| 24-05-2026 |
ప్రాత:మురళి
ఓంశాంతి
‘‘అవ్యక్త బాప్ దాదా’’
|
రివైజ్ 28-02-2010 మధువనం |
‘‘దేహ భానము యొక్క ‘నేను-నేను’ అనే హోలీని కాల్చివేసి పరమాత్మ సాంగత్యము అనే రంగుల హోలీని జరుపుకోండి’’
ఈ రోజు హోలియెస్ట్ బాబా తమ హోలీ పిల్లలతో హోలీని జరుపుకోవడానికి వచ్చారు. నలువైపులా ఉన్న పిల్లలు దూరదూరాల నుండి స్నేహముతో హృదయములో ఇమిడిపోతున్నారు. బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లల మస్తకములో భాగ్య సితారను మెరుస్తూ ఉండటాన్ని చూస్తున్నారు. ఇంత గొప్ప భాగ్యము పూర్తి కల్పములో మరెవ్వరికీ ఉండదు. ఈ సంగమయుగ ప్రాప్తుల ఆధారముగా పిల్లలైన మీరే ఇంతటి శ్రేష్ఠమైనవారిగా, పవిత్రులుగా అవుతారు, దీని ద్వారా భవిష్యత్తులో మీరు డబల్ పవిత్రులుగా అవుతారు. ఆత్మ కూడా పవిత్రముగా అవుతుంది మరియు శరీరము కూడా పవిత్రము అవుతుంది. పూర్తి కల్పమంతా తిరిగి చూడండి, ఏ ధర్మాత్మ కూడా డబల్ పవిత్రముగా అవ్వలేదు. పిల్లలైన మీరు డబల్ పవిత్రులుగా కూడా అవుతారు మరియు డబల్ పవిత్రతకు గుర్తు - డబల్ కిరీటధారిగా అవ్వడము.
ఈ రోజు అందరూ హోలీని జరుపుకుంటారు కానీ ఈ సమయములో మీరు డబల్ హోలీగా అనగా పవిత్రముగా అయినందుకు దానికి స్మృతిచిహ్నముగా ఉత్సవ రూపములో హోలీని జరుపుకుంటున్నారు. మీ యొక్క అడుగు-అడుగును, జీవిత మహత్వాన్నే ఉత్సవము రూపములో జరుపుకుంటారు. మీరు ఈ సంగమములో ప్రతి రోజు, ప్రతి అడుగు ఉల్లాసము మరియు ఉత్సాహములో ఉంటారు, కనుక మీ ఉల్లాస-ఉత్సాహాలకు స్మృతిచిహ్నముగా ఈ ఉత్సవాన్ని జరుపుకోవడము జరుగుతుంది. ఉల్లాస-ఉత్సాహాలు ఎందుకు ఉంటాయి? ఎందుకంటే మీరు పరమాత్ముని సాంగత్యపు రంగు యొక్క హోలీని జరుపుకుంటారు. కావున మీ ప్రతి అడుగును ఉత్సవ రూపములో జరుపుకుంటారు. మామూలుగా హోలీలో ముందుగా కాలుస్తారు, ఆ తర్వాత జరుపుకుంటారు. మీరు కూడా సంగమములో ఇప్పుడు మీ పాత సంస్కార-స్వభావాలను యోగాగ్నిలో కాలుస్తారు ఎందుకంటే మీలోని పాత సంస్కారాలను కాల్చనంత వరకు పరమాత్ముని సాంగత్యపు రంగు అంటుకోదు, పరమాత్మ మిలనము జరుగదు. అంటే మీరు యోగాగ్నిలో సంస్కారాలను కాల్చివేసారు, ఆ తర్వాత పరమాత్ముని సాంగత్యపు రంగులో నిమగ్నమయ్యారు. ఈ రోజుల్లో కాలుస్తున్నారు కూడా మరియు రంగులు కూడా వేసుకుంటున్నారు, వారు మీ ఆధ్యాత్మిక రూపానికి స్థూల రూపాన్ని ఇచ్చారు. వారు స్థూలమైన అగ్నిని వెలిగిస్తారు, స్థూలమైన రంగులు వేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు దేహాభిమాన వృత్తి ఉంది. మీరు హోలీగా అవుతారు మరియు వారు హోలీని జరుపుకుంటారు. పూర్తి కల్పములో ఎవ్వరూ కూడా ఆధ్యాత్మిక హోలీని జరుపుకుని డబల్ హోలీగా అవ్వలేదు. మరి మీరందరూ, ఎవరు ఎక్కడి నుండి వచ్చినా కానీ పరమాత్ముని సాంగత్యపు హోలీలోకి వచ్చారు. పరమాత్ముని సాంగత్యపు హోలీని జరుపుకోవడానికి వచ్చారు. హోలీ గురించి మీరు ఏమంటారంటే - హోలీ అనగా ఏదైతే గడిచిపోయిందో అది హో లీ (గడిచిపోయింది). డ్రామా అనుసారముగా ఏదైతే గడిచిపోయిందో దానిని హో లీ అని అంటారు, గడిచిపోయిందేదో గడిచిపోయింది. ఏ విధమైన వ్యర్థ విషయాన్నీ మనసులోకి తీసుకోరు, అది గడిచిపోయింది, ఇటువంటి హోలీని జరుపుకుంటూ ఉంటారు కదా. మీరందరూ హోలీగా అయ్యే అనగా పవిత్రముగా అయ్యే పూర్తి పురుషార్థాన్ని చేసి పవిత్రతను ధారణ చేసారు, అందుకే భవిష్యత్తులో మీకు డబల్ పవిత్రతకు గుర్తుగా డబల్ కిరీటాన్ని చూపిస్తారు.
ఈ రోజు పిల్లలైన మీరు ప్రతి ఒక్కరూ దేనిని కాల్చి వెళ్తారు? జన్మదినము రోజున బాప్ దాదా ఏదైతే హోమ్ వర్క్ ఇచ్చారో - క్రోధాన్ని జన్మదినము రోజున జన్మదిన కానుకగా ఇచ్చేయండి అని, దాని రిజల్టు ఈ రోజు కొంతమంది పిల్లల నుండి బాప్ దాదా వద్దకు చేరుకుంది. అక్కడక్కడ కొందరు పిల్లలు అటెన్షన్ పెట్టినట్లుగా బాప్ దాదా చూసారు. మీరందరూ కూడా మీ మీ రిజల్టును చూసుకుని ఉంటారు. ఈ రోజు ఎవరెవరైతే కూర్చుని ఉన్నారో, ఎవరైతే తమ రిజల్టును చూసుకున్నారో, ఎవరికైతే రిజల్టులో క్రోధాన్ని కంట్రోల్ చేసుకున్నట్లు కనిపిస్తుందో, మరియు సఫలతను అనుభవం చేసారో, వారు చేతులెత్తండి. సఫలతను ప్రాప్తి చేసుకున్నారా! చేతులు పైకి ఎత్తండి. టీచర్లు చేతులెత్తండి, విదేశీయులు చేతులెత్తండి. (అందరూ చేతులెత్తారు) అచ్ఛా! అభినందనలు! ఇందులో మీరందరూ ధైర్యము ఉంచారు మరియు ధైర్యానికి ప్రతిఫలం లభిస్తుంది అని అనుభవం చేసారు. మరి ఈ అనుభవముతో భవిష్యత్తు కోసం కూడా లక్ష్యము పెట్టుకుని పదే-పదే చెకింగ్ చేసుకుంటూ దీనిని ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటే, అది సంభవమేనని మీరు భావిస్తున్నారా? సంభవమేనా? మున్ముందు కూడా చెయ్యగలరా? వారు చేతులెత్తండి. అచ్ఛా. వీలవుతుందా? టీచర్స్ వీలవుతుందా? పాండవులు వీలవుతుందా? అచ్ఛా! సంభవమవుతుందా లేదా అవ్వాల్సిందేనా, దీని కోసం చప్పట్లు కొట్టండి. అచ్ఛా! ఈ సారి ఎక్కువ రోజులు అవ్వలేదు కానీ ఇప్పుడు ప్రతి మూడు నెలలకు ఒకసారి, ఈ రోజు నుండి మూడు నెలలు అటెన్షన్ పెట్టి క్రోధము యొక్క టెన్షన్ ను సమాప్తము చెయ్యగలరా? చెయ్యగలరా? వారు చేతులెత్తండి. అచ్ఛా. ఇదైతే చాలా మంచి శుభవార్త, ఎందుకని? క్రోధానికి కారణమేమిటి? క్రోధానికి బీజము ఏమిటి? మీరు సదా మీ భవిష్య స్వరూపాన్ని మీ ముందు ఉంచుకోండి, మీ భవిష్య స్వరూపము ఎంతగా అలంకరించబడి హర్షిత ముఖముగా ఉంటుంది. బాప్ దాదాను చూడండి, అందులోనూ బ్రహ్మాబాబాను ఎదురుగా తెచ్చుకోండి. ఎందుకని? శివబాబా అయితే ఎలాగూ నిరాకారుడే కానీ బ్రహ్మాబాబా మీలా సాకార రూపధారి, మీలా బాధ్యతా కిరీటాన్ని ధరించినవారు, అయినప్పటికీ సదా చిరునవ్వుతో కూడిన ముఖము, సంతోషకరమైన ముఖము ఉండేది, ఎందుకంటే ఈ వికారాలపై విజయాన్ని పొంది, శరీరముతో కార్యము చేస్తూ కూడా మీ ఎదురుగా ఉదాహరణగా నిలిచారు. మీకు బ్రహ్మాబాబా కన్నా ఎక్కువ బాధ్యతలు ఉన్నాయా? బ్రహ్మాబాబాకు ఉన్న బాధ్యతల ముందు మీకున్న బాధ్యతలు అసలేమీ కాదు. మరియు చివరికి కర్మాతీత వైబ్రేషన్లలో ఉంటూ అవ్యక్త ఫరిశ్తాగా అయిపోయారు. మరి ఇప్పుడు బాప్ దాదాకు ఇచ్చిన కానుకను తిరిగి తీసుకోరు కదా! కార్య వ్యవహారాలలోకి వచ్చినప్పుడు ఒక్కోసారి అటువంటి పరిస్థితులు వస్తుంటాయి అని బాప్ దాదా అర్థం చేసుకోగలరు. అప్పుడప్పుడూ పెద్ద గొంతు అవుతుందని, మూడ్ లో కొద్దిగా ఆవేశము వస్తూ ఉంటుంది అని కొందరు రిజల్టులో కూడా వ్రాశారు. కానీ ఎప్పుడైతే ఇటువంటి విషయాలు ఎదురుగా వస్తాయో, అప్పుడే విజయులుగా అవ్వడానికి అవకాశము ఉంటుంది. పరిస్థితుల పని రావడము కానీ మీకున్న జ్ఞానము పరిస్థితులను దాటుకుని విజయులుగా కావడము. మరి ఇష్టమేనా? క్రోధానికి వీడ్కోలు ఇస్తారా, సదా కోసమా లేక కేవలం మూడు నెలల కోసమేనా? ఎంత సమయము కోసం ధైర్యముంది? సదా కోసం క్రోధముక్తులుగా అవ్వడము కష్టము కాదు, అవ్వాల్సిందే అని భావించేవారు చేతులెత్తండి. అవ్వాల్సిందే. అచ్ఛా. బాప్ దాదా సంతోషిస్తున్నారు, ఎందుకని? మీ చివరి జన్మలో కూడా మీ మహిమను ఏమని గానము చేస్తారు? మీ దేవతా రూపము ఎదుట మీరు సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులు అని మీ మహిమను పాడుతారు. సంగమయుగములో మీరు ఇలా అయ్యే పాత్రకే గాయనము ఉంది.
బాప్ దాదా హృదయములో ఒక విశేషమైన ఆశ ఉంది, చెప్పమంటారా? తల ఊపండి, చెప్పమంటారా? బాప్ దాదా ఇప్పటినుండి, ఇప్పటినుండే పిల్లలు ప్రతి ఒక్కరినీ సదా వికసించి ఉన్న గులాబి పుష్పము వలె చూడాలని కోరుకుంటున్నారు. భాగ్యశాలిగా, సంతోషముగా చూడాలని కోరుకుంటున్నారు. పరిస్థితుల పని రావడము, ఇది కూడా అర్థం చేసుకోండి. విషయాలు వస్తాయి, కానీ మీ లక్ష్యాన్ని లక్షణాలలోకి తీసుకురావాలి. భయపడకండి. బ్రహ్మాకుమారీలు పవిత్రతా పాఠాన్ని చాలా నేర్పిస్తారు అని ఎలా అయితే ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారో, అలాగే బ్రహ్మాకుమారీలు క్రోధముక్తులుగా చేస్తారు అన్నది ప్రసిద్ధమవ్వాలి, ఎందుకంటే క్రోధము నుండి ముక్తులవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. ఒత్తిడి కలుగుతుంది కదా! ఒత్తిడి కలుగుతుంది కనుక అందరూ దాని నుండి విముక్తులవ్వాలని కోరుకుంటారు కానీ వారికి విధి తెలియదు. ఏ విధముగా పవిత్రముగా ఉండటం అసంభవమని భావించేవారో, కానీ ఇప్పుడు మీ అందరి అనుభవము యొక్క ఆధారముతో అది సాధ్యమవుతుంది అని ఎలా అయితే భావిస్తున్నారో, అలాగే ఇప్పుడు ఈ సంవత్సరము - క్రోధజీతులుగా అవ్వడము సంభవమే, అది కష్టమేమీ కాదు అన్న అలను వ్యాప్తి చేయండి. ఇటువంటి ఉదాహరణ యొక్క అనుభవాన్ని ప్రాక్టికల్ గా స్టేజిపైకి తీసుకురండి. చాలామంది పిల్లలు కార్యాలన్నీ చేస్తూ కూడా క్రోధజీతులుగా అవ్వడాన్ని బాప్ దాదా చూసారు. ఇటువంటి ఉదాహరణలు మీ పరివారములో, బ్రాహ్మణ పరివారములో తయారయ్యారు. మరి ఈ సంవత్సరము ఏం చేస్తారు? హోలీని జరుపుకోవడానికి వచ్చారు కదా! హోలీలో ఏమి చేస్తారు? ఏదైనా కాలుస్తారు కదా! మరి ఈ నాటి హోలీలో మీరు ఏం కాలుస్తారు? క్రోధాన్ని అయితే కాల్చేసారు, దీనిని పక్కా చేస్తారా! కానీ బాప్ దాదా ఏమి చూసారంటే - ఒత్తిడిలోకి రావడానికి కారణము దేహాభిమానముతో కూడిన ‘నేను’ అన్న పదము. దేహభానానికి సంబంధించిన ‘నేను’. ఒకటి - నేను ఆత్మను, ఈ ‘నేను’ అన్నది ఉంది. మరొకటి దేహభానపు ‘నేను’ అన్న పదము అభిమానముతో కూడినది కూడా ఉంటుంది, అవమానముతో కూడినది కూడా ఉంటుంది మరియు నిరాశతో కూడిన నేను-నేను అనేది కూడా కింద పడేస్తుంది. మరి ఈ రోజు క్రోధాన్ని జయించే విషయములో ముందుకు వెళ్ళేందుకు దేహాభిమానపు ‘నేను’ అన్నదానిని యోగాగ్నిలో కాల్చివేయండి. అనేక రకాల నేను-నేను అనేవాటిని కాల్చివేయండి మరియు ఒక్క నేను ఆత్మను అనే ఈ ‘నేను’ అన్న పదాన్ని పక్కా చేసుకోండి. మిగతా అన్ని ‘నేను’ అన్నవాటిని ఈ రోజు యోగాగ్నిలో కాల్చేసి వెళ్ళండి. అనేక రకాల ‘నేను’ అనేవి ఉన్నాయి కదా. కనుక ఈ రోజు కాల్చివేసే హోలీని జరుపుకోండి! ఎందుకంటే క్రోధానికి కారణమేమిటంటే, చాలా ఎక్కువ ఒత్తిడి ఉండటము. కనుక ఈ ‘నేను’ అన్నదానిని సమాప్తము చేసేందుకు ఈ రోజు మీ లోపల సంకల్పము తీసుకోండి. కాల్చివేయాలి ఎందుకంటే ఇది కూడా భారమే కదా. ట్రైన్ లో వెళ్ళండి, విమానములో వెళ్ళండి, కానీ ఈ భారాన్ని ఇక్కడే కాల్చివేసి వెళ్ళండి. కాల్చగలరా? పిల్లల ధైర్యము ఉంటే తండ్రి సహాయము తోడుగా ఉండనే ఉంది అని ఎవరైతే భావిస్తున్నారో, విజయము కూడా మీతోపాటే ఉంది. నేను విజయీగా అవ్వాల్సిందే అని ఎవరైతే భావిస్తున్నారో, వారు చేతులెత్తండి. అవ్వాల్సిందే, అచ్ఛా. ఈ రోజు ఎవరైతే వి.ఐ.పి.లు వచ్చారో, వారు చేతులు ఎత్తుతున్నారు. వి.ఐ.పి.లు ఎవరైతే వచ్చారో, వారు లేవండి, నిలబడండి. చేతులు ఎత్తుతున్నారు. చప్పట్లు కొట్టండి కదా. విజయులుగా అవుతారా? చూడండి. ఎవరైతే విజయులుగా అవుతారో వారికి ఒక్కొక్కరికీ మాలను వేస్తున్నాము. అభినందనలు, అభినందనలు. అచ్ఛా. ఇప్పుడు వచ్చిన వి.ఐ.పీ.లు అందరూ ధైర్యము కలవారు, అందుకే బాప్ దాదా వరదానాన్ని ఇస్తున్నారు. ఈ సమయములో మీరందరూ వి.ఐ.పి.లుగా ఏ కారణము చేతనైనా అయి ఉండవచ్చు ఈ జన్మలో, బాప్ దాదా ధైర్యము కలిగిన పిల్లలైన మిమ్మల్ని ఇప్పుడు వి.ఐ.పి అని అనరు, పిల్లలు అని అంటారు. బాప్ దాదా ఈ వరదానాన్ని ఇస్తున్నారు, గ్యారంటీ ఇస్తున్నారు - మీరందరూ 21 జన్మలు వి.ఐ.పి.లు అవుతారు. ఇక్కడిలా ఎలక్షన్లు, సెలక్షన్లు జరగవు. అందరూ కేవలం ఒక్క విషయాన్ని మాత్రం వదలకండి. ఎలా అయితే ఇప్పుడు సంబంధ-సంపర్కములోకి వచ్చారో, అలా ఈ బ్రాహ్మణ పరివారము యొక్క కనెక్షన్ ను విడిచిపెట్టకండి. ఎంతగా కనెక్షన్ ను పెట్టుకుంటారో అంతగా రిలేషన్ పక్కాగా ఉంటుంది మరియు బాబా వరదానాన్ని తప్పకుండా పొందుతారు. మరి సమ్మతమేనా? కనెక్షన్ పెట్టుకోవడము సమ్మతమేనా? చేతులెత్తండి. అచ్ఛా. (బాప్ దాదా పూలమాలను తీసుకుని ముందుకు అందించారు) ఈ మాలను మీరందరూ వేసుకోండి.
పిల్లలైన మీరందరూ కొత్తవారు, రియల్ గోల్డ్ పిల్లలు, మీరు సదా బాబాకు ఆజ్ఞాకారులు కదా! కనుక ఈ రోజు ఈ ‘నేను’ అన్నదానిని కాల్చేసే వెళ్ళండి. మొదటిసారి వచ్చినవారు లేవండి. అచ్ఛా. బాప్ దాదా మొదటిసారి వచ్చిన పిల్లలకు మొదటిసారి వచ్చినందుకు పదమాల రెట్లు అభినందనలను ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఎలా అయితే మొదటిసారి వచ్చారో, అలాగే మొదటి నంబరులోకి, మొదటి డివిజన్ లోకి రావాలి. మొదటి నంబరు అయితే ఫిక్స్ అయిపోయింది. మొదటి డివిజన్ లోకి వస్తారా, ఈ ధైర్యము ఉందా? ఎవరికైతే ధైర్యము ఉందో, వారు చేతులెత్తండి. చూడండి, ఆలోచించి చేతులెత్తండి. అచ్ఛా. మేము లాస్ట్ లో వచ్చాము కానీ ఫాస్ట్ గా వెళ్తాము అన్న లక్ష్యాన్ని పెట్టుకోండి, ఎందుకంటే సమయముపై ఎటువంటి నమ్మకము లేదు. ఇప్పుడు ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో, దానిని తీవ్ర పురుషార్థులుగా అయ్యి చేయండి ఎందుకంటే బహుకాలపు పురుషార్థాన్ని మీరందరూ కొద్ది సమయములోనే పూర్తి చెయ్యవలసి ఉంటుంది. మరి ధైర్యముందా? ధైర్యముందా? చేతులెత్తండి. చూడండి, మీ ఫోటోను తియ్యడము జరుగుతుంది. బాప్ దాదా ఇటువంటి ధైర్యవంతులకు అభినందనలు ఇస్తున్నారు - ధైర్యము మీది, సహాయము బాబాది. కానీ ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు. మీ భాగ్య సితారను సదా మెరిసేలా ఉంచండి ఎందుకంటే ఈ జన్మలో చేసే తీవ్ర పురుషార్థము, పురుషార్థము కాదు తీవ్ర పురుషార్థము అనేక జన్మల భాగ్యాన్ని తయారుచేస్తుంది, అందుకే ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకండి. పరిస్థితులు వస్తాయి, కానీ పరిస్థితి మహావీర్ కాదు, మీరు సర్వశక్తివంతుని పిల్లలు, మీ ముందు పరిస్థితి ఏపాటిది! పరిస్థితి వస్తుంది మరియు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేదాని వెనుక మీ అదృష్టాన్ని పోగొట్టుకోవద్దు. అచ్ఛా, కూర్చోండి. బాప్ దాదా అందరికీ స్నేహముతో అభినందనలు తెలియజేస్తున్నారు, ఏ విషయానికి? ధైర్యము ఉంచారు. బాప్ దాదా ప్రతి బిడ్డ తీసుకున్న ధైర్యముతో కూడిన సంకల్పానికి సంతోషిస్తున్నారు. మరి హోలీని జరుపుకున్నారా? కాల్చివేసే హోలీనైతే జరుపుకున్నారు మరియు పరమాత్ముని సాంగత్యపు రంగు యొక్క హోలీని కూడా జరుపుకున్నారు. కాల్చేసారు కూడా, జరుపుకున్నారు కూడా.
ఇప్పుడు బాప్ దాదా పిల్లలందరి చేత ఒక డ్రిల్ ను చేయించాలని అనుకుంటున్నారు ఎందుకంటే నలువైపులా పరిస్థితులు ఉన్నాయి. ఒక్కో చోట ఒక్కో పరిస్థితి ఉంది. ఇలా నలువైపులా ఉన్న పరిస్థితుల మధ్యన మీరు ఒక్క సెకండులో ఏకాగ్రమవ్వగలరా? ఇటువంటి అభ్యాసాన్ని స్వయములో అనుభవం చేస్తున్నారా? లేక ఒకవేళ మీకు ఏ కారణము వలనైనా ఏ విషయము గురించైనా వ్యర్థ సంకల్పాల తుఫాను వచ్చినట్లయితే, అటువంటి సమయములో మీరు మీ మనసు, బుద్ధిని ఏకాగ్రము చెయ్యగలరా? ఈ ఏకాగ్రతా శక్తి యొక్క డ్రిల్ ను అవసరమైన సమయములో చేసి చూసారా? ఒకవేళ ఇటువంటి సమయములో ఒక్క సెకండులో ఏకాగ్రతా శక్తి కార్యములోకి రాకపోతే మున్ముందు అటువంటి పరిస్థితి మళ్ళీ-మళ్ళీ వస్తుంది. ఈ రోజు బాప్ దాదా సెకండులో ఫుల్ స్టాప్ అనగా ఏకాగ్ర స్థితి యొక్క అభ్యాసముపై అటెన్షన్ ను ఇప్పించాలనుకుంటున్నారు ఎందుకంటే ప్రకృతి తన భిన్న-భిన్న రంగులను చూపించడము ప్రారంభించింది. నలువైపులా ఏమేమి జరుగుతున్నాయి అన్నది మీకు బాగా తెలుసు. మనసు, బుద్ధిని భ్రమింపజేసే విషయాలు రావలసిందే. మరి ఇప్పుడు మీ మనసును, బుద్ధిని ఒక్క క్షణములో పరంధామములో స్థితి చెయ్యగలరా! ఇప్పుడు మిమ్మల్ని మీరు ఫరిశ్తా రూపములో స్థితి చెయ్యండి. బ్రాహ్మణాత్మనైన నేను మాస్టర్ సర్వశక్తివంతుని స్థితిలో ఉన్నాను, అని ఇప్పుడు ఈ మాస్టర్ సర్వశక్తివంతుని స్థితిలో స్థితులవ్వండి. (బాప్ దాదా డ్రిల్ చేయించారు) ఇటువంటి అభ్యాసాన్ని రోజంతా, సమయము లభించినప్పుడల్లా, పదే-పదే మనసును ఏకాగ్రము చేసి చూడండి. ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా, మనసు ఏకాగ్రమవ్వాలి. పురుషార్థము ఒక్క నిమిషము పట్టినా, ఒక్క సెకండులో ఫుల్ స్టాప్ పడాలి, ఎందుకంటే అలజడుల సమయము ఇప్పుడు తయారవుతుంది, అందుకే మైండ్ కంట్రోల్ - మనసు నాది, నేను మనసును కాదు, నా మనసు - మరి నా అన్నదానిపై నాకు కంట్రోల్ ఉందా? ఈ డ్రిల్ చాలా అవసరము.
ఎవరెవరైతే వచ్చారో, బాప్ దాదాకు ఒక్కొక్క బిడ్డ ప్రియమైనవారు. ఎందుకని? ఎలా ఉన్నా కానీ బాప్ దాదా ప్రతి బిడ్డను కోట్లలో కొద్దిమంది అయిన ఆత్మగా చూస్తారు. పురుషార్థములో బలహీనముగా ఉన్నా కానీ బాబాకు ప్రియమైనవారిగా అయ్యారు. మనస్ఫూర్తిగా నా బాబా అని అంటారు, అందుకే బాబాకు కూడా అతి ప్రియమైనవారు. బాప్ దాదా కేవలం ఒక్క విషయాన్ని మళ్ళీ గుర్తుకు తెప్పిస్తున్నారు - మీ ముఖము సదా సంతోషముగా, సంతోషముతో మెరుస్తూ ఉండాలి. పరిస్థితులు వెళ్ళిపోవాలే కానీ సంతోషము పోకూడదు. సంగమయుగ సంతోషము పరమాత్ముని కానుక. హోలీ అనగా ఇలాంటి విషయాలు ఏవైనా వచ్చినా కానీ హోలీని జరుపుకుని వచ్చాము, పరిస్థితి హో లీ అయిపోవాలి (గడిచిపోవాలి) కానీ సంతోషము పోకూడదు అని గుర్తుంచుకోండి. పరమాత్మ ఇచ్చిన కానుక, ఖజానా సంతోషము.
బాప్ దాదా సదా అంటారు - సంతోషముగా ఉండాలి మరియు సంతోషాన్ని పంచాలి అన్న స్లోగన్ సదా గుర్తుండాలి. సంతోషాన్ని ఎంతగా పంచుతారో, అది అంతగా పెరుగుతుంది, అంతేకాక సంతోషకర ముఖము నడుస్తూ-తిరుగుతూ కూడా ఆటోమేటిక్ గా సేవ చేస్తూ ఉంటుంది. వీరికి ఏమి లభించింది అని చూసిన వారందరూ ఆలోచిస్తారు. మరి ఈ రోజు హోలీ సందర్భముగా సంతోషమనే దిల్ ఖుష్ మిఠాయిని స్వీకరించండి. అందరూ తిన్నారా? సదా తింటూ ఉండండి. దీనితో ఎటువంటి అనారోగ్యము రాదు. అచ్ఛా.
బాప్ దాదా మళ్ళీ సూచనను ఇస్తున్నారు - స్వ పురుషార్థము. స్వ పురుషార్థముతో స్వ ఉన్నతి మరియు సేవా ఉన్నతి, రెండింటి వైపు అటెన్షన్ పెడుతూ వెళ్ళండి, ముందుకు వెళ్తూ ఉండండి మరియు సదా ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి. అచ్ఛా.
నలువైపులా ఉన్న బాప్ దాదా స్నేహములో ఇమిడిపోయి స్మృతి మరియు సేవలో ఇంకా, ఇంకా ముందుకు వెళ్ళేవారు మరియు ముందుకు తీసుకువెళ్ళేవారు, అమృతవేళను చాలా బాగా శక్తిశాలిగా తయారుచేసుకునేవారు మరియు మనసా సేవ ద్వారా దయార్ద్ర హృదయులుగా, దయాళువుగా, కృపాళువుగా అయి ఆత్మలకు ఏదో ఒక అంచలిని ఇచ్చేవారు, మీ ఈ విధిని ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. ప్రతి బిడ్డ ఉల్లాస-ఉత్సాహాలలో ఉండటాన్ని బాప్ దాదా చూస్తుంటారు, కానీ ఇప్పుడు దేనిని జోడించాలి? సదా అన్న పదాన్ని జోడించాలి. అప్పుడప్పుడూ అన్న పదాన్ని డిక్షనరీ నుండి తీసేసెయ్యండి. మరి నలువైపులా ఉన్న పిల్లలు హోలీని కూడా జరుపుకున్నారు, కాల్చేసారు కూడా మరియు సాంగత్యపు రంగును కూడా వేసుకున్నారు, గతించిపోయిందేదో గతించిపోయింది అన్న హోలీని కూడా జరుపుకున్నారు, అందుకే బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లలను సమ్ముఖముగా హృదయములో చూస్తున్నారు. బాప్ దాదా యొక్క పదమాల, పదమాల రెట్లు ప్రియస్మృతులు మరియు నమస్తే.
| వరదానము:- |
సదా ఆజ్ఞ అనే తిలకాన్ని ధారణ చేసి ఫస్ట్ ప్రైజ్ తీసుకునే ఆజ్ఞాకారీ భవ ఏ పిల్లల మస్తకముపై ఆజ్ఞాకారీ అనే స్మృతి యొక్క తిలకము దిద్దబడి ఉందో, ఒక్క సంకల్పము కూడా ఆజ్ఞ లేకుండా చేయరో వారికి ఫస్ట్ ప్రైజ్ లభిస్తుంది. ఏ విధముగా సీతకు గీత లోపల కూర్చోవాలి అనే ఆజ్ఞ లభించిందో, అదే విధముగా ప్రతి అడుగు వేస్తూ, ప్రతి సంకల్పము చేస్తూ తండ్రి ఆజ్ఞ అనే గీత లోపల ఉన్నట్లయితే సదా సురక్షితముగా ఉంటారు. ఏ రకమైన రావణుడి సంస్కారాలు దాడి చేయవు మరియు సమయము కూడా వ్యర్థముగా పోదు. |
| స్లోగన్:- | ఎవరి పట్లనైనా మోహము ఉన్నట్లయితే ఆ మోహము పురుషార్థములో నిర్లక్ష్యులుగా తప్పకుండా చేస్తుంది. |
అవ్యక్త ప్రేరణలు:- సదా అచంచలమైన, స్థిరమైన, ఏకరస స్థితిని అనుభవము చేయండి
సదా ఒక్కరి స్మృతిలో ఉంటూ ఏకరస అవస్థను తయారుచేసుకున్నట్లయితే వన్-వన్-వన్ లోకి వస్తారు. బయట ఉన్నప్పటికీ కూడా ఈ పాఠాన్నే పక్కా చేసుకోండి - ‘‘సీ ఫాదర్, ఫాలో ఫాదర్ (తండ్రినే చూడండి, తండ్రినే అనుసరించండి)’’, అప్పుడిక ఏ పరిస్థితిలోనూ కింద-మీద అవ్వరు, బ్రహ్మాబాబా ఎదురుగా ఎన్ని విషయాలు వచ్చినా కానీ వారు విషయాలను చూడకుండా ఒక్క బాబానే చూసారు, అందుకే నంబరు వన్ గా అయ్యారు, కావున ఫాలో ఫాదర్ చేయండి.