తెలుగు మురళి · Brahma Kumaris

ఈరోజు మురళి · 27 ఏప్రిల్, 2025

ఓం శాంతి · BapDada · 27 ఏప్రిల్, 2025

ఈరోజు మురళి — today’s murli in Telugu, BK Telugu murli.

18
మురళి27 ఏప్రిల్, 2025 · తెలుగు
0:00--:--

పాఠ్యాన్ని ఎంచుకోండి → హైలైట్ / బాక్స్ / అండర్‌లైన్

27-04-2025
ప్రాత:మురళి
ఓంశాంతి
‘‘అవ్యక్త బాప్ దాదా’’
రివైజ్ 03-02-2005 మధువనం

‘‘సేవ చేస్తూ ఉపరామ వృత్తి మరియు అనంతమైన వృత్తి ద్వారా ఎవర్రెడీగా అయ్యి బ్రహ్మాబాబా సమానముగా సంపన్నముగా అవ్వండి’’

ఈ రోజు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నలువైపులా ఉన్న కోట్లలో కొద్దిమంది మరియు కొద్దిమందిలో కూడా కొద్దిమంది అయిన తమ పిల్లల భాగ్యాన్ని చూసి హర్షిస్తున్నారు. ఇంతటి విశేష భాగ్యము ఇతరులెవ్వరికీ లభించదు. పిల్లల ప్రతి ఒక్కరి విశేషతను చూసి హర్షిస్తున్నారు. ఏ పిల్లలైతే బాప్ దాదాతో హృదయపూర్వకముగా సంబంధాన్ని జోడించారో ఆ పిల్లలు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విశేషత తప్పకుండా ఉంది. అన్నింటికంటే మొదటి విశేషత ఏమిటంటే - సాధారణ రూపములో వచ్చిన బాబాను గుర్తించి ‘‘మేరా బాబా’’ (నా బాబా) అని స్వీకరించారు. ఈ గుర్తించటమనేది అన్నింటికంటే పెద్ద విశేషత. మనస్ఫూర్తిగా ‘‘నా బాబా’’ అని స్వీకరించారు మరియు బాబా కూడా ‘‘నా పిల్లలు’’ అని స్వీకరించారు. పెద్ద-పెద్ద తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, ధర్మాత్మలు ఎవరెవరైతే ఉన్నారో వారు గుర్తించలేకపోయారు, కానీ సాధారణమైన పిల్లలు గుర్తించి తమ అధికారాన్ని తీసుకున్నారు. ఎవరైనా వచ్చి ఈ సభలోని పిల్లలను చూస్తే ఈ అమాయకమైన మాతలు, ఈ సాధారణ పిల్లలు ఇంత ఉన్నతమైన బాబాను గుర్తించారు అన్నదానిని అర్థం చేసుకోలేరు. కనుక ఈ విధంగా గుర్తించటమనేదే విశేషత. బాబాను గుర్తించి తమవారిగా చేసుకోవటము, ఇది కోట్లలో కొద్దిమంది పిల్లలైన మీ భాగ్యము. పిల్లలంతా, సమ్ముఖముగా కూర్చుని ఉన్నవారైనా లేక దూరముగా కూర్చుని సమ్ముఖముగా అనుభవము చేస్తున్నా, పిల్లలందరూ హృదయపూర్వకముగా గుర్తించారు! గుర్తించారా లేక గుర్తిస్తూ ఉన్నారా? ఎవరైతే గుర్తించారో వారు చేతులెత్తండి. (అందరూ చేతులెత్తారు) గుర్తించారా? అచ్ఛా! కనుక బాప్ దాదా ఈ గుర్తించే విశేషత గురించి పిల్లలు ప్రతి ఒక్కరికీ అభినందనలు ఇస్తున్నారు. వాహ్ భాగ్యవంతులైన పిల్లలూ వాహ్! గుర్తించే మూడవ నేత్రమును ప్రాప్తి చేసుకున్నారు. పిల్లల మనసులోని పాటను బాప్ దాదా వింటుంటారు, అది ఏ పాట? పొందాల్సినదేదో పొందేసాము. బాబా కూడా అంటారు - ఓ ప్రియమైన పిల్లలూ, బాబా నుండి ఏదైతే తీసుకోవాలో అది తీసుకున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ అనేక ఆత్మిక ఖజానాలకు బాలకుల నుండి యజమానులుగా అయ్యారు.

మరి ఈ రోజు బాప్ దాదా ఖజానాలకు యజమానులైన పిల్లలది ఖజానా యొక్క ఖాతాను చూస్తున్నారు. బాబా అయితే ఖజానాలను అందరికీ ఒకే విధంగా, ఒకే పరిమాణములో ఇచ్చారు. కొందరికి పదమాలు, కొందరికి లక్షలు ఇవ్వలేదు. కానీ ఖజానాలను తెలుసుకోవటము మరియు ప్రాప్తి చేసుకోవటము, వాటిని జీవితములో ఇముడ్చుకోవటము, ఇందులో నంబరువారుగా ఉన్నారు. బాప్ దాదా ఈ రోజుల్లో పదే-పదే భిన్న-భిన్న రకాలుగా పిల్లలకు అటెన్షన్ ఇప్పిస్తున్నారు - సమయ సమీపతను చూసి మిమ్మల్ని మీరు సూక్ష్మ విశాలబుద్ధితో చెక్ చేసుకోండి - మాకు ఏం లభించాయి, మేము ఏం తీసుకున్నాము మరియు నిరంతరము ఆ ఖజానాలతో పాలింపబడుతూ ఉన్నామా. చెకింగ్ అనేది చాలా అవసరము ఎందుకంటే మాయ వర్తమాన సమయములో రకరకాల రాయల్ రూపములోని నిర్లక్ష్యము మరియు రాయల్ సోమరితనము రూపములో ట్రయల్ వేస్తూ ఉంటుంది, అందుకే మీ చెకింగ్ ను సదా చేసుకుంటూ వెళ్ళండి. అంతటి అటెన్షన్ తో చెకింగ్ చేసుకోవాలి, నిర్లక్ష్యముతో చెకింగ్ చేసుకోవడం కాదు - చెడు చెయ్యలేదు కదా, దుఃఖము ఇవ్వలేదు కదా, చెడు దృష్టి కలగలేదు కదా, ఈ చెకింగ్ అయితే జరుగుతుంది కానీ - చాలా మంచిగా ఏం చేసాను? సదా ఆత్మిక దృష్టి న్యాచురల్ గా ఉందా? లేక విస్మృతి స్మృతుల ఆట జరిగిందా? ఎంతమందికి శుభ భావన, శుభ కామన, ఆశీర్వాదాలను ఇచ్చాను? ఇటువంటి జమ ఖాతా ఎంత ఉంది మరియు ఎలా ఉంది? అని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే జమ ఖాతాను కేవలం ఇప్పుడే తయారుచేసుకోగలరు అని మీకు బాగా తెలుసు. ఈ సమయము, ఫుల్ సీజన్ అంతా ఖాతాను జమ చేసుకునే సమయము. ఇక తర్వాత మొత్తము సమయమంతా ఈ జమ అనుసారుముగానే రాజ్య భాగ్యము తీసుకుంటారు మరియు పూజ్య దేవీ-దేవతలుగానూ అవుతారు. జమ తక్కువగా ఉంటే రాజ్య భాగ్యము కూడా తక్కువగా ఉంటుంది మరియు పూజ్యులుగా అవ్వటములో కూడా నంబరువారుగా ఉంటారు. జమ తక్కువగా ఉంటే పూజ కూడా తక్కువగా అవుతుంది, విధిపూర్వకముగా జమ అవ్వకపోతే పూజ కూడా విధిపూర్వకముగా జరగదు. అప్పుడప్పుడు విధిపూర్వకముగా ఉంటే పూజ కూడా మరియు పదవి కూడా అప్పుడప్పుడు ఉంటాయి, అందుకే బాప్ దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరిపై అత్యంత ప్రేమ ఉంది కనుక బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు - పిల్లలు ప్రతి ఒక్కరూ సంపన్నముగా అవ్వాలి, సమానముగా అవ్వాలి. సేవ చెయ్యండి కానీ సేవలో కూడా ఉపరామము, అనంతము.

బాప్ దాదా చూసారు - మెజారిటీ పిల్లలకు యోగములో అనగా స్మృతి సబ్జెక్టులో రుచి లేక అటెన్షన్ తక్కువ ఉంటుంది, సేవలో ఎక్కువ ఉంటుంది. కానీ స్మృతి లేకుండా సేవలో ఎక్కువగా ఉన్నట్లయితే అందులో హద్దు వచ్చేస్తుంది, ఉపరామ వృత్తి ఉండదు, పేరు-ప్రతిష్టలు, పొజిషన్ పట్ల కోరిక అనేది అందులో మిక్స్ అయిపోతుంది, అనంతమైన వృత్తి తక్కువైపోతుంది. అందుకే బాప్ దాదా కోరుకుంటున్నారు - కోట్లలో కొద్దిమంది, కొద్దిమందిలో కొద్దిమంది అయిన నా పిల్లలు ఇప్పటి నుండే ఎవర్రెడీగా అవ్వాలి. ఎందుకని? కొంతమంది ఏమనుకుంటారంటే, సమయము వచ్చినప్పుడు తయారైపోతాములే. కానీ సమయము మీ రచన. రచనను మీ శిక్షకునిగా చేసుకుంటారా? రెండవ విషయము ఏమిటంటే, బహుకాలపు లెక్క ఉంటుంది, బహుకాలపు సంపన్నత బహుకాలపు ప్రాప్తిని కలిగిస్తుంది. కనుక ఇప్పుడు సమయ సమీపత ప్రమాణముగా బహుకాలపు జమ ఉండటము అవసరము, మళ్ళీ తర్వాత - బహుకాలము అంటే ఇంకా సమయము ఉంది అని మేము అనుకున్నాము అని ఫిర్యాదు చేయకండి. ఇప్పటినుండే బహుకాలము అన్నదానిపై అటెన్షన్ పెట్టండి. అర్థమైందా! అటెన్షన్ ప్లీజ్.

బాప్ దాదా ఏం కోరుకుంటున్నారంటే - ఒక్క బిడ్డలో కూడా, ఏ ఒక్క సబ్జెక్టు యొక్క లోపము ఉండకూడదు. బ్రహ్మాబాబా పైనైతే ప్రేమ ఉంది కదా! ప్రేమకు రిటర్న్ అయితే ఇస్తారు కదా! మరి ప్రేమకు రిటర్న్ ఏమిటంటే - మీలో ఉన్న లోపాన్ని చెక్ చేసుకోండి మరియు రిటర్న్ ఇవ్వండి, టర్న్ చేసుకోండి. మిమ్మల్ని మీరు టర్న్ (పరివర్తన) చేసుకోవడము - ఇదే రిటర్న్ ఇవ్వడము. మరి రిటర్న్ ఇచ్చేందుకు ధైర్యము ఉందా? చేతులైతే ఎత్తేస్తారు, చాలా సంతోషపరుస్తారు. ఎత్తిన చేతులను చూసి అయితే బాప్ దాదా సంతోషిస్తారు, ఇప్పుడు మనస్ఫూర్తిగా... పక్కా-పక్కాగా, ఒక్క శాతము కూడా కచ్చాగా ఉండకూడదు, పక్కా వ్రతాన్ని చేపట్టండి - రిటర్న్ ఇవ్వాల్సిందే. తమను తాము టర్న్ (పరివర్తన) చేసుకోవాలి.

ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదా! కనుక పిల్లలందరికీ బాబా జయంతియే తమ జయంతిగా జరుపుకోవాలి అనే ఉల్లాసము చాలా ప్రేమగా కలుగుతుంది. మంచి-మంచి ప్రోగ్రాములు తయారుచేస్తున్నారు. సేవా ప్లాన్లు అయితే చాలా మంచివి తయారుచేస్తారు, బాప్ దాదా సంతోషిస్తున్నారు. కానీ... కానీ అని అనటము మంచిగా అనిపించదు. జగదంబ తల్లి లేకిన్ (కానీ) అనే పదాన్ని సింధీ భాషలో ఏమనేవారంటే - లే కిన్, సింధీ భాషలో చెత్తను ‘కిన్’ అని అంటారు. కనుక లేకిన్ (కానీ) అని అనటము అనగా ఏదో ఒక చెత్తను తీసుకోవటము. కనుక ‘కానీ’ అని అనటము మంచిగా అనిపించదు. కానీ అనవలసిన వస్తుంది. ఏ విధంగానైతే ఇతర సేవల గురించి ప్లాన్లు తయారుచేసారు కూడా మరియు తయారుచేస్తారు కూడా, కానీ ఈ వ్రతాన్ని చేపట్టే ప్రోగ్రామును కూడా తయారుచేయండి. రిటర్న్ ఇవ్వాల్సిందే ఎందుకంటే బాప్ దాదా అయినా లేక మరెవరైనా ‘ఎలా ఉన్నారు’ అని అడిగితే, మెజారిటీ నుండి ఇదే సమాధానము వస్తుంది - చాలా బాగా ఉన్నాము కానీ బాప్ దాదా ఎంతైతే చెప్తారో అంతగా లేము. ఇకపై ఏ సమాధానము ఇవ్వాలంటే - బాప్ దాదా ఎలా అయితే కోరుకుంటున్నారో అదే విధముగా ఉన్నాము. బాప్ దాదా ఏం కోరుకుంటున్నారో నోట్ చేసుకోండి, ఆ లిస్టు నోట్ చేసుకోండి మరియు చెక్ చేసుకోండి - బాప్ దాదా ఇది కోరుకుంటున్నారు, ఇలా ఉన్నామా లేమా? ప్రపంచములోనివారు పూర్వజులైన మీ ద్వారా ముక్తిని కోరుకుంటున్నారు, వారు - ముక్తిని ఇవ్వండి, ముక్తిని ఇవ్వండి అని ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. ఎప్పటివరకైతే మెజారిటీ పిల్లలు తమ పాత సంస్కారాలను, దేనినైతే మీరు నేచర్ అని అంటారో, అవి నేచురల్ కాదు, నేచర్, వాటిలో ఏ మాత్రము కొద్దిగా మిగిలిపోయి ఉన్నా, ఇంకా ముక్తులుగా అవ్వలేదు అంటే సర్వాత్మలకు ముక్తి లభించదు. కనుక బాప్ దాదా అంటున్నారు - ముక్తిదాత పిల్లలైన ఓ మాస్టర్ ముక్తిదాతల్లారా, ఇప్పుడు మిమ్మల్ని మీరు ముక్తులుగా చేసుకున్నట్లయితే సర్వాత్మల కొరకు ముక్తి ద్వారము తెరుచుకుంటుంది. ఆ గేట్ యొక్క తాళంచెవి ఏమిటో వినిపించాము కదా? అనంతమైన వైరాగ్యము. అన్ని కార్యాలు చెయ్యండి కానీ మీరు భాషణ ఇచ్చేటప్పుడు చెప్తారు కదా, ప్రవృత్తివారు కమల పుష్ప సమానముగా అవ్వాలి అని, అలా అన్నీ చేస్తూ, కర్తాపన్ (నేను చేస్తున్నాను) అనే భావము నుండి ముక్తులుగా, అతీతముగా ఉండాలి, సాధనాలకూ వశమవ్వకూడదు, పొజిషన్ కు వశమవ్వకూడదు. ‘ఏదో ఒకటి లభించాలి’ అని అనుకోవటము అంటే అది పొజిషన్ కాదు, అది మాయ అపోజిషన్. అతీతముగా మరియు బాబాకు ప్రియమైనవారిగా ఉండాలి. అతీతముగా మరియు ప్రియముగా అవ్వటము ఏమైనా కష్టమా? ఎవరికైతే కష్టమనిపిస్తుందో వారు చేతులెత్తండి. (ఎవ్వరూ చేతులెత్తలేదు) ఎవ్వరికీ కష్టమనిపించటం లేదు అంటే ఇక శివరాత్రి కల్లా అందరూ సంపన్నమైపోతారు. కష్టము లేదు అని అన్నప్పుడు మరి అలా అవ్వాల్సిందే. బ్రహ్మాబాబా సమానముగా అవ్వాల్సిందే. సంకల్పాలలో కూడా, మాటలలో కూడా, సేవలలో కూడా, సంబంధ-సంపర్కాలలో కూడా, అన్నింటిలోనూ బ్రహ్మాబాబా సమానముగా అవ్వాలి.

అచ్ఛా, బ్రహ్మాబాబా మరియు దాదాపై, గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ పై నాకు చాలా-చాలా ప్రేమ ఉంది, 100 శాతము కంటే కూడా ఎక్కువ ప్రేమ ఉంది అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. చేతులెత్తి సంతోషపరచటం కాదు, కేవలము ఇప్పటికిప్పుడే సంతోషపరచటం కాదు. అందరూ చేతులెత్తారు. టి.వి.లో చూపిస్తున్నారు కదా. శివరాత్రి నాడు ఈ టి.వి.ని చూస్తాము మరియు లెక్క తీసుకుంటాము. సరేనా! కొద్దిగా కూడా సమానతలో తేడా ఉండకూడదు. ప్రేమ కోసము బలిహారమవ్వటము అనేది ఏమైనా పెద్ద విషయమా. ప్రపంచములోనివారైతే అశుద్ధమైన ప్రేమ వెనుక జీవితాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధమైపోతారు. బాప్ దాదా అయితే కేవలము - చెత్తను ఇచ్చేయండి అని అంటున్నారు, అంతే. మంచిది ఇవ్వకండి, చెత్తను ఇవ్వండి. బలహీనతలు, లోపాలు - ఇవి ఏమిటి? చెత్త కదా! చెత్తను బలిహారము చెయ్యటము ఏమంత పెద్ద విషయము! పరిస్థితి సమాప్తమైపోవాలి, స్వస్థితి శ్రేష్ఠమైపోవాలి. ఏం చెయ్యాలి, పరిస్థితి అలా ఉంది అనే అంటారు కదా! కనుక కదిలింపజేసే పర-స్థితి అన్న పేరు కూడా ఉండకూడదు, స్వ-స్థితి అంతటి శక్తిశాలిగా ఉండాలి. సమాప్తి యొక్క పరదా తెరుచుకున్నప్పుడు అందరూ ఎలా కనిపించాలి? ఫరిశ్తాలు మెరుస్తున్నట్లుగా కనిపించాలి. పిల్లలందరూ మెరుస్తూ కనిపించాలి. అందుకే, ఇప్పుడు పరదా తెరుచుకోకుండా ఆగి ఉంది. పరదాను తెరవండి, పరదాను తెరవండి అని ప్రపంచములోని వారు ఆర్తనాదాలు చేస్తున్నారు. కనుక మీ ప్లాన్ ను మీరే తయారుచేసుకోండి. రెడీమేడ్ ప్లాన్ ను ఇస్తే అందులో అనేక విషయాలు వస్తాయి. మీ ప్లాన్ మీ ధైర్యముతో తయారుచేసుకోండి. దృఢత అనే తాళం చెవిని పెట్టినట్లయితే సఫలత లభించేదే ఉంది. దృఢ సంకల్పము చేస్తారు మరియు బాప్ దాదా - వాహ్ పిల్లలూ వాహ్ అని సంతోషిస్తారు. దృఢ సంకల్పాన్ని చేసారు కానీ దృఢతలో కొంచెం-కొంచెం నిర్లక్ష్యము కలిసిపోతుంది, అందుకే సఫలత యొక్క శాతము కూడా ఒక్కోసారి సగము, ఒక్కోసారి మూడు వంతులు అయిపోతుంది. ఏ విధంగా ప్రేమ 100 శాతము ఉందో, అలాగే పురుషార్థములో సంపన్నత కూడా 100 శాతము ఉండాలి. ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ తక్కువ ఉండకూడదు. ఇష్టమేనా? ఇష్టమే కదా? శివరాత్రినాటికి సత్తాను చూపిస్తారు కదా! తయారవ్వాల్సిందే. మేము తయారవ్వకపోతే మరెవరు తయారవుతారు! ఈ నిశ్చయమును పెట్టుకోండి - మేమే అలా ఉండేవారిమి, ఇప్పుడూ మేమే ఉన్నాము మరియు తర్వాత కూడా మేమే అలా ఉంటాము. ఈ నిశ్చయము విజయులుగా చేస్తుంది. పరదర్శనము చెయ్యకూడదు, స్వయాన్నే చూసుకోవాలి. చాలామంది పిల్లలు ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు ఏమంటారంటే - వీరిని కాస్త బాగు చెయ్యండి, అప్పుడు నేను బాగైపోతాను, వారిని కాస్త మార్చినట్లయితే నేను కూడా మారిపోతాను. కానీ వారూ మారరు, మీరూ మారరు. స్వయాన్ని మార్చుకుంటే వారు కూడా మారిపోతారు. ఇది జరిగితే అది జరుగుతుంది అని ఇలా ఏ ఆధారాన్నీ పెట్టుకోకండి. నేను చెయ్యాల్సిందే.

అచ్ఛా, ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు చేతులెత్తండి. మొదటిసారిగా వచ్చినవారితో విశేషముగా బాప్ దాదా చెప్తున్నారు - మీరు ఎటువంటి సమయములో వచ్చారంటే, సమయము చాలా తక్కువ మిగిలి ఉంది, కానీ పురుషార్థము ఎంత తీవ్రముగా చెయ్యండంటే లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్ నంబరులోకి రాగలరు, ఎందుకంటే ఇప్పుడు కుర్చీలాట ఇంకా నడుస్తూ ఉంది. ఇప్పుడు ఎవరు గెలిచారు అన్నది ఇంకా అనౌన్స్ చేయలేదు. లేట్ గా అయితే వచ్చారు కానీ వేగముగా నడవటం ద్వారా చేరుకుంటారు. కేవలము మీకు మీరు అమృతవేళ అమర భవ అన్న వరదానాన్ని గుర్తు చేసుకోండి. అచ్ఛా - కొందరు దూరము నుండి, కొందరు దగ్గర నుండి వచ్చారు. బాప్ దాదా అంటారు - మీ ఇంటికి వచ్చారు, మంచిది. సంగఠన బాగా అనిపిస్తుంది. టి.వి.లో చూస్తారు కదా, సభ నిండుగా ఉంటే ఎంత బాగా అనిపిస్తుంది. అచ్ఛా. మరి ఎవర్రెడీనేనా? ఎవర్రెడీ పాఠాన్ని చదువుతారు కదా! అచ్ఛా.

మధుబన్ నివాసులతో:- మధుబన్ వారు చేతులెత్తండి. చాలామంది ఉన్నారు. మధుబన్ వారు ఆతిథ్యాన్ని ఇచ్చేవారు, ఇతరులైతే అతిధులుగా వస్తారు మరియు వెళ్ళిపోతారు కానీ మధుబన్ వారు ఆతిథ్యాన్ని ఇచ్చేవారు. వీరు నియరెస్ట్ (చాలా దగ్గర) అయినవారు కూడా, డియరెస్ట్ (చాలా ప్రియము) అయినవారు కూడా. మధుబన్ వారిని చూసి అందరూ సంతోషిస్తారు కదా. మధుబన్ వారు ఎక్కడికైనా వెళ్తే అక్కడ అందరూ వారిని ఏ దృష్టితో చూస్తారు. వాహ్, మధుబన్ నుండి వచ్చారు! ఎందుకంటే మధుబన్ అన్న పేరు వినటముతోనే మధుబన్ బాబా గుర్తుకువస్తారు, అందుకే మధుబన్ వారికి మహత్వము ఉంది. మహత్వము ఉందా? సంతోషిస్తారు కదా! ఇటువంటి ప్రేమపూర్వకమైన పాలనా స్థానము కోట్లలో కొద్దిమందికి మాత్రమే లభించింది. మధుబన్ లోనే ఉండిపోవాలి అని అందరూ కోరుకుంటారు. కానీ అలా ఉండగలరా! మీరైతే ఉంటున్నారు. కనుక మంచిది. మధుబన్ వారిని మర్చిపోము, మా గురించి అడగలేదు అని భావిస్తారు, కానీ బాప్ దాదా సదా మనసుతో అడుగుతారు. ముందు మధుబన్ వారే. మధుబన్ వారే లేకపోతే ఎక్కడికి వస్తారు! సేవకు నిమిత్తులు కదా! సేవాధారులు ఎంతమంది లభించినా కానీ, ఫౌండేషన్ అయితే మధుబన్ వారే! కనుక పైన జ్ఞాన సరోవర్ లో, పాండవ భవన్ లో ఎవరైత ఉన్నారో, వారందరికీ కూడా బాప్ దాదా హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను మరియు ప్రియస్మృతులను ఇస్తున్నారు. ఇక్కడ ఇస్తున్న టోలీ పైన మధుబన్ లో లభిస్తుందా? కనుక మధుబన్ వారికి టోలీ కూడా లభిస్తుంది, బోలీ (మురళి) కూడా లభిస్తుంది. రెండూ లభిస్తాయి. అచ్ఛా.

గ్లోబల్ హాస్పిటల్ వారితో:- హాస్పిటల్ వారందరూ బాగున్నారా ఎందుకంటే హాస్పిటల్ కు కూడా విశేష పాత్ర ఉంది కదా. మీరు ఇక్కడ కిందకు వస్తారా? అచ్ఛా, కొద్దిమందే వస్తారు. హాస్పిటల్ వారు కూడా మంచి సేవ చేస్తున్నారు. చూడండి, అవసరమైన సమయములోనైతే ఎంతైనా హాస్పిటలే ఉపయోగపడుతుంది కదా. మరియు హాస్పిటల్ తెరిచినప్పటి నుండి, అందరి దృష్టిలోకి ఏమని వచ్చిందంటే - బ్రహ్మాకుమారీలు కేవలం జ్ఞానం మాత్రమే ఇవ్వరు, కానీ అవసరమైన సమయములో సహాయము కూడా చేస్తారు, సమాజ సేవ కూడా చేస్తారు అని. కనుక హాస్పిటల్ తెరిచిన తర్వాత ఆబూలో ఆ వాయుమండలమే మారిపోయింది. మొదటిలో ఏ దృష్టితో చూసేవారో, ఇప్పుడు ఆ దృష్టితో చూడటం లేదు. ఇప్పుడు సహయోగము చేసేవారు అన్న దృష్టితో చూస్తున్నారు. జ్ఞానాన్ని ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా కానీ సహయోగము చేసేవారు అనే దృష్టితో చూస్తున్నారు అంటే, మరి హాస్పిటల్ వారు సేవ చేసారు కదా. మంచిది.

అచ్ఛా - నేటి విషయము గుర్తుందా? సంపన్నముగా అవ్వాల్సిందే, ఏం జరిగినా కానీ సంపన్నముగా అవ్వాల్సిందే. సంపన్నముగా అవ్వాలి, సమానముగా అవ్వాలి అనే తపన ఏర్పడాలి. అచ్ఛా.

నలువైపులా ఉన్న కోట్లలో కొద్దిమంది, కొద్దిమందిలో కూడా కొద్దిమంది అయిన భాగ్యవంతులకు, భగవంతుని పిల్లలైన శ్రేష్ఠ ఆత్మలకు, సదా తీవ్ర పురుషార్థము ద్వారా ఆలోచించినదానినే చేసారు అనేవారికి, శ్రేష్ఠముగా ఆలోచించటము, శ్రేష్ఠముగా చెయ్యటము, లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానము చేసుకునేవారికి, ఇటువంటి విశేష ఆత్మలకు, సదా బహుకాలపు పురుషార్థము ద్వారా రాజ్య భాగ్యము లభించే మరియు పూజ్యులుగా అయ్యే శ్రేష్ఠ ఆత్మలకు, సదా బాబా స్నేహానికి రిటర్నులో స్వయాన్ని టర్న్ (పరివర్తన) చేసుకునే నంబర్ వన్ పిల్లలకు, విన్ అయ్యే భాగ్యవంతులైన పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

వరదానము:- విశ్వ కళ్యాణకారి అనే ఉన్నతమైన స్థితిలో స్థితులై వినాశ లీలను చూసే సాక్షీ దృష్టా భవ
అంతిమ వినాశ లీలను చూసేందుకు విశ్వ కళ్యాణకారి అనే ఉన్నతమైన స్థితి కావాలి. ఈ స్థితిలో స్థితులవ్వటము ద్వారా దేహపు సర్వ ఆకర్షణలు అనగా సంబంధాలు, పదార్థాలు, సంస్కారాలు మరియు ప్రకృతి అలజడుల ఆకర్షణలు సమాప్తమైపోతాయి. ఎప్పుడైతే ఇటువంటి స్థితి ఉంటుందో, అప్పుడు సాక్షీ దృష్టాగా అయ్యి పైన ఉన్న స్టేజిపై స్థితులై శాంతి మరియు శక్తుల కిరణాలను సర్వాత్మలకు ఇవ్వగలరు.
స్లోగన్:- శక్తివంతులుగా అయినట్లయితే మాయ ఫోర్స్ సమాప్తమైపోతుంది.

 

అవ్యక్త సూచనలు - ‘‘కంబైండ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి’’

వరదాత అయిన బాబా మరియు వరదానీ ఆత్మలమైన మనము, ఇరువురము కంబైండుగా ఉన్నాము. ఈ స్మృతి సదా ఉన్నట్లయితే పవిత్రత యొక్క ఛత్రఛాయ స్వతహాగా ఉంటుంది ఎందుకంటే ఎక్కడైతే సర్వశక్తివంతుడైన బాబా ఉంటారో అక్కడ అపవిత్రత అనేది స్వప్నములో కూడా రాలేదు. సదా బాబా మరియు మీరు యుగళ రూపములో ఉండండి, సింగిల్ గా కాదు. సింగిల్ గా అయినట్లయితే పవిత్రత అనే సౌభాగ్యము పోతుంది.

మురళి అంటే ఏమిటి?

మురళి బ్రహ్మకుమారీల దైనిక ఆధ్యాత్మిక బోధన, ఇది ప్రతి ఉదయం మధుబన్ నుండి ప్రచురించబడుతుంది. ఇక్కడ మీరు ఈరోజు మురళిని తెలుగులో చదవవచ్చు, ఆడియో వినవచ్చు మరియు PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధ్యయనానికి సహాయంగా పాఠ్యాన్ని హైలైట్ చేయవచ్చు — మీ గుర్తులు ఈ బ్రౌజర్‌లోనే సురక్షితంగా ఉంటాయి.

Also searched astodays murli in telugu · today murli in telugu · today murli telugu · bk telugu murli · telugu pdf murli · daily murli telugu · telugu murli today · telugu murli · today's telugu murali · brahma kumaris daily murli in telugu · brahma kumaris telugu murli today · baba murli telugu today · om shanti telugu murli today · bk murli today telugu · ఈరోజు తెలుగు మురళి · murali in telugu

28 భాషల్లో మురళి

Daily Murli · Madhuban మూలం: మధుబన్ మురళి విభాగం ఇది స్వతంత్ర రీడర్ యాప్, అధికారిక వెబ్‌సైట్ కాదు.