| 18-10-2024 |
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
|
మధువనం |
| ‘‘మధురమైన పిల్లలూ - తండ్రి మిమ్మల్ని పుష్పాల వలె తయారుచేయడానికి వచ్చారు, పుష్పాలవంటి పిల్లలైన మీరు ఎప్పుడూ ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వలేరు, సదా సుఖాన్ని ఇస్తూ ఉండండి’’ | |
| ప్రశ్న:- | ఏ ఒక్క విషయములో పిల్లలైన మీరు చాలా, చాలా జాగ్రత్త వహించాలి? |
| జవాబు:- | మనసా, వాచా, కర్మణా మీ నాలుకపై చాలా జాగ్రత్త వహించాలి. బుద్ధి ద్వారా వికారీ ప్రపంచము యొక్క లోకమర్యాదలు, కులమర్యాదలు అన్నింటినీ మర్చిపోవాలి. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి - మేము ఎన్ని దివ్య గుణాలను ధారణ చేసాము? లక్ష్మీ-నారాయణుల వలె నిర్వికారీ దృష్టి కలవారిగా అయ్యామా? ఎంతవరకు పుష్పాలుగా అయ్యాము? |
ఓం శాంతి. నా పిల్లలైన వీరు ఆత్మలు అని శివబాబాకు తెలుసు. పిల్లలైన మీరు ఆత్మగా భావిస్తూ శరీరాన్ని మరచి శివబాబాను స్మృతి చేయాలి. శివబాబా అంటారు, నేను పిల్లలైన మిమ్మల్ని చదివిస్తాను. శివబాబా కూడా నిరాకారుడే, ఆత్మలైన మీరు కూడా నిరాకారులే. ఇక్కడకు వచ్చి పాత్రను అభినయిస్తారు. తండ్రి కూడా వచ్చి పాత్రను అభినయిస్తారు. డ్రామా ప్లాన్ అనుసారంగా తండ్రి వచ్చి మనల్ని పుష్పాలుగా తయారుచేస్తారని కూడా మీకు తెలుసు. కావున అన్ని అవగుణాలనూ వదిలి గుణవంతులుగా అవ్వాలి. గుణవంతులు - ఎప్పుడూ ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వరు, వినీ-విననట్లుగా వదిలేయరు, ఎవరైనా దుఃఖితులుగా ఉంటే వారి దుఃఖాన్ని దూరం చేస్తారు. అలాగే తండ్రి వచ్చారు అంటే మొత్తం ప్రపంచము యొక్క దుఃఖాలన్నీ తప్పకుండా దూరమవ్వనున్నాయి. తండ్రి అయితే శ్రీమతాన్ని ఇస్తారు, ఎంత వీలైతే అంత పురుషార్థము చేసి అందరి దుఃఖాన్ని దూరం చేస్తూ ఉండండి. పురుషార్థము ద్వారానే మంచి పదవి లభిస్తుంది. పురుషార్థము చేయకపోతే పదవి తగ్గిపోతుంది. దానితో ఇక కల్ప-కల్పాంతరాల కొరకు నష్టం వాటిల్లుతుంది. తండ్రి పిల్లలకు ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తారు. పిల్లలు తమను తాము నష్టపరచుకోవడమనేది తండ్రికి ఇష్టం లేదు. ప్రపంచములోని వారికి లాభ-నష్టాలను గురించి తెలియదు. కావున పిల్లలు తమపై తాము దయ చూపించుకోవాలి, శ్రీమతముపై నడుస్తూ ఉండాలి. బుద్ధి అటూ, ఇటూ పరుగెడుతుంది, అయినా కానీ ప్రయత్నించండి - మేము ఇటువంటి అనంతమైన తండ్రిని ఎందుకు స్మృతి చేయము, ఆ స్మృతితోనే ఉన్నత పదవి లభిస్తుంది. తక్కువలో తక్కువ స్వర్గములోకి అయితే వెళ్తారు. కానీ స్వర్గములో ఉన్నత పదవిని పొందాలి. మా పిల్లలు స్కూల్లో చదువుకుని ఉన్నత పదవిని పొందాలి అని తల్లిదండ్రులు అంటారు కదా. ఇక్కడ దీని గురించి ఎవరికీ తెలియదు. మీ సంబంధీకులకు మీరు ఏ చదువు చదువుతున్నారు అనేది తెలియదు. ఆ చదువు విషయములోనైతే మిత్ర-సంబంధీకులు మొదలైనవారందరికీ తెలుస్తుంది కానీ ఇందులో కొందరికి తెలుస్తుంది, కొందరికి తెలియదు. కొందరి విషయములో తండ్రికి తెలిస్తే సోదరీ, సోదరులకు తెలియదు, కొందరి విషయములో తల్లికి తెలిస్తే తండ్రికి తెలియదు, ఎందుకంటే ఇది విచిత్రమైన చదువు మరియు చదివించేవారు విచిత్రమైనవారు. నంబరువారుగా అర్థం చేసుకుంటారు. తండ్రి అర్థం చేయిస్తారు - భక్తి అయితే మీరు ఎంతగానో చేసారు. అది కూడా నంబరువారుగా. ఎవరైతే ఎంతో భక్తిని చేసారో వారే మళ్ళీ ఈ జ్ఞానాన్ని కూడా తీసుకుంటారు. ఇప్పుడిక భక్తి యొక్క ఆచార-వ్యవహారాలు పూర్తవుతాయి. మీరా లోకమర్యాదలను, కులమర్యాదలను వదిలేశారని అని పూర్వము ఆమె గురించి అనేవారు. ఇక్కడైతే మీరు మొత్తం వికారీ కులమర్యాదలన్నింటినీ వదిలేయాలి, బుద్ధి ద్వారా అన్నింటినీ సన్యసించాలి. ఈ వికారీ ప్రపంచములోనివేవీ మీకు మంచిగా అనిపించవు. వికర్మలు చేసేవారు ఏమాత్రమూ మంచిగా అనిపించరు. వారు తమ భాగ్యాన్నే పాడు చేసుకుంటారు. పిల్లలు ఎవరినైనా విసిగిస్తే లేక చదువుకోకపోతే, అది ఇష్టపడే తండ్రి ఎవరూ ఉండరు. అక్కడ ఇటువంటి పిల్లలు ఎవరూ ఉండరని పిల్లలైన మీకు తెలుసు. వారి పేరే దేవీ-దేవతలు. ఇది ఎంత పవిత్రమైన పేరు. స్వయాన్ని చెక్ చేసుకోవాలి - నాలో దైవీ గుణాలు ఉన్నాయా. సహనశీలురుగా కూడా అవ్వవలసి ఉంటుంది. ఇది బుద్ధియోగము యొక్క విషయము. ఈ యుద్ధమైతే చాలా మధురమైనది. తండ్రిని స్మృతి చేయడములో ఎటువంటి యుద్ధము యొక్క విషయమూ లేదు. ఇకపోతే ఇందులో మాయ విఘ్నాలను కలిగిస్తుంది, వాటి నుండి సంభాళించుకోవలసి ఉంటుంది. మాయపైనైతే మీరే విజయాన్ని పొందాలి. మీకు తెలుసు - కల్పకల్పము మనం ఏదైతే చేస్తూ వచ్చామో, కల్పకల్పము ఏదైతే నడుస్తూ వచ్చిందో, పూర్తిగా ఏక్యురేట్ గా అదే పురుషార్థము నడుస్తుంది. ఇప్పుడు మనం పదమాపదమ భాగ్యశాలులుగా అవుతామని, మళ్ళీ సత్యయుగములో అపారమైన సుఖవంతులుగా ఉంటామని మీకు తెలుసు.
కల్పకల్పమూ తండ్రి ఇదే విధంగా అర్థం చేయిస్తారు. ఇది కొత్త విషయమేమీ కాదు, ఇది చాలా పాత విషయము. పిల్లలు పూర్తిగా పుష్పాల వలె అవ్వాలని తండ్రి కోరుకుంటారు. లౌకిక తండ్రి కూడా తన పిల్లలు పుష్పాల వలె అవ్వాలని కోరుకుంటారు కదా. పారలౌకిక తండ్రి అయితే ముళ్ళను పుష్పాలుగా తయారుచేయడానికే వస్తారు. కావున ఆ విధంగా తయారవ్వాలి కదా. మనసా, వాచా, కర్మణా నాలుకపై కూడా చాలా జాగ్రత్త వహించాలి. ప్రతి కర్మేంద్రియముపైనా చాలా జాగ్రత్త వహించాలి. మాయ ఎంతగానో మోసం చేస్తుంటుంది. దాని నుండి బాగా సంభాళించుకోవాలి. ఇది చాలా పెద్ద గమ్యము. అర్ధకల్పము నుండి వికారీ దృష్టి తయారయ్యింది. దానిని ఒక్క జన్మలో నిర్వికారిగా తయారుచేసుకోవాలి. ఈ లక్ష్మీ-నారాయణుల దృష్టి వలె తయారుచేసుకోవాలి. వీరు సర్వగుణ సంపన్నులు కదా. అక్కడ వికారీ దృష్టి అనేదే ఉండదు. రావణుడే ఉండడు. ఇది కొత్త విషయమేమీ కాదు. మీరు అనేక సార్లు ఈ పదవిని పొందారు. వీరు ఏమి చదువుతున్నారు అనేది ప్రపంచానికి ఏమాత్రమూ తెలియదు. తండ్రి మీ సర్వ ఆశలను పూర్తి చేయడానికి వస్తారు. రావణుడివి అశుభ ఆశలు, మీవి శుభ ఆశలు. మీకు ఎటువంటి వికారీ ఆశా ఉండకూడదు. పిల్లలు సుఖపు అలలలో తేలియాడుతూ ఉండాలి. మీ అపారమైన సుఖాలను వర్ణన చేయలేరు, దుఃఖాల వర్ణన జరుగుతుందే కానీ సుఖాల వర్ణన జరగదు. పిల్లలైన మీ అందరికీ - మేము పావనంగా అవ్వాలి అన్న ఒక్క ఆశే ఉంది. పావనంగా ఎలా అవుతారు? ఇది మీకు తెలుసు, పావనంగా తయారుచేసేవారు ఒక్క తండ్రే, వారి స్మృతి ద్వారానే పావనంగా తయారవుతారు. మొట్టమొదట కొత్త ప్రపంచములో పావనులు ఈ దేవీ-దేవతలే. పావనంగా అవ్వడంలో ఎంతటి శక్తి ఉందో చూడండి. మీరు పావనులుగా అయి పావన ప్రపంచ రాజ్యాన్ని పొందుతారు, అందుకే ఈ దేవతా ధర్మములో ఎంతో శక్తి ఉంది అని అనడం జరుగుతుంది. ఈ శక్తి ఎక్కడి నుండి లభిస్తుంది? సర్వశక్తివంతుడైన తండ్రి నుండి. ఇంటిలో మీరు ముఖ్యమైన 2-4 చిత్రాలను పెట్టి ఎంతో సేవ చేయవచ్చు. కర్ఫ్యూలు మొదలైనవి ఎలాంటివి వస్తాయంటే వాటి వల్ల ఇక మీరు రావడం, వెళ్లడం కూడా చేయలేరు, ఆ సమయం వస్తుంది.
బ్రాహ్మణులైన మీరు సత్యమైన గీతను వినిపించేవారు. జ్ఞానమైతే చాలా సహజమైనది. ఎవరి విషయములోనైతే ఇంట్లోనివారందరూ వస్తారో, ఎవరి ఇంటిలోనైతే శాంతి ఉందో, వారి కొరకైతే ఇది చాలా సహజము. 2-4 ముఖ్యమైన చిత్రాలను ఇంట్లో పెట్టుకోవాలి. ఈ త్రిమూర్తి, సృష్టిచక్రము, వృక్షము మరియు మెట్ల చిత్రము కూడా సరిపోతాయి. వాటితోపాటు గీతా భగవానుడు శ్రీకృష్ణుడు కాదు అన్న చిత్రము కూడా బాగుంటుంది. ఇది ఎంత సహజము, ఇందులో డబ్బు ఏమాత్రమూ ఖర్చు అవ్వదు. చిత్రాలైతే ఉన్నాయి. చిత్రాలను చూడడంతోనే జ్ఞానము స్మృతిలోకి వస్తూ ఉంటుంది. వీటి కోసం ఒక గది తయారై ఉండాలి, అందులో మీరు పడుకోవచ్చు కూడా. ఒకవేళ శ్రీమతముపై నడుస్తూ ఉన్నట్లయితే మీరు అనేకుల కళ్యాణము చేయగలరు. మీరు కళ్యాణము చేస్తూ ఉండి ఉండవచ్చు కూడా, అయినా కానీ తండ్రి మీరు ఇలా, ఇలా చేయవచ్చు అని గుర్తు చేస్తూ ఉంటారు. చిన్ని కృష్ణుని మూర్తిని పెట్టుకుంటారు కదా. ఇందులో అర్థం చేయించవలసిన విషయాలు ఉన్నాయి. జన్మ-జన్మాంతరాలూ మీరు భక్తి మార్గములో మందిరాలలో భ్రమిస్తూ ఉంటారు కానీ వీరు ఎవరు అన్నది తెలియదు. మందిరాలలో దేవీల పూజను చేస్తారు, మళ్ళీ వారినే తీసుకువెళ్ళి నీటిలో ముంచేస్తారు. ఇది ఎంతటి అజ్ఞానము. పూజ చేస్తారు, పూజ చేసి మళ్ళీ వారిని తీసుకువెళ్ళి సముద్రంలో పడేస్తారు. గణేశుడిని, అంబను, సరస్వతిని కూడా ముంచేస్తారు. తండ్రి కూర్చుని పిల్లలకు కల్పకల్పమూ ఈ విషయాలను అర్థం చేయిస్తారు. మీరు ఏమి చేస్తున్నారో చూడండి! అని రియలైజ్ చేయిస్తారు. మధురాతి మధురమైన పిల్లలూ, మీరు ఏమి చేస్తున్నారో చూడండి అని తండ్రి ఇంతగా అర్థం చేయిస్తుంటే పిల్లలకు ఇక వాటిపై ద్వేషం కలగాలి. దీనిని విషయ వైతరణి నది అనే అంటారు. అక్కడ పాల సముద్రము ఉంటుందని కాదు, కానీ అక్కడ ప్రతి వస్తువు అపారంగా ఉంటుంది. ఏ వస్తువుకూ డబ్బులు పెట్టవలసిన అవసరం ఉండదు. అక్కడ అసలు డబ్బులే ఉండవు. బంగారు నాణాలే కనిపిస్తాయి. ఇళ్ళే బంగారముతో తయారవుతాయి, బంగారు ఇటుకలు ఉంటాయి అన్నప్పుడు, అక్కడ అసలు బంగారానికి, వెండికి ధరయే ఉండదని నిరూపణ అవుతుంది. ఇక్కడ ఎంత ధర ఉందో చూడండి. ఒక్కొక్క విషయములో అద్భుతముందని మీకు తెలుసు. మనుష్యులైతే మనుష్యులే, ఈ దేవతలు కూడా మనుష్యులే కానీ వీరు దేవతలు అని పిలవబడతారు. వీరి ఎదురుగా వెళ్ళి మనుష్యులు తమ అశుద్ధతను వ్యక్త పరుస్తారు - మేము పాపులము, నీచులము, మాలో ఏ గుణాలు లేవు అని. పిల్లలైన మీ బుద్ధిలో లక్ష్యము-ఉద్దేశ్యము ఉంది. మనం ఈ మనుష్యుల నుండి దేవతలుగా అవుతాము. దేవతలలో దైవీ గుణాలు ఉన్నాయి. మేము మందిరాలకు వెళ్తున్నాము అని వారు భావిస్తారే కానీ ఆ దేవతలు కూడా మనుష్యులేనన్నది అర్థం చేసుకోరు. మనం కూడా మనుష్యులమే, కానీ వారు దైవీ గుణాలు కలవారు, మనం ఆసురీ గుణాలు కలవారము. మనం ఎంత అనర్హులుగా ఉండేవారము అని ఇప్పుడు మీ బుద్ధిలోకి వస్తుంది. వారి ఎదురుగా వెళ్ళి - మీరు సర్వగుణ సంపన్నులు... అని గానం చేసేవారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, వీరంతా ఒకప్పుడు ఉండి వెళ్ళారు, వీరిలో దైవీ గుణాలు ఉండేవి, అపారమైన సుఖాలు ఉండేవి. వారే మళ్ళీ అపారమైన దుఃఖితులుగా అయ్యారు. ఈ సమయములో అందరిలో పంచ వికారాలు ప్రవేశించి ఉన్నాయి. ఏ విధంగా మేము పై నుండి కిందకు దిగుతూ, దిగుతూ పూర్తిగా నేలపైకి వచ్చి పడిపోయాము! అని ఇప్పుడు మీరు ఆలోచిస్తారు. భారతవాసులు ఎంతటి షావుకార్లుగా ఉండేవారు. ఇప్పుడు చూడండి, అప్పులు చేస్తూ ఉంటారు. ఈ విషయాలన్నింటినీ తండ్రే కూర్చుని అర్థం చేయిస్తారు, ఇంకెవరూ తెలియజేయలేరు. ఋషులు, మునులు మొదలైనవారు కూడా నేతి, నేతి అనేవారు అనగా మాకు తెలియదు అని అనేవారు. వారు చెప్పింది నిజమే అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వారికి తండ్రి గురించి గాని, రచన ఆదిమధ్యాంతాలను గురించి గాని తెలియదు. ఇప్పుడు కూడా పిల్లలైన మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. గొప్ప, గొప్ప సన్యాసులు, మహాత్ములు మొదలైనవారికెవరికీ తెలియదు. వాస్తవానికి మహాన్ ఆత్మలు అయితే ఈ లక్ష్మీ-నారాయణులు కదా. వీరు సదా పవిత్రముగా ఉంటారు. వీరికి కూడా తెలియనప్పుడు మరి ఇంకెవరికైనా ఎలా తెలుస్తుంది? తండ్రి ఎంత సరళమైన విషయాలను అర్థం చేయిస్తారు కానీ చాలామంది పిల్లలు మర్చిపోతారు. కొందరు చాలా బాగా గుణాలను ధారణ చేస్తారు కావున మధురంగా అనిపిస్తారు. ఎంతగా పిల్లలలో మధురతా గుణాన్ని చూస్తారో అంతగా హృదయం సంతోషిస్తుంది. కొందరైతే పేరును అప్రతిష్టపాలు చేసేస్తారు. ఇక్కడైతే తండ్రి, టీచర్, సద్గురువు ఉన్నారు - ఈ ముగ్గురి నిందను చేయిస్తారు. సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్ మరియు సద్గురువును నిందింపజేసినట్లయితే మూడు రెట్లు దండన పడుతుంది. కానీ కొంతమంది పిల్లలలో కొద్దిగా కూడా తెలివి లేదు, అలాంటివారు కూడా తప్పకుండా ఉంటారు అని తండ్రి అర్థం చేయిస్తారు. మాయ కూడా తక్కువేమీ కాదు. అర్ధకల్పం పాపాత్ములుగా తయారుచేస్తుంది. తండ్రి మళ్ళీ అర్ధకల్పం కొరకు పుణ్యాత్ములుగా తయారుచేస్తారు. అది కూడా నంబరువారుగా అవుతారు. తయారుచేసేవారు కూడా ఇద్దరు ఉన్నారు - రాముడు మరియు రావణుడు. వాళ్ళు రాముడిని పరమాత్మ అని అంటారు. రామ, రామ అని అంటూ మళ్ళీ చివరిలో శివుడికి నమస్కరిస్తారు. వారే పరమాత్మ. పరమాత్ముని పేర్లను లెక్కపెడతారు. మీకైతే అలా లెక్కపెట్టవలసిన అవసరం లేదు. ఈ లక్ష్మీ-నారాయణులు పవిత్రముగా ఉండేవారు కదా. వీరి ప్రపంచము ఉండేది, అది గతించిపోయింది. దానిని స్వర్గము, కొత్త ప్రపంచము అని అంటారు. ఏ విధంగా పాత ఇల్లు కూలిపోయేలా అయిపోతుందో, ఈ ప్రపంచము కూడా అలాగే అవుతుంది. ఇప్పుడు ఇది కలియుగ చివరి సమయము. ఇవి అర్థం చేసుకోవలసిన ఎంత సహజమైన విషయాలు. ధారణ చేయాలి మరియు చేయించాలి. తండ్రి అయితే అందరికీ అర్థం చేయించేందుకు వెళ్ళరు. పిల్లలైన మీరు ఈశ్వరీయ సేవలో ఉన్నారు. తండ్రి ఏ సేవనైతే నేర్పిస్తారో అదే సేవను చేయాలి. మీది ఈశ్వరీయ సేవ మాత్రమే. మీ పేరును ఉన్నతముగా చేయడానికి తండ్రి కలశాన్ని మాతలైన మీకు ఇచ్చారు. అలాగని పురుషులకు లభించదని కాదు. లభించడమైతే అందరికీ లభిస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు - మీరు ఎంత సుఖవంతులుగా, స్వర్గవాసులుగా ఉండేవారు, అక్కడ ఎవరూ దుఃఖితులుగా ఉండేవారు కాదు. ఇప్పుడు ఇది సంగమయుగము, మళ్ళీ మనం ఆ కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతున్నాము. ఇప్పుడు ఇది కలియుగము, పాత పతిత ప్రపంచము. పూర్తిగా గేదె బుద్ధి కల మనుష్యుల్లా ఉన్నారు. ఇప్పుడైతే ఈ విషయాలన్నింటినీ మర్చిపోవలసి ఉంటుంది. దేహ సహితముగా దేహపు సర్వ సంబంధాలనూ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించాలి. శరీరములో ఆత్మ లేకపోతే శరీరము ఏమీ చేయలేదు. ఆ శరీరముపై ఎంతటి మోహమును ఉంచుతారు. శరీరము కాలిపోయి ఆత్మ వెళ్ళి ఇంకొక శరీరాన్ని తీసుకున్నా పన్నెండు నెలలు, అయ్యో దేవుడా అని మొరపెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీ ఆత్మ శరీరాన్ని వదిలితే తప్పకుండా నంబరువారుగా ఉన్నతమైన ఇంటిలో జన్మ తీసుకుంటుంది. కొద్దిగా మాత్రమే జ్ఞానము ఉన్నవారు సాధారణ కులములో జన్మ తీసుకుంటారు, ఉన్నతమైన జ్ఞానము కలవారు ఉన్నతమైన కులములో జన్మ తీసుకుంటారు. అక్కడ సుఖము కూడా ఎంతో ఉంటుంది. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి ఏదైతే వినిపిస్తారో, దానిని వినీ-విననట్లుగా వదిలేయకూడదు. గుణవంతులుగా అయి అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. పురుషార్థము చేసి అందరి దుఃఖాలనూ దూరం చేయాలి.
2. వికారాలకు వశమై ఎటువంటి వికర్మలనూ చేయకూడదు. సహనశీలురుగా అవ్వాలి. ఎటువంటి క్రిమినల్ (అశుద్ధమైన, వికారీ) ఆశలను పెట్టుకోకూడదు.
| వరదానము:- |
శాంతి శక్తి ద్వారా అసంభవాన్ని సంభవము చేసే సహజయోగీ భవ శాంతి శక్తి సర్వ శ్రేష్ఠమైన శక్తి. శాంతి శక్తి నుండే ఇతర శక్తులన్నీ వెలువడ్డాయి. సైన్స్ శక్తి యొక్క ప్రభావము ఏదైతే ఉందో, ఆ సైన్స్ కూడా సైలెన్స్ నుండే వెలువడింది. కావున శాంతి శక్తి ద్వారా ఏది కావాలనుకుంటే అది చెయ్యగలరు. అసంభవాన్ని కూడా సంభవము చెయ్యగలరు. దేనినైతే ప్రపంచమువారు అసంభవము అని అంటారో, అది మీ కొరకు సంభవము మరియు సంభవమైన కారణముగా అది సహజము. శాంతి శక్తిని ధారణ చేసి సహజయోగిగా అవ్వండి. |
| స్లోగన్:- | వాణి ద్వారా అందరికీ సుఖాన్ని మరియు శాంతిని ఇచ్చినట్లయితే గాయన యోగ్యులుగా అవుతారు. |