| 13-10-2024 |
ప్రాత:మురళి
ఓంశాంతి
‘‘అవ్యక్త బాప్ దాదా’’
|
రివైజ్ 11-03-2002 మధువనం |
‘‘విశేషతలు పరమాత్మ ఇచ్చిన కానుకలు - వాటిని విశ్వ సేవలో అర్పణ చెయ్యండి’’
ఈ రోజు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయిన బ్రహ్మాబాబా మరియు శివబాబా విశ్వములో నలువైపులా ఉన్న తమ శ్రేష్ఠ భాగ్యవాన్ బ్రాహ్మణ కులానికి చాలా-చాలా కోటాను కోట్ల సార్లు దివ్య అలౌకిక జన్మ యొక్క అభినందనలను ఇస్తున్నారు. దానితో పాటుగా అతి స్నేహముతో కూడిన, మనస్సులోని ప్రేమతో కూడిన ఆత్మిక పుష్పాలతో జన్మదిన శుభాకాంక్షలను అందిస్తున్నారు. ప్రతి బ్రాహ్మణ ఆత్మ యొక్క విశేషతను చూస్తూ-చూస్తూ హర్షిస్తున్నారు. హృదయము లోలోపలే పాట పాడుకుంటున్నారు - వాహ్ పిల్లలూ వాహ్! ఈ రోజు అమృతవేళ నుండి అందరి హృదయాలలో ఈ సంతోషపు అలలే కనిపిస్తూ ఉన్నాయి - వాహ్ బాబా మరియు వాహ్ మా యొక్క అలౌకిక జన్మ! బాబా కూడా అమృతవేళ నుండి పిల్లలందరూ వేస్తున్న అభినందనల మాలలను చూస్తూ-చూస్తూ సంతోషిస్తున్నారు. ఈ జన్మదినాన్ని మొత్తము కల్పములో ఈ సంగమయుగములోనే జరుపుకుంటారు. సత్యయుగములో కూడా ఇటువంటి అలౌకిక జన్మదినాన్ని జరుపుకోరు. తండ్రి మరియు పిల్లలు ఒకేసారి జన్మించే ఇటువంటి విచిత్ర జన్మదినం అక్కడ కూడా ఉండదు. తండ్రి మరియు పిల్లల జన్మ ఒకే రోజున జరిగింది అన్న విషయాన్ని ఇంతవరకు ఎప్పుడైనా విన్నారా? కానీ ఈ రోజున పిల్లలైన మీ యొక్క మరియు బాప్ దాదా యొక్క జన్మ దినాన్ని ఒకే రోజున జరుపుకుంటున్నారు. కనుక వాహ్-వాహ్ అనే పాటలు పాడుకుంటున్నారు కదా!
ఈ రోజు బాప్ దాదా అమృతవేళ ఒక మాలను తయారుచేస్తున్నారు. ఏ మాల? అందులో మా పేరు ఉందా, మా పేరు ఉందా... అని మీరు ఆలోచించటానికి 108 యొక్క ఫైనల్ మాలను తయారుచెయ్యటం లేదు. కానీ ఈ రోజు ఆది నుండి, స్థాపనా సమయము నుండి ఇప్పుడు వినాశనము సమీపిస్తున్న ఈ సమయము వరకు ఏ, ఏ పిల్లలు అమర భవ యొక్క వరదానీలుగా ఉన్నారు! అన్న వారి మాలను తయారుచేస్తున్నారు. డ్రామానుసారంగా ఆ ఆత్మలకు ఉన్నతోన్నతమైన భగవంతునితోపాటు సర్వ చరిత్రను చూసే మరియు వినే శ్రేష్ఠ పాత్ర ఉంది, కానీ అటువంటివారు ఎంత కొద్దిమంది ఉన్నారు! మీ అందరి పాత్ర కూడా ఉంది, ఎందుకని? బాప్ దాదా బ్రాహ్మణ వంశావళిని తయారుచేస్తున్నారు. అందుకే విశ్వము లెక్కలో బ్రాహ్మణ ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారు చాలా-చాలా-చాలా భాగ్యవంతులు, ఎందుకని? కోట్లలో కొద్దిమంది అన్న లైన్ లో ఉన్నారు మరియు ఆ కొద్దిమందిలో కూడా కొద్దిమందిగా ఉన్నారు. ఒక వైపు విశ్వములోని కోట్లాదిమంది ఆత్మలు, మరొక వైపు బ్రాహ్మణులైన మీరు ప్రతి ఒక్కరూ ఒక్కరిగా ఉన్నారు. కావున జన్మదినాన బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరిదీ, కొంతమందిదని కాదు, పిల్లలందరి జన్మపత్రికను చూసి ప్రతి ఒక్కరి విశేషతల మాలలను మెడలో వేస్తూ ఉన్నారు. మీరందరూ, వారు కొత్తవారైనా లేక ఆదిలోనివారైనా లేక మధ్యలోనివారైనా కానీ, మీరు విశేషమైనవారు మరియు విశేషంగా ఉండనే ఉంటారు. మొత్తము కల్పమంతా విశేషంగా ఉంటారు. మొత్తము కల్పమంతా విశ్వములోని సర్వాత్మలకు శ్రేష్ఠ ఆత్మలైన మీ పట్ల మహానతకు సంబంధించిన దృష్టి ఉంటుంది. మరి మీలోని ప్రతి ఒక్కరికీ మీ విశేషతల గురించి తెలుసా? ఒకవేళ తెలుసు అని అనుకుంటే ఒక్క చేతిని ఎత్తండి. చాలా మంచిది. ఆ విశేషతలను ఏం చేస్తారు? విశేషతలను గురించి చాలా బాగా తెలుసు మరియు వాటిని చాలా బాగా అంగీకరిస్తారు కానీ ఆ విశేషతలను ఏం చేస్తారు? (సేవలో పెడతాము) వేరే విధంగా అయితే ఉపయోగించరు కదా? ఈ విశేషతలు పరమాత్మ ఇచ్చిన కానుకలు. పరమాత్మ ఇచ్చిన కానుకలను సదా విశ్వ సేవలో అర్పణ చెయ్యాలి. విశేషతలను ఒకవేళ నెగెటివ్ రూపంలో ఉపయోగించినట్లయితే అది అభిమానము రూపంగా తయారవుతుంది ఎందుకంటే జ్ఞానములోకి వచ్చిన తరువాత, బ్రాహ్మణ జీవితములోకి వచ్చిన తరువాత బాబా ద్వారా చాలా విశేషతలు ప్రాప్తిస్తాయి ఎందుకంటే బాబాకు చెందినవారిగా అవ్వటంతో విశేషతల ఖజానాలకు అధికారులుగా అవుతారు. ఒకటి-రెండు విశేషతలు కాదు, చాలా విశేషతలు ఉన్నాయి. స్మృతిచిహ్నములో కూడా మీ విశేషతల వర్ణన ఉంది - 16 కళల సంపన్నులు, అంటే కేవలం 16 అని కాదు, 16 అనగా సంపూర్ణము. సర్వ గుణ సంపన్నము. సంపూర్ణ నిర్వికారీతనము యొక్క వివరణ ఉంది. అనటానికైతే సంపూర్ణ నిర్వికారి అని అంటారు కానీ సంపూర్ణము అన్న మాటలో చాలా వివరణ ఉంది. మరి విశేషతలైతే బాబా ద్వారా ప్రతి బ్రాహ్మణాత్మకు వారసత్వముగా తప్పకుండా ప్రాప్తిస్తాయి. కానీ ఆ విశేషతలను ధారణ చెయ్యండి మరియు వాటిని సేవలో పెట్టండి. ఇది నా విశేషత అని అనుకోకూడదు, ఇది పరమాత్మ ఇచ్చిన కానుక. పరమాత్మ ఇచ్చిన కానుక అని భావించటంతో ఆ విశేషతలో పరమాత్ముని శక్తులు నిండుతాయి. ‘నాది’ అని అనటంతో అభిమానము మరియు అవమానము, రెండింటినీ ఎదుర్కోవలసి ఉంటుంది. ఏ రకమైన అభిమానమైనా కానీ, అది జ్ఞానానికి సంబంధించినదైనా, యోగానికి సంబంధించినదైనా, సేవకు సంబంధించినదైనా, బుద్ధికి సంబంధించినదైనా, ఏదైనా గుణానికి సంబంధించినదైనా, వీటికి సంబంధించి ఏ విషయములో అభిమానం ఉన్నా, వారి గుర్తు ఏమిటంటే - వారు అవమానము చాలా త్వరగా ఫీల్ అవుతారు. కనుక మీరు విశేష ఆత్మలు అనగా పరమాత్మ కానుకకు అధికారులు.
ఈ రోజు మీరందరూ బాప్ దాదా జన్మదినాన్ని జరిపేందుకు వచ్చారు కదా! మరియు బాప్ దాదా మీ అందరి జన్మదినాన్ని జరిపేందుకు వచ్చారు. మీరైతే కేవలం బాప్ దాదా జన్మదినాన్ని జరుపుతారు కానీ బాప్ దాదా మొత్తము బ్రాహ్మణ కులము యొక్క జన్మదినాన్ని జరిపేందుకు వచ్చారు. భారత్ లో దూరంలో కూర్చుని ఉన్నా, విదేశములో మూలలో దూరంగా కూర్చుని ఉన్నా, బ్రాహ్మణ ఆత్మలు ఎవరైతే బ్రాహ్మణ కులానికి చెందినవారిగా అయిపోయారో, వారందరి జన్మదినాన్ని బాప్ దాదా కూడా జరుపుతున్నారు, మీరు కూడా జరుపుతున్నారు. అందరిదీ జరుపుతున్నారా లేక కేవలం ఇక్కడ కూర్చుని ఉన్నవారిదే జరుపుతున్నారా? అందరూ గుర్తున్నారు కదా! మా జన్మదినాన్ని కూడా జరుపుతున్నారా, లేదా అని ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. కనుక అందరిదీ జరుపుతున్నారు. అందరికీ శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. జరుపుకోవటము అనగా ఉల్లాస-ఉత్సాహాలలోకి రావటము. మరి - వాహ్, మా అలౌకిక జన్మదినము అని హృదయములో ఉత్సాహము ఉంది కదా!
ఈ రోజు అమృతవేళ నుండీ జన్మదినము యొక్క ఉల్లాస-ఉత్సాహాలు అందరిలోనూ చాలా చాలానే ఉన్నాయి కదా! బాప్ దాదా కార్డులను కూడా చూసారు, మీరు ఈ కళ్ళతో చూస్తారు, బాప్ దాదా అయితే సూక్ష్మములోనే మీకంటే ముందే చూసేస్తారు. కానీ బాప్ దాదా చూసారు - అందరూ తమ మనసులోని ఉల్లాసాన్ని చూపించేందుకు ఎంత ఉల్లాస-ఉత్సాహాలను పెట్టుకుంటారు. ఈ రోజుల్లో అయితే ఈ-మెయిల్ చాలా చవక కదా! కనుక అందరూ చాలా ఈ-మెయిల్స్ కూడా పంపిస్తారు. బాప్ దాదా వద్దకు అన్నీ చేరుకుంటాయి. ఈ-మెయిల్స్ అయినా, కార్డులైనా, ఉత్తరాలైనా, హృదయములోని సంకల్పాలైనా అన్నీ చేరుకుంటాయి. అమృతవేళ నుండి వతనములో ఒకవేళ నలువైపుల నుండి వచ్చిన ఈ కార్డులు, ఉత్తరాలు, ఈ-మెయిల్స్, సంకల్పాలు అన్నింటినీ ఒకచోట చేరిస్తే వాటిని చూస్తూ-చూస్తూ చాలా మజా వస్తుంది. ఈ ఎగ్జిబిషన్ విచిత్రంగా ఉంటుంది. పుట్టిన రోజున భవిష్యత్తు కొరకు సంకల్పము చేస్తారు. ఎలా అయితే పుట్టినరోజు యొక్క నంబరు పెరుగుతుంటుందో, సంవత్సరము పెరుగుతుంటుందో, అలాగే పురుషార్థములో మరియు మీ అమూల్య జీవితములో, మనసులో అనగా సంకల్పాలలో, బుద్ధి యొక్క నిర్ణయ శక్తిలో, వాణిలో, క్షణములో సఫలతా మూర్తులుగా అయ్యే శక్తిలో, సంబంధ-సంపర్కములో ప్రతి సమయము సంబంధ-సంపర్కములోకి వచ్చేవారికి ఏదో ఒక ప్రాప్తి యొక్క అనుభూతి కలగాలి. ఇలా మీ భవిష్య సంవత్సరము కొరకు దృఢ సంకల్పముతో కూడిన వ్రతాన్ని చేపట్టారా? ఎందుకంటే విశేషంగా శివ జయంతినాడు రెండు లక్ష్యాలు బ్రాహ్మణ ఆత్మలలో ఉంటాయి - ఒకటి, స్వయముతో చేసుకునే ప్రతిజ్ఞ గురించి మరియు రెండవది, బాబా యొక్క ప్రత్యక్షతా జెండాను ఎగురవెయ్యడము గురించి, ఈ రెండు విశేష లక్ష్యాలు ఈ రోజు ప్రతి ఒక్కరి లోపల ఉంటాయి. బాప్ దాదా మీ అందరూ చేసిన (గతంలో చేసిన) ప్రతిజ్ఞల లెక్కాపత్రాన్ని చూసారు. ప్రతి సంవత్సరము, ప్రతి ఒక్కరూ విధి పూర్వకంగా సంకల్పము ద్వారా, వాణి ద్వారా ప్రతిజ్ఞ చేసారు. చాలా బాగా చేసారు. కానీ ఇప్పుడు ఈ రోజు తరువాత అనగా జన్మదినాన్ని జరుపుకున్న తరువాత ఒక మాటను విశేషంగా అండర్ లైన్ చెయ్యండి. అది కామన్ మాటే, కొత్తదేమీ కాదు. ఆ మాట ఏమిటంటే - నిరంతర దృఢత. ఒక్కోసారి దృఢత ఉండటము మరియు ఒక్కోసారి దృఢతలో కూడా నిర్లక్ష్యము ఉండటము, ఇలా ఉండకూడదు. ఒకవేళ నిరంతర దృఢత ఉన్నట్లయితే దానికి గుర్తు ఏమిటంటే - నిరంతరము ప్రతి సంకల్పము, మాట, కర్మ ద్వారా, స్వయములో, సేవలో మరియు సంబంధములో 100 శాతము సఫలత ఉండటము. ఎప్పటివరకైతే ఈ అన్ని విషయాలలో బ్రాహ్మణులలో సదా సఫలత తక్కువగా ఉంటుందో, అప్పటివరకు ప్రత్యక్షత డ్రామానుసారంగా ఆగి ఉంటుంది. సఫలత ప్రత్యక్షతకు ఆధారము. ప్రతి మాటా సఫలతా పూర్వకంగా ఉండాలి, ప్రతి సంకల్పము సఫలతా పూర్వకంగా ఉండాలి, అందుకే ఈ రోజుల్లోని స్మృతిచిహ్నములో కూడా గురువుగా పిలవబడేవారి విషయములో సత్య వచన మహరాజ్ అని అంటారు. వారు అబద్ధాలు చెప్తున్నా కూడా భక్తులు వారి మాటలను సత్య వచనములు అనే అంటారు. మరి ఇది మీ వచనముకు ఉన్న గాయనము. మహారాజులుగా, మహానులుగా అయితే మీరే అవుతారు కదా! అందుకే సత్య వచన మహారాజు అనగా మహానాత్మలు. నా భావము అది కాదు కానీ మాట్లాడేశాను, అలా వచ్చేసింది అని ఇలా ఎప్పుడూ ఆలోచించకండి. భావము లేకుండా, భావన లేకుండా మాట అలా రాదు, అలా అంటున్నారంటే అది తప్పించుకోవటము. ఒక్కోసారి, అలా వచ్చేసింది అని అంటారు, అలా ఎందుకు వచ్చేస్తుంది? ఎందుకు, అది అలా వచ్చేయటానికి కంట్రోలింగ్ పవర్ లేదా? అలా అయిపోయింది అని అంటే మీరు రాజులు కారా? అలా వచ్చేసింది, అలా అయిపోయింది అని అంటే ఏవో కర్మేంద్రియాలకు వశీభూతులైపోయారు కదా!
కనుక ఈ సంవత్సరములో శుభాకాంక్షలతోపాటు నిరంతరము ప్రతి విషయములో దృఢత అన్నదానిని అండర్ లైన్ చెయ్యండి. ఈ రోజు పుట్టినరోజు కనుక బాప్ దాదా ఈ రోజు వినిపించరు, కానీ అందరి చార్టు నుండి బాప్ దాదా ఒక విషయాన్ని నోట్ చేసారు, కానీ దానిని చివరి టర్న్ లో వినిపిస్తారు. ఈ రోజు అయితే జన్మదినాన్ని జరుపుకోవాలి, వినిపించరు. 15 రోజుల తర్వాత వినిపిస్తారు. (బాప్ దాదా వినిపించినట్లయితే 15 రోజులలో అందరూ బాగైపోతారు అని పిల్లలు చెప్పారు) అచ్ఛా, అయితే 15 రోజులలో కరెక్షన్ అయిపోతుంది అని ముందు చెప్పండి, అప్పుడు వినిపించినా బాగుంటుంది. ఒకవేళ 15 రోజులలో పరివర్తన అయిపోతే ఇక బాప్ దాదా ఏం చేస్తారో మీకు తెలియదు! మరి వినిపించమంటారా? మరి 15 రోజులలో పరివర్తన జరిగిపోతుందా? సంకల్పము చేస్తారా? అచ్ఛా, పాండవులు చేస్తారా? వినిపించమంటారా? వినటమైతే సహజమే, చేస్తారా? చెయ్యాల్సే ఉంటుంది. (బాప్ దాదా వెనుక ఉన్నవారిని, మాతలను, టీచర్లను, డబుల్ విదేశీయులను అందరినీ అడిగారు, అందరూ చేతులు ఊపారు) చేతులైతే అందరూ చాలా బాగా ఎత్తుతారు.
డబుల్ విదేశీయులవి మూడు గ్రూపులు ఉన్నాయి కదా? (అంతర్ముఖి గ్రూప్, మస్తానా గ్రూప్, శక్తి గ్రూప్)
అచ్ఛా, అంతర్ముఖి గ్రూప్ వారు చేతులెత్తండి. అంతర్ముఖిలో కొద్దిమందే ఉన్నారు. రెండవ గ్రూప్ మస్తానా, అచ్ఛా, మస్తానా గ్రూప్ వారు లేచి నిలబడండి. సదా మస్త్ గా ఉండేవారు కదా! మస్తానా అంటే అర్థమేమిటి? సదా మస్త్ గా ఉండేవారు కదా! మూడవ గ్రూప్ - శక్తి. శక్తి గ్రూప్ శక్తిశాలురు కదా! పేర్లు అయితే చాలా మంచివి పెట్టుకున్నారు. చూడండి, మొదట్లో మీ భట్టి ఉన్నప్పుడు మీ గ్రూపుల పేర్లు ఏముండేవి? (డివైన్ యూనిటీ, మనోహర్ పార్టీ, సుప్రీమ్ పార్టీ) పేర్లు అయితే సుందరముగా ఉన్నాయి కదా? అలాగే ఈ గ్రూపులు కూడా మంచిగా తయారయ్యాయి. పేరు గుర్తుంటే పేరుతోపాటు కర్తవ్యము కూడా గుర్తుంటుంది. అచ్ఛా, డబుల్ విదేశీయులలోని కుమారులు లేవండి. అచ్ఛా, ఇది కుమారుల గ్రూప్. బాగా చేసారు, బాప్ దాదా డబుల్ విదేశీయుల రిఫ్రెష్మెంట్ సమాచారమును చాలా బాగా విన్నారు. బాప్ దాదా మనస్ఫూర్తిగా అభినందనలను కూడా ఇస్తున్నారు కానీ అన్ని గ్రూప్ ల వారికి ఈ రోజు ఏదైతే అండర్ లైన్ చేసారో, దానిని గుర్తు చేయిస్తున్నారు కూడా.
డబుల్ విదేశీ టీచర్లు చాలామంది ఉన్నారు. టీచరుగా అవ్వటము చాలా-చాలా శ్రేష్ఠ భాగ్యానికి గుర్తు ఎందుకంటే బాప్ దాదా టీచర్లను గురు-భాయిగా (గురువు యొక్క ఆసనముపై కూర్చునేందుకు యోగ్యుడైన శిష్యునిగా) చూస్తారు, ఇంతగా సమాన రూపములో చూస్తారు ఎందుకంటే బాబా ఆసనముపై కూర్చుంటారు, టీచర్లకు ఈ హక్కు లభిస్తుంది. ఏ విధంగా గురువుల ఆసనము ఉంటుంది కదా, అలా ఇది మురళి సింహాసనము, మురళిని ధారణ చేయించటము మరియు మురళిని వినిపించటము చేయాలి. కేవలం వినిపించటము కాదు కానీ మురళిని ధారణ చేయించటము, టీచర్లకు బాప్ దాదా ఈ గురు-భాయి సింహాసనాన్ని ఇచ్చారు. విదేశాలలోనైతే చాలా త్వరగా సింహాసనాధికారులుగా అయిపోతారు అని చూడడం జరిగింది. బాప్ దాదా సంతోషిస్తారు. బాధ్యతా కిరీటాన్ని ధరించటము, ధైర్యాన్ని ఉంచడము, ఇది కూడా తక్కువ విషయమేమీ కాదు, కానీ గురు-భాయి అనగా బాబా సమానము. మామూలుగా అయితే అందరూ బాబా సమానంగా అవ్వాల్సిందే, అయినా కూడా టీచర్లకు విశేషంగా బాధ్యతా కిరీటము ఉంది. బాప్ దాదాకు కూడా టీచర్ల సంగఠన చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ ఈ రోజు యొక్క విశేషమైన మాట ‘‘నిరంతర అటెన్షన్’’.
అచ్ఛా - భారత్ లోని టీచర్లు లేవండి, భారత్ లోని టీచర్లు కూడా తక్కువేమీ లేరు. మరి విన్నారా, టీచర్లను బాబా ఏ దృష్టితో చూస్తారో. క్లాస్ చేసే ఈ సీట్, మురళిని వినిపించే ఈ సీట్... మీరు చాలా భాగ్యవంతులు. చాలా, చాలా, చాలా అదృష్టవంతులు ఎందుకంటే సాకార రూపములో నిమిత్తులు ఎవరు? అచ్ఛా, దాదీలైతే ఒకరు విదేశాలలో ఉంటారు, ఒకరు మధుబన్ లో ఉంటారు, కానీ ప్రతి స్థానములో సాకార రూపములో నిమిత్త టీచర్లు ఉన్నారు లేక నిమిత్త పాండవులు కూడా ఉన్నారు. కేవలం టీచర్లే (అక్కయ్యలే) ఉన్నారని కాదు, పాండవులు కూడా ఉన్నారు, వారిని పెద్ద అన్నయ్యలు అని అంటారు కదా. పాండవులు ఉండటము తప్పకుండా అవసరము. శక్తులు మరియు పాండవులు, ఈ ఇరువురి వలనే ఆది నుండి కార్యము నడిచింది. కొద్దిమంది పాండవులే ఉండేవారు, కానీ విశ్వ కిశోర్ అయితే ఉండేవారు కదా. ఆనంద కిశోర్, విశ్వ కిశోర్, వీరు మొదట్లో ఉండేవారు. కనుక పాండవుల తోడు అయితే ఉంది కదా. కానీ మెజారిటీ టీచర్లు ఎక్కువ ఉన్నారు, వారు నిమిత్తులు అవుతారు. మీరు వెన్నెముక వంటివారు, టీచర్లకు కూడా వెన్నెముక వంటివారు. ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. కానీ విదేశాలలోని విశేషత ఏమిటంటే పాండవులు కూడా టీచర్లుగా అవుతారు, భారత్ లో పాండవులు టీచర్లుగా తక్కువ అవుతారు. కనుక టీచర్లకు బాప్ దాదా సదా చెప్తారు - టీచర్ అనగా తమ ఫీచర్స్ ద్వారా బాబాను సాక్షాత్కారము చేయించేవారు, ఫీచర్స్ ద్వారా ఫ్యూచర్ ను స్పష్టంగా చూపించేవారు. మరి మీరు అటువంటి టీచర్లే కదా? మిమ్మల్ని చూస్తే బాప్ దాదా యొక్క పాలన అనుభూతి అవ్వాలి. పరమాత్మ గుణాలు, పరమాత్మ శక్తులు మీ ముఖం ద్వారా కనిపించాలి, మాటల ద్వారా కనిపించాలి. అంతేకానీ ఫలానా టీచరు చెప్పారు అని కాదు, బాప్ దాదా టీచర్ల ఫీచర్స్ ద్వారా అనుభవం చేయించారు అని అనిపించాలి. బాబాతో ప్రతి ఒక్కరి కనెక్షన్ ను జోడించటము - ఇదే టీచర్ల కర్తవ్యము. ప్రతి ఒక్కరి హృదయము నుండి ప్రతి సమయము బాబా అని వెలువడాలి.
ఈ గ్రూప్ లను కూడా మంచిగా తయారుచేసారు ఎందుకంటే పర్సనల్ రిఫ్రెష్మెంట్ దొరకటం వలన అనుభూతి బాగా చేస్తారు. గ్రూప్ లలో మంచి రిజల్టు వెలువడింది కదా! మంచిది!
నలువైపులా జన్మ ఉత్సవాన్ని జరుపుకునే శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మలకు, సదా అలౌకిక జన్మ యొక్క అలౌకిక దివ్య కర్తవ్యాన్ని చేసే శ్రేష్ఠ ఆత్మలకు, సదా ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అన్న ఇటువంటి ఏకనామీ మరియు సర్వ ఖజానాలలో ఎకానమీ యొక్క అవతారమూర్తులుగా అయ్యే పిల్లలకు, సదా ప్రతి వరదానాన్ని మరియు వారసత్వాన్ని జీవితము ద్వారా ప్రత్యక్షము చేసే ఉల్లాస-ఉత్సాహాలలో ఉండే పిల్లలకు, అలౌకిక జన్మకు బాప్ దాదా యొక్క శుభాకాంక్షలతోపాటు ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో:- దాదీజీ బాప్ దాదాకు జన్మదినం యొక్క చాలా-చాలా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ రోజు మాలలోకి మీరందరూ వచ్చారు. మాలను గుర్తు చేసారు కదా! ఆదిలోని స్థాపనా రత్నాలను గుర్తు చేసారు, అందులో మీరు మాలలోని మణులుగా ఉండేవారు. మంచిది, స్థాపనకు కూడా నిమిత్తులుగా అయ్యారు, పాలనకు కూడా నిమిత్తులుగా అయ్యారు, ఇప్పుడు బాబాతో పాటు వెళ్ళేందుకు కూడా నిమిత్తులుగా అవుతారు. ద్వారాన్ని బాప్ దాదా ఒక్కరే తెరుస్తారా ఏమిటి? (కాదు) మీ కోసం ఆగి ఉన్నారు. మీరు వస్తే ద్వారాన్ని తెరుస్తాను. కానీ సేవను పూర్తి చేయాల్సి ఉంటుంది కదా ఎందుకంటే సాకారములో మిమ్మల్ని నిమిత్తులుగా చేసారు. కనుక సాకారములోని కార్యాన్ని అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది కదా. ఈ రోజుల్లో అందరూ ఎవరిని చూస్తారు? అందరి దృష్టి ఎటువైపు వెళ్తుంది? మీవైపుకే వెళ్తుంది కదా. ఎవరైతే నిమిత్తులుగా అయ్యారో, వారివైపుకే అందరి దృష్టి వెళ్తుంది. నయనాలలోనైతే అందరినీ కూర్చోబెట్టుకున్నారు ఎందుకంటే బాబా దృష్టి తక్కువేమీ కాదు, వారి దృష్టి అనంతమైనది. కనుక అందరూ దృష్టిలో ఉన్నారు. అందరూ కంటి రత్నాలు. చాలా మంచిది. ప్రతి ఒక్కరూ తమ-తమ పాత్రను అభినయిస్తున్నారు మరియు అభినయించాల్సిందే. డ్రామాలో బంధించబడి ఉన్నారు. ఆనందం కలుగుతుంది కదా! చాలా మంచిది!
| వరదానము:- |
అల్పకాలిక ఆధారాల యొక్క తీరాలను వదిలి ఒక్క తండ్రిని ఆధారముగా చేసుకునే యథార్థ పురుషార్థీ భవ పురుషార్థము అంటే అర్థము ఒకసారి చేసిన పొరపాటును పదే-పదే చేస్తూ ఉండటము మరియు పురుషార్థాన్ని తమ ఆధారముగా చేసుకోవటము కాదు. యథార్థ పురుషార్థీ అనగా పురుష్ (ఆత్మ) గా అయ్యి రథము ద్వారా కార్యము చేయించేవారు. ఇప్పుడు అల్పకాలిక ఆధారాల యొక్క తీరాలను వదలండి. కొంతమంది పిల్లలు తండ్రికి బదులు హద్దు తీరాలను ఆధారంగా చేసుకుంటారు. అది తమ స్వభావ-సంస్కారాలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు... ఈ అల్పకాలిక ఆధారాలన్నీ బాహ్య ఆడంబరాలు, ఇవి మోసం చేసేటువంటివి. ఒక్క తండ్రి యొక్క ఆధారమే ఛత్రఛాయ. |
| స్లోగన్:- | నాలెడ్జ్ ఫుల్ ఎవరు అంటే, ఎవరైతే మాయను దూరము నుండే గుర్తించి స్వయాన్ని సమర్థులుగా చేసుకుంటారో వారు. |