తెలుగు మురళి · Brahma Kumaris

తెలుగు మురళి · 22 అక్టోబర్, 2024

ఓం శాంతి · BapDada ·

ఈరోజు మురళి — today’s murli in Telugu, BK Telugu murli.

18
మురళి22 అక్టోబర్, 2024 · తెలుగు
0:00--:--

పాఠ్యాన్ని ఎంచుకోండి → హైలైట్ / బాక్స్ / అండర్‌లైన్

22-10-2024
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
మధువనం

‘‘మధురమైన పిల్లలూ - తండ్రి మీకు ఏ జ్ఞానాన్ని అయితే చదివిస్తారో, అందులో రిద్ధి-సిద్ధుల విషయమేదీ లేదు, చదువులో మంత్రతంత్రాలతో పని నడవదు’’
ప్రశ్న:- దేవతలను తెలివైనవారు అని అంటారు, మనుష్యులను అనరు - ఎందుకు?
జవాబు:- ఎందుకంటే దేవతలు సర్వగుణ సంపన్నులు మరియు మనుష్యులలో ఏ గుణాలు లేవు. దేవతలు తెలివైనవారు, అందుకే మనుష్యులు వారిని పూజిస్తారు. వారి బ్యాటరీ ఛార్జ్ అయి ఉంది, అందుకే వారిని ఎంతో విలువైనవారు అని అంటారు. ఎప్పుడైతే బ్యాటరీ డిస్చార్జ్ అవుతుందో, అప్పుడు వారు పైస విలువచేసేవారిగా అయిపోతారు, అప్పుడు బుద్ధిహీనులు అని అంటారు.

ఓం శాంతి. తండ్రి పిల్లలకు అర్థం చేయించారు - ఇది పాఠశాల. ఇది చదువు. ఈ చదువుతో ఈ పదవి ప్రాప్తిస్తుంది, దీనిని స్కూలు లేక యూనివర్శిటీ అని భావించాలి. ఇక్కడికి దూరదూరాల నుండి చదువుకునేందుకు వస్తారు. ఏమి చదువుకునేందుకు వస్తారు? ఈ లక్ష్యము-ఉద్దేశ్యము బుద్ధిలో ఉంది. మనం చదువు చదువుకునేందుకు వస్తాము, చదివించేవారిని టీచర్ అని అంటారు. గీతయే భగవానువాచ. ఇంకే విషయమూ లేదు. గీత అనేది చదివించేవారి యొక్క పుస్తకము, కానీ వారు పుస్తకము మొదలైనవాటినేమీ చదివించరు. గీత ఏమీ చేతిలో లేదు. ఇది భగవానువాచ. మనుష్యులను భగవంతుడు అని అనరు. ఉన్నతోన్నతుడైన భగవంతుడు ఒక్కరే. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము - ఇదంతా విశ్వము. నాటకము ఏమీ సూక్ష్మవతనములో లేక మూలవతనములో జరుగదు, నాటకము ఇక్కడే జరుగుతుంది. 84 జన్మల చక్రము కూడా ఇక్కడే ఉంది. దీనినే 84 జన్మల చక్రము యొక్క నాటకము అని అంటారు. ఇది తయారై, తయారుచేయబడిన నాటకము. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు ఎందుకంటే ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు, మీకు వారి డైరెక్షన్లు లభిస్తాయి. ఇక్కడ ఇంకే వస్తువూ లేదు. ఒక్కరినే సర్వశక్తివంతుడు, వరల్డ్ ఆల్మైటీ అథారిటీ అని అంటారు. అథారిటీ యొక్క అర్థాన్ని కూడా వారు స్వయం అర్థం చేయిస్తారు. ఇది మనుష్యులు అర్థం చేసుకోరు ఎందుకంటే వారందరూ తమోప్రధానులు, దీనిని కలియుగము అనే అంటారు. అంతేకానీ ఇది కొందరి కొరకు కలియుగము, కొందరి కొరకు సత్యయుగము, కొందరి కొరకు త్రేతాయుగము అని కాదు. అలా కాదు. ఇప్పుడు ఇది నరకముగా ఉన్నప్పుడు మనుష్యులెవ్వరూ - మాకు ఇదే స్వర్గము ఎందుకంటే మా వద్ద ధనము, సంపద ఎంతగానో ఉంది అని అనలేరు. అది అలా అవ్వదు. ఇది తయారై, తయారుచేయబడిన నాటకము. సత్యయుగము గతించిపోయింది, అది ఈ సమయములో ఉండలేదు కూడా. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. తండ్రి కూర్చుని అన్ని విషయాలనూ అర్థం చేయిస్తారు. సత్యయుగములో వీరి రాజ్యము ఉండేది. భారతవాసులు ఆ సమయములో సత్యయుగవాసులుగా పిలువబడేవారు. ఇప్పుడు తప్పకుండా కలియుగవాసులుగా పిలువబడతారు. సత్యయుగవాసులుగా ఉన్నప్పుడు దానిని స్వర్గము అని అనేవారు. నరకమును కూడా స్వర్గము అని అంటారని కాదు. మనుష్యులకైతే తమ, తమ మతాలు ఉన్నాయి. ధనము యొక్క సుఖము ఉంది కావున స్వయాన్ని స్వర్గములో ఉన్నట్లుగా భావిస్తారు. నా వద్దనైతే ఎంతో సంపద ఉంది, అందుకే నేను స్వర్గములో ఉన్నాను అని భావిస్తారు. కానీ అది కాదు అని వివేకం చెప్తుంది. ఇది నరకమే. ఎవరి వద్దనైనా 10-20 లక్షలు ఉన్నా కానీ అసలు ఈ ప్రపంచమే రోగగ్రస్థ ప్రపంచము. సత్యయుగాన్ని నిరోగి ప్రపంచము అని అంటారు. ప్రపంచమైతే ఇదే. సత్యయుగములో దీనిని యోగీ ప్రపంచము అని అంటారు, కలియుగాన్ని భోగీ ప్రపంచము అని అంటారు. అక్కడ యోగీలు ఉంటారు ఎందుకంటే అక్కడ వికారాల భోగ విలాసాలేవీ ఉండవు. ఇది విద్యాలయము. ఇందులో శక్తి యొక్క విషయమేమీ లేదు. టీచర్ ఏమైనా శక్తిని చూపిస్తారా? మేము ఫలానాగా అవుతాము అన్న లక్ష్యము ఉంటుంది. మీరు ఈ చదువుతో మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. ఇందులో ఇంద్రజాలము, మంత్ర-తంత్రాలు లేక రిద్ధి-సిద్ధుల విషయమేదీ లేదు. ఇది ఒక స్కూల్. స్కూల్లో ఏమైనా రిద్ధి-సిద్ధుల విషయం ఉంటుందా? చదువుకుని కొందరు డాక్టర్లుగా, కొందరు బ్యారిస్టర్లుగా అవుతారు. ఈ లక్ష్మీ-నారాయణులు కూడా మనుష్యులే కానీ వారు పవిత్రముగా ఉండేవారు, అందుకే వారిని దేవీ-దేవతలు అని అంటారు. పవిత్రముగా తప్పకుండా అవ్వాలి. ఇది ఉన్నదే పతిత పాత ప్రపంచము.

ఈ ప్రపంచము పాతబడేందుకు ఇంకా లక్షల సంవత్సరాలు ఉంది అని మనుష్యులు భావిస్తారు. కలియుగము తర్వాతే సత్యయుగము వస్తుంది. ఇప్పుడు మీరు సంగమములో ఉన్నారు. ఈ సంగమము గురించి ఎవరికీ తెలియదు. సత్యయుగానికి లక్షల సంవత్సరాలు చూపిస్తారు. ఈ విషయాలను తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. వారిని సుప్రీమ్ సోల్ అని అంటారు. ఆత్మల తండ్రిని బాబా అని అంటారు. ఇంకే పేరూ ఉండదు. తండ్రి పేరు శివ. శివుని మందిరాలకు కూడా వెళ్తారు. శివ పరమాత్ముడిని నిరాకారుడు అనే అంటారు. వారికి మనుష్య శరీరమేదీ లేదు. ఆత్మలైన మీరు ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తారు, అప్పుడు మీకు మనుష్య శరీరము లభిస్తుంది. వారు శివుడు, మీరు సాలిగ్రామాలు. శివుడు మరియు సాలిగ్రామాల పూజ కూడా జరుగుతుంది ఎందుకంటే వారు ఒకప్పుడు చైతన్యముగా ఉండి వెళ్ళారు. ఏదో చేసి వెళ్ళారు కావుననే వారి పేరు ప్రఖ్యాతముగా గానం చేయబడుతుంది మరియు వారు పూజింపబడతారు. ముందు జన్మ గురించి అయితే ఎవరికీ తెలియదు. ఈ జన్మలో అయితే మహిమ చేస్తారు, దేవీ-దేవతలను పూజిస్తారు. ఈ జన్మలోనైతే ఎంతోమంది లీడర్లుగా కూడా అయిపోయారు. మంచి-మంచి సాధు-సన్యాసులు మొదలైనవారు ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళారో వారి పేరును ప్రఖ్యాతము చేసేందుకు వారి స్టాంప్ ను కూడా తయారుచేస్తారు. ఇక్కడ అందరికన్నా గొప్పగా ఎవరి పేరును మహిమ చేయాలి? అందరికన్నా పెద్దవారు ఎవరు? ఉన్నతోన్నతమైనవారైతే ఒక్క భగవంతుడే. వారు నిరాకారుడు మరియు వారి మహిమ పూర్తిగా వేరు. దేవతల మహిమ వేరు, మనుష్యుల మహిమ వేరు. మనుష్యులను దేవతలు అని అనలేరు. దేవతలలో సర్వ గుణాలూ ఉండేవి. లక్ష్మీ-నారాయణులు ఒకప్పుడు ఉండి వెళ్ళారు కదా. వారు పవిత్రముగా ఉండేవారు, విశ్వాధిపతులుగా ఉండేవారు, వారి పూజను కూడా చేస్తారు ఎందుకంటే పవిత్రలు పూజ్యులుగా ఉంటారు, అపవిత్రులను పూజ్యులు అని అనరు. అపవిత్రులు సదా పవిత్రులను పూజిస్తారు. కన్య పవిత్రముగా ఉంటుంది కావున పూజింపబడుతుంది, పతితముగా అయితే ఆమె అందరి కాళ్ళకు నమస్కరించవలసి వస్తుంది. ఈ సమయములో అందరూ పతితులుగా ఉన్నారు, సత్యయుగములో అందరూ పావనులుగా ఉండేవారు. అది ఉన్నదే పవిత్ర ప్రపంచము, కలియుగము పతిత ప్రపంచము, అందుకే పతిత-పావనుడైన తండ్రిని పిలుస్తారు. పవిత్రముగా ఉన్నప్పుడు పిలువరు. నన్ను సుఖములో ఎవ్వరూ తలచుకోరు అని స్వయంగా తండ్రి అంటారు. ఇది భారత్ విషయమే. తండ్రి భారత్ లోకే వస్తారు. భారత్ యే ఈ సమయములో పతితముగా అయ్యింది, భారత్ యే పావనంగా ఉండేది. పావన దేవతలను చూడాలనుకుంటే మందిరాలలోకి వెళ్ళి చూడండి. దేవతలందరూ పావనంగా ఉంటారు, వారిలో ముఖ్యులు ఎవరైతే ఉంటారో వారిని మందిరాలలో చూపిస్తారు. ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యములో అందరూ పావనముగా ఉండేవారు, యథా రాజా రాణి తథా ప్రజా, ఈ సమయములో అందరూ పతితులుగా ఉన్నారు. ఓ పతిత పావనా రండి, అని అందరూ పిలుస్తూ ఉంటారు. సన్యాసులు ఎప్పుడూ శ్రీకృష్ణుడిని భగవంతునిగా లేక బ్రహ్మముగా భావించరు. వారు భగవంతుడు నిరాకారుడు అనే భావిస్తారు, వారి చిత్రము కూడా నిరాకార రీతిలోనే పూజింపబడుతుంది. వారి యథార్థ నామము శివ. ఆత్మయైన మీరు ఎప్పుడైతే ఇక్కడకు వచ్చి శరీరాన్ని ధారణ చేస్తారో అప్పుడు మీకు పేరు పెట్టడం జరుగుతుంది. ఆత్మ అవినాశీ, శరీరము వినాశీ. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. 84 జన్మలైతే కావాలి కదా. 84 లక్షల జన్మలు ఉండవు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇదే ప్రపంచము సత్యయుగములో కొత్తగా ఉండేది, ధర్మయుక్తముగా ఉండేది. ఇదే ప్రపంచము మళ్ళీ అధర్మయుక్తముగా అయిపోతుంది. అది సత్యఖండము, అక్కడ అందరూ సత్యం మాట్లాడేవారే ఉంటారు. భారత్ ను సత్యఖండము అని అంటారు. అసత్యఖండమే మళ్ళీ సత్యఖండముగా అవుతుంది. సత్యమైన తండ్రే వచ్చి సత్యఖండాన్ని తయారుచేస్తారు. వారిని సత్యమైన చక్రవర్తి, ట్రూత్ అని అంటారు. ఇది ఉన్నదే అసత్య ఖండము. మనుష్యులు ఏదైతే చెప్తారో అదంతా అసత్యమే. దేవతలు వివేకవంతమైన బుద్ధి కలవారు, వారిని మనుష్యులు పూజిస్తారు. తెలివైనవారు మరియు తెలివిలేనివారు అని అంటారు. తెలివైనవారిగా ఎవరు తయారుచేస్తారు, మళ్ళీ తెలివిలేనివారిగా ఎవరు తయారుచేస్తారు? ఇది కూడా తండ్రి తెలియజేస్తారు. తెలివైనవారిగా, సర్వగుణ సంపన్నులుగా తయారుచేసేవారు తండ్రి. వారు స్వయం వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు. ఏ విధంగా ఆత్మ అయిన మీరు ఇక్కడ శరీరములో ప్రవేశించి పాత్రను అభినయిస్తారో, అలా నేను కూడా ఒకేసారి ఇతనిలోకి ప్రవేశిస్తాను. వారు ఒక్కరేనని మీకు తెలుసు. వారినే సర్వశక్తివంతుడు అని అంటారు. మనం సర్వశక్తివంతులు అని పిలువదగ్గ మనుష్యులు ఎవ్వరూ లేరు. లక్ష్మీ-నారాయణులను కూడా అలా అనలేము ఎందుకంటే వారికి కూడా శక్తిని ఇచ్చేవారు ఇంకెవరో ఉన్నారు. పతిత మనుష్యులలో శక్తి ఉండదు. ఆత్మలో ఏ శక్తి అయితే ఉంటుందో, అది మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది అనగా ఆత్మలో ఏదైతే సతోప్రధానమైన శక్తి ఉండేదో, అది తమోప్రధానమైన శక్తిగా అయిపోతుంది. ఏ విధముగా బండిలో పెట్రోల్ అయిపోతే మోటార్ ఆగిపోతుందో ఇదీ అలాగే. ఈ బ్యాటరీ ఘడియ, ఘడియ డిస్చార్జ్ అవ్వదు, దీనికి పూర్తి సమయం లభించి ఉంది. కలియుగాంతములో బ్యాటరీ చల్లబడిపోతుంది. మొదట ఎవరైతే సతోప్రధానముగా, విశ్వాధిపతులుగా ఉండేవారో, వారు ఇప్పుడు తమోప్రధానముగా ఉన్నారు కావున శక్తి తగ్గిపోయింది. శక్తి మిగల్లేదు. పైసకు కొరగానివారిగా అయిపోతారు. భారత్ లో దేవీ-దేవతా ధర్మం ఉన్నప్పుడు విలువైనవారిగా ఉండేవారు. రిలీజియన్ ఈజ్ మైట్ (ధర్మములో శక్తి ఉంది) అని అంటారు. దేవతా ధర్మములో శక్తి ఉంది. వారు విశ్వాధిపతులుగా ఉండేవారు. ఏమి శక్తి ఉండేది? యుద్ధము మొదలైనవి చేసే శక్తి ఏమీ కాదు. శక్తి అనేది సర్వశక్తివంతుడైన తండ్రి నుండి లభిస్తుంది. శక్తి అంటే ఏమిటి?

తండ్రి అర్థం చేయిస్తారు - మధురాతి మధురమైన పిల్లలూ, మీ ఆత్మ సతోప్రధానముగా ఉండేది, ఇప్పుడు తమోప్రధానముగా ఉంది. విశ్వాధిపతులకు బదులుగా విశ్వానికి సేవకులుగా అయిపోయారు. తండ్రి అర్థం చేయిస్తారు, ఈ పంచ వికారాల రూపీ రావణుడు మీ శక్తినంతటినీ దోచేసుకుంటాడు, అందుకే భారతవాసులు నిరుపేదలుగా అయిపోయారు. సైన్స్ వారిలో ఎంతో శక్తి ఉంది అని భావించకండి, అది శక్తి ఏమీ కాదు. ఇది ఆత్మిక శక్తి. ఇది సర్వశక్తివంతుడైన తండ్రితో యోగాన్ని జోడించడముతో లభిస్తుంది. సైన్స్ మరియు సైలెన్స్ కు ఈ సమయములో యుద్ధము జరుగుతున్నట్లుగా ఉంది. మీరు సైలెన్సులో వెళ్తారు, దాని బలం మీకు లభిస్తూ ఉంది. సైలెన్స్ బలాన్ని తీసుకుని మీరు సైలెన్స్ ప్రపంచములోకి వెళ్ళిపోతారు. తండ్రిని స్మృతి చేస్తూ స్వయాన్ని శరీరము నుండి అతీతము చేసుకుంటారు. భక్తి మార్గములో భగవంతుని వద్దకు వెళ్ళేందుకు మీరు ఎంతో కష్టపడ్డారు, కానీ సర్వవ్యాపి అని అన్న కారణముగా దారి అసలు లభించదు, తమోప్రధానముగా అయిపోయారు. ఇది చదువు, చదువును శక్తి అని అనరు. తండ్రి అంటారు, మొదట పవిత్రముగా అవ్వండి, ఆ తర్వాత సృష్టి చక్రము ఎలా తిరుగుతుందో దాని జ్ఞానాన్ని అర్థం చేసుకోండి. నాలెడ్జ్ ఫుల్ అయితే ఒక్క తండ్రే, ఇందులో శక్తి యొక్క విషయమేమీ లేదు. సృష్టిచక్రము ఎలా తిరుగుతుంది అన్న విషయము పిల్లలకు తెలియదు. నటులైన మీరు పాత్రధారులు కదా. ఇది అనంతమైన డ్రామా. ఇంతకుముందు మనుష్యుల నాటకాలు జరిగేవి, అందులో మార్పులు సాధ్యమవుతాయి. కానీ ఇప్పుడైతే సినిమాలు తయారయ్యాయి. బాబాకు కూడా ఆ సినిమా ఉదాహరణను ఇచ్చి అర్థం చేయించడం సహజమవుతుంది. అది చిన్న సినిమా, ఇది పెద్దది. నాటకాలలో నటులు మొదలైనవారిని మార్చవచ్చు కానీ ఇదైతే అనాది డ్రామా. ఒక్కసారి ఏదైతే షూట్ అయ్యిందో అది మళ్ళీ మారలేదు. ఈ ప్రపంచమంతా ఒక అనంతమైన సినిమా వంటిది. ఇందులో శక్తి యొక్క విషయమేదీ లేదు. అంబను శక్తి అని అంటారు కానీ ఎంతైనా పేరైతే ఉంది కదా. వారిని అంబ అని ఎందుకు అంటారు? ఆమె ఏమి చేసి వెళ్ళారు? ఉన్నతోన్నతమైనవారు అంబ మరియు లక్ష్మి అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అంబయే మళ్ళీ లక్ష్మిగా అవుతారు. ఇది కూడా పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. మీరు నాలెడ్జ్ ఫుల్ గా కూడా అవుతారు మరియు మీకు పవిత్రతను కూడా నేర్పిస్తారు. ఆ పవిత్రత అర్ధకల్పం నడుస్తుంది. ఆ తర్వాత తండ్రే వచ్చి పవిత్రత యొక్క దారిని తెలియజేస్తారు. మీరు వచ్చి దారిని తెలియజేయండి మరియు మార్గదర్శకునిగా కూడా అవ్వండి అని వారిని ఈ సమయం కొరకే పిలుస్తారు. వారు పరమ ఆత్మ, ఆ సుప్రీమ్ చదివించే చదువుతో ఆత్మ సుప్రీమ్ గా అవుతుంది. సుప్రీమ్ అని పవిత్రులనే అంటారు. ఇప్పుడు పతితులుగా ఉన్నారు. తండ్రి అయితే సదా పావనుడు. తేడా ఉంది కదా. ఆ సదా పావనుడే వచ్చి అందరికీ వారసత్వాన్ని ఇచ్చి నేర్పిస్తారు. ఇందులో వారు స్వయమే వచ్చి - నేను మీ తండ్రిని అని తెలియజేస్తారు. నాకు రథమైతే తప్పకుండా కావాలి, లేకపోతే ఆత్మ ఎలా మాట్లాడగలదు. రథము కూడా ప్రసిద్ధమైనది. భాగ్యశాలి రథము అని గానం చేస్తారు. భాగ్యశాలి రథము మానవునిది, ఇందులో గుర్రపుబండి మొదలైనవాటి విషయమేమీ లేదు. మనుష్యులకు అర్థం చేయించేందుకు మనుష్య రథమే కావాలి. కానీ వారు కూర్చుని గుర్రపు బండి మొదలైనవాటిని చూపించారు. భాగ్యశాలి రథము అని మానవుడిని అంటారు. ఇక్కడైతే కొన్ని జంతువులకు కూడా ఎంతోమంచి సేవ జరుగుతుంది, మనుష్యులకు కూడా అంత సేవ జరుగదు. కుక్కలను ఎంతగా ప్రేమిస్తారు. గుర్రాలను, ఆవులను కూడా ప్రేమిస్తారు. కుక్కల ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇవేవీ అక్కడ ఉండవు. లక్ష్మీ-నారాయణులు కుక్కలను పెంచుకుంటారా?

ఈ సమయములోని మనుష్యులందరూ తమోప్రధాన బుద్ధి కలవారని, వారిని సతోప్రధానముగా తయారుచేయాలని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. అక్కడ గుర్రాలు మొదలైనవేవీ మనుష్యులు సేవ చేసేలాంటివి ఉండవు. తండ్రి అర్థం చేయిస్తారు - మీ పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి. రావణుడు ఈ పరిస్థితిని తీసుకువచ్చాడు, అతను మీ శత్రువు. కానీ ఈ శత్రువు యొక్క జన్మ ఎప్పుడు జరుగుతుంది అన్నది మీకు తెలియదు. శివుని జన్మ గురించి కూడా తెలియదు, అలాగే రావణుని జన్మ గురించి కూడా తెలియదు. త్రేతా యొక్క అంతము మరియు ద్వాపరము యొక్క ఆదిలో రావణుడు వస్తాడు అని తండ్రి తెలియజేస్తారు. అతడికి 10 తలలు ఎందుకు చూపించారు? అతడిని ప్రతి సంవత్సరం ఎందుకు కాలుస్తారు? అది కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుతారు. ఎవరైతే చదవరో వారు దేవతలుగా అవ్వలేరు. అటువంటివారు ఎప్పుడైతే రావణ రాజ్యము ప్రారంభమవుతుందో, అప్పుడు వస్తారు. మేము దేవతా ధర్మానికి చెందినవారము, ఇప్పుడు మళ్ళీ అంటు కట్టడం జరుగుతోంది అని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి అంటారు, నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వచ్చి మిమ్మల్ని ఈ విధంగా చదివిస్తాను. ఈ సమయములో మొత్తం సృష్టి అంతటి వృక్షము పాతగా ఉంది. అది ఎప్పుడైతే కొత్తగా ఉండేదో అప్పుడు ఒక్క దేవతా ధర్మమే ఉండేది, మళ్ళీ మెల్లమెల్లగా కిందకు దిగుతారు. తండ్రి మీకు 84 జన్మల లెక్కను తెలియజేస్తారు ఎందుకంటే తండ్రి నాలెడ్జ్ ఫుల్ కదా. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సైలెన్స్ శక్తిని జమ చేసుకోవాలి. సైలెన్స్ బలముతో సైలెన్స్ ప్రపంచములోకి వెళ్ళాలి. తండ్రి స్మృతి ద్వారా శక్తిని తీసుకుని దాస్యత్వం నుండి విముక్తులవ్వాలి, యజమానులుగా అవ్వాలి.

2. సుప్రీమ్ చదివించే చదువును చదువుకుని ఆత్మను సుప్రీమ్ గా తయారుచేసుకోవాలి. పవిత్రతా మార్గములోనే నడుస్తూ పవిత్రముగా అయి ఇతరులను కూడా అలా తయారుచేయాలి. మార్గదర్శకులుగా అవ్వాలి.

వరదానము:- అల్ఫ్ ను (భగవంతుడిని) తెలుసుకునే మరియు పవిత్రత అనే స్వధర్మాన్ని అలవరచుకునే విశేష ఆత్మా భవ
నా పిల్లలు ప్రతి ఒక్కరూ విశేష ఆత్మ అని బాప్ దాదాకు సంతోషము ఉంటుంది - అది వృద్ధులైనా, చదువుకోనివారైనా, చిన్న పిల్లలైనా, యువత అయినా లేక ప్రవృత్తి వారైనా, ఎవరైనా సరే వారు విశ్వము ముందు విశేషమైనవారు. ప్రపంచములో ఎవరు ఎంత పెద్ద నేతలు అయినా, నటులు అయినా, వైజ్ఞానికులు అయినా, వారు అల్ఫ్ ను (భగవంతుడిని) తెలుసుకోలేదంటే ఇంకేం తెలుసుకున్నట్లు! మీరు నిశ్చయబుద్ధి కలవారై నషాతో ఇలా అంటారు, మీరు వెతుకుతూ ఉండండి, మేమైతే పొందేసాము అని. ప్రవృత్తిలో ఉంటూ పవిత్రతా స్వధర్మాన్ని అలవరచుకున్నారు కావున పవిత్ర ఆత్మ విశేష ఆత్మగా అయిపోయారు.
స్లోగన్:- ఎవరైతే సదా సంతోషముగా ఉంటారో వారు స్వయానికి మరియు సర్వులకు ప్రియమనిపిస్తారు.

 

మురళి అంటే ఏమిటి?

మురళి బ్రహ్మకుమారీల దైనిక ఆధ్యాత్మిక బోధన, ఇది ప్రతి ఉదయం మధుబన్ నుండి ప్రచురించబడుతుంది. ఇక్కడ మీరు ఈరోజు మురళిని తెలుగులో చదవవచ్చు, ఆడియో వినవచ్చు మరియు PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధ్యయనానికి సహాయంగా పాఠ్యాన్ని హైలైట్ చేయవచ్చు — మీ గుర్తులు ఈ బ్రౌజర్‌లోనే సురక్షితంగా ఉంటాయి.

28 భాషల్లో మురళి

Daily Murli · Madhuban మూలం: మధుబన్ మురళి విభాగం ఇది స్వతంత్ర రీడర్ యాప్, అధికారిక వెబ్‌సైట్ కాదు.