తెలుగు మురళి · Brahma Kumaris

తెలుగు మురళి · 9 అక్టోబర్, 2024

ఓం శాంతి · BapDada ·

ఈరోజు మురళి — today’s murli in Telugu, BK Telugu murli.

18
మురళి9 అక్టోబర్, 2024 · తెలుగు
0:00--:--

పాఠ్యాన్ని ఎంచుకోండి → హైలైట్ / బాక్స్ / అండర్‌లైన్

09-10-2024
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
మధువనం

‘‘మధురమైన పిల్లలూ - విశ్వ రాజ్యాన్ని బాహుబలము ద్వారా తీసుకోలేరు, దాని కోసం యోగబలము కావాలి, ఇది కూడా ఒక నియమము’’
ప్రశ్న:- శివబాబా స్వయమే స్వయంపై ఏ విషయంలో ఆశ్చర్యపోతారు?
జవాబు:- బాబా అంటారు, ఇది ఎటువంటి అద్భుతమో చూడండి - నేను మిమ్మల్ని చదివిస్తాను, ఇది నేను ఎవరి నుండి ఎప్పడూ చదువుకోలేదు. నాకు ఏ తండ్రీ లేరు, నాకు ఏ టీచర్ లేరు, గురువూ లేరు. నేను సృష్టి చక్రములో పునర్జన్మలను తీసుకోను, అయినా మీకు అన్ని జన్మల కథనూ వినిపిస్తాను. స్వయం 84 జన్మల చక్రములోకి రాను కానీ చక్రము యొక్క జ్ఞానాన్ని పూర్తిగా ఏక్యురేట్ గా ఇస్తాను.

ఓం శాంతి. ఆత్మిక తండ్రి పిల్లలైన మిమ్మల్ని స్వదర్శన చక్రధారులుగా తయారుచేస్తారు అనగా మీరు ఈ 84 జన్మల చక్రాన్ని తెలుసుకుంటారు. ఇంతకుముందు మీకు తెలియదు. ఇప్పుడు తండ్రి ద్వారా మీరు తెలుసుకున్నారు. 84 జన్మల చక్రములోకి మీరు తప్పకుండా వస్తారు. పిల్లలైన మీకు 84 జన్మల చక్రము యొక్క జ్ఞానాన్ని ఇస్తాను. నేను స్వదర్శన చక్రధారిని కానీ ప్రాక్టికల్ గా 84 జన్మల చక్రములోకి రాను. కావున దీని ద్వారా అర్థం చేసుకోవాలి - శివబాబాలో మొత్తం జ్ఞానమంతా ఉంది అని. బ్రాహ్మణులమైన మనము ఇప్పుడు స్వదర్శన చక్రధారులుగా అవుతామని మీకు తెలుసు. బాబా అలా అవ్వరు. మరి వారిలోకి ఆ అనుభవం ఎక్కడి నుండి వచ్చింది? మనకైతే అనుభవం ప్రాప్తిస్తుంది. మరి మీకు వినిపించడానికి బాబా ఎక్కడి నుండి అనుభవాన్ని పొందుతారు? ప్రాక్టికల్ అనుభవం ఉండాలి కదా. తండ్రి అంటారు, నన్ను జ్ఞానసాగరుడు అని అంటారు కానీ నేనైతే 84 జన్మల చక్రములోకి రాను. మరి నాలోకి ఈ జ్ఞానము ఎక్కడి నుండి వచ్చింది? టీచర్ అనేవారు చదివిస్తారంటే, వారు స్వయం తప్పకుండా చదివే ఉంటారు కదా. ఈ శివబాబా ఎలా చదువుకున్నారు? వీరు స్వయం 84 జన్మలలోకి రాకపోయినా వీరికి ఈ 84 జన్మల చక్రము గురించి ఎలా తెలిసింది. తండ్రి బీజరూపుడైన కారణంగా వారికి ఇది తెలుసు. వారు స్వయం 84 జన్మల చక్రములోకి రారు కానీ మీకు అంతా అర్థం చేయిస్తారు, ఇది కూడా ఎంతటి అద్భుతము. తండ్రి శాస్త్రాలు మొదలైనవాటిని చదివారని కూడా కాదు. డ్రామానుసారంగా వారిలో ఈ జ్ఞానము రచింపబడి ఉంది, దానిని మీకు వినిపిస్తారు అని చెప్పడం జరుగుతుంది. కావున వీరు అద్భుతమైన టీచర్ అన్నట్లు కదా. మరి ఆశ్చర్యపోవాలి కదా. అందుకే వీరికి చాలా గొప్ప, గొప్ప పేర్లను ఇచ్చారు. ఈశ్వరుడు, ప్రభువు, అంతర్యామి మొదలైన పేర్లను ఇచ్చారు. ఈశ్వరునిలో జ్ఞానమంతా ఏ విధంగా నిండి ఉంది అని మీరు ఆశ్చర్యపోతారు. మీకు అర్థం చేయించేందుకు అసలు వారిలోకి అది ఎక్కడి నుండి వచ్చింది? ఎవరి ద్వారానో జన్మ తీసుకుని అర్థం చేసుకునేందుకు వారికి తండ్రి కూడా ఎవరూ లేరు. మీరందరూ పరస్పరం సోదరులు. ఆ ఒక్కరూ మీకు తండ్రి, వారు బీజరూపుడు. వారు కూర్చొని పిల్లలకు ఎంతటి జ్ఞానాన్ని వినిపిస్తారు. వారు అంటారు, 84 జన్మలను నేను తీసుకోను, మీరు తీసుకుంటారు. కావున తప్పకుండా ప్రశ్న ఉత్పన్నమవుతుంది కదా - బాబా, మీకు ఎలా తెలిసింది? అని. బాబా అంటారు - పిల్లలూ, అనాది డ్రామానుసారంగా నాలో ముందు నుండే ఈ జ్ఞానము ఉంది, దానిని మీకు చదివిస్తాను, అందుకే నన్ను ఉన్నతోన్నతుడైన భగవంతుడు అని అంటారు. వారు స్వయం చక్రములోకి రారు కానీ వారిలో మొత్తం సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానము ఉంది. కావున పిల్లలైన మీకు ఎంత సంతోషము ఉండాలి. వారికి 84 జన్మల చక్రము యొక్క జ్ఞానము ఎక్కడి నుండి లభించింది? మీకైతే తండ్రి నుండి లభించింది. తండ్రిలో స్వతహాగానే జ్ఞానము ఉంది. వారిని నాలెడ్జ్ ఫుల్ అనే అంటారు. వారు ఎవరి నుండీ చదువుకోలేదు కూడా. అయినా కానీ వారికి స్వతహాగానే తెలుసు, అందుకే వారిని నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. ఇది అద్భుతము కదా, అందుకే దీనిని ఉన్నతోన్నతమైన చదువు అని అంటారు. తండ్రిని చూసి పిల్లలకు ఆశ్చర్యం కలుగుతుంది. వారిని నాలెడ్జ్ ఫుల్ అని ఎందుకు అంటారు - ఒకటేమో ఇది అర్థం చేసుకోవలసిన విషయము, రెండవ విషయము ఏమిటి? ఈ చిత్రాలను మీరు చూపించినప్పుడు కొందరు ఈ విధంగా అడుగుతారు - బ్రహ్మాలో కూడా అతని ఆత్మ ఉంటుంది మరియు నారాయణునిగా అవుతారు కదా, ఇతనిలో కూడా ఇతని ఆత్మ ఉంటుంది, రెండు ఆత్మలు కదా, ఒకటి బ్రహ్మా ఆత్మ, ఇంకొకటి నారాయణుని ఆత్మ అని అడుగుతారు. కానీ ఆలోచిస్తే, వీరు రెండు ఆత్మలేమీ కాదు. ఆత్మ ఒక్కటే. దేవతా రూపానికి శ్యాంపుల్ గా ఇతడిని చూపించడం జరుగుతుంది. ఈ బ్రహ్మాయే విష్ణువుగా అనగా నారాయణునిగా అవుతారు. వీటిని గుహ్యమైన విషయాలు అని అంటారు. తండ్రి చాలా గుహ్యమైన జ్ఞానాన్ని వినిపిస్తారు, దీనిని తండ్రి తప్ప ఇంకెవ్వరూ చదివించలేరు. కావున బ్రహ్మా మరియు విష్ణువు ఆత్మలు రెండేమీ కావు. అలాగే సరస్వతి మరియు లక్ష్మి - వీరిరువురి ఆత్మలు రెండు ఉన్నాయా లేక ఒక్కటేనా? ఆత్మ ఒక్కటే, శరీరాలు రెండు. ఈ సరస్వతియే మళ్ళీ లక్ష్మిగా అవుతారు, అందుకే ఒక్క ఆత్మగా లెక్కింపబడతారు. 84 జన్మలను ఒకే ఆత్మ తీసుకుంటుంది. ఇది బాగా అర్థం చేసుకోవలసిన విషయము. బ్రాహ్మణుల నుండి దేవతలుగా, దేవతల నుండి క్షత్రియులుగా అవుతారు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. ఆత్మ ఒక్కటే, బ్రాహ్మణుల నుండి దేవతలుగా ఏ విధముగా అవుతారు అనేదానికి ఒక ఉదాహరణగా చూపించడం జరుగుతుంది. హంసో అనే పదము యొక్క అర్థము ఎంత బాగుంది. వీటిని గుహ్యాతి గుహ్యమైన విషయాలు అని అంటారు. అందులోనూ మొట్టమొదటైతే - మనం ఒక్క తండ్రి పిల్లలము అన్న వివేకం కావాలి. ఆత్మలన్నీ వాస్తవానికి పరంధామ నివాసులే. ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చాయి. ఇది ఒక ఆట. తండ్రి కూర్చుని మీకు ఈ ఆట యొక్క సమాచారాన్ని వినిపిస్తారు. తండ్రికైతే ఇది స్వతహాగా తెలుసు. వారికి ఎవరూ నేర్పించలేదు. ఈ 84 జన్మల చక్రము గురించి వారికే తెలుసు, దాని గురించి ఈ సమయంలో మీకు వినిపిస్తారు. తర్వాత మీరు మర్చిపోతారు. మరి దీనికి సంబంధించిన శాస్త్రము ఎలా తయారవ్వగలదు. తండ్రి అయితే ఏ శాస్త్రాలనూ చదవలేదు. మరి వారు వచ్చి కొత్త-కొత్త విషయాలను ఎలా వినిపిస్తారు. అర్ధకల్పము భక్తి మార్గము ఉంటుంది. ఈ విషయము కూడా శాస్త్రాలలో లేదు. ఈ శాస్త్రాలు కూడా డ్రామానుసారంగా భక్తి మార్గములో తయారయ్యాయి. మీ బుద్ధిలో ప్రారంభం నుండి మొదలుకుని చివరి వరకూ ఈ డ్రామా యొక్క ఎంత గొప్ప జ్ఞానము ఉంది. వారు తప్పకుండా మనుష్య తనువు యొక్క ఆధారాన్ని తీసుకోవలసి ఉంటుంది. శివబాబా ఈ బ్రహ్మా తనువులో కూర్చుని ఈ సృష్టి చక్రము యొక్క జ్ఞానాన్ని వినిపిస్తారు. మనుష్యులైతే ఎన్నో ప్రగల్భాలు పలికి సృష్టి ఆయువునే ఎంత పెద్దగా చేసేసారు. కొత్త ప్రపంచము మళ్ళీ పాతగా అవుతుంది. కొత్త ప్రపంచాన్ని స్వర్గము అని, పాత ప్రపంచాన్ని నరకము అని అంటారు. ప్రపంచమైతే ఒక్కటే. కొత్త ప్రపంచములో దేవీ-దేవతలు ఉంటారు. అక్కడ అపారమైన సుఖము ఉంటుంది. మొత్తం సృష్టి అంతా కొత్తగా ఉంటుంది. ఇప్పుడు దీనిని పాత సృష్టి అని అంటారు. దీని పేరే ఇనుప యుగ ప్రపంచము. ఏ విధముగా ఓల్డ్ డిల్లీ మరియు న్యూ ఢిల్లీ అని అంటారో, ఇదీ అలాగే. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ, కొత్త ప్రపంచములో న్యూ ఢిల్లీ ఉంటుంది. ఇక్కడైతే పాత ప్రపంచములోనే దీనిని న్యూ ఢిల్లీ అని అనేస్తారు. దీనిని న్యూ (కొత్తది) అని ఎలా అనగలరు! తండ్రి అర్థం చేయిస్తున్నారు, కొత్త ప్రపంచములోనే కొత్త ఢిల్లీ ఉంటుంది. అందులో ఈ లక్ష్మీ-నారాయణులు రాజ్యం చేస్తారు. దానిని సత్యయుగము అని అంటారు. మీరు ఈ మొత్తం భారత్ పై రాజ్యం చేస్తారు. మీ రాజధాని యమునా తీరములో ఉంటుంది. చివరిలో రావణ రాజ్యము యొక్క రాజధాని కూడా ఇక్కడే ఉంది. రామ రాజ్యము యొక్క రాజధాని కూడా ఇక్కడే ఉంటుంది, కానీ దానికి ఢిల్లీ అన్న పేరు ఉండదు, దానిని పరిస్తాన్ అని అంటారు. ఆ తర్వాత ఎటువంటి రాజు ఉంటారో, అతను ఆ రాజధానికి అటువంటి పేరును పెడతారు. ఈ సమయములో మీరందరూ పాత ప్రపంచములో ఉన్నారు. కొత్త ప్రపంచములోకి వెళ్ళేందుకు మీరు చదువుకుంటున్నారు. మళ్ళీ మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. చదివించేవారు ఒక్క తండ్రే.

ఉన్నతోన్నతుడైన తండ్రి కిందకు వచ్చి రాజయోగాన్ని నేర్పించారని మీకు తెలుసు. ఇప్పుడు మీరు సంగమములో ఉన్నారు, ఈ సమయములో కలియుగ పాత ప్రపంచము అంతమవ్వనున్నది. తండ్రి దీని లెక్కను కూడా తెలియజేశారు. నేను బ్రహ్మా తనువులోకి వస్తాను. మనుష్యులకైతే బ్రహ్మా ఎవరు అన్నది తెలియనే తెలియదు. ప్రజాపిత బ్రహ్మా అన్న పేరును విన్నారు. మీరు బ్రహ్మా యొక్క ప్రజలే కదా. అందుకే స్వయాన్ని బి.కె.లుగా పిలుచుకుంటారు. వాస్తవానికి మీరు నిరాకారీ ఆత్మలుగా ఉన్నప్పుడు శివబాబా పిల్లలైన శివవంశీయులు, తర్వాత సాకారములో ప్రజాపిత బ్రహ్మా యొక్క పిల్లల రూపములో సోదరీ, సోదరులుగా ఉన్నారు, ఇది తప్ప ఇంకే సంబంధమూ లేదు. ఈ సమయములో మీరు ఆ కలియుగ సంబంధాలను మర్చిపోతారు ఎందుకంటే వాటిలో బంధనము ఉంది. మీరు కొత్త ప్రపంచములోకి వెళ్తారు. బ్రాహ్మణులకు పిలక ఉంటుంది. పిలక బ్రాహ్మణులకు గుర్తు. ఇది బ్రాహ్మణులైన మీ కులము. వారు కలియుగీ బ్రాహ్మణులు. బ్రాహ్మణులు చాలా వరకు పండాలుగా (మార్గదర్శకులుగా) ఉంటారు. ఒకరేమో శ్రాద్ధ భోజనాలు తింటూ ఉంటారు, ఇంకొక రకం బ్రాహ్మణులు గీతను వినిపిస్తారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు ఈ గీతను వినిపిస్తారు. వారు కూడా గీతను వినిపిస్తారు, అలాగే మీరు కూడా గీతను వినిపిస్తారు, కానీ తేడా ఎంత ఉందో చూడండి! మీరు అంటారు - కృష్ణుడిని భగవంతుడు అని అనలేము. కృష్ణుడినైతే దేవత అని అంటారు. అతనిలో దైవీ గుణాలు ఉంటాయి. అతడిని అయితే ఈ కనులతో చూడవచ్చు. శివుని మందిరాలలో శివునికి తమదంటూ శరీరము లేదని మీరు చూస్తారు. వారు పరమ ఆత్మ అనగా పరమాత్మ. ఈశ్వరుడు, ప్రభువు, భగవంతుడు అన్న పదాలకు అంత అర్థము వెలువడదు. పరమాత్మయే సుప్రీమ్ ఆత్మ. మీరు నాన్-సుప్రీమ్ (సుప్రీమ్ కాదు). మీ ఆత్మకు మరియు వారి ఆత్మకు ఎంత తేడా ఉందో చూడండి. ఆత్మలైన మీరు ఇప్పుడు పరమాత్మ నుండి నేర్చుకుంటున్నారు. వారు ఎవరి నుండీ నేర్చుకోలేదు. వారు తండ్రి కదా. ఆ పరమపిత పరమాత్మను మీరు తండ్రి అని కూడా అంటారు, టీచర్ అని కూడా అంటారు మరియు గురువు అని కూడా అంటారు. వాస్తవానికి వారు ఒక్కరే. ఇంకే ఆత్మా ఇలా తండ్రిగా, టీచరుగా, గురువుగా అవ్వలేదు. పరమాత్మ ఒక్కరే, వారిని సుప్రీమ్ అని అంటారు. ప్రతి ఒక్కరికీ మొదట తండ్రి కావాలి, ఆ తర్వాత టీచర్ కావాలి, ఆ తర్వాత చివరిలో గురువు కావాలి. తండ్రి కూడా అంటారు - నేను మీకు తండ్రిగా కూడా అవుతాను, తర్వాత టీచర్ గా అవుతాను, ఆ తర్వాత నేనే మీ సద్గతిదాతనైన సద్గురువుగా కూడా అవుతాను. సద్గతిని ఇచ్చే గురువు ఒక్కరే. మిగిలిన గురువులైతే అనేకులు ఉన్నారు. తండ్రి అంటారు, నేను మీ అందరికీ సద్గతిని ఇస్తాను, మీరందరూ సత్యయుగములోకి వెళ్తారు, మిగిలినవారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు, దానినే పరంధామము అని అంటారు. సత్యయుగములో ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ఉండేది. మిగిలిన ధర్మాలేవీ ఉండేవి కావు. మిగిలిన ఆత్మలందరూ ముక్తిధామములోకి వెళ్ళిపోతారు. సద్గతి అని సత్యయుగాన్ని అంటారు, పాత్రను అభినయిస్తూ, అభినయిస్తూ మళ్ళీ దుర్గతిలోకి వచ్చేస్తారు. మీరే సద్గతి నుండి మళ్ళీ దుర్గతిలోకి వస్తారు. మీరే పూర్తి 84 జన్మలను తీసుకుంటారు. యథా రాజా రాణి తథా ప్రజా, ఆ సమయములో ఎవరు ఉంటే వారిలా ఉంటారు. 9 లక్షల మందైతే మొదట వస్తారు. 84 జన్మలను 9 లక్షల మందైతే తీసుకుంటారు కదా. ఆ తర్వాత వేరేవారు వస్తూ ఉంటారు, ఇది లెక్కింపబడుతుంది. దీనిని తండ్రి అర్థం చేయిస్తారు. అందరూ 84 జన్మలు తీసుకోరు, మొట్టమొదట వచ్చేవారే 84 జన్మలు తీసుకుంటారు, ఆ తర్వాత తక్కువ, తక్కువ తీసుకుంటూ వస్తారు. ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు. ఈ విషయాలేవైతే ఉన్నాయో వీటి గురించి ఇతర మనుష్యులెవ్వరికీ తెలియదు. తండ్రే కూర్చుని అర్థం చేయిస్తారు. గీతలో భగవానువాచ అని ఉంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని కృష్ణుడేమీ రచించలేదు. దీనిని తండ్రే స్థాపిస్తారు. కృష్ణుని ఆత్మ 84 జన్మల అంతిమములో ఈ జ్ఞానాన్ని విన్నది, ఆ ఆత్మే మొదటి నెంబర్ లోకి వచ్చింది. ఈ విషయాలు అర్థం చేసుకోవలసినవి. వీటిని రోజూ చదువుకోవాలి. మీరు భగవంతుని విద్యార్థులు. భగవానువాచ ఉంది కదా, నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారుచేస్తాను అని. ఇది పాత ప్రపంచము, కొత్త ప్రపంచము అనగా సత్యయుగము. ఇప్పుడు ఇది కలియుగము. తండ్రి వచ్చి కలియుగ పతితుల నుండి సత్యయుగ పావన దేవతలుగా తయారుచేస్తారు. అందుకే కలియుగ మనుష్యులు పిలుస్తారు - బాబా, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారుచేయండి, కలియుగ పతితుల నుండి సత్యయుగ పావనులుగా తయారుచేయండి అని. ఎంత తేడా ఉందో చూడండి. కలియుగములో అపారమైన దుఃఖము ఉంది. కొడుకు పుడితే సుఖము కలుగుతుంది, రేపు చనిపోతే దుఃఖితులు అయిపోతారు. జీవితాంతము ఎంత దుఃఖము ఉంటుంది. ఇది ఉన్నదే దుఃఖ ప్రపంచము. ఇప్పుడు తండ్రి సుఖమయమైన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. మిమ్మల్ని స్వర్గవాసీ దేవతలుగా తయారుచేస్తారు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగములో ఉన్నారు. ఉత్తమోత్తమ పురుషులుగా మరియు స్త్రీలుగా తయారవుతారు. మీరు ఈ లక్ష్మీ-నారాయణులుగా అయ్యేందుకే వస్తారు. విద్యార్థులు టీచర్ తో యోగాన్ని జోడిస్తారు ఎందుకంటే వీరి ద్వారా మేము చదువుకుని ఫలానావారిగా అవుతాము అని భావిస్తారు. ఇక్కడ మీరు పరమపిత శివ పరమాత్మతో యోగాన్ని జోడిస్తారు, వారు మిమ్మల్ని దేవతలుగా తయారుచేస్తారు. వారు అంటారు, మీ తండ్రినైన నన్ను స్మృతి చేయండి, మీరు నాకు సాలిగ్రామ పిల్లలు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. వారే జ్ఞానసాగరుడు. తండ్రి మీకు సత్యమైన గీతను వినిపిస్తారు కానీ వారు స్వయం దానిని చదవలేదు. వారు అంటారు - నేను ఎవరి సంతానమునూ కాను, అలాగే నేను ఎవరి నుండీ చదువుకోలేదు, నాకు గురువులు ఎవ్వరూ లేరు. కానీ నేను పిల్లలైన మీకు తండ్రిని, టీచరును మరియు గురువును. వారి పరమ ఆత్మ అని అంటారు. వారికి ఈ మొత్తం సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలుసు. ఎప్పటివరకైతే వారు వినిపించరో అప్పటివరకూ మీరు ఆదిమధ్యాంతాలను అర్థం చేసుకోలేరు. ఈ చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా మీరు చక్రవర్తీ రాజులుగా అవుతారు. మిమ్మల్ని ఈ బాబా చదివించడం లేదు, వీరిలోకి శివబాబా ప్రవేశించి ఆత్మలను చదివిస్తారు. ఇది కొత్త విషయము కదా. ఇవి సంగమయుగములోనే జరుగుతాయి. పాత ప్రపంచము అంతమైపోతుంది, కొందరిది ధూళిలో కూరుకుపోతుంది, కొందరిది రాజులు తింటారు... తండ్రి పిల్లలకు చెప్తున్నారు - ఎంతోమంది యొక్క కళ్యాణము చేసేందుకు, వారిని మళ్ళీ దేవతలుగా తయారుచేసేందుకు ఈ పాఠశాలలను, మ్యూజియంలను తెరవండి, ఇక్కడకు ఎంతోమంది వచ్చి సుఖ వారసత్వాన్ని పొందుతారు. ఇప్పుడు ఇది రావణ రాజ్యము కదా. రామ రాజ్యంలో సుఖము ఉండేది, రావణ రాజ్యంలో దుఃఖము ఉంది ఎందుకంటే అందరూ వికారులుగా అయిపోయారు. అది ఉన్నదే నిర్వికారీ ప్రపంచము. పిల్లలు అయితే ఈ లక్ష్మీ-నారాయణులు మొదలైనవారికి కూడా ఉన్నారు కదా. కానీ అక్కడ ఉన్నది యోగబలము. తండ్రి మీకు యోగబలాన్ని నేర్పిస్తారు. యోగబలము ద్వారా మీరు విశ్వాధిపతులుగా అవుతారు, బాహుబలము ద్వారా ఎవరూ విశ్వాధిపతులుగా అవ్వలేరు. నియమము అలా లేదు. పిల్లలైన మీరు స్మృతి బలము ద్వారా మొత్తం విశ్వము యొక్క రాజ్యాధికారాన్ని తీసుకుంటున్నారు. ఇది ఎంతటి ఉన్నతమైన చదువు. తండ్రి అంటారు - మొట్టమొదట పవిత్రతా ప్రతిజ్ఞను చేయండి. పవిత్రముగా అవ్వడం ద్వారానే మీరు మళ్ళీ పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ సమయములో బంధనముగా ఉన్న కలియుగ సంబంధాలు ఏవైతే ఉన్నాయో, వాటిని మరచి స్వయాన్ని సంగమయుగ బ్రాహ్మణులుగా భావించాలి. సత్యమైన గీతను వినాలి మరియు వినిపించాలి.

2. పాత ప్రపంచము అంతమవ్వనున్నది, అందుకే మీ సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి. అనేకుల కళ్యాణము కొరకు, మనుష్యులను దేవతలుగా తయారుచేయడానికి ఈ పాఠశాలలను లేక మ్యూజియంలను తెరవాలి.

వరదానము:- తండ్రి ఆజ్ఞగా భావించి ప్రేమతో ప్రతి విషయాన్నీ సహనం చేసే సహనశీలి భవ
కొంతమంది పిల్లలు ఏమంటారంటే - మేము రైట్, అయినా కూడా మేమే సహనం చేయవలసి వస్తుంది, మరణించవలసి వస్తుంది అని. కానీ ఈ సహనం చేయటము లేక మరణించటమే ధారణా సబ్జెక్టులో నంబర్ తీసుకోవటము, అందుకే సహనం చేయటానికి గాభరా పడకండి. చాలామంది పిల్లలు సహనం చేస్తారు కానీ తప్పదన్నట్లుగా సహనం చేయటానికి మరియు ప్రేమ కారణంగా సహనం చేయటానికి తేడా ఉంది. విషయాల కారణంగా సహనము చెయ్యరు, కానీ తండ్రి ఆజ్ఞ ఉంది, సహనశీలురుగా అవ్వండి అని. కనుక ఆజ్ఞగా భావించి ప్రేమ కారణంగా సహనం చేయటం అనగా స్వయాన్ని పరివర్తన చేసుకోవటము, దీనికే మార్కులు ఉంటాయి.
స్లోగన్:- ఎవరైతే సదా సంతోషమనే ఔషధాన్ని తింటారో, వారు ఆరోగ్యంగా ఉంటారు.

 

మురళి అంటే ఏమిటి?

మురళి బ్రహ్మకుమారీల దైనిక ఆధ్యాత్మిక బోధన, ఇది ప్రతి ఉదయం మధుబన్ నుండి ప్రచురించబడుతుంది. ఇక్కడ మీరు ఈరోజు మురళిని తెలుగులో చదవవచ్చు, ఆడియో వినవచ్చు మరియు PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధ్యయనానికి సహాయంగా పాఠ్యాన్ని హైలైట్ చేయవచ్చు — మీ గుర్తులు ఈ బ్రౌజర్‌లోనే సురక్షితంగా ఉంటాయి.

28 భాషల్లో మురళి

Daily Murli · Madhuban మూలం: మధుబన్ మురళి విభాగం ఇది స్వతంత్ర రీడర్ యాప్, అధికారిక వెబ్‌సైట్ కాదు.