తెలుగు మురళి · Brahma Kumaris

తెలుగు మురళి · 19 అక్టోబర్, 2024

ఓం శాంతి · BapDada ·

ఈరోజు మురళి — today’s murli in Telugu, BK Telugu murli.

18
మురళి19 అక్టోబర్, 2024 · తెలుగు
0:00--:--

పాఠ్యాన్ని ఎంచుకోండి → హైలైట్ / బాక్స్ / అండర్‌లైన్

19-10-2024
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
మధువనం

‘‘మధురమైన పిల్లలూ - సదా సంతోషములో ఉన్నట్లయితే స్మృతి యాత్ర సహజమైపోతుంది, స్మృతితోనే 21 జన్మల కొరకు పుణ్యాత్ములుగా అవుతారు’’
ప్రశ్న:- మీకు అందరికంటే మంచి సేవకులు లేక దాసులు ఎవరు?
జవాబు:- ప్రకృతి వైపరీత్యాలు మరియు సైన్స్ ఇన్వెన్షన్లు, వీటి ద్వారా మొత్తం విశ్వము యొక్క చెత్త అంతా శుభ్రమవుతుంది. ఇవి మీకు అన్నింటికంటే మంచి సేవకులు లేక దాసులు, ఇవి శుభ్రం చేయడంలో సహాయకులుగా అవుతాయి. మొత్తం ప్రకృతి అంతా మీ అధికారములో ఉంటుంది.

ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఏమి చేస్తున్నారు? యుద్ధ మైదానములో నిలబడి ఉన్నారు. వాస్తవానికి మీరు నిలబడి లేరు, మీరు కూర్చునే ఉన్నారు కదా. మీ సైన్యము ఎంత బాగుంది. దీనిని ఆత్మిక తండ్రి యొక్క ఆత్మిక సైన్యము అని అంటారు. ఆత్మిక తండ్రితో యోగాన్ని జోడించి రావణునిపై విజయాన్ని పొందేందుకు ఎంత సహజమైన పురుషార్థాన్ని చేయిస్తారు. మిమ్మల్ని గుప్త యోధులు, గుప్త మహావీరులు అని అంటారు. వీరు పంచ వికారాలపై విజయాన్ని పొందుతారు, అందులోనూ మొదటిది దేహాభిమానము. తండ్రి విశ్వముపై విజయాన్ని పొందేందుకు లేక విశ్వములో శాంతిని స్థాపించేందుకు ఎంత సహజమైన యుక్తిని తెలియజేస్తారు. ఇది పిల్లలైన మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. మీరు విశ్వములో శాంతి రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. అక్కడ అశాంతి, దుఃఖము, రోగము యొక్క నామ-రూపాలు కూడా ఉండవు. ఈ చదువు మిమ్మల్ని కొత్త ప్రపంచానికి యజమానులుగా చేస్తుంది. తండ్రి అంటారు - మధురాతి మధురమైన పిల్లలూ, కామముపై విజయాన్ని పొందడం ద్వారా మీరు 21 జన్మల కొరకు జగత్ జీతులుగా అవుతారు. ఇది చాలా సహజము. మీరు శివబాబా యొక్క ఆత్మిక సైన్యము. ఇది రాముని విషయమూ కాదు, కృష్ణుని విషయమూ కాదు. పరమపిత పరమాత్మనే రామా అని అంటారు. వారు రాముని సైన్యము మొదలైనవాటినేవైతే చూపిస్తారో వాస్తవానికి అవన్నీ తప్పే. జ్ఞాన సూర్యుడు ఉదయించడముతో అజ్ఞానాంధకారము వినాశనమైంది అని అంటారు. కలియుగము ఘోర అంధకారము. ఎన్ని గొడవలు-కొట్లాటలు, మారణహోమాలు ఉన్నాయి. సత్యయుగములో ఇవేవీ ఉండవు. మీరు మీ రాజ్యాన్ని ఎలా స్థాపించుకుంటున్నారో చూడండి. ఇందులో చేతులు, కాళ్ళు ఏమీ ఉపయోగించరు, ఇందులో దేహము యొక్క భానాన్ని తెంచివేయాలి. ఇంట్లో ఉండేటప్పుడు కూడా మొదట - నేను ఒక ఆత్మను, శరీరాన్ని కాదు అన్నది గుర్తు చేసుకోండి. ఆత్మలైన మీరే 84 జన్మలను అనుభవిస్తారు. ఇప్పుడు ఇది మీ అంతిమ జన్మ. పాత ప్రపంచము అంతమవ్వనున్నది. దీనిని పురుషోత్తమ సంగమయుగము యొక్క లీప్ యుగము అని అంటారు. పిలక చిన్నగా ఉంటుంది కదా. బ్రాహ్మణుల పిలక ప్రసిద్ధమైనది. తండ్రి ఎంత సహజ రీతిగా అర్థం చేయిస్తారు. మీరు ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వచ్చి తండ్రి ద్వారా రాజ్యాన్ని ప్రాప్తింపజేసుకునేందుకు ఇది చదువుకుంటారు. శివబాబా ద్వారా మేము ఈ విధంగా తయారవ్వాలి అని లక్ష్యము-ఉద్దేశ్యము కూడా ఎదురుగా ఉంది. సరే పిల్లలూ, ఎందుకు తయారవ్వకూడదు, కేవలం దేహాభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు అంతమైపోతాయి. మీకు తెలుసు, ఈ జన్మలో పావనంగా అవ్వడముతో మనం 21 జన్మలు పుణ్యాత్ములుగా అవుతాము, ఆ తర్వాత ఇక కిందకు దిగడం ప్రారంభమవుతుంది. మనదే 84 జన్మల చక్రమని కూడా మీకు తెలుసు. మొత్తం ప్రపంచమంతా రాదు కదా. 84 జన్మల చక్రములో తిరిగేవారు మరియు ఈ ధర్మానికి చెందినవారే వస్తారు. సత్యయుగాన్ని మరియు త్రేతాయుగాన్ని తండ్రే స్థాపన చేస్తారు. దానిని ఇప్పుడు చేస్తున్నారు. మళ్ళీ ద్వాపర, కలియుగాలు రావణుడి స్థాపన. రావణుడి చిత్రము కూడా ఉంది కదా. పైన గాడిద తల ఉంటుంది. వికారీ గాడిదల్లా (మూర్ఖుల్లా) అయిపోతారు. మీరు ఎలా ఉండేవారు అనేది కూడా మీరు అర్థం చేసుకుంటారు! ఇది ఉన్నదే పాపాత్ముల ప్రపంచము. పాపాత్ముల ప్రపంచములో కోట్లాది మంది ఉన్నారు. పుణ్యాత్ముల ప్రపంచములో ప్రారంభంలో తొమ్మిది లక్షల మంది ఉంటారు. మీరు ఇప్పుడు మొత్తం విశ్వానికి అధిపతులుగా అవుతారు. ఈ లక్ష్మీ-నారాయణులు విశ్వాధిపతులుగా ఉండేవారు కదా. స్వర్గ రాజ్యాధికారాన్ని అయితే తప్పకుండా తండ్రే ఇస్తారు. తండ్రి అంటారు, నేను మీకు విశ్వ రాజ్యాధికారాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఇప్పుడు పావనంగా తప్పకుండా అవ్వవలసి ఉంటుంది. అది కూడా ఈ అంతిమ జన్మలో మృత్యులోకములో పవిత్రముగా అవ్వండి. ఈ పాత ప్రపంచము యొక్క వినాశనం ఎదురుగా సిద్ధంగా ఉంది. బాంబులు మొదలైనవన్నీ ఎలా తయారుచేస్తున్నారంటే వాటితో అక్కడ ఇంట్లో కూర్చుని ఉండగానే అంతా అంతం చేసేస్తారు. మేము ఇంట్లో కూర్చునే పాత ప్రపంచాన్ని వినాశనం చేసేస్తాము అని అంటారు కూడా. ఈ బాంబులు మొదలైనవాటిని ఇంట్లో కూర్చుని ఉంటూనే ఎలా వదులుతారంటే వాటితో మొత్తం ప్రపంచమంతటినీ అంతం చేస్తారు. పిల్లలైన మీరు ఇంట్లో కూర్చునే యోగబలముతో విశ్వాధిపతులుగా అవుతారు. మీరు యోగబలముతో శాంతి స్థాపన చేస్తున్నారు. వారు సైన్స్ బలముతో మొత్తం ప్రపంచమంతటినీ అంతం చేస్తారు. వారు మీ సేవకులు. మీ సేవను చేస్తున్నారు. పాత ప్రపంచాన్ని అంతం చేసేస్తారు. ప్రకృతి వైపరీత్యాలు మొదలైనవన్నీ మీకు దాసులుగా అవుతాయి. మొత్తం ప్రకృతి మీకు దాసిగా అవుతుంది. కేవలం మీరు తండ్రితో యోగాన్ని జోడిస్తారు. కావున పిల్లలైన మీ లోపల ఎంతో సంతోషము ఉండాలి. ఇటువంటి ప్రియమైన తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి. ఇదే భారత్ పూర్తి శివాలయముగా ఉండేది. సత్యయుగములో సంపూర్ణ నిర్వికారులుగా ఉంటారు, ఇక్కడ వికారులుగా ఉన్నారు. ఇప్పుడు మీకు స్మృతి కలిగింది - తప్పకుండా తండ్రి మాకు, చెడును వినకండి... అని చెప్పారు అని. చెడు విషయాలను వినకండి. నోటితో మాట్లాడకండి కూడా. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు ఎంత అశుద్ధముగా అయిపోయారు. మీ వద్దనైతే అపారమైన ధనము ఉండేది. మీరు స్వర్గాధిపతులుగా ఉండేవారు. ఇప్పుడు మీరు స్వర్గానికి బదులుగా నరకాధిపతులుగా అయిపోయారు. ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత పిల్లలైన మిమ్మల్ని నేను రౌరవ నరకము నుండి బయటకు తీసి స్వర్గములోకి తీసుకువెళ్తాను. ఆత్మిక పిల్లలూ, మీరు నా మాటను వినరా? మీరు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవ్వండి అని పరమాత్మ చెప్తున్నారు, మరి మీరు అలా అవ్వరా?

వినాశనమైతే తప్పకుండా జరుగుతుంది. ఈ యోగబలముతోనే మీ జన్మ-జన్మాంతరాల పాపాలు అంతమవుతాయి. కానీ జన్మ-జన్మాంతరాల పాపం అంతమవ్వడములో సమయం పడుతుంది. పిల్లలు మొదటి నుండి వచ్చి ఉన్నారు కానీ 10 శాతము కూడా యోగము కుదరదు, అందుకే పాపాలు అంతమవ్వవు. కొత్త-కొత్త పిల్లలు వెంటనే యోగీలుగా అయిపోతారు, కావున వారి పాపాలు అంతమైపోతాయి మరియు సేవ చేయడం మొదలుపెడతారు. ఇప్పుడు మనం ఇక తిరిగి వెళ్ళాలి అని పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. తండ్రి తీసుకువెళ్ళేందుకే వచ్చారు. పాపాత్ములైతే శాంతిధామములోకి, సుఖధామములోకి వెళ్ళలేరు. వారు దుఃఖధామములోనే ఉంటారు. అందుకే ఇప్పుడు తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయి. అరే పిల్లలూ, మీరు పుష్పాలుగా అయిపోండి, దైవీ కులానికి కళంకము తీసుకురాకండి. మీరు వికారులుగా అయిన కారణముగా ఎంత దుఃఖితులుగా అయిపోయారు. ఇది కూడా డ్రామా ఆటగా రచింపబడి ఉంది. మీరు పవిత్రముగా అవ్వకపోతే పవిత్ర ప్రపంచమైన స్వర్గములోకి రారు. భారత్ స్వర్గముగా ఉండేది, కృష్ణపురిలో ఉండేది, ఇప్పుడు నరకవాసులుగా ఉన్నారు. కావున పిల్లలైన మీరైతే సంతోషముగా వికారాలను వదిలేయాలి. విషాన్ని తాగడం వెంటనే వదిలేయాలి. ఇలా విషాన్ని తాగుతూ, తాగుతూ మీరు వైకుంఠములోకి వెళ్ళలేరు. ఇప్పుడు ఇలా తయారయ్యేందుకు మీరు పవిత్రముగా అవ్వాలి. వీరు ఈ రాజ్యాన్ని ఎలా ప్రాప్తి చేసుకున్నారు అనేది మీరు అర్థం చేయించవచ్చు. రాజయోగము ద్వారా ప్రాప్తి చేసుకున్నారు. ఇది చదువు కదా. బ్యారిస్టర్ యోగము మరియు సర్జన్ యోగము ఉంటాయి కదా, సర్జన్ తో యోగము ఉంటే సర్జన్ గా అవుతారు. కానీ ఇక్కడ ఇది భగవానువాచ. వారు రథములోకి ఎలా ప్రవేశిస్తారు? వారు అంటారు, అనేక జన్మల అంతిమములో నేను ఇతనిలో కూర్చుని పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇస్తాను. నాకు తెలుసు - ఈ విశ్వాధిపతులు పవిత్రముగా ఉండేవారు, ఇప్పుడు పతితముగా, నిరుపేదలుగా అయ్యారు, వీరు మళ్ళీ మొదటి నెంబర్ కి వెళ్తారు. వీరిలోకే ప్రవేశించి పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇస్తారు. అనంతమైన తండ్రి అంటారు - పిల్లలూ, పవిత్రముగా అయినట్లయితే మీరు సదా సుఖవంతులుగా అవుతారు. సత్యయుగము అమరలోకము, ద్వాపర, కలియుగాలు మృత్యులోకము. పిల్లలకు ఎంత బాగా అర్థం చేయిస్తారు. ఇక్కడ దేహీ-అభిమానులుగా అవుతారు, మళ్ళీ దేహాభిమానములోకి వచ్చి మాయతో ఓడిపోతారు. మాయతో ఒక్క ఫిరంగి దెబ్బ ఎలాంటిది తగులుతుందంటే దానితో పూర్తిగా బురదలో పడిపోతారు. తండ్రి అంటారు, ఇదంతా బురద, ఇది సుఖమేమీ కాదు. స్వర్గమంటే మరేమనుకున్నారు? ఈ దేవతల ఉండడము, చేయడము ఎలా ఉన్నాయో చూడండి. పేరే స్వర్గము. మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారుచేస్తారు, అయినా కానీ మేము విషాన్ని తప్పకుండా తాగుతాము అని అంటారు. కావున స్వర్గములోకి రాలేరు. శిక్షలు కూడా ఎన్నో అనుభవిస్తారు. పిల్లలైన మీది మాయతో యుద్ధము. దేహాభిమానములోకి వచ్చి చాలా ఛీ-ఛీ పనులు చేస్తారు. మమ్మల్ని ఎవ్వరూ చూడడం లేదు కదా అని భావిస్తారు. క్రోధము, లోభము అయితే గుప్తముగా ఉండవు. కామము గుప్తముగా జరుగుతుంది. ముఖాన్ని నల్లగా చేసేసుకుంటారు. అలా నల్ల ముఖము చేసుకుంటూ, చేసుకుంటూ మీరు తెల్లగా ఉన్నవారి నుండి నల్లగా అయిపోయేటప్పటికి మొత్తం ప్రపంచమంతా మీ వెనుకే వచ్చేసింది. ఇటువంటి పతిత ప్రపంచము తప్పకుండా మారనున్నది. తండ్రి అంటారు - మీకు సిగ్గు కలగడం లేదా, ఒక్క జన్మ కొరకు పవిత్రముగా అవ్వరా?

భగవానువాచ - కామము మహాశత్రువు. వాస్తవానికి మీరు స్వర్గవాసులుగా ఉన్నప్పుడు చెప్పడానికి వీల్లేనంతగా ధనవంతులుగా ఉండేవారు. బాబా, మా నగరానికి రండి అని పిల్లలు అంటారు. ముళ్ళ అడవిలో కోతులను చూడటానికి రమ్మంటారా! పిల్లలైన మీరు డ్రామానుసారంగా సేవ చేయాలి. ఫాదర్ షోస్ సన్ (తండ్రి కొడుకును ప్రత్యక్షం చేస్తారు) అన్న గాయనము ఉంది. పిల్లలే వెళ్ళి అందరి కళ్యాణమును చేయాలి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు - మనము యుద్ధ మైదానములో ఉన్నాము అన్నది మర్చిపోకండి, మీ యుద్ధము పంచ వికారాలతో ఉన్నది. ఈ జ్ఞాన మార్గము పూర్తిగా వేరు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని 21 జన్మల కొరకు స్వర్గాధిపతులుగా తయారుచేస్తాను, మరి మిమ్మల్ని నరకవాసులుగా ఎవరు తయారుచేస్తారు? రావణుడు. తేడా అయితే చూస్తారు కదా. జన్మ-జన్మాంతరాలూ మీరు భక్తి మార్గములో గురువులను ఆశ్రయించారు కానీ ఏమీ లభించలేదు. వీరిని సద్గురువు అని అంటారు. సద్గురువు అకాలమూర్తి అని సిక్కులు అంటారు కదా. వారిని ఎప్పుడూ కాలుడు కబళించడు. ఆ సద్గురువైతే కాలుడికే కాలుడు. తండ్రి అంటారు, నేను పిల్లలైన మిమ్మల్నందరినీ కాలుడి యొక్క పిడికిలి నుండి విడిపించేందుకు వచ్చాను. సత్యయుగములో మళ్ళీ కాలుడు రానే రాడు, దానిని అమరలోకము అని అంటారు. ఇప్పుడు మీరు శ్రీమతము ఆధారంగా అమరలోకమైన సత్యయుగానికి యజమానులుగా అవుతున్నారు. మీ యుద్ధము ఎలా ఉందో చూడండి. మొత్తం ప్రపంచమంతా ఒకరితో ఒకరు గొడవపడుతూ-కొట్లాడుకుంటూ ఉంటారు. మీది రావణుడైన పంచ వికారాలతో చేసే యుద్ధము. మీరు వాటిపై విజయాన్ని పొందుతారు. ఇది అంతిమ జన్మ.

తండ్రి అంటారు, నేను పేదల పాలిటి పెన్నిధిని. ఇక్కడకు పేదవారే వస్తారు. షావుకారులకైతే ఇది భాగ్యములోనే లేదు. ధనము యొక్క నషాలోనే గర్వముతో ఉంటారు. ఇది అంతా అంతమైపోనున్నది. ఇంకా కొద్ది సమయమే ఉంది. డ్రామా ప్లాన్ కదా. వీరు ఇన్ని బాంబులు మొదలైనవాటినేవైతే తయారుచేసారో, వాటన్నింటినీ తప్పకుండా ఉపయోగించనున్నారు. పూర్వము అయితే యుద్ధాలు బాణాలతో, ఖడ్గాలతో, ఆ తర్వాత తుపాకులు మొదలైనవాటితో జరిగేవి. ఇప్పుడు ఎటువంటి బాంబులు వెలువడ్డాయంటే ఇంట్లో కూర్చునే అంతా అంతం చేసేస్తారు. ఈ వస్తువులేమీ ఇంట్లో ఉంచుకునేందుకు తయారుచేయలేదు. ఎంతకాలమని ఉంచుకుంటారు. తండ్రి వచ్చారు కావున వినాశనం కూడా తప్పకుండా జరగాలి. డ్రామా చక్రము తిరుగుతూ ఉంటుంది. మీ రాజ్యము తప్పకుండా స్థాపన అవ్వనున్నది. ఈ లక్ష్మీ-నారాయణులు ఎప్పుడూ యుద్ధం చేయరు. శాస్త్రాలలో అసురులు మరియు దేవతల యుద్ధం జరిగినట్లుగా చూపించారు కానీ వారు సత్యయుగము వారు మరియు అసురులు కలియుగము వారు. యుద్ధం జరిగేందుకు అసలు ఇద్దరూ ఎక్కడ కలుస్తారు. మేము పంచ వికారాలతో యుద్ధం చేస్తున్నాము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. వీటిపై విజయాన్ని పొంది సంపూర్ణ నిర్వికారులుగా అయి నిర్వికారీ ప్రపంచానికి యజమానులుగా అయిపోతారు. లేస్తూ, కూర్చుంటూ తండ్రిని స్మృతి చేయాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. ఇది తయారై, తయారుచేయబడిన డ్రామా. కొందరి భాగ్యములో ఇది లేనే లేదు. యోగబలము ఉండాలి, అప్పుడే వికర్మలు వినాశనమవుతాయి. సంపూర్ణముగా అయితేనే సంపూర్ణ ప్రపంచములోకి రాగలుగుతారు. తండ్రి కూడా శంఖ ధ్వనిని చేస్తూ ఉంటారు. దానికి వారు కూర్చుని భక్తి మార్గములో శంఖము లేక తుత్తార (నోటి గాలితో వాయించే ఒక వాయిద్యము) మొదలైనవాటిని తయారుచేసారు. తండ్రి అయితే ఈ నోటి ద్వారా అర్థం చేయిస్తారు. ఇది రాజయోగము యొక్క చదువు. ఇది చాలా సహజమైన చదువు. తండ్రిని స్మృతి చేయండి మరియు రాజ్యాన్ని స్మృతి చేయండి. అనంతమైన తండ్రిని గుర్తించండి మరియు రాజ్యాన్ని తీసుకోండి. ఈ ప్రపంచాన్ని మర్చిపోండి. మీరు అనంతమైన సన్యాసులు. పాత ప్రపంచము అంతా అంతమవ్వనున్నదని మీకు తెలుసు. ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యములో కేవలం భారత్ మాత్రమే ఉండేది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తమ దైవీ కులానికి కళంకము తీసుకురాకూడదు. పుష్పాల వలె తయారవ్వాలి. అనేక ఆత్మల కళ్యాణము చేసే సేవను చేసి తండ్రిని ప్రత్యక్షము చేయాలి.

2. సంపూర్ణ నిర్వికారులుగా అయ్యేందుకు అశుద్ధమైన విషయాలను వినకూడదు, అలాగే నోటితో మాట్లాడకూడదు. చెడు వినకండి, చెడు మాట్లాడకండి... దేహాభిమానానికి వశమై ఎటువంటి అశుద్ధమైన పనులనూ చేయకూడదు.

వరదానము:- మన్మనాభవ మంత్రము ద్వారా మనస్సు యొక్క బంధనము నుండి విముక్తులయ్యే నిర్బంధన, ట్రస్టీ భవ
ఏ బంధమైనా పంజరము వంటిది. పంజరములోని మైనా ఇప్పుడు నిర్బంధనమై ఎగిరే పక్షిగా అయ్యింది. ఒకవేళ ఏదైనా తనువుకు సంబంధించిన బంధనమున్నా మనసైతే ఎగిరే పక్షిలాంటిది ఎందుకంటే మన్మనాభవగా అవ్వటం ద్వారా మనసు యొక్క బంధనాలు తొలగిపోతాయి. ప్రవృత్తిని సంభాళించే బంధనము కూడా ఉండదు. ట్రస్టీగా అయ్యి సంభాళించేవారు సదా నిర్బంధనులుగా ఉంటారు. గృహస్థీ అనగా భారము, భారము కలవారు ఎప్పుడూ ఎగరలేరు. కానీ ట్రస్టీగా ఉన్నట్లయితే నిర్బంధనులుగా ఉంటారు మరియు ఎగిరే కళతో క్షణములో మధురమైన ఇంటికి చేరుకోగలుగుతారు.
స్లోగన్:- ఉదాసీనతను మీ దాసిగా చేసుకోండి, దానిని ముఖము పైకి రానివ్వకండి.

 

మురళి అంటే ఏమిటి?

మురళి బ్రహ్మకుమారీల దైనిక ఆధ్యాత్మిక బోధన, ఇది ప్రతి ఉదయం మధుబన్ నుండి ప్రచురించబడుతుంది. ఇక్కడ మీరు ఈరోజు మురళిని తెలుగులో చదవవచ్చు, ఆడియో వినవచ్చు మరియు PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధ్యయనానికి సహాయంగా పాఠ్యాన్ని హైలైట్ చేయవచ్చు — మీ గుర్తులు ఈ బ్రౌజర్‌లోనే సురక్షితంగా ఉంటాయి.

28 భాషల్లో మురళి

Daily Murli · Madhuban మూలం: మధుబన్ మురళి విభాగం ఇది స్వతంత్ర రీడర్ యాప్, అధికారిక వెబ్‌సైట్ కాదు.