| 26-02-2025 |
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
|
మధువనం |
| ‘‘మధురమైన పిల్లలూ - మీకు ఈ అపారమైన సంతోషము ఉండాలి - మేము ఇప్పుడు పాత వస్త్రాన్ని వదిలి ఇంటికి వెళ్తాము, ఆ తర్వాత కొత్త వస్త్రాన్ని కొత్త ప్రపంచములో ధరిస్తాము’’ | |
| ప్రశ్న:- | డ్రామా యొక్క ఏ రహస్యము అతి సూక్ష్మముగా అర్థం చేసుకోవలసినది? |
| జవాబు:- | ఈ డ్రామా పేను వలె నడుస్తూ ఉంటుంది, టిక్ టిక్ అవుతూ ఉంటుంది. ఎవరు ఏ పాత్రనైతే అభినయించారో, అది మళ్ళీ యథావిధిగా 5 వేల సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది, ఈ రహస్యము చాలా సూక్ష్మముగా అర్థం చేసుకోవలసినది. ఏ పిల్లలైతే ఈ రహస్యాన్ని యథార్థముగా అర్థం చేసుకోరో వారు - డ్రామాలో ఉంటే పురుషార్థము చేస్తాములే అని అంటారు, అటువంటివారు ఉన్నత పదవిని పొందలేరు. |
ఓంశాంతి. పిల్లలకు తండ్రి పరిచయము లభించింది, ఇప్పుడు మళ్ళీ తండ్రి నుండి వారసత్వము తీసుకోవాలి మరియు పావనముగా అవ్వాలి. ఓ పతితపావనా, వచ్చి మమ్మల్ని పావనముగా తయారుచేయండి అని అంటారు కూడా ఎందుకంటే తాము పతిత బుద్ధి కలవారిగా ఉన్నారని భావిస్తారు. ఇది పతిత ఇనుపయుగ ప్రపంచము అని బుద్ధి కూడా చెప్తుంది. కొత్త ప్రపంచాన్ని సతోప్రధానమని, పాత ప్రపంచాన్ని తమోప్రధానమని అంటారు. పిల్లలైన మీకు ఇప్పుడు తండ్రి లభించారు, భక్తులకు భగవంతుడు లభించారు, భక్తి తర్వాత భగవంతుడు వచ్చి భక్తి ఫలాన్ని ఇస్తారు అని అంటారు కూడా ఎందుకంటే కష్టపడతారు కావున ఫలాన్ని కూడా యాచిస్తారు. భక్తులు ఏం శ్రమిస్తారు అనేది మీకు తెలుసు. మీరు అర్ధకల్పము భక్తి మార్గములో ఎదురుదెబ్బలు తిని అలసిపోయారు. భక్తిలో చాలా శ్రమ చేసారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. లాభము కొరకు శ్రమించడం జరుగుతుంది. భగవంతుడు వచ్చి భక్తి ఫలాన్ని ఇవ్వాలి అని భావిస్తారు. కావున ఫలాన్ని ఇచ్చేవారు ఎంతైనా భగవంతుడే అయినట్లు. భక్తులు భగవంతుడిని స్మృతి చేస్తారు ఎందుకంటే భక్తిలో దుఃఖము ఉంది, అందుకే అంటారు - మీరు వచ్చి మా దుఃఖాన్ని హరించండి, పావనముగా తయారుచేయండి అని.
ఇప్పుడు ఇది రావణ రాజ్యము అన్నది ఎవ్వరికీ తెలియదు. రావణుడే పతితముగా తయారుచేసాడు. రామ రాజ్యము కావాలి అని అంటారు కూడా, కానీ అది ఎప్పుడు మరియు ఎలా రానున్నది - ఇది ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఇది రావణ రాజ్యము అని ఆత్మ లోలోపల అర్థం చేసుకుంటుంది. ఇది ఉన్నదే భక్తి మార్గము. భక్తులు ఎన్నో నాట్యాలవీ చేస్తూ ఉంటారు. వారికి సంతోషము కూడా కలుగుతుంది, మళ్ళీ ఏడుస్తారు కూడా. భగవంతుడి ప్రేమలో అశృవులు వస్తాయి కానీ భగవంతుని గురించి తెలియదు. ఎవరి ప్రేమలోనైతే అశృవులు వస్తాయో, వారిని తెలుసుకోవాలి కదా. చిత్రాల ద్వారానైతే ఏమీ లభించదు. అయితే, చాలా భక్తి చేసినట్లయితే సాక్షాత్కారము జరుగుతుంది, అంతే, ఆ సాక్షాత్కారమే వారికి సంతోషాన్ని కలిగించే విషయము. నేను ఎవరు - అని భగవంతుడు స్వయమే వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు. నేను ఎవరిని, ఎలా ఉన్నాను అనేది ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. మీలో కూడా ఎవరైతే బాబా అని అంటారో, వారిలో కూడా కొందరు పక్కాగా ఉన్నారు, కొందరు కచ్చాగా ఉన్నారు. దేహాభిమానము తెగిపోవడములోనే శ్రమ అనిపిస్తుంది. దేహీ-అభిమానులుగా అవ్వాల్సి ఉంటుంది. తండ్రి అంటారు, మీరు ఆత్మ, మీరు 84 జన్మలను అనుభవించి తమోప్రధానముగా అయ్యారు. ఇప్పుడు ఆత్మకు మూడవ నేత్రము లభించింది. ఆత్మ అర్థం చేసుకుంటోంది. పిల్లలైన మీకు మొత్తం సృష్టి చక్రపు జ్ఞానాన్ని తండ్రి ఇస్తారు. తండ్రి నాలెడ్జ్ ఫుల్ కావున పిల్లలకు కూడా జ్ఞానాన్ని ఇస్తారు. కేవలం మీరు మాత్రమే 84 జన్మలు తీసుకుంటారా? అని ఎవరైనా ప్రశ్నిస్తే మీరు ఇలా చెప్పండి - అవును, మాలో కొందరు 84 జన్మలు, కొందరు 82 జన్మలు తీసుకుంటారు. ఎక్కువలో ఎక్కువ 84 జన్మలే తీసుకుంటారు. ఎవరైతే ప్రారంభములో వస్తారో వారికి 84 జన్మలు ఉంటాయి. ఎవరైతే బాగా చదువుకుని ఉన్నత పదవిని పొందుతారో వారు త్వరగా వస్తారు. మాలలో సమీపముగా కూర్చబడతారు. ఏ విధముగా కొత్త ఇల్లు నిర్మించేటప్పుడు, ఇది త్వరగా తయారైపోతే మేము వెళ్ళి అందులో కూర్చోవచ్చు అని అనిపిస్తుందో, అలాగే పిల్లలైన మీకు కూడా సంతోషము కలగాలి - ఇప్పుడు మేము ఈ పాత వస్త్రాలను వదిలి కొత్తవి ధరించేది ఉంది. నాటకములో పాత్రధారులు, గంట-అరగంటకు ముందు నుండే గడియారాన్ని చూస్తూ ఉంటారు, టైమ్ అయిపోతే ఇక ఇంటికి వెళ్ళాలి అని. చివరికి ఆ టైమ్ వచ్చేస్తుంది. పిల్లలైన మీ విషయములో అనంతమైన గడియారము ఉంది. ఎప్పుడైతే కర్మాతీత అవస్థను చేరుకుంటామో అప్పుడు ఇక ఇక్కడ ఉండము అని మీకు తెలుసు. కర్మాతీతముగా అయ్యేందుకు కూడా స్మృతిలో ఉండవలసి ఉంటుంది, ఇందులో చాలా శ్రమ ఉంది. కొత్త ప్రపంచములోకి మీరు వెళ్తారు, మళ్ళీ ఒక్కొక్క జన్మ తీసుకునే కొలది కళలు తగ్గిపోతూ ఉంటాయి. కొత్త ఇంటిలో 6 నెలలు కూర్చుంటే ఏదో ఒక మరక పడుతుంది కదా. కొద్దిగా తేడా వచ్చేస్తుంది. అలా అక్కడ కొత్త ప్రపంచములో కూడా కొందరు ముందుగా వస్తారు, కొందరు కాస్త ఆలస్యముగా వస్తారు. మొదట ఎవరైతే వస్తారో వారిని సతోప్రధానులు అని అంటారు, ఆ తర్వాత మెల్లమెల్లగా కళలు తగ్గుతూ ఉంటాయి. ఈ డ్రామా చక్రము పేను వలె తిరుగుతూ ఉంటుంది. టిక్ టిక్ అని అంటూ ఉంటుంది. మొత్తము ప్రపంచమంతటిలోనూ ఎవరిది ఏ పాత్ర నడిచినా, అది ఒక చక్రములా తిరుగుతూ ఉంటుంది. ఇవి అర్థం చేసుకోవలసిన చాలా సూక్ష్మమైన విషయాలు. తండ్రి అనుభవముతో వినిపిస్తారు.
ఈ చదువు మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుందని మీకు తెలుసు. ఇది తయారై, తయారుచేయబడిన నాటకము. ఈ చక్రము గురించి ఎవ్వరికీ తెలియదు. దీని రచయిత, డైరెక్టర్ మరియు ముఖ్యమైన పాత్రధారులు ఎవరు - ఏమీ తెలియదు. మనము 84 జన్మలను అనుభవించి ఇప్పుడు ఇక తిరిగి వెళ్తాము అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. నేను ఆత్మను. దేహీ-అభిమానిగా అయితే అప్పుడు సంతోషము యొక్క పాదరసము పైకి ఎక్కుతుంది. అది హద్దులోని నాటకము, ఇది అనంతమైన నాటకము. బాబా ఆత్మలైన మనల్ని చదివిస్తున్నారు, అయితే ఈ సమయములో ఇది జరుగుతుంది అని వారు చెప్పరు. బాబాను ఏదైనా విషయము అడిగితే, వారు అంటారు - డ్రామాలో ఏదైతే తెలియజేసేది ఉందో అది తెలియజేస్తాను, డ్రామానుసారముగా ఏ సమాధానమైతే దొరికేది ఉందో అది దొరికింది, ఇక దానిపై నడుస్తూ ఉండాలి. డ్రామాలో లేకుండా తండ్రి ఏమీ చేయలేరు. చాలామంది పిల్లలు డ్రామాలో ఉంటే పురుషార్థము చేస్తాములే అని అంటారు, అటువంటివారు ఎప్పుడూ ఉన్నత పదవిని పొందలేరు. తండ్రి అంటారు, పురుషార్థము చేయవలసింది మీరు. డ్రామా కల్పపూర్వము వలె మీ చేత పురుషార్థము చేయిస్తుంది. కొందరు డ్రామాలో ఏది ఉంటే అది అని డ్రామా వద్ద ఆగిపోతారు, అప్పుడు వీరి భాగ్యములో లేదు అని భావించడం జరుగుతుంది. ఇప్పుడు మీకు స్మృతి కలిగింది - మనము ఆత్మ, మనము ఈ పాత్రను అభినయించడానికి వచ్చాము. ఆత్మ కూడా అవినాశీ, పాత్ర కూడా అవినాశీ. 84 జన్మల పాత్ర ఆత్మలో నిశ్చితమై ఉంది, మళ్ళీ అదే పాత్రను అభినయిస్తారు. దీనిని సృష్టి అద్భుతము అని అంటారు. సృష్టి అద్భుతము అనేదానిని ఇంకేమి విస్తారము చేస్తాము. ఇప్పుడు ముఖ్యమైన విషయము ఏమిటంటే - పావనముగా తప్పకుండా అవ్వాలి. ఇదే చింత ఉంది. కర్మలు చేస్తూ తండ్రి స్మృతిలో ఉండాలి. మీరు ఒక్క ప్రియునికి ప్రేయసులు కదా. ఒక్క ప్రియుడిని ప్రేయసులందరూ తలచుకుంటారు. ఆ ప్రియుడు అంటున్నారు - ఇప్పుడు నన్ను స్మృతి చేయండి. నేను మిమ్మల్ని పావనముగా చేయడానికి వచ్చాను, మీరు నన్నే పతిత-పావనా అని అంటారు, మరి నన్ను మర్చిపోయి గంగను పతిత-పావని అని ఎందుకు అంటారు? ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కావున వాటన్నింటినీ వదిలేశారు. తండ్రియే పతిత-పావనుడు అని మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు పతిత-పావనుడు అని భావిస్తూ ఎప్పుడూ తలచుకోరు. కానీ భగవంతుడు ఎలా వస్తారు - ఇది ఎవ్వరికీ తెలియదు. సత్యయుగములో ఉన్న శ్రీకృష్ణుని ఆత్మ అనేక రూపాలను ధారణ చేస్తూ-చేస్తూ ఇప్పుడు తమోప్రధానముగా అయ్యింది, మళ్ళీ సతోప్రధానముగా అవుతుంది. శాస్త్రాలలో ఈ పొరపాటు చేసారు. ఈ పొరపాటు జరిగితేనే కదా నేను వచ్చి పొరపాటు చేయనివారిగా తయారుచేస్తాను. ఈ పొరపాట్లు కూడా డ్రామాలో ఉన్నాయి, ఇవి మళ్ళీ జరుగుతాయి. ఇది శివ భగవానువాచ అని ఇప్పుడు మీకు అర్థం చేయించడం జరిగింది. భగవంతుడు అని కూడా శివుడినే అంటారు. భగవంతుడు అయితే ఒక్కరే. భక్తులందరికీ ఫలాన్ని ఇచ్చేవారు ఒక్క భగవంతుడే. వారిని ఎవ్వరూ తెలుసుకోలేరు. ఓ గాడ్ ఫాదర్ అని ఆత్మ అంటుంది. ఆ లౌకిక తండ్రి అయితే ఇక్కడే ఉంటారు, అయినా కూడా ఆ తండ్రిని తలచుకుంటారు, కావున ఆత్మకు ఇద్దరు తండ్రులు ఉన్నట్లు. భక్తి మార్గములో ఆ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. ఆత్మ అయితే ఉండనే ఉంటుంది. ఇంతమంది ఆత్మలందరికీ తమ-తమ పాత్రలు లభించి ఉన్నాయి. ఒక శరీరాన్ని వదిలి మళ్ళీ ఇంకొక శరీరాన్ని ధరించి పాత్రను అభినయించవలసి ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ తండ్రియే అర్థం చేయిస్తారు. నేను ఇక్కడ పాత్రను అభినయించడానికి వచ్చాను అని అంటారు కూడా. ఇది ఒక రంగస్థలము. ఇక్కడ ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మొదలైనవన్నీ లైట్లు వంటివి. మనుష్యులు ఈ సూర్య, చంద్ర, నక్షత్రాలను దేవతలు అని అంటారు ఎందుకంటే ఇవి చాలా మంచి పని చేస్తాయి, మెరుస్తూ ఉంటాయి, ఎవరికీ కష్టాన్ని ఇవ్వవు, అందరికీ సుఖాన్ని ఇస్తాయి. చాలా పని చేస్తాయి, అందుకే వీటిని దేవతలు అని అంటారు. మంచి పనులు చేసేవారిని - వీరు దేవత వలె ఉన్నారు అని అంటారు కదా. ఇప్పుడు వాస్తవానికి దేవతలు సత్యయుగములో ఉండేవారు. వారందరూ సుఖాన్ని ఇచ్చేవారు, వారందరికీ ప్రీతి ఉండేది, అందుకే దేవతలతో పోల్చడం జరుగుతుంది. దేవతల గుణాలను కూడా మహిమ చేస్తూ ఉంటారు. వారి ఎదురుగా వెళ్ళి - నిర్గుణులైన మాలో ఏ గుణము లేదు, మీరే మాపై దయ చూపించండి... అని పాడుతారు. మీకైతే దయ కలుగుతూ ఉండవచ్చు. తండ్రి అంటారు, దయ కలిగింది, అందుకే మళ్ళీ వచ్చాను, మిమ్మల్ని గుణవంతులుగా చేయడానికి. మీరు పూజ్యులుగా ఉండేవారు, ఇప్పుడు పూజారులుగా అయ్యారు, మళ్ళీ పూజ్యులుగా అవ్వండి. హం సో యొక్క అర్థాన్ని కూడా మీకు అర్థం చేయించారు. మనుష్యులైతే ఆత్మయే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ అని అనేస్తారు. తండ్రి అంటారు, ఇది తప్పు. ఆత్మ అయిన మీరు నిరాకారిగా ఉండేవారు, ఆ తర్వాత మీరే దేవతలుగా, క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణ వర్ణములోకి వచ్చారు. ఆత్మ మొదట సతోప్రధానముగా, ఆ తర్వాత సతోలోకి, రజోలోకి, తమోలోకి వస్తుంది. ఈ జ్ఞానాన్ని బాబా కల్ప-కల్పము సంగమయుగములో వచ్చి మనకు ఇస్తారు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. తప్పకుండా భారత్ స్వర్గముగా ఉండేది, అక్కడ ఎంత తక్కువమంది మనుష్యులు ఉంటారు. ఇప్పుడు ఇది కలియుగము. అన్ని ధర్మాలు వచ్చేసాయి. సత్యయుగములో ఇతర ధర్మాలేవీ ఉండేవి కావు. అక్కడ ఒకే ధర్మము ఉంటుంది. మిగిలిన ఆత్మలన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ పాత ప్రపంచ వినాశనము ఎదురుగా నిలబడి ఉందని మీకు తెలుసు. తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఎవరైనా వస్తే ఇది అనంతమైన గడియారము అని చెప్పండి. తండ్రి దివ్యదృష్టిని ఇచ్చి ఈ గడియారాన్ని తయారుచేయించారు. ఏ విధంగా ఆ గడియారాన్ని మీరు ఘడియ-ఘడియ చూస్తూ ఉంటారో, అలా ఇప్పుడు ఈ అనంతమైన గడియారము గుర్తుకొస్తూ ఉంటుంది. తండ్రి బ్రహ్మా ద్వారా ఏక ధర్మ స్థాపనను, శంకరుని ద్వారా ఆసురీ ప్రపంచ వినాశనాన్ని చేయిస్తారు. చక్రము తప్పకుండా తిరిగేది ఉంటుందని బుద్ధి కూడా చెప్తుంది. కలియుగము తర్వాత సత్యయుగము వస్తుంది. ఇప్పుడు మనుష్యులు కూడా ఎక్కువగా ఉన్నారు, అలాగే వైపరీత్యాలు కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి. మిసైల్స్ కూడా అవే. శాస్త్రాలలోనైతే ఎన్ని కథలు తయారుచేసేసారు. తండ్రి వచ్చి వేద-శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారు. ముఖ్యమైన ధర్మాలు కూడా నాలుగు. ఈ బ్రాహ్మణ ధర్మము ఐదవది. ఇది అన్నింటికన్నా ఉన్నతమైనది, ఇది చిన్న ధర్మము. యజ్ఞాన్ని సంభాళించేవారు బ్రాహ్మణులు. ఇది జ్ఞాన యజ్ఞము. వైపరీత్యాలను తొలగించేందుకు యజ్ఞాలు రచిస్తారు, ఈ యుద్ధాలు మొదలైనవి జరగకూడదు అని వారు భావిస్తారు. అరే, యుద్ధము జరగకపోతే సత్యయుగము ఎలా వస్తుంది, ఇంతమంది మనుష్యులంతా ఎక్కడికి వెళ్తారు! నేను ఆత్మలందరినీ తీసుకువెళ్తాను అంటే తప్పకుండా శరీరాలను ఇక్కడ వదలాల్సి ఉంటుంది. ఓ బాబా, వచ్చి మమ్మల్ని పతితము నుండి పావనముగా తయారుచేయండి అని మీరు పిలుస్తారు కూడా.
తండ్రి అంటారు, నేను తప్పకుండా పాత ప్రపంచాన్ని వినాశనము చేయించవలసి ఉంటుంది. పావన ప్రపంచము సత్యయుగము. అందరినీ ముక్తిధామానికి తీసుకువెళ్తాను. అందరూ కాలుడినైతే పిలుస్తారు కదా. మేము కాలుడికే కాలుడిని పిలుస్తున్నాము అని అర్థం చేసుకోరు. తండ్రి అంటారు, ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఆత్మలను ఛీ-ఛీ ప్రపంచము నుండి బయటకు తీసి శాంతిధామానికి తీసుకువెళ్తాను. ఇది మంచి విషయమే కదా. మీరు ముక్తిలోకి వెళ్ళి, మళ్ళీ జీవన్ముక్తిలోకి రావాలి, ఆ తర్వాత జీవనబంధనములోకి రావాల్సి ఉంటుంది. ఇంతమందైతే సత్యయుగములోకి రారు, ఆ తర్వాత నంబరువారుగా వస్తారు, అందుకే ఇప్పుడు శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి. అంతిమములో ఎవరైతే వస్తారో, వారిదైతే పాత్రే చాలా తక్కువగా ఉంటుంది. మొదట వారు కూడా తప్పకుండా సుఖాన్ని పొందుతారు. మీ పాత్ర అందరికంటే ఉన్నతమైనది. మీరు చాలా సుఖాన్ని పొందుతారు. ధర్మ స్థాపకులైతే కేవలం ధర్మాన్నే స్థాపన చేస్తారు, వారు ఎవ్వరికీ ముక్తిని ఇవ్వరు. తండ్రి అయితే భారత్ లోకి వచ్చి అందరికీ జ్ఞానాన్ని ఇస్తారు. వారే అందరి పతిత-పావనుడు, అందరినీ విముక్తులుగా చేస్తారు. ఇతర ధర్మ స్థాపకులెవ్వరూ సద్గతిని ఇవ్వడానికి రారు, వారు ధర్మాన్ని స్థాపన చేయడానికే వస్తారు. వారు శాంతిధామములోకి కానీ, సుఖధామములోకి కానీ తీసుకువెళ్ళరు. అందరినీ శాంతిధామానికి, సుఖధామానికి తండ్రియే తీసుకువెళ్తారు. ఎవరైతే దుఃఖము నుండి విడిపించి సుఖాన్ని ఇస్తారో, వారివే తీర్థ స్థానాలు ఉంటాయి. వాస్తవానికి సత్యమైన తీర్థ స్థానమైతే ఒక్క బాబాదే అని మనుష్యులు అర్థం చేసుకోరు. మహిమ కూడా ఒక్కరిదే. అందరూ వారిని - ఓ ముక్తిప్రదాతా రండి అని పిలుస్తారు. భారత్ యే సత్యమైన తీర్థ స్థానము, ఇక్కడికి తండ్రి వచ్చి అందరికీ ముక్తి-జీవన్ముక్తులను ఇస్తారు. కావున మీరు మళ్ళీ భక్తి మార్గములో వారికి పెద్ద-పెద్ద మందిరాలను తయారుచేస్తారు. వజ్ర-వైఢూర్యాలతో పొదగబడిన మందిరాలను తయారుచేస్తారు. సోమనాథుని మందిరాన్ని ఎంత సుందరముగా తయారుచేసారు, కానీ ఇప్పుడు చూడండి బాబా ఎక్కడ కూర్చున్నారు - పతిత శరీరములో, పతిత ప్రపంచములో. మీరే వారిని గుర్తిస్తారు. మీరు బాబాకు సహాయకులుగా అవుతారు. ఇతరులకు దారి చూపించడములో ఎవరైతే సహాయము చేస్తారో, వారికి ఉన్నత పదవి లభిస్తుంది. ఇది ఒక నియమము. తండ్రి అంటారు, కృషి చేయండి. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయమని అనేకులకు దారి చూపించండి. 84 జన్మల చక్రమైతే ఎదురుగా ఉంది, ఇది అంధుల ముందు అద్దము వంటిది. ఈ డ్రామా యథావిధిగా రిపీట్ అవుతుంది, మళ్ళీ నా గురించి ఎవ్వరూ తెలుసుకోరు. నా మందిరాన్ని దోచుకుంటే, నేను ఏదైనా చేస్తాను అని కాదు. డ్రామాలో దోచుకోవాలి అని ఉంది, మళ్ళీ దోచుకుంటారు. నన్ను పతితము నుండి పావనముగా తయారుచేయండి అనే పిలుస్తారు కావున నేను వచ్చి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తాను. డ్రామాలో వినాశనము కూడా నిశ్చితమై ఉంది, అది మళ్ళీ జరుగుతుంది. నేనేమీ ఊది వినాశనాన్ని సృష్టించను. ఈ మిసైల్స్ మొదలైనవి తయారయ్యాయి - ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. నేను కూడా డ్రామా బంధనములో బంధింపబడి ఉన్నాను. నా పాత్ర అందరికన్నా గొప్పది - సృష్టిని పరివర్తన చేయడము, పతితము నుండి పావనముగా తయారుచేయడము. మరి ఇప్పుడు సమర్థమైనది ఎవరు? నేనా లేక డ్రామానా? రావణుడు కూడా డ్రామానుసారముగా వచ్చేదే ఉంది. ఏ జ్ఞానమైతే నాలో ఉందో దానిని నేను వచ్చి ఇస్తాను. మీరు శివబాబా సైన్యము. రావణుడిపై విజయము పొందుతారు. తండ్రి అంటారు, సెంటర్లు తెరుస్తూ ఉండండి. నేను చదివించడానికి వస్తాను. నేను ఏమీ తీసుకోను. ధనమేదైతే ఉందో దానిని ఇక్కడ సఫలం చేసుకోండి. అలాగని అంతా సమాప్తము చేసేసి ఆకలితో చనిపోమని కాదు. ఎవ్వరూ ఆకలితో చనిపోరు. బాబా సర్వస్వాన్ని ఇచ్చారు, మరి ఆకలితో చనిపోతారా? మీరు ఆకలితో చనిపోతారా? ఇది శివబాబా భండారము. ఈ రోజుల్లో ప్రపంచములో ఎంతమంది మనుష్యులు ఆకలితో చనిపోతూ ఉంటారో చూడండి. ఇప్పుడు పిల్లలైన మీరైతే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థము చేయాలి. ఇది ఆత్మిక ప్రకృతి వైద్యము. ఇది చాలా సహజమైన విషయము, కేవలం నోటితో మన్మనాభవ అని చెప్తారు. ఆత్మను నయం చేస్తారు, అందుకే తండ్రిని అవినాశీ సర్జన్ అని కూడా అంటారు. ఎంత చక్కటి ఆపరేషన్ ను నేర్పిస్తారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి. చక్రవర్తి రాజులుగా అయిపోతారు. ఈ ముళ్ళ ప్రపంచములో ఉంటూ ఎలా భావించండి అంటే - మేము పుష్పాలతోటలోకి వెళ్తున్నాము, ఇంటికి వెళ్తున్నాము. ఒకరికొకరు గుర్తు చేసుకుంటూ ఉండండి. అల్లాను స్మృతి చేసినట్లయితే రాజ్యాధికార వారసత్వము లభిస్తుంది. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఉన్నత పదవిని పొందేందుకు తండ్రికి పూర్తి-పూర్తి సహాయకులుగా అవ్వాలి. అంధులకు దారి చూపించాలి. అనంతమైన గడియారాన్ని సదా గుర్తుంచుకోవాలి.
2. యజ్ఞాన్ని సంభాళించేందుకు సత్యాతి-సత్యమైన బ్రాహ్మణులుగా అవ్వాలి. మీ వద్ద ధనము మొదలైనవి ఏవైతే ఉన్నాయో, వాటిని సఫలము చేసుకుని తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి.
| వరదానము:- |
మన్మనాభవ యొక్క విధి ద్వారా బంధనాల బీజాన్ని సమాప్తము చేసే నష్టోమోహా స్మృతి స్వరూప భవ బంధనాలకు బీజము సంబంధము. తండ్రితో సర్వ సంబంధాలను జోడించినప్పుడు మరి ఇంకెవరిపైనైనా మోహము ఎలా ఉండగలదు. సంబంధము లేకుండా మోహము ఉండదు మరియు మోహము లేకపోతే బంధనము ఉండదు. బీజమునే సమాప్తము చేసినప్పుడు ఇక బీజము లేకుండా వృక్షము ఎలా జన్మించగలదు. ఒకవేళ ఇప్పటివరకు బంధనము ఉన్నట్లయితే - కొంత తెంచారు, కొంత జోడించారు అని ఋజువు అవుతుంది, అందుకే మన్మనాభవ అనే విధి ద్వారా మనసు యొక్క బంధనాల నుండి కూడా ముక్తులుగా, నష్టోమోహా స్మృతి స్వరూపులుగా అవ్వండి, అప్పుడు - ఏం చేయాలి, బంధనము ఉంది, అది తెగిపోవడం లేదు అనే ఈ ఫిర్యాదులన్నీ సమాప్తమైపోతాయి. |
| స్లోగన్:- | బ్రాహ్మణ జీవితపు శ్వాస ఉల్లాస-ఉత్సాహాలు, అందుకే ఎటువంటి పరిస్థితిలోనూ ఉల్లాస-ఉత్సాహాల ప్రెషర్ తగ్గకూడదు. |
అవ్యక్త సూచనలు:- ఏకాంతప్రియులుగా అవ్వండి, ఏకతను మరియు ఏకాగ్రతను అలవరచుకోండి
ఎంతగా సేవల అలజడిలోకి వస్తారో, అంతగానే పూర్తిగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోండి. ఏదైనా కొత్త ఆవిష్కరణను మరియు శక్తిశాలి ఆవిష్కరణను అండర్ గ్రౌండ్ లోనే చేస్తారు, కనుక ఏకాంతవాసిగా అవ్వటమే అండర్ గ్రౌండ్. ఎంత సమయము లభించినా సరే, ఒకేసారి గంట, అరగంట లభించదు కానీ మధ్యలో 5 నిమిషాలు లభించినా సరే సాగరము లోతుల్లోకి వెళ్ళిపోండి. దీని ద్వారా సంకల్పాలకు బ్రేక్ పడగలదు, అప్పుడు వాణిలోకి రావాలనుకున్నా కానీ రాలేకపోతారు.