| 26-04-2025 |
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
|
మధువనం |
| ‘‘మధురమైన పిల్లలూ - పురుషోత్తమ సంగమయుగీ బ్రాహ్మణులైన మీరు ఇప్పుడు ఈశ్వరుని ఒడిలోకి వచ్చారు, మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి కావున దైవీ గుణాలు కూడా కావాలి’’ | |
| ప్రశ్న:- | బ్రాహ్మణ పిల్లలు ఏ విషయములో స్వయాన్ని చాలా-చాలా సంభాళించుకోవాలి మరియు ఎందుకు? |
| జవాబు:- | మొత్తం రోజంతటి దినచర్యలో ఎటువంటి పాప కర్మలు జరగకూడదు, ఈ విషయములో సంభాళించుకోవాలి ఎందుకంటే ఎదురుగా తండ్రి ధర్మరాజు రూపంలో నిలబడి ఉన్నారు. చెక్ చేసుకోండి - ఎవరికీ దుఃఖాన్ని అయితే ఇవ్వలేదు కదా? శ్రీమతముపై ఎంత శాతము నడుస్తున్నాను? రావణుడి మతముపై నడవడము లేదు కదా? ఎందుకంటే తండ్రికి చెందినవారిగా అయిన తర్వాత ఏవైనా వికర్మలు జరిగినట్లయితే అది ఒకటికి వంద రెట్లు అవుతుంది. |
ఓం శాంతి. భగవానువాచ. ఇదైతే పిల్లలకు అర్థం చేయించడం జరిగింది, ఏ మనుష్యులను కానీ లేక దేవతలను కానీ భగవంతుడు అని అనలేరు. ఇక్కడ కూర్చున్నప్పుడు - మేము సంగమయుగీ బ్రాహ్మణులము అన్నది బుద్ధిలో ఉంటుంది. ఈ స్మృతి కూడా సదా ఎవరికీ ఉండదు. మేము నిజంగా బ్రాహ్మణులము అని కూడా ఎవరూ భావించరు. బ్రాహ్మణ పిల్లలు దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. మేము సంగమయుగీ బ్రాహ్మణులము, మేము శివబాబా ద్వారా పురుషోత్తములుగా తయారవుతున్నాము. ఈ స్మృతి కూడా అందరికీ ఉండదు. మేము పురుషోత్తమ సంగమయుగీ బ్రాహ్మణులము అన్న విషయాన్ని ఘడియ-ఘడియ మర్చిపోతారు. ఇది బుద్ధిలో గుర్తున్నా కూడా అహో సౌభాగ్యము. ఎల్లప్పుడూ నంబరువారుగానైతే ఉంటారు. అందరూ తమ-తమ బుద్ధి అనుసారముగా పురుషార్థులుగా ఉన్నారు. ఇప్పుడు మీరు సంగమయుగవాసులు. పురుషోత్తములుగా అవ్వనున్నారు. ఎప్పుడైతే అబ్బాను (తండ్రిని) అనగా అత్యంత ప్రియమైన తండ్రిని స్మృతి చేస్తామో, అప్పుడు మనము పురుషోత్తములుగా అవుతాము అని మీకు తెలుసు. స్మృతి ద్వారానే పాపాలు వినాశనం అవుతాయి. ఒకవేళ ఎవరైనా పాపము చేస్తే దానికి వంద రెట్లు లెక్క పెరిగిపోతుంది. ఇంతకుముందు ఏవైతే పాపాలు చేసారో, దానికి 10 శాతము లెక్క పెరిగేది. ఇప్పుడైతే 100 శాతము పెరుగుతుంది ఎందుకంటే ఈశ్వరుని ఒడిలోకి వచ్చి మళ్ళీ పాపము చేస్తున్నారు కదా. పిల్లలైన మీకు తెలుసు - పురుషోత్తముల నుండి దేవతలుగా తయారుచేయడానికి తండ్రి మనల్ని చదివిస్తున్నారు. ఈ స్మృతి ఎవరికైతే స్థిరంగా ఉంటుందో వారు అలౌకిక సేవను కూడా ఎంతగానో చేస్తూ ఉంటారు. సదా హర్షితముఖులుగా అయ్యేందుకు ఇతరులకు కూడా మార్గాన్ని తెలియజేయాలి. ఎక్కడికి వెళ్ళినా, మేము సంగమయుగములో ఉన్నాము అన్న విషయము బుద్ధిలో గుర్తుండాలి. ఇది పురుషోత్తమ సంగమయుగము. వారు పురుషోత్తమ మాసము లేక పురుషోత్తమ సంవత్సరము అని అంటారు. మేము పురుషోత్తమ సంగమయుగీ బ్రాహ్మణులమని మీరు అంటారు. ఈ విషయాన్ని మంచి రీతిలో బుద్ధిలో ధారణ చేయాలి - ఇప్పుడు మేము పురుషోత్తములుగా అయ్యే యాత్రలో ఉన్నాము. ఇది గుర్తున్నా కూడా మన్మనాభవగా ఉన్నట్లే. మీరు పురుషార్థం అనుసారంగా మరియు కర్మల అనుసారంగా పురుషోత్తములుగా అవుతున్నారు. దైవీ గుణాలు కూడా కావాలి మరియు శ్రీమతముపై కూడా నడవాల్సి ఉంటుంది. తమ మతముపైనైతే మనుష్యులందరూ నడుస్తారు. అది రావణ మతము. అలాగని, మీరందరూ శ్రీమతముపై నడుస్తారు అనేమీ కాదు. రావణుడి మతముపై నడిచేవారు కూడా చాలా మంది ఉన్నారు. శ్రీమతముపై కొందరు కొంత శాతము నడుస్తారు, కొందరు కొంత శాతము నడుస్తారు. కొందరైతే 2 శాతము మాత్రమే నడుస్తూ ఉండవచ్చు. ఇక్కడ కూర్చొని ఉంటారు, అయినా కూడా శివబాబా స్మృతిలో ఉండరు. బుద్ధియోగము ఎక్కడెక్కడో భ్రమిస్తూ ఉంటుంది. ప్రతి రోజూ స్వయాన్ని చూసుకోవాలి - ఈ రోజు పాపపు కర్మలేవీ చేయలేదు కదా? ఎవరికీ దుఃఖాన్ని అయితే ఇవ్వలేదు కదా? స్వయాన్ని ఎంతగానో సంభాళించుకోవలసి ఉంటుంది ఎందుకంటే ధర్మరాజు కూడా నిలబడి ఉన్నారు కదా. ఇప్పటి సమయము ఉన్నదే లెక్కాచారాలను సమాప్తము చేసుకునేందుకు. శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది. మేము జన్మ-జన్మాంతరాల పాపులము అని పిల్లలకు తెలుసు. ఎక్కడికైనా ఏ మందిరాలకైనా లేదా గురువుల వద్దకు లేక ఇష్ట దేవతల వద్దకు వెళ్ళినప్పుడు - నేను జన్మ-జన్మాంతరాల పాపిని, నన్ను రక్షించండి, దయ చూపించండి అని అంటారు. సత్యయుగములో ఎప్పుడూ ఇటువంటి పదాలు వెలువడవు. కొందరు సత్యము మాట్లాడుతారు, కొందరైతే అసత్యము మాట్లాడుతారు. ఇక్కడ కూడా అలాగే. బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు - మీ జీవిత కథను బాబాకు వ్రాసి పంపించండి. కొందరు పూర్తిగా సత్యము వ్రాస్తారు, కొందరు దాచి పెడతారు కూడా. వారికి సిగ్గుగా అనిపిస్తుంది. చెడు కర్మలు చేయడము వలన దాని ఫలము కూడా చెడుగానే లభిస్తుంది అనైతే తెలుసు. అది అల్పకాలికమైన విషయము. ఇది బహుకాలపు విషయము. చెడు కర్మలు చేసినట్లయితే శిక్షలు కూడా అనుభవిస్తారు మళ్ళీ స్వర్గములో కూడా చివరిలో వస్తారు. ఎవరెవరు పురుషోత్తములుగా అవుతారు అనేది ఇప్పుడు అంతా తెలుస్తుంది. అది పురుషోత్తమ దైవీ రాజ్యము. మీరు ఉత్తమోత్తములైన పురుషులుగా అవుతారు కదా. ఇంకెక్కడా ఈ విధంగా ఎవరి మహిమను చేయరు. మనుష్యులకైతే దేవతల గుణాలు గురించి కూడా తెలియదు. వారిని మహిమ చేస్తారు కానీ చిలుక వలె చేస్తారు, అందుకే బాబా కూడా - భక్తులకు అర్థం చేయించండి అని అంటారు. భక్తులు తమను తాము నీచులము, పాపులము అని పిలుచుకున్నప్పుడు వారిని అడగండి - మీరు శాంతిధామములో ఉన్నప్పుడు అక్కడ పాపాలు చేసేవారా? అక్కడైతే ఆత్మలన్నీ పవిత్రముగా ఉంటాయి. ఇక్కడ అపవిత్రముగా అయిపోయాయి ఎందుకంటే ఇది తమోప్రధాన ప్రపంచము. కొత్త ప్రపంచములోనైతే పవిత్రముగా ఉంటుంది. అపవిత్రముగా తయారుచేసేది రావణుడు.
ఈ సమయములో ముఖ్యంగా భారత్ పై మరియు మొత్తం ప్రపంచమంతటిపైన రావణ రాజ్యము ఉంది. యథా రాజా-రాణి తథా ప్రజా. హైయెస్ట్ (అత్యంత ఉన్నతమైనవారు), లోయెస్ట్ (అత్యంత కనిష్ఠమైనవారు) ఉంటారు. ఇక్కడ అందరూ పతితులే ఉన్నారు. బాబా అంటారు - నేను మిమ్మల్ని పావనముగా తయారుచేసి వెళ్తాను, మళ్ళీ మిమ్మల్ని పతితులుగా ఎవరు చేస్తారు? రావణుడు. ఇప్పుడు మళ్ళీ మీరు నా మతము ద్వారా పావనముగా అవుతున్నారు, అర్ధకల్పము తరువాత రావణుడి మతముపై పతితులుగా అవుతారు అనగా దేహాభిమానములోకి వచ్చి వికారాలకు వశమైపోతారు. దానిని ఆసురీ మతము అని అంటారు. భారత్ పావనముగా ఉండేది, అదే ఇప్పుడు పతితముగా అయ్యింది, మళ్ళీ పావనముగా అవ్వాలి. పావనముగా తయారుచేయడానికే పతిత-పావనుడైన తండ్రి రావలసి వస్తుంది. ఈ సమయములో ఎంతమంది మనుష్యులు ఉన్నారో చూడండి. రేపటికి ఎంతమంది ఉంటారు! యుద్ధాలు మొదలవుతాయి, మృత్యువైతే ఎదురుగా నిలబడి ఉంది. రేపు ఇంతమంది ఎక్కడికి వెళ్తారు? అందరి శరీరాలు మరియు ఈ పాత ప్రపంచము వినాశనమవుతుంది. నంబరువారు పురుషార్థానుసారముగా ఈ రహస్యము ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. మేము ఎవరి సమ్ముఖములో కూర్చుని ఉన్నాము అన్నది కూడా చాలా మంది అర్థం చేసుకోరు. వారు అతి చిన్న పదవిని పొందేవారు. డ్రామానుసారముగా ఏమి చేయగలరు, వారి భాగ్యములో లేదు. ఇప్పుడైతే పిల్లలు సేవ చేయాలి, తండ్రిని స్మృతి చేయాలి. మీరు సంగమయుగీ బ్రాహ్మణులు, మీరు తండ్రి సమానముగా జ్ఞానసాగరులుగా, సుఖసాగరులుగా అవ్వాలి. ఆ విధముగా తయారుచేసే తండ్రి లభించారు కదా. సర్వగుణ సంపన్నులు... అని దేవతల మహిమను గాయనము చేస్తారు. ఇప్పుడైతే ఈ గుణాలు కలవారు ఎవరూ లేరు. స్వయాన్ని సదా ప్రశ్నించుకుంటూ ఉండండి - మేము ఉన్నత పదవిని పొందేందుకు యోగ్యముగా ఎంతవరకు అయ్యాము? సంగమయుగాన్ని మంచి రీతిలో స్మృతి చేయండి. సంగమయుగీ బ్రాహ్మణులైన మనము పురుషోత్తములుగా తయారయ్యేవారము. శ్రీకృష్ణుడు కొత్త ప్రపంచములో పురుషోత్తముడు కదా. పిల్లలకు తెలుసు - మేము బాబా సమ్ముఖములో కూర్చున్నాము, కావున ఇంకా ఎక్కువగా చదువుకోవాలి. చదివించాలి కూడా. చదివించడం లేదు అంటే చదవడము లేదు అని నిరూపించబడుతుంది. వారి బుద్ధిలో కూర్చోదు. 5 శాతం కూడా కూర్చోదు. మేము సంగమయుగీ బ్రాహ్మణులము అన్నది కూడా గుర్తుండదు. బుద్ధిలో తండ్రి యొక్క స్మృతి ఉండాలి మరియు చక్రము తిరుగుతూ ఉండాలి, అర్థం చేయించడమైతే చాలా సహజము. స్వయాన్ని ఆత్మగా భావించాలి మరియు తండ్రిని స్మృతి చేయాలి. వారు అందరికన్నా పెద్ద తండ్రి. తండ్రి అంటారు - నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. మనమే పూజ్యులుగా, మళ్ళీ మనమే పూజారులుగా అవుతాము అన్న ఈ మంత్రము చాలా బాగుంది. వారేమో ఆత్మయే పరమాత్మ అని అనేసారు, ఏదైతే చెప్తారో అది పూర్తిగా రాంగ్. మనము పవిత్రముగా ఉండేవారము, 84 జన్మల చక్రాన్ని తిరిగి వచ్చి ఇప్పుడు ఈ విధంగా తయారయ్యాము. ఇప్పుడు మనము తిరిగి వెళ్తాము. ఈ రోజు ఇక్కడ ఉంటాము, రేపు ఇంటికి వెళ్తాము. మనము అనంతమైన తండ్రి ఇంటికి వెళ్తాము. ఇది అనంతమైన నాటకము, ఇది ఇప్పుడు రిపీట్ అవ్వనున్నది. తండ్రి అంటారు - దేహ సహితంగా దేహపు సర్వ ధర్మాలను మరచి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు మనము ఈ శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్తాము, ఇది పక్కాగా గుర్తుంచుకోండి, నేను ఆత్మను అన్నది కూడా గుర్తుండాలి మరియు మన ఇల్లు కూడా గుర్తుండాలి, ఇది గుర్తున్నట్లయితే బుద్ధితో మొత్తము ప్రపంచమంతటినీ సన్యసించినట్లే. శరీరాన్ని కూడా సన్యసిస్తారు కావున సర్వస్వాన్ని సన్యసిస్తారు. ఆ హఠయోగులు మొత్తము సృష్టినంతటినీ ఏమీ సన్యసించరు, వారిది అసంపూర్ణమైన సన్యాసము. మీరైతే మొత్తము ప్రపంచాన్ని త్యాగం చేయాలి, స్వయాన్ని దేహముగా భావించినట్లయితే కర్మలు కూడా అటువంటివే చేస్తారు. దేహాభిమానులుగా అవ్వడం వలన దొంగతనాలు చేయడము, అబద్ధాలు చెప్పడము, పాపాలు చేయడము... ఇవన్నీ అలవాటైపోతాయి. గట్టిగా మాట్లాడడము కూడా అలవాటైపోతుంది, మళ్ళీ మా గొంతే అంత అని అంటారు. రోజంతటిలో 25-30 పాపాలు కూడా చేస్తూ ఉంటారు. అబద్ధము చెప్పడము కూడా పాపము అయినట్లే కదా. అది అలవాటైపోతుంది. బాబా అంటారు - నెమ్మదిగా మాట్లాడడము నేర్చుకోండి కదా. నెమ్మదిగా మాట్లాడడానికి సమయమేమీ పట్టదు. కుక్కను కూడా పాలన చేసినట్లయితే అది మంచిగా అవుతుంది, కోతులు ఎంత చంచలముగా ఉంటాయి కానీ అవి ఎవరికైనా అలవాటు పడితే, నాట్యము మొదలైనవి కూర్చుని చేస్తాయి. జంతువులు కూడా తీర్చిదిద్దబడతాయి. జంతువులను తీర్చిదిద్దేవారు మనుష్యులు. మనుష్యులను తీర్చిదిద్దేవారు తండ్రి. తండ్రి అంటారు - మీరు కూడా జంతువుల వలె ఉన్నారు. అందుకే నన్ను కూడా కూర్మావతారము, వరాహావతారము అని అనేస్తారు. మీ నడవడిక ఎలా ఉందో, అంతకన్నా హీనముగా నన్ను చూపించారు. ఇది కూడా మీకే తెలుసు, ప్రపంచానికి తెలియదు. అంతిమములో మీకు సాక్షాత్కారాలు జరుగుతాయి. ఎలాంటి-ఎలాంటి శిక్షలను అనుభవిస్తారు, అది కూడా మీకు తెలుస్తుంది. అర్ధకల్పము భక్తి చేశారు, ఇప్పుడు తండ్రి లభించారు. తండ్రి అంటారు - నా మతముపై నడవకపోతే శిక్షలు ఇంకా పెరుగుతూ ఉంటాయి అందుకే ఇప్పుడు పాపాలు మొదలైనవి చేయడము విడిచిపెట్టండి. మీ చార్ట్ ను పెట్టుకోండి, దానితోపాటు ధారణ కూడా కావాలి. ఎవరికైనా అర్థం చేయించే అభ్యాసము కూడా ఉండాలి. ప్రదర్శనీ చిత్రాల గురించి ఆలోచించండి. ఎవరికి మేము ఏ విధంగా అర్థం చేయించాలి. మొట్టమొదట ఈ విషయాన్ని ప్రస్తావించండి - గీతా భగవంతుడు ఎవరు? జ్ఞానసాగరుడైతే పతిత-పావనుడైన పరమపిత పరమాత్మయే కదా. ఈ తండ్రి సర్వాత్మలకు తండ్రి. కావున తండ్రి పరిచయము కావాలి కదా. ఋషులు-మునులు మొదలైనవారెవరికీ కూడా తండ్రి పరిచయమూ లేదు, రచన యొక్క ఆదిమధ్యాంతాల పరిచయమూ లేదు అందుకే మొట్టమొదట ఈ విషయాన్ని అర్థం చేయించి వారి చేత వ్రాయించండి - భగవంతుడు ఒక్కరే. ఇతరులెవ్వరూ భగవంతుడు కాలేరు. మనుష్యులు స్వయాన్ని భగవంతుడు అని పిలుచుకోలేరు.
పిల్లలైన మీకు ఇప్పుడు నిశ్చయముంది - భగవంతుడు నిరాకారుడు. తండ్రి మనల్ని చదివిస్తారు. మనము విద్యార్థులము. వారు తండ్రి కూడా, టీచర్ కూడా, సద్గురువు కూడా. ఒక్కరిని స్మృతి చేస్తే టీచర్ మరియు గురువు ఇరువురి స్మృతి వచ్చేస్తుంది. బుద్ధి భ్రమించకూడదు. కేవలం శివ అని మాత్రమే అనకూడదు, శివుడు మనకు తండ్రి కూడా, సుప్రీమ్ టీచర్ కూడా, మనల్ని వారితో పాటుగా తీసుకువెళ్తారు. ఆ ఒక్కరికే ఎంతటి మహిమ ఉంది, వారినే స్మృతి చేయాలి. కొందరు ఈ విధంగా అంటారు - వీరు వెళ్ళి బి.కె.లను తమ గురువుగా చేసుకున్నారు. మీరు గురువుగా అయితే అవుతారు కదా. కానీ మిమ్మల్ని తండ్రి అని అనరు. టీచర్, గురువు అని అంటారు, తండ్రి అని అనరు. దీనిని మంచి రీతిలో అర్థం చేయించాలి. ప్రదర్శనీలో అర్థం చేయించేందుకు తెలివి కావాలి. కానీ తమలో అంతటి ధైర్యము ఉందని భావించరు. పెద్ద-పెద్ద ప్రదర్శనీలు జరిగినప్పుడు మంచి-మంచి సేవాధారీ పిల్లలు ఉంటారు, వారు వెళ్ళి సేవ చేయాలి. బాబా వెళ్ళవద్దు అనైతే చెప్పరు. మున్ముందు సాధు-సన్యాసులు మొదలైనవారికి కూడా మీరు జ్ఞాన బాణాలను వేస్తూ ఉంటారు. వారు ఇంకెక్కడికి వెళ్తారు! ఒకటే దుకాణము ఉంది. సర్వుల సద్గతి ఈ దుకాణము నుండే జరగనున్నది. ఈ దుకాణము ఎటువంటిదంటే, మీరు అందరికీ పవిత్రముగా అయ్యే మార్గాన్ని తెలియజేస్తారు, ఆపై తయారవ్వడము, తయారవ్వకపోవడము అన్నది వారిపై ఉంటుంది.
పిల్లలైన మీ అటెన్షన్ విశేషంగా సేవ పట్ల ఉండాలి. పిల్లలు తెలివైనవారు కావచ్చు కానీ సేవ పూర్తి చేయకపోతే, వారిపై రాహు దశ కూర్చుందని బాబా భావిస్తారు. దశలు అందరిపైన తిరుగుతూ ఉంటాయి కదా. మాయా నీడ పడుతుంది, మళ్ళీ రెండు రోజుల్లో బాగైపోతారు. పిల్లలు సేవ యొక్క అనుభవాన్ని పొంది రావాలి. ప్రదర్శనీలు చేస్తూ ఉంటారు, అయినా మనుష్యులు - గీతా జ్ఞానాన్ని కృష్ణుడు కాదు, శివ భగవానుడు వినిపించారని ఎందుకు వ్రాయరు. కొందరు అంటారు - ఇది చాలా బాగుంది, మనుష్యుల కొరకు ఇది ఎంతో కళ్యాణకారిగా ఉంది, ఈ ప్రదర్శనీని అందరికీ చూపించాలి అని. కానీ నేను కూడా ఈ వారసత్వాన్ని తీసుకుంటాను... అని ఈ విధంగా ఎవరూ అనరు. అచ్ఛా.
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. దేహాభిమానములోకి వచ్చి గట్టిగా మాట్లాడకూడదు. ఈ అలవాటును తొలగించాలి. దొంగతనము చేయడము, అబద్ధాలు చెప్పడము... ఇవన్నీ పాపాలు, వీటి నుండి రక్షించుకునేందుకు దేహీ-అభిమానులుగా అయి ఉండాలి.
2. మృత్యువు ఎదురుగా ఉంది కావున తండ్రి శ్రీమతముపై నడుస్తూ పావనముగా అవ్వాలి. తండ్రికి చెందినవారిగా అయిన తర్వాత ఎటువంటి చెడు కర్మలు చేయకూడదు. శిక్షల నుండి స్వయాన్ని రక్షించుకునేందుకు పురుషార్థము చేయాలి.
| వరదానము:- |
లోకప్రియ సభకు టికెట్ ను బుక్ చేసుకునే రాజ్య సింహాసన అధికారీ భవ ఏ సంకల్పమునైనా లేక ఆలోచననైనా చేసినప్పుడు, ఈ సంకల్పము లేక ఆలోచన తండ్రికి ప్రియమేనా అని మొదట చెక్ చేసుకోండి. ఏదైతే తండ్రికి ప్రియమైనదో అది లోకప్రియముగా స్వతహాగా అవుతుంది. ఒకవేళ ఏ సంకల్పములోనైనా స్వార్థము ఉన్నట్లయితే అది మనసుకు ప్రియమైనది అని అంటారు, అదే విశ్వ కళ్యాణార్థము అయితే లోక ప్రియము మరియు ప్రభువుకు ప్రియము అని అంటారు. లోకప్రియ సభకు సభ్యునిగా అవ్వటము అనగా లా అండ్ ఆర్డర్ తో కూడిన రాజ్యాధికారాన్ని అనగా రాజ్య సింహాసనాన్ని ప్రాప్తి చేసుకోవటము. |
| స్లోగన్:- | పరమాత్మ తోడును అనుభవము చేసినట్లయితే అన్నింటినీ సహజముగా అనుభవము చేస్తూ సురక్షితముగా ఉంటారు. |
అవ్యక్త సూచనలు - ‘‘కంబైండ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి’’
ఎలాగైతే శివశక్తి అనేది కంబైండ్ రూపమో, అలా పాండవపతి మరియు పాండవులు అన్నది సదా యొక్క కంబైండ్ రూపము. పాండవపతి, పాండవులు లేకుండా ఏమీ చెయ్యలేరు. ఎవరైతే ఇలా కంబైండ్ రూపములో సదా ఉంటారో వారికి బాప్ దాదా సాకారములో అన్ని సంబంధాలతో ఎదురుగా ఉంటారు. ఎక్కడ పిలిస్తే అక్కడికి క్షణములో హాజరైపోతారు అందుకే హాజిరా హజూర్(ప్రభువు హాజరై ఉన్నారు) అని అంటారు.