| 12-10-2024 |
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
|
మధువనం |
| ‘‘మధురమైన పిల్లలూ - మీ అందరి నావను విషయ సాగరం నుండి బయటకు తీసి క్షీర సాగరంలోకి తీసుకువెళ్ళేందుకు తండ్రి నావికునిగా అయి వచ్చారు, ఇప్పుడు మీరు ఈ తీరము నుండి ఆవలి తీరానికి వెళ్ళాలి’’ | |
| ప్రశ్న:- | పిల్లలైన మీరు ప్రతి ఒక్కరి పాత్రను చూస్తూ ఎవ్వరినీ నిందించలేరు - ఎందుకు? |
| జవాబు:- | ఎందుకంటే మీకు తెలుసు - ఇది అనాదిగా తయారై-తయారుచేయబడిన డ్రామా, ఇందులో పాత్రధారులు ప్రతి ఒక్కరూ తమ-తమ పాత్రను అభినయిస్తున్నారు. ఇందులో ఎవరి దోషమూ లేదు. ఈ భక్తి మార్గం కూడా మళ్ళీ గడిచేది ఉంది, ఇందులో కొద్దిగా కూడా మార్పు రావడమనేది జరగదు. |
| ప్రశ్న:- | ఏ రెండు పదాలలో మొత్తం చక్రం యొక్క జ్ఞానము ఇమిడి ఉంది? |
| జవాబు:- | ఈ రోజు మరియు రేపు. నిన్న మనం సత్యయుగములో ఉండేవారము, ఈ రోజు 84 జన్మల చక్రములో తిరిగి నరకములోకి చేరుకున్నాము, రేపు మళ్ళీ స్వర్గములోకి వెళ్తాము. |
ఓం శాంతి. ఇప్పుడు పిల్లలు ఎదురుగా కూర్చున్నారు. పిల్లలు ఎక్కడి నుండైతే వస్తారో, అక్కడ తమ సెంటర్లలో ఉన్నప్పుడు - మేము ఉన్నతోన్నతుడైన బాబా సమ్ముఖములో కూర్చున్నాము అని భావించరు. వారే మన టీచర్ కూడా, వారే మన నావను తీరానికి చేర్చేవారు, వారినే గురువు అని అంటారు. ఇక్కడ మీరు - మేము సమ్ముఖముగా కూర్చున్నాము, వారు మమ్మల్ని ఈ విషయ సాగరము నుండి బయటకు తీసి క్షీరసాగరములోకి తీసుకువెళ్తారు అని భావిస్తారు. ఆవలి తీరానికి తీసుకువెళ్ళే తండ్రి కూడా సమ్ముఖముగా కూర్చున్నారు. ఆ ఒక్క శివబాబా ఆత్మనే సుప్రీమ్ లేక ఉన్నతోన్నతుడైన భగవంతుడు అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు - మేము ఉన్నతోన్నతుడైన భగవంతుడైన శివబాబా ఎదురుగా కూర్చున్నాము అని భావిస్తారు. వారు వీరిలో (బ్రహ్మా తనువులో) కూర్చున్నారు, వారు మిమ్మల్ని ఆవలి తీరానికి కూడా చేరుస్తారు. వారికి రథము కూడా తప్పకుండా కావాలి కదా. లేకపోతే శ్రీమతాన్ని ఎలా ఇవ్వగలరు? ఇప్పుడు పిల్లలైన మీకు నిశ్చయము ఉంది - బాబా మన బాబా కూడా, టీచర్ కూడా, ఆవలి తీరానికి తీసుకువెళ్ళేవారు కూడా. ఇప్పుడు ఆత్మలమైన మనం మన ఇల్లు అయిన శాంతిధామానికి వెళ్ళనున్నాము. ఆ బాబా మనకు దారిని చూపిస్తున్నారు. అక్కడ సెంటర్లలో కూర్చోవడానికి మరియు ఇక్కడ సమ్ముఖముగా కూర్చోవడానికి రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. అక్కడ ఈ విధంగా మేము సమ్ముఖముగా కూర్చున్నాము అని భావించరు. ఇక్కడ ఆ అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు మనం పురుషార్థం చేస్తున్నాము. పురుషార్థం చేయించేవారికి సంతోషము ఉంటుంది. ఇప్పుడు మనం పావనంగా అయి ఇంటికి వెళ్తున్నాము. ఏ విధంగా నాటకంలోని పాత్రధారులు, ఇప్పుడు ఇక నాటకం పూర్తయ్యింది అని భావిస్తారో, అలా మీరూ భావిస్తారు. ఇప్పుడు తండ్రి ఆత్మలైన మనల్ని తీసుకువెళ్ళేందుకు వచ్చారు. మీరు ఇంటికి ఏ విధంగా వెళ్ళగలరో కూడా అర్థం చేయిస్తారు, వారు తండ్రి కూడా మరియు నావను తీరానికి చేర్చే నావికుడు కూడా. వాళ్ళు గానం చేస్తారు కానీ నావ అని దేనినంటారో వారికి ఏమీ తెలియదు. తండ్రి ఏమైనా శరీరాన్ని తీసుకువెళ్తారా? ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు - వారు మన ఆత్మను ఆవలి తీరానికి తీసుకువెళ్తారు. ఇప్పుడు ఆత్మ ఈ శరీరముతోపాటు వేశ్యాలయములో విషయ వైతరణి నదిలో పడి ఉంది. వాస్తవానికి మనం శాంతిధామ నివాసులుగా ఉండేవారము, మనల్ని ఆవలి తీరానికి తీసుకువెళ్ళే అనగా ఇంటికి తీసుకువెళ్ళే తండ్రి లభించారు. మీ రాజధాని ఉండేది, దానినంతటినీ మాయా రావణుడు దోచుకున్నాడు. ఆ రాజధానిని మళ్ళీ తప్పకుండా తీసుకోవాలి. అనంతమైన తండ్రి అంటారు - పిల్లలూ, ఇప్పుడు మీ ఇంటిని స్మృతి చేయండి. అక్కడకు వెళ్ళి మళ్ళీ క్షీరసాగరములోకి రావాలి. ఇక్కడ ఇది విషయ సాగరము, అక్కడ అది క్షీర సాగరము మరియు మూలవతనము శాంతి సాగరము. మూడు ధామాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది దుఃఖధామము.
తండ్రి అర్థం చేయిస్తారు - మధురాతి మధురమైన పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇలా చెప్తుంది ఎవరు, ఎవరి ద్వారా చెప్తున్నారు? మొత్తం రోజంతా ‘మధురాతి మధురమైన పిల్లలూ’ అని అంటూ ఉంటారు. ఇప్పుడు ఆత్మ పతితముగా ఉంది, ఆ కారణముగా మళ్ళీ శరీరము కూడా అదే విధముగా లభిస్తుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు - ఒకప్పుడు మనము స్వచ్ఛమైన బంగారు నగల వలె ఉండేవారము, ఆ తర్వాత మలినాలు చేరుతూ-చేరుతూ కల్తీగా అయిపోయాము. మరి ఇప్పుడు ఆ కల్తీ ఎలా తొలగాలి, అందుకే ఈ స్మృతియాత్ర యొక్క భట్టీ ఉంది. అగ్నిలో బంగారము శుద్ధమవుతుంది కదా. తండ్రి పదే-పదే అర్థం చేయిస్తారు. నేను ఈ విషయాలనేవైతే మీకు అర్థం చేయిస్తున్నానో, ఇది ప్రతి కల్పమూ అర్థం చేయిస్తూ వచ్చాను. నా పాత్ర ఏమిటంటే - మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత వచ్చి పిల్లలూ, పావనంగా అవ్వండి అని చెప్తాను. సత్యయుగములో కూడా మీ ఆత్మ పావనముగా ఉండేది, శాంతిధామములో కూడా పావన ఆత్మయే ఉంటుంది. అది మన ఇల్లు. ఎంత మధురమైన ఇల్లు. అక్కడకు వెళ్ళేందుకే మనుష్యులు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. తండ్రి అర్థం చేయిస్తారు - ఇప్పుడు అందరూ అక్కడకు వెళ్ళాలి, మళ్ళీ పాత్రను అభినయించేందుకు రావాలి. ఇది పిల్లలు అర్థం చేసుకున్నారు. పిల్లలు దుఃఖితులుగా ఉన్నప్పుడు - ఓ భగవంతుడా, మమ్మల్ని మీ వద్దకు పిలవండి, మమ్మల్ని ఇక్కడ దుఃఖములో ఎందుకు వదిలేసారు? అని అంటారు. తండ్రి పరంధామంలో ఉంటారని పిల్లలకు తెలుసు. అందుకే - ఓ భగవంతుడా, మమ్మల్ని పరంధామంలోకి పిలవండి అని అంటారు. సత్యయుగములో ఇలా అనరు. అక్కడైతే సుఖమే సుఖము ఉంటుంది. ఇక్కడ అనేక దుఃఖాలు ఉన్నాయి, అందుకే - ఓ భగవంతుడా అని పిలుస్తారు. ఆత్మకు స్మృతి ఉంటుంది. కానీ భగవంతుని గురించి ఏమాత్రమూ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి పరిచయం లభించింది. తండ్రి పరంధామంలోనే ఉంటారు. అందరూ ఇంటినే స్మృతి చేస్తూ ఉంటారు. మమ్మల్ని రాజధానిలోకి పిలవండి అని ఎప్పుడూ అనరు. రాజధాని గురించి అలా ఎప్పుడూ అనరు. తండ్రి అయితే రాజధానిలో ఉండనే ఉండరు. వారు శాంతిధామంలోనే ఉంటారు. అందరూ శాంతిని కోరుకుంటూ ఉంటారు. పరంధామంలో భగవంతుని వద్దనైతే తప్పకుండా శాంతియే ఉంటుంది, దానినే ముక్తిధామము అని అంటారు. అది ఆత్మలు నివసించే స్థానము, అక్కడి నుండే ఆత్మలు వస్తాయి. సత్యయుగాన్ని ఇల్లు అని అనరు, అది రాజధాని. ఇప్పుడు మీరు ఎక్కడెక్కడి నుండి వచ్చారు. ఇక్కడకు వచ్చి సమ్ముఖముగా కూర్చున్నారు. తండ్రి ‘పిల్లలూ, పిల్లలూ’ అంటూ మాట్లాడుతారు. తండ్రి రూపంలో పిల్లలూ, పిల్లలూ అని కూడా అంటారు, అలాగే టీచరుగా అయి సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాలను మరియు చరిత్ర, భౌగోళములను కూడా అర్థం చేయిస్తారు. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. పిల్లలైన మీకు తెలుసు, మూలవతనము ఆత్మలైన మన ఇల్లు. సూక్ష్మవతనము అయితే దివ్య దృష్టికి సంబంధించినది. ఇకపోతే సత్య, త్రేతా, ద్వాపర, కలియుగాలైతే ఇక్కడే ఉంటాయి. పాత్రను కూడా మీరు ఇక్కడే అభినయిస్తారు. సూక్ష్మవతనము యొక్క పాత్ర ఏమీ లేదు. ఇది సాక్షాత్కారానికి సంబంధించిన విషయము. నిన్న మరియు ఈ రోజు, ఇది బుద్ధిలో చాలా బాగా ఉండాలి. నిన్న మనం సత్యయుగములో ఉండేవారము, మళ్ళీ 84 జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ ఈ రోజు నరకములోకి వచ్చేసాము. తండ్రిని పిలవడం కూడా నరకములోకే పిలుస్తారు. సత్యయుగములోనైతే అపారమైన సుఖము ఉంది కావున అక్కడ ఎవరూ పిలవరు. ఇక్కడ మీరు శరీరములో ఉన్నారు, అందుకే మాట్లాడుతున్నారు. తండ్రి కూడా అంటారు, నేను అన్నీ తెలిసినవాడిని అనగా సృష్టి ఆదిమధ్యాంతాల గురించి నాకు తెలుసు. కానీ నేను ఎలా వినిపించాలి! ఇది ఆలోచించవలసిన విషయం కదా, అందుకే తండ్రి రథాన్ని తీసుకుంటారు అని వ్రాయబడి ఉంది. వారు అంటారు, నా జన్మ మీ జన్మలా ఉండదు. నేను ఇతనిలోకి ప్రవేశిస్తాను. రథము యొక్క పరిచయాన్ని కూడా ఇస్తారు. ఈ ఆత్మ కూడా నామ, రూపాలను ధారణ చేస్తూ-చేస్తూ తమోప్రధానముగా అయ్యింది. ఈ సమయములో అందరూ అనాథలే ఎందుకంటే తండ్రి గురించి తెలియనే తెలియదు. కావున అందరూ అనాథ బాలురు మరియు బాలికలు అయినట్లు. పరస్పరం కొట్లాడుకుంటుంటే - అనాథ బాలురు మరియు బాలికలు, ఎందుకు కొట్లాడుకుంటున్నారు అని అంటారు కదా! తండ్రి అంటున్నారు, నన్ను అందరూ మర్చిపోయారు. ఆత్మయే అనాథ బాలురు మరియు బాలికలు అని అంటుంది. లౌకిక తండ్రి కూడా ఇలాగే అంటారు, అలాగే అనంతమైన తండ్రి కూడా - అనాథ బాలురు మరియు బాలికలు - ఇటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది, నాథుడు ఎవరూ లేరా? అని అంటారు. మిమ్మల్ని ఏ అనంతమైన తండ్రి అయితే స్వర్గాధిపతులుగా తయారుచేస్తారో, ఎవరినైతే మీరు అర్ధకల్పం బట్టి పిలుస్తూ వచ్చారో, వారిని రాయి-రప్పల్లో ఉన్నారు అని అనేస్తారు. తండ్రి ఇప్పుడు సమ్ముఖముగా కూర్చుని అర్థం చేయిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు భావిస్తారు - మేము తండ్రి వద్దకు వచ్చాము, ఈ బాబాయే మమ్మల్ని చదివిస్తారు, మా నావను తీరానికి చేరుస్తారు ఎందుకంటే ఈ నావ చాలా పాతబడిపోయింది. అందుకే దీనిని దాటించి మళ్ళీ మాకు కొత్తది ఇవ్వండి అని అంటారు. పాత నావ ప్రమాదకరంగా ఉంటుంది, దారిలో విరిగిపోవచ్చు, ప్రమాదం జరగవచ్చు. కావున మీరు అంటారు, మా నావ పాతబడిపోయింది, ఇప్పుడు మాకు కొత్తది ఇవ్వండి. దీనిని వస్త్రము అని కూడా అంటారు, అలాగే నావ అని కూడా అంటారు. పిల్లలు అంటారు, బాబా, మాకైతే ఈ లక్ష్మీ-నారాయణుల వంటి వస్త్రము (దేహము) కావాలి.
తండ్రి అంటారు - మధురాతి మధురమైన పిల్లలూ, స్వర్గవాసులుగా అవ్వాలనుకుంటున్నారా? ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మీ ఈ వస్త్రాలు పాతబడతాయి, మళ్ళీ కొత్తవి ఇస్తాను. ఇది ఆసురీ వస్త్రము, ఆత్మ కూడా ఆసురీగా ఉంది. మనుష్యులు పేదవారిగా ఉంటే వస్త్రాలు కూడా పేదరికానివే ధరిస్తారు. షావుకార్లు అయితే వస్త్రాలు కూడా షావుకారుతనానివే ధరిస్తారు. ఈ విషయాలు ఇప్పుడు మీకు తెలుసు. ఇక్కడ మీకు - మేము ఎవరి ఎదురుగా కూర్చున్నాము అన్న నషా ఎక్కుతుంది. సెంటర్లలో కూర్చున్నప్పుడు అక్కడ మీకు ఈ అనుభూతి కలగదు. ఇక్కడ సమ్ముఖముగా ఉండడంతో సంతోషము కలుగుతుంది ఎందుకంటే తండ్రి డైరెక్టుగా కూర్చుని అర్థం చేయిస్తారు. అక్కడ ఎవరైనా అర్థం చేయిస్తే బుద్ధియోగము ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటుంది. వ్యాపార, వ్యవహారాలలో చిక్కుకుని ఉంటాము, తీరిక ఎక్కడ దొరుకుతుంది అని అంటారు కదా. నేను మీకు అర్థం చేయిస్తున్నాను. బాబా ఈ నోటి ద్వారా మనకు అర్థం చేయిస్తారు అని మీరు కూడా భావిస్తారు. ఈ నోటికి ఎంత మహిమ ఉంది. గోముఖము నుండి అమృతాన్ని తాగేందుకు ఎక్కడెక్కడికి వెళ్ళి కష్టపడుతూ ఉంటారు. ఎంత కష్టపడి వెళ్తారు. ఈ గోముఖము అంటే ఏమిటి అనేది మనుష్యులు అర్థమే చేసుకోరు. ఎంత వివేకవంతులైన గొప్ప వ్యక్తులు అక్కడకు వెళ్తారు, అందులో లాభమేముంది? ఇంకా ఎంతో సమయం వ్యర్థమవుతుంది. బాబా అంటారు - ఈ సూర్యాస్తమయము మొదలైనవాటిని ఏం చూస్తారు, ఇందులో లాభమేమీ లేదు. లాభము అనేది చదువులోనే ఉంటుంది. గీతలో చదువు ఉంది కదా. గీతలో హఠయోగము మొదలైనవాటి విషయమేమీ లేదు. అందులోనైతే రాజయోగము ఉంది. మీరు రావడం కూడా రాజ్యాన్ని తీసుకునేందుకే వస్తారు. మీకు తెలుసు - ఈ ఆసురీ ప్రపంచంలోనైతే ఎన్ని గొడవలు-కొట్లాటలు మొదలైనవి ఉన్నాయి. బాబా అయితే మనల్ని యోగబలంతో పావనంగా తయారుచేసి విశ్వాధిపతులుగా తయారుచేస్తారు. దేవీలకు ఆయుధాలను చూపించారు కానీ వాస్తవానికి ఇందులో ఆయుధాలు మొదలైనవాటి విషయమేమీ లేదు. కాళీని ఎంత భయంకర రూపంలో తయారుచేసారో చూడండి. వీటన్నింటినీ తమ-తమ మనస్సులోని భ్రాంతులతో కూర్చుని తయారుచేశారు. దేవీలు ఏమీ ఇలా 4-8 భుజాలు కలిగి ఉండరు. ఇదంతా భక్తి మార్గం. ఇదంతా ఒక అనంతమైన నాటకము అని తండ్రి అర్థం చేయిస్తారు. ఇందులో ఎవరి నింద మొదలైనవాటి విషయము లేదు. అనాది డ్రామా రచింపబడి ఉంది. ఇందులో ఎటువంటి తేడా రాదు. జ్ఞానం అని దేనినంటారు, భక్తి అని దేనినంటారు అనేది తండ్రి అర్థం చేయిస్తారు. భక్తి మార్గమును మీరు ఎంతైనా దాటవలసి ఉంటుంది. ఇలాగే మీరు 84 జన్మల చక్రములో తిరుగుతూ, తిరుగుతూ కిందకు వస్తారు. ఇది అనాదిగా తయారై-తయారుచేయబడిన చాలా మంచి నాటకము, దీని గురించి తండ్రి అర్థం చేయిస్తారు. ఈ డ్రామా రహస్యాన్ని అర్థం చేసుకోవడంతో మీరు విశ్వాధిపతులుగా అవుతారు. ఇది ఒక అద్భుతం కదా. భక్తి ఎలా నడుస్తుంది, జ్ఞానం ఎలా నడుస్తుంది, ఈ ఆట అనాదిగా రచింపబడి ఉంది. ఇందులో ఎటువంటి మార్పు రావడమనేది జరగదు. వారైతే -బ్రహ్మములో లీనమైపోయారని, జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందని, ఇది సంకల్పాల ప్రపంచమని అంటారు, ఎవరికి ఏది తోస్తే అది చెప్తూ ఉంటారు. ఇదైతే తయారై-తయారుచేయబడిన ఆట. మనుష్యులు సినిమా చూసి వస్తారు, మరి దానిని సంకల్పాల ఆట అని అంటారా? తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, ఇది అనంతమైన నాటకము, ఇది ఇదే విధంగా రిపీట్ అవుతుంది. తండ్రే వచ్చి ఈ జ్ఞానాన్ని ఇస్తారు ఎందుకంటే వారు నాలెడ్జ్ ఫుల్. వారు మనుష్య సృష్టికి బీజరూపుడు, చైతన్యమైనవారు, వారికే మొత్తం జ్ఞానమంతా ఉంది. మనుష్యులైతే లక్షల సంవత్సరాల ఆయువును చూపించారు. తండ్రి అంటారు, అంతటి ఆయువు ఏమైనా ఉంటుంది. ఏదైనా సినిమా లక్షల సంవత్సరాలదై ఉంటే అది ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. మీరైతే మొత్తం అంతా వర్ణన చేస్తారు. లక్షల సంవత్సరాల విషయమైతే ఎలా వర్ణన చేయగలరు. కావున ఇదంతా భక్తి మార్గం. మీరే భక్తి మార్గపు పాత్రను అభినయించారు. ఇలా-ఇలా దుఃఖాన్ని అనుభవిస్తూ, అనుభవిస్తూ ఇప్పుడు అంతిమంలోకి వచ్చేసారు. మొత్తం వృక్షమంతా శిథిలావస్థను పొందింది. ఇప్పుడు అక్కడకు వెళ్ళాలి. మిమ్మల్ని మీరు ఇక తేలికగా చేసుకోండి. ఇతను కూడా తేలికగా చేసుకున్నారు కదా. కావున అన్ని బంధనాలు తెగిపోవాలి. లేకపోతే పిల్లలు, ధనము, ఫ్యాక్టరీలు, గ్రాహకులు, రాజులు, రాజ్యాలు మొదలైనవి గుర్తుకొస్తూ ఉంటాయి. ఆ వ్యాపారమే వదిలేస్తే ఇక ఎందుకు గుర్తుకువస్తాయి? ఇక్కడైతే అన్నింటినీ మర్చిపోవాలి. వీటిని మరచి తమ ఇంటిని మరియు రాజధానిని స్మృతి చేయాలి. శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయాలి. శాంతిధామం నుండి మళ్ళీ మనం ఇక్కడకు రావలసి ఉంటుంది. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి, దీనినే యోగాగ్ని అని అంటారు. ఇది రాజయోగము కదా. మీరు రాజఋషులు. ఋషులు అని పవిత్రులను అంటారు. మీరు రాజ్యం కొరకు పవిత్రముగా అవుతారు. తండ్రే మీకు అంతా సత్యాన్ని తెలియజేస్తారు. ఇది నాటకము అని మీరు కూడా అర్థం చేసుకుంటారు. పాత్రధారులందరూ తప్పకుండా ఇక్కడ ఉండాలి. మళ్ళీ తండ్రి అందరినీ తీసుకువెళ్తారు. ఇది ఈశ్వరుని ఊరేగింపు కదా. అక్కడ తండ్రి మరియు పిల్లలు ఉంటారు. మళ్ళీ ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తారు. తండ్రి అయితే సదా అక్కడే ఉంటారు కదా. నన్ను దుఃఖములోనే తలచుకుంటారు. మరి ఇక అక్కడ నేనేమి చేస్తాను. మిమ్మల్ని శాంతిధామానికి, సుఖధామానికి పంపించాక ఇంకేమి కావాలి! మీరు సుఖధామములో ఉండేవారు. అప్పుడు మిగిలిన ఆత్మలందరూ శాంతిధామములో ఉండేవారు, మళ్ళీ నంబరువారుగా వస్తూ ఉన్నారు. నాటకము ఇప్పటికి ఇక పూర్తయ్యింది. తండ్రి అంటున్నారు - పిల్లలూ, ఇప్పుడిక నిర్లక్ష్యం చేయకండి. పావనంగా అయితే తప్పకుండా అవ్వాలి. తండ్రి అంటారు, డ్రామా అనుసారంగా ఆ పాత్రయే ఇప్పుడు మళ్ళీ నడుస్తోంది. మీ కొరకు డ్రామానుసారంగా నేను కల్ప-కల్పమూ వస్తాను. ఇప్పుడిక కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి కదా. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఇప్పుడు ఈ వృక్షము పాతదిగా, శిథిలావస్థకు చేరుకుంది, ఆత్మ ఇక తిరిగి ఇంటికి వెళ్ళాలి, అందుకే స్వయాన్ని అన్ని బంధనాల నుండి ముక్తులుగా చేసుకుని తేలికగా చేసుకోవాలి. ఇక్కడికి సంబంధించిన వాటన్నింటినీ బుద్ధితో మర్చిపోవాలి.
2. అనాది డ్రామాను బుద్ధిలో ఉంచుకుని ఏ పాత్రధారి యొక్క నిందను చేయకూడదు. డ్రామా రహస్యాన్ని అర్థం చేసుకుని విశ్వాధిపతులుగా అవ్వాలి.
| వరదానము:- |
సైలెన్సు శక్తితో ఆత్మ శక్తి యొక్క ఎగిరే వేగాన్ని తీవ్రతరం చేసే విశ్వ పరివర్తక భవ సైన్స్ సాధనాల వేగాన్ని సైన్స్ ద్వారా తగ్గించవచ్చు కూడా, పెంచవచ్చు కూడా. కానీ ఆత్మ వేగాన్ని ఇప్పటివరకు ఎవరూ అందుకోలేకపోయారు, అలాగే అందుకోలేరు కూడా, ఇందులో సైన్స్ తనను తాను ఫెయిల్ అయినట్లు భావిస్తుంది. ఎక్కడైతే సైన్సు ఫెయిల్ అవుతుందో, అక్కడ సైలెన్సు శక్తితో ఏది కావాలనుకుంటే అది చెయ్యగలరు. కావున ఆత్మ శక్తి యొక్క ఎగిరే వేగాన్ని తీవ్రతరం చెయ్యండి, ఈ శక్తితో స్వ పరివర్తనను, ఇతరుల వృత్తి యొక్క పరివర్తనను, వాయుమండలం యొక్క పరివర్తనను చేసి విశ్వ పరివర్తకులుగా అవ్వగలరు. తీవ్రతకు గుర్తు - ఆలోచించిన వెంటనే జరిగిపోతుంది. |
| స్లోగన్:- | శిక్షణా దాతగా అవ్వడంతో పాటుగా దయార్ద్ర హృదయులుగా అయ్యి సహయోగులుగా అవ్వండి. |