| 24-10-2024 |
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
|
మధువనం |
| ‘‘మధురమైన పిల్లలూ - అనంతమైన అపారమైన సంతోషాన్ని అనుభవం చేసేందుకు ప్రతి క్షణమూ బాబాతోపాటు ఉండండి’’ | |
| ప్రశ్న:- | తండ్రి నుండి ఏ పిల్లలకు చాలా-చాలా శక్తి లభిస్తుంది? |
| జవాబు:- | ఎవరికైతే - మేము అనంతమైన విశ్వాన్ని పరివర్తన చేసేవారము, మేము అనంతమైన విశ్వానికి యజమానులుగా అవ్వాలి, మమ్మల్ని చదివించేవారు స్వయంగా విశ్వాధిపతియైన తండ్రి అన్న నిశ్చయం ఉంటుందో, అటువంటి పిల్లలకు చాలా శక్తి లభిస్తుంది. |
ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలను లేక ఆత్మలను ఆత్మిక తండ్రియైన పరమపిత పరమాత్మ కూర్చుని చదివిస్తారు మరియు అర్థం చేయిస్తారు ఎందుకంటే పిల్లలే పావనంగా అయి స్వర్గాధిపతులుగా మళ్ళీ అవ్వనున్నారు. మొత్తం విశ్వమంతటికీ తండ్రి అయితే ఒక్కరే. పిల్లలకు ఈ నిశ్చయం ఏర్పడుతుంది. మొత్తం విశ్వము యొక్క తండ్రి, సర్వాత్మల తండ్రి ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నారు. ఈ విషయం బుద్ధిలో అంతగా కూర్చుంటుందా? ఎందుకంటే బుద్ధి తమోప్రధానముగా ఉంది, లోహపు పాత్రలా, ఇనుపయుగ బుద్ధిలా ఉంది. బుద్ధి ఆత్మలో ఉంటుంది. మరి అంతగా బుద్ధిలో కూర్చుంటుందా? తప్పకుండా అనంతమైన తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు, మేము అనంతమైన విశ్వాన్ని మారుస్తున్నాము అని అర్థం చేసుకునేంత శక్తి లభిస్తుంది. ఈ సమయంలో అనంతమైన సృష్టిని నరకము అని అంటారు. పేదవారు నరకములో ఉన్నారు అని తెలుసు లేక అలా భావిస్తారు, మరి సన్యాసులు, షావుకార్లు, పెద్ద పదవులు కలవారు స్వర్గములో ఉన్నారా? తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ సమయంలో మనుష్యమాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ నరకములోనే ఉన్నారు. ఆత్మ ఎంత చిన్ననిది, ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇంత చిన్నని ఆత్మలో మొత్తం జ్ఞానమంతా నిలవడం లేదా లేక మర్చిపోతున్నారా? విశ్వములోని సర్వాత్మల తండ్రి మీ సమ్ముఖములో కూర్చుని మిమ్మల్ని చదివిస్తున్నారు. తప్పకుండా బాబా మనతోపాటు ఇక్కడ ఉన్నారు అని రోజంతా బుద్ధిలో ఇది గుర్తుంటుందా? బుద్ధిలో ఎంత సమయం కూర్చుంటుంది? గంటా, అరగంటా లేక రోజంతానా? ఇది బుద్ధిలో ఉంచుకునేందుకు కూడా శక్తి కావాలి. ఈశ్వరుడైన పరమపిత పరమాత్మ మిమ్మల్ని చదివిస్తున్నారు. బయట మీ ఇళ్ళలో ఉన్నప్పుడు అక్కడ తోడుగా ఉండరు. ఇక్కడ ప్రాక్టికల్ గా మీతోపాటు ఉన్నారు. ఉదాహరణకు ఎవరి పతి అయినా విదేశాలకు వెళ్తే, పత్ని ఇక్కడ ఉంటే, ఆమె నా పతి నాతో ఉన్నారు అని అయితే అనరు కదా. అనంతమైన తండ్రి అయితే ఒక్కరే. తండ్రి అందరిలోనూ లేరు కదా. తండ్రి తప్పకుండా ఒకేచోట కూర్చుంటారు. కావున అనంతమైన తండ్రి మనల్ని కొత్త ప్రపంచానికి యజమానులుగా తయారుచేసేందుకు యోగ్యులుగా చేస్తున్నారు అన్నది బుద్ధిలోకి వస్తుందా? మేము మొత్తం విశ్వానికి యజమానులుగా అవ్వనున్నాము అని మీ హృదయములో స్వయాన్ని ఇంతగా అర్హులుగా భావిస్తున్నారా? ఇది అయితే ఎంతో సంతోషించవలసిన విషయము. ఇంతకన్నా ఎక్కువ సంతోషపు ఖజానా అయితే ఇంకెవరికీ లభించదు. మేము ఈ విధంగా అవ్వనున్నాము అని ఇప్పుడు మీకు తెలిసింది. ఈ దేవతలు ఎక్కడి అధిపతులో, ఇది కూడా అర్థం చేసుకున్నారు. భారత్ లోనే దేవతలు ఒకప్పుడు ఉండి వెళ్ళారు. వీరు మొత్తం విశ్వానికి యజమానులుగా అవ్వనున్నారు. ఇంతగా మీ బుద్ధిలో ఉందా? అటువంటి నడవడిక ఉందా? మాట్లాడే విధానము అలా ఉందా? అటువంటి బుద్ధి ఉందా? ఏదైనా విషయములో వెంటనే కోపగించుకునే, ఎవరికైనా నష్టం కలిగించే, ఎవరినైనా గ్లాని చేసే, అటువంటి నడవడికనైతే నడవడం లేదు కదా. సత్యయుగములో ఈ విధంగా ఎప్పుడూ ఎవరి గ్లానినీ చేయరు. అక్కడ గ్లాని చేసే అశుద్ధమైన ఆలోచనలు కలవారు ఉండనే ఉండరు. తండ్రి అయితే పిల్లలను ఎంత జోరుగా పైకి ఎత్తుతారు. మీరు తండ్రిని స్మృతి చేసినట్లయితే పాపాలు అంతమైపోతాయి. మీరు చేతులు ఎత్తుతారు కానీ మీ నడవడిక ఆ విధంగా ఉందా? తండ్రి కూర్చుని చదివిస్తున్నారు అన్నది మీ బుద్ధిలో దృఢముగా కూర్చుంటుందా? చాలామంది నషా సోడా వాటర్ లా అయిపోతుందని తండ్రికి తెలుసు. అందరికీ అంతటి సంతోషపు పాదరసము పైకి ఎక్కదు. ఎప్పుడైతే బుద్ధిలో కూర్చుంటుందో అప్పుడే నషా ఎక్కుతుంది. విశ్వాధిపతులుగా తయారుచేయడానికి తండ్రే చదివిస్తారు.
ఇక్కడైతే అందరూ పతితులుగా, రావణ సాంప్రదాయులుగా ఉన్నారు. రాముడు కోతుల సైన్యాన్ని తీసుకున్నట్లుగా, ఆ తర్వాత ఇది, అది చేసారని కథ కూడా ఉంది కదా. బాబా రావణునిపై విజయాన్ని ప్రాప్తింపజేసి లక్ష్మీ-నారాయణులుగా తయారుచేస్తారని ఇప్పుడు మీకు తెలుసు. ఇక్కడ పిల్లలైన మిమ్మల్ని ఎవరైనా అడిగితే, మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు అని మీరు వెంటనే చెప్తారు. భగవానువాచ. నేను మిమ్మల్ని బ్యారిస్టరుగా లేక ఫలానావారిగా తయారుచేస్తాను అని టీచర్ అంటారు కదా. టీచరు నిశ్చయంతో చదివిస్తారు మరియు పిల్లలు అలా తయారైపోతారు. చదువుకునేవారు కూడా నంబరువారుగా ఉంటారు కదా, ఇక పదవిని కూడా నంబరువారుగా పొందుతారు. ఇది కూడా చదువే. బాబా లక్ష్యాన్ని-ఉద్దేశ్యాన్ని ఎదురుగా చూపిస్తున్నారు. ఈ చదువుతో మేము ఈ విధంగా అవుతాము అని మీరు భావిస్తారు. ఇది సంతోషకరమైన విషయం కదా. ఐ.సి.యస్. చదివేవారు కూడా మేము ఇది చదివి ఆ తర్వాత ఇది చేస్తాము, ఇల్లు కట్టుకుంటాము, ఇలా చేస్తాము అని భావిస్తారు. బుద్ధిలో ఇలా నడుస్తుంది. ఇక్కడేమో పిల్లలైన మిమ్మల్ని తండ్రి కూర్చుని చదివిస్తారు. అందరూ చదువుకోవాలి, పవిత్రముగా అవ్వాలి. మేము ఎటువంటి అపవిత్ర కర్మనూ చేయము అని తండ్రితో ప్రతిజ్ఞ చేయాలి. తండ్రి అంటారు, ఒకవేళ ఏదైనా తప్పుడు పని చేసినట్లయితే చేసుకున్న సంపాదన అంతా అంతమైపోతుంది. ఇది మృత్యులోకము, పాత ప్రపంచము. మనము కొత్త ప్రపంచం కోసం చదువుకుంటున్నాము. ఈ పాత ప్రపంచమైతే అంతమైపోనున్నది. పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. తండ్రి మనల్ని అమరలోకము కోసమే చదివిస్తున్నారు. మొత్తం ప్రపంచము యొక్క చక్రాన్ని తండ్రి అర్థం చేయిస్తారు. చేతిలో ఎటువంటి పుస్తకమూ లేదు, తండ్రి డైరెక్టుగా నోటితో అర్థం చేయిస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్న మొట్టమొదటి విషయమేమిటంటే - స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. ఆత్మ భగవంతుడైన తండ్రి సంతానము. పరమపిత పరమాత్మ పరంధామములో ఉంటారు. ఆత్మలమైన మనం కూడా అక్కడ ఉంటాము. మళ్ళీ అక్కడి నుండి పాత్రను అభినయించేందుకు నంబరువారుగా ఇక్కడకు వస్తూ ఉంటాము. ఇది చాలా విశాలమైన, అనంతమైన రంగస్థలము. ఈ రంగస్థలముపైకి పాత్రధారులు పాత్రను అభినయించేందుకు మొట్టమొదట భారత్ లోకి, కొత్త ప్రపంచములోకి వస్తారు. ఇది వారి పాత్ర. మీరు వారి మహిమను కూడా గానం చేస్తారు. వారిని మల్టీ మిలియనియర్ అని అంటారా? ఆ వ్యక్తుల (దేవతలు) వద్దనైతే అపారమైన లెక్కలేనంత ధనము ఉంటుంది. తండ్రి వారిని ‘ఆ వ్యక్తులు’ అనే అంటారు కదా ఎందుకంటే తండ్రి అనంతమైనవారు. ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది. శివబాబా వీరిని ఈ విధంగా షావుకార్లుగా తయారుచేశారు కావున భక్తి మార్గములో శివుని మందిరాలను పూజ కొరకు నిర్మిస్తారు. ఎవరైతే పూజ్యులుగా తయారుచేశారో మొట్టమొదట వారినే పూజిస్తారు. తండ్రి అయితే నషా ఎక్కించేందుకు ప్రతి రోజూ ఎంతో అర్థం చేయిస్తారు. కానీ నంబరువారు పురుషార్థానుసారముగా ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు సేవలో నిమగ్నమై ఉంటారు కావున తాజాగా ఉంటారు, లేకపోతే పాసిపోతారు. వీరు భారత్ లో రాజ్యం చేసేటప్పుడు ఇంకే ధర్మమూ లేదు అని తప్పకుండా పిల్లలకు తెలుసు. కేవలం దేవతా ధర్మమే ఉండేది, ఆ తర్వాత ఇతరేతర ధర్మాలు వచ్చాయి. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది అన్నది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. స్కూల్లో లక్ష్యము-ఉద్దేశ్యమైతే కావాలి కదా. సత్యయుగ ఆదిలో వీరు రాజ్యము చేసేవారు, తర్వాత 84 జన్మల చక్రములోకి వచ్చారు. ఇది అనంతమైన చదువు అని పిల్లలకు తెలుసు. జన్మ-జన్మాంతరాలు అయితే హద్దులోని చదువులను చదువుతూ వచ్చారు, ఇందులో చాలా పక్కా నిశ్చయం కావాలి. మొత్తం సృష్టినంతటినీ పరివర్తన చేసేవారు అనగా పునరుజ్జీవింపజేసేవారు అనగా నరకాన్ని స్వర్గముగా తయారుచేసేవారు తండ్రి, వారు మనల్ని చదివిస్తున్నారు. ముక్తిధామములోకి అయితే అందరూ వెళ్ళగలుగుతారు అన్నది పక్కా, కానీ స్వర్గములోకి అయితే అందరూ రారు. మనల్ని తండ్రి ఈ విషయసాగరము నుండి, వేశ్యాలయము నుండి బయటకు తీస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు తప్పకుండా ఇది వేశ్యాలయమే. ఇది ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది, ఇది కూడా మీరు తెలుసుకున్నారు. ఈ రావణ రాజ్యము ప్రారంభమై, భక్తి ప్రారంభమై 2500 సంవత్సరాలు అయ్యింది. ఆ సమయములో దేవీ-దేవతా ధర్మమువారే ఉన్నారు, వారు వామ మార్గములోకి వచ్చేసారు. భక్తి కొరకే మందిరాలను నిర్మిస్తారు. సోమనాథ మందిరాన్ని ఎంత పెద్దగా తయారుచేసారు. చరిత్రనైతే విన్నారు కదా. ఆ మందిరంలో ఏముండేది! మరి ఆ సమయములో ఎంత ధనవంతులుగా ఉండి ఉంటారు! కేవలం ఒక్క మందిరమే ఉండదు కదా. చరిత్రలో ఒక మందిరం పేరు వేసారు కానీ మందిరాలనైతే ఎంతోమంది రాజులు నిర్మిస్తారు. ఒకరినొకరు చూసి పూజలైతే అందరూ చేస్తారు కదా. ఎన్నో మందిరాలు ఉంటాయి. కేవలం ఒక్కదానినే దోచుకుని ఉండరు కదా. వేరే మందిరాలు కూడా చుట్టుప్రక్కల ఉంటాయి. అక్కడ గ్రామాలు దూరదూరంగా ఉండవు. ఒకదానికొకటి దగ్గరగానే ఉంటాయి ఎందుకంటే అక్కడ రైళ్ళు మొదలైనవైతే ఉండవు కదా. ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటూ ఉండవచ్చు. తర్వాత మెల్లమెల్లగా సృష్టి వ్యాపిస్తూ ఉంటుంది.
ఇప్పుడు పిల్లలైన మీరు చదువుకుంటున్నారు. అందరికన్నా పెద్ద తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారు. ఈ నషా ఉండాలి కదా. ఇంట్లో ఎప్పుడూ ఏడవడం, రోదించడం చేయకూడదు. ఇక్కడ మీరు దైవీ గుణాలను ధారణ చేయాలి. ఈ పురుషోత్తమ సంగమయుగములో పిల్లలైన మిమ్మల్ని చదివించడం జరుగుతుంది. ఇది మధ్యలోని సమయము, ఇప్పుడు మీరు పరివర్తన అవుతారు. పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచములోకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగములో చదువుకుంటున్నారు. భగవంతుడు మిమ్మల్ని చదివిస్తారు. మొత్తం ప్రపంచమంతటినీ పరివర్తన చేస్తారు. పాత ప్రపంచాన్ని కొత్తగా చేస్తారు, ఆ కొత్త ప్రపంచానికి మీరు యజమానులుగా అవ్వాలి. మీకు యుక్తిని తెలియజేసేందుకు తండ్రి బంధింపబడి ఉన్నారు. కావున పిల్లలైన మీరు కూడా దానిని అమలు చేయాలి. మనం ఇక్కడి నివాసులము కాము అనైతే మీరు అర్థం చేసుకున్నారు. మన రాజధాని ఉండేది అని మీకు ఇంతకుముందు తెలియదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు - రావణుని రాజ్యములో మీరు చాలా దుఃఖితులుగా ఉన్నారు. దీనిని వికారీ ప్రపంచము అనే అంటారు. ఈ దేవతలు సంపూర్ణ నిర్వికారులు. మనుష్యులు స్వయాన్ని వికారులుగా పిలుచుకుంటారు. ఇప్పుడు ఈ రావణ రాజ్యము ఎప్పటి నుండి ప్రారంభమయ్యింది, అసలు ఏమి జరిగింది, ఇది కొద్దిగా కూడా ఎవరికీ తెలియదు. బుద్ధి పూర్తిగా తమోప్రధానముగా ఉంది. పారసబుద్ధి కలవారు సత్యయుగములో ఉండేవారు, అప్పుడు విశ్వాధిపతులుగా ఉండేవారు, అపారమైన సుఖములో ఉండేవారు. దాని పేరే సుఖధామము. ఇక్కడ అయితే అపారమైన దుఃఖము ఉంది. సుఖ ప్రపంచము ఎలా ఉండేదో మరియు దుఃఖ ప్రపంచము ఎలా ఉందో, అది కూడా తండ్రి అర్థం చేయిస్తారు. సుఖము ఎంత సమయం ఉంటుంది, దుఃఖము ఎంత సమయం ఉంటుంది అన్నది మనుష్యులకు ఏమాత్రమూ తెలియదు. మీలో కూడా నంబరువారుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. అర్థం చేయించేవారైతే అనంతమైన తండ్రే. శ్రీకృష్ణుడిని అనంతమైన తండ్రి అని అనరు. అలా అనడాన్ని మనసు స్వీకరించదు. కానీ తండ్రి అని ఎవరిని అనాలి, ఏమీ అర్థం చేసుకోరు. భగవంతుడు అర్థం చేయిస్తున్నారు - నన్ను గ్లాని చేస్తారు, కానీ నేను మిమ్మల్ని దేవతలుగా తయారుచేస్తాను, నన్ను ఎంతగా గ్లాని చేసారు, అలాగే దేవతలను కూడా గ్లాని చేసారు, మనుష్యులు అంత మందబుద్ధి కలవారిగా అయిపోయారు. భజ గోవిందం... అని అంటారు. తండ్రి అంటారు - ఓ మూఢమతులారా (మందబుద్ధి కలవారు), గోవిందా గోవిందా, రామ రామ అని అంటున్నా తాము ఎవరిని భజిస్తున్నారు అనేది బుద్ధిలోకి ఏమీ రాదు. రాతిబుద్ధి కలవారిని మందబుద్ధి కలవారు అనే అంటారు. తండ్రి అంటారు, ఇప్పుడు నేను మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారుచేస్తాను. తండ్రి సర్వుల సద్గతిదాత.
తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు మీ పరివారాలు మొదలైనవాటిలో ఎంతగా చిక్కుకుని ఉన్నారు! భగవంతుడు ఏదైతే చెప్తున్నారో దానిని బుద్ధిలోకి తీసుకురావాలి. కానీ ఆసురీ మతములో చిక్కుకుని ఉన్నారు కావున ఈశ్వరీయ మతముపై ఎలా నడవగలరు! గోవిందుడు ఎవరు, వారు ఏమిటి, ఇది కూడా తెలియదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు అంటారు - బాబా, మీరు అనేక సార్లు మాకు అర్థం చేయించారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. బాబా, మేము మళ్ళీ మీ నుండి ఈ వారసత్వాన్ని తీసుకుంటున్నాము, మేము నరుని నుండి నారాయణునిగా తప్పకుండా అవుతాము. విద్యార్థులకు - మేము ఇలా అవుతాము అని చదువు యొక్క నషా తప్పకుండా ఉంటుంది. నిశ్చయం ఉంటుంది. ఇప్పుడు తండ్రి అంటారు, మీరు సర్వ గుణ సంపన్నులుగా అవ్వాలి, ఎవరి పైనా క్రోధము మొదలైనవి చేయకూడదు. దేవతలలో పంచ వికారాలు ఉండవు. శ్రీమతముపై నడవాలి. శ్రీమతము మొట్టమొదట చెప్తుంది ఏమిటంటే - స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలైన మీరు పాత్రను అభినయించేందుకు పరంధామము నుండి ఇక్కడకు వచ్చారు. మీ ఈ శరీరము నశ్వరమైనది. ఆత్మ అయితే అవినాశీ. కావున మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి - ఆత్మనైన నేను పాత్రను అభినయించేందుకు పరంధామము నుండి ఇక్కడకు వచ్చాను. ఇప్పుడు ఇక్కడ దుఃఖితులుగా అవుతారు, కావుననే ముక్తిధామములోకి వెళ్ళాలి అని అనుకుంటారు. కానీ మిమ్మల్ని పావనంగా ఎవరు తయారుచేయాలి? పిలవడం కూడా ఒక్కరినే పిలుస్తారు, కావున ఆ తండ్రి వచ్చి చెప్తున్నారు - నా మధురాతి మధురమైన పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావించండి, దేహముగా భావించకండి. నేను కూర్చుని ఆత్మలనే చదివిస్తాను. ఓ పతిత పావనా, మీరు వచ్చి పావనంగా చేయండి అని ఆత్మలే పిలుస్తారు. భారత్ లోనే పావనులు ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ పిలుస్తారు - పతితుల నుండి పావనులుగా తయారుచేసి సుఖధామములోకి తీసుకువెళ్ళండి అని. శ్రీకృష్ణుని పట్లనైతే మీకు ప్రీతి ఉంది. శ్రీకృష్ణుని కోసం అందరికన్నా ఎక్కువగా కుమారీలు, మాతలే వ్రతాలు, నోములు మొదలైనవి చేస్తారు. నిర్జలంగా ఉంటారు. కృష్ణపురిలోకి అనగా సత్యయుగములోకి వెళ్ళాలనుకుంటారు. కానీ జ్ఞానము లేదు, అందుకే ఎంతో హఠము మొదలైనవి చేస్తారు. మీరు కూడా ఎంతో చేస్తారు, కానీ మీరు ఎవరికో వినిపించేందుకు చేయరు, స్వయం కృష్ణపురిలోకి వెళ్ళేందుకు చేస్తారు. మిమ్మల్ని ఎవ్వరూ ఆపరు. వారైతే గవర్నమెంట్ ముందు నిరాహార దీక్షలు మొదలైనవి చేస్తారు, వారిని విసిగించేందుకు హఠం చేస్తారు. మీరైతే ఎవరి ముందు ధర్నాలు చేసి కూర్చోకూడదు, అలాగే మీకు ఇది ఎవరూ నేర్పించలేదు కూడా.
శ్రీకృష్ణుడు అయితే సత్యయుగ మొట్టమొదటి యువరాజు కానీ ఇది ఎవరికీ తెలియదు. శ్రీకృష్ణుడిని వారు ద్వాపరములోకి తీసుకువెళ్ళారు. తండ్రి అర్థం చేయిస్తారు - మధురాతి మధురమైన పిల్లలూ, భక్తి మరియు జ్ఞానము రెండూ వేర్వేరు. జ్ఞానము పగలు, భక్తి రాత్రి. ఎవరిది? బ్రహ్మా యొక్క రాత్రి మరియు పగలు. కానీ దీని అర్థాన్ని గురువులూ అర్థం చేసుకోరు, వారి శిష్యులూ అర్థం చేసుకోరు. జ్ఞానము, భక్తి మరియు వైరాగ్యముల రహస్యాన్ని తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయించారు. జ్ఞానము పగలు, భక్తి రాత్రి మరియు దాని తర్వాత వైరాగ్యము. వారికి అది తెలియదు. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అన్న పదాలు ఏక్యురేట్ గా ఉన్నాయి కానీ వారికి అర్థము తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు - జ్ఞానాన్ని తండ్రి ఇస్తారు, దాని ద్వారా పగలు వస్తుంది. భక్తి ప్రారంభమైతే దానిని రాత్రి అని అంటారు ఎందుకంటే అందులో ఎదురుదెబ్బలు తినవలసి ఉంటుంది. బ్రహ్మా యొక్క రాత్రి అనగా బ్రాహ్మణుల యొక్క రాత్రి, ఆ తర్వాత పగలు ఉంటుంది. జ్ఞానము ద్వారా పగలు, భక్తి ద్వారా రాత్రి. రాత్రివేళ మీరు వనవాసంలో కూర్చున్నారు, మళ్ళీ పగలులో మీరు ఎంత ధనవంతులుగా అయిపోతారు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి:-
1. తండ్రి నుండి ఇంతటి సంతోషమనే ఖజానా ఏదైతే లభిస్తుందో, అది బుద్ధిలో కూర్చుంటుందా?
2. బాబా మనల్ని విశ్వాధిపతులుగా తయారుచేయడానికి వచ్చారు, మరి - అటువంటి నడవడిక ఉందా? మాట్లాడే విధానము ఆ విధంగా ఉందా? ఎప్పుడూ ఎవరినీ గ్లాని అయితే చేయడం లేదు కదా?
3. తండ్రితో ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఎటువంటి అపవిత్ర కర్మలు జరగడం లేదు కదా?
| వరదానము:- |
సాక్షీ స్థితిలో స్థితులై పరిస్థితులు అనే ఆటను చూసే సంతుష్ట ఆత్మా భవ ఎటువంటి చలింపజేసే పరిస్థితి అయినా కానీ సాక్షీ స్థితిలో స్థితులైనట్లయితే, అది ఒక తోలుబొమ్మలాట, అది రియల్ కాదు అన్నట్లు అనుభవం చేస్తారు. మీ గౌరవములో ఉంటూ ఆటను చూడండి. సంగమయుగము యొక్క శ్రేష్ఠ గౌరవము సంతుష్టమణిగా అవ్వటము మరియు సంతుష్టులుగా అయ్యి ఉండటము. ఈ గౌరవములో ఉండే ఆత్మ ఆందోళనకు గురి అవ్వదు. సంగమయుగములో బాప్ దాదా ఇచ్చిన విశేష కానుక సంతుష్టత. |
| స్లోగన్:- | ఎంతటి సంతోషము కలవారిగా అవ్వాలంటే మనసులోని ఆ సంతోషము ముఖము ద్వారా స్పష్టంగా కనిపించాలి. |