తెలుగు మురళి · Brahma Kumaris

తెలుగు మురళి · 10 అక్టోబర్, 2024

ఓం శాంతి · BapDada ·

ఈరోజు మురళి — today’s murli in Telugu, BK Telugu murli.

18
మురళి10 అక్టోబర్, 2024 · తెలుగు
0:00--:--

పాఠ్యాన్ని ఎంచుకోండి → హైలైట్ / బాక్స్ / అండర్‌లైన్

10-10-2024
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
మధువనం

‘‘మధురమైన పిల్లలూ - లేస్తూ-కూర్చుంటూ బుద్ధిలో జ్ఞానము ఉప్పొంగుతూ ఉన్నట్లయితే అపారమైన సంతోషములో ఉంటారు’’
ప్రశ్న:- పిల్లలైన మీరు ఎవరి సాంగత్యము నుండి చాలా-చాలా సంభాళించుకోవాలి?
జవాబు:- ఎవరి బుద్ధిలోనైతే తండ్రి స్మృతి నిలవదో, బుద్ధి అటూ-ఇటూ భ్రమిస్తూ ఉంటుందో, వారి సాంగత్యము నుండి మీరు సంభాళించుకోవాలి. వారి శరీర అంగముతో మీ శరీర అంగము తగలకూడదు కూడా ఎందుకంటే స్మృతిలో ఉండనివారు వాయుమండలాన్ని పాడు చేస్తారు.
ప్రశ్న:- మనుష్యులకు పశ్చాత్తాపము ఎప్పుడు కలుగుతుంది?
జవాబు:- ఎప్పుడైతే వీరిని చదివించేవారు స్వయంగా భగవంతుడు అని వారికి తెలుస్తుందో, అప్పుడు వారి ముఖము పాలిపోతుంది మరియు మేము నిర్లక్ష్యము చేసి పొరపాటు చేసాము, చదువును చదువుకోలేదు అని పశ్చాత్తాపపడతారు.

ఓం శాంతి. ఇప్పుడు ఆత్మిక యాత్ర గురించైతే పిల్లలు బాగా అర్థం చేసుకున్నారు. హఠయోగ యాత్ర అంటూ ఏదీ ఉండదు. ఇది స్మృతి. స్మృతి కొరకు ఎటువంటి కష్టమైన విషయమూ లేదు. తండ్రిని స్మృతి చేయడము, ఇందులో ఎటువంటి కష్టమూ లేదు. ఇది క్లాస్, అందుకే కేవలం నియమానుసారముగా కూర్చోవలసి ఉంటుంది. మీరు తండ్రికి పిల్లలుగా అయ్యారు, పిల్లల పాలన జరుగుతోంది. ఏ పాలన? అవినాశీ జ్ఞాన రత్నాల ఖజానా లభిస్తోంది. తండ్రిని స్మృతి చేయడములో ఎటువంటి కష్టమూ లేదు. కేవలం మాయ బుద్ధి యోగాన్ని తెంచివేస్తుంది. ఇకపోతే మీరు ఎలాగైనా కూర్చోండి, దానికీ స్మృతికీ ఎటువంటి సంబంధమూ లేదు. చాలామంది పిల్లలు హఠయోగములా 3-4 గంటలు కూర్చుంటారు, మొత్తం రాత్రంతా కూడా కూర్చుంటారు. ఇంతకుముందైతే మీకు భట్టీ జరిగింది, అప్పటి విషయము వేరు, అక్కడ మీకు వ్యాపార, వ్యవహారాలేవీ లేవు, అందుకే మీకు ఇది నేర్పించడం జరిగేది. ఇప్పుడు తండ్రి అంటారు, మీరు గృహస్థ వ్యవహారములో ఉండండి, వ్యాపార-వ్యవహారాలు కూడా చేయండి, ఏ పనులు చేస్తున్నా సరే తండ్రిని స్మృతి చేయాలి. అలాగని ఇప్పుడే మీరు నిరంతరమూ స్మృతి చేయగలరని కాదు, అలా కాదు. అటువంటి అవస్థ తయారయ్యేందుకు సమయం పడుతుంది. ఇప్పుడే నిరంతర స్మృతి నిలిచి ఉన్నట్లయితే ఇక కర్మాతీత అవస్థ ఏర్పడిపోతుంది. తండ్రి అర్థం చేయిస్తారు - పిల్లలూ, డ్రామా ప్లాన్ అనుసారంగా ఇప్పుడు ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది. మొత్తం లెక్క అంతా కూడా బుద్ధిలో ఉంటుంది. క్రైస్టుకు 3,000 సంవత్సరాల పూర్వము భారత్ యే ఉండేది అని అంటారు. దానిని స్వర్గము అని పిలిచేవారు. ఇప్పుడు వారు వచ్చి 2,000 సంవత్సరాలు పూర్తవుతాయి, దానితో 5000 సంవత్సరాల లెక్క పూర్తవుతుంది.

మీ పేరు మొత్తం విదేశాల నుండే వెలువడుతుంది అని గమనించడం జరుగుతుంది ఎందుకంటే వారి బుద్ధి ఎంతైనా భారతవాసుల కంటే చురుకైనది. భారత్ నుండి వారు శాంతిని కూడా కోరుకుంటారు. భారతవాసులే లక్షల సంవత్సరాలు అనేసి, సర్వవ్యాపి జ్ఞానాన్ని ఇచ్చి బుద్ధిని పాడు చేసేసారు, తమోప్రధానముగా అయిపోయారు. కానీ వారు ఇంత తమోప్రధానముగా అవ్వలేదు, వారి బుద్ధి అయితే చాలా చురుకుగా ఉంది. వారి ద్వారా ఎప్పుడైతే శబ్దము వెలువడుతుందో అప్పుడు భారతవాసులు మేల్కుంటారు ఎందుకంటే భారతవాసులు పూర్తిగా ఘోరమైన నిద్రలో నిదురిస్తున్నారు. వారైతే కొద్దిగానే నిద్రించి ఉన్నారు. వారి ద్వారా శబ్దం బాగా వెలువడుతుంది. శాంతి ఎలా ఏర్పడగలదో మాకు ఎవరైనా చెప్పండి అని విదేశాల నుండి వచ్చారు కూడా. ఎందుకంటే తండ్రి కూడా భారత్ లోనే వస్తారు. ప్రపంచములో మళ్ళీ ఆ శాంతి ఎప్పుడు మరియు ఎలా ఏర్పడగలదు అన్న విషయాన్ని పిల్లలైన మీరే తెలియజేయగలరు. తప్పకుండా ప్యారడైజ్ లేక స్వర్గము ఉండేదని పిల్లలైన మీకు తెలుసు. కొత్త ప్రపంచములో భారత్ ప్యారడైజ్ గా ఉండేది. ఇది ఇంకెవరికీ తెలియదు. మనుష్యుల బుద్ధిలో ఈశ్వరుడు సర్వవ్యాపి అన్న విషయమే కూర్చుండిపోయింది, అంతేకాక కల్పము ఆయువును లక్షల సంవత్సరాలు అని అనేశారు. అందరికన్నా ఎక్కువగా రాతిబుద్ధి కలవారిగా ఈ భారతవాసులే అయ్యారు. ఈ గీతా శాస్త్రము మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. మళ్ళీ ఇవన్నీ ఇదే విధంగా తయారవుతాయి. డ్రామా గురించి తెలుసు, అయినా కూడా తండ్రి అయితే పురుషార్థము చేయిస్తారు. వినాశనమైతే తప్పకుండా జరుగుతుంది అని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేందుకే వచ్చారు. ఇది సంతోషకరమైన విషయము కదా. ఎవరైనా ఏదైనా పెద్ద పరీక్షను పాస్ అయితే లోలోపల సంతోషము కలుగుతుంది కదా. మనం ఇవన్నీ పాస్ అయి వెళ్ళి ఈ దేవతలుగా అవుతాము. మొత్తమంతా చదువుపైనే ఆధారపడి ఉంది.

తప్పకుండా తండ్రి మనల్ని చదివించి ఈ విధంగా తయారుచేస్తారని పిల్లలైన మీకు తెలుసు. తప్పకుండా ప్యారడైజ్, హెవెన్ ఉండేది. మనుష్యులైతే పాపం పూర్తిగా తికమకలో ఉన్నారు. అనంతమైన తండ్రి వద్ద ఏ జ్ఞానమైతే ఉందో దానిని పిల్లలైన మీకు ఇస్తున్నారు. బాబా నాలెడ్జ్ ఫుల్ అని, అలాగే ఆనంద సాగరుడు అని, ఖజానా కూడా వారి వద్ద నిండుగా ఉంది అని మీరు ఆ తండ్రి మహిమను చేస్తారు. మిమ్మల్ని ఇంత షావుకార్లుగా ఎవరు తయారుచేస్తారు? ఇక్కడకు మీరు ఎందుకు వచ్చారు? వారసత్వాన్ని తీసుకునేందుకు. ఒకవేళ ఎవరికైనా ఆరోగ్యము బాగుండి ధనము లేకపోతే, ధనము లేకపోతే ఏముంటుంది! వైకుంఠములోనైతే మీ వద్ద ధనము ఉంటుంది. ఇక్కడ షావుకార్లు ఎవరెవరైతే ఉన్నారో వారికి మా వద్ద ఇంతటి ధనము ఉంది, ఈ-ఈ ఫ్యాక్టరీలు మొదలైనవి ఉన్నాయి అన్న నషా ఉంటుంది. శరీరము వదలితే ఇక సమాప్తము. మనకు బాబా 21 జన్మల కొరకు ఇంతటి ఖజానాను ఇస్తారు అనైతే మీకు తెలుసు. తండ్రి స్వయం ఆ ఖజానాలకు యజమానిగా అవ్వరు. పిల్లలైన మిమ్మల్ని యజమానులుగా తయారుచేస్తారు. విశ్వములో శాంతినైతే గాడ్ ఫాదర్ తప్ప ఇంకెవ్వరూ స్థాపించలేరని కూడా మీకు తెలుసు. అన్నింటికన్నా ఫస్ట్ క్లాస్ అయిన చిత్రము ఈ త్రిమూర్తి, సృష్టి చక్రము. ఈ చక్రములోనే మొత్తం జ్ఞానమంతా నిండి ఉంది. మీ వద్ద ఇటువంటి అద్భుతమైన వస్తువేదైనా ఉంటేనే, వీరి వద్ద తప్పకుండా అటువంటి రహస్యమేదో ఉంది అని వారు భావిస్తారు. పిల్లలు కొందరు చిన్న-చిన్న బొమ్మలు (చిత్రాలు) తయారుచేస్తారు, అవి బాబాకు ఇష్టమనిపించవు. బాబా అయితే దూరం నుండే ఎవరైనా చదివి అర్థం చేసుకునేలా పెద్ద చిత్రాలను పెట్టమని చెప్తారు. మనుష్యులు పెద్ద వస్తువుల వైపు అటెన్షన్ పెడతారు. ఇందులో స్పష్టంగా చూపించబడింది, అటువైపు కలియుగము ఉంది, ఇటువైపు సత్యయుగము ఉంది. పెద్ద-పెద్ద చిత్రాలు ఉంటే మనుష్యుల అటెన్షన్ అటువైపుకు వెళ్తుంది. టూరిస్టులు కూడా చూస్తారు, వారు బాగా అర్థం చేసుకుంటారు కూడా. క్రైస్టుకు 3,000 సంవత్సరాల పూర్వం స్వర్గము ఉండేది అన్నది కూడా తెలుసు. విదేశాలలో వారికి ఈ విధంగా తెలియదు. 5000 సంవత్సరాల లెక్కను మీరు స్పష్టముగా అర్థం చేయిస్తారు కావున దీనిని ఎంత పెద్దగా తయారుచేయాలంటే వారు దీనిని దూరం నుండే చూడగలగాలి మరియు అక్షరాలను కూడా చదవగలగాలి మరియు ప్రపంచము యొక్క అంతము తప్పకుండా జరుగనున్నది అని అర్థం చేసుకోగలగాలి. బాంబులైతే తయారవుతూ ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. మీరు వినాశనం అన్న మాట వింటే లోలోపల చాలా సంతోషము కలగాలి. కానీ జ్ఞానమే లేకపోతే సంతోషించలేరు కూడా. తండ్రి అంటారు, దేహ సహితముగా అన్నింటినీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి, మీ ఆత్మ యొక్క యోగాన్ని తండ్రినైన నాతో జోడించండి. ఇది శ్రమతో కూడుకున్న విషయము. పావనముగా తయారయ్యే పావన ప్రపంచములోకి రావాలి. మనమే రాజ్యాధికారాన్ని తీసుకుంటాము, మళ్ళీ పోగొట్టుకుంటాము అని మీరు భావిస్తారు. ఇది చాలా సహజము. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ లోలోపల ఈ చింతన జరుగుతూ ఉండాలి. ఏ విధంగా బాబా వద్ద జ్ఞానము ఉంది కదా. తండ్రి చదివించి దేవతలుగా తయారుచేసేందుకే వచ్చారు. కావున అంతటి అపారమైన సంతోషము పిల్లలకు ఉండాలి కదా. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, అంతటి అపారమైన సంతోషము ఉందా? తండ్రిని అంతగా స్మృతి చేస్తున్నామా? చక్రము యొక్క జ్ఞానమంతా కూడా బుద్ధిలో ఉంది కావున అంతటి సంతోషము ఉండాలి. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి మరియు పూర్తిగా సంతోషములో ఉండండి. మిమ్మల్ని చదివించేవారు ఎవరో చూడండి! ఎప్పుడైతే అందరికీ తెలుస్తుందో అప్పుడు అందరి ముఖము పాలిపోతుంది. కానీ ఇప్పుడు వారు అర్థం చేసుకోవడానికి ఇంకా కొద్దిగా సమయం ఉంది. ఇప్పుడింకా దేవతా ధర్మము యొక్క సభ్యులుగా అంతమంది తయారవ్వలేదు. మొత్తం రాజ్యమంతా ఇంకా స్థాపన అవ్వలేదు. ఇంకా ఎంతమంది మనుష్యులకు తండ్రి సందేశాన్ని ఇవ్వాలి! అనంతమైన తండ్రి మళ్ళీ మనకు స్వర్గ రాజ్యాధికారాన్ని ఇస్తున్నారు. మీరు కూడా ఆ తండ్రిని స్మృతి చేయండి. అనంతమైన తండ్రి అయితే తప్పకుండా అనంతమైన సుఖాన్నే ఇస్తారు కదా. పిల్లల లోపల జ్ఞానము యొక్క సంతోషము అపారముగా ఉండాలి మరియు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారో అంతగా ఆత్మ పవిత్రముగా అవుతూ ఉంటుంది.

డ్రామా ప్లాన్ అనుసారముగా పిల్లలైన మీరు ఎంతగా సేవ చేసి ప్రజలను తయారుచేసుకుంటారో, అక్కడ ఎవరి కళ్యాణమైతే జరుగుతుందో వారి ఆశీర్వాదాలు కూడా మీకు లభిస్తాయి. మీరు పేదవారి సేవను చేస్తారు. ఆహ్వానాన్ని ఇస్తూ ఉండండి. ట్రైన్ లో కూడా మీరు ఎంతో సేవను చేయవచ్చు. ఇంత చిన్న బ్యాడ్జిలోనే ఎంతటి జ్ఞానము నిండి ఉంది. మొత్తం చదువు యొక్క సారమంతా ఇందులో ఉంది. బ్యాడ్జీలైతే చాలా మంచి-మంచివి ఎన్నో తయారుచేయాలి, వాటిని ఎవరికైనా కానుకగా కూడా ఇవ్వవచ్చు. ఎవరికైనా అర్థం చేయించడమైతే చాలా సహజము. కేవలం శివబాబాను స్మృతి చేయండి. శివబాబా నుండే వారసత్వము లభిస్తుంది కావున తండ్రిని మరియు తండ్రి వారసత్వమైన స్వర్గ రాజ్యాధికారాన్ని, కృష్ణపురిని స్మృతి చేయండి. మనుష్యుల మతమైతే ఎంతగా తికమకగా ఉంది. వారేమీ అర్థం చేసుకోరు. వికారాల కోసం ఎంతగా విసిగిస్తూ ఉంటారు. కామము కోసము ఎంతగా చస్తూ ఉంటారు. విషయాన్ని అర్థం చేసుకోరు. అందరి బుద్ధి పూర్తిగా నాశనమైపోయింది, అసలు తండ్రి గురించి తెలియనే తెలియదు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. అందరి మానసిక శక్తి అంతమైపోయింది. తండ్రి అంటారు - పిల్లలూ, మీరు పవిత్రముగా అయినట్లయితే ఇటువంటి స్వర్గానికి యజమానులుగా అవుతారు. కానీ అర్థం చేసుకోనే చేసుకోరు. ఆత్మలోని శక్తి అంతా పోయింది. ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు, అయినా కానీ పురుషార్థము చేయాలి మరియు చేయించాలి, పురుషార్థములో అలసిపోకూడదు. హార్ట్ ఫెయిల్ కూడా అవ్వకూడదు. ఇంతగా కష్టపడ్డాము, కానీ భాషణ ద్వారా ఒక్కరు కూడా వెలువడలేదే అని భావించకండి. కానీ మీరు ఏదైతే వినిపించారో దానిని ఎవరెవరైతే విన్నారో వారిపై ముద్ర అయితే పడిపోయింది. చివరిలో అందరూ తప్పకుండా తెలుసుకుంటారు. బి.కె.లు అయిన మీది అపారమైన మహిమ వెలువడనున్నది. కానీ కొందరి కర్మలు చూస్తుంటే పూర్తిగా బుద్ధిహీనతతో ఉన్నట్లు ఉంది. ఎటువంటి గౌరవమూ లేదు, పూర్తి పరిచయమూ లేదు. బుద్ధి బయట భ్రమిస్తూ ఉంటుంది. తండ్రిని స్మృతి చేసినట్లయితే సహాయం కూడా లభించగలదు. తండ్రినే స్మృతి చేయకపోతే వారు పతితులుగా ఉన్నట్లే. మీరు పావనంగా అవుతారు. ఎవరైతే తండ్రిని స్మృతి చేయరో వారి బుద్ధి తప్పకుండా ఎక్కడో అక్కడ భ్రమిస్తూ ఉంటుంది. కావున అటువంటివారి శరీర అంగముతో మీ శరీర అంగము తగలకూడదు ఎందుకంటే స్మృతిలో ఉండని కారణముగా వారు వాయుమండలాన్ని పాడు చేసేస్తారు. పవిత్రులు మరియు అపవిత్రులు కలిసి ఉండలేరు, అందుకే తండ్రి పాత సృష్టిని అంతం చేసేస్తారు. రోజురోజుకు నియమాలు కూడా కఠినమైనవి వెలువడుతూ ఉంటాయి. తండ్రిని స్మృతి చేయకపోతే లాభానికి బదులుగా ఇంకా నష్టాన్ని కలిగిస్తారు. పవిత్రత ఆధారమంతా స్మృతిపైనే ఉంది. అలాగని ఒక్క చోటే కూర్చుండిపోయే విషయమూ కాదు. ఇక్కడ కలిసి కూర్చోవడం కన్నా వేర్వేరు పర్వతాల పైకి వెళ్ళి కూర్చోవడం మంచిది. ఎవరైతే స్మృతి చేయరో వారు పతితులు. వారితో సాంగత్యము కూడా చేయకూడదు. నడవడిక ద్వారా కూడా తెలిసిపోతుంది. స్మృతి లేకుండా పావనముగానైతే అవ్వలేరు. ప్రతి ఒక్కరిపైనా జన్మజన్మాంతరాల పాపాల భారము ఎంతగానో ఉంది. అది స్మృతియాత్ర లేకుండా ఎలా తొలగుతుంది. వారు పతితులుగా ఉన్నట్లే.

తండ్రి అంటారు, నేను పిల్లలైన మీ కొరకు మొత్తం పతిత ప్రపంచమంతటినీ అంతం చేసేస్తాను. వారి సాంగత్యము కూడా ఉండకూడదు. కానీ ఎవరితో సాంగత్యము చేయాలి అన్నంత బుద్ధి కూడా లేదు. పావనులైన మీ ప్రేమ పావనుడితో ఉండాలి. ఈ బుద్ధి కూడా కావాలి కదా. మధురమైన తండ్రి మరియు మధురమైన రాజధాని తప్ప ఇంకెవరూ గుర్తుకురాకూడదు. ఇంతగా అంతా త్యాగం చేయడమనేది సామాన్యమైన విషయమేమీ కాదు. తండ్రికైతే పిల్లలపై అపారమైన ప్రేమ ఉంది. పిల్లలూ, పావనంగా అయినట్లయితే మీరు పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. నేను మీ కొరకు పావన ప్రపంచ స్థాపనను చేస్తున్నాను. ఈ పతిత ప్రపంచాన్ని పూర్తిగా అంతం చేయించేస్తారు. ఇక్కడ ఈ పతిత ప్రపంచములో ప్రతి వస్తువూ మీకు దుఃఖాన్ని కలిగిస్తుంది. ఆయువు కూడా తగ్గిపోతూ ఉంటుంది. దీనిని పైసకు కొరగానిది అనే అనడం జరుగుతుంది. వజ్రానికి మరియు గవ్వకు తేడా అయితే ఉంటుంది కదా. కావున పిల్లలైన మీకు ఎంతటి సంతోషము కలగాలి. సత్యమున్న చోట మనసు ఆనందముతో నాట్యము చేస్తుంది అని అంటూ ఉంటారు కూడా. మీరు సత్యయుగములో సంతోషములో నాట్యం చేస్తారు. ఇక్కడ ఉన్న ఏ వస్తువు పైనా మనస్సు పెట్టుకోకూడదు. వీటినైతే చూస్తూ కూడా చూడకూడదు, కళ్ళు తెరిచి ఉంటూ కూడా నిదురిస్తున్నట్లుగా ఉండాలి. కానీ అంతటి ధైర్యము, అంతటి అవస్థ కావాలి. ఈ పాత ప్రపంచము ఇక అసలు ఉండనే ఉండదు అన్న నిశ్చయమైతే ఉంది. సంతోషము యొక్క పాదరసము అంతగా పైకెక్కి ఉండాలి. అరే, మేము శివబాబాను స్మృతి చేసినట్లయితే విశ్వరాజ్యాధికారము లభిస్తుంది అని మిమ్మల్ని మీరు గిల్లుకోవాలి. అలాగని హఠయోగములా కూడా కూర్చోకూడదు. తింటూ, తాగుతూ, పనులు చేసుకుంటూ తండ్రిని స్మృతి చేయండి. రాజధాని స్థాపన అవుతోందని కూడా మీకు తెలుసు. తండ్రి దాసిగా అవ్వండి అని అయితే అనరు. తండ్రి అంటారు, పావనంగా అయ్యేందుకు పురుషార్థము చేయండి. తండ్రి పావనంగా తయారుచేసే పురుషార్థాన్ని చేయిస్తారు, మీరు మళ్ళీ పతితులుగా అవుతారు, ఎన్ని అబద్ధాలు చెప్పి, పాపాలు చేస్తారు. ఎల్లప్పుడూ శివబాబానే స్మృతి చేస్తూ ఉన్నట్లయితే పాపాలన్నీ స్వాహా అయిపోతాయి. ఇది బాబా యజ్ఞము కదా. ఇది చాలా గొప్ప యజ్ఞము. అక్కడ వారు యజ్ఞాలు రచిస్తారు, లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. ఇక్కడ మీకు తెలుసు, ఈ మొత్తం ప్రపంచమంతా ఇందులో స్వాహా అవ్వనున్నది. బయట నుండి శబ్దము వెలువడుతుంది, భారత్ లో కూడా వ్యాపిస్తుంది. ఒకటేమో తండ్రితోపాటు బుద్ధియోగము ఉన్నట్లయితే పాపాలు అంతమవుతాయి మరియు ఉన్నత పదవి కూడా లభిస్తుంది. తండ్రి బాధ్యత పిల్లల చేత పురుషార్థం చేయించడము. లౌకిక తండ్రి అయితే పిల్లల సేవ చేస్తారు, అలాగే సేవ తీసుకుంటారు కూడా. ఈ తండ్రి అయితే అంటారు, నేను పిల్లలైన మీకు 21 జన్మల వారసత్వాన్ని ఇస్తాను, కావున ఇటువంటి తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి, తద్వారా పాపాలు అంతమవుతాయి. అంతేకానీ నీటి ద్వారా పాపాలేవీ అంతమవ్వవు. నీరు అయితే ఎక్కడ పడితే అక్కడ ఉంది. విదేశాల్లో కూడా నదులు ఉన్నాయి, మరి ఇక్కడి నదులు పావనంగా చేస్తే విదేశాలలోని నదులు పతితముగా చేస్తాయా. మనుష్యులలో ఏ మాత్రమూ వివేకము లేదు. తండ్రికైతే దయ కలుగుతుంది కదా. తండ్రి అర్థం చేయిస్తారు - పిల్లలూ, నిర్లక్ష్యముతో పొరపాటు చేయకండి. తండ్రి ఇంతటి పుష్పాలుగా తయారుచేస్తుంటే మరి కృషి చేయాలి కదా. మీపై మీరు దయ చూపించుకోవాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఇక్కడికి సంబంధించిన ఏ వస్తువు పట్ల మనసు పెట్టుకోకూడదు. చూస్తూ కూడా చూడకూడదు. కళ్ళు తెరిచి ఉంటూ కూడా ఏ విధంగా నిద్ర యొక్క నషా ఉంటుందో, అదే విధంగా సంతోషము యొక్క నషా ఎక్కి ఉండాలి.

2. మొత్తం అంతా పవిత్రతపై ఆధారపడి ఉంది, అందుకే పతితుల శరీర అంగము మీ శరీర అంగముతో తగలకుండా ఉండేలా సంభాళించుకోవాలి. మధురమైన తండ్రి మరియు మధురమైన రాజధాని తప్ప ఇంకెవ్వరూ గుర్తుకురాకూడదు.

వరదానము:- హద్దు కోరికలను వదిలి మంచిగా అయ్యే ఇచ్ఛా మాత్రం అవిద్య భవ
మనసులో ఏదైనా హద్దు కోరిక ఉన్నట్లయితే అది మంచిగా అవ్వనివ్వదు. ఏ విధంగా ఎండలో నడిచినప్పుడు నీడ ముందు వెళ్తూ ఉంటుంది, ఒకవేళ దానిని పట్టుకోవాలని ప్రయత్నిస్తే పట్టుకోలేరు, వెనక్కి తిరిగి నడిచినట్లయితే నీడ వెనుక-వెనుక వస్తుంది. అలాగే కోరిక అనేది ఆకర్షితం చేసి ఏడిపించేటువంటిది, దానిని వదిలేసినట్లయితే అది వెనుక-వెనుక వస్తుంది. యాచించేవారు ఎప్పుడూ సంపన్నులుగా అవ్వలేరు. ఎలాంటి హద్దు కోరికల వెనుకనైనా పరిగెత్తటమంటే ఎండమావుల వెనుక పరిగెత్తటము వంటిది, దీని నుండి సదా రక్షింపబడి ఉన్నట్లయితే ఇచ్ఛా మాత్రం అవిద్యగా అవుతారు.
స్లోగన్:- తమ శ్రేష్ఠ కర్మలు మరియు శ్రేష్ఠ నడవడిక ద్వారా ఆశీర్వాదాలను జమ చేసుకున్నట్లయితే పర్వతము వంటి విషయము కూడా దూది సమానంగా అనుభవమవుతుంది.

 

మురళి అంటే ఏమిటి?

మురళి బ్రహ్మకుమారీల దైనిక ఆధ్యాత్మిక బోధన, ఇది ప్రతి ఉదయం మధుబన్ నుండి ప్రచురించబడుతుంది. ఇక్కడ మీరు ఈరోజు మురళిని తెలుగులో చదవవచ్చు, ఆడియో వినవచ్చు మరియు PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధ్యయనానికి సహాయంగా పాఠ్యాన్ని హైలైట్ చేయవచ్చు — మీ గుర్తులు ఈ బ్రౌజర్‌లోనే సురక్షితంగా ఉంటాయి.

28 భాషల్లో మురళి

Daily Murli · Madhuban మూలం: మధుబన్ మురళి విభాగం ఇది స్వతంత్ర రీడర్ యాప్, అధికారిక వెబ్‌సైట్ కాదు.