తెలుగు మురళి · Brahma Kumaris

తెలుగు మురళి · 26 డిసెంబర్, 2024

ఓం శాంతి · BapDada ·

ఈరోజు మురళి — today’s murli in Telugu, BK Telugu murli.

18
మురళి26 డిసెంబర్, 2024 · తెలుగు
0:00--:--

పాఠ్యాన్ని ఎంచుకోండి → హైలైట్ / బాక్స్ / అండర్‌లైన్

26-12-2024
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
మధువనం

‘‘మధురమైన పిల్లలూ - మీరు ఇప్పుడు చదువును చదువుకుంటున్నారు, ఇది పతితుల నుండి పావనులుగా అవ్వడానికి చదువుకునే చదువు, మీరు ఇది చదువుకోవాలి మరియు చదివించాలి’’
ప్రశ్న:- ప్రపంచములో ఏ జ్ఞానము ఉన్నప్పటికీ అజ్ఞానాంధకారము ఉంది?
జవాబు:- మాయా జ్ఞానము. దీని ద్వారా వినాశనము జరుగుతుంది. చంద్రుని వరకూ వెళ్తారు. ఈ జ్ఞానము ఎంతగానో ఉంది కానీ కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచము యొక్క జ్ఞానము ఎవరి వద్ద లేదు. అందరూ అజ్ఞానాంధకారములో ఉన్నారు, అందరూ జ్ఞాననేత్రము విషయములో అంధులుగా ఉన్నారు. మీకు ఇప్పుడు జ్ఞానమనే మూడవ నేత్రము లభిస్తుంది. వారి బుద్ధిలో వినాశనము గురించిన ఆలోచనలు ఉన్నాయి, మీ బుద్ధిలో స్థాపన గురించిన ఆలోచనలు ఉన్నాయి అని నాలెడ్జ్ ఫుల్ పిల్లలైన మీకు తెలుసు.

ఓం శాంతి. తండ్రి ఈ శరీరము ద్వారా అర్థం చేయిస్తారు, దీనిని జీవము అని అంటారు. దీనిలో ఆత్మ కూడా ఉంది మరియు నేను కూడా ఇందులోకే వచ్చి కూర్చొంటాను, మొట్టమొదట ఇది పక్కా అవ్వాలి. వీరిని దాదా అని అంటారు. ఈ నిశ్చయము పిల్లలకు చాలా పక్కాగా ఉండాలి. ఈ నిశ్చయములోనే రమించాలి. బాబా ఎవరిలోకి అయితే ప్రవేశించారో, వారి గురించి బాబాయే స్వయం చెప్తున్నారు - నేను ఇతని అనేక జన్మల అంతిమములో వస్తాను. ఇది సర్వశాస్త్ర శిరోమణి అయిన గీతాజ్ఞానమని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. శ్రీమతము అనగా శ్రేష్ఠ మతము. శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన మతము ఒక్క భగవంతునిదే. వారి శ్రేష్ఠ మతము ద్వారానే మీరు దేవతలుగా అవుతారు. ఎప్పుడైతే మీరు భ్రష్ట మతముపై పతితులుగా అయిపోతారో అప్పుడే నేను వస్తాను అని స్వయం తండ్రి అంటారు. మనుష్యుల నుండి దేవతలుగా అవ్వడము యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోవాలి. వికారీ మనుష్యుల నుండి నిర్వికారీ దేవతలుగా తయారుచేయడానికి తండ్రి వస్తారు. సత్యయుగములో మనుష్యులే ఉంటారు కానీ వారు దైవీ గుణాలు కలిగినవారు. ఇప్పుడు కలియుగములో అందరూ ఆసురీ గుణాలు కలవారే. వాస్తవానికి అంతా మనుష్య సృష్టియే. కానీ ఇది ఈశ్వరీయ బుద్ధి మరియు అది ఆసురీ బుద్ధి. ఇక్కడ జ్ఞానము ఉంది, అక్కడ భక్తి ఉంది. జ్ఞానము మరియు భక్తి వేర్వేరు. భక్తి పుస్తకాలు ఎన్నో లెక్కలేనన్ని ఉన్నాయి. జ్ఞానానికి సంబంధించిన పుస్తకము ఒక్కటే. ఒక్క జ్ఞానసాగరుని పుస్తకము ఒక్కటే ఉండాలి. ధర్మ స్థాపన ఎవరెవరైతే చేస్తారో, వారికి కూడా ఒకటే పుస్తకము ఉంటుంది, దానినే ధర్మగ్రంథము అని అంటారు.

మొట్టమొదటి ధర్మగ్రంథము గీత. మొట్టమొదటి ధర్మము ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము, అంతేకానీ హిందూ ధర్మము కాదు. గీత ద్వారా హిందూ ధర్మము స్థాపన అయ్యిందని, గీతా జ్ఞానాన్ని శ్రీకృష్ణుడు ఇచ్చారని మనుష్యులు భావిస్తారు. ఎప్పుడు ఇచ్చారు అని అడిగితే పరంపరగా అని అంటారు. ఏ శాస్త్రములోనూ శివ భగవానువాచ అన్నదైతే లేదు. ఈ గీతా జ్ఞానము ద్వారానే మనుష్యుల నుండి దేవతలుగా అయ్యారని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. దానినే ఇప్పుడు తండ్రి మనకు ఇస్తున్నారు. దీనినే భారత్ యొక్క ప్రాచీన రాజయోగము అని అంటారు. ఆ గీతలోనే కామము మహాశత్రువు అని వ్రాయబడి ఉంది. ఈ శత్రువే మిమ్మల్ని ఓడించేసింది. తండ్రి దీనిపైనే విజయాన్ని ప్రాప్తింపజేసి జగత్ జీతులుగా, విశ్వాధిపతులుగా తయారుచేస్తారు. అనంతమైన తండ్రి కూర్చుని వీరి ద్వారా మిమ్మల్ని చదివిస్తారు. వారు ఆత్మలందరికీ తండ్రి. వీరేమో మనుష్య ఆత్మలకు అనంతమైన తండ్రి. వీరి పేరే ప్రజాపిత బ్రహ్మా. బ్రహ్మా యొక్క తండ్రి పేరేమిటి అని మీరెవరినైనా అడగవచ్చు, అప్పుడు వారు తికమకపడతారు. బ్రహ్మా-విష్ణు-శంకరులు, ఈ ముగ్గురికీ తండ్రి ఎవరో ఉంటారు కదా. బ్రహ్మా-విష్ణు-శంకరులు సూక్ష్మవతనములోని దేవతలు. వారిపైన శివుడు ఉన్నారు. శివబాబా పిల్లలైన ఆత్మలెవరైతే ఉన్నారో వారంతా శరీరాలను ధారణ చేసారు కానీ పరమపిత పరమాత్మ అయితే సదా నిరాకారునిగానే ఉంటారని పిల్లలకు తెలుసు. ఆత్మయే శరీరము ద్వారా పరమపిత అని అంటుంది. ఇది ఎంత సహజమైన విషయము! దీనినే అల్ఫ్ (భగవంతుడు) మరియు బే (రాజ్యాధికారము) యొక్క చదువు అని అంటారు. దీనిని ఎవరు చదివిస్తారు? గీతా జ్ఞానాన్ని ఎవరు వినిపించారు? శ్రీకృష్ణుడినైతే భగవంతుడు అని అనరు. అతను దేహధారి, కిరీటధారి. శివుడు అయితే నిరాకారుడు, వారిపై ఎటువంటి కిరీటము మొదలైనవి లేవు. వారే జ్ఞానసాగరుడు. తండ్రే బీజరూపుడు, చైతన్యమైనవారు. మీరు కూడా చైతన్యమైనవారే. అన్ని వృక్షాల యొక్క ఆదిమధ్యాంతాల గురించి మీకు తెలుసు. మీరు తోటమాలులు కాకపోయినా కానీ బీజాలను ఎలా నాటుతారు, వాటి నుండి వృక్షాలు ఎలా వెలువడతాయి అనేది మీరు అర్థం చేసుకోగలరు. అవి జడమైనవి, ఇది చైతన్యమైనది. ఆత్మను చైతన్యము అని అంటారు. మీ ఆత్మలోనే జ్ఞానము ఉంది, ఇతర ఏ ఆత్మలోనూ జ్ఞానము ఉండదు. కావున తండ్రి చైతన్య మనుష్య సృష్టికి బీజరూపుడు. ఇది చైతన్యమైన రచన.

అవన్నీ జడమైన బీజాలు. జడమైన బీజములో జ్ఞానముందని కాదు. వీరు చైతన్యమైన బీజరూపుడు, వీరిలో మొత్తం సృష్టి జ్ఞానము ఉంది. వృక్షము యొక్క ఉత్పత్తి, పాలన, వినాశనముల మొత్తం జ్ఞానమంతా వారిలో ఉంది, మళ్ళీ కొత్త వృక్షము ఎలా నిలబడుతుంది, అది గుప్తము. మీకు జ్ఞానము కూడా గుప్తముగా లభిస్తుంది. తండ్రి కూడా గుప్తముగా వచ్చారు. ఈ అంటు కట్టబడుతోందని మీకు తెలుసు. ఇప్పుడైతే అందరూ పతితలుగా అయిపోయారు. అచ్ఛా, బీజము నుండి మొట్టమొదటి ఆకు వెలువడింది, అది ఎవరు? సత్యయుగములోని మొదటి ఆకు అని శ్రీకృష్ణుడినే అంటారు. లక్ష్మీ-నారాయణులను అనరు. కొత్త ఆకు చిన్నగా ఉంటుంది. ఆ తర్వాత పెద్దది అవుతుంది. కావున ఈ బీజానికి ఎంతటి మహిమ ఉంది. వీరు చైతన్యమైనవారు కదా. వేరేవారు కూడా వెలువడినా, మెల్లమెల్లగా వారి మహిమ తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు దేవతలుగా అవుతారు. కావున ముఖ్యమైన విషయము - మనము దైవీ గుణాలను ధారణ చేయాలి. వీరిలా తయారవ్వాలి. చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రాలు లేకపోతే బుద్ధిలోకి జ్ఞానము ఎలా వస్తుంది. ఈ చిత్రాలు ఎంతో ఉపయోగపడతాయి. భక్తి మార్గములో ఈ చిత్రాలకు పూజ జరుగుతుంది మరియు జ్ఞాన మార్గములో వీటి ద్వారా - మేము ఇలా తయారవ్వాలి అని మీకు జ్ఞానము లభిస్తుంది. భక్తి మార్గములో - మేము ఇలా తయారవ్వాలి అని అనుకోరు. భక్తి మార్గములో మందిరాలు మొదలైనవి ఎన్ని నిర్మిస్తారు. అందరికన్నా ఎక్కువ మందిరాలు ఎవరికి ఉంటాయి? తప్పకుండా శివబాబాకే ఉంటాయి. ఆ తర్వాత వారి రచనకు ఉంటాయి. మొదటి రచన ఈ లక్ష్మీ-నారాయణులు, కావున శివుని తర్వాత వీరి పూజ ఎక్కువగా జరుగుతుంది. ఏ మాతలైతే జ్ఞానాన్ని ఇస్తారో వారి పూజ జరగదు, వారు చదువుకుంటున్నారు. మీ పూజ ఇప్పుడు జరగదు ఎందుకంటే మీరు ఇప్పుడు చదువుకుంటున్నారు. ఎప్పుడైతే మీరు చదువుకుని, మళ్ళీ ఈ చదువు లేనివారిగా అవుతారో, అప్పుడు పూజ జరుగుతుంది. ఇప్పుడు మీరు దేవీ-దేవతలుగా అవుతారు. సత్యయుగములోకి తండ్రి చదివించేందుకు వెళ్ళరు. అక్కడ ఇటువంటి చదువేదీ ఉండదు. ఈ చదువు పతితులను పావనులుగా తయారుచేసేటువంటిది. మనల్ని ఎవరైతే ఇలా తయారుచేస్తారో, వారి పూజ జరుగుతుంది, ఆ తర్వాత మన పూజ కూడా నంబరువారుగా జరుగుతుందని మీకు తెలుసు. మళ్ళీ పడిపోతూ, పడిపోతూ పంచ తత్వాలను కూడా పూజించడం మొదలుపెడతారు. పంచ తత్వాల పూజ అనగా పతిత శరీరము యొక్క పూజ. ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము మొత్తం సృష్టి అంతటిపైనా ఉండేది అని బుద్ధిలో జ్ఞానము ఉంది. ఈ దేవీ-దేవతలు రాజ్యాన్ని ఎలా మరియు ఎప్పుడు పొందారు? ఇది ఎవరికీ తెలియదు. లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. లక్షల సంవత్సరాల విషయమైతే ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు, అందుకే ఇది పరంపరగా నడుస్తూ వస్తోంది అని అనేస్తారు. దేవీ-దేవతా ధర్మము వారు ఇతర ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోయారని ఇప్పుడు మీకు తెలుసు. భారత్ లో ఉన్నవారు తమను తాము హిందువులుగా పిలుచుకుంటారు ఎందుకంటే పతితులుగా ఉన్న కారణముగా దేవీ-దేవతలుగా పిలవడం శోభించదు. కానీ మనుష్యుల్లో జ్ఞానము ఎక్కడ ఉంది. దేవీ-దేవతల కంటే ఉన్నతమైన టైటిళ్ళను స్వయానికి పెట్టించుకుంటారు. పావనమైన దేవీ-దేవతలను పూజిస్తూ శిరస్సు వంచుతారు, కానీ తమను తాము పతితులుగా భావించరు.

భారత్ లో విశేషముగా కన్యలకు ఎంతగా నమస్కరిస్తారు. కుమారులకు అంత చేయరు. పురుషుల కన్నా ఎక్కువగా స్త్రీలకు నమస్కరిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ సమయములో జ్ఞానామృతము మొదట ఈ మాతలకు లభిస్తుంది. తండ్రి వీరిలోకి ప్రవేశిస్తారు. వీరు (బ్రహ్మాబాబా) జ్ఞానపు పెద్ద నది అని వీరు కూడా భావిస్తారు. వీరు జ్ఞాన నది కూడా, అలాగే పురుషుడు కూడా. బ్రహ్మపుత్రా నది అన్నింటికన్నా పెద్దది, అది కలకత్తా వైపు సాగరములోకి వెళ్ళి కలుస్తుంది. మేళా కూడా అక్కడే జరుగుతుంది కానీ ఇది ఆత్మలు మరియు పరమాత్మ యొక్క మేళా అన్నది వారికి తెలియదు. అది నీటి నది, దానికి బ్రహ్మపుత్ర అన్న పేరును పెట్టారు. వారు బ్రహ్మమును ఈశ్వరుడు అని అంటారు, అందుకే బ్రహ్మపుత్రా నదిని పావనమైనదిగా భావిస్తారు. పతిత-పావని అని వాస్తవానికి గంగను అనరు. ఇక్కడ సాగరము మరియు బ్రహ్మా నది యొక్క మిలనము జరుగుతుంది. తండ్రి అంటారు, ఇతని ద్వారా దత్తత జరిగేందుకు ఇతను స్త్రీ అయితే కాదు. ఇవి అర్థం చేసుకోవలసిన చాలా గుహ్యమైన విషయాలు, ఇవి మళ్ళీ కనుమరుగైపోతాయి. మళ్ళీ తర్వాత మనుష్యులు వీటి ఆధారముపై శాస్త్రాలు మొదలైనవి తయారుచేస్తారు. మొదట చేతితో వ్రాయబడిన శాస్త్రాలు ఉండేవి, ఆ తర్వాత పెద్ద-పెద్ద లావు పుస్తకాలు ముద్రించారు. సంస్కృతములో శ్లోకాలు మొదలైనవి ఉండేవి కావు. ఇది చాలా సహజమైన విషయము. నేను ఇతని ద్వారా రాజయోగాన్ని నేర్పిస్తాను, ఇక తర్వాత ఈ ప్రపంచమే అంతమైపోతుంది. శాస్త్రాలు మొదలైనవి ఏవీ ఉండవు. మళ్ళీ భక్తి మార్గములో ఈ శాస్త్రాలు మొదలైనవి తయారవుతాయి. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ పరంపరగా వస్తున్నాయి అని మనుష్యులు భావిస్తారు. దీనిని అజ్ఞానాంధకారము అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని తండ్రి చదివిస్తున్నారు, దీని ద్వారా మీరు వెలుగులోకి వచ్చారు. సత్యయుగములో పవిత్ర ప్రవృత్తి మార్గము ఉంది. కలియుగములో అందరూ అపవిత్ర ప్రవృత్తి వారు. ఇది కూడా డ్రామాయే. ఆ తర్వాత నివృత్తి మార్గము ఉంటుంది, దానిని సన్యాస ధర్మము అని అంటారు, వారు అడవుల్లోకి వెళ్ళి ఉంటారు. అది హద్దులోని సన్యాసము. వారు ఉండేది ఈ పాత ప్రపంచములోనే. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచములోకి వెళ్తారు. మీకైతే తండ్రి ద్వారా జ్ఞానమనే మూడవ నేత్రము లభించింది కావున మీరు ఎంత నాలెడ్జ్ ఫుల్ గా అవుతారు. దీని కన్నా ఉన్నతమైన జ్ఞానమంటూ ఏదీ ఉండదు. అది మాయ జ్ఞానము, దాని ద్వారా వినాశనము జరుగుతుంది. వారు చంద్రుని పైకి వెళ్ళి అన్వేషిస్తూ ఉంటారు. మీకు ఇది కొత్త విషయమేమీ కాదు. ఇవన్నీ మాయ అట్టహాసాలు. ఎంతో అట్టహాసము చేస్తారు. ఏదైనా అద్భుతము చేసి చూపించాలని అతి లోతుల్లోకి వెళ్తారు. చాలా అద్భుతాలు చేయడం వలన ఇక నష్టము జరిగిపోతుంది. వారి మెదడులో వినాశనపు ఆలోచనలే వస్తాయి. ఏమేమో తయారుచేస్తూ ఉంటారు. వీటి ద్వారానే వినాశనం జరుగుతుంది అని వాటిని తయారుచేసేవారికి తెలుసు. ట్రయల్ కూడా వేస్తూ ఉంటారు. రెండు పిల్లులు కొట్లాడుకుంటే మధ్యలో వెన్నను ఇంకెవరో తినేసారు అని అంటారు. ఈ కథ అయితే చిన్నదే కానీ ఆట ఎంత పెద్దది. వీరి పేరే ప్రసిద్ధమైనది. వీరి ద్వారానే వినాశనము నిశ్చితమై ఉంది. ఎవరో ఒకరు నిమిత్తమవుతారు కదా. ప్యారడైజ్ ఉండేది, కానీ మేము ఉండేవారము కాదు అని క్రిస్టియన్లు భావిస్తారు. అక్కడ ఇస్లాములు, బౌద్ధులు కూడా లేరు కానీ క్రిస్టియన్ల తెలివి కొంత బాగుంది. భారతవాసులైతే దేవీ-దేవతా ధర్మము లక్షల సంవత్సరాల క్రితం ఉండేది అని అంటారు అంటే వారు తెలివితక్కువవారే కదా. తండ్రి భారత్ లోకే వస్తారు. ఎవరైతే మహాన్ అవివేకులుగా ఉన్నారో వారినే ఎంతో మహాన్ వివేకవంతులుగా తయారుచేస్తారు. కానీ అది కూడా గుర్తుంటేనే సాధ్యమవుతుంది.

బాబా పిల్లలైన మీకు ఎంత సహజము చేసి అర్థం చేయిస్తారు - మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీరు బంగారు పాత్రలా అయిపోతారు, అప్పుడు ధారణ కూడా బాగా జరుగుతుంది. స్మృతియాత్ర ద్వారానే పాపాలు అంతమవుతాయి. మురళిని వినకపోతే జ్ఞానము మాయమైపోతుంది. తండ్రి దయార్ద్ర హృదయులు కావున వారు పైకి లేచేందుకే యుక్తిని తెలియజేస్తారు. చివరి సమయము వరకూ నేర్పిస్తూనే ఉంటారు. అచ్ఛా, ఈ రోజు భోగ్ ఉంది, భోగ్ పెట్టి త్వరగా తిరిగి వచ్చేయాలి. అంతేకానీ వైకుంఠములోకి వెళ్ళి దేవీ-దేవతలు మొదలైనవారి సాక్షాత్కారాన్ని పొందడము, అదంతా వ్యర్థము. ఇందులో చాలా సూక్ష్మమైన బుద్ధి కావాలి. తండ్రి ఈ రథము ద్వారా అంటారు - నన్ను స్మృతి చేయండి, నేనే పతిత-పావనుడను, మీ తండ్రిని. నీతోనే తింటాను... నీతోనే కూర్చుంటాను... అన్నది ఇక్కడి గురించే. అది పైన ఎలా అవుతుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి ఈ దాదాలోకి ప్రవేశించి మనల్ని మనుష్యుల నుండి దేవతలుగా అనగా వికారుల నుండి నిర్వికారులుగా తయారుచేయడానికి గీతా జ్ఞానాన్ని వినిపిస్తున్నారు, ఈ నిశ్చయముతోనే రమించాలి. శ్రీమతముపై నడుస్తూ శ్రేష్ఠ గుణవంతులుగా అవ్వాలి.

2. స్మృతి యాత్ర ద్వారా బుద్ధిని బంగారు పాత్రగా తయారుచేసుకోవాలి. జ్ఞానము బుద్ధిలో సదా నిలిచి ఉండేందుకు మురళిని తప్పకుండా చదవాలి మరియు వినాలి.

వరదానము:- తమ పొజిషన్ యొక్క స్మృతి ద్వారా మాయపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే నిరంతర యోగీ భవ
ఏ విధంగా స్థూల పొజిషన్ కలవారు తమ పొజిషన్ ను ఎప్పుడూ మర్చిపోరో, అలా మీ పొజిషన్ - మాస్టర్ సర్వశక్తివాన్, దీనిని సదా స్మృతిలో ఉంచుకోండి మరియు ప్రతి రోజూ అమృతవేళ ఈ స్మృతిని ఇమర్జ్ చేసుకున్నట్లయితే నిరంతర యోగులుగా అవుతారు మరియు మొత్తము రోజంతా దాని సహయోగము లభిస్తూ ఉంటుంది. మాస్టర్ సర్వశక్తివంతుల ఎదురుగా మాయ రాలేదు, ఎప్పుడైతే మీరు మీ స్మృతి యొక్క ఉన్నతమైన స్థితిలో ఉంటారో, అప్పుడు మాయా చీమను జయించటము సహజమవుతుంది.
స్లోగన్:- ఆత్మా రూపీ పురుష్ ను శ్రేష్ఠముగా తయారుచేసుకునేవారే సత్యమైన పురుషార్థీ.

 

మురళి అంటే ఏమిటి?

మురళి బ్రహ్మకుమారీల దైనిక ఆధ్యాత్మిక బోధన, ఇది ప్రతి ఉదయం మధుబన్ నుండి ప్రచురించబడుతుంది. ఇక్కడ మీరు ఈరోజు మురళిని తెలుగులో చదవవచ్చు, ఆడియో వినవచ్చు మరియు PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధ్యయనానికి సహాయంగా పాఠ్యాన్ని హైలైట్ చేయవచ్చు — మీ గుర్తులు ఈ బ్రౌజర్‌లోనే సురక్షితంగా ఉంటాయి.

28 భాషల్లో మురళి

Daily Murli · Madhuban మూలం: మధుబన్ మురళి విభాగం ఇది స్వతంత్ర రీడర్ యాప్, అధికారిక వెబ్‌సైట్ కాదు.