| 08-10-2024 |
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
|
మధువనం |
| ‘‘మధురమైన పిల్లలూ - బుద్ధిని రిఫైన్ గా చేసుకోవాలంటే ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండండి, స్మృతి ద్వారానే ఆత్మ స్వచ్ఛముగా తయారవుతూ ఉంటుంది’’ | |
| ప్రశ్న:- | వర్తమాన సమయములో మనుష్యులు తమ సమయాన్ని మరియు ధనాన్ని ఎలా వృధా చేసుకుంటున్నారు? |
| జవాబు:- | ఎవరైనా శరీరాన్ని వదిలితే వారి వెనుక ఎంత ధనము మొదలైనవాటిని ఖర్చు చేస్తూ ఉంటారు. శరీరాన్ని వదిలి వెళ్ళిపోయాక ఇక దానికి ఏ విలువా లేదు, అందుకే వారి వెనుక ఏమేమైతే చేస్తారో, అందులో తమ సమయాన్ని మరియు ధనాన్ని వృధా చేస్తారు. |
ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. వీరు కూడా ఇలాగే అంటారు కదా. కావున తండ్రి అయినా అంటారు లేక దాదా అయినా అంటారు. దాదా కూడా అంటారు - ఆత్మిక తండ్రి పిల్లలైన మీకు భూత-భవిష్య-వర్తమానాల యొక్క ఈ జ్ఞానాన్ని వినిపిస్తారు. వాస్తవానికి సత్యయుగము నుండి మొదలుకుని త్రేతా వరకూ ఏమి జరిగింది అనేదే ముఖ్యమైన విషయము. ఇకపోతే ద్వాపర, కలియుగాలలో ఎవరెవరు వచ్చారో, ఏమి జరిగిందో, దాని చరిత్ర, భౌగోళికమై ఎంతో ఉంది. సత్య, త్రేతాయుగాలకు సంబంధించి ఏ చరిత్ర, భౌగోళికాలు లేవు, మిగిలినవారందరివీ చరిత్ర, భౌగోళికాల వివరాలు ఉన్నాయి. దేవతలనైతే లక్షల సంవత్సరాల పూర్వములోకి తీసుకువెళ్ళిపోయారు. ఇది అనంతమైన వివేకహీనత. మీరు కూడా అనంతమైన వివేకహీనతలో ఉండేవారు. ఇప్పుడు కొద్ది-కొద్దిగా అర్థం చేసుకుంటున్నారు. కొందరైతే ఇప్పుడు కూడా ఏమీ అర్థం చేసుకోరు. అర్థం చేసుకోవలసింది ఇంకా ఎంతో ఉంది. తండ్రి ఆబూ మహిమను గురించి అర్థం చేయించారు, దీని గురించి ఆలోచించాలి. మీ బుద్ధిలోకి రావాలి - మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు, మీ స్మృతిచిహ్నమైన దిల్వాడా మందిరము ఎప్పుడు తయారయ్యింది, ఎన్ని సంవత్సరాల తర్వాత తయారయ్యింది? 1,250 సంవత్సరాల క్రితం తయారయ్యింది అని అంటారు, మరి మిగిలింది ఎన్ని సంవత్సరాలు? 3,750 సంవత్సరాలు. కావున వారు కూడా ఇప్పటి స్మృతిచిహ్నాన్ని మరియు వైకుంఠపు స్మృతిచిహ్నాన్ని తయారుచేసారు. మందిరాలది కూడా కాంపిటీషన్ ఉంటుంది కదా. ఒకదాని కంటే మరొకటి బాగా నిర్మిస్తారు. ఇప్పుడైతే నిర్మించడానికి అసలు ధనము ఎక్కడుంది. ఇంతకుముందు ధనము ఎంతగానో ఉండేది, అప్పుడు సోమనాథ మందిరాన్ని ఎంత పెద్దగా తయారుచేసారు. ఇప్పుడైతే అలా తయారుచేయలేరు. ఆగ్రా మొదలైన చోట్ల నిర్మిస్తూ ఉంటారు కానీ అవన్నీ వ్యర్థమైనవే. మనుష్యులైతే అంధకారములో ఉన్నారు కదా. వాటిని నిర్మించే లోపు వినాశనం కూడా వచ్చేస్తుంది. ఈ విషయాల గురించి ఎవరికీ తెలియదు. పడగొడుతూ ఉంటారు మరియు నిర్మిస్తూ ఉంటారు. ధనము ఫ్రీగా వస్తూ ఉంటుంది. అంతా వృధా అవుతూ ఉంటుంది. సమయము వృధా, ధనము వృధా, శక్తి వృధా. ఎవరైనా మరణిస్తే ఎంత సమయాన్ని వృధా చేస్తారు. మనం ఏమీ చేయము. ఆత్మ అయితే వెళ్ళిపోయింది, ఇక ఆ శరీరము దేనికి పనికొస్తుంది. సర్పము తన శరీరాన్ని వదిలేస్తుంది, దానికేమైనా విలువ ఉందా. ఏమీ లేదు. భక్తి మార్గములో శరీరానికి విలువ ఉంది. జడచిత్రాలకు ఎంతగా పూజ చేస్తారు కానీ వారు ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు అన్నదేమీ తెలియదు. దానిని భూత పూజ అని అంటారు. పంచ తత్వాలకు పూజ చేస్తారు. ఈ లక్ష్మీ-నారాయణులు స్వర్గములో రాజ్యము చేసేవారు కదా, అయితే వారు 150 సంవత్సరాలు ఆయుష్షు పూర్తయ్యాక ఇక శరీరము వదిలేస్తారు, అంతే. శరీరమైతే ఎందుకూ పనికి రాదు. దానికి అక్కడ ఏమి విలువ ఉంటుంది. ఆత్మ వెళ్ళిపోతుంది, శరీరాన్ని చండాలుడి చేతికి ఇచ్చేస్తారు, అతను అక్కడి ఆచార, వ్యవహారాల బట్టి దానిని కాల్చేస్తాడు. అంతేకానీ వారి పేరును ప్రఖ్యాతం చేయడానికి వారి మట్టిని తీసుకుని తిప్పరు. ఇవేవీ చేయరు. ఇక్కడైతే ఎంతగా చేస్తూ ఉంటారు. బ్రాహ్మణులకు తినిపిస్తారు, అదీ-ఇదీ చేస్తూ ఉంటారు. అక్కడ ఇవేవీ ఉండవు. శరీరమైతే ఎందుకూ ఉపయోగపడదు. శరీరాన్ని కాల్చేస్తారు. ఇకపోతే చిత్రాలు ఉంటాయి, కానీ ఏక్యురేట్ చిత్రాలు లభించవు. ఈ ఆదిదేవుని రాతి మూర్తి ఏక్యురేట్ గా అదే విధముగా అయితే లేదు కదా. పూజను ఎప్పుడైతే ప్రారంభించారో అది అప్పటి రాతితో తయారుచేయబడినది. వాస్తవానికి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని శరీరమైతే కాలి అంతమైపోయింది కదా, మళ్ళీ భక్తి మార్గములో ఇది వెలువడింది. ఈ విషయాలపై కూడా ఆలోచన అయితే నడుస్తుంది కదా. ఆబూ మహిమనైతే బాగా నిరూపించాలి. మీరు కూడా ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడే తండ్రి మొత్తం విశ్వమంతటినీ నరకము నుండి స్వర్గముగా తయారుచేస్తున్నారు కావున ఇదే అన్నింటికన్నా ఉన్నతోన్నతమైన తీర్థ స్థానము. ప్రస్తుతం అంతటి భావన లేదు. కేవలం ఒక్క శివుని పట్ల భావన ఉంది. ఎక్కడికి వెళ్ళినా శివుని మందిరం తప్పకుండా ఉంటుంది. అమరనాథ్ లో కూడా శివుని మందిరమే ఉంది. శంకరుడు పార్వతికి కథను వినిపించారు అని అంటారు. అక్కడైతే కథ యొక్క విషయమే లేదు. మనుష్యులకు వివేకము ఏమీ లేదు. ఇప్పుడు మీకు వివేకము లభించింది. మీకు ఇంతకుముందేమైనా తెలుసా?
ఇప్పుడు బాబా ఆబూకు ఎంతగా మహిమ చేస్తూ ఉంటారు. అన్ని తీర్థ స్థానాలలో కల్లా ఇది మహాన్ తీర్థ స్థానము. బాబా అయితే ఎంతగానో అర్థం చేయిస్తూ ఉంటారు, కానీ అనన్యులైన పిల్లల బుద్ధిలో కూర్చోవాలి కదా. ఇప్పుడైతే దేహాభిమానము చాలా ఉంది. జ్ఞానమైతే ఎంతో కావాలి. రిఫైన్ నెస్ (మెరుగుదల) ఇంకా ఎంతగానో రావాలి. ఇప్పుడైతే యోగము ఏ కొందరికో కష్టం మీద కుదురుతుంది. యోగముతోపాటు మళ్ళీ జ్ఞానము కూడా కావాలి. కేవలం యోగములోనే ఉండడం కాదు. యోగములో జ్ఞానము తప్పకుండా కావాలి. ఢిల్లీలో జ్ఞాన-విజ్ఞాన భవనము అన్న పేరును పెట్టారు, కానీ దాని అర్థమేమిటి అన్నది ఎవరూ అర్థం చేసుకోరు. జ్ఞానము-విజ్ఞానమైతే ఒక్క క్షణానికి సంబంధించినదే. శాంతిధామము, సుఖధామము. కానీ మనుష్యుల్లో కొద్దిగా కూడా బుద్ధి లేదు. అర్థాన్ని అర్థం చేసుకోరు. చిన్మయానందుడు మొదలైన ఎంత పెద్ద-పెద్ద సన్యాసులు మొదలైనవారు ఉన్నారు, వారు గీతను వినిపిస్తారు, వారికి ఎంతమంది అనుచరులు ఉన్నారు. అందరికన్నా పెద్ద జగద్గురువు అయితే ఒక్క తండ్రే. తండ్రి మరియు టీచరు కన్నా పెద్దవారు గురువు. పత్ని ఎప్పుడూ ఇంకొకరిని పతిగా చేసుకోదు, అలాగే గురువుగా కూడా ఇంకొకరిని ఆశ్రయించకూడదు. ఒక గురువును ఆశ్రయించిన తర్వాత ఇక వారే సద్గతిని ఇవ్వాలి, మరి ఇతర గురువులు ఎందుకు? సద్గురువు అయితే ఒక్క అనంతమైన తండ్రే. వారే అందరికీ సద్గతిని ఇస్తారు. కానీ ఈ విషయాలను ఏ మాత్రమూ అర్థం చేసుకోనివారు ఎందరో ఉన్నారు. తండ్రి అర్థం చేయించారు - ఇక్కడ రాజధాని స్థాపన అవుతోంది కావున నంబరువారుగా ఉంటారు కదా. కొందరైతే కొద్దిగా కూడా అర్థం చేసుకోలేరు. డ్రామాలో పాత్ర ఆ విధంగా ఉంది. టీచర్ అయితే అర్థం చేసుకోగలరు. ఏ శరీరము ద్వారానైతే అర్థం చేయిస్తారో, వారికి కూడా తెలుస్తూ ఉండవచ్చు కదా. బెల్లము రుచి బెల్లానికి మరియు బెల్లపు సంచికే తెలుస్తుంది. బెల్లము అని శివబాబాను అంటారు. వారికి అందరి అవస్థ గురించి తెలుసు. ప్రతి ఒక్కరి చదువు ద్వారా అర్థం చేసుకోగలరు - ఎవరెవరు ఎలా చదువుతున్నారు, ఎంత సేవ చేస్తున్నారు, బాబా సేవలో తమ జీవితాన్ని ఎంతగా సఫలము చేసుకుంటున్నారు అని. ఈ బ్రహ్మా ఇల్లు-వాకిళ్ళను వదిలేశారు, అందుకే లక్ష్మీ-నారాయణునిగా అవుతారు అని కాదు. కష్టపడతారు కదా. ఈ జ్ఞానము చాలా ఉన్నతమైనది. ఒకవేళ ఎవరైనా తండ్రి ఆజ్ఞను ఉల్లంఘిస్తే పూర్తిగా రాయిలా అయిపోతారు. బాబా అర్థం చేయించారు - ఇది ఇంద్రసభ. శివబాబా జ్ఞాన వర్షాన్ని కురిపిస్తారు. వారి ఆజ్ఞను ఉల్లంఘిస్తే రాతిబుద్ధి కలవారిగా అయిపోయారు అని శాస్త్రాలలో ఉంది. అందుకే బాబా అందరికీ వ్రాస్తూ ఉంటారు - మీతో పాటు ఎవరినైనా తీసుకువచ్చేటప్పుడు జాగ్రత్తగా తీసుకురండి. వికారులు, అపవిత్రులు ఇక్కడకు వచ్చి కూర్చోకూడదు. అలా జరిగితే తీసుకువచ్చే బ్రాహ్మణిపై దోషం పడుతుంది. అటువంటివారిని ఎవరినీ తీసుకురాకూడదు. ఇది పెద్ద బాధ్యత. వీరు ఎంతో ఉన్నతోన్నతమైన తండ్రి. వారు మీకు విశ్వ రాజ్యాధికారాన్ని ఇస్తున్నారంటే వారి పట్ల ఎంతటి గౌరవం ఉంచాలి. చాలామందికి మిత్ర-సంబంధీకులు మొదలైనవారు గుర్తుకువస్తారు, తండ్రి స్మృతి లేదు. లోలోపలే గుటకలు మింగుతూ ఉంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇది ఆసురీ ప్రపంచము. ఇప్పుడు దైవీ ప్రపంచము తయారవుతుంది, ఇదే మన లక్ష్యము-ఉద్దేశ్యము. ఈ లక్ష్మీ-నారాయణులుగా తయారవ్వాలి. చిత్రాలేవైతే ఉన్నాయో, వాటన్నింటి చరిత్రను గురించి మీకు తెలుసు. మనుష్యులకు అర్థం చేయించేందుకు ఎంతగా శ్రమించడం జరుగుతుంది. ఫలానావారు మంచి వివేకవంతులని లేక ఫలానావారైతే ఏమీ అర్థం చేసుకోవడం లేదని మీరు కూడా అర్థం చేసుకుంటూ ఉండి ఉండవచ్చు. పిల్లలైన మీలో ఎవరు ఎంతగా జ్ఞానాన్ని తీసుకున్నారో, దాని అనుసారంగానే సేవ చేస్తున్నారు. ముఖ్యమైన విషయము, గీతా భగవానుడికి సంబంధించినది. సూర్యవంశీ దేవీ-దేవతలకు ఈ ఒక్క శాస్త్రమే ఉంది. వేర్వేరు శాస్త్రాలు లేవు. బ్రాహ్మణులకు కూడా వేరుగా లేదు. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. ఈ జ్ఞాన మార్గములో కూడా నడుస్తూ-నడుస్తూ ఒకవేళ వికారాలలో పడిపోయినట్లయితే ఆ జ్ఞానము బయటకు కొట్టుకుపోతుంది. చాలా మంచి-మంచివారు వెళ్ళి వికారులుగా అయ్యారు, దానితో రాతిబుద్ధి కలవారిగా అయిపోయారు. ఇందులో చాలా వివేకము కావాలి. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిని నెమరువేయాలి. ఇక్కడైతే మీకు చాలా సహజము, ఎటువంటి లౌకిక కార్య-వ్యవహారాలు, హంగామా మొదలైనవి ఉండవు. బయట ఉంటే వ్యాపారాలు మొదలైనవాటి చింత ఎంతగా ఉంటుంది. మాయ ఎంతగానో తుఫానులలోకి తీసుకువస్తుంది. ఇక్కడైతే ఏకాంతము ఉంది. తండ్రి అయితే ఎంతైనా పిల్లల చేత పురుషార్థము చేయిస్తూ ఉంటారు. ఈ బాబా కూడా పురుషార్థియే. పురుషార్థము చేయించేవారైతే తండ్రి. ఇందులో విచార సాగర మథనము చేయవలసి ఉంటుంది. ఇక్కడైతే తండ్రి పిల్లలతోపాటు కూర్చున్నారు. ఎవరైతే సహయోగము అనే వేలును పూర్తిగా అందిస్తారో, వారినే సర్వీసబుల్ అని అంటారు. ఇకపోతే గుటకలు మింగేవారైతే నష్టం కలిగిస్తారు, ఇంకా డిస్సర్వీస్ చేస్తారు, విఘ్నాలు కలిగిస్తారు. మహారాజా, మహారాణులుగా తయారవుతారు కావున వారి దాస-దాసీలు కూడా కావాలి అని మీకు తెలుసు. వారు కూడా ఇక్కడి నుండే వస్తారు. మొత్తం ఆధారమంతా చదువుపై ఉంది. ఈ శరీరాన్ని కూడా సంతోషంగా వదిలేయాలి. దుఃఖము యొక్క విషయమేదీ లేదు. పురుషార్థము కొరకు సమయమైతే లభించింది. జ్ఞానము ఒక్క క్షణముది. శివబాబా నుండి వారసత్వము లభిస్తుంది అని బుద్ధిలో ఉంది. కొద్దిగా జ్ఞానం విన్నా, శివబాబాను స్మృతి చేసినా అక్కడికి రాగలరు. ప్రజలుగా అయితే ఎంతోమంది తయారవ్వనున్నారు. మన సూర్యవంశీ, చంద్రవంశీ రాజధాని ఇక్కడ స్థాపన అవుతోంది. తండ్రికి చెందినవారిగా అయి ఒకవేళ గ్లాని చేసినట్లయితే ఎంతో భారం తలపైకి ఎక్కుతుంది. పూర్తిగా పాతాళములోకి వెళ్ళిపోయినట్లుగా అవుతుంది. బాబా అర్థం చేయించారు - ఎవరైతే కూర్చుని తమ పూజను చేయించుకుంటారో వారు పూజ్యులుగా ఎలా పిలువబడగలరు. సర్వుల సద్గతిదాత, కళ్యాణము చేసేవారు అయితే ఒక్క తండ్రే. మనుష్యులకైతే శాంతి యొక్క అర్థము కూడా తెలియదు. హఠయోగముతో ప్రాణాయామాలు మొదలైనవి చేయడము, దానినే శాంతి అని భావిస్తారు. అందులో కూడా ఎంతో కష్టపడవలసి ఉంటుంది, కొందరికైతే మెదడు పాడైపోతుంది. ప్రాప్తి ఏమీ ఉండదు. అది అల్పకాలికమైన శాంతి. ఏ విధముగా సుఖాన్ని అల్పకాలికమైనదని, కాకిరెట్టతో సమానమైనదని అంటారో, అలాగే ఆ శాంతి కూడా కాకిరెట్టతో సమానమైనది. అది కేవలం అల్పకాలికముగానే ఉంటుంది. తండ్రి అయితే 21 జన్మల కొరకు మీకు సుఖ-శాంతులు రెండింటినీ ఇస్తారు. కొందరైతే శాంతిధామములో చివరి వరకూ ఉంటూ ఉండవచ్చు. ఎవరికైతే ఆ పాత్ర ఉంటుందో, వారు ఇంతటి సుఖాన్ని చూడలేరు. అక్కడ కూడా పదవులు నంబరువారుగా ఉంటాయి కదా. దాస-దాసీలు ఉంటారు కానీ వారు లోపలికి రాలేరు. శ్రీకృష్ణుడిని కూడా చూడలేరు. అందరికీ వేర్వేరు మహళ్ళు ఉంటాయి కదా. శ్రీకృష్ణుడిని చూసేందుకు ఏదో ఒక సమయం ఉంటుంది. ఉదాహరణకు పోప్ వచ్చినప్పుడు వారిని దర్శించుకునేందుకు ఎంతమంది వెళ్తారు. అలా ఎంతోమంది వెలువడుతారు, వారి ప్రభావము ఎంతో ఉంటుంది. వారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది మనుష్యులు వెళ్తారు. ఇక్కడ శివబాబా దర్శనము ఎలా జరుగుతుంది? ఇది అర్థం చేసుకోవలసిన విషయము.
ఇది అన్నింటికన్నా ఉన్నతమైన తీర్థ స్థానము అని ఇప్పుడు ప్రపంచానికి ఎలా తెలియాలి. దిల్వాడా మందిరము వంటి మందిరాలు ఒకవేళ చుట్టుప్రక్కల ఇంకేవైనా ఉంటే వెళ్ళి వాటిని కూడా చూడాలి, అవి ఎలా తయారయ్యాయో చూడాలి. వారికి జ్ఞానాన్ని ఇవ్వవలసిన అవసరం లేదు. వారు తిరిగి మీకు జ్ఞానాన్ని ఇవ్వడం మొదలుపెడతారు. ఇది చేయాలి, అది చేయాలి... అంటూ సలహాలు ఇస్తూ ఉంటారు కదా. వీరిని చదివించేవారు ఎవరు అన్నది వారికి తెలియదు. ఒక్కొక్కరికీ అర్థం చేయించడానికి కష్టపడవలసి ఉంటుంది. వాటిపై కథలు కూడా ఉన్నాయి. పులి వచ్చింది, పులి వచ్చింది... అని అనేవారు. మీరు కూడా ఇక మృత్యువు వచ్చేసింది అని అంటూ ఉంటారు కానీ వారు విశ్వసించరు. ఇప్పుడింకా 40,000 సంవత్సరాలున్నాయి, మృత్యువు ఎక్కడి నుండి వస్తుంది అని భావిస్తారు. కానీ మృత్యువైతే తప్పకుండా వచ్చేది ఉంది, అది అందరినీ తీసుకువెళ్తుంది. అక్కడ ఎటువంటి చెత్తా ఉండదు. ఇక్కడి ఆవులకు మరియు అక్కడి ఆవులకు మధ్యన కూడా ఎంత తేడా ఉంటుంది. శ్రీకృష్ణుడేమీ గోవులను మేపేవారు కాదు. వారి వద్దకైతే పాలు హెలికాప్టర్లలో వస్తూ ఉండవచ్చు. ఈ చెత్త అంతా దూరంగా ఉంటూ ఉండవచ్చు. ఇంటి ముందు చెత్త ఉండదు కదా. అక్కడైతే అపారమైన సుఖము ఉంటుంది, దాని కొరకు పూర్తి పురుషార్థము చేయాలి. సెంటర్ల నుండి ఎంత మంచి-మంచి పిల్లలు వస్తూ ఉంటారు. బాబా చూసి ఎంత సంతోషిస్తారు. నంబరువారు పురుషార్థానుసారంగా పుష్పాలు వెలువడుతారు. పుష్పాలుగా ఎవరైతే ఉన్నారో, వారు స్వయాన్ని కూడా పుష్పాలుగా భావిస్తారు. ఢిల్లీలో కూడా పిల్లలు రాత్రింబవళ్ళు ఎంత సేవ చేస్తూ ఉంటారు. జ్ఞానము కూడా ఎంత ఉన్నతమైనది. ఇంతకుముందు అయితే ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు ఎంతగా కష్టపడవలసి వస్తుంది. బాబా వద్దకైతే అన్ని సమాచారాలూ వస్తాయి. కొందరివి వినిపిస్తారు, కొందరివి వినిపించరు ఎందుకంటే ద్రోహులు కూడా ఎందరో ఉంటారు. చాలా ఫస్ట్ క్లాస్ అయినవారు కూడా ద్రోహులుగా అయిపోతారు. అలాగే థర్డ్ క్లాస్ వారు కూడా ద్రోహులుగా ఉన్నారు. కొద్దిగా జ్ఞానము లభించడంతో మేము శివబాబాకు కూడా బాబాగా అయిపోయాము అని భావిస్తారు. జ్ఞానాన్ని ఎవరు ఇస్తున్నారు అన్నది గుర్తించరు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. విశ్వ రాజ్యాధికారాన్ని ఇచ్చే తండ్రి పట్ల చాలా-చాలా గౌరవాన్ని ఉంచాలి. తండ్రి సేవలో తమ జీవితాన్ని సఫలం చేసుకోవాలి, చదువుపై పూర్తి-పూర్తి ధ్యాసను ఉంచాలి.
2. తండ్రి నుండి ఏ జ్ఞానమైతే లభిస్తుందో, దానిపై విచార సాగర మథనము చేయాలి. ఎప్పుడూ కూడా విఘ్నరూపులుగా అవ్వకూడదు. డిస్సర్వీస్ చేయకూడదు. అహంకారములోకి రాకూడదు.
| వరదానము:- |
నాలుగు సబ్జెక్టులలోనూ తండ్రి హృదయానికి ఇష్టమైన మార్కులను తీసుకునే హృదయ సింహాసనాధికారీ భవ ఏ పిల్లలైతే నాలుగు సబ్జెక్టులలోనూ మంచి మార్కులు తీసుకుంటారో, ఆది నుండి అంతిమము వరకు మంచి నంబరుతో పాస్ అవుతారో, వారినే పాస్ విత్ ఆనర్ అని అంటారు. మధ్యమధ్యలో మార్కులు తక్కువవ్వటము, మళ్ళీ మేకప్ చేసుకోవటము, ఇలా కాదు. అన్ని సబ్జెక్టులలోనూ తండ్రి హృదయానికి ఇష్టమైనవారే హృదయ సింహాసనాధికారులుగా అవుతారు. దానితో పాటుగా బ్రాహ్మణ ప్రపంచములో సర్వులకు ప్రియమైనవారు, సర్వుల సహయోగీ, సర్వుల గౌరవాన్ని ప్రాప్తి చేసుకునేవారే హృదయ సింహాసనాధికారుల నుండి రాజ్య సింహాసనాధికారులుగా అవుతారు. |
| స్లోగన్:- | ప్రియమైనవారు ఎవరు అంటే - ఎవరి హృదయములోనైతే, నేను బాబాకు చెందినవాడిని, బాబా నా వారు అన్న అనంత నాదము సదా మ్రోగుతూ ఉంటుందో, వారు. |