| 21-11-2026 |
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
|
మధువనం |
| ‘‘మధురమైన పిల్లలూ - విచార సాగర మంథనము చేసి సేవకు సంబంధించిన రకరకాల యుక్తులను తీయండి, వాటి ద్వారా అందరికీ తండ్రి పరిచయము లభించాలి’’ | |
| ప్రశ్న:- | తండ్రి ప్రతి బిడ్డకు ఉన్నత భాగ్యాన్ని తయారుచేసుకునేందుకు ఏ యుక్తిని తెలియజేస్తారు? |
| జవాబు:- | తమ ఉన్నత భాగ్యాన్ని తయారుచేసుకోవాలంటే - లోపల నుండి అన్ని ఛీ-ఛీ, చెడు అలవాట్లను తొలగించండి. అబద్ధాలు చెప్పడము, కోపగించుకోవడము, ఇవి చాలా చెడ్డ అలవాట్లు. సేవ పట్ల అభిరుచి పెట్టుకోండి. తండ్రి ఎలాగైతే నిరహంకారిగా అయ్యి సేవ చేస్తారో, అలా ఎంత వీలైతే అంత ఇతరుల కళ్యాణార్థము ఆత్మిక సేవలో బిజీగా ఉండండి. |
| పాట:- | నీ దారిలోనే మరణించాలి... |
ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు మొట్టమొదట - తండ్రి ఎవరు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి మరియు అర్థం చేయించాలి! ఎప్పుడైతే - మేము అనంతమైన తండ్రికి సంతానము అనే నిశ్చయము ఏర్పరచుకుంటారో, అప్పుడు పిల్లలకు అతీంద్రియ సుఖము అనుభవమవుతుంది. కేవలం ఈ ఒక్క మాటతోనే సంతోషపు పాదరసము పైకి ఎక్కుతుంది. ఇది స్థిరమైన సంతోషాన్ని కలిగించే పాయింటు. తమను తాము బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీలుగా పిలుచుకుంటారని మీకు తెలుసు. ఇది కొత్త రచన. మొదట వీరు మన తండ్రి అని నిశ్చయము ఏర్పరచుకోవాలి. తండ్రి కింద విష్ణువు ఉన్నారు (త్రిమూర్తి చిత్రములో). తండ్రి నుండి విష్ణుపురి యొక్క వారసత్వము లభిస్తుంది కనుక ఎంత సంతోషముండాలి. ఇది నిశ్చయము చేయించిన తర్వాత వారితో వ్రాయించాలి. విష్ణువు అనే పదానికి వైష్ణవ అన్న అర్థాన్ని కూడా చెప్తూ ఉంటారు. ఈ దేవీ-దేవతలు నిర్వికారులుగా ఉండేవారని భారతవాసులకు బాగా తెలుసు. స్వర్గములో వీరి యొక్క పవిత్ర ప్రవృత్తి మార్గముండేది. మీరు సంపూర్ణ నిర్వికారులు, మేము వికారులమని పాడుతారు కూడా. సత్యయుగములో సంపూర్ణ నిర్వికారులుగా ఉంటారు. కలియుగములో సంపూర్ణ వికారులుగా ఉన్నారు. వికారులను పతితులు, భ్రష్టాచారులు అని అంటారు. క్రోధులను పతితులు, భ్రష్టాచారులని అనరు. క్రోధమైతే సన్యాసులలో కూడా ఉంటుంది. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఉన్నతోన్నతమైన తండ్రి భారత్ లోకి వచ్చినప్పుడు ఈ మహాభారత యుద్ధము కూడా తప్పకుండా జరుగుతుంది, ఎందుకంటే పరమాత్మ వచ్చి పతిత ప్రపంచము నుండి పావన ప్రపంచములోకి తీసుకువెళ్తారు. శరీరాలైతే వినాశనమవుతాయి. తండ్రి మనల్ని చదివిస్తున్నారనే నిశ్చయముండాలి, అటువంటప్పుడు ఎంత రెగ్యులర్ గా ఉండాలి. ఇక్కడ ఇది హాస్టల్ కాదు. హాస్టల్ తయారుచేయాలంటే చాలా ఇళ్ళు కావాలి. 7 రోజుల కోసం, 4 రోజుల కోసం వచ్చినా కానీ చాలా ఇళ్ళు కావాలి. తండ్రి అంటారు - గృహస్థ వ్యవహారములో ఉంటూ కేవలం బాబాను స్మృతి చేయండి. తండ్రియే పతిత-పావనుడు, అంతే. తండ్రి అంటారు - నన్ను స్మృతి చేయండి, మీ పాపాలన్నీ భస్మమవుతాయనే గ్యారెంటీ నేను ఇస్తాను. మొదట - మేము తప్పకుండా శివబాబా సంతానమని, తర్వాత విశ్వ రాజ్యాధికారానికి హక్కుదారులుగా అవుతామని వ్రాయించాలి. రాజు-రాణి, ప్రజలు అందరూ విశ్వానికి యజమానులే. మేళాలలో, ప్రదర్శనీలలో అర్థం చేయించేవారికి బాబా డైరెక్షన్ ఏమని ఇస్తున్నారంటే - ఉన్నతోన్నతమైన భగవంతుడు ఒక్కరే, వారే జ్ఞాన సాగరుడు, పతిత-పావనుడు అన్న ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించాలి. వారు జ్ఞాన సాగరుడు కనుక తప్పకుండా డైరెక్షన్లు కూడా వారే ఇస్తారు. శ్రీకృష్ణుడు ఇవ్వలేరు. శివబాబా తప్ప ఇంకెవ్వరూ భగవంతుడు కారు. బ్రహ్మా, విష్ణు, శంకరులు కూడా దేవతలే. స్వర్గములో దైవీ గుణాలు కల మనుష్యులు ఉంటారు, ఇక్కడ కలియుగములో ఆసురీ గుణాలు కల మనుష్యులు ఉన్నారు. ఇది కూడా తర్వాత అర్థం చేయించాలి. మొట్టమొదటైతే తండ్రి పరిచయాన్ని ఇచ్చి సంతకము చేయించాలి. విచార సాగర మంథనము చేసి రకరకాల యుక్తులను తీయాలి మరియు బాబాకు చెప్పాలి - బాబా, వారు మమ్మల్ని ఈ విధమైన ప్రశ్నలు అడుగుతున్నారు, మేము ఈ విధముగా అర్థం చేయించాము. అప్పుడు బాబా కూడా వాళ్ళపై ప్రభావము చూపించే లాంటి పాయింట్లను వినిపిస్తారు. బాబాను సర్వవ్యాపి లేదా కూర్మావతారము, మత్స్యావతారము అని అనడము, ఇది కూడా నింద చేసినట్లే, అందుకే బాబా పరిచయాన్ని ఇవ్వాలి. బాబాయే విశ్వానికి యజమానులుగా చేస్తారు. ఈ లక్ష్మీ-నారాయణులు విశ్వానికి యజమానులుగా, సతోప్రధానముగా ఉండేవారు. తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ తమోప్రధానముగా అయిపోయారు. అందుకే తండ్రి అంటారు - నన్ను స్మృతి చేస్తే సతోప్రధానముగా అవుతారు. ఏ ధర్మము వారైనా కావచ్చు, తండ్రి సందేశము అందరి కోసముంది. వారిని గాడ్ ఫాదర్, ముక్తిప్రదాత అని అంటారు. ముక్తిని ఇచ్చేందుకు తప్పకుండా పతిత ప్రపంచములోకే వస్తారు. కలియుగాంతములో మొత్తము ప్రపంచమంతా తమోప్రధానముగా ఉంది. సతోప్రధానముగా అయినప్పుడు కొత్త ప్రపంచములోకి వెళ్ళగలరు. ఇకపోతే, ఎవరైతే అక్కడకు రారో, వారు శాంతిధామములో ఉంటారు. ఈ విషయాన్ని వారి బుద్ధిలో కూర్చోబెట్టాలి, తద్వారా - మేము ఆ తండ్రిని స్మృతి చేయాలి అన్నది వారికి అర్థమవ్వాలి. దేహధారులెవ్వరినీ స్మృతి చేయకూడదు. తండ్రి ఉన్నదే విదేహీ, విచిత్రుడు, మిగిలినవారందరి చిత్రాలు రకరకాలుగా ఉంటాయి. ఎవరికైనా అర్థం చేయించాలనే అభిరుచి ఉండాలి. ప్రదర్శనీలకు చాలామంది వస్తారు. సెంటర్లకు అంతమంది రారు. సేవలో నిమగ్నమై ఉన్నట్లయితే పిల్లలకు చాలా ఉల్లాసము ఉంటుంది. ఇక్కడ తండ్రిని పదే-పదే మర్చిపోతారు. సేవలో ఉంటే స్మృతియాత్రను మర్చిపోరు. స్వయం స్మృతి చేస్తారు, ఇతరుల చేత కూడా స్మృతి చేయిస్తారు. పిల్లలైన మీరు చదువుకుంటున్నారు. మేము రాజ్యము తప్పకుండా తీసుకుంటామని మీ బుద్ధిలో ఉంది. ఇది గుర్తున్నా సరే సంతోషముంటుంది. దీనిని మర్చిపోయారంటే భయమనిపిస్తుంది.
బాబా, మేము అతీంద్రియ సుఖములో ఉన్నామని బాబాకు వ్రాయాలి. ఇంకా కొద్ది సమయమే ఉంది, మనము మన సుఖధామానికి వెళ్తాము. 63 జన్మలుగా మనము చాలా వ్యాధిగ్రస్తులుగా ఉన్నాము. ఎలాంటి చికిత్స లభించక వ్యాధి తీవ్రతరమైంది. చూసుకోవడానికి ఎవరూ లేని కారణముగా, వ్యాధి లోపల తిష్ఠ వేసింది. ఈ వ్యాధి ఎలాంటిదంటే, దీనిని అవినాశీ సర్జన్ తప్ప ఇంకెవ్వరూ దూరం చేయలేరు. ఇప్పుడు అందరూ వదిలి వెళ్ళే సమయము. పవిత్రముగా అయి ముక్తిధామములోకి వెళ్ళిపోతారు. ముక్తిలో ఉండడం మంచిదని, పాత్రే ఉండదని కొందరు అంటారు. ఎవరైనా నాటకములో చిన్న పాత్రను అభినయించినంత మాత్రాన వారిని హీరో, హీరోయిన్ అని లేక ఉన్నత పాత్రధారులు అని అనరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేసినట్లయితే పక్కా అయిపోతారు. స్మృతిని మర్చిపోకూడదు. ముఖ్యమైనవారు ఒక్క తండ్రి. మిగిలిన ఈ చిన్న-చిన్న చిత్రాలు అర్థం చేయించడం కోసం ఉన్నాయి. వీటి ద్వారా - శివుడు, శంకరుడు ఒక్కరు కాదని ఋజువు చేయాలి. ఇకపోతే, సూక్ష్మవతనములో ఏమీ జరగదు. ఇదంతా భక్తి మార్గమని, జ్ఞానాన్ని ఇచ్చేవారు ఒక్క తండ్రియేనని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. వారు సంగమములో జ్ఞానమిస్తారు, ఇది పక్కా చేసుకోండి. భారతవాసులకైతే కల్ప-కల్పము స్వర్గ వారసత్వము తప్పకుండా లభిస్తుంది. ఇది 5 వేల సంవత్సరాల నాటి విషయము. వారు లక్షల సంవత్సరాలని అంటారు. వారు - కేవలం కలియుగము మాత్రమే లక్షల సంవత్సరాలని అంటారు. మనము - ఈ చక్రమంతా 5 వేల సంవత్సరాలని అంటాము. ఎంత పెద్ద వ్యర్థ ప్రలాపాలు పలికారు. ఓ పతిత-పావనా అని పిలుస్తారు. శ్రీకృష్ణుడిని పతిత-పావనుడు అని అనరు. ఏ ధర్మము వారు కూడా శ్రీకృష్ణుడిని ముక్తిదాత అని అనరు. ఓ పతిత-పావనా అని పిలిచినప్పుడు బుద్ధి పైకి వెళ్ళిపోతుంది, అయినా కూడా అర్థం చేసుకోరు. మాయ అంధకారము ఎంతగా ఉంది, పొరపాట్లు చేస్తూనే ఉన్నారు. శాస్త్రాలు అనాదిగా ఉన్నాయని అంటారు. కానీ సత్య, త్రేతాయుగాలలో ఇవి ఉండవు. ఈ చదువు ఎలాంటిదంటే, అనారోగ్యమున్నా కానీ క్లాసులో కూర్చుని చదువుకోవచ్చు. ఇక్కడ సాకులు పని చేయవు. గోవులు చాలా బాగుంటాయి, కానీ కొన్ని కాళ్ళతో తన్నేవి కూడా ఉంటాయి. ఇక్కడ కూడా ఎవరిలోనైతే క్రోధముంటుందో, వారు అహంకారానికి వశమై తన్నుతారు కూడా. డిస్సర్వీస్ చేస్తారు. ఏ అవగుణాలు ఉండకూడదు. కానీ కర్మబంధనాలు ఎలాంటివంటే, అవి ఉన్నత పదవిని పొందనివ్వవు. తండ్రి ఉన్నతమైన అదృష్టాన్ని తయారుచేసుకునే మార్గాన్ని తెలియజేస్తారు. కానీ ఎవరైనా తయారుచేసుకోలేకపోతే, తండ్రి ఏం చేస్తారు. ఇది చాలా గొప్ప సంపాదన. సంపాదన యొక్క నషా ఉండాలి. సంపాదన చేసుకోకపోతే, పరిణామము ఏమవుతుంది! కల్ప-కల్పము ఇలాంటి పరిస్థితే ఉంటుంది. తండ్రి అయితే అందరినీ సావధాన పరుస్తారు, అవమానించరు. పిల్లలలో ఎలాంటి ఛీ-ఛీ అలవాట్లు ఉండకూడదు. అబద్ధాలు చెప్పడం చాలా చెడ్డ అలవాటు. యజ్ఞ సేవను సంతోషముగా చేయాలి. మీరు బాబా వద్దకు వచ్చినప్పుడు, సేవ చేయండి అని బాబా మీకు సూచనను ఇస్తారు. ఎవరైతే మీకు తినిపిస్తారో, వారి సేవను తప్పకుండా చేయాలి. సేవ చేయడం తండ్రి నేర్పిస్తారు. ఉన్నతోన్నతుడైన తండ్రి కూడా ఎంత సేవ చేస్తున్నారో చూడండి. ఏ పనినైతే అజ్ఞానములో కూడా చేయలేదో, అది కూడా చేయాల్సి ఉంటుంది. అంతటి నిరహంకారులుగా అవ్వాలి. నియమవిరుద్ధమైన పనులేవీ చేయకూడదు. ఎంత వీలైతే అంత, ఇతరుల కళ్యాణార్థము, అన్నీ మీ చేతులతోనే చేయాల్సి ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇతరులతో చేయించడమనేది వేరే విషయము. మిమ్మల్ని మీరు నిరహంకారులుగా, నిర్మోహులుగా తయారుచేసుకోవాలి. బాబా స్మృతి లేకుండా ఎవరి కళ్యాణము జరగదు. ఎంత స్మృతి చేస్తే, అంత పావనముగా అవుతారు. స్మృతిలోనే విఘ్నాలు కలుగుతాయి. జ్ఞానములో అంతగా విఘ్నాలు కలగవు. జ్ఞానానికి సంబంధించిన పాయింట్లు అయితే అనేకమున్నాయి. తండ్రిని స్మృతి చేసినట్లయితే సుగంధభరితమైన పుష్పాలుగా అవుతారు. తక్కువగా స్మృతి చేస్తే రత్నజ్యోతి పుష్పాలుగా అవుతారు. జిల్లేడు పుష్పాలు కూడా ఉంటారు. స్వయాన్ని సుగంధభరితమైన పుష్పాలుగా తయారుచేసుకోవాలి. ఏ దుర్గంధము ఉండకూడదు. ఆత్మలు సుగంధభరితముగా అవ్వాలి. ఇంత చిన్నని బిందువులో పూర్తి జ్ఞానమంతా నిండి ఉంది, ఇది అద్భుతము. సృష్టి ఒక్కటే ఉంది. పైన కానీ, కింద కానీ వేరే సృష్టి లేదు. త్రిమూర్తి యొక్క అర్థం కూడా మీకు తెలుసు. వారు కేవలం త్రిమూర్తి మార్గమని పేరు పెట్టారు. కొందరు బ్రహ్మాను త్రిమూర్తి అని అంటారు. వారి జీవితచరిత్ర గురించి ఏమీ తెలియదు. శాస్త్రాలలో శ్రేష్ఠాచారీ మనుష్యుల జీవిత కథలు ఉన్నాయి. లక్ష్మీ-నారాయణులు, రాధ-కృష్ణులు మొదలైనవారందరూ మనుష్యులే. కానీ ఇతరుల జీవిత కథలను శాస్త్రాలు అని అనరు, దేవతల జీవిత కథలను శాస్త్రాలని అంటారు. ఇకపోతే, శివబాబా జీవిత చరిత్ర ఎక్కడుంది? వారైతే నిరాకారుడు. వారు స్వయంగా అంటారు - నేనైతే పతిత-పావనుడిని, నన్ను అందరూ ‘తండ్రి’ అని పిలుస్తారు, నేను వచ్చి స్వర్గ స్థాపన చేస్తాను. భారత్ 5 వేల సంవత్సరాల క్రితం స్వర్గముగా ఉండేది, ఇప్పుడు మళ్ళీ అలా తయారవ్వాలి. ఇది ఎంత సహజము. కానీ ఎంత రాతిబుద్ధి కలవారిగా ఉన్నారంటే, తాళం అసలు తెరుచుకోవడమే లేదు. జ్ఞాన-యోగాల తాళం మూసివేసి ఉంది.
తండ్రి అంటారు - ‘ఉన్నతోన్నతమైనవారు తండ్రి’ అని ఇంటింటికీ సందేశమివ్వండి. మొదటి అంతస్తు - మూలవతనము, రెండవ అంతస్తు - సూక్ష్మవతనము, మూడవ అంతస్తు - ఈ సాకారీ ప్రపంచము. ఒకవేళ పిల్లలకు ఈ అంతస్తులు గుర్తున్నా సరే, ముందుగా బాబా తప్పకుండా గుర్తుకొస్తారు. సేవ కోసం పరుగెత్తాలి. బాబా ఎక్కడికైనా వెళ్ళేందుకు వద్దు అని అనరు. వివాహాలకు వెళ్ళండి, తీర్థ స్థానాలకు వెళ్ళండి, కానీ సేవ చేయడానికి వెళ్ళండి. ఒకటి - ఆత్మిక యాత్ర, రెండవది - దైహిక యాత్ర అని భాషణ చేయండి. పాయింట్లు అయితే ఎన్నో లభిస్తూ ఉంటాయి. వానప్రస్థుల సమూహములోకి వెళ్ళి సేవ చేయండి. వారేమంటారో కూడా వినండి. చేతిలో కరపత్రాలు ఉండాలి, అందులో ముఖ్యమైన 4-5 విషయాలు వ్రాసి ఉండాలి - ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు, గీతా భగవానుడు శ్రీకృష్ణుడు కాదు అని స్పష్టముగా వ్రాయండి. ఎవరు చదివినా కానీ, ఇది సత్యము అని భావించాలి. ఇందులో చాలా తెలివి కావాలి. బాబా త్రిమూర్తి గురించి కూడా అర్థం చేయిస్తారు. దీనిని పదే-పదే పాకెట్ నుండి తీసి చూస్తూ ఉండండి. వీరు బాబా, ఇది వారసత్వము అని ఎవరికైనా అర్థం చేయించండి. విష్ణువు చిత్రము కూడా బాగుంది. ట్రైన్ లో కూడా సేవ చేయవచ్చు. తండ్రిని స్మృతి చేస్తే విశ్వానికి యజమానులుగా అవుతారు. చాలా సేవ చేయవచ్చు. కానీ అంత తెలివి ఎవ్వరికీ ఉండదు. చాలా పురుషార్థము చేయాలి. యుద్ధ మైదానములో బద్దకించకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మందిరాలలో కూడా చాలా సేవ జరగగలదు. బాబా కేవలం - మన్మనాభవ అని మాత్రమే చెప్తారు. తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వండి. ముఖ్యమైన విషయాన్ని పక్కా చేయించాలి. పిల్లలకు సేవకు సంబంధించి చాలా ఆలోచన ఉండాలి. త్రిమూర్తి చిత్రములో మొత్తం జ్ఞానమంతా నిండి ఉంది. మెట్ల వరస చిత్రము కూడా బాగుంది. ప్రతి ఒక్కరూ ధనము సంపాదించుకునే విషయములో తమ ఉన్నతిని కోరుకుంటారు. చిన్న పిల్లలకు కూడా యుక్తులు నేర్పించండి, అందరూ అభినందిస్తారు. ఈ బ్రహ్మాకుమార-కుమారీలది ఎంతటి అద్భుతము, చిన్న పిల్లలు కూడా ఎంత బాగా జ్ఞానాన్ని ఇస్తున్నారంటే, సన్యాసులు మొదలైనవారు కూడా ఇలా ఇవ్వలేరు అని అంటారు. ఉచితముగా ఏదైనా వస్తువు లభిస్తుందంటే, ఇది మా కళ్యాణము కోసమే ఇస్తున్నారని భావిస్తారు. ఇది ఉచితము, మీరు చదువుకుని దీనితో మీ కళ్యాణము చేసుకోండి అని వారికి చెప్పండి. శివబాబా భోళా భండారి కదా. చాలామంది పిల్లలు ఉన్నారు. బాబాకు ధనముతో అవసరమేముంది. ట్రైన్ లో కూడా మీరు చాలా సేవ చేయవచ్చు. ఎవరైనా మంచి వ్యక్తి కనిపించారంటే, వెంటనే వారికి అర్థం చేయించి చిత్రాలు ఇవ్వాలి. మీరు మీ కళ్యాణము చేసుకోండి మరియు ఇతరుల కళ్యాణము కూడా చేయండి అని వారితో చెప్పండి. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఏ పని కూడా నియమవిరుద్ధముగా చేయకూడదు. చాలా-చాలా నిరహంకారులుగా, నిర్మోహులుగా ఉండాలి. ఎంత వీలైతే అంత ప్రతి పనిని తమ చేతులతోనే చేసుకోవాలి. యజ్ఞ సేవను చాలా సంతోషముగా చేయాలి.
2. చదువులో ఎప్పుడూ సాకులు చెప్పకూడదు. అనారోగ్య సమయములో కూడా తప్పకుండా చదువుకోవాలి. ఉల్లాసముగా ఉండేందుకు సేవ పట్ల అభిరుచి పెట్టుకోవాలి.
| వరదానము:- |
సదా స్వమానములో స్థితులై నిర్మాన స్థితి ద్వారా సర్వులకు గౌరవాన్ని ఇచ్చే గౌరవనీయులుగా, పూజ్యనీయులుగా కండి తండ్రి మహిమనే మీ స్వమానము, స్వమానములో స్థితులై ఉన్నట్లయితే నిర్మానులుగా అవుతారు, అప్పుడు సర్వుల నుండి స్వతహాగానే గౌరవము లభిస్తూ ఉంటుంది. గౌరవమనేది అడిగితే లభించదు, కానీ గౌరవమనేది ఇవ్వడము ద్వారా, స్వమానములో స్థితులై ఉండడము ద్వారా, గౌరవాన్ని త్యాగము చేయడము ద్వారా సర్వులకు గౌరవనీయులుగా మరియు పూజ్యనీయులుగా అయ్యే భాగ్యము ప్రాప్తిస్తుంది ఎందుకంటే గౌరవమివ్వడము అంటే ఇవ్వడము కాదు, తీసుకోవడము. |
| స్లోగన్:- | అన్నీ తెలిసినవారిగా అవ్వడముతో పాటు చేసేవారిగా అయి అసమర్థ ఆత్మలకు అనుభూతి అనే ప్రసాదాన్ని పంచుతూ వెళ్ళండి. |
అవ్యక్త ప్రేరణలు - బ్రహ్మాబాబా సమానముగా సంపన్న మరియు సంపూర్ణ స్థితిని అనుభవము చేయండి
దేహము, సంబంధాలు, వైభవాలు... ఇటువంటి ఏ బంధనము కూడా తనవైపుకు ఆకర్షితము చేయకూడదు, ఇటువంటి స్వతంత్ర ఆత్మయే బాబా సమానమైన కర్మాతీత స్థితిని మరియు సంపన్న స్థితిని అనుభవము చేస్తుంది. దీని కోసం ఈ ప్రాక్టీస్ చేయండి - ఇప్పుడిప్పుడే కర్మయోగి, ఇప్పుడిప్పుడే కర్మాతీత స్టేజ్. ఏ కర్మ కూడా తన బంధనములో బంధించకూడదు.