తెలుగు మురళి · Brahma Kumaris

ఈరోజు మురళి · 27 నవంబర్, 2026

ఓం శాంతి · BapDada · 27 నవంబర్, 2026

ఈరోజు మురళి — today’s murli in Telugu, BK Telugu murli.

18
మురళి27 నవంబర్, 2026 · తెలుగు
0:00--:--

పాఠ్యాన్ని ఎంచుకోండి → హైలైట్ / బాక్స్ / అండర్‌లైన్

27-11-2026
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
మధువనం

‘‘మధురమైన పిల్లలూ - భారత్ అందరి యొక్క తీర్థ స్థానము, అందుకే అన్ని ధర్మాల వారికి తీర్థ స్థానమైన భారత్ యొక్క మహిమను వినిపించండి, అందరికీ సందేశాన్ని ఇవ్వండి’’
ప్రశ్న:- ఏ పురుషార్థముతో మీకు అంత మతి సో గతి జరుగుతుంది? నిద్రాజీతులుగా అవుతారు?
జవాబు:- రాత్రివేళ నిద్రపోయే ముందు మొదటగా తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి, స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి. నిద్ర వచ్చినప్పుడు నిద్రపోండి, అప్పుడు అంత మతి సో గతి జరుగుతుంది (అంతిమ సమయములో ఎటువంటి ఆలోచనలతో చనిపోతారో, అటువంటి జన్మ లభిస్తుంది). ఉదయము లేచినప్పుడు అవే పాయింట్లు గుర్తుకువస్తూ ఉంటాయి. ఇటువంటి అభ్యాసము చేస్తూ మీరు నిద్రను జయించేవారిగా అవుతారు. ఎవరైతే చేస్తారో, వారు పొందుతారు. ఇలా చేసేవారి నడవడిక ప్రసిద్ధమవుతూ ఉంటుంది.
పాట:- ఎవరైతే ప్రియమైనవారితో ఉంటారో...

ఓంశాంతి. ఎవరైతే ప్రియమైనవారితో పాటు ఉంటారో... ఇప్పుడు ప్రపంచములో తండ్రులైతే చాలా మంది ఉన్నారు కానీ వారందరి తండ్రి, రచయిత అయిన వారొక్కరే. వారే జ్ఞానసాగరుడు. జ్ఞానము ద్వారానే సద్గతి కలుగుతుంది. సద్గతి కూడా మనుష్యులకు, సత్యయుగ స్థాపన జరగనున్నప్పుడే కలుగుతుంది. బాబానే సద్గతిదాత అని అంటారు. సంగమ సమయము వచ్చినప్పుడల్లా జ్ఞాన సాగరుడు వచ్చి సద్గతిలోకి తీసుకువెళ్తారు. ఈ సమయములో అందరూ దుర్గతిలో ఉన్నారు. దుర్గతి కూడా అందరిదీ ఒకేలా ఉండదు. అన్నింటికంటే ప్రాచీనమైనది భారత్. భారతవాసుల విషయములోనే 84 జన్మలని అంటూ ఉంటారు. ఎవరైతే మొట్టమొదటి మనుష్యులు ఉంటారో, తప్పకుండా వారే 84 జన్మలకు యోగ్యులుగా ఉంటారు. దేవతలకు 84 జన్మలు ఉంటాయి అంటే బ్రాహ్మణులకు కూడా 84 జన్మలు ఉంటాయి. ముఖ్యమైనవారి గురించే చెప్తూ ఉంటారు. తండ్రి బ్రహ్మా ద్వారా కొత్త సృష్టిని రచించేందుకు మొట్టమొదట సూక్ష్మలోకాన్ని రచిస్తారు, తర్వాత కొత్త సృష్టి యొక్క స్థాపన జరుగుతుంది. త్రిలోకనాథుడు ఒక్క తండ్రి మాత్రమే. ఇకపోతే, వారి పిల్లలు కూడా తమను తాము త్రిలోకనాథులుగా చెప్పుకోవచ్చు. ఇక్కడైతే చాలా మంది మనుష్యులు త్రిలోకినాథ్ అనే పేరు కూడా పెట్టుకుంటారు, అంతేకాక గౌరీశంకర్, రాధేశ్యామ్ అని డబల్ దేవతల పేర్లను కూడా పెట్టుకుంటారు. ఇప్పుడు రాధా-కృష్ణులు వేర్వేరు రాజ్యాలకు చెందినవారు. ఎవరైతే మంచి పిల్లలు ఉంటారో, వారి బుద్ధిలో చాలా మంచి పాయింట్ల ధారణ ఉంటుంది. ఎవరైతే తెలివైన డాక్టరుగా ఉంటారో, వారి బుద్ధిలో చాలా మందులు ఉంటాయి. ఇక్కడ కూడా ప్రతి రోజూ కొత్త-కొత్త పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. ఎవరికైతే మంచి ప్రాక్టీసు ఉంటుందో, వారు కొత్త-కొత్త పాయింట్లను ధారణ చేస్తూ ఉంటారు. ఎవరైతే ధారణ చేయరో, వారిని మహారథులని అనరు. అంతా బుద్ధిపై ఆధారపడి ఉంటుంది మరియు భాగ్యముపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇది కూడా డ్రామా. డ్రామా గురించి ఎవ్వరికీ తెలియదు. ఆత్మనైన నేను శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తున్నానని కూడా అర్థం చేసుకుంటారు. కానీ డ్రామా ఆదిమధ్యాంతాలను తెలుసుకోలేదంటే, ఏమీ తెలుసుకోనట్లే. మీరైతే తెలుసుకోవాలి. పిల్లల కర్తవ్యము ఇతరులకు తండ్రి పరిచయాన్ని ఇవ్వడము. మొత్తం ప్రపంచమంతటికీ తెలియజేయాలి. మాకు తెలియదని ఎవ్వరూ అనకూడదు. విదేశాల నుండి కూడా చాలా మంది రానున్నారు. వారందరికీ బొంబాయిలో ఏర్పాట్లు చేస్తారు. వారైతే సమర్థమైనవారు కూడా. ధనమైతే వారి వద్ద చాలా ఉంది. శివుడిని తమ పెద్ద గురువుగా భావిస్తారు కదా, అందుకే ఈ ధర్మపితలకు కూడా కొంత పాత్ర ఉందని అర్థం చేయించడం జరుగుతుంది. ఈ క్రైస్టు, ఇబ్రహీమ్ మొదలైనవారంతా కలుసుకోవడానికి వస్తారని పిల్లలకు ప్రారంభములో సాక్షాత్కారము అయ్యింది. కనుక వారికి ఫీల్డును తయారుచేయాలి. టూరిస్టులు మొదలైనవారంతా బొంబాయికి వస్తూ ఉంటారు. భారత్ అందరినీ చాలా ఆకర్షిస్తుంది. వాస్తవానికి భారత్ తండ్రి జన్మ స్థలము. కానీ అందరిలోనూ భగవంతుడు ఉన్నారని చెప్పడము వలన అనంతమైన తండ్రి మహత్వాన్ని మాయం చేసేసారు. భారత్ అన్నింటికన్నా పెద్ద తీర్థ స్థానమని ఇప్పుడు మీరు అర్థం చేయిస్తారు. మిగిలిన సందేశకులందరూ తమ-తమ ధర్మాలను స్థాపన చేయడానికి వస్తారు. వారి వెనుక వారి ధర్మానికి చెందినవారు కూడా వస్తారు. ఇప్పుడిది అంతిమము. తిరిగి వెళ్ళాలని ప్రయత్నము చేస్తారు. వారిని అడగండి - మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది ఎవరు? క్రైస్టు క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపన చేసారు, మరి వారు మిమ్మల్ని ఇక్కడకు లాక్కొని వచ్చారా? ఇప్పుడు అందరూ విసిగిపోయి తిరిగి వెళ్ళాలని కోరుకుంటున్నారు. అందరూ పాత్రను అభినయించేందుకే వస్తారు. పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ చివరికి దుఃఖములోకి రావాల్సిందే. అప్పుడు దుఃఖము నుండి విడిపించి సుఖములోకి తీసుకువెళ్ళడము తండ్రి పని మాత్రమే. తండ్రి జన్మ స్థలము భారత్. ఇంతటి మహత్యము పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఎవరికైతే తెలుసో, వారికి నషా ఎక్కి ఉంది. కల్ప-కల్పము భారత్ లో బాబా వస్తారు. ఇది అందరికీ తెలియజేయాలి, ఆహ్వానము అందించాలి. రచనను గురించిన జ్ఞానము ఎవ్వరికీ తెలియదు. ఈ విధముగా సేవాధారులుగా అయి మీ పేరును ప్రసిద్ధము చేసుకోవాలి. ఈ మేళా అన్ని వైపులకు వెళ్తుంది. కనుక ఎవరైతే చురుకైన పిల్లలు ఉన్నారో, వారి సహాయాన్ని కోరుతూ ఉంటారు. వారి పేరును జపిస్తూ ఉంటారు. ఒకటి శివబాబాను జపిస్తారు, రెండు బ్రహ్మాబాబాను, మూడు కుమారకా, గంగే, మనోహర్, వీరిని జపిస్తారు. భక్తి మార్గములో చేతితో మాలను తిప్పుతారు. ఇప్పుడు నోటి ద్వారా పేర్లను జపిస్తారు - ఫలానావారు చాలా సర్వీసబుల్, వారు నిరహంకారి, మధురమైనవారు, వారికి దేహాభిమానము లేదు అని. స్నేహము ఇస్తే స్నేహము లభిస్తుందని అంటూ ఉంటారు కదా. ఇప్పుడు తండ్రి అంటారు - మీరు దుఃఖితులుగా అయ్యారు, మీరు నన్ను స్మృతి చేస్తే నేను కూడా సహాయము చేస్తాను. మీరు ద్వేషిస్తే, మిమ్మల్ని మీరే ద్వేషించుకున్నట్లు, పదవి లభించదు. ఎంత అపారమైన ధనము లభిస్తుంది. ఎవరికైనా లాటరీ లభిస్తే, ఎంత సంతోషము కలుగుతుంది. అందులో కూడా ఎన్ని బహుమతులు లభిస్తాయి. రెండవ బహుమతి మరియు మూడవ బహుమతి కూడా ఉంటాయి. ఇది కూడా ఈశ్వరీయ రేస్. ఇది జ్ఞాన-యోగాల రేస్. ఇందులో ఎవరైతే వేగముగా వెళ్తారో, వారే కంఠహారముగా అవుతారు మరియు సింహాసనముపై సమీపముగా కూర్చుంటారు.

మీరందరూ కర్మయోగులు. మీ ఇంటిని కూడా సంభాళించండి. క్లాసులో ఒక గంట చదువుకోవాలి. తర్వాత ఇంటికి వెళ్ళి రివైజ్ చేసుకోవాలి. స్కూల్లో కూడా అలా చేస్తూ ఉంటారు కదా. చదువుకుని, తర్వాత ఇంటికి వెళ్ళి రివైజ్ చేస్తారు. తండ్రి అంటారు - ఒక గంట, అర్ధ గంట... రోజులో 8 గంటలు ఉంటాయి కదా. వాటిలో కూడా తండ్రి అంటారు - ఒక గంట, అర్ధ గంట, 15-20 నిముషాలైనా క్లాసులో చదువుకుని, ధారణ చేసి, అప్పుడు కార్య-వ్యవహారాలలోకి వెళ్ళండి. ఇదివరకు బాబా మిమ్మల్ని కూర్చోబెట్టేవారు - తండ్రి స్మృతిలో కూర్చోండి, స్వదర్శన చక్రాన్ని తిప్పండి అని చెప్పి కూర్చోబెట్టేవారు. స్మృతి యొక్క జ్ఞానమైతే ఉండేది కదా. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ, స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ చూడండి, నిద్ర వచ్చినప్పుడు నిద్రపోండి. అప్పుడు అంతమతి సో గతి జరుగుతుంది. తర్వాత ఉదయము లేచినప్పుడు, అవే పాయింట్లు గుర్తుకువస్తూ ఉంటాయి. ఇటువంటి అభ్యాసము చేస్తూ-చేస్తూ మీరు నిద్రను జయించేవారిగా అయిపోతారు. ఎవరైతే చేస్తారో, వారు పొందుతారు. చేసేవారిది కనిపిస్తుంది, వారి నడవడిక ప్రసిద్ధమవుతుంది. ఫలానావారు విచార సాగర మంథనము చేస్తున్నారు, ధారణ చేస్తున్నారు, లోభము మొదలైనది ఏమీ లేదు అని చూడడము జరుగుతుంది. ఈ శరీరము పాతది, దీని గురించి కూడా చాలా ఎక్కువ ఆలోచించకూడదు. ఈ శరీరము కూడా ఎప్పుడు బాగుంటుందంటే, జ్ఞాన-యోగాల ధారణ పూర్తిగా ఉన్నప్పుడు. ధారణ లేకపోతే శరీరము మరింత పాడవుతూ ఉంటుంది. పాడవుతూ-పాడవుతూ పూర్తిగా శ్మశానముపాలు అవుతుంది. కొత్త శరీరము మళ్ళీ భవిష్యత్తులో లభించనున్నది. ఆత్మను పవిత్రముగా తయారుచేసుకోవాలి. ఇదైతే పాత, మురికి పట్టిన శరీరము. దీనికి ఎంత పౌడర్ రాసినా కానీ, ఇది పైసకు కూడా కొరగానిది. ఇప్పుడు మీ అందరి నిశ్చితార్థము శివబాబాతో జరుగుతుంది. వివాహము జరిగే రోజున పాత వస్త్రాలను ధరిస్తారు. ఇప్పుడు ఈ శరీరానికి స్థూలమైన అలంకరణ ఎక్కువగా చేయకూడదు. జ్ఞాన-యోగాలతో స్వయాన్ని అలంకరించుకుంటే ఫరిశ్తాలుగా అవుతారు. ఇది జ్ఞాన మానస సరోవరము. ఇందులో జ్ఞానము యొక్క మునకలు వేస్తూ ఉన్నట్లయితే మీరు స్వర్గములోని దేవ కన్యలుగా అవుతారు. ప్రజలను దేవ కన్యలని అనరు. శ్రీకృష్ణుడు ఎత్తుకుపోయారని, మహారాణులుగా, పట్టపురాణులుగా చేసారని అంటూ ఉంటారు. అంతేకానీ, ఎత్తుకుపోయి ప్రజలలో చండాలురుగా చేసారని చెప్పరు కదా. పట్టపురాణులుగా చేయటం కోసమే ఎత్తుకుపోయారు. మీరు కూడా అలాంటి పురుషార్థము చేయాలి. ఏది లభిస్తే, అది చాలని అనుకోకూడదు. ఇది పాఠశాల. ఇక్కడ ముఖ్యమైనది చదువు. గీతా పాఠశాలలు చాలా తయారుచేస్తారు. అక్కడ కూర్చుని గీతను వినిపిస్తారు, కంఠస్థము చేయిస్తారు. ఏదైనా ఒక శ్లోకము తీసుకుని, దానిపై విస్తారముగా అర్థం చేయిస్తారు. కొందరు మామూలుగా చదువుతారు, మరి కొందరు ఒక శ్లోకముపై అర్ధ గంట, ముప్పావు గంట ఉపన్యసిస్తారు, దాని వలన లాభమేమీ ఉండదు. ఇక్కడైతే తండ్రి కూర్చుని చదివిస్తారు. లక్ష్యము-ఉద్దేశ్యము స్పష్టముగా ఉంది. ఇతర వేద-శాస్త్రాలు మొదలైనవి చదవడములో లక్ష్యము-ఉద్దేశ్యము లేదు. పురుషార్థము చేస్తూ ఉండండి. కానీ ఏం లభిస్తుంది? ఎప్పుడైతే చాలా భక్తి చేస్తారో, అప్పుడు భగవంతుడు లభిస్తారు. రాత్రి తర్వాత పగలు తప్పకుండా ఉంటుంది. కల్పము ఆయువును ఒక్కొక్కరూ ఒక్కొక్క విధముగా చెప్తారు. ఇప్పుడు అర్థం చేయించేందుకు కూడా శక్తి కావాలి. యోగబలము ద్వారా పని చేయాలి. ఒకవేళ చేయలేకపోతే, శక్తి లేనట్లు, యోగము లేనట్లు. ఎవరైతే యోగయుక్తులైన పిల్లలుంటారో, బాబా కూడా వారికే సహాయము చేస్తారు. డ్రామాలో ఏది ఉంటే, అది రిపీట్ అవుతుంది. క్షణ-క్షణము ఏదైతే గడుస్తూ ఉంటుందో, అది టిక్-టిక్ అంటూ గడుస్తుంది. మనము శ్రీమతము అనుసారముగా కర్మలోకి వస్తాము. శ్రీమతముపై నడవకపోతే శ్రేష్ఠముగా అవ్వరు. నంబరువారుగా అయితే ఉన్నారు కదా. మనమంతా ఒక్కటవ్వాలని మనుష్యులు భావిస్తారు కానీ దాని అర్థం తెలియదు. ఒక్కటవ్వాలి అంటే ఏమిటి, అందరూ ఒక్క తండ్రి వలె అవ్వాలనా లేక సోదరులందరూ కలిసి ఒక్కటిగా అవ్వాలనా? ఒకవేళ సోదరులందరూ ఒక్కటిగా అవ్వాలి అని అన్నా, అది కూడా సరియైనదే. శ్రీమతము ద్వారా తప్పకుండా మనమంతా ఒక్కటిగా అవ్వగలము. మీరంతా ఒకే మతముపై నడుస్తారు. మీ తండ్రి, టీచరు, గురువు ఒక్కరే. ఎవరైతే పూర్తిగా శ్రీమతముపై నడవరో, వారు శ్రేష్ఠముగా అవ్వలేరు. ఒకవేళ అస్సలు నడవకపోతే, వారు సమాప్తమైపోతారు. ఎవరైతే యోగ్యులుగా, తెలివైనవారిగా ఉంటారో, వారినే రేసులో ఉంచుతారు. పెద్ద-పెద్ద రేసులలో మంచి గుర్రాలనే ఉంచుతారు ఎందుకంటే లాటరీ కూడా పెద్ద మొత్తంలో పెడతారు. ఇది కూడా మానవ అశ్వాల రేస్. హుస్సేన్ గుర్రాన్ని కూడా చూపిస్తారు.

హింస రెండు రకాలుగా ఉంటుందని పిల్లలైన మీకు తెలుసు. మొట్టమొదటిది కామ ఖడ్గము, దాని వలన అర్ధకల్పముగా మిమ్మల్ని మీరు కూడా హతమార్చుకుంటూ వచ్చారు, ఇతరులను కూడా హతమారుస్తూ వచ్చారు. ఈ హింస గురించి ఎవ్వరికీ తెలియనే తెలియదు. సన్యాసులు కూడా ఇలా భావించరు. వారు కేవలం, ఇది వికారము అని అంటారు. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, ఈ కామము మహాశత్రువు, ఇది ఆదిమధ్యాంతాలు దుఃఖమిస్తుంది. ఇది కూడా ఋజువు చేసి చెప్పాలి - మాది ప్రవృత్తి మార్గము, రాజయోగము, మీది హఠయోగము, మీరు శంకరాచార్యుని ద్వారా హఠయోగాన్ని నేర్చుకుంటారు, మేము శివాచార్యుని ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటాము. మున్ముందు మీ ప్రత్యక్షత తప్పకుండా జరుగుతుంది. కొందరు ఈ ప్రశ్న అడుగుతారు - దేవతలవి 5000 సంవత్సరాలలో 84 జన్మలైతే, క్రిస్టియన్లవి ఎన్ని జన్మలు అని. క్రైస్టు వచ్చి 2000 సంవత్సరాలయ్యింది, వారికి సగటున ఎన్ని జన్మలు ఉండవచ్చో ఇప్పుడు లెక్క వేయండి. 30-32 జన్మలని తేలుతుంది. ఇదైతే స్పష్టముగా ఉంది. ఎవరైతే చాలా సుఖాన్ని చూస్తారో, వారు చాలా దుఃఖాన్ని కూడా చూస్తారు. ఇతర ధర్మాల వారికి తక్కువ సుఖము, తక్కువ దుఃఖము లభిస్తుంది. ఏవరేజ్ లెక్కను తీయాలి. ముఖ్యమైన గురువులు ఎవరైతే ఉన్నారో, వారి జన్మల లెక్క తీస్తాము. ఎవరైతే వెనుక వస్తారో, వారు కొన్ని-కొన్ని జన్మలు తీసుకుంటారు. బుద్ధుడు, ఇబ్రహీమ్ యొక్క లెక్కను కూడా తీయవచ్చు. మహా అయితే 1-2 జన్మల తేడా ఉండవచ్చు. ఏక్యురేట్ గా అయితే చెప్పలేరు. సుమారుగా చెప్పగలరు. ఇవన్నీ విచార సాగర మంథనము చేయాల్సిన విషయాలు. ఎవరైనా అడిగితే ఏమని అర్థం చేయించాలి? అయినా చెప్పండి, ముందు తండ్రిని స్మృతి చేయండి ఎందుకంటే తండ్రి నుండి వారసత్వము తీసుకోవాలి. ఇంతకుముందు ఎన్ని జన్మలు తీసుకుని ఉంటారో, అన్నే తీసుకుంటారు. తండ్రి నుండి వారసత్వము తీసుకోండి. మంచి రీతిలో అర్థం చేయించాలి. ఇది శ్రమతో కూడిన పని.

పిల్లలు బొంబాయిలో చాలా కష్టపడుతున్నారు ఎందుకంటే వారు చాలా విజయవంతులుగా అవ్వాల్సి ఉంది. ఇందులో బుద్ధి కావాలి. బాబా యొక్క ధనము పట్ల చాలా ప్రేమ ఉండాలి. కొందరు ఈ ధనము తీసుకోరు. అరే! జ్ఞాన రత్నాలను తీసుకోండి మరియు ధారణ చేయండి అని చెప్తే వారేమంటారంటే - నేనేమి చేయను, నాకు అర్థం కావడము లేదు అని. నీకు అర్థం కాకపోతే ఇక నీ తలరాత. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శరీరాన్ని బాగా ఉంచుకునేందుకు జ్ఞాన-యోగాలను ధారణ చేయాలి. ఏ వస్తువు పట్ల లోభము పెట్టుకోకూడదు. ఈ జ్ఞాన-యోగాలతో అలంకరించుకోవాలి, స్థూలమైన అలంకరణతో కాదు.

2. ఒక ఘడియ, అర్ధ ఘడియ చదువును తప్పకుండా చదువుకోవాలి. జ్ఞాన-యోగాలలో రేస్ చేయాలి.

వరదానము:- సంగమయుగము యొక్క శ్రేష్ఠమైన చిత్రాన్ని ఎదురుగా పెట్టుకుని భవిష్యత్తును దర్శనము చేసే త్రికాలదర్శి భవ
భవిష్యత్తు కన్నా ముందే సర్వ ప్రాప్తుల అనుభవాన్ని సంగమయుగీ బ్రాహ్మణులైన మీరు చేస్తారు. ఇప్పుడు మీరు డబల్ కిరీటధారులుగా, సింహాసనాధికారులుగా, తిలకధారులుగా, సర్వ అధికారీ మూర్తులుగా అవుతారు. భవిష్యత్తులోనైతే బంగారు స్పూన్ ఎలాగూ ఉంటుంది కానీ ఇప్పుడు వజ్ర సమానముగా అవుతారు. జీవితమే వజ్రము వలె అయిపోతుంది. అక్కడ బంగారము, వజ్రాల ఊయలలో ఊగుతారు, ఇక్కడ బాప్ దాదా ఒడిలో, అతీంద్రియ సుఖమనే ఊయలలో ఊగుతారు. కావున త్రికాలదర్శులుగా అయి వర్తమానము మరియు భవిష్యత్తు యొక్క శ్రేష్ఠమైన చిత్రాన్ని చూస్తూ సర్వ ప్రాప్తులను అనుభవము చేయండి.
స్లోగన్:- కర్మ మరియు యోగము యొక్క బ్యాలన్సే పరమాత్మ బ్లెసింగ్ కు (ఆశీర్వాదాలకు) అధికారులుగా చేస్తుంది.

 

అవ్యక్త ప్రేరణలు - బ్రహ్మాబాబా సమానముగా సంపన్న మరియు సంపూర్ణ స్థితిని అనుభవము చేయండి

బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ బాబా సమానముగా చైతన్య చిత్రముగా అవ్వండి, లైట్ మరియు మైట్ హౌస్ ల సజీవ ప్రదర్శకులుగా అవ్వండి. సంకల్ప శక్తి యొక్క, సైలెన్స్ యొక్క భాషణను తయారుచేసుకోండి మరియు కర్మాతీత స్టేజ్ పై వరదానీ మూర్తి యొక్క పాత్రను పోషించండి, అప్పుడు సంపూర్ణత సమీపముగా వస్తుంది. అప్పుడు సెకండు కంటే కూడా త్వరగా ఎక్కడైతే కర్తవ్యము చేయించాల్సి ఉంటుందో, అక్కడికి వైర్ లెస్ ద్వారా డైరెక్షన్లు ఇవ్వగలరు. కర్మాతీత స్టేజ్ యొక్క ఆధారముతో సంకల్పము చేసిన వెంటనే ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆ సంకల్పము సెకండులో చేరిపోతుంది.

మురళి అంటే ఏమిటి?

మురళి బ్రహ్మకుమారీల దైనిక ఆధ్యాత్మిక బోధన, ఇది ప్రతి ఉదయం మధుబన్ నుండి ప్రచురించబడుతుంది. ఇక్కడ మీరు ఈరోజు మురళిని తెలుగులో చదవవచ్చు, ఆడియో వినవచ్చు మరియు PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధ్యయనానికి సహాయంగా పాఠ్యాన్ని హైలైట్ చేయవచ్చు — మీ గుర్తులు ఈ బ్రౌజర్‌లోనే సురక్షితంగా ఉంటాయి.

Also searched astodays murli in telugu · today murli in telugu · today murli telugu · bk telugu murli · telugu pdf murli · daily murli telugu · telugu murli today · telugu murli · today's telugu murali · brahma kumaris daily murli in telugu · brahma kumaris telugu murli today · baba murli telugu today · om shanti telugu murli today · bk murli today telugu · ఈరోజు తెలుగు మురళి · murali in telugu

28 భాషల్లో మురళి

Daily Murli · Madhuban మూలం: మధుబన్ మురళి విభాగం ఇది స్వతంత్ర రీడర్ యాప్, అధికారిక వెబ్‌సైట్ కాదు.