| 14-10-2024 |
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
|
మధువనం |
| ‘‘మధురమైన పిల్లలూ - చెడు వినకండి... ఇక్కడ మీరు సత్సంగంలో కూర్చున్నారు, మీరు మాయావీ చెడు సాంగత్యములోకి వెళ్ళకూడదు, చెడు సాంగత్యము అంటుకోవడంతోనే సంశయం రూపములో ఇబ్బందులు వస్తాయి’’ | |
| ప్రశ్న:- | ఈ సమయంలో మనుష్యులెవ్వరినీ స్పిరిచుయల్ అని అనలేరు - ఎందుకు? |
| జవాబు:- | ఎందుకంటే అందరూ దేహాభిమానులుగా ఉన్నారు. దేహాభిమానము కలవారిని స్పిరిచుయల్ అని ఎలా అనగలరు. స్పిరిచుయల్ ఫాదర్ అయితే ఒక్క నిరాకారుడైన తండ్రే, వారు మీకు కూడా దేహీ-అభిమానులుగా అయ్యే శిక్షణను ఇస్తారు. సుప్రీమ్ అన్న టైటిల్ ను ఒక్క తండ్రికే ఇవ్వగలరు, తండ్రి తప్ప సుప్రీమ్ అని ఇంకెవ్వరూ పిలవబడలేరు. |
ఓం శాంతి. పిల్లలు ఇక్కడ కూర్చున్నప్పుడు వారికి తెలుసు - బాబా మాకు తండ్రి కూడా, టీచర్ కూడా మరియు సద్గురువు కూడా అని. ఈ ముగ్గురి అవసరమూ ఉంటుంది. మొదట తండ్రి, ఆ తర్వాత చదివించే టీచర్, ఆ తర్వాత చివరిలో గురువు. ఇక్కడ స్మృతిని కూడా అలాగే చేయాలి ఎందుకంటే ఇది కొత్త విషయం కదా. వీరు అనంతమైన తండ్రి కూడా, అనంతమైన అనగా అందరి తండ్రి. ఇక్కడకు ఎవరు వచ్చినా వారికి - ఇది స్మృతిలోకి తీసుకురండి అని చెప్పడం జరుగుతుంది. ఇందులో ఎవరికైనా సంశయం ఉంటే చేతులు ఎత్తండి. ఇది అద్భుతమైన విషయం కదా. జన్మ-జన్మాంతరాలలో మీరు తండ్రి, టీచర్, సద్గురువుగా భావించగలిగినవారు ఎవరైనా లభించారా, అది కూడా సుప్రీమ్ అయినవారు. అనంతమైన తండ్రి, అనంతమైన టీచర్, అనంతమైన సద్గురువు, ఇటువంటివారు ఎప్పుడైనా ఎవరైనా లభించారా? కేవలం ఈ పురుషోత్తమ సంగమయుగములో తప్ప ఇంకెప్పుడూ లభించలేరు. ఇందులో ఎవరికైనా సంశయం ఉంటే చేతులు ఎత్తండి. ఇక్కడ అందరూ నిశ్చయబుద్ధి కలవారిగా అయి కూర్చున్నారు. ముఖ్యమైనవారు ఈ ముగ్గురే. అనంతమైన తండ్రి జ్ఞానాన్ని కూడా అనంతమైనదే ఇస్తారు. అనంతమైన జ్ఞానము అయితే ఇదొక్కటే. హద్దు జ్ఞానాలనైతే మీరు అనేకం చదువుతూ వచ్చారు. కొందరు వకీలుగా అయితే, కొందరు సర్జన్లుగా అవుతారు ఎందుకంటే ఇక్కడైతే డాక్టర్లు, జడ్జిలు, వకీళ్ళు మొదలైనవారందరూ కావాలి కదా. అక్కడైతే అవసరం లేదు. అక్కడ దుఃఖపు విషయమేదీ లేదు. కావున ఇప్పుడు తండ్రి కూర్చుని అనంతమైన శిక్షణను పిల్లలకు ఇస్తున్నారు. అనంతమైన తండ్రే అనంతమైన శిక్షణను ఇస్తారు, మళ్ళీ అర్ధకల్పం వరకూ ఎటువంటి శిక్షణనూ మీరు చదవవలసిన అవసరం ఉండదు. ఒకేసారి శిక్షణ లభిస్తుంది, అది 21 జన్మల కొరకు ఫలీభూతమవుతుంది అనగా దాని ఫలము లభిస్తుంది. అక్కడైతే డాక్టర్లు, బ్యారిష్టర్లు, జడ్జిలు మొదలైనవారెవ్వరూ ఉండరు. ఈ నిశ్చయమైతే ఉంది కదా. తప్పకుండా అలాగే ఉంటుంది కదా? అక్కడ దుఃఖము ఉండదు, కర్మభోగము ఉండదు. తండ్రి కూర్చుని కర్మల గతిని అర్థం చేయిస్తారు. ఆ గీతను వినిపించేవారు ఇలా ఏమైనా వినిపిస్తారా? తండ్రి అంటారు, నేను పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. వారు అందులో శ్రీకృష్ణ భగవానువాచ అని వ్రాసేశారు, కానీ అతడైతే దైవీ గుణాలు కల మానవుడు. శివబాబా అయితే ఎటువంటి పేరును ధరించరు, వారికి ఇంకొక పేరు ఏదీ లేదు. తండ్రి అంటారు, నేను ఈ శరీరాన్ని లోన్ గా తీసుకుంటాను, ఈ శరీరము రూపీ ఇల్లు నాది కాదు, ఇది కూడా ఇతని ఇల్లే, కిటికీలు మొదలైనవన్నీ ఉన్నాయి. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు - నేను మీ అనంతమైన తండ్రిని అనగా ఆత్మలందరికీ తండ్రిని, నేను ఆత్మలను చదివిస్తాను కూడా. వీరిని స్పిరిచుయల్ ఫాదర్ అనగా ఆత్మిక తండ్రి అని అంటారు, ఇంకెవ్వరినీ ఈ విధంగా ఆత్మిక తండ్రి అని అనరు. వీరు అనంతమైన తండ్రి అని ఇక్కడ పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు స్పిరిచుయల్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. వాస్తవానికి అది స్పిరిచుయల్ కాన్ఫరెన్స్ ఏమీ కాదు, వారు నిజమైన స్పిరిచుయల్ వ్యక్తులు కారు, వారు దేహాభిమానులుగా ఉన్నారు. తండ్రి అంటారు - పిల్లలూ, దేహీ-అభిమానీ భవ, దేహ అభిమానాన్ని వదలండి. ఇలా ఎవరితోనైనా అంటారా. స్పిరిచుయల్ అన్న పదాన్ని ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. ఇంతకుముందు కేవలం రెలిజియస్ కాన్ఫరెన్స్ అని అనేవారు. స్పిరిచుయల్ అనే పదము యొక్క అర్థాన్ని ఎవరూ అర్థం చేసుకోరు. స్పిరిచుయల్ ఫాదర్ అనగా నిరాకారీ తండ్రి. ఆత్మలైన మీరు స్పిరిచుయల్ పిల్లలు. స్పిరిచుయల్ ఫాదర్ వచ్చి మిమ్మల్ని చదివిస్తారు. ఈ వివేకము ఇంకెవరిలోనూ ఉండదు. తండ్రి స్వయం కూర్చుని తాను ఎవరు అనేది తెలియజేస్తారు. గీతలో ఇది లేదు. నేను మీకు అనంతమైన శిక్షణను ఇస్తాను. అక్కడ వకీలు, జడ్జి, సర్జన్ మొదలైనవారి అవసరం లేదు ఎందుకంటే అక్కడ పూర్తిగా సుఖమే సుఖము ఉంది, దుఃఖపు నామ-రూపాలు కూడా ఉండవు. అలాగే ఇక్కడ సుఖము యొక్క నామ-రూపాలు లేవు. దీనిని కనుమరుగైపోవడము అని అంటారు. సుఖమైతే కాకిరెట్టతో సమానముగా ఉంటుంది. ఇక్కడ ఏదో కాస్త సుఖము ఉంది. మరి వీరు అనంతమైన సుఖము యొక్క జ్ఞానాన్ని ఎలా ఇవ్వగలరు. మొదట దేవీ-దేవతల రాజ్యమున్నప్పుడు సత్యత 100 శాతమూ ఉండేది. ఇప్పుడైతే అంతా అసత్యమే అసత్యము.
ఇది అనంతమైన జ్ఞానము. మీకు తెలుసు - ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షము, దీనికి బీజరూపుడను నేను. వారిలో వృక్షము యొక్క జ్ఞానమంతా ఉంది. మనుష్యులకు ఈ జ్ఞానము లేదు. నేను చైతన్య బీజరూపుడను. నన్ను జ్ఞానసాగరుడు అనే అంటారు. జ్ఞానముతో ఒక్క క్షణములో గతి, సద్గతి లభిస్తుంది. నేను సర్వులకూ తండ్రిని. నన్ను గుర్తించడం ద్వారా పిల్లలైన మీకు వారసత్వము లభిస్తుంది. కానీ అక్కడ రాజధాని ఉంటుంది కదా. స్వర్గములో కూడా పదవులైతే నంబరువారుగా ఎన్నో ఉంటాయి. తండ్రి ఒకే చదువును చదివిస్తారు. చదివేవారైతే నంబరువారుగానే ఉంటారు. ఇందులో మళ్ళీ ఇంకే చదువు యొక్క అవసరమూ ఉండదు. అక్కడ ఎవ్వరూ రోగగ్రస్థులుగా ఉండరు. ఏదో పైసకు విలువ చేసే సంపాదన కోసం అక్కడ చదువులు చదువుకోరు. మీరు ఇక్కడి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకువెళ్తారు. ఈ పదవిని మాకు ఎవరు ఇప్పించారు అన్న విషయం అక్కడ తెలియదు. అది మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు. హద్దులోని జ్ఞానమునైతే మీరు చదువుతూ వచ్చారు. ఇప్పుడు అనంతమైన జ్ఞానాన్ని చదివించేవారిని చూశారు, తెలుసుకున్నారు. ఈ తండ్రి, తండ్రి కూడా మరియు టీచర్ కూడా, వారు వచ్చి మమ్మల్ని చదివిస్తారు అన్నది తెలుసుకున్నారు. వారు సుప్రీమ్ టీచర్, రాజయోగాన్ని నేర్పిస్తారు. వారు సత్యమైన సద్గురువు కూడా. ఇది అనంతమైన రాజయోగము. వారు బ్యారిస్టరీ, డాక్టరీ మొదలైన విద్యలనే నేర్పిస్తారు ఎందుకంటే ఈ ప్రపంచమే దుఃఖమయమైనది. అవన్నీ హద్దులోని చదువులు, ఇది అనంతమైన చదువు. తండ్రి మీ చేత అనంతమైన చదువును చదివిస్తారు. వీరు తండ్రి, టీచర్, సద్గురువు అని కూడా మీకు తెలుసు. వీరు కల్ప-కల్పమూ వస్తారు, మళ్ళీ సత్య, త్రేతాయుగాల కొరకు ఇదే చదువును చదివిస్తారు, తర్వాత ఇది కనుమరుగైపోతుంది. సుఖము యొక్క ప్రారబ్ధము డ్రామా అనుసారంగా పూర్తయిపోతుంది. ఈ విషయాలను అనంతమైన తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు, వారినే పతిత-పావనుడు అని అంటారు. శ్రీకృష్ణుడిని త్వమేవ మాతాశ్చ పిత అని లేక పతిత-పావనుడు అని అంటారా? వీరి స్థాయికి మరియు వారి స్థాయికి రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడు తండ్రి అంటారు, నన్ను గుర్తించడం ద్వారా మీరు క్షణములో జీవన్ముక్తిని పొందగలరు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఒకవేళ భగవంతుడైనట్లయితే అతడిని ఎవరైనా వెంటనే గుర్తించగలరు. శ్రీకృష్ణుని జన్మ ఏమీ దివ్యమైనదిగా, అలౌకికమైనదిగా మహిమ చేయబడలేదు, అది కేవలం పవిత్రత ద్వారా జరుగుతుంది. తండ్రి అయితే ఎవరి గర్భము నుండీ వెలువడరు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు అని అర్థం చేయిస్తారు. ఆత్మయే చదువుతుంది. మంచి లేక చెడు సంస్కారాలన్నీ ఆత్మలోనే ఉంటాయి. ఎటువంటి కర్మలనైతే చేస్తారో వాటి అనుసారంగా వారికి శరీరాలు లభిస్తాయి. కొందరు చాలా దుఃఖాన్ని అనుభవిస్తారు. కొందరు మూగవారిగా, కొందరి చెవిటివారిగా ఉంటారు. గతంలో అటువంటి కర్మలను చేశారు కావున ఇది దాని ఫలము అని అంటారు. ఆత్మల కర్మల అనుసారంగానే రోగగ్రస్థ శరీరము మొదలైనవి లభిస్తాయి.
ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, మనల్ని చదివించేవారు స్వయంగా గాడ్ ఫాదర్, వారు గాడ్ టీచర్ మరియు గాడ్ గురువు కూడా. వారిని గాడ్, పరమ ఆత్మ అని అంటారు, ఈ రెండింటినీ కలిపి పరమాత్మ అని అంటారు అనగా సుప్రీమ్ సోల్. బ్రహ్మాను అయితే సుప్రీమ్ అని అనరు. సుప్రీమ్ అనగా ఉన్నతోన్నతమైనవారు, పవిత్రాతి పవిత్రమైనవారు. పదవులైతే అందరివీ వేర్వేరుగా ఉంటాయి. శ్రీకృష్ణుని పదవి ఏదైతే ఉందో అది ఇతరులకు లభించదు. ప్రైమ్ మినిస్టర్ పదవిని ఇంకొకరికి ఇవ్వరు కదా. అలాగే తండ్రి పదవి కూడా వేరు, బ్రహ్మా-విష్ణు-శంకరుల పదవులు కూడా వేరు. బ్రహ్మా-విష్ణు-శంకరులు దేవతలు, శివుడైతే పరమాత్మ. వారిరువురినీ కలిపి శివ-శంకరులు అని ఎలా అనగలరు. ఇరువురూ వేర్వేరు కదా. అర్థం చేసుకోని కారణముగా శివ-శంకరులు ఒక్కరే అని అనేసారు. పేర్లు కూడా అలాగే పెడతారు. ఈ విషయాలన్నింటినీ తండ్రే వచ్చి అర్థం చేయిస్తారు. వీరు తండ్రి కూడా, టీచర్ కూడా మరియు సద్గురువు కూడా అని మీకు తెలుసు. మనుష్యులు ప్రతి ఒక్కరికీ తండ్రి కూడా ఉంటారు, టీచర్ కూడా ఉంటారు, అలాగే గురువు కూడా ఉంటారు. ఎప్పుడైతే వృద్ధులుగా అవుతారో అప్పుడు గురువును ఆశ్రయిస్తారు. ఈ రోజుల్లోనైతే బాల్యములోనే గురువును ఆశ్రయిస్తున్నారు, ఒకవేళ గురువును ఆశ్రయించకపోతే ఆజ్ఞ ఉల్లంఘన జరుగుతుంది అని భావిస్తారు. ఇంతకుముందు 60 సంవత్సరాల తర్వాత గురువును ఆశ్రయించేవారు. అది వానప్రస్థావస్థ. నిర్వాణము అనగా వాణి నుండి అతీతమైన, స్వీట్ సైలెన్స్ హోమ్, అక్కడకు వెళ్ళేందుకే మీరు అర్ధకల్పం కష్టపడ్డారు. కానీ దాని గురించి తెలియనే తెలియదు కావున అక్కడకు ఎవరూ వెళ్ళలేరు. మరి ఎవరికైనా దారిని ఎలా తెలియజేయగలరు. ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ ఆ దారిని తెలియజేయలేరు. అందరి బుద్ధి ఒకేలా ఉండదు. కొందరైతే కథలు విన్నట్లుగా వింటారు, అందులో లాభమేమీ ఉండదు, ఉన్నతి ఏమీ ఉండదు. మీరు ఇప్పుడు తోటలోని పుష్పాలుగా అవుతారు. ఒకప్పుడు పుష్పాల నుండి ముళ్ళగా అయ్యారు, ఇప్పుడు మళ్ళీ ముళ్ళ నుండి పుష్పాలుగా తండ్రి తయారుచేస్తారు. మీరే పూజ్యులుగా, మళ్ళీ మీరే పూజారులుగా అయ్యారు. 84 జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ సతోప్రధానము నుండి తమోప్రధానముగా, పతితముగా అయ్యారు. తండ్రి మొత్తం మెట్లనన్నింటినీ అర్థం చేయించారు. ఇప్పుడు మళ్ళీ పతితము నుండి పావనముగా ఎలా తయారవుతారు, ఇది ఎవరికీ తెలియదు. ఓ పతిత-పావనా రండి, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారుచేయండి అని గానం కూడా చేస్తారు కదా, మరి నీటి నదులను, సాగరము మొదలైనవాటిని పతిత-పావనిగా భావిస్తూ అక్కడకు వెళ్ళి స్నానాలు ఎందుకు చేస్తారు. గంగను పతిత-పావని అని అనేస్తారు కానీ నదులు కూడా ఎక్కడి నుండి వెలువడ్డాయి? సాగరము నుండే వెలువడతాయి కదా. ఇవన్నీ సాగరుని సంతానమే. ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోవలసి ఉంటుంది.
ఇక్కడైతే పిల్లలైన మీరు సత్సంగములో కూర్చున్నారు. బయట చెడు సాంగత్యములోకి వెళ్ళినప్పుడు మీకు ఎన్నో తప్పుడు విషయాలను వినిపిస్తారు. దానితో ఇక్కడ విన్న ఇన్ని విషయాలను మర్చిపోతారు. చెడు సాంగత్యములోకి వెళ్ళడంతో ఇబ్బందులు పడడం మొదలుపెడతారు, అప్పుడు సంశయమును గురించి తెలుస్తుంది. కానీ ఈ విషయాలను అసలు మర్చిపోకూడదు. బాబా మనకు అనంతమైన తండ్రి కూడా, టీచర్ కూడా, ఆవలి తీరానికి తీసుకువెళ్తారు కూడా, ఈ నిశ్చయంతో మీరు ఇక్కడకు వచ్చారు. అవన్నీ దైహికమైన లౌకిక చదువులు, లౌకిక భాషలు. ఇది అలౌకికమైనది. తండ్రి అంటారు, నా జన్మ కూడా అలౌకికమైనది, నేను లోన్ గా తీసుకుంటాను, పాత చెప్పును తీసుకుంటాను, అది కూడా అన్నింటికన్నా పాత చెప్పు తీసుకుంటాను, ఈ చెప్పు అన్నింటికన్నా పాతది. తండ్రి ఏ దేహమునైతే తీసుకున్నారో దీనిని లాంగ్ బూట్ అని అంటారు. ఇది ఎంత సహజమైన విషయము. ఇది మర్చిపోయే విషయమేమీ కాదు. కానీ మాయ ఇంతటి సహజమైన విషయాలను కూడా మరపింపజేస్తుంది. తండ్రి, తండ్రి కూడా మరియు అనంతమైన శిక్షణను ఇచ్చేవారు కూడా, దీనిని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. బాబా అంటారు, ఇది ఎక్కడైనా లభిస్తుందేమో వెళ్ళి చూడండి. అందరూ మనుష్యులే. వారు ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. భగవంతుడు ఒకే రథాన్ని తీసుకుంటారు, దానిని భాగ్యశాలీ రథము అని అంటారు, పదమాపదమ భాగ్యశాలులుగా తయారుచేయడానికి అందులోకి తండ్రి ప్రవేశము జరుగుతుంది. ఇతను మాలలోని అతి సమీపమైన మణిపూస. బ్రహ్మాయే విష్ణువుగా అవుతారు. శివబాబా ఇతడిని కూడా తయారుచేస్తారు, అలాగే ఇతని ద్వారా మిమ్మల్ని కూడా విశ్వాధిపతులుగా తయారుచేస్తారు. విష్ణువు యొక్క పురి స్థాపన అవుతుంది. దీనిని రాజ్యాన్ని స్థాపన చేసేందుకు రాజయోగము అని అంటారు. ఇప్పుడు ఇక్కడ అందరూ వింటున్నారు కానీ బాబాకు తెలుసు, చాలామంది చెవుల నుండి ఇది బయటకు కొట్టుకుపోతుంది, కొందరు ధారణ చేసి వినిపించగలరు. వారిని మహారథులు అని అంటారు. వారు వింటారు, ధారణ చేస్తారు, అలాగే ఇతరులకు కూడా ఎంతో అభిరుచితో అర్థం చేయిస్తారు. అర్థం చేయించేవారు మహారథులైతే వెంటనే అర్థం చేసుకుంటారు, అర్థం చేయించేవారు గుర్రపు స్వారీ చేసేవారైతే కాస్త తక్కువగా అర్థం చేసుకుంటారు, పాదచారులు నుండి అయితే ఇంకా తక్కువగా అర్థం చేసుకుంటారు. ఎవరు మహారథులు, ఎవరు గుర్రపు స్వారీవారు అనేదైతే తండ్రికి తెలుసు. ఇప్పుడు ఇందులోనైతే తికమకపడే విషయమేదీ లేదు. కానీ బాబా చూస్తూ ఉంటారు, పిల్లలు తికమకపడతారు, మళ్ళీ కునికిపాట్లు పడుతూ ఉంటారు. కళ్ళు మూసుకుని కూర్చుంటారు. సంపాదనలో ఎప్పుడైనా కునికిపాట్లు వస్తాయా? కునికిపాట్లు పడుతూ ఉంటే ధారణ ఎలా జరుగుతుంది? ఆవలిస్తూ ఉంటే వీరు అలసిపోయారని బాబా భావిస్తారు. సంపాదనలో ఎప్పుడూ అలసట ఉండదు. ఆవలింతలు ఉదాసీనతకు గుర్తు. ఏదో ఒక విషయములో లోలోపల ఇబ్బంది పడుతుండేవారికి ఆవలింతలు ఎంతగానో వస్తాయి. ఇప్పుడు మీరు తండ్రి ఇంట్లో కూర్చున్నారు, కావున పరివారమూ ఉంది, వారు టీచర్ కూడా అవుతారు, అలాగే దారిని చూపించేందుకు వారు గురువుగా కూడా అవుతారు. మాస్టర్ గురువు అని అంటారు. కావున ఇప్పుడు తండ్రికి కుడి భుజముగా అవ్వాలి కదా, అటువంటివారు అనేకుల కళ్యాణము చేయగలుగుతారు. నరుని నుండి నారాయణునిగా అయ్యే వ్యాపారములో తప్ప మిగిలిన వ్యాపారాలన్నింటిలోనూ నష్టము ఉంది. అందరి సంపాదన అంతమైపోతుంది. నరుని నుండి నారాయణునిగా అయ్యే వ్యాపారమును తండ్రే నేర్పిస్తారు. మరి ఏ చదువును చదవాలి. ఎవరి వద్దనైతే ధనము ఎంతో ఉంటుందో, వారు స్వర్గమైతే ఇక్కడే ఉంది అని భావిస్తారు. బాపూ గాంధీ రామరాజ్యాన్ని స్థాపించారా? అరే, ఈ ప్రపంచమైతే పాతగా, తమోప్రధానముగానే ఉంది కదా, ఇంకా దుఃఖము పెరిగిపోతూ ఉంటుంది, దీనిని రామరాజ్యం అని ఎలా అంటారు. మనుష్యులు ఎంత బుద్ధిహీనులుగా అయిపోయారు. బుద్ధిహీనులను తమోప్రధానులు అని అంటారు. వివేకవంతులు సతోప్రధానముగా ఉంటారు. ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. ఇందులో తండ్రిని ఏమీ అడిగేది ఉండదు. తండ్రి కర్తవ్యము రచయిత మరియు రచనల జ్ఞానాన్ని ఇవ్వడము, అదైతే వారు ఇస్తూ ఉంటారు. మురళిలో అంతా అర్థం చేయిస్తూ ఉంటారు. అన్ని విషయాలకు రెస్పాన్స్ (బదులు) లభిస్తుంది. ఇంకేమీ అడుగుతారు? తండ్రి తప్ప ఇంకెవరూ అర్థం చేయించలేరు కూడా అన్నప్పుడు ఇక ఎలా అడగగలరు. మీరు బోర్డుపై ఇలా కూడా వ్రాయవచ్చు - 21 జన్మల కొరకు సదా ఆరోగ్యవంతులుగా, సదా ఐశ్వర్యవంతులుగా అవ్వాలనుకుంటే ఇక్కడకు వచ్చి అర్థం చేసుకోండి అని. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిని విని బాగా ధారణ చేయాలి. ఇతరులకు అభిరుచితో వినిపించాలి. ఒక చెవితో విని ఇంకొక చెవి నుండి తొలగించి వేయకూడదు. సంపాదనా సమయములో ఎప్పుడూ ఆవలించకూడదు.
2. బాబాకు కుడి భుజముగా అయి అనేకుల కళ్యాణము చేయాలి. నరుని నుండి నారాయణునిగా అయ్యే మరియు తయారుచేసే వ్యాపారాన్ని చేయాలి.
| వరదానము:- |
ఎవరికి సంబంధించిన వ్యర్థ సమాచారమునైనా విని ఇంటరెస్ట్ ను పెంచుకునేందుకు బదులుగా ఫుల్ స్టాప్ పెట్టే పరమతము నుండి ముక్త భవ చాలామంది పిల్లలు నడుస్తూ-నడుస్తూ శ్రీమతముతోపాటు ఆత్మల పరమతమును కలిపేస్తారు. ఎవరైనా బ్రాహ్మణ ప్రపంచానికి సంబంధించిన సమాచారాన్ని వినిపిస్తుంటే దానిని చాలా ఇంటరెస్ట్ తో వింటారు. వారు చేయగలిగిందేమీ లేదు కానీ దానిని వింటే ఆ సమాచారము బుద్ధిలోకి వెళ్ళిపోతుంది, అప్పుడిక టైమ్ వేస్ట్ అవుతుంది. అందుకే బాబా ఆజ్ఞ ఏమిటంటే - వింటూ కూడా వినకండి. ఒకవేళ ఎవరైనా వినిపించినా కూడా మీరు ఫుల్ స్టాప్ పెట్టండి. ఏ వ్యక్తి గురించైతే విన్నారో వారి పట్ల దృష్టిలో గానీ, సంకల్పములో గానీ ద్వేష భావము లేకుండా ఉన్నప్పుడే పరమతము నుండి ముక్తులు అని అంటారు. |
| స్లోగన్:- | ఎవరి హృదయమైతే విశాలంగా ఉంటుందో, వారి స్వప్నములో కూడా హద్దు సంస్కారాలు ఇమర్జ్ అవ్వలేవు. |