| 23-05-2026 |
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
|
మధువనం |
| ‘‘మధురమైన పిల్లలూ - రావణుడు మిమ్మల్ని చాలా పీడించాడు, ఇప్పుడు భక్తులైన మీ రక్షకుడైన భగవంతుడు మీ దుఃఖాన్ని దూరము చేయడానికి వచ్చారు’’ | |
| ప్రశ్న:- | సుపుత్రులైన పిల్లల యొక్క ముఖ్యమైన రెండు గుర్తులను వినిపించండి? |
| జవాబు:- | సుపుత్రులైన పిల్లలు సదా తల్లి-తండ్రిని ఫాలో చేసి సింహాసనాధికారులుగా అవుతారు. పురుషార్థములో పూర్తిగా తత్పరులై ఉంటారు. 2. వారు తండ్రి పట్ల చాలా సత్యమైన హృదయము కలిగి ఉంటారు. సత్యమైన హృదయము కలవారు సదా శ్రీమతముపై నడుస్తారు. ఒకవేళ లోపల సత్యత లేకపోతే స్మృతిలో ఉండలేకపోతారు. |
| పాట:- | భోళానాథుని కన్నా అతీతమైనవారు... |
ఓంశాంతి. మధురాతి మధురమైన పిల్లలు ఈ భక్తి మార్గములోని పాటను విన్నారు. భక్తులకు ఈ పాట అర్థం తెలియదు. మీరు భగవంతునికి పిల్లలుగా అయ్యారు. భగవంతుడు భక్తుల రక్షకుడు. మీరు కూడా భక్తుల రక్షకులు. మీరు భక్తుల రక్షణను చేస్తారు. ఏ ఆపద ఉన్న కారణముగా భక్తులు భగవంతుడిని రక్షించమని పిలుస్తారు? భక్తులకు రావణుడి దుఃఖము చాలా ఉంది. రావణ సాంప్రదాయము దుఃఖాలతో పీడించబడి ఉంది. కావున భోళానాథుడిని స్మృతి చేస్తారు. అది రావణుడి సాంప్రదాయము, ఇది రాముడి సాంప్రదాయము. తమ రక్షకుడు ఎవరు అనేది భక్తులకు అసలు తెలియనే తెలియదు. భోళానాథుడు రక్షకుడని గాయనము చేయడము చేస్తారు కానీ ఏ విషయములో రక్షిస్తారు అనేది తెలియదు. భోళానాథుడైన శివబాబానే పాడైపోయిన దానిని బాగు చేసేవారని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. భగవంతుడు అని ఎవరిని అంటారు అనేది ప్రపంచానికి అసలు తెలియదు. ఒకవేళ భగవంతుని గురించి తెలిస్తే, వారి రచన యొక్క ఆదిమధ్యాంతాల గురించి కూడా తెలిసి ఉండాలి. భగవంతుని గురించి తెలియదు, వారి రచన గురించి తెలియదు, అందుకే ఇటువంటి మనుష్య సాంప్రదాయాన్ని అంధులు అని కూడా అనడము జరుగుతుంది. మరో వైపు దివ్యదృష్టి లభించిన మీరు ఉన్నారు. ఇప్పుడు మీ పేరు బ్రహ్మాకుమార-కుమారీలు. బోర్డుపై కూడా - బ్రహ్మాకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయము అన్న పేరు వ్రాయబడి ఉంది. కేవలం బ్రహ్మాకుమారీలు అని ఉంటే సరిపోదు. ప్రజాపిత బ్రహ్మా ఉన్నారు కదా. తండ్రికి కుమారులు మరియు కుమార్తెలు, ఇరువురూ ఉంటారు. ప్రజాపిత బ్రహ్మాకు మాత్రమే ఇంతమంది పిల్లలు ఉండగలరు. బాబా అనంతమైన తండ్రి అని అర్థం చేసుకోవాలి. బ్రహ్మా-విష్ణు-శంకరులను రచించేవారు బాబాయేనని, వారిని నిరాకారుడని అంటారని కూడా మీకు తెలుసు. వారు అనంతమైన తండ్రి. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా రచనను రచిస్తారని కూడా మీకు తెలుసు. అంతా వారి రచన - మనుష్యమాత్రులందరూ వాస్తవానికి శివవంశీయులు. ఇప్పుడు మీరు ప్రజాపిత బ్రహ్మాకు సంతానముగా అయ్యారు. ఇది కొత్త రచన. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా రచనను రచిస్తారు కావున మిమ్మల్ని బ్రహ్మాకుమార-కుమారీలని అనడము జరుగుతుంది. ఇంతమంది అనంతమైన పిల్లలు ఉన్నారు, వారు తప్పకుండా అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటూ ఉండవచ్చు. బ్రహ్మాకుమార-కుమారీలైన మమ్మల్ని శివబాబా దత్తత తీసుకున్నారని పిల్లలకు తెలుసు. మీరు నా పిల్లలు అని శివబాబా అంటారు. ఆత్మలైన మీరు కూడా నిరాకారులుగా ఉండేవారు. కానీ జ్ఞానమైతే సాకారములో కావాలి. మనము ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారమని మీకు తెలుసు, బ్రహ్మా ద్వారా రచన ఇక్కడ జరుగుతుంది. శివజయంతి కూడా ఇక్కడే జరుపుకోబడుతుంది. ఈ మగధ దేశములోనే జన్మ తీసుకున్నారు. తండ్రి అంటారు, ఈ దేశము ఎంతో పవిత్రమైన స్వర్గముగా ఉండేది. ఇప్పుడు దీనిని నరకముగా ఉన్న మగధ దేశమని అంటారు. మళ్ళీ స్వర్గము తయారవ్వాలి. శివబాబా మనకు మళ్ళీ రాజయోగాన్ని నేర్పించి పవిత్రముగా తయారుచేస్తారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. పతిత-పావనుడు, భక్తుల రక్షకుడు భగవంతుడని పాడుతారు కూడా. భక్తులే పిలుస్తారు. పతితులుగా ఉన్నప్పటికీ స్వయాన్ని పతితులుగా భావించరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరందరూ పతితులు. పావన ప్రపంచమని సత్యయుగాన్ని, పతిత ప్రపంచమని కలియుగాన్ని అంటారు. తండ్రి మీకు అంతా రైట్ చెప్తారు. లక్షల సంవత్సరాల వస్తువేదీ ఉండదు. మనుష్యులు ఘోర అంధకారములో ఉన్నారు, కలియుగము ఇప్పుడింకా బాల్యములోనే ఉందని భావిస్తారు, కానీ మృత్యువు ఎదురుగా నిలబడి ఉందని మీకు తెలుసు. అంధకారము మరియు ప్రకాశము యొక్క వర్ణన సంగమములోనే చేయడము జరుగుతుంది. ఇప్పుడు మీరు అత్యంత ప్రకాశములోకి వచ్చారు. సత్యయుగములో మీరు ఇలా వర్ణన చేయలేరు. అక్కడ ఈ జ్ఞానమే ఉండదు. ఈ సమయములో తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - మీరు సత్యయుగములో సూర్య వంశస్థులుగా ఉండేవారు, తర్వాత అంతిమములో శూద్ర వంశస్థులుగా అయ్యారు, ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణ వంశస్థులుగా అయ్యారు. ఇప్పుడు మీరు సర్వోత్తమమైన బ్రాహ్మణ కులానికి చెందినవారు, మీరు ఉన్నతోన్నతమైనవారు. ఇది ఈశ్వరీయ కులము కదా. తండ్రి వద్దకు వచ్చినప్పుడు, మీరు ఎవరి వద్దకు వచ్చారని బాబా అడుగుతారు. అప్పుడు, తండ్రి వద్దకు వచ్చామని చెప్తారు. తండ్రులు ఇద్దరు - ఒకరు లౌకిక తండ్రి, మరొకరు పారలౌకిక తండ్రి. సాలిగ్రామాలందరి తండ్రి ఒక్క శివుడే. మీ బుద్ధిలో ఈ జ్ఞానము చుక్క-చుక్కగా పడుతూ ఉంటుంది. మనము ఒక్క తండ్రి పిల్లలము, వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. నిరాకారుడు వారసత్వాన్ని సాకారుడి ద్వారానే ఇస్తారు కదా. తండ్రి స్వయంగా చెప్తున్నారు - నేను సాధారణ తనువులోకి వచ్చి ప్రవేశిస్తాను. ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తున్నారు - పిల్లలూ, దేహీ-అభిమాని భవ. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ దేహము వినాశీ అయినది, ఆత్మ అవినాశీ. ఆత్మే 84 జన్మలు తీసుకోవలసి ఉంటుంది, శరీరము కాదు. దేహమైతే మారుతూ ఉంటుంది, అప్పుడు వేరే-వేరే మిత్ర-సంబంధీకులు లభిస్తారు.
ఇప్పుడు ఆత్మ, అనంతమైన తండ్రి అయిన పరమపిత పరమాత్మ నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. మీరే విని ధారణ చేస్తారు. సంస్కారాలు మీ ఆత్మలోనే ఉన్నాయి. ఆత్మలోనే సంస్కారాలు ఉంటాయి. అంతేకానీ, శరీరము యొక్క సంస్కారాలని అనరు. అలా కాదు. మీ ఆత్మ యొక్క సంస్కారాలు తమోప్రధానముగా ఉన్నాయి. వాటిని ఇప్పుడు పరివర్తన చేసుకోవాలి. శరీరాన్ని కల్పతరువు అని అంటారు. శరీరము కల్పవృక్ష సమానముగా తయారవుతుంది. ఆయుష్షు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆయుష్షు చాలా తక్కువగా ఉంటుందని మీకు తెలుసు. చిన్న వయసులోనే అలా కూర్చుని ఉంటుండగానే అకాల మృత్యువులు జరుగుతాయి. ఇప్పుడు మీరు మృత్యువుపై విజయాన్ని పొందుతారు. అక్కడ మృత్యువు ఎప్పుడూ కబళించదు. అకస్మాత్తుగా ఎప్పుడూ శరీరాన్ని వదలరు. ఇప్పుడు ఈ శరీరము వృద్ధ శరీరముగా అయ్యిందని, దీనిని వదిలి కొత్తది తీసుకోవాలని మీకు తెలుస్తుంది. శరీరము వదిలే సమయములో కూడా భజంత్రీలు మ్రోగుతాయి, జన్మించే సమయములో కూడా మ్రోగుతాయి. అక్కడ ఏడ్చే విషయమే ఉండదు. మీకు భ్రమరము ఉదాహరణను కూడా అర్థం చేయించారు. మీరు బ్రాహ్మణులు, బ్రాహ్మణీలు. బ్రాహ్మణి మరియు భ్రమరము యొక్క ప్రాస కలుస్తుంది. భ్రమరము ఏ పని చేస్తుందో, మీరు కూడా అదే చేస్తారు. ఇది అద్భుతము కదా. భ్రమరము ఉదాహరణ, తాబేలు ఉదాహరణ, సర్పము ఉదాహరణ, ఇవన్నీ శాస్త్రాలలో ఉన్నాయి. సన్యాసులు మొదలైనవారు కూడా ఈ ఉదాహరణలను ఇస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి ద్వారా ఇవన్నీ అర్థం చేసుకుంటున్నారు. అది భక్తి మార్గము. అక్కడ గతాన్ని గాయనము చేస్తారు, ఇక్కడ జరుగుతున్నదాని మహిమ తర్వాత జరుగుతుంది. ఈ సమయములోనే తండ్రి ఈ తనువులోకి వస్తారు, వీరిని (బ్రహ్మాను) భగవంతుడని అనరు. అలా అంటే, అది అంధవిశ్వాసము అవుతుంది. రాముడిని, కృష్ణుడిని భగవంతుడు అని భావించే మనుష్యులు కూడా ఉన్నారు. కృష్ణుడిని, రాముడిని కూడా సర్వవ్యాపి అని అనేస్తారు. కొందరు కృష్ణుని భక్తి సాంప్రదాయము వారు ఉంటారు, కొందరు రాధా భక్తి సాంప్రదాయము వారు ఉంటారు. రాధా భక్తి సాంప్రదాయము వారు, అంతటా రాధయే రాధ అని అంటారు. కృష్ణుని భక్తి సాంప్రదాయము వారు, ఎక్కడ చూసినా కృష్ణుడే కృష్ణుడని అంటారు. రాముని భక్తి సాంప్రదాయము వారు అంతటా రాముడే రాముడని అంటారు. రాముడు కృష్ణుడి కన్నా పెద్దవారని భావిస్తారు, ఎందుకంటే రాముడిని త్రేతాలోకి, కృష్ణుడిని ద్వాపరములోకి తీసుకువెళ్ళారు. ఎంతటి అజ్ఞానము. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. ఎంతమంది బ్రహ్మాకుమార-కుమారీలు ఉన్నారు, తప్పకుండా అనంతమైన తండ్రి ఉంటారు. ప్రజాపిత బ్రహ్మా పేరును ఎప్పుడైనా విన్నారా అని మీరు ఎవరినైనా అడగవచ్చు. తండ్రి స్వర్గము యొక్క కొత్త రచనను రచించారు. బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులని అంటూ ఉంటారు కూడా. ఎప్పటివరకైతే బ్రాహ్మణులైన మీరంతా బ్రహ్మా ముఖవంశావళిగా అవ్వరో, అప్పటివరకు తాతగారి నుండి వారసత్వాన్ని తీసుకోలేరు. అనంతమైన పిల్లలు తండ్రి నుండే అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటారు. తప్పకుండా తీసుకున్నారు, తప్పకుండా స్వర్గవాసులుగా ఉండేవారు. ఇప్పుడు నరకవాసులుగా అయిపోయారు, ఇప్పుడు మళ్ళీ ప్రజాపిత బ్రహ్మా ద్వారా పరమపిత పరమాత్మ విష్ణుపురి అయిన స్వర్గాన్ని రచిస్తున్నారు. ఇది ఎంత సహజము. ఇంతకుముందు మీకు ఈ జ్ఞానముండేదా అని శివబాబా అడుగుతారు. వీరి ఆత్మ చెప్తుంది - నాలో ఈ జ్ఞానముండేది కాదు, నేను కూడా విష్ణువు పూజారిగా ఉండేవాడిని. ఒకప్పుడు పూజ్యులుగా ఉన్న మనము ఇప్పుడు పూజారులుగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చి పూజారుల నుండి పూజ్య దేవతలుగా తయారుచేస్తున్నారు. పిల్లలైన మీకు లోలోపల సంతోషము ఉండాలి. పరమపిత పరమాత్మ వచ్చి మనల్ని దత్తత తీసుకున్నారు. మనుష్యులు, మనుష్యులను దత్తత తీసుకుంటారు కదా. చాలామందికి తమకంటూ పిల్లలు లేకపోతే దత్తత తీసుకుంటారు. ఇప్పుడు తండ్రికి తెలుసు - నా పిల్లలందరూ రావణుడికి చెందినవారిగా అయిపోయారు, అందుకే నేను వచ్చి మళ్ళీ దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. బ్రహ్మా ద్వారా తమ పిల్లలను దత్తత తీసుకుంటారు. ఈ దత్తత ఎంత అద్భుతమైనది. శివబాబా మనల్ని బ్రహ్మా ద్వారా దత్తత తీసుకున్నారని మీకే తెలుసు. శివబాబా అంటారు - మీకు అనంతమైన సుఖ వారసత్వాన్ని ఇచ్చేందుకు నేను పిల్లలైన మిమ్మల్ని దత్తత తీసుకున్నాను. ఈ బ్రహ్మా అయితే ఇవ్వలేరు. వీరు కూడా మనిషే కదా. ప్రజాపిత బ్రహ్మా. మనుష్యులు ఈ జ్ఞానాన్ని ఇవ్వరు. జ్ఞానసాగరుడైన నిరాకార పరమపిత పరమాత్మయే కూర్చుని ఈ జ్ఞానాన్ని ఇస్తారు. బ్రహ్మాను లేక విష్ణువును జ్ఞానసాగరుడని అనరు. ఈ ముగ్గురి మహిమ వేర్వేరు. జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు ఒక్క తండ్రే. మొత్తము ప్రపంచములోని మనుష్యమాత్రులందరూ వారిని పిలుస్తారు. ఇంగ్లీషులో కూడా వారిని లిబరేటర్ (ముక్తిప్రదాత) అని అంటారు. ఎవరి నుండైతే దుఃఖము లభిస్తుందో, వారి నుండి విముక్తులుగా చేయడము జరుగుతుంది. తండ్రి కూడా ఇక్కడకు వచ్చి రావణుడి నుండి విముక్తులుగా చేస్తారు. రావణ రాజ్యము కూడా ఇక్కడే ఉంది. ఇక్కడే రావణుడిని కాలుస్తారు. కాల్చేసి, మళ్ళీ బంగారు లంకను దోచుకునేందుకు వెళ్తామని అంటారు. రావణుడు ఎవరు, ఎప్పటి శత్రువు అనేది వారికి ఏమీ తెలియదు. రాముని సీత అపహరించబడిందని అనుకుంటారు. మనమంతా సీతలమని, మనము రావణుడి జైలులో చిక్కుకుని ఉన్నామని వారు అర్థం చేసుకోరు. ఈ జ్ఞానము ఎవరిలోనూ లేదు, వారు కూర్చుని కథలను వినిపిస్తారు.
శివబాబా అంటారు - దూరదేశములో నివసించే నేను ఈ పరాయి దేశములోకి వచ్చాను. ఈ పతిత ప్రపంచము పాతది కదా, ఇది రావణుడి ప్రపంచము. ఓ బాబా రండి, మేము పతితముగా అయిపోయాము అని పిలుస్తారు కూడా. తండ్రి అంటారు, మిమ్మల్ని పావనముగా తయారుచేయడానికి నేను ఈ పతిత ప్రపంచములోకి రావలసి ఉంటుంది. ఎవరైతే మొదటి నంబరు పావనముగా ఉండేవారో, సుందరముగా ఉండేవారో, వారిలోకే నేను రావలసి ఉంటుంది, వారే ఇప్పుడు శ్యామముగా అయ్యారు. ఇవి ఎంత అద్భుతమైన విషయాలు. శ్రీకృష్ణుడిని శ్యామసుందరుడని ఎందుకు అంటారు, ఇది ఎవరికీ తెలియదు. కేవలం ఒక్క శ్రీకృష్ణుడినే సర్పము కాటు వేసిందా? సత్యయుగములో సర్పాలు మొదలైనవేవీ ఉండవు. తండ్రి అంటారు - ఈ అంతిమ జన్మలో నా కోసం పవిత్రముగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. కేవలం నన్ను స్మృతి చేయండి మరియు పవిత్రముగా అవ్వండి. భగవంతుడిని స్మృతి చేసినట్లయితే రాజ్యాధికార వారసత్వము మీదవుతుంది. ఇది సహజ రాజయోగము, సహజ రాజ్యాధికారము. బిడ్డ జన్మించగానే వారసత్వానికి హక్కుదారునిగా అవుతారు. మేము తండ్రికి చెందినవారిగా అయ్యాము కావున స్వర్గ రాజ్యాధికారానికి హక్కుదారులమని ఇక్కడ కూడా పిల్లలకు తెలుసు. ఇప్పుడు తండ్రి అంటారు - మీరు సతోప్రధానము నుండి తమోప్రధానముగా అయ్యారు, మళ్ళీ సతోప్రధానముగా అవ్వాలి. యోగము మరియు జ్ఞానము నేర్పించేందుకు ఒక్క క్షణము పడుతుంది. బిడ్డ జన్మించగానే వారసునిగా నిర్ణయిస్తారు. మీరు తండ్రికి చెందినవారిగా అయ్యారు కావున రాజధాని యొక్క వారసత్వము మీదే. కానీ అందరూ రాజు-రాణిగా అవ్వరు. ఇది రాజయోగము. రాజు-రాణి, ప్రజలు, షావుకారులు, పేదవారు అందరూ కావాలి, అందుకే రుద్రమాల కూడా తయారయ్యింది, ఈ మాలను భక్తి మార్గములో జపిస్తారు. మీరు రాజయోగాన్ని నేర్చుకునేందుకు వచ్చారని మీకు తెలుసు. మాతా-పితలను ఫాలో చేసి మొట్టమొదట సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా అవుతారు. ఎవరైతే మాతా-పితలను ఫాలో చేసి సింహాసనాధికారులుగా అవుతారో, వారే సుపుత్రులైన పిల్లలు. బాగా పురుషార్థము చేయాలి. నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తారు, కానీ స్మృతి చేయరు, శ్రీమతముపై నడవరు. లోపల సత్యత లేదు. మనసు సత్యముగా ఉన్నట్లయితే శ్రీమతముపై నడుస్తారు, తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. శ్రీమతము ఆధారముగానే మీకు తాతగారి నుండి వారసత్వము లభిస్తుంది. బ్రహ్మా స్వర్గ వారసత్వాన్ని ఇవ్వలేరు. తాతగారి సంపాదనపై మనవులకు హక్కు ఉంటుంది. తండ్రి సంపాదనకు పిల్లలు భాగస్వాములు అవుతారు కావున హక్కుదారులుగా అవుతారు. ఇక్కడ మీకు శివబాబా నుండి వారసత్వము లభిస్తుంది. జ్ఞాన రత్నాలు తండ్రి నుండే లభిస్తాయి.
బ్రాహ్మణులైన మనమే మళ్ళీ దేవీ-దేవతలుగా అవుతామని మీకు తెలుసు. జగదంబ ఎవరు? తండ్రి అర్థం చేయిస్తున్నారు - వారు బ్రాహ్మణి, జ్ఞాన-జ్ఞానేశ్వరిగా ఉండేవారు, తర్వాత రాజరాజేశ్వరిగా అవుతారు. మీరు కూడా అలా తయారవుతారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఆత్మలో తమోప్రధానతతో కూడిన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, వాటిని స్మృతి బలముతో పరివర్తన చేసుకోవాలి. సతోప్రధానముగా అవ్వాలి.
2. తండ్రి నుండి రాజ్యాధికారము యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు సదా సుపుత్రులైన పిల్లలుగా అయి శ్రీమతముపై నడవాలి. సత్యమైన తండ్రితో సత్యముగా ఉండాలి. తల్లి-తండ్రిని పూర్తిగా ఫాలో చేయాలి. జ్ఞాన రత్నాలను దానము చేస్తూ ఉండాలి.
| వరదానము:- |
తమ పరివర్తన ద్వారా నిరంతరం విజయము యొక్క అనుభూతిని చేసే సత్యమైన సేవాధారీ భవ ఏ విధముగా నిరంతర యోగులుగా అయ్యారో, అదే విధముగా నిరంతర విజయులుగా అవ్వండి, అప్పుడు సత్యమైన సేవాధారులుగా అవుతారు ఎందుకంటే విజయీ ఆత్మ, ఎప్పుడైతే ప్రతి సంకల్పములో, ప్రతి అడుగులో విజయాన్ని అనుభవం చేస్తుందో, అప్పుడు వారి పరివర్తనను చూసి అనేకాత్మల సేవ స్వతహాగానే జరుగుతుంది. వారి నయనాలు ఆత్మికతను అనుభవం చేయిస్తాయి, వారి నడవడిక తండ్రి చరిత్రను సాక్షాత్కారము చేయిస్తుంది, వారి మస్తకము నుండి మస్తకమణి యొక్క సాక్షాత్కారము జరుగుతుంది. ఈ విధముగా తమ అవ్యక్త ముఖము ద్వారా సేవ చేసే విశేష ఆత్మనే సత్యమైన సేవాధారి అని అంటారు. |
| స్లోగన్:- | విశేషతలు మరియు గుణాలు దాత ఇచ్చినటువంటి ప్రసాదము, దాతను చూడండి, వ్యక్తిని కాదు. |
అవ్యక్త ప్రేరణలు - ‘‘సదా అచంచలమైన, స్థిరమైన, ఏకరస స్థితిని అనుభవము చేయండి’’
ఆత్మిక స్థితి యొక్క అభ్యాసము ద్వారా వాయుమండలాన్ని ఆత్మికముగా తయారుచేసినట్లయితే ఇతర విషయాలన్నీ స్వతహాగా సరి అయిపోతాయి, అందరూ ఏకమతముగా మరియు ఏకరసముగా అయిపోతారు, అప్పుడిక మాయ కూడా రాదు ఎందుకంటే వాయుమండలము శక్తిశాలిగా ఉంటుంది. వాయుమండలాన్ని శక్తిశాలిగా చేసేందుకు స్మృతి యొక్క ప్రోగ్రామును పెట్టండి మరియు పరస్పరములో ఉన్నతి కోసం ఆత్మిక సంభాషణకు సంబంధించిన క్లాసులు చేసుకోండి, స్నేహ మిలనాన్ని జరుపుకోండి, ధారణా క్లాసులు పెట్టుకోండి, అప్పుడు సఫలత లభిస్తుంది.