| 23-10-2024 |
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
|
మధువనం |
| ‘‘మధురమైన పిల్లలూ - మీ యాత్ర బుద్ధికి సంబంధించినది, దీనినే ఆత్మిక యాత్ర అని అంటారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు, శరీరముగా భావించరు, శరీరముగా భావించడం అనగా తలక్రిందులుగా వేలాడడము’’ | |
| ప్రశ్న:- | మాయ ఆర్భాటములో మనుష్యులకు ఏ గౌరవము లభిస్తుంది? |
| జవాబు:- | ఆసురీ గౌరవము. మనుష్యులు ఎవరికైనా ఈ రోజు కాస్త గౌరవాన్ని ఇస్తారు, రేపు వారిని అగౌరవపరుస్తారు, నిందలు వేస్తారు. మాయ అందరినీ అగౌరవపాలు చేసింది, పతితముగా చేసేసింది. తండ్రి మిమ్మల్ని దైవీ గౌరవము కలవారిగా చేయడానికి వచ్చారు. |
ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మలను అడుగుతున్నారు - మీరు ఎక్కడ కూర్చున్నారు? విశ్వము యొక్క ఆత్మిక యూనివర్శిటీలో కూర్చున్నాము అని మీరు అంటారు. ఆత్మిక అన్న పదము గురించి వారికి తెలియదు. విశ్వ విద్యాలయాలైతే ప్రపంచములో అనేకం ఉన్నాయి. ఇది మొత్తం విశ్వమంతటిలో ఉన్న ఏకైక ఆత్మిక విద్యాలయము. ఇక్కడ చదివించేవారు ఒక్కరే. ఏమి చదివిస్తారు? ఆత్మిక జ్ఞానము. కావున ఇది స్పిరిచ్యుయల్ విద్యాలయము అనగా ఆత్మిక పాఠశాల. స్పిరిచ్యుయల్ జ్ఞానాన్ని అనగా ఆత్మిక జ్ఞానాన్ని చదివించేవారు ఎవరు? ఇది కూడా పిల్లలైన మీకే ఇప్పుడు తెలుసు. ఆత్మిక తండ్రే ఆత్మిక జ్ఞానాన్ని చదివిస్తారు, అందుకే వారిని టీచర్ అని కూడా అంటారు, ఆత్మిక తండ్రి చదివిస్తారు. అచ్ఛా, ఆ తర్వాత ఏమవుతుంది? ఈ ఆత్మిక జ్ఞానముతో మనము మన ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాము అన్నది పిల్లలైన మీకు తెలుసు. ఏక ధర్మ స్థాపన మరియు మిగిలిన ఇన్ని ధర్మాలేవైతే ఉన్నాయో వాటన్నింటి వినాశనం జరుగుతుంది. ఈ ఆత్మిక జ్ఞానానికి అన్ని ధర్మాలతోనూ ఏ సంబంధం ఉంది - అది కూడా మీకు ఇప్పుడు తెలుసు. ఏక ధర్మ స్థాపన ఈ ఆత్మిక జ్ఞానము ద్వారా జరుగుతుంది. ఈ లక్ష్మీ-నారాయణులు విశ్వాధిపతులుగా ఉండేవారు కదా! దానిని ఆత్మిక ప్రపంచము (స్పిరిచ్యుయల్ వరల్డ్) అని అంటారు. ఈ ఆత్మిక జ్ఞానము ద్వారా మీరు రాజయోగాన్ని నేర్చుకుంటారు. రాజ్య స్థాపన జరుగుతుంది. అచ్ఛా, మరి ఇతర ధర్మాలతో ఏం సంబంధముంది? ఇతర ధర్మాలన్నీ వినాశనాన్ని పొందుతాయి ఎందుకంటే మీరు పావనంగా అయితే మీకు కొత్త ప్రపంచము కావాలి. ఇన్ని అనేక ధర్మాలు అంతమైపోతాయి, ఒకే ధర్మము ఉంటుంది. దానిని విశ్వములో శాంతి రాజ్యము అని అంటారు. ఇప్పుడు ఉన్నది పతితమైన అశాంతమయమైన రాజ్యము, ఆ తర్వాత పావనమైన, శాంతమయమైన రాజ్యము ఉంటుంది. ఇప్పుడైతే అనేక ధర్మాలున్నాయి. ఎంతటి అశాంతి ఉంది. అందరూ పతితులే పతితులు. ఇది రావణ రాజ్యము కదా. పంచ వికారాలను తప్పకుండా వదలాలి అని, వీటిని తమతోపాటు తీసుకువెళ్ళకూడదు అని ఇప్పుడు పిల్లలకు తెలుసు. ఆత్మ మంచి లేక చెడు సంస్కారాలను తీసుకువెళ్తుంది కదా. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు పవిత్రముగా అయ్యే విషయాన్ని తెలియజేస్తారు. ఆ పావన ప్రపంచములో ఎటువంటి దుఃఖమూ ఉండదు. ఈ ఆత్మిక జ్ఞానాన్ని చదివించేవారు ఎవరు? ఆత్మిక తండ్రి. వారు ఆత్మలందరికీ తండ్రి. ఆత్మిక తండ్రి ఏమి చదివిస్తారు? ఆత్మిక జ్ఞానాన్ని, ఇందులో పుస్తకాలు మొదలైనవాటి అవసరమేమీ లేదు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి, పావనంగా అవ్వాలి. తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ అంతిమ స్థితిని బట్టి గతి ఏర్పడుతుంది. ఇది స్మృతియాత్ర. యాత్ర అన్న పదము బాగుంది. అవి భౌతికమైన యాత్రలు, ఇది ఆత్మిక యాత్ర. అందులో కాలినడకన వెళ్ళవలసి ఉంటుంది, చేతులు, కాళ్ళను ఉపయోగిస్తారు, ఇందులో ఏమీ లేదు. కేవలం స్మృతి చేయాలి. మీరు ఎక్కడైనా వెళ్ళండి, తిరగండి, లేస్తున్నా, కూర్చుంటున్నా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇది కష్టమైన విషయమేమీ కాదు, కేవలం స్మృతి చేయాలి. ఇది యథార్థమే కదా. ఇంతకుముందు మీరు తలక్రిందులుగా నడుచుకునేవారు. స్వయాన్ని ఆత్మకు బదులుగా శరీరముగా భావించడము, దీనిని తలక్రిందులుగా వేలాడడం అని అంటారు. స్వయాన్ని ఆత్మగా భావించడమంటే సరిగ్గా ఉండడము. అల్లా ఎప్పుడైతే వస్తారో, అప్పుడు వారు వచ్చి పావనంగా చేస్తారు. అల్లాది పావన ప్రపంచము, రావణుడిది పతిత ప్రపంచము. దేహాభిమానములో అందరూ తలక్రిందులుగా అయిపోయారు. ఇప్పుడు ఈ ఒక్కసారి దేహీ-అభిమానులుగా అవ్వాలి. మీరు అల్లా పిల్లలు. నేనే అల్లాను అని అనరు. ఎప్పుడూ వేలుతో పైకి చూపిస్తూ ఉంటారు, తద్వారా అల్లా అక్కడ ఉన్నారు అన్నది నిరూపించబడుతుంది. కావున తప్పకుండా ఇక్కడ ఉన్నది ఇంకేదో కదా. మనము తండ్రి అయిన ఆ అల్లా సంతానము. మనము సోదరులము. నేనే అల్లాను అని అన్నట్లయితే మళ్ళీ మనమందరమూ తండ్రులము అన్న అర్థము రావడం వలన అది తలక్రిందులుగా అయిపోతుంది. అలా కాదు. తండ్రి ఒక్కరే, వారినే స్మృతి చేయాలి. అల్లా సదా పవిత్రమైనవారు. అల్లా స్వయంగా కూర్చుని చదివిస్తారు. చిన్న విషయములో మనుష్యులు ఎంతగా తికమకపడతారు. శివజయంతిని కూడా జరుపుకుంటారు కదా.
శ్రీకృష్ణుడు స్వర్గము యొక్క మొదటి రాజకుమారుడు, ఈ అనంతమైన తండ్రి అతనికి రాజ్యభాగ్యాన్ని ఇస్తారు. తండ్రి కొత్త ప్రపంచమైన స్వర్గమునేదైతే స్థాపన చేస్తారో, అందులో శ్రీకృష్ణుడు నంబరు వన్ రాజకుమారుడు. తండ్రి కూర్చుని పిల్లలకు పావనంగా అయ్యే యుక్తిని తెలియజేస్తారు. ఏ స్వర్గమునైతే వైకుంఠము, విష్ణుపురి అని అంటారో అది గతించిపోయింది, అది మళ్ళీ భవిష్యత్తులో ఉంటుంది అని పిల్లలకు తెలుసు. చక్రము తిరుగుతూ ఉంటుంది కదా. ఈ జ్ఞానము ఇప్పుడు పిల్లలైన మీకు లభిస్తుంది. దీనిని ధారణ చేసి ఇతరుల చేత చేయించాలి. ప్రతి ఒక్కరూ టీచర్ అవ్వాలి. అలాగని టీచర్ అవ్వడం ద్వారా లక్ష్మీ-నారాయణులుగా అయిపోతారని కూడా కాదు. అలా కాదు. టీచర్ అవ్వడం ద్వారా మీరు ప్రజలను తయారుచేసుకుంటారు. ఎంతగా అనేకుల కళ్యాణము చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. స్మృతి ఉంటుంది. తండ్రి అంటారు, ట్రెయిన్ లో వచ్చేటప్పుడు కూడా బ్యాడ్జిపై అర్థం చేయించండి. తండ్రి పతిత-పావనుడు, ముక్తిప్రదాత, పావనంగా తయారుచేసేవారు. అక్కడ అనేకులను స్మృతి చేయవలసి ఉంటుంది. జంతువులైన ఏనుగు, గుర్రము మొదలైనవాటిని, కూర్మాన్ని, మత్స్యాన్ని కూడా అవతారాలు అని అంటారు, వాటిని కూడా పూజిస్తూ ఉంటారు. భగవంతుడు సర్వవ్యాపి అనగా అన్నింటిలోనూ ఉన్నారు, అందుకే అన్నింటికీ తినిపించాలి అని భావిస్తారు. అచ్ఛా, కణకణములోనూ భగవంతుడు ఉన్నారు అని అంటారు, మరి వాటికి ఎలా తినిపిస్తారు. పూర్తిగా తెలివితక్కువవారిగా అయిపోయారు. లక్ష్మీ-నారాయణులు మొదలైన దేవీ-దేవతలు ఈ పనులు చేయరు కదా. చీమలకు అన్నం పెడతారు, ఫలానావారికి ఇస్తారు. పిల్లలైన మీరు ధర్మానికి మరియు రాజనీతికి సంబంధించినవారు. మనం ధర్మ స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు. రాజ్య స్థాపన చేసేందుకు మిలిట్రీ ఉంటుంది కానీ మీరు గుప్తముగా ఉన్నారు. మీది ఆత్మిక విశ్వవిద్యాలయము. మొత్తం ప్రపంచములోని మనుష్యమాత్రులెవరైతే ఉన్నారో వారందరూ ఈ ధర్మాల నుండి బయటకు వచ్చి తమ ఇంటికి వెళ్తారు. ఆత్మలు వెళ్ళిపోతాయి. అది ఆత్మలు నివసించే ఇల్లు. ఇప్పుడు మీరు సంగమయుగములో చదువుతున్నారు, మళ్ళీ సత్యయుగములోకి వచ్చి రాజ్యం చేస్తారు, అక్కడ ఇంకే ధర్మమూ ఉండదు. బాబా, మీరు ఏదైతే ఇస్తారో దానిని ఇంకెవరూ ఇవ్వలేరు అని పాటలో కూడా ఉంది కదా. మొత్తం ఆకాశము, మొత్తం భూమి మీదిగా ఉంటుంది. మొత్తం విశ్వానికి మీరు యజమానులుగా అయిపోతారు. ఇది కూడా ఇప్పుడే మీరు అర్థం చేసుకుంటారు, కొత్త ప్రపంచములో ఈ విషయాలన్నింటినీ మర్చిపోతారు. దీనిని ఆత్మిక స్పిరిచ్యుయల్ జ్ఞానము అని అంటారు. మనము ప్రతి 5000 సంవత్సరాల తర్వాత రాజ్యాన్ని తీసుకుంటాము, మళ్ళీ పోగొట్టుకుంటాము అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఈ 84 జన్మల చక్రము తిరుగుతూనే ఉంటుంది. చదువును చదవవలసి ఉంటుంది, అప్పుడే వెళ్ళగలుగుతాము కదా! చదువుకోకపోతే కొత్త ప్రపంచములోకి వెళ్ళలేరు. అక్కడ కేవలం లిమిటెడ్ సంఖ్యే ఉంటుంది. నంబరువారు పురుషార్థానుసారముగా అక్కడకు వెళ్ళి పదవిని పొందుతారు. ఇంతమందైతే చదవరు కదా. ఒకవేళ అందరూ చదువుకున్నట్లయితే మరుసటి జన్మలో రాజ్యాన్ని కూడా పొందాలి కదా. చదువుకునేవారి లిమిట్ ఉంది. సత్య, త్రేతాయుగాలలోకి వచ్చేవారే చదువుకుంటారు. మీ ప్రజలు ఎంతోమంది తయారవుతూ ఉంటారు. ఆలస్యముగా వచ్చేవారు పాపాలను భస్మం చేసుకోలేరు. పాపాత్ములైనట్లయితే ఇక శిక్షలు అనుభవించి చాలా చిన్న పదవినే పొందుతారు, అగౌరవపాలవుతారు. ఎవరైతే ఇప్పుడు ఎంతో మాయావి గౌరవము కలిగి ఉన్నారో, వారు అగౌరవపాలవుతారు. ఇది ఈశ్వరీయ గౌరవము. అది ఆసురీ గౌరవము. ఈశ్వరీయ అనగా దైవీ గౌరవానికి మరియు ఆసురీ గౌరవానికి రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. మనం ఆసురీ గౌరవము కలవారిగా ఉండేవారము, ఇప్పుడు మళ్ళీ దైవీ గౌరవము కలవారిగా అవుతాము. ఆసురీ గౌరవము ద్వారా పూర్తిగా బికారులుగా అయిపోతారు. ఇది ముళ్ళ ప్రపంచము, కావున ఇది అగౌరవపాలైనట్లు కదా. తర్వాత మళ్ళీ ఎంత గౌరవము కలవారిగా అవుతారు. యథా రాజా రాణి తథా ప్రజా. అనంతమైన తండ్రి మీ గౌరవాన్ని ఎంతో ఉన్నతముగా తయారుచేస్తారు కావున అంతటి పురుషార్థాన్ని కూడా చేయాలి. మేము మా గౌరవాన్ని ఈ విధంగా తయారుచేసుకోవాలి అనగా నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా తయారవ్వాలి అని అందరూ అంటారు. వీరికన్నా ఉన్నతమైన గౌరవము ఇంకెవరికీ ఉండదు. కథను కూడా నరుని నుండి నారాయణునిగా అయ్యేదే వింటారు. అమరకథ, మూడవ నేత్రము యొక్క కథ, రెండూ ఒక్కటే. ఈ కథను ఇప్పుడే మీరు వింటారు.
పిల్లలైన మీరు విశ్వాధిపతులుగా ఉండేవారు, తర్వాత 84 జన్మలు తీసుకుంటూ కిందకు దిగుతూ వచ్చారు. మళ్ళీ మొదటి నంబరు జన్మ లభిస్తుంది. మొదటి నంబరు జన్మలో మీరు చాలా ఉన్నతమైన పదవిని పొందుతారు. రాముడు గౌరవము కలవారిగా చేస్తారు, రావణుడు అగౌరవపాలు చేస్తాడు. ఈ జ్ఞానము ద్వారానే మీరు ముక్తి-జీవన్ముక్తులను పొందుతారు. అర్ధకల్పము రావణుడి పేరే ఉండదు. ఈ విషయాలు ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలోకి వస్తాయి, నంబరువారుగా వస్తాయి. కల్ప-కల్పమూ ఇదే విధముగా మీరు నంబరువారు పురుషార్థానుసారముగా వివేకవంతులుగా అవుతారు. మాయ పొరపాట్లు చేయిస్తుంది. అనంతమైన తండ్రిని స్మృతి చేయడమునే మర్చిపోతారు. భగవంతుడు చదివిస్తారు, వారు మన టీచరుగా అయ్యారు, అయినా ఆబ్సెంట్ అవుతారు, చదువుకోరు. ప్రతి ముంగిట ఎదురుదెబ్బలు తినే అలవాటు ఏర్పడిపోయింది. ఎవరికైతే చదువుపై శ్రద్ధ ఉండదో, వారిని ఏదో ఒక ఉద్యోగములో చేర్చవలసి ఉంటుంది. చాకలి పని మొదలైన పనులను చేస్తారు. వాటిలో చదువు యొక్క అవసరమేముంది. వ్యాపారాలలో మనుష్యులు మల్టీ-మిలియనీర్లుగా అవుతారు కానీ ఉద్యోగాలలో అంతగా అవ్వరు. అందులోనైతే ఫిక్స్ చేసిన జీతమే లభిస్తుంది. ఇప్పుడు మీ ఈ చదువు విశ్వము యొక్క రాజ్యాధికారము కోసము. మేము భారతవాసులము అని ఇక్కడ అంటారు కదా. మళ్ళీ చివరిలో మిమ్మల్ని విశ్వాధిపతులు అని అంటారు. అక్కడ దేవీ-దేవతా ధర్మము తప్ప ఇంకే ధర్మమూ ఉండదు. తండ్రి మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారుచేస్తారు కావున వారి మతముపై నడవాలి. ఎటువంటి వికారాల భూతము ఉండకూడదు. ఈ భూతాలు చాలా చెడ్డవి. కామ వికారములో ఉండేవారి ఆరోగ్యము పాడవుతూ ఉంటుంది, శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఈ కామ వికారము మీ శక్తిని పూర్తిగా అంతం చేసేసింది. పరిణామముగా ఆయుష్షు తగ్గిపోతూ వచ్చింది. భోగిగా అయిపోయారు. కామ వికారము కలవారు భోగిగా, రోగిగా, అన్ని రకాలుగా అయిపోతారు. అక్కడ వికారాలు ఉండవు. యోగీలు సదా ఆరోగ్యవంతముగా ఉంటారు మరియు ఆయుష్షు కూడా 150 సంవత్సరాలు ఉంటుంది. అక్కడ కాలుడు కబళించడు. దీనిపై ఒక కథను కూడా చెప్తారు. నీకు మొదట సుఖము కావాలా లేక దుఃఖము కావాలా అని ఒకరిని అడిగితే, అప్పుడు మొదట సుఖాన్నే తీసుకో, ఎందుకంటే సుఖములోకి వెళ్ళిపోతే ఇక అక్కడకు కాలుడు రాలేడు, కాలుడు లోపలికి ప్రవేశించలేడు అని అతనికి ఎవరో చెప్పినట్లుగా ఒక కథను తయారుచేశారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు సుఖధామములో ఉన్నప్పుడు అక్కడ కాలుడు ఉండడు. రావణ రాజ్యమే ఉండదు. మళ్ళీ ఎప్పుడైతే వికారులుగా అవుతారో అప్పుడు కాలుడు వస్తాడు. ఎన్ని కథలు తయారుచేశారు, కాలుడు తీసుకువెళ్ళాడని, తర్వాత ఇది జరిగిందని... అని అంటారు. వాస్తవానికి కాలుడు కనిపించడు, ఆత్మా కనిపించదు, వీటన్నింటినీ కట్టుకథలు అని అంటారు. చెవులకు ఇంపుగా అనిపించే కథలు ఎన్నో తయారయ్యాయి. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు, అక్కడ అకాల మృత్యువు ఎప్పుడూ ఉండదు. అక్కడ ఆయుష్షు ఎక్కువగా ఉంటుంది మరియు పవిత్రముగా ఉంటారు. 16 కళలు ఉంటాయి, తర్వాత కళలు తగ్గుతూ, తగ్గుతూ పూర్తిగా కళావిహీనముగా అయిపోతారు. నిర్గుణుడినైన నాలో ఏ గుణము లేదు అని అంటారు. పిల్లలది నిర్గుణ సంస్థ కూడా ఒకటి ఉంది. మాలో ఏ గుణమూ లేదు, మమ్మల్ని గుణవంతులుగా తయారుచేయండి, సర్వ గుణ సంపన్నులుగా తయారుచేయండి అని అంటారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పవిత్రముగా అవ్వాలి. అందరూ మరణించాలి కూడా. ఇంత లెక్కలేనంతమంది మనుష్యులు సత్యయుగములో ఉండరు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు. అక్కడ పిల్లలు కూడా యోగబలము ద్వారానే జన్మిస్తారు. ఇక్కడ ఎంతమంది పిల్లలకు జన్మనిస్తూ ఉంటారో చూడండి. తండ్రి మళ్ళీ చెప్తున్నారు, తండ్రినే స్మృతి చేయండి. ఆ తండ్రే చదివిస్తారు, చదివించే టీచర్ గుర్తుకువస్తారు. శివబాబా మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. వారు ఏమి చదివిస్తారు, అది కూడా మీకు తెలుసు. కావున తండ్రి లేక టీచరుతో యోగాన్ని జోడించాలి. జ్ఞానము చాలా ఉన్నతమైనది. ఇప్పుడు ఇది మీ అందరిదీ విద్యార్థి జీవితము. చిన్న పిల్లలు, వృద్ధులు, యువత అందరూ కలిసి చదువుకునే విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడైనా చూశారా? స్కూలూ ఒక్కటే, చదివించే టీచరు కూడా ఒక్కరే మరియు అందులో బ్రహ్మా స్వయమూ చదువుకుంటున్నారు. ఆశ్చర్యము కదా. శివబాబా మిమ్మల్ని చదివిస్తారు. ఈ బ్రహ్మా కూడా వింటారు. పిల్లలైనా, వృద్ధులైనా ఎవరైనా చదువుకోవచ్చు. ఈ జ్ఞానాన్ని మీరు కూడా చదువుకుంటారు కదా. ఇప్పుడు చదివించడం ప్రారంభించారు. రోజురోజుకు సమయం తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు అనంతములోకి వెళ్ళిపోయారు. ఈ 5000 సంవత్సరాల చక్రము ఎలా గతించిందో మీకు తెలుసు. మొదట ఒకే ధర్మము ఉండేది. ఇప్పుడు ఎన్ని అనేక ధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు దీనిని రాజ్యము అని అనరు. దీనిని ప్రజలపై ప్రజల రాజ్యము అని అంటారు. మొట్టమొదట చాలా శక్తివంతమైన ధర్మము ఉండేది. మొత్తం విశ్వానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు అధర్ములుగా అయిపోయారు. ఏ ధర్మమూ లేదు. అందరిలోనూ 5 వికారాలు ఉన్నాయి. అనంతమైన తండ్రి చెప్తున్నారు -పిల్లలూ, ఇప్పుడు కాస్త ఓపిక పట్టండి, ఇప్పుడు ఇంకా కొద్ది సమయమే మీరు ఈ రావణ రాజ్యములో ఉంటారు. బాగా చదువుకున్నట్లయితే ఇక సుఖధామములోకి వెళ్ళిపోతారు. ఇది దుఃఖధామము. మీరు మీ శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి, ఈ దుఃఖధామాన్ని మర్చిపోతూ ఉండండి. ఓ ఆత్మిక పిల్లలూ! అని ఆత్మల తండ్రి డైరెక్షన్ ఇస్తారు. ఆత్మిక పిల్లలు ఈ ఇంద్రియాల ద్వారా అది విన్నారు. ఆత్మలైన మీరు సత్యయుగములో సతోప్రధానముగా ఉన్నప్పుడు మీ శరీరము కూడా ఫస్ట్ క్లాస్ గా, సతోప్రధానముగా ఉండేది. మీరు చాలా ధనవంతులుగా ఉండేవారు, మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ ఎలా తయారయ్యారు! రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. పగలులో మనం స్వర్గములో ఉండేవారము, రాత్రివేళలో మనం నరకములో ఉన్నాము. దీనిని బ్రహ్మా మరియు బ్రాహ్మణుల యొక్క పగలు మరియు రాత్రి అని అంటారు. 63 జన్మలు ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు, ఇది అంధకారమయమైన రాత్రి కదా. భ్రమిస్తూ ఉంటారు. భగవంతుడు ఎవ్వరికీ లభించరు. దీనిని తికమక దారుల ఆట అని అంటారు. తండ్రి పిల్లలైన మీకు మొత్తం సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల సమాచారాన్ని వినిపిస్తారు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ప్రతి ముంగిట ఎదురుదెబ్బలు తినే అలవాటును వదిలి భగవంతుడు చెప్పే చదువును శ్రద్ధగా చదవాలి. ఎప్పుడూ ఆబ్సెంట్ అవ్వకూడదు. తండ్రి సమానముగా టీచరుగా కూడా తప్పకుండా అవ్వాలి. చదువుకుని మళ్ళీ చదివించాలి కూడా.
2. సత్యనారాయణుని సత్యమైన కథను విని నరుని నుండి నారాయణునిగా అవ్వాలి, అటువంటి గౌరవం కలవారిగా స్వయాన్ని స్వయమే తయారుచేసుకోవాలి. ఎప్పుడూ భూతాలకు వశీభూతమై గౌరవాన్ని పోగొట్టుకోకూడదు.
| వరదానము:- |
సంబంధము మరియు ప్రాప్తుల స్మృతి ద్వారా సదా సంతోషములో ఉండే సహజయోగీ భవ సహజయోగానికి ఆధారము - సంబంధము మరియు ప్రాప్తి. సంబంధము ఆధారంపై ప్రేమ కలుగుతుంది మరియు ఎక్కడైతే ప్రాప్తులు ఉంటాయో అక్కడకు మనసు, బుద్ధి సహజంగా వెళ్తాయి. కనుక సంబంధములో నా వారు అన్న అధికారముతో గుర్తు చెయ్యండి. మనస్ఫూర్తిగా మేరా బాబా (నా బాబా) అని అనండి మరియు బాబా ద్వారా శక్తులు, జ్ఞానము, గుణాలు, సుఖ-శాంతులు, ఆనందము, ప్రేమ, ఈ ఖజానా ఏదైతే లభించిందో, దానిని స్మృతిలో ఇమర్జ్ చేసుకోండి, దీని వలన అపారమైన సంతోషము ఉంటుంది మరియు సహజయోగిగా కూడా అవుతారు. |
| స్లోగన్:- | దేహభానము నుండి ముక్తులుగా అయినట్లయితే ఇతర బంధనాలన్నీ స్వతహాగా సమాప్తమైపోతాయి. |