తెలుగు మురళి · Brahma Kumaris

ఈరోజు మురళి · 19 నవంబర్, 2026

ఓం శాంతి · BapDada · 19 నవంబర్, 2026

ఈరోజు మురళి — ప్రతి ఉదయం కొత్తది.

18
డౌన్‌లోడ్ PDF
0:00--:--

పాఠ్యాన్ని ఎంచుకోండి → హైలైట్ / బాక్స్ / అండర్‌లైన్

19-11-2026
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
మధువనం

‘‘మధురమైన పిల్లలూ - లోపల-బయట స్వచ్ఛముగా అవ్వండి, ఎటువంటి చెడు అలవాటు ఇప్పుడు మీలో ఉండకూడదు’’
ప్రశ్న:- బ్రాహ్మణ పిల్లలు తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు ఏయే ధారణల పట్ల అటెన్షన్ పెట్టాలి?
జవాబు:- 1. ఈ జన్మలో తండ్రికి చెందినవారిగా అయిన తర్వాత, వంద రెట్లు శిక్షలు అనుభవించే విధముగా ఏ పాప కర్మలు జరగకూడదు. 2. తండ్రి అతి మధురమైనవారు, వారు మిమ్మల్ని తమ సమానముగా మధురముగా తయారుచేస్తున్నారు, అందుకే నోటి ద్వారా ఇతరులకు దుఃఖము కలిగించే ఎటువంటి చేదు మాటలు వెలువడకూడదు. 3. దుఃఖహర్త-సుఖకర్తకు పిల్లలుగా అయ్యి అందరి దుఃఖాలను హరించాలి. మనసా-వాచా-కర్మణా సుఖము ఇవ్వాలి. 4. నింద-స్తుతిలో సమానముగా ఉండాలి.

ఓంశాంతి. సద్గురువారాన్ని వృక్షపతి రోజు అని కూడా అంటారు. వృక్షపతి రోజు అంటే తండ్రి రోజు. అమావాస్య నాడు అంధకారమయమైన రాత్రి పూర్తి అయ్యి పగలు ప్రారంభమవుతుంది. చంద్రుడు ఉదయించడం ప్రారంభమవుతుంది. ఆ రోజుల్లో ఎవరికైనా పిండ ప్రదానం చేసేది ఉంటే, వారికి తినిపించి-తాగించి అంతా పూర్తి చేస్తారు, ఇక తిరిగి పిలవాల్సిన అవసరముండదు. అందరినీ తృప్తి పరచడం జరుగుతుంది. పగలులోకి వెళ్ళారంటే ఇక రాత్రిలోకి తిరిగి రావాల్సిన అవసరమేముంది. వాస్తవానికి నియమము ఏమిటంటే - 12 నెలల సమయము పూర్తి అయిన తర్వాత వారికి తినిపించి అంతా సమాప్తము చేయాలి. మళ్ళీ అంధకారమయమైన రాత్రిలోకి ఎందుకు పిలవడం జరుగుతుంది. కానీ బ్రాహ్మణులు దీనిని కూడా ఒక ఆచారము-పద్ధతిగా తయారుచేసారు, అదే కొనసాగుతూ వస్తుంది. దీని వలన వారికి దక్షిణ మొదలైనవి లభిస్తూ ఉంటాయి. అది హద్దు అమావాస్య. ఇప్పుడు తండ్రి అనంతమైన అమావాస్యలో వచ్చారు. తండ్రి వచ్చారంటే అర్ధకల్పం యొక్క అంధకారము సమాప్తమవుతుంది. తర్వాత సత్యయుగములో ప్రకాశమే ప్రకాశముంటుంది. అక్కడ ఎప్పుడూ ఎవ్వరూ పితృలకు తినిపించరు. ఇది అనంతమైన అమావాస్య. బ్రహ్మా యొక్క రాత్రి అనగా బ్రాహ్మణుల యొక్క రాత్రి పూర్తి అయి పగలు వస్తుంది. తర్వాత ఎవ్వరూ పితృలకు తినిపించరు, అయినా అక్కడ బ్రాహ్మణులే ఉండరు. అలాగని ఎవ్వరూ మరణించరని కాదు, కానీ అక్కడ ఈ ఆచారాలు-పద్ధతులు ఉండవు. ఇక్కడైతే అనేక రకాల బ్రాహ్మణులు కూడా ఉన్నారు. ఒకే ప్రపంచము, ఒకే దేశము కావాలని ఇప్పుడు కోరుకుంటారు. ఇప్పుడు ఇంతమందికి ఒకే దేశము ఉండడమనేది సాధ్యము కాదు. అయితే సత్యయుగము ఉన్నప్పుడు ఒకే రాజ్యము, ఒకే ఆచారము-పద్ధతి ఉండేవి. దానినైతే తండ్రియే వచ్చి స్థాపన చేస్తారు. అక్కడ అందరూ చాలా మధురముగా ఉంటారు, దుఃఖమనే మాటే ఉండదు. ఎప్పుడూ చేదుగా మాట్లాడరు, పాపాలు చేయరు. ఇప్పుడు ఎవరెంత పురుషార్థము చేస్తే అంతటి పదవిని పొందుతారు, నంబరువారుగా. అక్కడ ఎవరూ దొంగతనాలు మొదలైనవి చేయరు. అలా చేయరు. లోపల-బయట స్వచ్ఛముగా ఉంటారు. ఇక్కడ లోపల ఒకలా, బయట మరోలా ఉంటారు. ఒకరినొకరు ఎంతగా నష్టపరచుకుంటూ ఉంటారు. ఇదంతా రావణ రాజ్యములోని అశుద్ధమైన చంచలత్వము. బాబా ఇప్పుడు దీనిని పూర్తిగా సమాప్తము చేయిస్తారు. అందరి చెడు అలవాట్లు ఒక్కసారిగా వెంటనే తొలగిపోవు, సమయము పడుతుంది. ఎంతెంతగా యోగములో ఉంటారో అంతంతగా అడుగడుగులోనూ చూసుకుంటూ ఉంటారు - నేను యోగములో ఉంటున్నానా, ఏ పాప కర్మ చేయడము లేదు కదా, స్వయం మధురముగా అయి ఇతరులను మధురముగా తయారుచేస్తున్నానా? స్వయమే చేదుగా ఉంటే ఇతరులను మధురముగా ఎలా తయారుచేస్తారు. ఇక్కడ అటువంటివారు వెంటనే ప్రత్యక్షమవుతారు, దాగి ఉండరు.

తండ్రి అంటారు - నా పిల్లలుగా అయి ఇంకా ఏవైనా తప్పుడు కర్మలు చేస్తే చాలా కఠినమైన శిక్షలను అనుభవిస్తారు, పదవి కూడా భ్రష్టమైపోతుంది. భగవంతుడు స్వయంగా కూర్చుని దేవతలుగా తయారుచేయడానికి చదివిస్తున్నారు. సర్వగుణ సంపన్నులు... అహింసా పరమోధర్మము కలవారు... అని దేవతల మహిమను గానం చేస్తారు. హింస రెండు రకాలుగా ఉంటుంది - ఒకటి కామ ఖడ్గముతో చేసే హింస ద్వారా మనుష్యులు ఆదిమధ్యాంతాలు దుఃఖాన్ని పొందుతారు. రెండవది - క్రోధములోకి వచ్చి ఒకరినొకరు కొట్టుకుంటూ, దుఃఖాన్ని కలిగిస్తూ, దుఃఖితులుగా అవుతారు. మనసా-వాచా-కర్మణా అటువంటి కర్మలేవీ చేయకూడదని ఇక్కడ పిల్లలకు చెప్పడం జరుగుతుంది. ఎవరికీ దుఃఖము ఇవ్వకూడదు. మనం ఉన్నదే దుఃఖహర్త-సుఖకర్తకు పిల్లలము. కావున - మీరు దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఎలా ఇవ్వాలి అనే యుక్తినే మీరు అందరికీ తెలియజేయాలి. దీని ద్వారా గతంలో చేసిన కర్మల లెక్కాచారము సమాప్తమవుతుంది. ఇక్కడ తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ జన్మలో ఏవైతే పాప కర్మలు చేశారో, అవన్నీ చెప్పినట్లయితే సగం కట్ అయిపోతాయి. కానీ అనేక జన్మలుగా చేసిన పాప కర్మలైతే తలపై చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఈ జన్మలో కూడా పాపం తయారయ్యే విధమైన కర్మలేవీ చేయకూడదు మరియు యోగబలముతో అనేక జన్మల పాప కర్మలను భస్మం చేసుకోవాలి. ఈ జన్మలో తండ్రికి చెందినవారిగా అయ్యి ఎలాంటి పాప కర్మలు చేయకూడదు. బ్రాహ్మణులుగా అవ్వకుండా వారసత్వము లభించదు. వీరు బాప్ దాదా కదా. వారసత్వము మీకు వారి నుండి (శివబాబా నుండి) లభిస్తుంది, ఇతని ద్వారా (బ్రహ్మా ద్వారా) కాదు. ఇతను స్వయం గురించి ఏమీ చెప్పుకోరు. ఇతనైతే కేవలం రథము మాత్రమే, ఇతని ద్వారా మీకు ఏమీ లభించదు. రథము గురించి కూడా మహిమ చేస్తారు. హుస్సేన్ యొక్క రథము ఉంటుంది కదా, ఆ గుర్రాన్ని ఎంతగా అలంకరిస్తారు. ఇదైతే పతిత తనువు కదా. ఇతను కూడా ఇప్పుడు అలంకరించబడుతూ ఉన్నారు. తమ పురుషార్థముతోనే అలంకరించబడతారు. తండ్రి ఇతనిపై ఎలాంటి పక్షపాతము చూపించరు. అద్దె అయితే లభిస్తుంది కదా అని బాబా అప్పుడప్పుడు సరదాగా అంటూ ఉంటారు. కానీ, మీరు ఎలాగైతే పురుషార్థము చేయాల్సి ఉంటుందో, అలా ఇతను కూడా చేయాల్సి ఉంటుంది. అద్దె తీసుకోవాలనే ఆశ వీరికి ఉండదు. బాబా అలా సరదాగా అంటారు. ఆత్మ యోగబలముతోనే సతోప్రధానముగా అవ్వాలి. ఎంత యోగముంటుందో, అంత పావనముగా అవుతారు, అంతేకాక తమ సమానముగా కూడా తయారుచేయాలి. పిల్లలైన మీకు తెలుసు - ఎవరైతే బాగా సేవ చేసేవారు ఉన్నారో, వారు పేరు-ప్రఖ్యాతలు కలిగి ఉన్నారు. వారిని బాబా సేవ చేయడానికి పంపిస్తారు. చాలా మధురముగా మాట్లాడాల్సి ఉంటుంది. ఎవరితోనూ గొడవపడకూడదు, కొట్లాడకూడదు. బ్రాహ్మణులు ఒకవేళ చేదుగా మాట్లాడినట్లయితే, వీరిలో క్రోధమనే భూతముందని అంటారు. నింద-స్తుతిలో సమానముగా ఉండాలి. చాలామందిలో క్రోధమనే భూతముంది, అందుకే చాలా కోపగించుకుంటారు. అంతేకానీ అందరిలో ఉన్న క్రోధము తొలగిపోయిందని కాదు. ఎప్పటివరకైతే సంపూర్ణముగా అయ్యే సమయము రాదో, అంతవరకు నెమ్మది-నెమ్మదిగా మాలిన్యము తొలగుతూ ఉంటుంది. మాలో క్రోధము లేదని అయితే ఎవ్వరూ అనలేరు. కొందరిలో ఎక్కువగా, కొందరిలో తక్కువగా ఉంటుంది. కొందరి మాటలే ఎలా ఉంటాయంటే - గొడవపడుతున్నట్లుగా అనిపిస్తుంది. పిల్లలు చాలా-చాలా మధురముగా తయారవ్వాలి. ఇక్కడే సర్వగుణ సంపన్నులుగా తయారవ్వాలి. వికారాలైతే అనేక రకాలవి ఉన్నాయి కదా. క్రోధము చేయడం, అబద్ధాలు చెప్పడం - ఇవన్నీ వికారాలే.

తండ్రి అంటారు - పిల్లలూ, ఇప్పుడు ఏ వికర్మలు చేసినా చాలా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. అక్కడైతే నాతో పాటు శిక్షలను విధించే ధర్మరాజు ఉన్నారు. ఇక్కడి శిక్షలు ప్రత్యక్షముగా లభిస్తాయి, ధర్మరాజు శిక్షలు గుప్తముగా లభిస్తాయి, గర్భజైలులో కూడా శిక్షలను అనుభవిస్తారు. కొంతమందికి అనారోగ్యము మొదలైనవి వస్తాయి, అది కూడా కర్మభోగమే. ధర్మరాజు ద్వారా శిక్షలు లభిస్తాయి. గతంలో చేసినవాటికి కూడా ఇప్పుడు లభిస్తాయి, ఇప్పుడు చేసినవాటికి కూడా ఇప్పుడు లభించవచ్చు. తర్వాత గర్భజైలులో కూడా లభిస్తాయి. అవి గుప్తమైనవి. ధర్మరాజు అక్కడైతే శిక్షలను విధించరు కదా. ఇక్కడ శరీరముతో కర్మభోగాన్ని అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పుడు తండ్రి మనల్ని వీటి నుండి విడిపిస్తున్నారు. పరమపిత పరమాత్మ మరియు ధర్మరాజు అయిన బాబా, ఇద్దరూ హాజరై ఉన్నారు. ఇప్పుడు ఇది అందరి యొక్క వినాశన సమయము. ప్రతి ఒక్కరికీ తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. పిల్లలైన మీరు సంపూర్ణముగా అవ్వాలని కోరుకుంటున్నారు కావున ఎలాంటి పాప కర్మలు చేయకండి. తమ కళ్యాణము కోసం ఎంత వీలైతే అంత పూర్తి పురుషార్థము చేయాలి. ఇది కల్ప-కల్పానికి సంబంధించిన విషయము. ఆ చదువు ఒక్క జన్మ కోసం ఉంటుంది. మరుసటి జన్మలో ఇంకొక చదువు ఉంటుంది. ఇది 21 జన్మలకు సంబంధించిన చదువు. అవినాశీ తండ్రి అవినాశీ చదువును చదివిస్తున్నారు, దీని ద్వారా 21 జన్మల కొరకు అవినాశీ పదవి కూడా లభిస్తుంది. తండ్రి నుండి 21 జన్మల కొరకు వారసత్వము లభిస్తుంది. ఇది పాత ప్రపంచమని, కొత్త ప్రపంచములో భారత్ ఒక్కటే ఉండేదని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఈ చక్రము తిరగనున్నది. కొత్త సృష్టి స్థాపన జరిగి పాతదాని వినాశనమవుతుంది. పరమపిత పరమాత్మ వచ్చి బ్రహ్మా ద్వారా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారని అంటూ ఉంటారు. బ్రాహ్మణులైతే తప్పకుండా ఉండాలి. అంటే తప్పకుండా పవిత్రముగా కూడా అవుతూ ఉండవచ్చు, రాజయోగము కూడా నేర్చుకుంటూ ఉండవచ్చు. బ్రహ్మాకుమార-కుమారీలైన మనమైతే పవిత్రముగా అవుతున్నాము. తండ్రి ఇళ్ళు-వాకిళ్ళను వదలమని చెప్పరు. అలా కాదు. గృహస్థ వ్యవహారములో ఉంటూ కమల పుష్ప సమానముగా ఉండండి. ‘బాప్ దాదా’ అన్న పేరు చాలా బాగుంది. తాతగారి నుండి వారసత్వము లభిస్తుంది. వారు ఉన్నతోన్నతమైనవారు. బ్రహ్మా అయితే పతితముగా ఉండేవారు కదా. ఇతను మొట్టమొదట శ్రేష్ఠాచారిగా, పూజ్యముగా, మహారాజుగా ఉండేవారు. ఇప్పుడు అంతిమములోకి వచ్చి పతితముగా అయిపోయారు. ఇది వీరి యొక్క అంతిమ జన్మ. ఈ ప్రపంచములో అసలు పావనమైనవారు ఎక్కడ ఉన్నారు. పావన ప్రపంచములో ఎవ్వరూ స్మృతి చేయరు. ఆత్మ-పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు... అని అంటూ ఉంటారు కూడా. ఈ లెక్కను కూడా మీరు అర్థం చేసుకున్నారు. సూర్యవంశీయులు ఎవరైతే ఉన్నారో, వారు మొట్టమొదట తమ వారసత్వాన్ని తీసుకోవడానికి వస్తారు. ఇప్పుడు ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్తే, స్వర్గానికి వెళ్ళారని అంటారు. మరి అసలు వారిని నరకములోకి పిలిచే అవసరమే ఏముంది. ఏమీ అర్థం చేసుకోరు. సాధు-సత్పురుషులు మొదలైనవారు కూడా మరణించినప్పుడు వారిది కూడా వర్ధంతిని జరుపుకుంటారు, భోగ్ పెడుతూ ఉండవచ్చు. జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది అన్నప్పుడు మరి భోగ్ ఎందుకు పెడతారు, వర్ధంతిని ఎందుకు జరుపుతారు? శరీరమైతే సమాప్తమైంది, ఆత్మ కూడా వెళ్ళిపోయింది, మళ్ళీ ఆత్మను పిలిచే అవసరమేముంది. జ్యోతి జ్యోతిలో లీనమైపోయిన తర్వాత ఇక మళ్ళీ ఎలా రాగలదు. అనేకానేక మతాలు ఉన్నాయి. మనిషి మోక్షాన్ని పొందిన తర్వాత ఇక మళ్ళీ రారు అని కూడా అంటారు. మోక్షం పొందారంటే ఇంకా సంతోషించాలి, ఎందుకంటే వారు పాత్రను అభినయించడం నుండి విముక్తులుగా అయ్యారు. ఇక తర్వాత వారిని అసలు గుర్తు కూడా చేయకూడదు. ఇది కూడా మీకు తెలుసు. మనుష్యమాత్రులందరూ ఒక్క తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తారు. అందరూ సోదరులేనని ఒప్పుకుంటారు కూడా. మరి సోదరులకు తండ్రి నుండి వారసత్వము తప్పకుండా లభించాలి. సర్వాత్మల సద్గతిదాత ఒక్కరే. ఆత్మలందరూ తిరిగి వెళ్ళాలి. మనుష్యులు మనుష్యులకు సద్గతిని ఎలా ఇవ్వగలరు, అందుకే ఒక్క సర్వుల సద్గతిదాత పేరు మాత్రమే ప్రఖ్యాతి చెంది ఉంది. వారే జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు. ఆ తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. అందరినీ రావణ రాజ్యము నుండి విడిపిస్తారు. దీనిని ‘అనంతమైన అమావాస్య’ అని అంటారు. అర్ధకల్పం అనంతమైన రాత్రి, మళ్ళీ అర్ధకల్పం అనంతమైన పగలు ఉంటుంది. ఇది ఒక ఆట. ధర్మ సమ్మేళనాలు చేసేవారు మిమ్మల్ని పిలిచినప్పుడు - శాంతి ఎలా ఏర్పడగలదు అని వారు అడిగితే అక్కడ చెప్పాలి - ఏక ధర్మము, ఏక మతము సత్యయుగములోనే ఉంటాయి. అది గడిచి 5 వేల సంవత్సరాలు అవుతుంది. అక్కడ సుఖ-శాంతులు, అన్నీ ఉండేవి, మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామములో ఉండేవి. కొత్త ప్రపంచములో ఒకే ధర్మముండేది. పాత ప్రపంచములో వృక్షము ఎంతగా పెరిగిపోతుంది. అనేక ధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు అనేక ధర్మాల వినాశనము మరియు ఏక ధర్మ స్థాపన, ఇది తండ్రి పని మాత్రమే. శివబాబా అంటారు - ఇది నా పని. నేను కల్ప-కల్పము వచ్చి ఈ పని చేస్తాను. సత్యయుగ రాజధాని కోసం రాజయోగాన్ని తప్పకుండా సంగమములోనే నేర్పిస్తాను. పతితులందరినీ పావనముగా తయారుచేస్తాను. నేను అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమములో వస్తాను. ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకున్నారో, అతని రథములోకే వచ్చి అర్థం చేయిస్తాను. కొత్త ప్రపంచమైతే లేనే లేదు. నేను పాత ప్రపంచములోకే వచ్చి కొత్త ప్రపంచాన్ని తయారుచేస్తాను. పతిత ప్రపంచాన్ని పావనముగా తయారుచేస్తాను. నా పేరే దుఃఖహర్త-సుఖకర్త. సుఖములో నన్ను ఎవరూ స్మృతి చేయరు, దుఃఖములో నన్ను స్మృతి చేస్తారు. తప్పకుండా ఒకప్పుడు సుఖము లభించి ఉంటుంది.

తండ్రి అంటారు - నేను చదివించడానికి వచ్చాను. ఇప్పుడు చదవడమనేది మీ పని. మనుష్యులైతే ఘోర అంధకారములో ఉన్నారు. మీకు కూడా ఇంతకుముందు ఏమీ తెలియదు. ఈ సమయములో మొత్తం ప్రపంచము యొక్క నావ మునిగిపోయి ఉంది, ఎంత దుఃఖితులుగా ఉన్నారు. మీరు అందరి నావను తీరానికి చేరుస్తారు, అందరూ శాంతిధామములోకి వెళ్ళిపోతారు. ఈ విషయాలు మీ బుద్ధిలో ఉన్నాయి, అది కూడా నంబరువారుగా ఉన్నాయి. ఎవరైతే లైట్ హౌస్ గా అయి ఉంటారో, వారు ఇతరులకు కూడా మార్గాన్ని తెలియజేస్తూ ఉంటారు. వారి పనే మార్గాన్ని తెలియజేయడము. తండ్రి పిల్లలను ఎలా చదివిస్తున్నారు, ఈ స్థిరమైన సంతోషముండాలి. ఇక్కడకు వచ్చి చాలా రిఫ్రెష్ అవుతారు, బయటకు వెళ్ళగానే నషాయే మాయమైపోతుంది. తండ్రి నుండి పూర్తి వారసత్వము తీసుకోవాలనే కోరికను పెట్టుకోవాలి. అడుగడుగులోనూ తండ్రి నుండి సలహా తీసుకుంటూ ఉండండి. ఇంతకుముందు తీర్థయాత్రలకు కాలి నడకన వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళేవారు. ఈ సమయములోనైతే బస్సులో లేక రైలులో వెళ్తున్నారు. మాయ ఆర్భాటము ఈ సమయములో చాలా ఉంది. సత్యయుగములో వైభవముండేది, తర్వాత ద్వాపరము నుండి పడిపోతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చివరిలో మొదలయ్యింది. దీనిని మాయ ఆర్భాటము అని అంటారు. ఎవరినైనా - స్వర్గములోకి పదండి అని అంటే, మాకు ఇక్కడే అన్ని సుఖాలు ఉన్నాయని అంటారు. వాహనాలు, విమానాలు మొదలైనవన్నీ ఉన్నాయి, మాకైతే స్వర్గము ఇక్కడే ఉంది, ధనము, వస్తువులు, నగలు మొదలైనవన్నీ ఉన్నాయి, లక్ష్మీ-నారాయణులకు కూడా నగలుండేవి కదా, మేము కూడా ధరించవచ్చు అని అంటారు. ఎంతగా అర్థం చేయించినా సరే వారికి విషమే గుర్తుంటుంది. విషము (వికారాలు) లేకుండా ఉండలేకపోతారు. తండ్రి అంటారు - మీరు నా మాట వినడం లేదు. పావనముగా అవ్వనప్పుడు ఇక, ఓ పతిత-పావనా రండి అని నన్ను అసలు ఎందుకు పిలుస్తారు. గుర్తుంచుకోండి - ఇప్పుడు నా మాట వినకపోతే ధర్మరాజు ద్వారా శిక్షలను ఇప్పిస్తాను. భయపెడతారు కూడా. చాలామంది పిల్లలు వికారాలలోకి వెళ్తూనే ఉంటారు, భయమే ఉండదు. వారు ఎన్ని కొరడా దెబ్బలు తింటారో, ఇక అడగకండి. పదవి కూడా భ్రష్టమైపోతుంది. పురుషార్థము చేసి ఉన్నత పదవిని పొందాలి కదా. సాంగత్య దోషానికి వశమై ఎలా పడిపోతారంటే, ఇక ఒక్కసారిగా తమ పదవిని పోగొట్టుకుంటారు. మీకు తెలుసు - ఇప్పుడు వజ్రాల గనులు మొదలైనవన్నీ ఖాళీ అవుతూ ఉన్నాయి, మళ్ళీ నిండిపోతాయి. బంగారము, వజ్రాల పర్వతాలుంటాయి. వజ్రాలను తవ్వి తీసినప్పుడు, అవి మొదట రాళ్ళు వలె ఉంటాయి, తర్వాత వాటిని శుభ్రము చేసి వజ్రముగా తయారుచేస్తారు. అలాగే మీకు కూడా జ్ఞానమనే పదును పెట్టినప్పుడు మీరు ఎంత బాగా తయారవుతారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఇప్పుడిది వినాశన సమయము, అందుకే ఎటువంటి పాప కర్మలు చేయకూడదు. తమ కళ్యాణము కోసం పురుషార్థము చేయాలి. చాలా మధురముగా తయారవ్వాలి. క్రోధాన్ని విడిచిపెట్టాలి.

2. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలనే కోరికను పెట్టుకోవాలి. అడుగడుగులోనూ తండ్రి సలహాను తీసుకోవాలి. తండ్రి సమానముగా దుఃఖహర్త-సుఖకర్తగా అవ్వాలి.

వరదానము:- తమ భాగ్యము మరియు భాగ్యవిధాత యొక్క స్మృతి ద్వారా అన్ని చిక్కుల నుండి ముక్తులుగా ఉండే మాస్టర్ రచయిత భవ
సదా వాహ్ నా భాగ్యము మరియు వాహ్ భాగ్య విధాత! మనసు యొక్క ఈ సూక్ష్మ శబ్దాన్ని వింటూ ఉండండి మరియు సంతోషములో నాట్యము చేస్తూ ఉండండి. తెలుసుకోవలసినది తెలుసుకున్నాను, పొందాల్సినది పొందేసాను - ఈ అనుభవాలలో ఉన్నట్లయితే అన్ని చిక్కుల నుండి ముక్తులైపోతారు. ఇప్పుడిది చిక్కులలో ఉన్న ఆత్మలను బయటకి తీసే సమయము, అందుకే - నేను మాస్టర్ సర్వశక్తివంతుడిని, మాస్టర్ రచయితను - ఈ స్మృతితో బాల్యము యొక్క చిన్న-చిన్న విషయాలలో సమయాన్ని పోగొట్టుకోకండి.
స్లోగన్:- కమలాసనధారులే మాయ ఆకర్షణ నుండి అతీతముగా ఉంటారు, తండ్రి స్నేహములో ప్రియముగా ఉంటారు, శ్రేష్ఠ కర్మయోగులుగా ఉంటారు.

 

అవ్యక్త ప్రేరణలు - బ్రహ్మాబాబా సమానముగా సంపన్న మరియు సంపూర్ణ స్థితిని అనుభవము చేయండి

పురుషార్థములో సరళత, బ్రహ్మాబాబా సమానముగా ఉపరామము మరియు సాక్షీద్రష్టా సంస్కారాలు, ఇవే సంపూర్ణ స్థితికి గుర్తులు లేక లక్షణాలు. ఇప్పుడు ఈ సంస్కారాలలో సమానతను తీసుకురావాలి. వీటి ద్వారానే సర్వుల హృదయాలలో విజయులుగా అవుతారు, ఎవరైతే సంగమములో సర్వుల హృదయాలలో విజయులుగా అవుతారో వారే భవిష్యత్తులో విశ్వ మహారాజులుగా అవుతారు.

మురళి అంటే ఏమిటి?

మురళి బ్రహ్మకుమారీల దైనిక ఆధ్యాత్మిక బోధన, ఇది ప్రతి ఉదయం మధుబన్ నుండి ప్రచురించబడుతుంది. ఇక్కడ మీరు ఈరోజు మురళిని తెలుగులో చదవవచ్చు, ఆడియో వినవచ్చు మరియు PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధ్యయనానికి సహాయంగా పాఠ్యాన్ని హైలైట్ చేయవచ్చు — మీ గుర్తులు ఈ బ్రౌజర్‌లోనే సురక్షితంగా ఉంటాయి.

28 భాషల్లో మురళి

Daily Murli · Madhuban మూలం: మధుబన్ మురళి విభాగం ఇది స్వతంత్ర రీడర్ యాప్, అధికారిక వెబ్‌సైట్ కాదు.