| 17-10-2024 |
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
|
మధువనం |
| ‘‘మధురమైన పిల్లలూ - స్మృతి యాత్రపై పూర్తి అటెన్షన్ ను పెట్టండి, దీని ద్వారానే మీరు సతోప్రధానముగా అవుతారు’’ | |
| ప్రశ్న:- | తండ్రి తమ పిల్లలపై ఏ కృపను చూపిస్తారు? |
| జవాబు:- | తండ్రి పిల్లల కళ్యాణము కొరకు ఏ డైరెక్షన్లు అయితే ఇస్తారో, ఆ డైరెక్షన్లు ఇవ్వడమే వారి కృప. తండ్రి ఇచ్చే మొట్టమొదటి డైరెక్షన్ - మధురమైన పిల్లలూ, దేహీ-అభిమానులుగా అవ్వండి. దేహీ-అభిమానులు చాలా శాంతిగా ఉంటారు, వారి ఆలోచనలు ఎప్పుడూ తప్పుగా నడవలేవు. |
| ప్రశ్న:- | పిల్లలు పరస్పరం ఏ సెమినార్ ను చేసుకోవాలి? |
| జవాబు:- | తిరగడానికి ఎప్పుడు వెళ్ళినా, స్మృతి యాత్ర యొక్క రేస్ ను చేయండి మరియు తర్వాత కూర్చుని పరస్పరం సెమినార్ చేసుకోండి - ఎవరు ఎంత సమయం తండ్రిని స్మృతి చేసారు అని. ఇక్కడ స్మృతి కొరకు ఏకాంతము కూడా చాలా బాగుంది. |
ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతారు - మీరు ఏం చేస్తున్నారు? అని. ఆత్మిక పిల్లలు అంటారు - బాబా, సతోప్రధానముగా ఉన్న మేమే తమోప్రధానముగా అయిపోయాము, మళ్ళీ బాబా, మీ శ్రీమతమనుసారంగా మేము సతోప్రధానముగా తప్పకుండా అవ్వాలి, బాబా, ఇప్పుడు మీరు దారి చూపించారు. ఇది కొత్త విషయమేమీ కాదు. ఇది అత్యంత పాత విషయము. అన్నింటికన్నా పాతది స్మృతి యాత్ర, ఇందులో షో చేయవలసిన విషయమేమీ లేదు. ప్రతి ఒక్కరూ తమను తాము ఆంతరికంగా ప్రశ్నించుకోండి - మేము ఎంతవరకు బాబాను స్మృతి చేస్తున్నాము? ఎంతవరకు సతోప్రధానముగా అయ్యాము? ఏం పురుషార్థము చేస్తున్నాము? అని. చివరి సమయములో ఎప్పుడైతే అంతిమము వస్తుందో అప్పుడు సతోప్రధానముగా అవుతారు. దాని సాక్షాత్కారము కూడా జరుగుతూ ఉంటుంది. ఎవరు ఏమి చేసినా వారు అది తమ కొరకే చేసుకుంటారు. తండ్రి కూడా కృప ఏమీ చూపించరు. పిల్లల కళ్యాణార్థము బాబా పిల్లలకు డైరెక్షన్లు ఇస్తారు కదా, అదే బాబా చూపించే కృప. తండ్రి ఉన్నదే కళ్యాణకారి. కొంతమంది పిల్లలు జ్ఞానాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. దేహాభిమానులు అహంకారులుగా ఉంటారు అన్నది బాబాకు తెలుస్తుంది. దేహీ-అభిమానులు చాలా శాంతిగా ఉంటారు, వారికి ఎప్పుడూ తప్పుడు ఆలోచనలు రావు. తండ్రి అయితే అన్ని విధాలుగానూ పురుషార్థము చేయిస్తూ ఉంటారు. మాయ కూడా చాలా శక్తివంతమైనది, అది మంచి-మంచి పిల్లలపై కూడా దాడి చేస్తుంది, అందుకే బ్రాహ్మణుల మాల తయారవ్వదు. ఈ రోజు చాలా బాగా స్మృతి చేస్తారు, రేపు దేహ అహంకారములోకి ఎలా వచ్చేస్తారంటే, ఊసరవెల్లిలా అయిపోతారు. ఊసరవెల్లికి అహంకారము చాలా ఉంటుంది. సురమండలము (దేవతల సమూహము) లోని దివ్యత్వము, స్వరాలు దేహ-అభిమానము ఉన్న ఊసరవెల్లికి ఏం అర్థమవుతుంది అని ఒక నానుడి కూడా ఉంది. దేహాభిమానము చాలా అసత్యమైనది. ఎంతగానో కష్టపడవలసి ఉంటుంది. శివబాబా అయితే అంటారు - నేను అతి వినమ్రుడనైన సేవకుడిని. అలాగని స్వయాన్ని సేవకులము అని చెప్పుకుంటూ అధికారాన్ని నడుపుతూ ఉండడం కాదు. తండ్రి అంటారు - మధురాతి మధురమైన పిల్లలూ, సతోప్రధానముగా తప్పకుండా అవ్వాలి. ఇది చాలా సహజము, ఇందులో మాట్లాడటానికేమీ లేదు. నోటితో ఏమీ మాట్లాడకూడదు. ఎక్కడికైనా వెళ్ళండి, లోలోపల స్మృతి చేస్తూ ఉండాలి. అలాగని ఇక్కడ కూర్చుంటే బాబా సహాయం చేస్తారని కాదు, అసలు బాబా వచ్చిందే సహాయం చేయడానికి. తండ్రికైతే ఈ ఆలోచన ఉంటుంది - పిల్లలు ఎక్కడా ఎటువంటి తప్పూ చేయకూడదు అని. మాయ ఇక్కడే దెబ్బ వేసేస్తుంది. దేహాభిమానము చాలా-చాలా చెడ్డది. దేహాభిమానములోకి రావడం వలన పూర్తిగా నేలపైకి వచ్చి పడిపోయారు. బాబా అంటారు, ఇక్కడకు వచ్చి కూర్చున్నప్పుడు కూడా అత్యంత ప్రియమైన తండ్రిని స్మృతి చేయండి. తండ్రి అంటారు, నేనే పతిత-పావనుడిని, నన్ను స్మృతి చేయడముతో, ఈ యోగాగ్నితో మీ జన్మ-జన్మాంతరాల పాపాలు భస్మమవుతాయి. ఎవరికైనా సరే బాగా అర్థం చేయించగలిగేలాంటి అవస్థకు పిల్లలు ఇప్పుడింకా చేరుకోలేదు. జ్ఞాన ఖడ్గములో యోగము యొక్క పదును కావాలి. లేకపోతే ఖడ్గము ఎందుకూ పనికి రాదు. ముఖ్యమైన విషయమే స్మృతి యాత్ర. చాలామంది పిల్లలు తప్పుడు వ్యాపారాలలో నిమగ్నమై ఉంటారు, స్మృతియాత్రలో ఉండరు మరియు చదువు చదవరు, అందుకే దీని కోసం సమయం దొరకదు. తండ్రి అంటారు, మీ పదవినే పోగొట్టుకునే విధంగా వ్యాపార-వ్యవహారాల వెనుక కష్టపడకండి. మీ భవిష్యత్తునైతే తయారుచేసుకోవాలి కదా. కానీ సతోప్రధానముగా అవ్వాలి. ఇందులోనే చాలా శ్రమ ఉంది. చాలా పెద్ద-పెద్ద మ్యూజియంలు మొదలైనవాటిని సంభాళించేవారు ఉన్నారు కానీ వారు స్మృతియాత్రలో ఉండరు. బాబా అర్థం చేయించారు - స్మృతియాత్రలో పేదవారు మరియు బంధనములో ఉన్నవారు ఎక్కువగా ఉంటారు, వారు ఘడియ-ఘడియ శివబాబాను స్మృతి చేస్తూ ఉంటారు. శివబాబా, మా ఈ బంధనాలను అంతం చేయండి అని అంటూ ఉంటారు. అబలలపై అత్యాచారాలు జరుగుతాయి అని కూడా చెప్పుకుంటూ ఉంటారు.
పిల్లలైన మీరు చాలా మధురముగా అవ్వాలి. సత్యాతి-సత్యమైన విద్యార్థులుగా అవ్వండి. మంచి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, వారు ఏకాంతములో తోటలోకి వెళ్ళి చదువుకుంటారు. మీకు కూడా తండ్రి చెప్తున్నారు - ఎక్కడికైనా తిరగడానికి వెళ్ళండి కానీ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేయండి. స్మృతి యాత్రపై అభిరుచిని పెట్టుకోండి. ఆ ధనాన్ని సంపాదించడముతో పోలిస్తే ఈ అవినాశీ ధనమైతే చాలా-చాలా ఉన్నతమైనది. ఆ వినాశీ ధనమైతే ఎంతైనా బూడిద అయిపోనున్నది. బాబాకు తెలుసు - పిల్లలు పూర్తి సేవను చేయడం లేదు, స్మృతిలో కష్టం మీద ఉంటున్నారు. సత్యమైన సేవనేదైతే చేయాలో అది చేయడం లేదు, స్థూల సేవ వైపుకు అటెన్షన్ వెళ్ళిపోతుంది. డ్రామానుసారంగానే జరుగుతున్నా సరే, బాబా పురుషార్థమైతే చేయిస్తారు కదా. తండ్రి అంటారు, ఏ పని చేస్తున్నా, బట్టలు కుడుతున్నా సరే తండ్రిని స్మృతి చేయండి. స్మృతిలోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది. బాబా అర్థం చేయించారు - బలశాలితో మాయ కూడా బలశాలిగా అయి కొట్లాడుతుంది. బాబా తమ విషయాన్ని కూడా చెప్తారు. నేను బలశాలిని, నేను బెగ్గర్ నుండి ప్రిన్స్ గా అవ్వనున్నాను అని నాకు తెలుసు, అయినా కానీ మాయ ఎదిరిస్తూ ఉంటుంది. మాయ ఎవ్వరినీ విడిచిపెట్టదు. పహిల్వాన్లతోనైతే ఇంకా ఎక్కువగా కొట్లాడుతుంది. కొంతమంది పిల్లలు తమ దేహ-అహంకారములో చాలా ఉంటారు. బాబా ఎంత నిరహంకారిగా ఉంటారు. వారు అంటారు, నేను కూడా పిల్లలైన మీకు నమస్కరించే సేవకుడిని. వాళ్ళు అయితే తమను తాము చాలా గొప్పగా భావిస్తారు. ఆ దేహ అహంకారమంతటినీ తెంచివేయాలి. చాలామందిలో అహంకారము యొక్క భూతము కూర్చుని ఉంది. తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఇక్కడైతే చాలా మంచి అవకాశము ఉంది. అటూ, ఇటూ తిరగడానికి కూడా బాగుంది, తీరిక కూడా ఉంది. మీరు తిరగడానికి వెళ్ళినా, తర్వాత ఒకరినొకరు ప్రశ్నించుకోండి - ఎంత సమయం స్మృతిలో ఉన్నారు? బుద్ధి ఇంకెటువైపుకూ వెళ్ళలేదు కదా? అని. పరస్పరం ఈ సెమినార్ చేసుకోవాలి. స్త్రీ వేరుగా, పురుషులు వేరుగా ఉండవచ్చు. స్త్రీలు ముందు ఉండాలి, పురుషులు వెనక ఉండాలి, ఎందుకంటే మాతలను సంభాళించాలి కావున మాతలను ముందుంచాలి. చాలా మంచి ఏకాంతము ఉంది. సన్యాసులు కూడా ఏకాంతములోకి వెళ్ళిపోతారు. సతోప్రధాన సన్యాసులు ఎవరైతే ఉండేవారో, వారు చాలా నిర్భయంగా ఉండేవారు, జంతువులు మొదలైనవాటికి భయపడేవారు కాదు. తమ నషాలో ఉండేవారు. ఇప్పుడు తమోప్రధానముగా అయిపోయారు. స్థాపించబడే ప్రతి ధర్మము మొదట సతోప్రధానముగా ఉంటుంది, ఆ తర్వాత రజో, తమోలలోకి వస్తారు. సతోప్రధాన సన్యాసులు ఎవరైతే ఉండేవారో వారు బ్రహ్మము యొక్క నషాలో నిమగ్నమై ఉండేవారు. వారిలో ఎంతో ఆకర్షణ ఉండేది. వారికి అడవులలో భోజనం లభించేది. రోజురోజుకు తమోప్రధానముగా అవుతుండడం వలన శక్తి తగ్గిపోతూ ఉంటుంది.
బాబా సలహాను ఇస్తున్నారు - ఇక్కడ పిల్లలకు తమ ఉన్నతి కొరకు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడికి మీరు సంపాదించుకునేందుకే వస్తారు. కేవలం బాబాను కలుసుకోవడం వల్ల సంపాదన ఏమీ జరగదు. బాబాను స్మృతి చేస్తే సంపాదన జరుగుతుంది. బాబా ఏదో ఆశీర్వదిస్తారని భావించకండి, అలాంటిదేమీ లేదు. ఆ సాధువులు మొదలైనవారు ఆశీర్వదిస్తారు, అయినా కానీ మీరు కిందకు దిగజారవలసిందే. ఇప్పుడు తండ్రి అంటారు, జిన్ను భూతములా మీ బుద్ధియోగాన్ని పైన జోడించండి. జిన్ను భూతము కథ ఉంది కదా. నాకు ఏదైనా పని ఇవ్వు అని అంటుంది. బాబా కూడా అంటున్నారు - స్మృతిలో ఉన్నట్లయితే మీ నావ తీరానికి చేరుకుంటుంది అని మీకు డైరెక్షన్ ను ఇస్తున్నాను. మీరు సతోప్రధానముగా తప్పకుండా అవ్వాలి. మాయ ఎంతగా కష్టపెట్టినా కానీ మేమైతే శ్రేష్ఠమైన బాబాను తప్పకుండా స్మృతి చేస్తాము అని అంటూ ఈ విధంగా లోలోపల బాబా మహిమను చేస్తూ బాబాను స్మృతి చేస్తూ ఉండండి. మానవమాత్రులెవ్వరినీ స్మృతి చేయకండి. భక్తి మార్గపు ఆచారాలేవైతే ఉన్నాయో, అవి జ్ఞాన మార్గములో ఉండవు. తండ్రి శిక్షణను ఇస్తున్నారు - స్మృతియాత్రలో చురుకుగా ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన విషయము ఇదే. సతోప్రధానముగా అవ్వాలి. తండ్రి డైరెక్షన్ లభిస్తుంది - అటూ, ఇటూ తిరిగేందుకు వెళ్ళినప్పుడు కూడా స్మృతిలో ఉండండి, తద్వారా ఇల్లు కూడా గుర్తుంటుంది, రాజ్యము కూడా గుర్తుంటుంది. అంతేకానీ స్మృతిలో కూర్చుంటూ-కూర్చుంటూ పడిపోవడం కాదు. అది హఠయోగమైపోతుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేయాలి, ఇది స్పష్టమైన విషయము. కొంతమంది పిల్లలు కూర్చుంటూ-కూర్చుంటూ పడిపోతారు. అందుకే బాబా అంటారు, నడుస్తూ, తిరుగుతూ, తింటూ, తాగుతూ స్మృతిలో ఉండండి. అంతేకానీ అలా కూర్చుంటూ-కూర్చుంటూ స్పృహ కోల్పోవడం కాదు. దీని వల్ల మీ పాపాలేమీ అంతమవ్వవు. ఇలా కూడా మాయ విఘ్నాలు ఎన్నో కలుగుతాయి. ఈ భోగ్ మొదలైనవి కూడా ఆచార, వ్యవహారాలే, అంతేకానీ ఇందులో ఏమీ లేదు. ఇది జ్ఞానమూ కాదు, యోగమూ కాదు. సాక్షాత్కారాల అవసరమేమీ లేదు. ఎంతోమందికి సాక్షాత్కారాలు జరిగాయి, వారు ఈ రోజు లేరు. మాయ చాలా శక్తివంతమైనది. సాక్షాత్కారాల ఆశను కూడా ఎప్పుడూ పెట్టుకోకూడదు. ఇందులోనైతే సతోప్రధానముగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయాలి. మీకు డ్రామా గురించి కూడా తెలుసు, ఈ అనాది డ్రామా రచింపబడి ఉంది, ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. దీనిని కూడా అర్థం చేసుకోవాలి మరియు తండ్రి ఏ డైరెక్షన్లు అయితే ఇస్తారో, వాటిపై కూడా నడవాలి. మేము రాజయోగాన్ని నేర్చుకునేందుకు మళ్ళీ వచ్చాము అని పిల్లలకు తెలుసు. ఇది భారత్ విషయమే. ఇదే తమోప్రధానముగా అయ్యింది, మళ్ళీ ఇదే సతోప్రధానముగా అవ్వాలి. తండ్రి కూడా భారత్ లోకే వచ్చి సర్వుల సద్గతిని చేస్తారు. ఇది చాలా అద్భుతమైన ఆట. ఇప్పుడు తండ్రి అంటారు, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావించండి, మీరు 84 జన్మల చక్రాన్ని చుట్టి పూర్తిగా 5000 సంవత్సరాలు అవుతోంది, ఇప్పుడు ఇక తిరిగి వెళ్ళాలి. ఈ విషయాలను ఇంకెవ్వరూ చెప్పలేరు. పిల్లలైన మీరు కూడా నంబరువారు పురుషార్థానుసారముగా నిశ్చయబుద్ధి కలవారిగా అవుతుంటారు. ఇది అనంతమైన పాఠశాల. పిల్లలకు తెలుసు - అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు, వారు ఉస్తాదు టీచర్ అని, చాలా పెద్ద ఉస్తాదు అని పిల్లలకు తెలుసు. వారు చాలా ప్రేమగా అర్థం చేయిస్తారు. ఎంతమంది మంచి-మంచి పిల్లలు ఆరింటి (6 గం.) వరకూ కూడా విశ్రాంతిగా పడుకుని ఉంటారు. మాయ పూర్తిగా ముక్కు పట్టుకుంటుంది. వారు తమ అధికారాన్ని నడిపిస్తూ ఉంటారు. ప్రారంభములో మీరు భట్టీలో ఉన్నప్పుడు మమ్మా, బాబా కూడా అన్ని సేవలూ చేసేవారు. ఎటువంటి కర్మలను మనం చేస్తామో మనల్ని చూసి ఇతరులు కూడా చేస్తారు. మహారథులు, గుర్రపు స్వారీవారు, పాదచారులు నంబరువారుగా ఉన్నారని బాబాకు తెలుసు. కొంతమంది పిల్లలు చాలా విశ్రాంతిగా ఉంటారు, లోపలే పడుకుని ఉంటారు, ఫలానావారు ఎక్కడ ఉన్నారు? అని బయటి నుండి ఎవరైనా అడిగితే, లేరు అని చెప్తారు, కానీ లోపలే పడుకుని ఉంటారు. ఏమేమి జరుగుతూ ఉంటాయో బాబా అర్థం చేయిస్తారు. సంపూర్ణముగా అయితే ఎవ్వరూ అవ్వలేదు. ఎంతగా డిస్సర్వీస్ చేసేస్తారు. నిజానికి బాబా గురించి గాయనమేమి ఉందంటే - మీరు కొట్టండి లేక ప్రేమించండి, కానీ మేము మాత్రం మీ ద్వారాన్ని వదలము అని. కానీ ఇక్కడైతే చిన్న విషయానికే అలిగేస్తారు. యోగములో చాలా లోపము ఉంది. బాబా పిల్లలకు ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు, కానీ వ్రాయగలిగే శక్తి ఎవరిలోనూ లేదు. యోగము ఉన్నట్లయితే వ్రాసినదానిలో కూడా శక్తి నిండుతుంది. తండ్రి అంటారు, గీతా భగవానుడు శివుడు, అంతేకానీ శ్రీకృష్ణుడు కాదు అని మంచి రీతిలో నిరూపించండి.
బాబా వచ్చి పిల్లలైన మీకు అన్ని విషయాల అర్థాన్ని అర్థం చేయిస్తారు. పిల్లలకు ఇక్కడ నషా ఎక్కుతుంది, మళ్ళీ బయటకు వెళ్ళడంతో అంతమైపోతుంది, ఎంతో సమయాన్ని వ్యర్థం చేస్తారు. మేము సంపాదించి యజ్ఞానికి ఇవ్వాలి అన్న ఆలోచనతో మీ సమయాన్ని వ్యర్థం చేయకండి. తండ్రి అంటారు, నేనైతే పిల్లలైన మీ కళ్యాణము చేయడానికి వచ్చాను, కానీ మీరు మిమ్మల్ని మీరు నష్టపరుచుకుంటున్నారు. యజ్ఞములో అయితే కల్పపూర్వము ఎవరు సహాయం చేసారో వారు చేస్తూ ఉంటారు, మున్ముందు కూడా చేస్తూ ఉంటారు. ఇది చేయాలి, అది చేయాలి అంటూ మీరు ఎందుకు తల బాదుకుంటారు. డ్రామాలో నిశ్చితమై ఉంది - ఎవరైతే బీజం నాటి ఉంటారో వారు ఇప్పుడు కూడా నాటుతారు. యజ్ఞము గురించి మీరు చింతన చేయకండి, మీ కళ్యాణము చేసుకోండి. మీకు మీరు సహాయం చేసుకోండి. భగవంతుడికి మీరు ఏమైనా సాయం చేస్తారా? భగవంతుడి నుండి మీరు తీసుకుంటారా లేక ఇస్తారా? ఈ ఆలోచన కూడా రాకూడదు. బాబా అయితే అంటారు - ప్రియమైన పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఇప్పుడు మీరు సంగమయుగములో నిలబడి ఉన్నారు. సంగమములోనే మీరు రెండు వైపులా చూడగలుగుతారు. ఇక్కడ ఎంతమంది మనుష్యులు ఉన్నారు. సత్యయుగములో ఎంత కొద్దిమంది మనుష్యులు ఉంటారు. రోజంతా సంగమములో నిలబడి ఉండాలి. బాబా మనల్ని ఎలాంటివారిని ఎలా తయారుచేస్తున్నారు. బాబా పాత్ర ఎంత అద్భుతమైనది. తిరగండి, విహరించండి, కానీ స్మృతి యాత్రలో ఉండండి. చాలామంది పిల్లలు సమయాన్ని వ్యర్థం చేస్తారు. స్మృతి యాత్ర ద్వారానే నావ తీరానికి చేరుకోనున్నది. కల్పపూర్వము కూడా పిల్లలకు ఈ విధంగా అర్థం చేయించాను. డ్రామా రిపీట్ అవుతూ ఉంటుంది. లేస్తూ, కూర్చుంటూ మొత్తం కల్పవృక్షమంతా బుద్ధిలో గుర్తుండాలి, ఇదే చదువు. ఇకపోతే వ్యాపారాలు మొదలైనవైతే చేసుకోండి కానీ చదువు కోసం సమయాన్ని కేటాయించాలి. మధురమైన తండ్రిని మరియు స్వర్గాన్ని స్మృతి చేయండి. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా అంతిమ స్థితిని బట్టి గతి ఏర్పడుతుంది. బాబా, ఇక మేము మీ వద్దకు వచ్చేస్తున్నాము, అంతే! బాబా స్మృతిలో శ్వాస కూడా సుఖవంతముగా అయిపోతుంది. బ్రహ్మజ్ఞానుల శ్వాస కూడా సుఖవంతముగా (సుఖమయమైనదిగా) అయిపోతుంది. బ్రహ్మ తత్త్వము యొక్క స్మృతిలోనే ఉంటారు, కానీ బ్రహ్మలోకములోకి ఎవరూ వెళ్ళరు. తమకు తామే శరీరము వదిలేయడమనేది జరగవచ్చు. కొంతమంది ఉపవాసం పెట్టుకుని శరీరాన్ని వదిలేస్తారు, వారు దుఃఖితులుగా అయి మరణిస్తారు. బాబా అంటారు, తినండి తాగండి, బాబాను స్మృతి చేయండి, తద్వారా అంతిమ స్థితిని బట్టి గతి ఏర్పడుతుంది. మరణించడమైతే మరణించాలి కదా. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. సదా గుర్తుండాలి - ఏ కర్మలైతే నేను చేస్తానో నన్ను చూసి ఇతరులు చేస్తారు... డిస్సర్వీస్ అయ్యే విధంగా విశ్రాంతి ప్రియులుగా అవ్వకూడదు. చాలా-చాలా నిరహంకారులుగా ఉండాలి. తమకు తామే సహాయం చేసుకుని తమ కళ్యాణాన్ని చేసుకోవాలి.
2. స్మృతియాత్ర కొరకు మరియు చదువు కొరకు అసలు సమయమే లభించనంతగా వ్యాపార-వ్యవహారాలలో నిమగ్నమైపోకూడదు. దేహాభిమానము చాలా అసత్యమైనది మరియు చెడ్డది, దానిని వదిలి దేహీ-అభిమానులుగా ఉండేందుకు కృషి చేయాలి.
| వరదానము:- |
ఏ విషయమునైనా కళ్యాణ భావనతో చూసే మరియు వినే పరదర్శన ముక్త భవ సంగఠన ఎంతగా పెద్దదిగా అవుతూ ఉంటుందో, విషయాలు కూడా అంతగానే పెద్దవిగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే చూస్తూ కూడా చూడకుండా ఉంటారో, వింటూ కూడా వినకుండా ఉంటారో, అప్పుడే రక్షణ ఉంటుంది. తమ స్వచింతనలో ఉండాలి. స్వచింతన చేసే ఆత్మ పరదర్శనము నుండి విముక్తి అయిపోతుంది. ఒకవేళ ఏ కారణంగానైనా వినవలసి వస్తే, అక్కడ మీ బాధ్యత ఉంది అని భావించినట్లయితే ముందుగా మీ బ్రేక్ ను పవర్ ఫుల్ చేసుకోండి. చూసారు, విన్నారు, ఎంత వీలైతే అంత కళ్యాణము చేసారు మరియు ఫుల్ స్టాప్. |
| స్లోగన్:- | తమ సంతుష్టకరమైన, సంతోషకరమైన జీవితముతో ప్రతి అడుగులోనూ సేవ చేసేవారే సత్యమైన సేవాధారులు. |