తెలుగు మురళి · Brahma Kumaris

తెలుగు మురళి · 21 అక్టోబర్, 2024

ఓం శాంతి · BapDada ·

ఈరోజు మురళి — today’s murli in Telugu, BK Telugu murli.

18
మురళి21 అక్టోబర్, 2024 · తెలుగు
0:00--:--

పాఠ్యాన్ని ఎంచుకోండి → హైలైట్ / బాక్స్ / అండర్‌లైన్

21-10-2024
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
మధువనం

‘‘మధురమైన పిల్లలూ - సత్యమైన తండ్రితో సత్యముగా ఉండండి, సత్యతతో కూడిన చార్టు పెట్టండి, జ్ఞాన అహంకారాన్ని వదిలి స్మృతిలో ఉండేందుకు పూర్తి-పూర్తి పురుషార్థం చేయండి’’
ప్రశ్న:- మహావీరులైన పిల్లల ముఖ్యమైన గుర్తులు ఏమిటి?
జవాబు:- మహావీరులైన పిల్లలు ఎవరంటే - ఎవరి బుద్ధిలో అయితే నిరంతరమూ తండ్రి స్మృతి ఉంటుందో వారు. మహావీరులు అనగా శక్తివంతులు. మహావీరులు ఎవరంటే - ఎవరికైతే నిరంతరమూ సంతోషము ఉంటుందో వారు. వారు ఆత్మాభిమానులుగా ఉంటారు, కొద్దిగా కూడా దేహ అహంకారము ఉండదు. ఇటువంటి మహావీరులైన పిల్లల బుద్ధిలో - నేను ఒక ఆత్మను, బాబా నన్ను చదివిస్తున్నారు అని ఉంటుంది.

ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతున్నారు - స్వయాన్ని రూహ్ లేక ఆత్మగా భావిస్తూ కూర్చున్నారా? ఎందుకంటే ఇది కొంత కష్టమని, ఇందులోనే శ్రమ ఉందని తండ్రికి తెలుసు. ఎవరైతే ఆత్మాభిమానులుగా అయి కూర్చున్నారో వారినే మహావీరులు అని అంటారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి, వారినే మహావీరులు అని అంటారు. ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ ఉండండి - నేను ఆత్మాభిమానిగా ఉన్నానా? స్మృతి ద్వారానే మహావీరులుగా అవుతారు అనగా సుప్రీమ్ గా అవుతారు. ఇతర ధర్మాలవారు ఎవరైతే వస్తారో వారు ఇంత సుప్రీమ్ గా అవ్వరు. వారు రావడము కూడా ఆలస్యముగానే వస్తారు. మీరు నంబరువారుగా సుప్రీమ్ గా అవుతారు. సుప్రీమ్ అనగా శక్తివంతులు లేక మహావీరులు. కావున లోలోపల నేను ఒక ఆత్మను అన్న సంతోషము ఉంటుంది. మన ఆత్మలందరి తండ్రి మనల్ని చదివిస్తున్నారు. కొందరు తమ చార్టును 25 శాతం చూపిస్తారు, కొందరు 100 శాతం చూపిస్తారు, ఇది కూడా తండ్రికి తెలుసు. కొందరు అంటారు - 24 గంటల్లో స్మృతి అరగంట నిలుస్తుంది, మరి అది ఎంత శాతము అయినట్లు? మిమ్మల్ని మీరు చాలా సంభాళించుకోవాలి. మెల్లమెల్లగా మహావీరులుగా అవ్వాలి. వెంటనే అయిపోలేరు, ఇందులో శ్రమ ఉంది. బ్రహ్మజ్ఞానులు, తత్వజ్ఞానులు ఎవరైతే ఉన్నారో, వారు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు అని అనుకోకండి. వారు అయితే ఇల్లయిన బ్రహ్మ తత్వమును పరమాత్మగా భావిస్తారు మరియు స్వయాన్ని అహం బ్రహ్మస్మి అని పిలుచుకుంటారు. ఎక్కడైనా ఇంటితో యోగాన్ని జోడిస్తారా? ఇప్పుడు పిల్లలైన మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు. మీ చార్టును మీరు చూసుకోవాలి - 24 గంటల్లో మేము ఎంత సమయం స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నాము. మనం ఈశ్వరీయ సేవలో ఉన్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, ఆన్ గాడ్లీ సర్వీస్. తండ్రి కేవలం మన్మనాభవ అని చెప్తారు అనగా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి అని చెప్తారు అని ఈ విషయాన్నే అందరికీ చెప్పండి. ఇదే మీ సేవ. ఎంతగా మీరు సేవ చేస్తారో అంత ఫలము కూడా లభిస్తుంది. ఈ విషయాలు బాగా అర్థం చేసుకోవలసినవి. మంచి-మంచి మహారథులైన పిల్లలు కూడా ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోరు. ఇందులో ఎంతో శ్రమ ఉంది. కష్టపడకుండా ఫలము లభించదు.

బాబా చూస్తారు - కొందరు చార్టు వ్రాసి పంపిస్తారు, కొందరైతే చార్టును అసలు వ్రాయలేకపోతారు. జ్ఞానము యొక్క అహంకారము ఉంది. వారు స్మృతిలో కూర్చునే శ్రమను చేయలేకపోతారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ముఖ్యమైన విషయము స్మృతి. నా చార్ట్ ఎలా ఉంటోంది అని మీపై మీరు దృష్టి పెట్టుకోవాలి. దానిని నోట్ చేసుకోవాలి. కొందరు, చార్టు వ్రాయడానికి ఖాళీ లేదు అని అంటారు. తండ్రి చెప్తున్న ముఖ్యమైన విషయము ఏమిటంటే - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ అల్ఫ్ ను (భగవంతుడిని) స్మృతి చేయండి. ఇక్కడ ఎంత సమయమైతే కూర్చుంటారో అంత సమయమూ మధ్యమధ్యలో మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోండి - నేను ఎంత సమయం స్మృతిలో కూర్చున్నాను? ఇక్కడ ఎప్పుడైతే కూర్చుంటారో, అప్పుడు మీరు స్మృతిలోనే ఉండాలి, అలాగే చక్రమును తిప్పినా పర్వాలేదు. మనం బాబా వద్దకు తప్పకుండా వెళ్ళాలి. పవిత్రముగా, సతోప్రధానముగా అయి వెళ్ళాలి. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కొందరైతే వెంటనే మర్చిపోతారు. తమ సత్యాతి-సత్యమైన చార్టును తెలియజేయరు. ఇలాంటి మహారథులు ఎందరో ఉన్నారు. వారు ఎప్పుడూ సత్యం చెప్పరు. అర్ధకల్పం అసత్యమైన ప్రపంచం నడిచింది కావున అసత్యం లోలోపల నిలిచిపోయినట్లు అయిపోయింది. అందులోనూ ఎవరైతే సాధారణముగా ఉన్నారో వారు వెంటనే చార్ట్ వ్రాస్తారు. తండ్రి అంటారు - మీరు స్మృతియాత్రతో పాపాలను భస్మం చేసుకుని పావనంగా అవుతారు. కేవలం జ్ఞానం ద్వారానైతే పావనంగా అవ్వరు, ఇక లాభమేముంది? పావనంగా తయారయ్యేందుకే పిలుస్తారు కూడా. దాని కొరకు కావాల్సింది స్మృతి. ప్రతి ఒక్కరూ సత్యతతో తమ చార్టును తెలియజేయాలి. ఇక్కడ మీరు ముప్పావుగంట కూర్చుంటే, ఆ ముప్పావుగంట మేము ఎంత సమయం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి స్మృతిలో ఉన్నాము అన్నది చూసుకోవాలి. కొందరికైతే నిజం చెప్పడానికి సిగ్గుగా అనిపిస్తుంది. తండ్రికి సత్యం చెప్పరు. ఈ సేవ చేసాము, ఇంతమందికి అర్థం చేయించాము, ఇది చేసాము, అది చేసాము అని వారు సమాచారాన్ని ఇస్తారు కానీ స్మృతియాత్ర చార్టును వ్రాయరు. తండ్రి అంటారు, స్మృతియాత్రలో ఉండని కారణముగానే మీ బాణం ఎవరికీ తగులదు. జ్ఞాన ఖడ్గములో పదును నిండదు. జ్ఞానాన్ని అయితే వినిపిస్తారు, కానీ యోగ బాణం తగలడం చాలా కష్టము. బాబా అయితే అంటారు, ముప్పావుగంటలో 5 నిమిషాలు కూడా స్మృతియాత్రలో కూర్చోవటం లేదేమో. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని ఏ విధముగా స్మృతి చేయాలి అన్నది అర్థమే చేసుకోరు. కొందరు, మేము నిరంతరమూ స్మృతిలోనే ఉంటాము అని అంటారు. బాబా అంటారు, ఆ అవస్థ ప్రస్తుతం ఇంకా ఏర్పడదు. ఒకవేళ నిరంతరమూ స్మృతి చేసినట్లయితే - కర్మాతీత అవస్థ వచ్చేస్తుంది, జ్ఞాన పరాకాష్ఠ ఏర్పడుతుంది, ఎవరికైనా కొద్దిగా అర్థం చేయించినా బాణం ఎంతగానో తగులుతుంది. ఇందులో శ్రమ ఉంది కదా. విశ్వాధిపతులుగా ఊరికే అలా అయిపోతారా. మాయ మీ బుద్ధి యోగాన్ని ఎక్కడెక్కడికో తీసుకువెళ్తుంది. మిత్ర-సంబంధీకులు మొదలైనవారంతా గుర్తుకువస్తూ ఉంటారు. ఎవరికైనా విదేశాలకు వెళ్ళేది ఉంటే వారికి మిత్ర-సంబంధీకులు, స్టీమర్లు, విమానాలు మొదలైనవే గుర్తుకువస్తూ ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలి అన్న ప్రాక్టికల్ కోరిక ఏదైతే ఉందో అది లాగుతూ ఉంటుంది. బుద్ధియోగము పూర్తిగా తెగిపోతుంది. ఇంకెటువైపుకూ బుద్ధి వెళ్ళకుండా ఉండాలి అంటే అందులో చాలా కష్టపడవలసి ఉంటుంది. కేవలం ఒక్క తండ్రి స్మృతే ఉండాలి. ఈ దేహము కూడా గుర్తుకురాకూడదు. మీకు ఈ అవస్థ చివరిలో ఏర్పడుతుంది.

రోజురోజుకు ఎంతగా స్మృతియాత్రను పెంచుతూ ఉంటారో, అంతగా అందులో మీ కళ్యాణమే ఉంది. ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా మీ సంపాదన జరుగుతుంది. ఒకవేళ శరీరము పోతే ఇక సంపాదననైతే చేసుకోలేరు. వెళ్ళి చిన్న పిల్లలుగా అవుతారు. అప్పుడిక సంపాదన ఏం చేసుకోగలరు. ఆత్మ ఈ సంస్కారాన్ని తీసుకువెళ్ళినా కానీ మళ్ళీ దీని స్మృతిని కలిగించేందుకు టీచర్ అయితే కావాలి కదా. తండ్రి కూడా స్మృతిని కలిగిస్తారు కదా. తండ్రిని స్మృతి చేయండి - తండ్రి స్మృతి ద్వారానే పావనంగా అవుతారు అని మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. వారైతే గంగా స్నానాలనే ఉన్నతముగా భావిస్తారు, అందుకే గంగా స్నానాలనే చేస్తూ ఉంటారు. బాబా అయితే ఈ విషయాలన్నింటిలో అనుభవజ్ఞులు కదా. వీరైతే ఎందరో గురువులను ఆశ్రయించారు. వారు నీటి స్నానాలు చేయడానికి వెళ్తారు. ఇక్కడ మీ స్నానము స్మృతియాత్ర ద్వారా జరుగుతుంది. తండ్రి స్మృతితో తప్ప మీ ఆత్మ పావనంగా అవ్వలేదు. దీని పేరే యోగము అనగా స్మృతియాత్ర. జ్ఞానాన్ని స్నానముగా భావించకండి. యోగమే స్నానము. జ్ఞానము చదువు, యోగము స్నానము, దాని ద్వారా పాపాలు అంతమవుతాయి. జ్ఞానము మరియు యోగము, రెండూ వేర్వేరు. స్మృతి ద్వారానే జన్మ-జన్మాంతరాల పాపాలు భస్మమవుతాయి. తండ్రి అంటారు, ఈ స్మృతియాత్ర ద్వారానే మీరు పావనంగా అయి సతోప్రధానముగా అవుతారు. మధురాతి మధురమైన పిల్లలూ, ఈ విషయాలను బాగా అర్థం చేసుకోండి అని తండ్రి అయితే ఎంతో బాగా అర్థం చేయిస్తారు. ఇది మర్చిపోకండి. స్మృతియాత్ర ద్వారానే జన్మ-జన్మాంతరాల పాపాలు అంతమవుతాయి. ఇకపోతే జ్ఞానము సంపాదన. స్మృతి మరియు చదువు, రెండూ వేర్వేరు. జ్ఞానము మరియు విజ్ఞానము - జ్ఞానము అనగా చదువు, విజ్ఞానము అనగా యోగము లేక స్మృతి. దేనిని ఉన్నతముగా భావిస్తారు - జ్ఞానమునా లేక యోగమునా? స్మృతియాత్ర చాలా ఉన్నతమైనది, అందులోనే శ్రమ ఉంది. స్వర్గములోకైతే అందరూ వెళ్తారు. సత్యయుగము స్వర్గము, త్రేతా సెమీ స్వర్గము. అక్కడకు ఈ చదువు అనుసారంగా వెళ్ళి విరాజమానమవుతారు. ఇకపోతే ముఖ్యమైనది స్మృతి విషయము. ప్రదర్శనీ లేక మ్యూజియం మొదలైనవాటిలో కూడా మీరు జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు. యోగాన్ని అర్థం చేయించలేరు. కేవలం - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని ఇంతవరకు చెప్తారు. కానీ జ్ఞానాన్ని అయితే ఎంతో వినిపిస్తారు. తండ్రి అంటారు, మొట్టమొదటి విషయంగా ఇదే చెప్పండి - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని. ఈ జ్ఞానాన్ని ఇచ్చేందుకే మీరు ఇన్ని చిత్రాలు మొదలైనవాటిని తయారుచేస్తారు. యోగము కొరకు ఎటువంటి చిత్రము యొక్క అవసరమూ లేదు. చిత్రాలన్నీ జ్ఞానాన్ని వివరించేందుకే తయారుచేయబడతాయి. స్వయాన్ని ఆత్మగా భావించడం ద్వారా దేహ అహంకారం పూర్తిగా తెగిపోతుంది. జ్ఞానాన్ని వర్ణన చేయడానికైతే తప్పకుండా నోరు కావాలి. యోగముకైతే ఒక్కటే విషయము - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. చదువులోనైతే దేహము యొక్క అవసరముంది. శరీరము లేకుండా ఎలా చదువుకుంటారు లేక చదివిస్తారు?

పతిత-పావనుడు తండ్రే, కావున వారితో యోగాన్ని జోడించవలసి ఉంటుంది కదా. కానీ ఇది ఎవరికి తెలియదు. తండ్రి స్వయంగా వచ్చి నేర్పిస్తారు, మనుష్యులు మనుష్యులకు ఎప్పుడూ నేర్పించలేరు. నన్ను స్మృతి చేయండి అని తండ్రే అంటారు, దీనిని పరమాత్ముని జ్ఞానము అని అంటారు. పరమాత్మయే జ్ఞానసాగరుడు. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. అందరికీ ఇదే చెప్పండి - అనంతమైన తండ్రిని స్మృతి చేయండి. ఆ తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. వారు కొత్త ప్రపంచ స్థాపన జరుగనున్నది అన్నది అర్థమే చేసుకోరు కావున భగవంతుడిని స్మృతి చేయలేరు. ఈ విషయము వారి ధ్యాసలోనే లేకపోతే ఇక వారు ఎందుకు ఆలోచిస్తారు. ఇది కూడా మీకు తెలుసు. పరమపిత పరమాత్మ శివ భగవానుడు ఒక్కరే. బ్రహ్మా దేవతాయ నమః అని అంటారు కూడా, మళ్ళీ చివరిలో శివ పరమాత్మాయ నమః అని అంటారు. ఆ తండ్రి ఉన్నతోన్నతమైనవారు. కానీ వారు ఎవరు అన్నది కూడా అర్థం చేసుకోరు. ఒకవేళ రాయి-రప్పల్లో ఉన్నట్లయితే మరి నమస్కరించేది ఏముంది? అర్థ రహితముగా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడైతే మీరు శబ్దము నుండి అతీతముగా వెళ్ళాలి అనగా నిర్వాణధామానికి, శాంతిధామానికి వెళ్ళాలి. శాంతిధామము, సుఖధామము అని అంటారు. అది స్వర్గధామము, నరకాన్ని ధామము అని అనరు. ఈ పదాలు చాలా సహజమైనవి. క్రైస్టు యొక్క ధర్మము ఎంతవరకు నడుస్తుంది? ఇది కూడా వారికేమీ తెలియదు. క్రైస్టుకు 3000 సంవత్సరాల క్రితం ప్యారడైజ్ ఉండేదని అనగా దేవీ-దేవతల రాజ్యము ఉండేదని కూడా అంటారు అనగా క్రిస్టియన్లు వచ్చి 2000 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు మళ్ళీ దేవతా ధర్మము ఉండాలి కదా. మనుష్యుల బుద్ధి అసలేమీ పని చేయదు. డ్రామా రహస్యము తెలియని కారణంగా ఎన్ని ప్లాన్లు తయారుచేస్తూ ఉంటారు. ఈ విషయాల గురించి పెద్ద వయస్సు కల వృద్ధ మాతలైతే అర్థం చేసుకోలేరు. తండ్రి అర్థం చేయిస్తారు - ఇప్పుడు ఇది మీ అందరి వానప్రస్థావస్థ. వాణి నుండి అతీతముగా వెళ్ళాలి. వారు నిర్వాణధామానికి వెళ్ళారు అని అంటారు కానీ అలా ఎవ్వరూ వెళ్ళరు. తప్పకుండా మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. తిరిగి ఎవరూ వెళ్ళరు. వానప్రస్థములోకి వెళ్ళేందుకు గురువును ఆశ్రయిస్తారు. ఎన్నో వానప్రస్థ ఆశ్రమాలు ఉన్నాయి. మాతలు కూడా ఎంతోమంది ఉన్నారు. అక్కడ కూడా మీరు సేవ చేయవచ్చు. వానప్రస్థము యొక్క అర్థమేమిటి అనేది మీకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరందరూ వానప్రస్థులు. మొత్తం ప్రపంచమంతా వానప్రస్థముగా ఉంది. మనుష్యమాత్రులనెవరినైతే చూస్తారో వారందరూ వానప్రస్థులే. సర్వుల సద్గతిదాత ఒక్క సద్గురువే. అందరూ అక్కడకు వెళ్ళవలసిందే. ఎవరైతే బాగా పురుషార్థం చేస్తారో, వారు తమ ఉన్నత పదవిని పొందుతారు. దీనిని తీర్పు ఇచ్చే చివరి సమయము అని అంటారు. తీర్పు ఇచ్చే సమయము యొక్క అర్థాన్ని కూడా వారు అర్థం చేసుకోరు. పిల్లలైన మీలో కూడా నంబరువారుగా అర్థం చేసుకుంటారు. ఇది చాలా ఉన్నతమైన గమ్యము. ఇప్పుడు మనం తప్పకుండా ఇంటికి వెళ్ళాలి అని అందరూ అర్థం చేసుకోవాలి. ఆత్మలు వాణి నుండి అతీతముగా వెళ్ళాలి, మళ్ళీ పాత్రను రిపీట్ చేస్తారు. కానీ తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ వెళ్ళినట్లయితే ఉన్నత పదవిని పొందుతారు. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. ఎటువంటి అశుద్ధమైన పనులను, దొంగతనం మొదలైనవాటిని చేయకూడదు. మీరు యోగము ద్వారానే పుణ్యాత్ములుగా అవుతారు, అంతేకానీ జ్ఞానము ద్వారా కాదు. ఆత్మ పవిత్రముగా ఉండాలి. శాంతిధామములోకి పవిత్ర ఆత్మలే వెళ్ళగలుగుతాయి. ఆత్మలన్నీ అక్కడ ఉంటాయి, ఇప్పుడు వస్తూ ఉంటాయి. ఇప్పుడింకా ఎవరైతే మిగిలి ఉన్నారో, వారు కూడా వస్తూ ఉంటారు.

పిల్లలైన మీరు స్మృతియాత్రలో ఎంతగానో ఉండాలి. ఇక్కడ మీకు మంచి సహాయం లభిస్తుంది. పరస్పరం ఒకరి బలం ఒకరికి లభిస్తూ ఉంటుంది కదా. కొద్దిమంది పిల్లలైన మీ శక్తియే పని చేస్తుంది. గోవర్ధన పర్వతాన్ని చూపిస్తారు కదా. వేలుతో పైకి ఎత్తారు. మీరు గోప-గోపికలు కదా. సత్యయుగ దేవీ-దేవతలను గోప, గోపికలు అని అనరు. మీరే మీ వేలును అందిస్తారు. ఇనుప యుగాన్ని బంగారు యుగముగా తయారుచేయడానికి లేక నరకాన్ని స్వర్గముగా తయారుచేయడానికి మీరు ఒక్క తండ్రితో బుద్ధియోగాన్ని జోడిస్తారు. యోగము ద్వారానే పవిత్రముగా అవ్వాలి. ఈ విషయాలను మర్చిపోకూడదు. ఈ శక్తి మీకు ఇక్కడే లభిస్తుంది. బయట అయితే ఆసురీ మనుష్యుల సాంగత్యము ఉంటుంది. అక్కడ స్మృతిలో ఉండడం చాలా కష్టము. ఇంత స్థిరంగా మీరు అక్కడ ఉండలేరు. సంగఠన కావాలి కదా. ఇక్కడ అందరూ ఏకరసముగా కలిసి కూర్చుంటారు కావున సహాయం లభిస్తుంది. ఇక్కడ వ్యాపారాలు మొదలైనవేవీ ఉండవు. ఇక బుద్ధి ఎక్కడకు వెళ్తుంది! బయట ఉన్నట్లయితే వ్యాపారాలు, ఇళ్ళు మొదలైనవి తప్పకుండా లాగుతాయి. ఇక్కడైతే ఏమీ లేదు. ఇక్కడ వాయుమండలము చాలా మంచిగా, శుద్ధముగా ఉంటుంది. డ్రామానుసారముగా ఎంత దూరంగా పర్వతాల పైకి వచ్చి మీరు కూర్చున్నారు. స్మృతిచిహ్నాలు కూడా ఎదురుగా ఏక్యురేట్ గా ఉన్నాయి. పైన స్వర్గాన్ని చూపించారు. లేకపోతే మరి ఎక్కడ తయారుచేయాలి. కావున బాబా అంటారు, మీరు ఇక్కడకు వచ్చి కూర్చున్నప్పుడు స్వయాన్ని చెక్ చేసుకోండి - మేము తండ్రి స్మృతిలో కూర్చున్నామా? స్వదర్శన చక్రము కూడా తిరుగుతూ ఉండాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తమ స్మృతి చార్టుపై పూర్తి దృష్టిని ఉంచాలి. మేము తండ్రిని ఎంత సమయం స్మృతి చేస్తున్నాము, స్మృతి చేసే సమయంలో బుద్ధి ఎక్కడెక్కడ భ్రమిస్తుంది అని చూసుకోవాలి.

2. ఈ తీర్పును ఇచ్చే చివరి సమయములో వాణి నుండి అతీతముగా వెళ్ళేందుకు పురుషార్థము చేయాలి. తండ్రి స్మృతితోపాటు దైవీ గుణాలను కూడా తప్పకుండా ధారణ చేయాలి. ఎటువంటి అశుద్ధమైన పనులు, దొంగతనము మొదలైనవేవీ చేయకూడదు.

వరదానము:- వ్యర్థమైన మరియు డిస్టర్బ్ చేసే మాటల నుండి ముక్తులై డబుల్ లైట్ అవ్యక్త ఫరిశ్తా భవ
అవ్యక్త ఫరిశ్తాగా అవ్వాలంటే ఎవ్వరికీ మంచిగా అనిపించని వ్యర్థ మాటలేవైతే ఉన్నాయో, వాటిని సదా కొరకు సమాప్తము చెయ్యండి. అక్కడ ఉండేది రెండు మాటల విషయము, కానీ దానిని పెద్దదిగా చేసి మాట్లాడుతూ ఉండటము, ఇది కూడా వ్యర్థమే. నాలుగు మాటలలో పని అవ్వగలదు అన్న చోట దానిని 12-15 మాటలలో మాట్లాడకండి. తక్కువగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి... ఈ స్లోగన్ ను మెడలో వేసుకుని పెట్టుకోండి. వ్యర్థమైన మరియు డిస్టర్బ్ చేసే మాటల నుండి ముక్తులుగా అవ్వండి, అప్పుడు అవ్యక్త ఫరిశ్తాగా అవ్వటములో చాలా సహాయము లభిస్తుంది.
స్లోగన్:- ఎవరైతే స్వయాన్ని పరమాత్ముని ప్రేమలో బలిహారము చేస్తారో, సఫలత వారికి మెడలోని హారముగా అవుతుంది.

 

మురళి అంటే ఏమిటి?

మురళి బ్రహ్మకుమారీల దైనిక ఆధ్యాత్మిక బోధన, ఇది ప్రతి ఉదయం మధుబన్ నుండి ప్రచురించబడుతుంది. ఇక్కడ మీరు ఈరోజు మురళిని తెలుగులో చదవవచ్చు, ఆడియో వినవచ్చు మరియు PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధ్యయనానికి సహాయంగా పాఠ్యాన్ని హైలైట్ చేయవచ్చు — మీ గుర్తులు ఈ బ్రౌజర్‌లోనే సురక్షితంగా ఉంటాయి.

28 భాషల్లో మురళి

Daily Murli · Madhuban మూలం: మధుబన్ మురళి విభాగం ఇది స్వతంత్ర రీడర్ యాప్, అధికారిక వెబ్‌సైట్ కాదు.