తెలుగు మురళి · Brahma Kumaris

తెలుగు మురళి · 15 అక్టోబర్, 2024

ఓం శాంతి · BapDada ·

ఈరోజు మురళి — today’s murli in Telugu, BK Telugu murli.

18
మురళి15 అక్టోబర్, 2024 · తెలుగు
0:00--:--

పాఠ్యాన్ని ఎంచుకోండి → హైలైట్ / బాక్స్ / అండర్‌లైన్

15-10-2024
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
మధువనం

‘‘మధురమైన పిల్లలూ - పరస్పరం మీ అందరిదీ ఒకే మతము, మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఒక్క తండ్రినే స్మృతి చేస్తారు, దానితో అన్ని భూతాలూ పారిపోతాయి’’
ప్రశ్న:- పదమాపదమ భాగ్యశాలులుగా అయ్యేందుకు ముఖ్యమైన ఆధారము ఏమిటి?
జవాబు:- బాబా ఏదైతే వినిపిస్తారో, ఆ ఒక్కొక్క విషయాన్ని ధారణ చేసేవారే పదమాపదమ భాగ్యశాలులుగా అవుతారు. బాబా ఏమి చెప్తున్నారు మరియు రావణ సాంప్రదాయం వారు ఏమి చెప్తున్నారు అని జడ్జి చేయండి! తండ్రి ఏ జ్ఞానాన్ని అయితే ఇస్తారో దానిని బుద్ధిలో ఉంచుకోవడము, స్వదర్శన చక్రధారులుగా అవ్వడమే పదమాపదమ భాగ్యశాలులుగా అవ్వడము. ఈ జ్ఞానము ద్వారానే మీరు గుణవంతులుగా అవుతారు.

ఓం శాంతి. ఆత్మిక తండ్రి, వారిని ఇంగ్లీష్ లో స్పిరిచ్యుయల్ ఫాదర్ అని అంటారు. మీరు సత్యయుగములోకి వెళ్ళినప్పుడు అక్కడ ఇంగ్లీష్ మొదలైన ఇతర భాషలేవీ ఉండవు. సత్యయుగములో మన రాజ్యం ఉంటుందని మీకు తెలుసు, అందులో మన భాష ఏదైతే ఉంటుందో అదే నడుస్తుంది. మళ్ళీ ఆ తర్వాత ఆ భాష మారిపోతూ ఉంటుంది. ఇప్పుడైతే అనేకానేక భాషలున్నాయి. ఏ రాజు ఉంటారో, వారి బట్టి వారి భాష నడుస్తుంది. ఇప్పుడు ఇదైతే పిల్లలందరికీ తెలుసు, అన్ని సెంటర్లలో ఉన్న పిల్లలందరిదీ ఒకే మతము. స్వయాన్ని ఆత్మగా భావించాలి మరియు ఒక్క తండ్రినే స్మృతి చేయాలి, అప్పుడు భూతాలన్నీ పారిపోతాయి. తండ్రి పతిత-పావనుడు. 5 భూతాలైతే అందరిలోనూ ప్రవేశించి ఉన్నాయి. ఆత్మలోకే భూతాలు ప్రవేశించడం జరుగుతుంది, ఆ భూతాలకు లేక వికారాలకు దేహాభిమానము, కామము, క్రోధము మొదలైన పేర్లు పెట్టడం జరుగుతుంది. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు. ఎప్పుడైనా ఎవరైనా ఈశ్వరుడు సర్వవ్యాపి అని అన్నట్లయితే ఇలా చెప్పండి - సర్వత్రా వ్యాపించి ఉన్నది ఆత్మలు మరియు ఆ ఆత్మలలో పంచ వికారాలు సర్వవ్యాపిగా ఉన్నాయి. అంతేకానీ పరమాత్మ సర్వులలోనూ విరాజమానమై ఉన్నారని కాదు. పరమాత్మలో 5 భూతాలు ఎలా ప్రవేశిస్తాయి! ఒక్కొక్క విషయాన్ని బాగా ధారణ చేసినట్లయితే మీరు పదమాపదమ భాగ్యశాలులుగా అవుతారు. ప్రపంచములోని రావణ సాంప్రదాయం వారు ఏం చెప్తున్నారు మరియు తండ్రి ఏం చెప్తున్నారు, ఇప్పుడు జడ్జి చేయండి. ప్రతి ఒక్కరి శరీరములోనూ ఆత్మ ఉంది. ఆ ఆత్మలో పంచ వికారాలు ప్రవేశించి ఉన్నాయి. శరీరములో కాదు, ఆత్మలో పంచ వికారాలు లేక భూతాలు ప్రవేశిస్తాయి. సత్యయుగములో ఈ ఐదు భూతాలూ లేవు. దాని పేరే దైవీ ప్రపంచము. ఇది డెవిల్ (ఆసురీ) ప్రపంచము. డెవిల్ అని అసురులనే అంటారు. ఎంతగా రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడు మీరు పరివర్తన చెందుతారు. అక్కడ మీలో ఏ వికారాలు, ఏ అవగుణాలు ఉండవు. మీలో గుణాలు సంపూర్ణముగా ఉంటాయి. మీరు 16 కళల సంపూర్ణులుగా అవుతారు. మొదట అలా ఉండేవారు, ఆ తర్వాత కిందకు దిగుతారు. ఈ చక్రము గురించి ఇప్పుడు తెలిసింది. 84 జన్మల చక్రము ఎలా తిరుగుతుంది అనేది తెలిసింది. ఆత్మయైన మనకు స్వ-దర్శనము జరిగింది అనగా ఈ చక్రము యొక్క జ్ఞానము లభించింది. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ మీరు ఈ జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. తండ్రి జ్ఞానాన్ని చదివిస్తారు. ఈ ఆత్మిక జ్ఞానాన్ని తండ్రి భారత్ లోకే వచ్చి ఇస్తారు. హమారా భారత్ (మా భారత్) అని అంటారు కదా. వాస్తవానికి హిందుస్థాన్ అని అనడం తప్పు. భారత్ స్వర్గముగా ఉన్నప్పుడు కేవలం మన రాజ్యమే ఉండేదని, అప్పుడు ఇంకే ధర్మమూ ఉండేది కాదని మీకు తెలుసు. అది కొత్త ప్రపంచముగా ఉండేది. కొత్త ఢిల్లీ అని అంటారు కదా. వాస్తవానికి ఢిల్లీ యొక్క యథార్థమైన పేరు ఢిల్లీ కాదు, దానిని పరిస్తాన్ అని పిలిచేవారు. ఇప్పుడైతే కొత్త ఢిల్లీ మరియు పాత ఢిల్లీ అని అంటారు, ఆ తర్వాత పాత ఢిల్లీ ఉండదు, అలాగే కొత్త ఢిల్లీ కూడా ఉండదు. దానిని పరిస్తాన్ అని పిలుస్తారు. ఢిల్లీని రాజధాని అని అంటారు. ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉంటుంది, అది తప్ప మరి ఇంకేమీ ఉండదు, మన రాజ్యమే ఉంటుంది. ఇప్పుడైతే రాజ్యము లేదు, కావుననే కేవలం మా భారత్ దేశము అని అంటారు. రాజులైతే లేరు. పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా తిరుగుతూ ఉంటుంది. తప్పకుండా మొట్టమొదట ఈ విశ్వములో దేవీ-దేవతల రాజ్యము ఉండేది, అప్పుడు ఇంకే రాజ్యమూ ఉండేది కాదు. యమునా నదీ తీరము ఉండేది, దానిని పరిస్తాన్ అని అనేవారు. దేవతల రాజధానిగా ఢిల్లీయే ఉండేది, అందుకే అందరికీ ఆకర్షణ కలుగుతుంది, అది అన్నింటికన్నా పెద్దది కూడా, అది పూర్తిగా మధ్యలో ఉంది.

పాపాలు తప్పకుండా జరిగాయని, పాపాత్ములుగా అయిపోయారని మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు. సత్యయుగములో పుణ్య ఆత్మలు ఉంటారు. తండ్రే వచ్చి పావనంగా తయారుచేస్తారు, వారి పేరు మీద మీరు శివజయంతిని కూడా జరుపుతారు. ఇప్పుడు జయంతి అన్న పదమైతే అందరికీ వర్తిస్తుంది, అందుకే దానిని శివరాత్రి అని అంటారు. రాత్రి అనే మాట యొక్క అర్థమునైతే మీరు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. మంచి-మంచి విద్వాంసులు మొదలైనవారికెవరికీ శివరాత్రి అంటే ఏమిటో కూడా తెలియదు, కావున వారేమి జరుపుకుంటారు! రాత్రి యొక్క అర్థమేమిటి అనేది తండ్రి అర్థం చేయించారు. ఈ 5000 సంవత్సరాల చక్రమేదైతే ఉందో, అందులో సుఖము మరియు దుఃఖము యొక్క ఆట ఉంది. సుఖమును పగలు అని అంటారు, దుఃఖమును రాత్రి అని అంటారు. కావున రాత్రి మరియు పగలుకు మధ్యలో సంగమము వస్తుంది. అర్ధకల్పము ప్రకాశము, అర్ధకల్పము అంధకారము. భక్తిలోనైతే అన్నింటికీ చాలా సమయము పడుతుంది. ఇక్కడైతే ఒక్క క్షణము యొక్క విషయము. ఇక్కడ ఇది చాలా ఈజీ, ఇది సహజయోగము. మీరు మొదట ముక్తిధామానికి వెళ్ళాలి, ఆ తర్వాత మీరు జీవన్ముక్తి మరియు జీవనబంధనములో ఎంత సమయం ఉన్నారు అనేది పిల్లలైన మీకు గుర్తుంది, అయినా కానీ ఘడియ-ఘడియ మర్చిపోతారు. తండ్రి అర్థం చేయిస్తారు, యోగము అన్న పదము సరైనది కానీ వారిది దైహికమైన యోగము, ఇది పరమాత్మునితో ఆత్మల యొక్క యోగము. సన్యాసులు అనేక రకాల హఠయోగాలు మొదలైనవాటిని నేర్పిస్తారు, దానితో మనుష్యులు తికమకపడతారు. పిల్లలైన మీకు వీరు తండ్రి కూడా మరియు టీచర్ కూడా, కావున వీరితో యోగాన్ని జోడించవలసి ఉంటుంది కదా. టీచర్ ద్వారా చదువుకోవలసి ఉంటుంది. బిడ్డ పుట్టినప్పుడు మొదట తండ్రితో యోగము ఉంటుంది, 5 సంవత్సరాల తర్వాత టీచర్ తో యోగాన్ని జోడించవలసి ఉంటుంది, ఆ తర్వాత వానప్రస్థావస్థలో గురువుతో యోగాన్ని జోడించవలసి ఉంటుంది. ఈ ముగ్గురూ ముఖ్యముగా గుర్తుంటారు. అక్కడైతే వారు వేర్వేరుగా ఉంటారు. ఇక్కడ తండ్రి ఒకేసారి వచ్చి తండ్రిగానూ అవుతారు, టీచరుగానూ అవుతారు. ఇది అద్భుతము కదా. ఇటువంటి తండ్రినైతే తప్పకుండా గుర్తు చేయాలి. జన్మ-జన్మాంతరాలూ ఈ ముగ్గురినీ వేర్వేరుగా తలచుకుంటూ వచ్చారు. సత్యయుగములో కూడా తండ్రితో యోగము ఉంటుంది, ఆ తర్వాత టీచరుతో ఉంటుంది. చదువుకునేందుకైతే వెళ్తారు కదా. ఇకపోతే అక్కడ గురువు యొక్క అవసరం ఉండదు ఎందుకంటే అందరూ సద్గతిలో ఉంటారు. ఈ విషయాలన్నింటినీ స్మృతి చేయడంలో కష్టమేముంది! ఇది పూర్తిగా సహజము. దీనిని సహజ యోగము అని అంటారు. కానీ ఇది అసాధారణమైనది. తండ్రి అంటారు, నేను ఈ శరీరాన్ని తాత్కాలికంగా లోన్ గా తీసుకుంటాను, అది కూడా ఎంత తక్కువ సమయం తీసుకుంటాను. 60 సంవత్సరాల వయస్సులో వానప్రస్థావస్థ ఉంటుంది. 60 సంవత్సరాలు వచ్చాయంటే చేతికర్ర వస్తుంది అని అంటారు. ఈ సమయంలో అందరికీ చేతికర్ర ఉంది. అందరూ వానప్రస్థములోకి, నిర్వాణధామములోకి వెళ్తారు. అది మధురమైన ఇల్లు, అత్యంత మధురమైన ఇల్లు. దాని కోసమే ఎంతటి అపారమైన భక్తిని చేసారు. ఇప్పుడు చక్రమంతా తిరిగి వచ్చారు. మనుష్యులకు ఇదేమీ తెలియదు, ఇది లక్షల సంవత్సరాల చక్రము అని ఏదో అలా ప్రగల్భాలు పలికారు. ఇది లక్షల సంవత్సరాల విషయమైనట్లయితే ఇక విశ్రాంతి లభించదు, విశ్రాంతి లభించడమే కష్టమైపోయేది. మీకు విశ్రాంతి లభిస్తుంది, దానిని సైలెన్స్ హోమ్, నిరాకార లోకము అని అంటారు. ఇది స్థూలమైన, మధురమైన ఇల్లు. అది మూలధామము, మధురమైన ఇల్లు. ఆత్మ చాలా చిన్నని రాకెట్ వంటిది, దానికంటే వేగముగా పరిగెత్తేది ఇంకేదీ ఉండదు. ఇది అన్నింటికంటే వేగవంతమైనది. ఒక్క క్షణములో శరీరము వదలగానే పరిగెడుతుంది, ఇంకొక శరీరము తయారుగా ఉంటుంది. డ్రామానుసారంగా సమయము పూర్తయినప్పుడు ఆత్మ వెళ్ళవలసిందే. డ్రామా ఎంత ఏక్యురేట్ (సరియైనది), ఇందులో సరిగ్గాలేనిది అంటూ ఏదీ లేదు, ఇది మీకు తెలుసు. తండ్రి కూడా డ్రామానుసారంగా పూర్తిగా ఏక్యురేట్ సమయంలో వస్తారు. ఒక్క క్షణము యొక్క తేడా కూడా రాదు. వీరిలో తండ్రి అయిన భగవంతుడు ఉన్నారు అని ఎలా తెలుస్తుంది. వారెప్పుడైతే జ్ఞానాన్ని ఇస్తారో, పిల్లలకు కూర్చుని అర్థం చేయిస్తారో, అప్పుడు తెలుస్తుంది. శివరాత్రిని కూడా జరుపుకుంటారు కదా. శివుడినైన నేను ఎప్పుడు వస్తాను, ఎలా వస్తాను అనేది మీకైతే తెలియదు. శివరాత్రిని, కృష్ణరాత్రిని జరుపుకుంటారు. రాముని రాత్రిని జరుపుకోరు ఎందుకంటే తేడా ఏర్పడిపోయింది కదా. శివరాత్రితోపాటు శ్రీకృష్ణుని రాత్రిని కూడా జరుపుకుంటారు. కానీ వారికేమీ తెలియదు. ఇక్కడ ఉన్నదే ఆసురీ రావణ రాజ్యము. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. వీరు బాబా, వృద్ధులను బాబా అని అంటారు. చిన్న పిల్లలను బాబా అని అనరు. కొంతమంది ప్రేమతో పిల్లలను కూడా బాబా అని అంటారు. అలాగే వారు కూడా శ్రీకృష్ణుడిని ప్రేమతో అలా అనేసారు. ఎప్పుడైతే పెద్దయ్యి పిల్లలకు జన్మనిస్తారో అప్పుడు బాబా అని అంటారు. శ్రీకృష్ణుడు తాను స్వయమే యువరాజు, అతనికి పిల్లలు ఎక్కడి నుండి వచ్చారు. నేను వృద్ధుని తనువులోకి వస్తాను అనే తండ్రి అంటారు. ఇది శాస్త్రాల్లో కూడా ఉంది కానీ శాస్త్రాల్లోని అన్ని విషయాలు ఏక్యురేట్ గా ఉండవు, కొన్ని విషయాలు సరైనవి. బ్రహ్మా ఆయువు అనగా ప్రజాపిత బ్రహ్మా ఆయువు అని అంటారు. వారు తప్పకుండా ఈ సమయంలోనే ఉంటారు. బ్రహ్మా ఆయువు మృత్యులోకములో సమాప్తమవుతుంది. ఇది అమరలోకమేమీ కాదు. దీనిని పురుషోత్తమ సంగమయుగము అని అంటారు. ఇది పిల్లలైన మీ బుద్ధిలో తప్ప ఇంకెవరి బుద్ధిలోనూ ఉండలేదు.

తండ్రి కూర్చుని చెప్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ, మీకు మీ జన్మల గురించి తెలియదు, మీరు 84 జన్మలు తీసుకుంటారు అని నేను తెలియజేస్తాను. ఎలా తీసుకుంటారు? అది కూడా మీకు తెలిసిపోయింది. ప్రతి యుగము యొక్క ఆయువు 1250 సంవత్సరాలు మరియు ఒక్కొక్క యుగములో ఇన్ని-ఇన్ని జన్మలు తీసుకున్నారు. 84 జన్మల లెక్క ఉంది కదా. 84 లక్షల జన్మలైతే లెక్క ఉండదు. దీనిని 84 జన్మల చక్రము అని అంటారు, 84 లక్షల జన్మల విషయమైతే గుర్తుకు రానే రాదు. ఇక్కడ ఎంతటి అపారమైన దుఃఖము ఉంది. దుఃఖాన్ని ఇచ్చే పిల్లలు ఎటువంటివారు జన్మిస్తూ ఉంటారు. దీనిని ఘోర నరకము, పూర్తిగా ఛీ-ఛీ ప్రపంచము అని అంటారు. ఇప్పుడు మనము కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. పాపాలు అంతమైపోతే మనం పుణ్యాత్ములుగా అయిపోతాము. ఇప్పుడు ఇక ఏ పాపాలూ చేయకూడదు. ఒకరిపై ఒకరు కామ ఖడ్గాన్ని ఉపయోగించడము, ఇది ఆదిమధ్యాంతాలు దుఃఖాన్ని ఇవ్వడమే. ఇప్పుడు ఈ రావణ రాజ్యము పూర్తి అవుతుంది. ఇప్పుడు ఇది కలియుగాంతము. ఈ మహాభారీ యుద్ధము చివరి యుద్ధము. ఇక ఆ తర్వాత ఎటువంటి యుద్ధాలు ఉండవు. అక్కడ ఎటువంటి యజ్ఞాలూ రచింపబడవు. యజ్ఞాన్ని రచించినప్పుడు అందులో హోమము చేస్తారు. అలాగే తండ్రి ఈ రుద్ర యజ్ఞాన్ని ఏదైతే రచించారో, ఇందులో పిల్లలు తమ పాత సామాగ్రినంతటినీ స్వాహా చేసేస్తారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు, ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము. రుద్రుడు అని శివుడినే అంటారు. రుద్రమాల అని అంటారు కదా. నివృత్తి మార్గము వారికి ప్రవృత్తి మార్గపు ఆచార-వ్యవహారాల గురించేమీ తెలియదు. వారు ఇళ్ళు-వాకిళ్ళను వదిలి అడవుల్లోకి వెళ్ళిపోతారు. దాని పేరే సన్యాసము. దేని సన్యాసము? ఇళ్ళు-వాకిళ్ళ సన్యాసము. ఒట్టి చేతులతో వెళ్తారు. మొదట గురువులు ఎంతగానో పరీక్షిస్తారు, పనులు చేయిస్తారు. పూర్వము భిక్షలో కూడా కేవలం పిండినే తీసుకునేవారు, వండినవి తీసుకునేవారు కాదు. వారు అడవుల్లోనే ఉండాలి, అక్కడ కందమూలాలు, ఫలాలు లభిస్తాయి. ఈ గాయనం కూడా ఉంది. సతోప్రధాన సన్యాసులుగా ఉన్నప్పుడు అవి తినేవారు. ఇప్పుడైతే ఏమేమి చేస్తూ ఉంటారో ఇక అడగకండి. దీని పేరే వికారీ ప్రపంచము. అది నిర్వికారీ ప్రపంచము. కావున స్వయాన్ని వికారులుగా అర్థం చేసుకోవాలి కదా. తండ్రి అంటారు, సత్యయుగాన్ని శివాలయము అని, నిర్వికారీ ప్రపంచము అని అంటారు. ఇక్కడైతే అందరూ పతిత మనుష్యులుగానే ఉన్నారు, అందుకే దేవీ-దేవతలకు బదులుగా పేరే హిందువులు అని పెట్టేసారు. తండ్రి అయితే అన్ని విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. వాస్తవానికి మీరు అనంతమైన తండ్రి పిల్లలు. వారు మీకు 21 జన్మల వారసత్వాన్ని ఇస్తారు. కావున తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - జన్మజన్మాంతరాల పాపాలు మీ శిరస్సుపై ఉన్నాయి. పాపాల నుండి ముక్తులుగా అయ్యేందుకే మీరు పిలుస్తారు. సాధు-సన్యాసులు మొదలైనవారందరూ - ఓ పతిత-పావనా అని పిలుస్తారు. అర్థమేమీ తెలియదు, ఊరికే అలా గానం చేస్తూ ఉంటారు, చప్పట్లు కొడుతూ ఉంటారు. పరమాత్మతో యోగాన్ని ఎలా జోడించాలి, వారిని ఎలా కలుసుకోవాలి అని ఎవరైనా వారిని అడిగితే, అతను సర్వవ్యాపి అని అనేస్తారు. వారు చెప్పే దారి ఇదేనా! వేద-శాస్త్రాలను చదవడం ద్వారా భగవంతుడు లభిస్తారు అని అనేస్తారు. కానీ తండ్రి అంటారు, నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత డ్రామా ప్లాన్ అనుసారంగా వస్తాను. ఈ డ్రామా రహస్యము గురించి తండ్రికి తప్ప ఇంకెవరికీ తెలియదు. లక్షల సంవత్సరాల డ్రామా అయితే ఉండలేదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇది 5000 సంవత్సరాల విషయము. కల్పపూర్వము కూడా బాబా మన్మనాభవ అని అన్నారు. ఇది మహామంత్రము. ఇది మాయపై విజయాన్ని ప్రాప్తి చేయించే మంత్రము. తండ్రే కూర్చుని అర్థాన్ని అర్థం చేయిస్తారు. ఇంకెవరూ అర్థాన్ని అర్థం చేయించరు. సర్వుల సద్గతిదాత ఒక్కరే అని అంటూ ఉంటారు కూడా కదా. మానవమాత్రులు ఎవ్వరూ అలా కారు. ఇది దేవతల విషయము కూడా కాదు. అక్కడైతే అంతా సుఖమే సుఖము ఉంది. అక్కడ భక్తి ఏమీ చేయరు. భగవంతుడిని కలుసుకునేందుకే భక్తి చేయడం జరుగుతుంది. సత్యయుగములో భక్తి అనేది ఉండదు ఎందుకంటే అక్కడ 21 జన్మల వారసత్వము లభించి ఉంది. అందుకే దుఃఖములో అందరూ స్మరణ చేస్తారు... అని అంటూ ఉంటారు. ఇక్కడైతే అపారమైన దుఃఖము ఉంది. ఘడియ-ఘడియ భగవంతుడా, దయ చూపించండి అని అంటారు. ఈ కలియుగీ దుఃఖమయమైన ప్రపంచము సదా ఉండదు. సత్య, త్రేతాయుగాలు గతించిపోయాయి, అవి మళ్ళీ వస్తాయి. లక్షల సంవత్సరాల విషయమైతే కనీసం గుర్తు కూడా ఉండదు. ఇప్పుడు తండ్రి అయితే మొత్తం జ్ఞానమంతటినీ ఇస్తారు, తమ పరిచయాన్ని కూడా ఇస్తారు మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాల రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తారు. ఇది 5000 సంవత్సరాల విషయము. ఇది పిల్లలైన మీ ధ్యాసలోకి వచ్చింది. ఇప్పుడైతే పరాయి రాజ్యములో ఉన్నారు. మీకు మీ రాజ్యము ఉండేది. ఇక్కడైతే యుద్ధాలు చేసి తమ రాజ్యాలు తీసుకుంటారు, మారణాయుధాలతో హింసాయుతంగా తమ రాజ్యాలు తీసుకుంటారు. పిల్లలైన మీరైతే యోగబలముతో మీ రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నారు. మీకు సతోప్రధానమైన ప్రపంచము కావాలి. పాత ప్రపంచము అంతమై కొత్త ప్రపంచము తయారవుతుంది, దీనిని కలియుగ పాత ప్రపంచము అంటారు. సత్యయుగము కొత్త ప్రపంచము. ఇది కూడా ఎవరికీ తెలియదు. సన్యాసులు అంటారు - ఇదంతా మీ ఊహ, ఇక్కడే సత్యయుగము ఉంది, ఇక్కడే కలియుగము ఉంది అని. ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు, తండ్రి గురించి తెలిసినవారు ఒక్కరు కూడా లేరు. ఒకవేళ ఎవరికైనా తెలిసి ఉంటే వారు తన పరిచయాన్ని ఇచ్చేవారు. సత్య, త్రేతాయుగాలంటే ఏమిటి అనేది ఎవరికీ అర్థం కాదు. పిల్లలైన మీకు తండ్రి బాగా అర్థం చేయిస్తూ ఉంటారు. తండ్రికే అన్నీ తెలుసు, వారు అన్నీ తెలిసినవారు అనగా నాలెడ్జ్ ఫుల్. వారు మనుష్య సృష్టికి బీజరూపుడు. వారు జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు. వారి ద్వారానే మనకు వారసత్వము లభించనున్నది. తండ్రి జ్ఞానములో తమ సమానముగా తయారుచేస్తారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఇది పాపాల నుండి విముక్తులయ్యే సమయము, అందుకే ఇప్పుడు ఎటువంటి పాపాలు చేయకూడదు. పాత సామాగ్రినంతటినీ ఈ రుద్ర యజ్ఞములో స్వాహా చేయాలి.

2. ఇప్పుడు ఇది వానప్రస్థావస్థ, అందుకే తండ్రి, టీచరుతోపాటు సద్గురువును కూడా స్మృతి చేయాలి. మధురమైన ఇంటికి వెళ్ళేందుకు ఆత్మను సతోప్రధానముగా (పావనంగా) తయారుచేసుకోవాలి.

వరదానము:- మీ సూక్ష్మ బలహీనతలను చింతన చేసి పరివర్తన చేసే స్వచింతక భవ
కేవలం జ్ఞాన పాయింట్లను రిపీట్ చెయ్యటము, వినటము లేక వినిపించటమే స్వచింతన కాదు, కానీ స్వచింతన అనగా తమ సూక్ష్మ బలహీనతలను, తమ చిన్న-చిన్న పొరపాట్లను చింతన చేసి తొలగించటము, పరివర్తన చెయ్యటము - ఇదే స్వచింతకులుగా అవ్వటము. జ్ఞాన మననమునైతే పిల్లలందరూ చాలా బాగా చేస్తారు కానీ జ్ఞానాన్ని స్వయము పట్ల ఉపయోగించి ధారణా స్వరూపులుగా అవ్వటము, స్వయాన్ని పరివర్తన చేసుకోవటము, దీనికే ఫైనల్ రిజల్టులో మార్కులు లభిస్తాయి.
స్లోగన్:- ప్రతి సమయము చేసేవారు, చేయించేవారు అయిన తండ్రి గుర్తున్నట్లయితే ‘నేను’ అనేదానికి సంబంధించిన అభిమానము రాలేదు.

 

మురళి అంటే ఏమిటి?

మురళి బ్రహ్మకుమారీల దైనిక ఆధ్యాత్మిక బోధన, ఇది ప్రతి ఉదయం మధుబన్ నుండి ప్రచురించబడుతుంది. ఇక్కడ మీరు ఈరోజు మురళిని తెలుగులో చదవవచ్చు, ఆడియో వినవచ్చు మరియు PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధ్యయనానికి సహాయంగా పాఠ్యాన్ని హైలైట్ చేయవచ్చు — మీ గుర్తులు ఈ బ్రౌజర్‌లోనే సురక్షితంగా ఉంటాయి.

28 భాషల్లో మురళి

Daily Murli · Madhuban మూలం: మధుబన్ మురళి విభాగం ఇది స్వతంత్ర రీడర్ యాప్, అధికారిక వెబ్‌సైట్ కాదు.