తెలుగు మురళి · Brahma Kumaris

తెలుగు మురళి · 20 అక్టోబర్, 2024

ఓం శాంతి · BapDada ·

ఈరోజు మురళి — today’s murli in Telugu, BK Telugu murli.

18
మురళి20 అక్టోబర్, 2024 · తెలుగు
0:00--:--

పాఠ్యాన్ని ఎంచుకోండి → హైలైట్ / బాక్స్ / అండర్‌లైన్

20-10-2024
ప్రాత:మురళి
ఓంశాంతి
‘‘అవ్యక్త బాప్ దాదా’’
రివైజ్ 28-03-2002 మధువనం

‘‘ఈ సంవత్సరాన్ని నిర్మాన, నిర్మల సంవత్సరముగా మరియు వ్యర్థము నుండి ముక్తులుగా అయ్యే ముక్తి సంవత్సరముగా జరుపుకోండి’’

ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న తమ పిల్లల మస్తకములో మెరుస్తున్న మూడు రేఖలను చూస్తున్నారు. ఒక రేఖ ప్రభు పాలన యొక్క రేఖ, రెండవ రేఖ శ్రేష్ఠ చదువు యొక్క రేఖ మరియు మూడవ రేఖ శ్రేష్ఠ మతము యొక్క రేఖ. మూడు రేఖలూ మెరుస్తున్నాయి. ఈ మూడు రేఖలు సర్వుల భాగ్యరేఖలు. మీరందరూ కూడా మీ మూడు రేఖలను చూస్తున్నారు కదా! ప్రభు పాలనా భాగ్యము బ్రాహ్మణ ఆత్మలైన మీకు తప్ప మరెవ్వరికీ ప్రాప్తించదు. పరమాత్మ పాలన, ఈ పాలన ద్వారా ఎంతటి శ్రేష్ఠమైన పూజ్యనీయులుగా అవుతారు. ఆత్మనైన నాకు పరమాత్మ చదువు యొక్క అధికారము ప్రాప్తిస్తుంది అని ఎప్పుడైనా స్వప్నములోనైనా ఆలోచించారా. కానీ ఇప్పుడు సాకారములో అనుభవము చేస్తున్నారు. స్వయంగా సద్గురువు అమృతవేళ నుండి రాత్రి వరకు ప్రతి కర్మకు శ్రేష్ఠ మతాన్ని ఇచ్చి కర్మ బంధనాలను కర్మ సంబంధములోకి పరివర్తన చేసేందుకు శ్రీమతాన్ని ఇచ్చేందుకు నిమిత్తంగా తయారుచేస్తారు - ఇది కూడా స్వప్నములో లేదు. కానీ ఇప్పుడు మా ప్రతి కర్మ శ్రీమతము అనుసారంగా నడుస్తూ ఉంది అని అనుభవంతో అంటారు. ఇటువంటి అనుభవం ఉందా? పిల్లలందరి యొక్క ఇటువంటి శ్రేష్ఠ భాగ్యాన్ని చూస్తూ బాప్ దాదా కూడా హర్షిస్తారు - వాహ్ నా శ్రేష్ఠ భాగ్యవంతులారా వాహ్! పిల్లలు - వాహ్ బాబా వాహ్ అని అంటారు మరియు బాబా - వాహ్ పిల్లలూ వాహ్ అని అంటారు!

ఈ రోజు అమృతవేళ నుండి పిల్లలు చేసే రెండు సంకల్పాల స్మృతి బాప్ దాదా వద్దకు చేరుకుంది. ఒకటేమో, కొంతమంది పిల్లలకు తమ అకౌంట్ ను ఇవ్వాలన్నది గుర్తుంది. రెండవది, బాబా సాంగత్యపు రంగు యొక్క హోలీ గుర్తుంది. అందరూ హోలీని జరుపుకునేందుకు వచ్చారు కదా! బ్రాహ్మణుల భాషలో జరుపుకోవటము అనగా తయారవ్వటము. హోలీ జరుపుకుంటారు అనగా హోలీ (పవిత్రం) గా అవుతారు. బ్రాహ్మణ పిల్లలు అతి పవిత్రులుగా అవ్వటము అన్నింటికంటే ఎంతో అతీతమైనది మరియు ప్రియమైనది అన్నదానిని బాప్ దాదా చూసారు. ఆ మాటకొస్తే ద్వాపరము యొక్క ఆదిలోని మహానాత్మలు మరియు కాలానుగుణంగా వచ్చిన ధర్మపితలు కూడా పవిత్రముగా, హోలీగా అయ్యారు. కానీ మీ పవిత్రత అన్నింటికంటే శ్రేష్ఠమైనది కూడా, అతీతమైనది కూడా. మొత్తము కల్పములో మహాత్ములు కానీ, ధర్మాత్మలు కానీ, ధర్మపితలు కానీ మీలా అతి పవిత్రులుగా అవ్వలేదు, అవ్వలేరు, ఎందుకంటే మీ విషయములో ఆత్మ కూడా పవిత్రము, శరీరము కూడా పవిత్రము, ప్రకృతి కూడా సతోప్రధాన పవిత్రము. మీ భవిష్య స్వరూపాన్ని ఎదురుగా తెచ్చుకోండి. అందరి ఎదురుగా తమ-తమ భవిష్య రూపము వచ్చిందా? లేకపోతే అలా అవుతామా లేక అవ్వమా లేక ఎలా అవుతామో తెలియనే తెలియదు అని అనుకుంటున్నారా! ఎలా అయినా కానీ పవిత్రముగా అయితే అవుతారు కదా! శరీరము కూడా పవిత్రము, ఆత్మ కూడా పవిత్రము మరియు ప్రకృతి కూడా పవిత్ర పావనము, సుఖదాయకము... నిశ్చయమనే కలముతో మీ భవిష్య చిత్రాన్ని ఎదురుగా తెచ్చుకోగలరు. నిశ్చయము ఉంది కదా! టీచర్లకు నిశ్చయముందా? అచ్ఛా, ఒక్క క్షణములో మీ భవిష్య చిత్రాన్ని ఎదురుగా తెచ్చుకోగలరా? సరే, కృష్ణుడిగా అవ్వకపోయినా కానీ అతని సహచరులుగానైతే అవుతారు కదా! ఎంత ప్రియముగా అనిపిస్తుంది. ఆర్టిస్ట్ గా అవ్వటము వస్తుందా లేక రాదా? ఎదురుగా చూడండి, అంతే. ఇప్పుడు సాధారణంగా ఉన్నాను, రేపటి రోజున (అంటే డ్రామాలోని రేపు, మరుసటి రోజు అని కాదు) మరి రేపు ఆ పవిత్ర శరీరధారిగా అవ్వాల్సిందే. పాండవులు ఏమనుకుంటున్నారు? పక్కాయే కదా, అవుతామా, అవ్వమా అన్న అనుమానమేమీ లేదు కదా? అనుమానమేమైనా ఉందా? లేదు కదా! పక్కాయే. రాజయోగులు అన్నప్పుడు రాజ్యాధికారులుగా అవ్వాల్సిందే. బాబా మీ కొరకు కానుకను తీసుకువచ్చారు అని బాప్ దాదా చాలా సార్లు గుర్తుచేస్తారు కదా, మరి ఏ కానుకను తీసుకువచ్చారు? బంగారు ప్రపంచము, సతోప్రధాన ప్రపంచము యొక్క కానుకను తీసుకువచ్చారు. కనుక నిశ్చయము ఉంది, నిశ్చయానికి గుర్తు ఆత్మిక నషా. ఎంతగా మీ రాజ్యానికి సమీపంగా వస్తూ ఉన్నారో, ఇంటికి కూడా సమీపంగా వస్తూ ఉన్నారో మరియు మీ రాజ్యానికి కూడా సమీపంగా వస్తూ ఉన్నారో, అంతగానే పదే-పదే మీ స్వీట్ హోమ్ మరియు మీ స్వీట్ రాజ్యము యొక్క స్మృతి స్పష్టంగా రావాలి. ఇది సమీపంగా వస్తున్నందుకు గుర్తు. మీ ఇల్లు, మీ రాజ్యము చాలా స్పష్టంగా స్మృతిలోకి రావాలి, మూడవ నేత్రము ద్వారా స్పష్టంగా కనిపించాలి. ఈ రోజు ఇది, రేపు అది అని అనుభవమవ్వాలి. ఎన్ని సార్లు పాత్రను పూర్తి చేసి మీ ఇంటికి మరియు మీ రాజ్యానికి వెళ్ళారు, గుర్తుకొస్తుంది కదా! ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి.

బాప్ దాదా అందరి యొక్క వర్తమాన సమయపు రిజల్టును చూసారు. డబుల్ విదేశీయులలోనైనా లేక భారతవాసులలోనైనా, అందరి రిజల్టులో ఏం చూసారంటే - వర్తమాన సమయములో నిర్లక్ష్యానికి చెందిన కొత్త-కొత్త రకాలు పిల్లలలో చాలా ఉన్నాయి. అనేక రకాల నిర్లక్ష్యాలు ఉన్నాయి. మనసు లోలోపలే - అంతా నడుస్తుందిలే... అని ఆలోచిస్తారు. ఈ రోజుల్లో అన్ని విషయాలలోనూ ఉన్న విశేష స్లోగన్ ఏమిటంటే - ‘‘అంతా నడుస్తుందిలే’’ - ఇది నిర్లక్ష్యము. దీనితో పాటుగా పురుషార్థములో మరియు స్వ పరివర్తనలో నిర్లక్ష్యముతోపాటు కొంత పర్సెంటేజ్ లో - అయిపోతుందిలే, చేసేస్తాములే... అన్న సోమరితనము కూడా రకరకాలుగా ఉంది. బాప్ దాదా కొత్త-కొత్త రకాల నిర్లక్ష్యపు విషయాలను చూసారు, అందుకే నిర్లక్ష్యపు రూపముతో కాకుండా సత్యమైన హృదయముతో మీ సత్యమైన అకౌంట్ ను తప్పకుండా పెట్టుకోండి.

బాప్ దాదా ఈ రోజు రిజల్టును వినిపిస్తున్నారు. వినిపించాలి కదా! లేక కేవలం ప్రేమనే చూపించాలా? ఇది కూడా ప్రేమే. ప్రతి ఒక్కరిపై బాప్ దాదాకు ఎంతటి ప్రేమ ఉంటుందంటే పిల్లలందరూ బ్రహ్మాబాబాతోపాటుగా తమ ఇంటికి వెళ్ళాలి అని కోరుకుంటారు. వెనుక-వెనుక రాకూడదు, సహచరులుగా అయ్యి రావాలి. మరి దాని కోసం సమానంగా అయితే అవ్వాల్సి ఉంటుంది కదా! సమానత లేకుండా సహచరులుగా అయ్యి వారితో పాటు కలిసి వెళ్ళలేరు మరియు ఆ తర్వాత మీ రాజ్యములో మొదటి జన్మ, మొదటి జన్మ అంటే మొదటి జన్మే కదా, ఒకవేళ రెండవ, మూడవ జన్మలోకి వచ్చినా కానీ, పోనీ రాజుగా అయినా కానీ రెండవ జన్మ, మూడవ జన్మ అనే అంటారు కదా! వారితో పాటే వెళ్ళాలి మరియు బ్రహ్మాబాబాతోపాటుగా మొదటి జన్మలో అధికారులుగా అవ్వాలి - వీరే నంబరు వన్ పాస్ విత్ ఆనర్లు. మరి పాస్ విత్ ఆనర్లుగా అవ్వాలా లేక కేవలం పాస్ మార్కుల వారైనా ఫర్వాలేదా? మేము ఏం చేస్తున్నామో, ఏం జరుగుతూ ఉందో అన్నదానిని బాప్ దాదా చూడరు అని ఎప్పుడూ అనుకోకండి. ఇందులో ఎప్పుడూ నిర్లక్ష్యులుగా అవ్వకండి. ఒకవేళ పిల్లలెవరైనా తమ మనసులోని చార్టు గురించి అడిగితే బాప్ దాదా చెప్పగలరు, కానీ ప్రస్తుతం చెప్పేది లేదు. బాప్ దాదా ప్రతి ఒక్క మహారథి, గుర్రపు స్వారీవారు... ఇలా అందరి చార్టును చూస్తున్నారు. వీరు ఉన్నది ఎవరు కానీ చేస్తున్నది ఏమిటి అని చాలా సార్లు బాప్ దాదాకు చాలా జాలి కలుగుతుంది. కానీ బ్రహ్మాబాబా చెప్పేవారు కదా - ఏం చెప్పేవారో గుర్తుందా? బెల్లానికి తెలుసు, బెల్లపు సంచికి తెలుసు అని అనేవారు. అలాగే శివబాబాకు తెలుసు మరియు బ్రహ్మాబాబాకు తెలుసు ఎందుకంటే బాప్ దాదాకు చాలా జాలి కలుగుతుంది, కానీ అటువంటి పిల్లలు బాప్ దాదా యొక్క దయతో కూడిన సంకల్పాలను టచ్ చెయ్యలేరు, క్యాచ్ చెయ్యలేరు, అందుకే బాప్ దాదా అన్నారు - రకరకాల రాయల్ నిర్లక్ష్యాలను బాప్ దాదా చూస్తుంటారు అని. చాలా జాలి కలుగుతుంది అని ఈ రోజు బాప్ దాదా చెప్పేసారు. కొంతమంది పిల్లలు ఎలా భావిస్తారంటే - ఎవరు ఎలా ఉండేవారు అనేది సత్యయుగములో తెలియనే తెలియదు కదా, ఇప్పుడైతే సరదాగా గడిపేద్దాము, ఇప్పుడు ఏం చెయ్యాలనుకుంటే అది చేసేద్దాము, ఎవరూ ఆపేవారు లేరు, ఎవరూ చూసేవారు లేరు. కానీ ఇలా అనుకోవటము తప్పు. కేవలం బాప్ దాదా పేర్లు వినిపించరు, పేర్లు వినిపిస్తే రేపటికి బాగైపోతారు.

మరి ఏం చెయ్యాలో అర్థమైందా, పాండవులు అర్థమయ్యిందా, అర్థమవ్వలేదా! నడిచిపోతుందా? నడవదు, ఎందుకంటే బాప్ దాదా వద్దకు ప్రతి ఒక్కరి ప్రతి రోజు యొక్క రిపోర్ట్ వస్తుంది. బాప్ దాదా ఇరువురూ పరస్పరంలో కూడా ఆత్మిక సంభాషణ చేసుకుంటారు. కనుక బాప్ దాదా పిల్లలందరికీ మళ్ళీ ఈ సూచనను ఇస్తున్నారు - సమయము అన్ని రకాలుగా అతిలోకి వెళ్తుంది, మాయ కూడా తన అతి యొక్క పాత్రను అభినయిస్తుంది, ప్రకృతి కూడా తన అతి యొక్క పాత్రను అభినయిస్తుంది, ఇటువంటి సమయములో బ్రాహ్మణ పిల్లలకు తమవైపు అటెన్షన్ కూడా అతిగా ఉండాలి అనగా మనసా-వాచా-కర్మలలో అటెన్షన్ అతిగా ఉండాలి. సాధారణ పురుషార్థము ఉండకూడదు. ఆ మాటకొస్తే బాప్ దాదా చూసారు - సేవ పట్ల లగనము బాగుంది, సేవ కొరకు ఎవర్రెడీగా ఉన్నారు, అవకాశం లభిస్తే ప్రేమగా సేవ చేయడానికి ఎవర్రెడీగా ఉన్నారు. కానీ ఇప్పుడు సేవలో దీనిని చేర్చండి - వాణితోపాటు మనసా, తమ ఆత్మను విశేషముగా ఏదో ఒక ప్రాప్తి యొక్క స్వరూపములో స్థితి చేసుకుని వాణితో సేవ చెయ్యండి. ఒకవేళ భాషణ చేస్తున్నారనుకోండి, వాణితోనైతే భాషణ చాలా బాగా చేస్తారు కానీ ఆ సమయములో తమ ఆత్మిక స్థితిలో విశేషంగా శక్తి అయినా లేక శాంతి అయినా లేక పరమాత్మ ప్రేమ అయినా, ఇలా ఏదో ఒక విశేష అనుభూతి యొక్క స్థితిలో స్థితి చేసుకుని మనసా ద్వారా ఆత్మిక స్థితి యొక్క ప్రభావాన్ని వాయుమండలములో వ్యాపింపజేయండి మరియు వాణితో సందేశాన్ని ఇవ్వండి. వాణి ద్వారా సందేశాన్ని ఇవ్వండి, మనసా ఆత్మిక స్థితి ద్వారా అనుభూతిని చేయించండి. భాషణ చేసే సమయములో మీ మాటల ద్వారా, మీ మస్తకము ద్వారా, నయనాల ద్వారా, ముఖము ద్వారా ఆ అనుభూతి యొక్క గుణము కనిపించాలి, ఎలా అంటే - ఈ రోజు భాషణనైతే విన్నాము కానీ పరమాత్ముని ప్రేమ యొక్క అనుభూతి చాలా బాగా జరిగింది అని ఎదుటివారు అనాలి. భాషణ చేసినప్పుడు దాని రిజల్టులో చాలా బాగా చెప్పారు, చాలా బాగుంది, చాలా మంచి విషయాలు వినిపించారు అని అంటుంటారు కదా, అలాగే మీ ఆత్మ స్వరూపపు అనుభూతిని కూడా వారు వర్ణించాలి. మనుష్యాత్మలకు వైబ్రేషన్లు చేరాలి, వాయుమండలము తయారవ్వాలి. సైన్స్ సాధనాలు చల్లని వాతావరణాన్ని తయారుచెయ్యగలవు, చాలా మంచి చల్లదనం వస్తుంది అని అందరూ అనుభూతి చెందుతారు, అలాగే వేడి వాతావరణాన్ని కూడా అనుభవం చేయించగలవు. సైన్స్ చలిలో వెచ్చదనాన్ని అనుభవం చేయించగలదు, వేడిలో చల్లదనాన్ని అనుభవం చేయించగలదు, మరి మీ సైన్స్ ప్రేమ స్వరూపపు, సుఖ స్వరూపపు, శాంత స్వరూపపు వాయుమండలాన్ని అనుభవం చేయించలేదా! దీని రీసెర్చ్ చెయ్యండి. కేవలం మంచిగా ఉంది అని అనటం కాదు, కానీ మంచిగా తయారవ్వాలి, అప్పుడు సమాప్తి సమయాన్ని సమాప్తము చేసి తమ రాజ్యాన్ని తీసుకువస్తారు. ఎందుకు, మీకు మీ రాజ్యము గుర్తుకురాదా? సంగమయుగము శ్రేష్ఠమైనదే, అది కరక్టే, ఇది వజ్రతుల్యమైనదే, కానీ ఓ దయా హృదయులారా, విశ్వకళ్యాణీ పిల్లలరా, దుఃఖముతో, అశాంతితో ఉన్న మీ సోదరీ-సోదరులపై దయ కలగటం లేదా? ఉల్లాసము రావటం లేదా, దుఃఖమయ ప్రపంచాన్ని సుఖమయ ప్రపంచముగా తయారుచెయ్యాలి అన్న ఈ ఉల్లాసము రావటం లేదా? దుఃఖాన్ని చూడాలనుకుంటున్నారా, ఇతరుల దుఃఖము చూసి కూడా దయ కలగటం లేదా? వారు మీ సోదరులు, మీ సోదరీలు, మరి వారి దుఃఖాన్ని చూడటం మంచిగా అనిపిస్తుందా? మీ దయాళు, కృపాళు స్వరూపాన్ని ఇమర్జ్ చెయ్యండి. ఈ ప్రోగ్రామ్ చేసాము, ఆ ప్రోగ్రామ్ చేసాము... సంవత్సరం పూర్తయిపోయింది అని కేవలం ఇటువంటి సేవలోనే ఉండిపోకండి. ఇప్పుడు దయా స్వరూపులుగా అవ్వండి. దృష్టి ద్వారానైనా, అనుభూతి ద్వారానైనా, ఆత్మిక స్థితి యొక్క ప్రభావము ద్వారానైనా ఇప్పుడు దయా స్వరూపులుగా అవ్వండి, దయా హృదయులుగా అవ్వండి. అచ్ఛా!

బాప్ దాదా మరో విషయాన్ని కూడా చూసారు, దానిని వినిపించడం మంచిగా అనిపించదు. అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు, చాలా-చాలా మంచి పిల్లలు కూడా ఇతరుల విషయాలలో చాలా జోక్యం చేసుకుంటారు. ఇతరుల విషయాలను చూడటము, ఇతరుల విషయాలను వర్ణన చెయ్యటము... చూసేది కూడా వ్యర్థమైన విషయాలు చూస్తారు. ఇతరుల విశేషతలను వర్ణన చేయడం తక్కువగా ఉంది. ప్రతి ఒక్కరిలోని విశేషతలను చూడటము, విశేషతలను వర్ణన చెయ్యటము, వాళ్ళ విశేషతల ద్వారా వాళ్ళకు ఉల్లాస-ఉత్సాహాలను కలిగించటము, ఇది తక్కువగా ఉంది. కానీ వదిలేయండి అని బాప్ దాదా ఏ విషయాల గురించైతే చెప్తారో, ఆ వ్యర్థ విషయాలను, తమలో ఉన్న వ్యర్థ విషయాలను వదిలెయ్యటానికి ప్రయత్నమైతే చేస్తారు, కానీ ఇతరుల విషయాలను చూసే అలవాటు మాత్రం ఉంటుంది. ఇందులో చాలా సమయము పోతుంది. బాప్ దాదా ఒక విశేషమైన శ్రీమతాన్ని ఇస్తున్నారు - ఇది చాలా మామూలు విషయమే కానీ చాలా సమయము చాలా వ్యర్థముగా పోతుంది. మాటలలో నిర్మానులుగా అవ్వండి. మాటలలో నిర్మానత తక్కువ అవ్వకూడదు. సాధారణ మాటలు మాట్లాడుతారు, ఇలా మాట్లాడవలసే వస్తుంది అని అనుకుంటారు, కానీ నిర్మానతకు బదులుగా ఒకవేళ ఎవరైనా అథారిటీతో కూడిన మాటలు మాట్లాడితే, నిర్మానచిత్తముగా మాట్లాడటకపోతే, వారు చేస్తున్న కార్యం యొక్క లేక సీట్ (పదవి) యొక్క అభిమానం 5 శాతం కనిపిస్తుంది. నిర్మానత అనేది బ్రాహ్మణ జీవితపు విశేష అలంకారము. నిర్మానత మనసులో, వాణిలో, మాటలలో, సంబంధ-సంపర్కములలో... ఉండాలి. అలాగని మూడు విషయాలలో నేను నిర్మానముగా ఉన్నాను, ఒక్కదాంట్లో తక్కువగా ఉంటే ఏమవుతుంది అని అనుకోకూడదు! కానీ ఆ ఒక్క లోపము పాస్ విత్ ఆనర్ లుగా అవ్వనివ్వదు. నిర్మానతయే మహానత. ఇది వంగడము కాదు, ఇది వంగేలా చేయటము. కొంతమంది పిల్లలు నవ్వుతూ ఇలా అనేస్తారు - నేనే వంగాలా, వాళ్ళు కూడా వంగాలి కదా. కానీ ఇది వంగటము కాదు, వాస్తవానికి ఇది పరమాత్మను కూడా మీపై వంగేలా చేసుకోవటము. ఆత్మల విషయమే కాదు, ఇది పరమాత్మను కూడా మీపై వంగేలా చేసుకోవటము. నిర్మానత అనేది స్వతహాగానే నిరహంకారులుగా చేస్తుంది. నిరహంకారులుగా అయ్యేందుకు ఇక ప్రత్యేకంగా పురుషార్థము చెయ్యవలసి ఉండదు. నిర్మానత అనేది ప్రతి ఒక్కరి మనసులో మీ కొరకు ప్రేమ స్థానాన్ని ఏర్పరుస్తుంది. నిర్మానత అనేది ప్రతి ఒక్కరి మనసు నుండి మీ కొరకు ఆశీర్వాదాలు వెలువడేలా చేస్తుంది. చాలా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆశీర్వాదాలు అనేవి పురుషార్థములో లిఫ్ట్ కంటే కూడా రాకెట్ లా అవుతాయి. నిర్మానత అటువంటిది. ఎవరు ఎలా ఉన్నా సరే, బిజీగా ఉన్నా సరే, కఠిన మనస్కులైనా సరే, క్రోధీలైనా సరే, నిర్మానత అనేది మీకు సర్వుల ద్వారా సహయోగాన్ని ఇప్పించేందుకు నిమిత్తంగా అవుతుంది. నిర్మానతతో ఉన్నవారు, ప్రతి ఒక్కరి సంస్కారము అనుసారముగా స్వయాన్ని నడిపించుకోగలరు. వారు రియల్ గోల్డ్ (అసలైన బంగారమైన) అయిన కారణముగా వారిలో స్వయాన్ని మోల్డ్ చేసుకునే (మలుచుకునే) విశేషత ఉంటుంది. కనుక బాప్ దాదా చూసారు - మాట తీరులో కూడా, నడవడికలో కూడా, సంబంధ-సంపర్కములో కూడా, సేవలో కూడా ఇతరులతో నిర్మాన స్వభావులుగా ఉండటము అనేది విజయాన్ని ప్రాప్తి చేయిస్తుంది, అందుకే ఈ సంవత్సరములో విశేషంగా బాప్ దాదా ఈ సంవత్సరానికి నిర్మాన, నిర్మల సంవత్సరము అనే పేరును ఇస్తున్నారు. ఈ సంవత్సరాన్ని ఇలా జరుపుకుంటారు కదా.

బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ ఈ సంవత్సరములో వ్యర్థము నుండి ముక్తులుగా చూడాలనుకుంటున్నారు. ముక్తి సంవత్సరాన్ని జరుపుకోండి. ఏ లోపమున్నా, ఆ లోపానికి ముక్తినివ్వండి ఎందుకంటే ఎప్పటివరకైతే దానికి ముక్తినివ్వరో అప్పటివరకు బాబాతో పాటు ముక్తిధామానికి వెళ్ళలేరు. మరి ముక్తినిస్తారా? ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటారా? జరుపుకుంటాము అనేవారు ఇలా చేతులూపండి. జరుపుకుంటారా? ఒకరినొకరు చూసుకున్నారు కదా, జరుపుకుంటారు కదా! మంచిది. ఒకవేళ ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటే బాప్ దాదా వజ్రాలతో పొదిగిన పళ్ళాల నిండుగా చాలా-చాలా అభినందనలు, గ్రీటింగ్స్, శుభాకాంక్షలను ఇస్తారు. మంచిది, స్వయాన్ని కూడా ముక్తులుగా చేసుకోండి, మీ సోదర, సోదరీలను కూడా దుఃఖము నుండి దూరం చెయ్యండి. ఆ అభాగ్యుల మనసుల నుండి - మా తండ్రి వచ్చేసారు అని సంతోషముతో కూడిన ఈ మాట రావాలి. సరే. అచ్ఛా!

నలువైపులా ఉన్న అతి పవిత్రమైన ఆత్మలందరికీ, సదా నిర్మానులుగా అయ్యి నిర్మాణము చేసే బాప్ దాదా యొక్క సమీప ఆత్మలకు, సదా తమ పురుషార్థము యొక్క విధిని వేగముగా, తీవ్రతరం చేసుకుని సంపన్నముగా అయ్యే స్నేహీ ఆత్మలకు, సదా తమ పొదుపు ఖాతాను పెంచుకునే తీవ్ర పురుషార్థులకు, తీవ్ర బుద్ధి కల పిల్లలకు, విశాల బుద్ధికి అభినందనలు. ప్రియస్మృతులతోపాటు పిల్లలందరికీ నమస్తే.

వరదానము:- ఒకే బలము, ఒకే విశ్వాసము యొక్క ఆధారముతో మాయను సరెండర్ చేయించే శక్తిశాలి ఆత్మా భవ
ఒకే బలము, ఒకే విశ్వాసము అనగా సదా శక్తిశాలి. ఎక్కడైతే ఒకే బలము, ఒకే విశ్వాసము ఉంటుందో, అక్కడ ఎవ్వరూ కదిలించలేరు. వారి ఎదురుగా మాయ మూర్ఛితమైపోతుంది, సరెండర్ అయిపోతుంది. మాయ సరెండర్ అయినట్లయితే సదా విజయులుగా ఉండనే ఉంటారు. కనుక విజయము మా జన్మసిద్ధ అధికారము అన్న ఇదే నషా ఉండాలి. ఈ అధికారాన్ని ఎవ్వరూ లాక్కోలేరు. హృదయములో ఈ స్మృతి ఇమర్జ్ అయి ఉండాలి - మేమే కల్ప-కల్పము యొక్క శక్తులము మరియు పాండవులము, మేమే విజయులుగా అయ్యాము, ఉన్నాము మరియు మళ్ళీ అవుతాము.
స్లోగన్:- కొత్త ప్రపంచము యొక్క స్మృతితో సర్వ గుణాలను ఆహ్వానించండి మరియు తీవ్రగతితో ముందుకు వెళ్ళండి.

 

సూచన:- ఈ రోజు నెలలోని మూడవ ఆదివారము, అంతర్జాతీయ యోగ దివసము, బ్రహ్మా వత్సలందరూ సంగఠిత రూపములో సాయంత్రము 6.30 నుండి 7.30 గం.ల వరకు విశేషముగా దయాళు, కృపాళు అయిన బాబాతో పాటు ప్రతి ఆత్మ పట్ల దయతో, కృపతో కూడిన దృష్టిని ప్రసరింపజేయండి. అందరికీ ఆశీర్వాదాలను ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలను తీసుకోవాలి.

మురళి అంటే ఏమిటి?

మురళి బ్రహ్మకుమారీల దైనిక ఆధ్యాత్మిక బోధన, ఇది ప్రతి ఉదయం మధుబన్ నుండి ప్రచురించబడుతుంది. ఇక్కడ మీరు ఈరోజు మురళిని తెలుగులో చదవవచ్చు, ఆడియో వినవచ్చు మరియు PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధ్యయనానికి సహాయంగా పాఠ్యాన్ని హైలైట్ చేయవచ్చు — మీ గుర్తులు ఈ బ్రౌజర్‌లోనే సురక్షితంగా ఉంటాయి.

28 భాషల్లో మురళి

Daily Murli · Madhuban మూలం: మధుబన్ మురళి విభాగం ఇది స్వతంత్ర రీడర్ యాప్, అధికారిక వెబ్‌సైట్ కాదు.