మీ-నారాయణులు శక్తివంతమైనవారు కదా. ఇప్పుడు రావణుడు బలాన్ని లాక్కున్నాడు, మళ్ళీ మీరు ఆ రావణుడిపై విజయాన్ని పొంది ఎంత శక్తివంతముగా అవుతారు. ఎంతగా సత్యము యొక్క సాంగత్యము చేస్తారో అనగా ఆత్మ ఎంతగా సత్యమైన తండ్రిని స్మృతి చేస్తుందో అంత శక్తివంతముగా అవుతుంది. చదువులో కూడా బలమైతే లభిస్తుంది కదా. మీకు కూడా బలము లభిస్తుంది, మొత్తము విశ్వముపై మీరు రాజ్యము చేస్తారు. ఆత్మకు సత్యముతో యోగము అనేది ఈ సంగమములోనే ఉంటుంది. తండ్రి అంటారు, ఆత్మకు నా సాంగత్యము లభించడముతో ఆత్మ చాలా శక్తివంతముగా తయారవుతుంది. తండ్రి వరల్డ్ ఆల్మైటీ అథారిటీ (సర్వశక్తివంతుడు) కదా, వారి ద్వారా బలము లభిస్తుంది. ఇందులో సర్వ వేద-శాస్త్రాల ఆదిమధ్యాంతాల జ్ఞానము వచ్చేస్తుంది.

ఏ విధంగా తండ్రి సర్వశక్తివంతుడో, అలా మీరు కూడా శక్తివంతముగా అవుతారు. విశ్వముపై మీరు రాజ్యము చేస్తారు. దానిని మీ నుండి ఎవ్వరూ లాక్కోలేరు. మీకు నా ద్వారా ఎంత బలము లభిస్తుంది, వీరికి కూడా బలము లభిస్తుంది. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంత బలము లభిస్తుంది. తండ్రి వేరే ఏ కష్టమూ ఇవ్వరు. కేవలం స్మృతి చేయాలి, అంతే. 84 జన్మల చక్రము ఇప్పుడు పూర్తయ్యింది, ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. ఇది అర్థం చేసుకోవడం ఏమంత పెద్ద విషయము కాదు. ఎక్కువ విస్తారములోకి వెళ్ళవలసిన అవసరము లేదు. బీజాన్ని తెలుసుకోవడం ద్వారా, దీని నుండి మొత్తము వృక్షమంతా ఈ విధంగా వెలువడుతుంది అని అర్థం చేసుకుంటారు. సారము బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఇవి చాలా విచిత్రమైన విషయాలు. భక్తి మార్గములో మనుష్యులు ఎన్ని ఎదురుదెబ్బలు తింటారు, ఎంత శ్రమిస్తారు, కానీ ఏమీ లభించదు. అయినా తండ్రి వచ్చి మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు. మనము యోగబలముతో విశ్వానికి యజమానులుగా అవుతాము, ఈ పురుషార్థమే చేయాలి. భారత్ యొక్క యోగము ప్రసిద్ధమైనది. యోగము ద్వారా మీ ఆయువు ఎంత ఎక్కువ అవుతుంది. సత్యము యొక్క సాంగత్యముతో ఎంత లాభము కలుగుతుంది, ఆయువు కూడా ఎక్కువ అవుతుంది మరియు శరీరము కూడా నిరోగిగా అవుతుంది. ఈ విషయాలన్నీ పిల్లలైన మీ బుద్ధిలోనే కూర్చోబెట్టడం జరుగుతుంది. బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవ్వరికీ సత్యముతో సాంగత్యము లేదు. మీరు ప్రజాపిత బ్రహ్మాకు సంతానము మరియు తాతగారికి మనవలు. మరి మేము ఆ తాతగారికి మనవలము అని అంతటి సంతోషము ఉండాలి కదా. వారసత్వము కూడా తాతగారి నుండే లభిస్తుంది, ఇదే స్మృతియాత్ర. బుద్ధిలో ఇదే స్మరణ ఉండాలి. ఆ సత్సంగాలలోనైతే ఒక చోటుకు వెళ్ళి కూర్చొంటారు, ఇక్కడ ఆ విషయము కాదు. ఒక చోట కూర్చోవడము ద్వారానే సత్యముతో సాంగత్యము ఉంటుంది అనేమీ కాదు. అలా కాదు. లేస్తూ-కూర్చుంటూ, నడుస్తూ-తిరుగుతూ మనము సత్యము యొక్క సాంగత్యములో ఉన్నాము. ఒకవేళ వారిని స్మృతి చేసినట్లయితేనే. స్మృతి చేయకపోతే దేహాభిమానములో ఉన్నట్లు, దేహము అసత్యమైన వస్తువు కదా. దేహాన్ని సత్యము అని అనరు. శరీరము జడమైనది, అది పంచ తత్వాలతో తయారైనది, అందులో ఆత్మ లేనట్లయితే చలనమేమీ ఉండదు. మనుష్యుల శరీరానికి విలువ ఏమీ లేదు, మిగిలిన అన్ని శరీరాలకు విలువ ఉంది. సౌభాగ్యమైతే ఆత్మకే లభిస్తుంది. నేను ఫలానాను అని ఆత్మయే అంటుంది కదా. తండ్రి అంటారు, ఆత్మ ఎలా తయారైపోయింది. గుడ్లు, చేపలు అన్నిటినీ తినేస్తుంది. ప్రతి ఒక్కరూ భస్మాసురులే, తమను తామే భస్మము చేసుకుంటారు. ఎలా? కామ చితిపై కూర్చుని ప్రతి ఒక్కరూ తమను తాము భస్మము చేసుకుంటున్నారు అంటే మరి భస్మాసురులైనట్లే కదా. ఇప్పుడు మీరు జ్ఞాన చితిపై కూర్చుని దేవతలుగా అవుతారు. మొత్తము ప్రపంచమంతా కామ చితిపై కూర్చుని భస్మమైపోయింది, తమోప్రధానముగా, నల్లగా అయిపోయింది. తండ్రి పిల్లలను నలుపు నుండి తెలుపుగా తయారుచేయడానికి వస్తారు. కావున తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, దేహాభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. పిల్లలు స్కూల్లో చదువుకుంటారు, ఆ తర్వాత చదువు ఇంటిలో ఉన్నా కూడా బుద్ధిలో ఉంటుంది కదా. అలా ఈ చదువు కూడా మీ బుద్ధిలో ఉండాలి. ఇది మీ విద్యార్థి జీవితము. లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా నిలబడి ఉంది. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ బుద్ధిలో ఈ జ్ఞానము ఉండాలి.

ఇక్కడికి పిల్లలు వస్తారు, రిఫ్రెష్ అవుతారు. ఇలా, ఇలా అర్థం చేయించండి అని యుక్తులు అర్థం చేయించడం జరుగుతుంది. ప్రపంచములో ఎన్నో సత్సంగాలు ఉంటాయి. ఎంతమంది మనుష్యులు వచ్చి ఒకచోట పోగవుతారు. వాస్తవానికి అది సత్యము యొక్క సాంగత్యము అయితే కాదు. సత్యము యొక్క సాంగత్యము అయితే ఇప్పుడు పిల్లలైన మీకే లభిస్తుంది. తండ్రియే వచ్చి సత్యయుగాన్ని స్థాపన చేస్తారు. మీరు యజమానులుగా అవుతారు. దేహాభిమానము లేక అసత్య అభిమానము వలన మీరు పడిపోతారు మరియు సత్యము యొక్క సాంగత్యముతో మీరు ఎక్కుతారు. అర్ధకల్పము మీరు ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు. అలాగని అక్కడ కూడా మీకు సత్యము యొక్క సాంగత్యము ఉంటుందని కాదు. అలా ఉండదు. సత్యము యొక్క సాంగత్యము మరియు అసత్యము యొక్క సాంగత్యము అని ఆ రెండూ ఉన్నప్పుడే అంటారు. సత్యమైన తండ్రి ఎప్పుడైతే వస్తారో, అప్పుడే వారు అన్ని విషయాలనూ అర్థం చేయిస్తారు. ఎప్పటివరకైతే ఆ సత్యమైన తండ్రి రారో అప్పటివరకూ ఎవరికీ తెలియను కూడా తెలియదు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు చెప్తున్నారు - ఓ ఆత్మలారా, నాతో సాంగత్యము పెట్టుకోండి. దేహము యొక్క సాంగత్యము ఏదైతే లభించిందో, దాని నుండి అతీతులుగా అవ్వండి. దేహ సాంగత్యము సత్యయుగములో కూడా ఉంటుంది, కానీ అక్కడ మీరు ఉన్నదే పావనముగా. ఇప్పుడు మీరు సత్యము యొక్క సాంగత్యముతో పతితము నుండి పావనముగా అవుతారు, అప్పుడు శరీరము కూడా సతోప్రధానమైనది లభిస్తుంది. ఆత్మ కూడా సతోప్రధానముగా ఉంటుంది. ఇప్పుడైతే ప్రపంచము కూడా తమోప్రధానముగా ఉంది. ప్రపంచము కొత్తగా మరియు పాతగా అవుతుంది. కొత్త ప్రపంచములో తప్పకుండా ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ఉండేది. ఈ రోజు ఆ ధర్మాన్ని మాయం చేసి ఆది సనాతన హిందూ ధర్మము అని అంటారు, తికమకలో ఉన్నారు. మనము ప్రాచీన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారమని, సత్యయుగానికి యజమానులుగా ఉండేవారమని ఇప్పుడు భారతవాసులైన మీరు అర్థం చేసుకుంటారు. కానీ ఆ నషా ఎక్కడ ఉంది? కల్పము ఆయువునే ఎక్కువ వ్రాసేసారు. అన్ని విషయాలనూ మర్చిపోయారు. దీని పేరే తికమక దారుల ఆట. ఇప్పుడు సత్యమైన తండ్రి ద్వారా మీరు మొత్తం జ్ఞానమంతటినీ తెలుసుకోవడం వలన ఉన్నత పదవిని పొందుతారు, మళ్ళీ అర్ధకల్పము తర్వాత కిందికి పడిపోతారు ఎందుకంటే రావణ రాజ్యము ప్రారంభమవుతుంది. ప్రపంచము పాతగా అయితే అవుతుంది కదా. మనము కొత్త ప్రపంచానికి యజమానులుగా ఉండేవారమని, ఇప్పుడు పాత ప్రపంచములో ఉన్నామని మీరు అర్థం చేసుకుంటారు. కొందరికి ఇది కూడా గుర్తుకు రాదు. బాబా మనల్ని స్వర్గవాసులుగా తయారుచేస్తున్నారు. అర్ధకల్పము మనము స్వర్గవాసులుగా ఉంటాము, మళ్ళీ అర్ధకల్పము తర్వాత కిందికి పడిపోతాము ఎందుకంటే రావణ రాజ్యము ప్రారంభమవుతుంది. ప్రపంచము పాతగా అయితే అవుతుంది కదా. బాబా మనల్ని స్వర్గవాసులుగా తయారుచేస్తున్నారని మీరు అర్థం చేసుకుంటారు. అర్ధకల్పము మనము స్వర్గవాసులుగా ఉంటాము, ఆ తర్వాత నరకవాసులుగా అవుతాము. మీరు కూడా నంబరువారు పురుషార్థానుసారముగా మాస్టర్ సర్వశక్తివంతులుగా అయ్యారు. ఇది జ్ఞానామృతము యొక్క డోస్. శివబాబాకు పాత ఇంద్రియాలు లభించాయి. కొత్త ఇంద్రియాలైతే లభించవు. పాత వాయిద్యము లభిస్తుంది. తండ్రి రావడము కూడా వానప్రస్థములోనే వస్తారు. పిల్లలకు సంతోషము కలిగితే తండ్రి కూడా సంతోషిస్తారు. తండ్రి అంటారు, నేను పిల్లలకు జ్ఞానమిచ్చి రావణుడి నుండి విడిపించేందుకు వస్తాను. పాత్రనైతే సంతోషముగా అభినయించడం జరుగుతుంది కదా. తండ్రి చాలా సంతోషముగా పాత్రను అభినయిస్తారు. తండ్రికి కల్ప-కల్పము రావలసి ఉంటుంది. ఈ పాత్ర ఎప్పటికీ అంతము కాదు. పిల్లలకు చాలా సంతోషము ఉండాలి. ఎంతగా సత్యము యొక్క సాంగత్యము చేస్తారో, అంత సంతోషము ఉంటుంది. స్మృతి తక్కువగా చేస్తారు, అందుకే అంత సంతోషము ఉండదు. తండ్రి పిల్లలకు ఆస్తిని ఇస్తారు. ఏ పిల్లలైతే సత్యమైన హృదయము కలవారో, వారిపై తండ్రికి చాలా ప్రేమ ఉంటుంది. సత్యమైన హృదయము కలవారితో తండ్రి రాజీగా ఉంటారు. లోపల, బయట ఎవరైతే సత్యముగా ఉంటారో, తండ్రికి సహాయకులుగా అవుతారో, సేవలో తత్పరులై ఉంటారో, వారే తండ్రికి ప్రియమనిపిస్తారు. తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి - నేను సత్యాతి, సత్యమైన సేవ చేస్తున్నానా? సత్యమైన బాబాతో సాంగత్యాన్ని పెట్టుకుంటున్నానా? ఒకవేళ సత్యమైన బాబాతో సాంగత్యము పెట్టుకోకపోతే ఏ గతి పడుతుంది? అనేకులకు మార్గము తెలియజేస్తూ ఉన్నట్లయితే ఉన్నత పదవిని కూడా పొందుతారు. సత్యమైన తండ్రి ద్వారా నేను ఏం వారసత్వాన్ని పొందాను అనేది తమ అంతరంగములో చూసుకోవాలి. నంబరువారుగా ఉన్నారు అనైతే తెలుసు. ఒకరు ఒకలా వారసత్వాన్ని పొందుతారు, మరొకరు మరోలా పొందుతారు. రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మీకు ఈ దేహము యొక్క సాంగత్యము ఏదైతే లభించిందో, ఈ సాంగత్యము నుండి అతీతముగా ఉండాలి. సత్యము యొక్క సాంగత్యముతో పావనముగా అవ్వాలి.

2. ఈ విద్యార్థి జీవితములో నడుస్తూ-తిరుగుతూ బుద్ధిలో జ్ఞానము తిరుగుతూ ఉండాలి. లక్ష్యాన్ని-ఉద్దేశ్యాన్ని ఎదురుగా పెట్టుకుని పురుషార్థము చేయాలి. సత్యమైన హృదయముతో తండ్రికి సహాయకులుగా అవ్వాలి.

వరదానము:- అవ్యభిచారీ మరియు నిర్విఘ్న స్థితి ద్వారా మొదటి జన్మ యొక్క ప్రారబ్ధాన్ని ప్రాప్తి చేసుకునే సమీప మరియు సమాన భవ
ఏ పిల్లలైతే ఇక్కడ తండ్రి యొక్క గుణాలకు మరియు సంస్కారాలకు సమీపముగా ఉన్నారో, సర్వ సంబంధాలతో తండ్రి తోడును మరియు సమానతను అనుభవం చేస్తారో, వారే అక్కడ రాయల్ కులములో మొదటి జన్మ యొక్క సంబంధములో సమీపముగా వస్తారు. 2 - ఎవరైతే ఆది నుండి ఇప్పటివరకు అవ్యభిచారిగా మరియు నిర్విఘ్నముగా ఉన్నారో వారే ఫస్ట్ లో (మొదట్లో) వస్తారు. నిర్విఘ్నము అంటే విఘ్నాలే రాకుండా ఉండడము అని కాదు, కానీ విఘ్న-వినాశకులుగా అనగా విఘ్నాలపై సదా విజయులుగా ఉండాలి. ఈ రెండు విషయాలు ఒకవేళ ఆది నుండి అంతిమము వరకు సరిగ్గా ఉన్నట్లయితే మొదటి జన్మలో సహచరులుగా అవుతారు.
స్లోగన్:- సైలెన్స్ శక్తితో నెగెటివ్ ను పాజిటివ్ లోకి పరివర్తన చేయండి.

 

అవ్యక్త సూచనలు:- ఏకాంతప్రియులుగా అవ్వండి, ఏకతను మరియు ఏకాగ్రతను అలవరచుకోండి

ఏకాంతవాసి అనగా సదా స్థూల ఏకాంతముతోపాటు ఒక్కరి అంతములో ఉండటము. ఏకాగ్రతా శక్తి ద్వారా ఏ ఆత్మ యొక్క సందేశమునైనా ఆ ఆత్మ వరకు చేర్చగలరు. ఏ ఆత్మనైనా ఆహ్వానించగలరు. ఏ ఆత్మ యొక్క శబ్దాన్ని అయినా క్యాచ్చేయగలరు. ఏ ఆత్మకైనా దూరముగా కూర్చుని ఉన్నా సహయోగాన్ని ఇవ్వగలరు.

మురళి అంటే ఏమిటి?

మురళి బ్రహ్మకుమారీల దైనిక ఆధ్యాత్మిక బోధన, ఇది ప్రతి ఉదయం మధుబన్ నుండి ప్రచురించబడుతుంది. ఇక్కడ మీరు ఈరోజు మురళిని తెలుగులో చదవవచ్చు, ఆడియో వినవచ్చు మరియు PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధ్యయనానికి సహాయంగా పాఠ్యాన్ని హైలైట్ చేయవచ్చు — మీ గుర్తులు ఈ బ్రౌజర్‌లోనే సురక్షితంగా ఉంటాయి.

28 భాషల్లో మురళి

Daily Murli · Madhuban మూలం: మధుబన్ మురళి విభాగం ఇది స్వతంత్ర రీడర్ యాప్, అధికారిక వెబ్‌సైట్ కాదు.