తెలుగు మురళి · Brahma Kumaris

ఈరోజు మురళి · 18 నవంబర్, 2026

ఓం శాంతి · BapDada · 18 నవంబర్, 2026

ఈరోజు మురళి — ప్రతి ఉదయం కొత్తది.

18
డౌన్‌లోడ్ PDF
0:00--:--

పాఠ్యాన్ని ఎంచుకోండి → హైలైట్ / బాక్స్ / అండర్‌లైన్

18-11-2026
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
మధువనం

‘‘మధురమైన పిల్లలూ - మీరు మనసా-వాచా-కర్మణా ఏక్యురేట్ గా తయారవ్వాలి, ఎందుకంటే మీరు దేవతల కంటే ఉన్నతమైన బ్రాహ్మణులు, పిలక వంటి వారు’’
ప్రశ్న:- పిల్లలు కూడా కష్టం మీద అర్థం చేసుకోగలిగే అన్నింటికంటే గుప్తమైన మరియు సూక్ష్మమైన విషయమేమిటి?
జవాబు:- శివబాబాకు మరియు బ్రహ్మాబాబాకు మధ్యన ఉన్న భేదాన్ని అర్థం చేసుకోవడమనేది అన్నింటికంటే గుప్తమైన మరియు సూక్ష్మమైన విషయము. ఇందులో కొంతమంది పిల్లలు తికమకపడతారు. ఈ రహస్యాన్ని స్వయంగా తండ్రి ఏమని అర్థం చేయిస్తున్నారంటే - నేను ఉదయముదయమే ఈ తనువు ద్వారా పిల్లలైన మిమ్మల్ని చదివిస్తాను, అంతేకానీ నేను రోజంతా ఇతని పై స్వారీ చేస్తానని కాదు.

ఓంశాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలు అంటే ఎవరు? బ్రాహ్మణులు. మేము బ్రాహ్మణులము, దేవతలుగా తయారవ్వబోతున్నాము అని ఎప్పుడూ మర్చిపోకండి. వర్ణాలను కూడా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు పరస్పరములో అంతా బ్రాహ్మణులే. బ్రాహ్మణులను అనంతమైన తండ్రి చదివిస్తున్నారు. ఈ బ్రహ్మా చదివించడము లేదు. శివబాబా చదివిస్తున్నారు. బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులనే చదివిస్తారు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా అవ్వలేరు. వారసత్వమైతే శివబాబా నుండి లభిస్తుంది. శివబాబా అయితే అందరికీ తండ్రి. ఈ బ్రహ్మాను గ్రాండ్ ఫాదర్ అని అంటారు. లౌకిక తండ్రి అయితే అందరికీ ఉంటారు. పారలౌకిక తండ్రిని భక్తి మార్గములో స్మృతి చేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు - బ్రహ్మా యొక్క మందిరము ఉన్నప్పటికీ, వీరు అలౌకిక తండ్రి అని వీరి గురించి ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ కూడా ఆది దేవ్ అయిన ప్రజాపిత యొక్క మందిరముంది. వారిని మహావీర్ అని కూడా అంటారు, కొందరు దిల్ వాలా (మనసున్నవారు) అని కూడా అంటారు. కానీ వాస్తవానికి మనసును దోచుకునేవారు శివబాబా, అంతేకానీ బ్రహ్మా కాదు. ఆత్మలందరికీ సదా సుఖాన్ని ఇచ్చేవారు, సంతోషాన్ని ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇది కూడా కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ప్రపంచములోనైతే మనుష్యులకు ఏమీ తెలియదు. బ్రాహ్మణులైన మనమే శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. మీరు కూడా పదే-పదే మర్చిపోతారు. స్మృతి చాలా సహజమైనది. ‘యోగము’ అనే పదాన్ని సన్యాసులు ఉపయోగిస్తారు. మీరైతే బాబాను స్మృతి చేస్తారు. యోగము అనేది కామన్ పదము. దీనిని యోగాశ్రమము అని కూడా అనరు. పిల్లలు మరియు తండ్రి కూర్చుని ఉన్నారు. అనంతమైన తండ్రిని స్మృతి చేయడం పిల్లల కర్తవ్యము. మనం బ్రాహ్మణులము, తాతగారి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము, బ్రహ్మా ద్వారా. అందుకే శివబాబా అంటారు - ఎంత వీలైతే అంత స్మృతి చేస్తూ ఉండండి. చిత్రాలను కూడా గుర్తు పెట్టుకోండి. మనం బ్రాహ్మణులము, తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము అనైతే గుర్తుంటుంది. బ్రాహ్మణులు ఎప్పుడైనా తమ జాతిని మర్చిపోతారా ఏమిటి? మీరు శూద్రుల సాంగత్యములోకి రావడముతో బ్రాహ్మణత్వాన్ని మర్చిపోతారు. బ్రాహ్మణులైతే దేవతల కంటే ఉన్నతమైనవారు, ఎందుకంటే బ్రాహ్మణులైన మీరు నాలెడ్జ్ ఫుల్. భగవంతుడిని జానీజానన్ హార్ (అన్నీ తెలిసినవారు) అని అంటారు కదా. దీని అర్థం వారు అందరి మనసులలో ఏముందో కూర్చుని చూస్తారని కాదు. అలా కాదు. వారికి సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానముంది. వారు బీజరూపుడు. బీజానికి వృక్షము యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలుసు. కనుక అటువంటి తండ్రిని చాలా-చాలా స్మృతి చేయాలి. ఇతని ఆత్మ కూడా ఆ తండ్రిని స్మృతి చేస్తుంది. ఆ తండ్రి అంటారు - వీరు (బ్రహ్మా) కూడా నన్ను స్మృతి చేసినప్పుడే ఈ పదవిని పొందుతారు. మీరు కూడా స్మృతి చేస్తే పదవిని పొందుతారు. మొట్టమొదట మీరు శరీరము లేకుండా (అశరీరిగా) వచ్చారు. మళ్ళీ అశరీరిగా అయి తిరిగి వెళ్ళాలి. ఇతర దేహ సంబంధీకులందరూ మీకు దుఃఖాన్ని ఇచ్చేవారే, నేను మీకు లభించినప్పుడు మీరు వారినెందుకు స్మృతి చేస్తున్నారు! నేను మిమ్మల్ని కొత్త ప్రపంచములోకి తీసుకువెళ్ళేందుకు వచ్చాను. అక్కడ ఎటువంటి దుఃఖము ఉండదు. అది దైవీ సంబంధము. ఇక్కడ స్త్రీ-పురుషుల సంబంధములో మొదట దుఃఖము ఉంటుంది, ఎందుకంటే వికారులుగా అవుతారు. మిమ్మల్ని నేను ఇప్పుడు ఎటువంటి ప్రపంచానికి యోగ్యులుగా తయారుచేస్తానంటే అక్కడ వికారాల విషయమే ఉండదు. కామము మహాశత్రువు అని అంటూ ఉంటారు, అది ఆదిమధ్యాంతాలు దుఃఖమిస్తుంది. క్రోధము గురించి - అది ఆదిమధ్యాంతాలు దుఃఖమిస్తుంది అని అనరు. అలా అనరు. కామాన్ని జయించాలి, అదే ఆదిమధ్యాంతాలు దుఃఖమిస్తుంది, పతితులుగా తయారుచేస్తుంది. పతితులు అనే పదం వికారులకు వర్తిస్తుంది. ఈ శత్రువుపై విజయము పొందాలి. మనం సత్యయుగ దేవీ-దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు. ఈ నిశ్చయము ఏర్పడనంత వరకు ఏమీ పొందలేరు.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలు మనసా-వాచా-కర్మణా ఏక్యురేట్ గా తయారవ్వాలి. దీని కోసం కృషి చేయాలి. మీరు భారత్ ను స్వర్గముగా తయారుచేస్తున్నారని ప్రపంచములోని వారికెవ్వరికీ తెలియదు. మున్ముందు అర్థం చేసుకుంటారు. ఒకే ప్రపంచము, ఒకే రాజ్యము, ఒకే ధర్మము, ఒకే భాష ఉండాలని కోరుకుంటారు కూడా. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం ఒకే రాజ్యము, ఒకే ధర్మముండేది, దానినే స్వర్గమని అంటారని మీరు అర్థం చేయించవచ్చు. రామ రాజ్యము, రావణ రాజ్యము గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. ఇంతకుముందు మీకు కూడా తెలియదు. ఇప్పుడు మీరు స్వచ్ఛ బుద్ధి కలవారిగా అయ్యారు, నంబరువారు పురుషార్థమనుసారముగా. తండ్రి కూర్చుని మీకు అర్థం చేయిస్తున్నారు కనుక తప్పకుండా తండ్రి మతముపై నడవండి. తండ్రి అంటారు - పాత ప్రపంచములో ఉంటూ కమలపుష్ప సమానముగా పవిత్రముగా ఉండండి. నన్ను స్మృతి కూడా చేస్తూ ఉండండి. తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. ఈ కర్మేంద్రియాల ద్వారా ఆత్మలను చదివించేందుకే వచ్చాను. ఇదైతే పాత ఛీ-ఛీ ప్రపంచము, ఛీ-ఛీ శరీరము. బ్రాహ్మణులైన మీరు పూజకు యోగ్యులు కాదు, గాయన యోగ్యులు. పూజకు యోగ్యులు దేవతలు. మీరు శ్రీమతముపై విశ్వాన్ని స్వర్గముగా తయారుచేస్తారు, అందుకే మీకు గాయనముంది, పూజ జరగదు. గాయనము తప్పకుండా బ్రాహ్మణులైన మీకు మాత్రమే ఉంటుంది, దేవతలకు కాదు. తండ్రి మిమ్మల్నే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారుచేస్తారు. దేవతల యొక్క ఆత్మ మరియు శరీరము, రెండు పవిత్రముగా ఉంటాయి. ఇప్పుడు మీ ఆత్మ పవిత్రముగా అవుతూ ఉంటుంది. శరీరము పవిత్రముగా లేదు. ఇప్పుడు మీరు ఈశ్వరుని మతముపై భారత్ ను స్వర్గముగా తయారుచేస్తున్నారు. మీరు కూడా స్వర్గానికి యోగ్యులుగా తయారవుతున్నారు. సతోప్రధానముగా తప్పకుండా అవ్వాలి. కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే తండ్రి కూర్చుని చదివిస్తున్నారు. బ్రాహ్మణుల వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. ఏ బ్రాహ్మణులైతే పక్కాగా అవుతారో, వారే వెళ్ళి దేవతలుగా అవుతారు. ఇది కొత్త వృక్షము, మాయా తుఫానులు కూడా వస్తాయి. సత్యయుగములో ఏ తుఫానులు రావు. ఇక్కడ మాయ తండ్రి స్మృతిలో ఉండనివ్వదు. తండ్రి స్మృతి ద్వారానే తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయ్యామని మనకు తెలుసు. అంతా స్మృతిపైనే ఆధారపడి ఉంటుంది. భారత్ యొక్క ప్రాచీన యోగము కూడా ప్రసిద్ధమైనది కదా. విదేశీయులు కూడా - ఎవరైనా వచ్చి ప్రాచీన యోగాన్ని నేర్పించాలని భావిస్తారు.

ఇప్పుడు యోగం రెండు రకాలుగా ఉంటుంది - ఒకటి హఠయోగులకు సంబంధించింది, రెండవది రాజయోగులకు సంబంధించింది. మీరు రాజయోగులు. హఠయోగము అనేది చాలా రోజుల నుండి కొనసాగుతూ ఉంది. రాజయోగము గురించి ఇప్పుడు మీకు తెలిసింది. సన్యాసులకు రాజయోగము గురించి ఏం తెలుసు. రాజయోగాన్ని నేనే వచ్చి నేర్పిస్తాను, శ్రీకృష్ణుడు నేర్పించలేరని తండ్రి వచ్చి తెలియజేశారు. ఇది కేవలం భారత్ కు సంబంధించిన ప్రాచీన యోగమే, కానీ గీతలో నా పేరుకు బదులుగా శ్రీకృష్ణుని పేరును వేసేసారు. ఎంత తేడా వచ్చేసింది. శివజయంతి జరిగినప్పుడు, మీ వైకుంఠ జయంతి కూడా జరుగుతుంది, అందులో శ్రీకృష్ణుని రాజ్యముంటుంది. మీకు తెలుసు, శివబాబా జయంతి అంటే గీతా జయంతి కూడా, వైకుంఠ జయంతి కూడా జరుగుతూ ఉంది. మీరు పవిత్రముగా అయిపోతారు. కల్పక్రితం వలె స్థాపన జరుగుతూ ఉంది. కనుక శివబాబా జయంతి అనగా స్వర్గ జయంతి. బాబాయే వచ్చి స్వర్గ స్థాపనను చేస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు - నన్ను స్మృతి చేయండి. స్మృతి చేయకపోతే మాయ ఏదో ఒక వికర్మ చేయిస్తూ ఉంటుంది. స్మృతి చేయకపోతే చెంపదెబ్బ తగులుతుంది. స్మృతిలో ఉంటే చెంపదెబ్బ తగలదు. ఈ బాక్సింగ్ జరుగుతూ ఉంది. మనకు మనుష్యులెవరూ శత్రువులు కారని, రావణుడు శత్రువని మీకు తెలుసు. వివాహమైన తర్వాత కుమార-కుమారీలు కూడా పతితులుగా అవ్వడం వలన పరస్పరము ఒకరికొకరు శత్రువులుగా అయిపోతారు. వివాహములో లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. తండ్రి అంటారు - వివాహము సర్వనాశనము. ఇప్పుడు పారలౌకిక తండ్రి ఆర్డినెన్స్ (చట్టాన్ని) జారీ చేసారు - పిల్లలూ, ఈ కామము మహాశత్రువు, దీనిపై విజయము పొందండి మరియు పవిత్రత యొక్క ప్రతిజ్ఞను చేయండి. ఎవ్వరూ పతితులుగా అవ్వకూడదు. జన్మజన్మలుగా ఈ వికారాల కారణముగా మీరు పతితులుగా అయ్యారు, అందుకే కామము మహాశత్రువని అంటారు. మీరు 84 జన్మలు ఎలా తీసుకున్నారు అనేది తండ్రి అయితే చాలా బాగా అర్థం చేయిస్తారు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. మీకైతే చాలా శుద్ధ అహంకారముండాలి. ఆత్మలమైన మనం తండ్రి మతముపై నడుస్తూ భారత్ ను స్వర్గముగా తయారుచేస్తున్నాము. మనమే మళ్ళీ స్వర్గములో రాజ్యము చేస్తాము. ఎంత శ్రమ చేస్తే అంతటి పదవిని పొందుతారు. రాజు-రాణులుగానైనా అవ్వండి లేక ప్రజలుగానైనా అవ్వండి. రాజు-రాణులుగా ఎలా అవుతారు అనేది కూడా మీరు చూస్తున్నారు. ఫాలో ఫాదర్ అని అంటూ ఉంటారు. అది ఇప్పటి విషయమే. లౌకిక సంబంధాల విషయములో ఇలా అనరు. ఈ తండ్రి మతాన్ని ఇస్తున్నారు - నన్నొక్కరినే స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. మనం మంచి మతముపై నడుస్తూ అనేకుల సేవ చేస్తామని మీరు భావిస్తారు. పిల్లలు తండ్రి వద్దకు వచ్చినప్పుడు శివబాబా కూడా రిఫ్రెష్ చేస్తారు, అలాగే బ్రహ్మాబాబా కూడా రిఫ్రెష్ చేస్తారు. వీరు కూడా నేర్చుకుంటారు కదా. శివబాబా ఏమంటారంటే - నేను ఉదయాన్నే వస్తాను, ఆ తర్వాత ఎవరైనా కలుసుకునేందుకు వస్తే, ఈ బ్రహ్మా అర్థం చేయించలేరా ఏమిటి. అలా కాకుండా - బాబా, మీరే వచ్చి అర్థం చేయించండి, నేను అర్థం చేయించను అని బ్రహ్మా అంటారా ఏమిటి? ఇవి చాలా గుప్తమైన, గుహ్యమైన విషయాలు కదా. నేనైతే అందరికంటే బాగా అర్థం చేయించగలను. శివబాబా మాత్రమే అర్థం చేయిస్తారని, ఇతను అర్థం చేయించలేరేమోనని మీరెందుకు భావిస్తారు. కల్పక్రితం కూడా ఇతను అర్థం చేయించారు కనుకనే ఈ పదవిని పొందారని కూడా మీకు తెలుసు. మమ్మా కూడా అర్థం చేయించేవారు కదా. ఆమె కూడా ఉన్నత పదవిని పొందుతారు. అక్కడ బాబాను సూక్ష్మవతనములో చూస్తారు, పిల్లలు వారిని ఫాలో చేయాలి. పేదవారే సరెండర్ అవుతారు, షావుకారులు సరెండర్ అవ్వలేరు. బాబా, ఇదంతా మీదేనని పేదవారే చెప్తారు. శివబాబా అయితే దాత. వారు ఎప్పుడూ తీసుకోరు. ఇదంతా మీదేనని పిల్లలకు చెప్తారు. నా కోసం ఇక్కడ కాని, అక్కడ కాని మహళ్ళు తయారుచేసుకోను. మిమ్మల్నే స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తాను. ఇప్పుడు ఈ జ్ఞాన రత్నాలతో జోలిని నింపుకోవాలి. మందిరములోకి వెళ్ళి జోలిని నింపండి అని అడుగుతారు. కానీ ఏ విధముగా, ఏ వస్తువులతో జోలిని నింపాలి? ఇప్పుడు జోలిని నింపేవారైతే లక్ష్మి, ఆమె ధనమిస్తారు. ధనం కోసం శివుని వద్దకైతే వెళ్ళరు. శ్రీకృష్ణుడు గీతను వినిపించారని వారి గురించి అంటారు. కానీ శ్రీకృష్ణుడిని జోలిని నింపమని అడగరు. శంకరుని వద్దకు వెళ్ళి అడుగుతారు. శివుడు మరియు శంకరుడు ఒక్కరేనని భావిస్తారు. శంకరుడైతే జోలిని ఖాళీ చేసేవారు. మన జోలిని ఎవ్వరూ ఖాళీ చేయలేరు. వినాశనమైతే జరిగేదే ఉంది. రుద్ర జ్ఞాన యజ్ఞము నుండి వినాశ జ్వాల ప్రజ్వలితమైందని అంటూ ఉంటారు. కానీ దానిని ఎవ్వరూ అర్థం చేసుకోరు.

పిల్లలైన మీరు గృహస్థ వ్యవహారములో కూడా ఉండాలి, వ్యాపారము కూడా చేయాలి. బాబా ప్రతి ఒక్కరి నాడిని చూసి సలహానిస్తారు, ఎందుకంటే బాబా ఏమనుకుంటారంటే - నేను చెప్పింది వీరు చేయలేరు అన్నప్పుడు ఇక అటువంటి సలహాను అసలు ఇవ్వడమెందుకు. నాడిని చూసే సలహాను ఇస్తారు. ఇతని వద్దకు రావాల్సి ఉంటుంది. ఇతను పూర్తి సలహాను ఇస్తారు. బాబా, ఈ పరిస్థితిలో మేము ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి అని అందరూ బాబాను అడగాలి. తండ్రి స్వర్గములోకి అయితే తీసుకువెళ్తారు. మనం స్వర్గవాసులుగా అవ్వబోతున్నామని మీకు తెలుసు. ఇప్పుడు మనం నరకవాసులుగా ఉన్నాము. ఇప్పుడు మీరు నరకములోనూ లేరు, స్వర్గములోనూ లేరు. ఎవరెవరైతే బ్రాహ్మణులుగా అవుతారో, వారి లంగరు ఈ ఛీ-ఛీ ప్రపంచము నుండి ఎత్తివేయబడింది. మీరు కలియుగ ప్రపంచ తీరాన్ని ఇప్పుడు వదిలేశారు. కొందరు బ్రాహ్మణులు చురుకుగా వెళ్తున్నారు, కొందరు స్మృతియాత్రలో తక్కువగా ఉన్నారు, కొందరు చేతిని వదిలేస్తారు, వారు గుటకలు మింగి మునిగిపోయి మరణిస్తారు అనగా మళ్ళీ కలియుగములోకి వెళ్ళిపోతారు. నావికుడు ఇప్పుడు మనల్ని తీసుకువెళ్తున్నారని మీకు తెలుసు. ఆ యాత్రలైతే అనేక రకాలుగా ఉన్నాయి. మీ యాత్ర ఒక్కటే, ఇది పూర్తిగా అతీతమైన యాత్ర. అయితే, స్మృతిని తెంచే విధముగా తుఫానులు వస్తాయి. ఈ స్మృతియాత్రను మంచి రీతిలో పక్కా చేసుకోండి, కృషి చేయండి. మీరు కర్మయోగులు. ఎంత వీలైతే అంత చేతులతో పని చేయండి, మనసుతో ప్రియుడిని స్మృతి చేయండి. అర్ధకల్పం నుండి మీరు ప్రేయసిగా అయి ప్రియుడిని స్మృతి చేస్తూ వచ్చారు. బాబా, మాకు ఇక్కడ చాలా దుఃఖముంది, ఇప్పుడు మమ్మల్ని సుఖధామానికి యజమానులుగా చేయండి. స్మృతియాత్రలో ఉంటే మీ పాపాలు సమాప్తమైపోతాయి. మీరే స్వర్గ వారసత్వాన్ని పొందారు, ఇప్పుడు పోగొట్టుకున్నారు. భారత్ స్వర్గముగా ఉండేది, అందుకే ప్రాచీన భారత్ అని అంటారు. భారత్ ను చాలా గౌరవిస్తారు. భారత్ అన్నింటికంటే పెద్దది కూడా, అన్నింటికంటే పాతది కూడా. వినాశనము ఎదురుగా నిలబడి ఉందని మీకు తెలుసు. ఎవరైతే మంచి రీతిలో అర్థం చేసుకుంటారో, వారికి లోలోపల చాలా సంతోషముంటుంది. ప్రదర్శనీలకు ఎంతమంది వస్తారు. అహ్మదాబాద్ లో చూడండి ఎంతమంది సాధువు-సత్పురుషులు మొదలైనవారు, అన్ని రకాలవారు వచ్చారు. మీరు సత్యమే చెప్తున్నారని అంటారు. కానీ మేము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి అనేది వారి బుద్ధిలో కూర్చోదు. ఇక్కడ నుండి బయటకు వెళ్ళగానే సమాప్తము. తండ్రి మనల్ని స్వర్గములోకి తీసుకువెళ్తారని ఇప్పుడు మీకు తెలుసు. అక్కడ గర్భజైలు ఉండదు, స్థూలమైన జైలు ఉండదు. ఇక తర్వాత ఎప్పుడూ జైలు ముఖము చూడాల్సిన పని ఉండదు. రెండు జైళ్ళు ఉండవు. ఇక్కడ ఇదంతా మాయ యొక్క ఆర్భాటము. ఈ రోజుల్లో ప్రతి పని త్వరగా అవుతూ ఉంటుంది. మృత్యువు కూడా త్వరగా అవుతూ ఉంటుంది. సత్యయుగములో ఇటువంటి ఉపద్రవాలేవీ సంభవించవు. ఇక్కడ మృత్యువు కూడా త్వరగా సంభవిస్తుంది, కనుక దుఃఖము కూడా చాలా ఉంటుంది. అందరూ సమాప్తమైపోతారు. పూర్తి ధరణి అంతా కొత్తదిగా అవుతుంది. సత్యయుగములో దేవీ-దేవతల రాజధాని ఉండేది, అది మళ్ళీ ఉంటుంది. మున్ముందు ఏమి జరుగుతుందో చూడండి! చాలా భయంకరమైన దృశ్యము ఉంటుంది. పిల్లలైన మీరు సాక్షాత్కారములో చూసారు. పిల్లలకు ముఖ్యమైనది స్మృతియాత్ర. ఇది ఎక్కే కళ యొక్క యాత్ర. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మేము బ్రాహ్మణులము అని సదా ఈ స్మృతిలోనే ఉండాలి. బ్రాహ్మణులైన మనల్నే భగవంతుడు చదివిస్తున్నారు. మనం ఇప్పుడు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతున్నాము.

2. జ్ఞాన రత్నాలతో తమ జోలిని నింపుకుని దానము చేయాలి. ఈ కలియుగీ పతిత ప్రపంచము యొక్క తీరాన్ని వదిలేయాలి. మాయా తుఫానులకు భయపడకూడదు.

వరదానము:- జన్మ సిద్ధ అధికారము యొక్క నషా ద్వారా లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానముగా చేసుకునే శ్రేష్ఠ భాగ్యశాలి భవ
ఎలాగైతే లౌకిక జన్మలో స్థూల సంపద జన్మ సిద్ధ అధికారముగా ఉంటుందో, అలా బ్రాహ్మణ జన్మలో దివ్య గుణాలు రూపీ సంపద, ఈశ్వరీయ సుఖము మరియు శక్తి జన్మ సిద్ధ అధికారము. జన్మ సిద్ధ అధికారము యొక్క నషా న్యాచురల్ రూపములో ఉన్నట్లయితే కృషి చేయాల్సిన అవసరముండదు. ఈ నషాలో ఉన్నట్లయితే లక్ష్యము మరియు లక్షణాలు సమానమైపోతాయి. స్వయాన్ని - నేను ఎవరిని, ఎలా ఉన్నాను, ఏ శ్రేష్ఠమైన తండ్రికి మరియు పరివారానికి చెంది ఉన్నాను అని తెలుసుకుని, స్వీకరించి శ్రేష్ఠ భాగ్యశాలిగా అవ్వండి.
స్లోగన్:- ప్రతి కర్మను స్వ స్థితిలో స్థితులై చేసినట్లయితే సహజముగానే సఫలతా సితారలుగా అవుతారు.

 

అవ్యక్త ప్రేరణలు - బ్రహ్మాబాబా సమానముగా సంపన్న మరియు సంపూర్ణ స్థితిని అనుభవము చేయండి

ఒక్క సెకండులో శబ్దములోకి రండి మరియు ఒక్క సెకండులో శబ్దము నుండి అతీతమైపోండి, ఇప్పుడిప్పుడే శబ్దములోకి రండి, ఇప్పుడిప్పుడే శబ్దము నుండి అతీతమైపోండి... ఎప్పుడైతే ఈ అభ్యాసము సరళముగా మరియు సహజముగా అవుతుందో, అప్పుడు సంపూర్ణత సమీపముగా ఉంది అని భావించండి. ఇప్పుడు మీ ప్రతి కర్మేంద్రియము ‘‘జీ హజూర్, జీ హాజిర్ (చిత్తం ప్రభు, హాజరై ఉన్నాను ప్రభు)’’ అని అంటూ నడవాలి. ఇలా ఎప్పుడైతే రాజ్య అధికారులైన మీ ఈ కర్మేంద్రియాలు స్వాగతము చేస్తాయో అనగా సలామ్ చేస్తాయో, అప్పుడు సంపన్నముగా మరియు సంపూర్ణముగా, కర్మాతీతులుగా అవ్వగలరు.

మురళి అంటే ఏమిటి?

మురళి బ్రహ్మకుమారీల దైనిక ఆధ్యాత్మిక బోధన, ఇది ప్రతి ఉదయం మధుబన్ నుండి ప్రచురించబడుతుంది. ఇక్కడ మీరు ఈరోజు మురళిని తెలుగులో చదవవచ్చు, ఆడియో వినవచ్చు మరియు PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధ్యయనానికి సహాయంగా పాఠ్యాన్ని హైలైట్ చేయవచ్చు — మీ గుర్తులు ఈ బ్రౌజర్‌లోనే సురక్షితంగా ఉంటాయి.

28 భాషల్లో మురళి

Daily Murli · Madhuban మూలం: మధుబన్ మురళి విభాగం ఇది స్వతంత్ర రీడర్ యాప్, అధికారిక వెబ్‌సైట్ కాదు.