| 11-10-2024 |
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
|
మధువనం |
| ‘‘మధురమైన పిల్లలూ - తండ్రి స్మృతితోపాటు జ్ఞాన ధనముతో సంపన్నులుగా అవ్వండి, బుద్ధిలో మొత్తము జ్ఞానమంతా తిరుగుతూ ఉండాలి, అప్పుడు అపారమైన సంతోషము ఉంటుంది, సృష్టి చక్రము యొక్క జ్ఞానముతో మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు’’ | |
| ప్రశ్న:- | ఏ పిల్లల (మనుష్యుల) ప్రీతి తండ్రితో ఉండలేదు? |
| జవాబు:- | ఎవరైతే రౌరవ నరకములో ఉండే వికారులతో ప్రీతిని పెట్టుకుంటారో, అటువంటి మనుష్యుల ప్రీతి తండ్రితో ఉండలేదు. పిల్లలైన మీరు తండ్రిని గుర్తించారు, అందుకే మీకు తండ్రితో ప్రీతి ఉంది. |
| ప్రశ్న:- | ఎవరికి సత్యయుగములోకి వచ్చే ఆజ్ఞనే లేదు? |
| జవాబు:- | తండ్రి కూడా సత్యయుగములోకి రారు, అలాగే అక్కడకు కాలుడు కూడా రాలేడు. ఏ విధంగా రావణుడికి సత్యయుగములోకి వచ్చే ఆజ్ఞ లేదో, అలాగే బాబా అంటారు - పిల్లలూ, నాకు కూడా సత్యయుగములోకి వచ్చే ఆజ్ఞ లేదు. బాబా అయితే మిమ్మల్ని సుఖధామానికి యోగ్యులుగా చేసి ఇంటికి వెళ్ళిపోతారు, వారికి కూడా లిమిట్ (హద్దు) ఉంది. |
ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆత్మిక పిల్లలూ, స్మృతి యాత్రలో కూర్చున్నారా? ఆత్మలమైన మేము స్మృతి యాత్రలో ఉన్నాము అన్న జ్ఞానము లోపల ఉంది కదా. యాత్ర అన్న పదము అయితే తప్పకుండా హృదయములోకి రావాలి. ఏ విధంగా వారు హరిద్వార్, అమర్ నాథ్ మొదలైన చోట్లకు వెళ్ళే యాత్రలను చేస్తారు, యాత్రలను పూర్తి చేసి తిరిగి వస్తారు. ఇక్కడేమో పిల్లలైన మీ బుద్ధిలో, మేము ఇక శాంతిధామానికి వెళ్తాము అని ఉంది. తండ్రి వచ్చి చేయి పట్టుకున్నారు. చేయి పట్టుకుని ఆవలి తీరానికి తీసుకువెళ్ళవలసి ఉంటుంది కదా. చేయిని పట్టుకోండి అని అంటారు కూడా ఎందుకంటే విషయసాగరములో పడి ఉన్నారు. ఇప్పుడు మీరు శివబాబాను స్మృతి చేయండి మరియు ఇంటిని స్మృతి చేయండి. మేము ఇక వెళ్తున్నాము అని లోలోపల అనిపిస్తూ ఉండాలి. ఇందులో నోటితో ఏమీ అనేది కూడా లేదు. లోలోపల కేవలం - బాబా తీసుకువెళ్ళేందుకు వచ్చారు అన్నది మాత్రమే గుర్తుండాలి. స్మృతి యాత్రలో తప్పకుండా ఉండాలి. ఈ స్మృతి యాత్ర ద్వారానే మీ పాపాలు అంతమవుతాయి, అప్పుడే మళ్ళీ ఆ గమ్యానికి చేరుకుంటారు. తండ్రి ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తారు. ఏ విధంగా చిన్న పిల్లలకు చదివించడం జరుగుతుంది కదా. సదా బుద్ధిలో ఉండాలి - మేము బాబాను స్మృతి చేస్తూ వెళ్తున్నాము అని. తండ్రి పనే పావనంగా తయారుచేసి పావన ప్రపంచములోకి తీసుకువెళ్ళడము. వారు పిల్లలను తీసుకువెళ్తారు. ఆత్మయే యాత్రను చేయవలసి ఉంటుంది. ఆత్మలమైన మనము తండ్రిని స్మృతి చేసి ఇంటికి వెళ్ళాలి. ఇంటికి చేరుకున్నాక ఇక తండ్రి పని పూర్తవుతుంది. తండ్రి పతితులను పావనంగా చేసి ఇంటికి తీసుకువెళ్ళేందుకే వస్తారు. చదువునైతే ఇక్కడే చదువుతారు. ఆ తర్వాత మీరు తిరగండి, విహరించండి లేక ఏ పనులైనా చేసుకోండి, బుద్ధిలో ఈ స్మృతి ఉండాలి. యోగము అన్న పదముతో యాత్ర అన్నది నిరూపించబడదు. యోగము సన్యాసులది. అవన్నీ మనుష్యుల మతాలు. అర్ధకల్పం మీరు మనుష్య మతముపై నడిచారు. అర్ధకల్పం దైవీ మతముపై నడిచారు. ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతము లభిస్తుంది.
యోగము అన్న పదము అనకండి, స్మృతి యాత్ర అని అనండి. ఆత్మయే ఈ యాత్రను చేయాలి. అక్కడ అది భౌతికమైన యాత్ర, దానికి శరీరముతో వెళ్తారు. ఇందులోనైతే శరీరము పనే లేదు. ఆత్మలమైన మనకు అది మధురమైన ఇల్లు అని ఆత్మకు తెలుసు. తండ్రి మనకు శిక్షణను ఇస్తున్నారు, తద్వారా మనం పావనంగా అవుతాము. స్మృతి చేస్తూ, చేస్తూ తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలి. ఇది యాత్ర. మనం తండ్రి స్మృతిలో కూర్చుంటాము ఎందుకంటే బాబా వద్దకే ఇంటికి వెళ్ళాలి. తండ్రి పావనంగా తయారుచేసేందుకే వస్తారు, కావున పావన ప్రపంచములోకి వెళ్ళవలసిందే. తండ్రి పావనంగా తయారుచేస్తారు, మళ్ళీ నంబరువారు పురుషార్థానుసారముగా మీరు పావన ప్రపంచములోకి వెళ్తారు. ఈ జ్ఞానము బుద్ధిలో ఉండాలి. మనం స్మృతి యాత్రలో ఉన్నాము. మనం ఈ మృత్యు లోకములోకి తిరిగి వచ్చేది లేదు. బాబా పని మనల్ని ఇంటి వరకూ చేర్చడం. బాబా దారిని తెలియజేస్తారు. ఇప్పుడు మీరైతే మృత్యులోకములో ఉన్నారు, ఆ తర్వాత అమరలోకమైన కొత్త ప్రపంచములో ఉంటారు. తండ్రి యోగ్యులుగా తయారుచేసే తీరుతారు. సుఖధామములోకి తండ్రి తీసుకువెళ్ళరు. వారికి ఇంటికి చేర్చడం వరకే లిమిట్ ఉంది. ఈ మొత్తం జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. కేవలం తండ్రిని స్మృతి చేయడమే కాదు, దానితో పాటుగా జ్ఞానము కూడా కావాలి. జ్ఞానముతో మీరు ధనాన్ని సంపాదిస్తారు కదా. ఈ సృష్టి చక్రము యొక్క జ్ఞానముతో మీరు చక్రవర్తీ రాజులుగా అవుతారు. బుద్ధిలో ఈ జ్ఞానము ఉంది - ఈ చక్రములో తిరిగి వచ్చాము, మళ్ళీ మనం ఇంటికి వెళ్తాము, మళ్ళీ కొత్తగా చక్రము ప్రారంభమవుతుంది. ఈ మొత్తం జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి, అప్పుడు సంతోషపు పాదరసము పైకి ఎక్కుతుంది. తండ్రిని కూడా స్మృతి చేయాలి, శాంతిధామాన్ని, సుఖధామాన్ని కూడా స్మృతి చేయాలి. ఒకవేళ 84 జన్మల చక్రాన్ని స్మృతి చేయకపోతే చక్రవర్తీ రాజులుగా ఎలా అవుతారు. కేవలం ఒక్కదానినే స్మృతి చేయడమైతే సన్యాసుల పని ఎందుకంటే వారికి వీరి గురించి తెలియదు, వారు బ్రహ్మమునే తలచుకుంటూ ఉంటారు. తండ్రి అయితే పిల్లలకు బాగా అర్థం చేయిస్తారు. స్మృతి చేస్తూ, చేస్తూనే మీ పాపాలు అంతమవ్వనున్నాయి. మొదటైతే ఇంటికి వెళ్ళాలి, ఇది ఆత్మిక యాత్ర. నలువైపులా తిరిగి వచ్చాము, అయినా ప్రతి క్షణమూ దూరంగా ఉన్నాము అనగా తండ్రి నుండి దూరంగా ఉన్నాము అన్న గాయనము కూడా ఉంది. ఏ తండ్రి నుండైతే అనంతమైన వారసత్వము లభించేది ఉందో, వారి గురించి తెలియనే తెలియదు. ఎన్ని సార్లు తిరిగారు. కొందరు ప్రతి సంవత్సరము యాత్రలు చేస్తారు. ధనం బాగా ఉంటే యాత్రల అభిరుచి ఉంటుంది. మీదైతే ఆత్మిక యాత్ర. మీ కొరకు కొత్త ప్రపంచము తయారవుతుంది, ఇక తర్వాత మీరు కొత్త ప్రపంచములోకే రాబోతున్నారు, దానిని అమరలోకము అని అంటారు. ఎవరినైనా తీసుకుపోయేందుకు అక్కడ కాలుడు ఉండడు. కొత్త ప్రపంచములోకి వచ్చేందుకు కాలుడికి అనుమతే లేదు. రావణుడిదైతే ఈ పాత ప్రపంచమే కదా. మీరు పిలవడం కూడా ఇక్కడే పిలుస్తారు. తండ్రి అంటారు, నేను పాత ప్రపంచములోకి, పాత శరీరములోకి వస్తాను. నాకు కూడా కొత్త ప్రపంచములోకి వచ్చేందుకు అనుమతి లేదు. నేనైతే పతితులను పావనంగా చేసేందుకే వస్తాను. మీరు పావనంగా అయి మళ్ళీ ఇతరులను కూడా పావనంగా తయారుచేస్తారు. సన్యాసులైతే పారిపోతారు, పూర్తిగా మాయమైపోతారు. వారు ఎక్కడకు వెళ్ళారు అనేది తెలియనే తెలియదు ఎందుకంటే వారు తమ వస్త్రాలనే మార్చేస్తారు. ఏ విధంగా పాత్రధారులు రూపాన్ని మారుస్తారు కదా. ఒక్కో సారి పురుషుని నుండి స్త్రీగా అయిపోతారు, ఒక్కో సారి స్త్రీ నుండి పురుషునిగా అయిపోతారు. అలాగే వారు కూడా రూపాన్ని మారుస్తారు. సత్యయుగములో ఇటువంటి విషయాలేవీ ఉండవు.
తండ్రి అంటారు, నేను కొత్త ప్రపంచాన్ని తయారుచేసేందుకు వస్తాను. అర్ధకల్పం పిల్లలైన మీరు రాజ్యం చేస్తారు, మళ్ళీ డ్రామా ప్లాన్ అనుసారంగా ద్వాపరము ప్రారంభమవుతుంది, దేవతలు వామ మార్గములోకి వెళ్ళిపోతారు. జగన్నాథపురిలో వారివి చాలా అశుద్ధమైన చిత్రాలు కూడా ఉన్నాయి. జగన్నాథుని మందిరము ఉంది. ఒకప్పుడు అతని రాజధాని ఉండేది, తాను స్వయం విశ్వాధిపతిగా ఉండేవారు. తర్వాత అతను వెళ్ళి మందిరములో బంధించబడ్డారు, అతడిని నల్లగా చూపిస్తారు. ఈ జగన్నాథ మందిరముపై మీరు చాలా అర్థం చేయించవచ్చు. ఇంకెవరూ దీని అర్థాన్ని అర్థం చేయించలేరు. దేవతలే పూజ్యుల నుండి పూజారులుగా అవుతారు. వారైతే ప్రతి విషయములోనూ భగవంతుని కోసం - మీరే పూజ్యులు, మీరే పూజారి, మీరే సుఖాన్ని ఇస్తారు, మీరే దుఃఖాన్ని ఇస్తారు అని అంటారు. తండ్రి అంటారు, నేనైతే ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వనే ఇవ్వను. ఇది అర్థం చేసుకోవలసిన విషయము. కొడుకు పుడితే సంతోషము కలుగుతుంది, కొడుకు చనిపోతే ఏడవడం మొదలుపెడతారు. భగవంతుడు దుఃఖాన్ని ఇచ్చారు అని అంటారు. అరే, ఈ అల్పకాలికమైన సుఖ-దుఃఖాలు మీకు రావణ రాజ్యములోనే లభిస్తాయి. నా రాజ్యములో దుఃఖము అన్న మాటే ఉండదు. సత్యయుగాన్ని అమరలోకము అని అంటారు. దీని పేరే మృత్యులోకము. అకాల మరణాలు సంభవిస్తాయి. అక్కడైతే చాలా సంతోషముగా ఉంటారు, ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువలో ఎక్కువ 150 సంవత్సరాల ఆయువు ఉంటుంది. ఇక్కడ కూడా అప్పుడప్పుడూ కొందరికి అంత ఆయువు ఉంటుంది కానీ ఇక్కడైతే స్వర్గము లేదు కదా. కొందరు శరీరాన్ని చాలా జాగ్రత్తగా సంభాళించుకుంటే ఆయుష్షు పెరుగుతుంది కూడా, ఇక పిల్లలు కూడా ఎంతమంది పుడతారు. పరివారము పెరుగుతూ ఉంటుంది, వృద్ధి త్వరగా జరుగుతుంది. ఏ విధంగా వృక్షములో శాఖోపశాఖలు వెలువడతాయి, 50 శాఖలు వెలువడతాయి, మళ్ళీ అందులో నుండి ఇంకొక 50 శాఖలు వెలువడతాయి, అలా వృద్ధి ఎంతగా జరుగుతుంది. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది, అందుకే దీనిని మర్రి వృక్షముతో పోలుస్తారు. మొత్తం వృక్షమంతా నిలబడి ఉంటుంది, పునాది ఉండదు. ఇక్కడ కూడా ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము అనే పునాది లేదు. దేవతలు ఎప్పుడు ఉండేవారు అనేది ఎవరికీ తెలియదు, వారైతే లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. ఇంతకుముందు మీరు ఎప్పుడూ ఇది ఆలోచించను కూడా ఆలోచించేవారు కాదు. తండ్రే వచ్చి ఈ విషయాలన్నింటినీ అర్థం చేయిస్తారు. మీరు ఇప్పుడు తండ్రిని కూడా తెలుసుకున్నారు మరియు మొత్తం డ్రామా యొక్క ఆదిమధ్యాంతాలను, దాని కాలము మొదలైనవాటన్నింటినీ తెలుసుకున్నారు. కొత్త ప్రపంచము నుండి పాతదిగా, పాతది నుండి మళ్ళీ కొత్తదిగా ఎలా అవుతుంది, ఇది ఎవరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు స్మృతియాత్రలో కూర్చుంటారు. మీ ఈ యాత్ర అయితే నిత్యమూ నడవాలి. తిరగండి, విహరించండి కానీ ఈ స్మృతి యాత్రలో ఉండండి. ఇది ఆత్మిక యాత్ర. భక్తి మార్గములో మనం కూడా ఆ యాత్రలకు వెళ్ళేవారమని మీకు తెలుసు. పక్కా భక్తులు ఎవరైతే ఉంటారో వారు ఎన్నో సార్లు యాత్రలు చేసి ఉంటారు. బాబా అర్థం చేయించారు - ఒక్క శివుని భక్తినే చేయడాన్ని అవ్యభిచారీ భక్తి అని అంటారు. ఆ తర్వాత దేవతలది జరుగుతుంది. ఆ తర్వాత పంచ తత్వాలను భక్తి చేస్తారు. దేవతల భక్తి అయితే ఎంతో కొంత మంచిదే ఎందుకంటే వారి శరీరము ఎంతైనా సతోప్రధానముగా ఉంటుంది, మనుష్యుల శరీరమైతే పతితముగా ఉంది కదా. వారు పావనంగా ఉన్నారు, మళ్ళీ ద్వాపరము నుండి మొదలుకుని అందరూ పతితులుగా అయిపోయారు. కిందకు దిగజారుతూ వస్తారు. మీరు అర్థం చేయించేందుకు మెట్ల వరుస చిత్రము చాలా బాగుంది. జిన్ను భూతము కథను కూడా వినిపిస్తారు కదా. ఈ దృష్టాంతాలూ మొదలైనవన్నీ ఈ సమయానికి చెందినవే. అన్నీ మిమ్మల్ని ఉద్దేశ్యించే తయారుచేయబడ్డాయి. భ్రమరము ఉదాహరణ కూడా మీదే ఎందుకంటే మీరు పురుగుల్లాంటివారిని మీ సమానంగా బ్రాహ్మణులుగా తయారుచేస్తారు. అన్నీ దృష్టాంతాలూ ఇక్కడివే.
పిల్లలైన మీరు మొదట దైహికమైన యాత్రలను చేసేవారు. ఇప్పుడు మళ్ళీ తండ్రి ద్వారా ఆత్మిక యాత్రను నేర్చుకుంటారు. ఇది చదువు కదా. భక్తిలో ఏమేమి చేస్తారో చూడండి. అందరి ముందు తల వంచి నమస్కరిస్తూ ఉంటారు, కానీ ఒక్కరి కర్తవ్యము గురించి కూడా తెలియదు. అందరికన్నా ఎక్కువ జన్మలు ఎవరు తీసుకుంటారు, మళ్ళీ అవి ఎలా తగ్గిపోతూ ఉంటాయి అన్న లెక్క వేయడం జరుగుతుంది కదా. ఈ జ్ఞానము కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది. తప్పకుండా ఒకప్పుడు స్వర్గము ఉండేదని మీరు భావిస్తారు. భారతవాసులైతే ఎంతో రాతిబుద్ధి కలవారిగా అయిపోయారు. స్వర్గము ఎప్పుడు ఉండేది అని వారిని అడిగితే లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. మనం విశ్వాధిపతులుగా ఉండేవారమని, ఎంతో సుఖంగా ఉండేవారమని, ఇప్పుడు మళ్ళీ మనం నిరుపేదల నుండి యువరాజులుగా అవ్వాలని పిల్లలైన మీకు తెలుసు. ప్రపంచము కొత్తది నుండి పాతది అవుతుంది కదా. కావున తండ్రి అంటారు - కష్టపడండి. మాయ ఘడియ-ఘడియ మరపింపజేస్తుంది అని కూడా మీకు తెలుసు.
తండ్రి అర్థం చేయిస్తున్నారు, బుద్ధిలో ఎల్లప్పుడూ ఇది గుర్తుంచుకోండి - ఇక మేము వెళ్తున్నాము, ఈ పాత ప్రపంచము నుండి మా లంగరు ఎత్తివేయబడింది. నావ ఆవలి తీరానికి వెళ్ళాలి. నా నావను ఆవలి తీరానికి చేర్చండి అని పాడుతారు కదా. ఎప్పుడు ఆవలి తీరానికి చేరాలి అనేది తెలియదు. ముఖ్యమైనది స్మృతి యాత్ర. తండ్రితోపాటు వారసత్వము కూడా గుర్తుకురావాలి. పిల్లలు పెద్దయితే తండ్రి వారసత్వమే బుద్ధిలో ఉంటుంది. మీరైతే ఎలాగూ పెద్దవారే. ఈ విషయం నిజమేనని ఆత్మ వెంటనే తెలుసుకుంటుంది. అనంతమైన తండ్రి ఇచ్చే వారసత్వము తప్పకుండా స్వర్గమే. బాబా స్వర్గ స్థాపనను చేస్తారు కావున తండ్రి శ్రీమతముపై నడవవలసి ఉంటుంది. తండ్రి అంటారు, పవిత్రముగా తప్పకుండా అవ్వాలి. పవిత్రత కారణముగానే కొట్లాటలు జరుగుతూ ఉంటాయి. వారైతే పూర్తిగా రౌరవ నరకములో పడి ఉన్నట్లుగా ఉన్నారు. ఇంకా ఎక్కువగా వికారాలలో పడిపోతూ ఉంటారు, అందుకే తండ్రిపై ప్రీతిని ఉంచలేరు. వినాశన కాలములో విపరీత బుద్ధి కలవారిగా ఉన్నారు కదా. తండ్రి ప్రీతి బుద్ధి కలవారిగా తయారుచేసేందుకే వస్తారు. కొంచెం కూడా ప్రీతి బుద్ధి లేనివారు ఎందరో ఉన్నారు. వారు ఎప్పుడూ తండ్రిని స్మృతి కూడా చేయరు. శివబాబా గురించి వారికి తెలియనే తెలియదు, నమ్మనే నమ్మరు. పూర్తిగా మాయ గ్రహణం పట్టి ఉంది. స్మృతి యాత్ర ఏమాత్రమూ లేదు. తండ్రి కృషి అయితే చేయిస్తూ ఉంటారు. సూర్యవంశీ, చంద్రవంశీ రాజధాని ఇక్కడ స్థాపన అవుతోంది అని కూడా మీకు తెలుసు. సత్య, త్రేతాయుగాలలో ఏ ధర్మ స్థాపనా జరగదు. రాముడేమీ ధర్మ స్థాపన చేయరు. స్థాపన చేసే తండ్రి ద్వారా అతను అలా తయారవుతారు. ఇతర ధర్మ స్థాపకుల స్థాపనకు మరియు తండ్రి చేసే ధర్మ స్థాపనకు రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఎప్పుడైతే ప్రపంచము మారవలసి ఉంటుందో, అప్పుడే సంగమములో తండ్రి వస్తారు. తండ్రి అంటారు, కల్ప-కల్పమూ కల్పము యొక్క సంగమయుగములో నేను వస్తాను, దానికి బదులుగా వారు యుగే-యుగే అన్న పదాన్ని తప్పుగా వ్రాసేశారు. అర్ధకల్పం భక్తి మార్గము కూడా నడవవలసిందే. తండ్రి అంటారు, పిల్లలూ, ఈ విషయాలను మర్చిపోకండి. మీరు అంటారు, బాబా, మేము మర్చిపోతున్నాము. అరే, తమ తండ్రినైతే జంతువులు కూడా మర్చిపోవు, మీరెందుకు మర్చిపోతున్నారు? స్వయాన్ని ఆత్మగా భావించడం లేదా! దేహాభిమానులుగా అవ్వడం వలననే మీరు తండ్రిని మర్చిపోతారు. ఇప్పుడు తండ్రి ఎలా అయితే అర్థం చేయిస్తారో, అలాగే పిల్లలైన మీరు కూడా అలవాటు చేసుకోవాలి. నషాతో మాట్లాడాలి. అంతేకానీ ఎవరైనా పెద్ద వ్యక్తుల ముందు మీరు భయపడిపోవడం కాదు. కుమారీలైన మీరే గొప్ప-గొప్ప విద్వాంసులు, పండితులు మొదలైనవారి ముందుకు వెళ్తారు కావున నిర్భయులుగా అయి అర్థం చేయించాలి. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. బుద్ధిలో సదా గుర్తుండాలి - మేము వెళ్ళిపోతున్నాము, మా నావ యొక్క లంగరు ఈ పాత ప్రపంచము నుండి ఎత్తివేయబడింది. మేము ఆత్మిక యాత్రలో ఉన్నాము. ఇదే యాత్రను చేయాలి మరియు చేయించాలి.
2. ఎలాంటి గొప్ప వ్యక్తుల ఎదురుగానైనా నిర్భయతతో (నషాతో) మాట్లాడాలి, భయపడకూడదు. దేహీ-అభిమానులుగా అయ్యి అర్థం చేయించే అలవాటును ఏర్పరచుకోవాలి.
| వరదానము:- |
వ్యర్థము మరియు మాయ నుండి ఇన్నోసెంట్ (అమాయకులు) గా అయ్యి దివ్యతను అనుభవము చేసే మహాన్ ఆత్మ భవ ఎవరైతే వ్యర్థము మరియు మాయ నుండి ఇన్నోసెంట్ (అమాయకులు) గా ఉంటారో, వారినే మహాన్ ఆత్మ లేక సెయింట్ అని అంటారు. ఏ విధంగా దేవతలు వీటి నుండి ఇన్నోసెంట్ గా ఉండేవారో, అలా మీ ఆ సంస్కారాలను ఇమర్జ్ చేసుకోండి, వ్యర్థము యొక్క అవిద్య స్వరూపులుగా అవ్వండి ఎందుకంటే ఈ వ్యర్థము యొక్క తీవ్రత చాలా సార్లు సత్యత యొక్క తెలివిని, యథార్థత యొక్క తెలివిని సమాప్తం చేస్తుంది. అందుకే సమయము, శ్వాస, మాటలు, కర్మలు అన్నింటిలో వ్యర్థం నుండి ఇన్నోసెంట్ గా అవ్వండి. ఎప్పుడైతే వ్యర్థము నుండి అవిద్యగా అవుతారో, అప్పుడు దివ్యత స్వతహాగానే అనుభవమవుతుంది మరియు అనుభవము చేయిస్తారు. |
| స్లోగన్:- | ఫస్ట్ డివిజన్ లోకి రావాలంటే బ్రహ్మాబాబా అడుగులలో అడుగులు వెయ్యండి. |