| 28-11-2026 |
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
|
మధువనం |
| ‘‘మధురమైన పిల్లలూ - అందరికీ ఒక్క తండ్రి పరిచయాన్నే ఇవ్వండి, ఒక్క తండ్రితోనే ఇచ్చి-పుచ్చుకోవడాలను చేయండి, తండ్రికే మీ సత్యమైన లెక్కాపత్రాన్ని ఇవ్వండి’’ | |
| ప్రశ్న:- | పిల్లల ద్వారా ఇప్పటికీ అనేక రకాల పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, దానికి కారణమేమిటి? |
| జవాబు:- | ముఖ్యమైన కారణమేమిటంటే - యోగములో చాలా కచ్చాగా (అపరిపక్వముగా) ఉన్నారు. తండ్రి స్మృతిలో ఉన్నట్లయితే ఎప్పుడూ ఎలాంటి చెడు కర్మ జరగదు. నామ-రూపాలలో చిక్కుకున్నట్లయితే యోగము కుదరదు. మీరు పతితము నుండి పావనముగా అవ్వాలి అన్న తపనలో ఉండండి. నిరంతరం శివబాబా స్మృతిలో ఉండండి, మీకు పరస్పరములో దైహిక ప్రేమ ఉండకూడదు. |
| పాట:- | దీపపు పురుగులు ఎందుకు కాలిపోలేదు... |
ఓంశాంతి. భక్తి మార్గములో ఈ పాటలను పాడారు. చివరికి ఇవన్నీ ఆగిపోతాయి, వీటి అవసరముండదు. ఒక్క సెకెండులో తండ్రి నుండి వారసత్వము లభిస్తుందని గాయనము కూడా ఉంది. అనంతమైన తండ్రి నుండి జీవన్ముక్తి యొక్క వారసత్వము లభిస్తుందని మీకు తెలుసు. జీవన్ముక్తి అనగా ఈ దుఃఖధామము నుండి ముక్తి, భ్రష్టాచారము నుండి ముక్తి. తర్వాత ఏమవుతారు? దాని కోసం లక్ష్యాన్ని-ఉద్దేశ్యాన్ని చాలా బాగా అర్థం చేయించాలి. బాబా రాత్రి కూడా అర్థం చేయించారు - ఎవరైనా వస్తే ముందుగా వారికి, ఉన్నతోన్నతమైన భగవంతుని పరిచయాన్ని ఇవ్వండి. ఇక్కడి ఉద్దేశ్యము ఏమిటి అని వారు అడుగుతారు. కనుక మొట్టమొదట అనంతమైన తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఇప్పుడు వారంటారు - నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనముగా అవుతారు. ఓ పతిత-పావనా రండి, అని పాడుతారు కూడా. అంటే తండ్రికి తప్పకుండా ఏదో ఒక అథారిటీ ఉంటుంది కదా. ఏదో ఒక పాత్ర లభించి ఉంటుంది. వారిని ఉన్నతోన్నతమైన తండ్రి అని అంటారు. వారు భారత్ లోనే వస్తారు. వారు వచ్చి భారత్ నే ఉన్నతోన్నతముగా తయారుచేస్తారు. వైకుంఠము యొక్క కానుకను తీసుకువస్తారు. మనుష్య సృష్టిలో ఉన్నతోన్నతమైనవారు దేవీ-దేవతలు, సూర్యవంశీయులు, వారు సత్యయుగములో రాజ్యము చేసేవారు. సత్యయుగాన్ని స్థాపన చేసేవారు ఉన్నతోన్నతమైన భగవంతుడే. వారిని స్వర్గ స్థాపన చేసేవారు, హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు కూడా. వారు తండ్రి, వారి గురించి ఎప్పుడూ - తండ్రి సర్వవ్యాపి అని అనలేరు. సర్వవ్యాపి అని అనడముతో తండ్రి వారసత్వము మాయమైపోతుంది. ఇవి ఎంత మధురమైన విషయాలు. తండ్రి అనగా వారసత్వము. తప్పకుండా తమ పిల్లలకే వారసత్వాన్ని ఇస్తారు. పిల్లలందరి తండ్రి ఒక్కరే. వారు వచ్చి సుఖ-శాంతుల వారసత్వాన్ని ఇస్తారు. రాజయోగాన్ని నేర్పిస్తారు. మిగిలిన ఆత్మలన్నీ లెక్కాచారాలను తీర్చుకుని తిరిగి వెళ్ళిపోతారు. ఇప్పుడు పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది. దాని కోసమే ఈ మహాభారత యుద్ధము ఉంది. అనేక ధర్మాల వినాశనము, ఏక ధర్మ స్థాపన జరగనున్నది. తప్పకుండా కలియుగము తర్వాత సత్యయుగము రావాలని బుద్ధి కూడా చెప్తుంది. దేవీ-దేవతల చరిత్ర రిపీట్ అవుతుంది. బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తారని అంటూ ఉంటారు కూడా. ఉన్నతోన్నతమైన పదవిని ప్రాప్తింపజేస్తారు.
తండ్రి అంటారు - పిల్లలూ, ఈ అంతిమ జన్మలో పవిత్రముగా అవ్వండి. ఇప్పుడు మృత్యులోకము ముర్దాబాద్ (నశించడం) మరియు అమరలోకము జిందాబాద్ అవ్వనున్నది. మీరందరూ పార్వతులు, అమరకథను వింటున్నారు. కుమారులు మరియు కుమార్తెలు, ఇరువురూ అమరులుగా అవుతారు కదా. దీనిని అమరకథ అనైనా అనండి, మూడవ నేత్రము కథ అనైనా అనండి. చాలా వరకు మాతలే కథలు వింటారు, అంటే అమరపురిలో పురుషులు ఉండరా? ఇరువురూ ఉంటారు. భక్తి మార్గములోని శాస్త్రాలు ఏం చెప్తున్నాయో మరియు తండ్రి ఏం చెప్తున్నారో తండ్రియే అర్థం చేయిస్తారు. భక్తి ఫలాన్ని ఇవ్వడానికి భగవంతుడు వస్తారని కూడా అంటారు. తప్పకుండా సత్యయుగములో విశ్వముపై ఈ దేవీ-దేవతల రాజ్యమే ఉండేది. వారికి ఆ ఫలాన్ని ఎవరిచ్చారు? సాధు-సన్యాసులు మొదలైనవారెవ్వరూ ఇవ్వలేరు. భక్తిని కూడా అందరూ ఒకేలా చేయరు, ఇది కూడా మీకు తెలుసు. ఎవరైతే చాలా భక్తి చేస్తారో, వారికి ఫలము కూడా తప్పకుండా అలాగే లభిస్తుంది. ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో, వారే పూజారులుగా అయ్యారు, మళ్ళీ పూజ్యులుగా అవుతారు. భక్తి ఫలమైతే లభిస్తుంది కదా. ఈ విషయాలన్నింటినీ కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది. మొట్టమొదట త్రిమూర్తి చిత్రముపై అర్థం చేయించాలి. అంతేకానీ, ముందు మెట్ల వరస చిత్రము వద్దకు తీసుకువెళ్ళకూడదు. ఇవి విస్తారమైన విషయాలు. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. వారు ఉన్నతోన్నతమైనవారు. తర్వాత బ్రహ్మా-విష్ణు-శంకరుల పరిచయము, ఆ తర్వాత లక్ష్మీ-నారాయణుల పరిచయము ఇవ్వాలి. ఇకపోతే, భక్తి మార్గపు చిత్రాలైతే ఎన్నో ఉన్నాయి. మొట్టమొదట ఇలా చెప్పండి - వారు అనంతమైన తండ్రి, వారి నుండి మనము అనంతమైన స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటాము. ఉన్నతోన్నతమైన భగవంతుడు వారసత్వాన్ని కూడా ఉన్నతోన్నతమైనదే ఇస్తారు. భారత్ లో శివజయంతిని కూడా జరుపుకుంటారు, తప్పకుండా హెవెన్లీ గాడ్ ఫాదర్ వచ్చి స్వర్గాన్ని స్థాపన చేసి ఉంటారు. తండ్రియే స్వర్గ స్థాపన చేస్తారు, మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత నరకముగా అవుతుంది. రాముడు కూడా రావాల్సి ఉంటుంది, అలానే సమయమనుసారముగా రావణుడు కూడా రావాల్సి ఉంటుంది. రాముడు వారసత్వాన్ని ఇస్తారు, రావణుడు శాపాన్ని ఇస్తాడు. జ్ఞానము అనగా పగలు పూర్తయి రాత్రి అవుతుంది. పగలులో కేవలం సూర్యవంశీయులు, చంద్రవంశీయులు ఉంటారు. ఈ విషయాలను సారములో అర్థం చేయించడము చాలా సులభము. మొట్టమొదట ఉన్నతోన్నతమైన తండ్రి పరిచయాన్ని ఇచ్చి పక్కా చేయించాలి. ఇదే ముఖ్యమైన విషయము. సత్యయుగములో దేవీ-దేవతల వంశముండేది. సతోప్రధానముగా ఉండేవారు, తర్వాత సతో, రజో, తమోలలోకి వచ్చారు. ఇది చక్రము. ఏదీ ఎప్పటికీ ఒకేలా ఉండదు. పిల్లలైన మీ బుద్ధిలో ఈ విషయమే గుర్తుండాలి - ఉన్నతోన్నతమైన తండ్రిని స్మృతి చేయాలి అని. ఈ స్మృతిలో చాలా మంది కచ్చాగా (అపరిపక్వముగా) ఉన్నారు. స్మృతిని పదే-పదే మర్చిపోతానని బాబా కూడా తమ అనుభవాన్ని చెప్తారు ఎందుకంటే బాబాకు చాలా ఆలోచనలుంటాయి. అందుకే అంటారు, ఎవరి తలపైనైతే చాలా బాధ్యతలు ఉంటాయో, వారు స్మృతిలో ఎలా ఉండగలరు అని. బాబాకు రోజంతా ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. ఎన్ని విషయాలు ఎదురుగా వస్తాయి. బాబాకు ఉదయాన్నే లేచి కూర్చోవడములో చాలా మజా వస్తుంది. నషా కూడా ఉంటుంది - ఇప్పుడిక స్థాపన జరిగిన తర్వాత నేను మళ్ళీ విశ్వ మహారాజుగా అవుతాను అని. బాబా తమ అనుభవముతో ఇలా చెప్తారు - మొట్టమొదటి ముఖ్యమైన విషయము తండ్రి పరిచయము. ఇక మిగతా ఎవరు ఏ విషయాలు మాట్లాడినా, వారికి ఇలా చెప్పండి - వాటి వలన లాభమేమీ లేదు, మేము మీకు ఉన్నతోన్నతమైన తండ్రి పరిచయాన్ని ఇస్తాము, వారే విశ్వానికి యజమానులుగా తయారయ్యే ఉన్నతోన్నతమైన వారసత్వాన్ని ఇస్తారు. ఆర్య సమాజము వారు దేవతల చిత్రాలను నమ్మరు. మీ వద్ద చిత్రాలను చూసినప్పుడు డిస్టర్బ్ అవుతారు. ఎవరైతే వారసత్వము తీసుకునేది ఉంటుందో, వారు శాంతిగా వచ్చి వింటూ ఉంటారు. ఉన్నతోన్నతమైన భగవంతుని గురించిన విషయమే ముఖ్యమైనది. ఉన్నతోన్నతమైనవారు అని బ్రహ్మా, విష్ణు, శంకరులను అనరు. ఉన్నతోన్నతమైన తండ్రి నుండి మాత్రమే వారసత్వము లభిస్తుంది. వారే పతిత-పావనుడు. ఈ విషయాన్ని పక్కా చేసుకోండి. భగవంతుడు ఒక్కరే. తండ్రి అనగా వారసత్వము. వారు భారత్ లోకి వచ్చి వారసత్వాన్ని ఇస్తారు. బ్రహ్మా ద్వారా కొత్త ప్రపంచ స్థాపన, శంకరుని ద్వారా వినాశనము జరుగుతుంది. ఈ మహాభారత యుద్ధముతోనే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. పతితము నుండి పావనముగా అవుతారు. అనంతమైన తండ్రి నుండే భారత్ కు వారసత్వము లభిస్తుంది. ఇక వేరే విషయమేమీ లేదు. ఇక్కడున్నది ఒకే విషయము. తండ్రి అంటారు - నన్ను స్మృతి చేసినట్లయితే మీ మాలిన్యము తొలగిపోతుంది. ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాతే మిగిలినవేవైనా అర్థం చేయించండి. ఇన్ని చిత్రాలు ఏవైతే ఉన్నాయో, ఇవి విస్తారాన్ని తెలిపేవి. జ్ఞానామృతాన్ని తాగి పవిత్రముగా అవ్వండి అని మనము చెప్తాము. వారు, విషము కావాలి అని అంటారు. దీని గురించి ఒక చిత్రము కూడా ఉంది. అందుకే, అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు తాగాలి అని అంటారు.
ఈ ఆత్మిక జ్ఞానాన్ని స్పిరిచ్యుల్ ఫాదర్ మాత్రమే ఇస్తారు. ఆ తండ్రి సర్వవ్యాపి ఎలా అవుతారు. మీరు తండ్రిని సర్వవ్యాపి అని నమ్మితే నమ్మండి, మేము ఇప్పుడు నమ్మము. ఇంతకుముందు మేము నమ్మేవారము. అది తప్పు అని తండ్రి ఇప్పుడు తెలియజేశారు. తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. ఇప్పుడు భారత్ నరకముగా ఉంది, దానిని మనము మళ్ళీ స్వర్గముగా అనగా పవిత్ర గృహస్థ ఆశ్రమముగా తయారుచేస్తాము. ఆది సనాతన దేవీ-దేవతలది పవిత్ర గృహస్థ ఆశ్రమము. ఇప్పుడున్నది అపవిత్ర వికారీ ప్రపంచము. తండ్రి అంటారు - నన్ను స్మృతి చేయండి. ఉన్నతోన్నతమైనవారు శివబాబా, రచయిత, వారి నుండి వారసత్వము లభిస్తుంది. ఇప్పుడు కలియుగములో ఎంతోమంది మనుష్యులు ఉన్నారు. సత్యయుగములోనైతే చాలా కొద్దిమంది మనుష్యులు ఉంటారు. ఆ సమయములో మిగిలినవారంతా శాంతిధామములో ఉంటారు. కనుక తప్పకుండా ఇప్పుడు యుద్ధము జరుగుతుంది, అప్పుడు ముక్తిలోకి వెళ్తారు. ఈ విషయాలన్నీ పిల్లల బుద్ధిలో ఉండాలి. పిల్లలు సేవను తప్పకుండా చేయాలి. సేవతోనే ఉన్నత పదవిని పొందుతారు. అలాగని పరస్పరము ఒకరితో ఒకరికి పడకపోతే, శివబాబాను మర్చిపోవడము లేక శివబాబా సేవను వదిలేయడము చేయకూడదు. అలా చేస్తే పదవి భ్రష్టమైపోతుంది. అప్పుడిక ఈ సర్వీస్ చేయడానికి బదులుగా డిస్సర్వీస్ చేస్తారు. పరస్పరములో ఉప్పునీరులా అయి సేవను వదిలేయడము - ఇటువంటి చెడ్డ పని ఇంకొకటి లేదు. బాబాను స్మృతి చేస్తే సంపాదన కూడా జరుగుతుంది. ఇప్పుడు జ్ఞానము లభించింది, పవిత్రముగా అవ్వండి మరియు తండ్రిని స్మృతి చేయండి. జ్ఞానపు రంగులో ముంచడాన్ని ధురియా అని అంటారు. జ్ఞానము మరియు విజ్ఞానము అని అంటారు. విజ్ఞానము అనగా యోగము, జ్ఞానము అనగా సృష్టి చక్ర జ్ఞానము. హోలీ-ధురియాల గురించి మనుష్యులు ఏమీ అర్థం చేసుకోరు. తండ్రిని స్మృతి చేయండి మరియు జ్ఞానాన్ని అందరికీ వినిపించండి. ఉన్నతోన్నతమైన తండ్రిని సర్వవ్యాపి అని అనలేరని బాబా పదే-పదే అర్థం చేయిస్తారు. లేకుంటే మీరు స్వయం ఎవరిని స్మృతి చేస్తారు? తండ్రి అంటారు - నిరంతరం నన్ను స్మృతి చేయండి. కానీ రచయిత గురించి తెలియకపోతే ఏం లభిస్తుంది! తెలియని కారణముగా సర్వవ్యాపి అని అంటారు. కనుక వారు ఉన్నతోన్నతమైనవారు అని ఋజువు చేసి అర్థం చేయించండి. అప్పుడు సర్వవ్యాపి గురించిన విషయాలు బుద్ధి నుండి తొలగిపోతాయి. మనమంతా సోదరులము. తండ్రి ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వచ్చి వారసత్వాన్ని ఇస్తారు. సత్యయుగములో దేవీ-దేవతలు ఉంటారు. మిగిలినవారంతా ముక్తిలోకి వెళ్తారు. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇస్తూ ఉండండి. క్రైస్టును ప్రార్థిస్తారు. క్రైస్టు అయితే అందరికీ ఫాదర్ కాదు కదా అని చెప్పండి. అందరికీ ఫాదర్ అయితే నిరాకారుడు, వారినే ఆత్మ - ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తుంది. క్రైస్టును వారి బిడ్డ అని అంటూ ఉంటారు. కొడుకు నుండి వారసత్వము ఎలా లభిస్తుంది. క్రైస్టు అయితే రచన. క్రైస్టును స్మృతి చేయడముతో ఆత్మ తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతుందని ఏ శాస్త్రాలలోనూ వ్రాసి లేదు. ఒక్క గీతలో మాత్రమే, నన్నొక్కరినే స్మృతి చేయండి అని ఉంది. గాడ్ ఫాదర్ యొక్క శాస్త్రమే గీత. కేవలం తండ్రి పేరును మార్చి శ్రీకృష్ణుని పేరును వ్రాసేశారు. ఈ తప్పు చేసారు. ఉన్నతోన్నతమైనవారు తండ్రి, వారే సుఖ-శాంతుల వారసత్వాన్ని ఇస్తారు. శివుని చిత్రాన్ని అందరూ తమ వద్ద పెట్టుకోవాలి. శివబాబా ఈ వారసత్వాన్ని ఇస్తారు. తర్వాత 84 జన్మలలో పోగొట్టుకుంటారు. పతిత-పావనుడైన తండ్రియే వచ్చి పావనముగా తయారయ్యే యుక్తిని తెలియజేస్తారని మెట్ల వరస చిత్రముపై అర్థం చేయించాలి. వారు శ్రీకృష్ణ భగవానువాచ అని అంటారు, మీరు శివ భగవానువాచ అని అంటారు. మొదటి అంతస్థులో ఉన్నతమైన తండ్రి ఉంటారు, తర్వాత రెండవ అంతస్థులో సూక్ష్మవతనము, ఇది మూడవ అంతస్థు. సృష్టి ఇక్కడ ఉంది. చివరిలో సూక్ష్మవతనానికి వెళ్తారు. అక్కడ ట్రిబ్యునల్ (న్యాయసభ) కూర్చుంటుంది. శిక్షలు లభిస్తాయి. శిక్షలు అనుభవించి పవిత్రముగా అయి పైకి వెళ్ళిపోతారు. తండ్రి పిల్లలందరినీ తీసుకువెళ్తారు. ఇప్పుడిది సంగమము. దీనికి 100 సంవత్సరాలు ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లలు అడుగుతారు - బాబా, స్వర్గములో ఏమేమి ఉంటాయి? బాబా అంటారు - పిల్లలూ, అది మున్ముందు చూడండి. ముందు మీరు తండ్రిని తెలుసుకోండి, పతితము నుండి పావనముగా తయారయ్యే తపనలో ఉండండి. స్వర్గములో ఏమి జరిగేది ఉంటే, అది జరుగుతూ ఉంటుంది. మీరు ఎంత పావనముగా అవ్వాలంటే, తండ్రి నుండి కొత్త ప్రపంచము యొక్క పూర్తి వారసత్వము లభించాలి. ఇకపోతే, మధ్యలో ఏం జరుగుతుంది, ఇది కూడా మున్ముందు చూడండి. ఈ విషయాలన్నింటినీ గుర్తుంచుకోవాలి. గుర్తుండని కారణముగా సమయానికి అర్థం చేసుకోరు, మర్చిపోతారు. పిల్లలు కర్మలు కూడా మంచివి చేయాలి. తండ్రి స్మృతిలో ఉంటే చెడు కర్మలు జరగనే జరగవు. చాలామంది చెడు కర్మలు కూడా చేస్తారు. కేవలం ఈ బ్రాహ్మణి చెప్పేదే బాగుందని భావించకూడదు. ఆ బ్రాహ్మణి వెళ్ళిపోతే స్వయం కూడా సమాప్తమైపోతారు. బ్రాహ్మణి కారణముగా మరణిస్తారు అనగా తండ్రి వారసత్వము తీసుకోవడము నుండి మరణిస్తారు. దీనిని కూడా దురదృష్టమని అనడము జరుగుతుంది.
కొంతమంది పిల్లలు పరస్పరము నామ-రూపాలలో చిక్కుకుని మరణిస్తారు. ఇక్కడ మీకు దైహిక ప్రేమ ఉండకూడదు. నిరంతరము శివబాబాను స్మృతి చేయాలి. ఎవ్వరితోనూ ఇచ్చి-పుచ్చుకోవడాలు ఉండకూడదు. మాకు ఎందుకు ఇస్తారు? అని అడగండి. మీ యోగమైతే శివబాబాతో ఉంది కదా. ఎవరైతే డైరెక్టుగా ఇవ్వరో, వారిది శివబాబా వద్ద జమ అవ్వదు. బ్రహ్మా ద్వారా స్థాపన జరుగుతుంది కనుక వారి ద్వారానే అంతా చేయాలి. మధ్యలో ఎవరైనా తినేస్తే, శివబాబా వద్ద జమ అవ్వదు. శివబాబాకు ఇవ్వాలి అంటే అది బ్రహ్మా ద్వారా ఇవ్వాలి. సెంటరు కూడా బ్రహ్మా ద్వారానే తెరవండి. మీకు మీరే సెంటరు తెరుస్తే, అది సెంటరు కాదు. బాప్ దాదా ఇరువురూ కలిసి ఉన్నారు. వీరి చేతికి వచ్చిందంటే శివబాబా చేతికి వచ్చినట్లే. ఎన్ని సెంటర్లు ఉన్నాయి, వాటి గురించి ఏ సమాచారము లేదు. శివబాబా, ఇవి మీ సెంటరు యొక్క ఎకౌంట్స్ అని వ్రాయాలి. సేఠ్ వద్దకు ఎకౌంట్ రావాలి కదా. చాలా మందిది శివబాబా వద్ద జమ అవ్వదు. వారికి ఆ తెలివి కూడా ఉండదు. వారికి జ్ఞానమైతే చాలా ఉంది కానీ ఆ యుక్తి తెలియదు. మేము సెంటరు తెరిచాము కదా అని అనుకుంటారు. మీరు ఎవరికైతే ఇచ్చారో, వారు సెంటరు తెరిచినట్లు. అది శివబాబా తెరవలేదు. అటువంటి సెంటరు శక్తిని కూడా పుంజుకోదు. సెంటరు తెరవాలంటే శివబాబా ద్వారానే జరగాలి. శివబాబా, మేము ఇది ఇస్తున్నాము, సెంటర్ తెరవడానికి ఉపయోగించండి అని అనాలి. పిల్లలు చాలా తప్పులు చేస్తారు. యోగములో చాలా కచ్చాగా ఉన్నారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. జ్ఞానముతో పాటుగా తమ భవిష్యత్తును తయారుచేసుకునే యుక్తిని కూడా నేర్చుకోవాలి. ఒక్క తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. ఏ దేహధారి వెనుక వెళ్ళి దురదృష్టవంతులుగా అవ్వకూడదు.
2. పరస్పరములో ఏ విషయము కారణముగానైనా తండ్రి సేవను విడిచిపెట్టకూడదు. ఉదయాన్నే లేచి మీతో మీరు మాట్లాడుకోవాలి. స్మృతి చేసే శ్రమ చేయాలి.
| వరదానము:- |
తమ శ్రేష్ఠ ధారణల కొరకు త్యాగములో భాగ్యాన్ని అనుభవము చేసే సత్యమైన త్యాగి భవ బ్రాహ్మణుల శ్రేష్ఠమైన ధారణ సంపూర్ణ పవిత్రత. ఈ ధారణ కోసమే - ప్రాణము పోయినా ధర్మము పోకూడదు అనే గాయనముంది. ఏ రకమైన పరిస్థితిలోనైనా తమ ఈ ధారణ కోసము ఏది త్యాగము చేయవలసి వచ్చినా, సహనము చేయవలసి వచ్చినా, ఎదుర్కోవలసి వచ్చినా, సాహసము చేయవలసి వచ్చినా సరే సంతోషముగా చేయండి - ఇందులో త్యాగాన్ని త్యాగముగా భావించకుండా భాగ్యము యొక్క అనుభవము చేయండి, అప్పుడు సత్యమైన త్యాగి అని అంటారు. ఇటువంటి ధారణ కలవారే సత్యమైన బ్రాహ్మణులుగా పిలవబడతారు. |
| స్లోగన్:- | సర్వశక్తులను తమ ఆర్డర్ లో ఉంచుకునేవారే మాస్టర్ సర్వశక్తివంతులు. |
అవ్యక్త ప్రేరణలు - బ్రహ్మాబాబా సమానముగా సంపన్న మరియు సంపూర్ణ స్థితిని అనుభవము చేయండి
ఎలా అయితే సాకారములో చూసారు కదా, చివరి సంపన్నమైన మరియు కర్మాతీత స్టేజ్ యొక్క పాత్ర కేవలం బ్లెస్సింగ్స్ (ఆశీర్వాదాలు) ఇచ్చేదిగానే ఉండినది. బ్యాలెన్స్ యొక్క విశేషత కూడా ఉండినది మరియు బ్లెస్సింగ్స్ యొక్క అద్భుతము కూడా ఉండినది. అలా ఫాలో ఫాదర్. సహజమైన మరియు శక్తిశాలి సేవ ఇదే. ఇప్పుడు విశేష ఆత్మల పాత్ర - ఆశీర్వాదాలు ఇవ్వటము. నయనాల ద్వారానైనా ఇవ్వండి, మస్తకమణి ద్వారానైనా ఇవ్వండి. కర్మలు చేస్తూ కూడా కర్మ బంధనాల నుండి సదా అతీతముగా ఉండండి. ఎప్పుడూ కూడా కర్మలకు వశీభూతులవ్వకూడదు, కర్మేంద్రియాల ద్వారా ప్రతి కర్మను చేస్తూ అధికారీతనపు నషాలో ఉండండి, ఇదే సంపూర్ణత యొక్క స్టేజ్.